Neetikathamala-1    Chapters    Last Page

2

దైవస్తుతి

శ్లో|| బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్కకిరీట కోటి

సంఘట్టితాంéఘ్రి కమలామల కాంతి కాంత!

లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస!

లక్ష్మీ నృసింహ! మమదేహి! కరావలంబమ్‌.

--------

దాశరథీ

హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్ర రాజమై

కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై

పరcగిన యట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరం

తరము నటింపc జేయు మిcక దాశరథీ! కరుణా వయోనిధీ!

దయాసముద్రుడవైన ఓ రామా! éఈశ్వరునకు, విభీషణునకు, పార్వతికి దివ్వ మంత్రమై, అహల్యకు, ద్రౌపదికి ఆపదలను బాపు చుట్టమై, వారలను కాపాడినట్టి నీ పవిత్ర నామము ఇక నిరంతరము నా నాలుకపై నాట్యమాడ జేయము.

* * *

పద్మపాదుడు

శ్రీ శంకర భగవత్పాదుల శిష్యులలో సనందను డొకడు. సద్గుణ సంపన్నుడు. విశేషనియమ నిష్ఠాగరిష్ఠుడు. గురుభక్తి లో అందరికన్నమిన్న. శంకరు లాతని యోగ్యత కానందించి యతనిచే ప్రస్థాన త్రయమును ముమ్మారు చదివించారు. మిగిలిన శిష్యులు అసూయాపరులై సనందనుని ఆధిక్యమును సహింపలేకుండిరి. శంకరులు అది గ్రహించి ఒకనాడు శిష్యులను వెంటబెట్టుకుని స్నానార్థమ గంగానదికి వెళ్లారు. సనందనుడు గంగానది కావలి ఒడ్డున నుండెను. శిష్యులందరూ చూచుచుండ శంకరులు సనందుని రమ్మని చేతితో సంజ్ఞ చేసిరి. గురువు నాజ్ఞనందుకొని సనందనుడు ముందు వెనుక లాలోచింపక గురు పాదపద్మములనే మనమున ధ్యానించుచు గంగానదిలో దిగి నడచి వచ్చుచుండెను, అతడు నీటిపై పాదము పెట్టగనే అతని పాదము క్రింద ఒక్కొక్క పద్మ ముద్భవించుచుండెను. సనందను డట్లు పద్మములపై నడచి గంగను దాటి గురు సన్నిధికి నడచి వచ్చెను. శంకరు లాతని గురుభక్తికి ఆనందభరితులైరి. నాటినుండి సనందనునకు పద్మపాదుడను సార్థకనామ మేర్పడెను.

అట్టి పద్మపాదుడు ఒకనాడు శ్రీ నృసింహ మంత్రానుష్ఠానార్థము అహోబిలము చేరి ఆ కొండపై తపము జేయ ప్రారంభించెను. కొంతకాలము జరిగెను. కాని నృసింహస్వామి దర్శనము కాలేదు. ఒకనాడొక కిరాతు డాతని సమీపించి ''స్వామీ! మీరు ఎందులకు ఇచ్చట కూర్చుండి జపము చేయుచున్నారు? తమ సేవ జేయుటకు నేను సిద్థముగానున్నాను, అనుగ్రహింపుడు'' అని నుడివెను. పద్మపాదు డాతని చూచి ఈ మూర్ఖునకు ఇది యంతయు నెట్లర్థమగునని తలంచి ''ఓయీ ఈ అరణ్యమందు కంఠము వరకు మనుష్యాకారము, ఆపైన సింహాకృతి గల జంతువు నీ కెక్కడైనా కన్పించెనా? అది నా కన్నులకు కన్పడుట లేదు. దానికొరకే నే నిట తపించు చుంటిని'' అని చెప్పెను. అప్పుడతడు వినయముగా ''స్వామీ! నేను ఎంతోకాలము నుండి ఈ అరణ్యమందున్నాను. అట్టి జంతువు నాకుగానీ, మాలో మరెవరికి గానీ కన్పడలేదు. అది ఇచ్చట ఉన్నట్లే లేదు'' అని నుడివెను. అప్పుడు పద్మపాదుడు ''నాయనా అది ఉన్నదనుమాట నిశ్చయము. నీకు కన్పడినచో దానిని నాకు చూపించుము'' అని చెప్పెను. ఆ కిరాతుడు ''స్వామీ! ఆ మృగము ఈ అరణ్యమందున్నచో ఎట్టి శ్రమయైనను లెక్కచేయక అన్నిచోట్ల వెదకి దానిని ఈసాయంసమయమునకే తమ వద్దకు పట్టి తీసుకువత్తు'' నని చెప్పి వెడలి పోయెను. పద్మపాదుడు తన జపమును ప్రారంభించెను.

ఆకిరాతుని మనస్సు పద్మపాదుడు చేసిన మృగవర్ణనతో నిండిపోయెను. అతడు ఆహారము విశ్రాంతి లేక ఆ మృగ స్వరాపమునే భావించుచూ ఆరణ్యమందలి ప్రతి పొదను, ప్రతి గుహను గాలించి వేసేను. ఎక్కడను అట్టి మృగమే కానరాదు. స్వామిమాట దబ్బర కాదను నిశ్చయ బుద్దితో అతడు వెదకి వెదకి వేసారెను. ఆమృగమును మనసార తలంచుచు అట్టి మృగమును చూపలేని తన బ్రతుకు నిరర్థకమని నిర్ణయించుకొని అడవి తీగలతో ఒక చెట్టునకు ఉరిపోసుకుని మరణించుట కుద్యుక్తుడయ్యెను. అంతలో కనుచూపు మేరలో సగము మానవాకారము, సగము సింహాకృతి గల మృగము కన్పించెను. వెంటనే ఆ బోయవాడు సంతోషముతో దూకి ఆ లతలతో దానిని గట్టి పద్మపాదుని వద్దకు తీసుకొని వచ్చెను. పద్మపాదునకు ఆ మృగ దర్శనము కాలేదు. కాని కిరాతుడు దాని అవయవములను వర్ణించుచు చెప్పసాగెను. అప్పుడు నృసింహస్వామి గర్జారావము మాత్ర మాతనికి విన్పడెను. అంతట పద్మపాదుడు నృసింహాస్వామిని స్తుతించగా ఆ స్వామి ''వత్సా! ఈ కిరాతుడు తన బుద్ధిని నాయందు స్థిరముగా నిల్పినట్లు నీవు స్థిర చిత్తుడవు కాలేదు. అందువలన నీకు దర్శనము కాక ధ్వని రూపాన దర్శన మిచ్చితిని. అనతికాలములో నీ మంత్రము సిద్థించగా నీకు వశ్యుడనుగానుందు'' నని పలికెను. మనము స్థిర చిత్తముతో నున్నప్పుడు మన ప్రార్థనలు వెంటనే ఫలించును; పరమేశ్వరుడు ప్రసన్నుడగును.

ప్రశ్నలు

1. పద్మపాదుడెవరు? అత డెట్టివాడు?

2. పద్మపాదుడు కిరాతున కేమి చెప్పెను?

3. నృసంహస్వామి పద్మపాదున కేల దర్శన మీయ లేదు?

Neetikathamala-1    Chapters    Last Page