Neetikathamala-1    Chapters    Last Page

9

\®µ…ª«sxqsVò¼½

ƒ«sª«sVbP+ªy˳ØùLi xqsLRir¡»R½=ªy˳ØùLi

నమస్కృతాభీష్ట వర్రపదాభ్యామ్‌,

నారాయణనార్చిత పాదుకాభ్యాం

నమో నమ శ్శంకర పార్వతీభ్యామ్‌.

(ఉమామహేశ్వరస్తోత్రం)

--------

భర్తృహరి

తివిరి యిసుమునc దైలంబు దీయవచ్చుc

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుc

దిరిగి కుందేటి కొమ్ము సాదింపవచ్చుc

జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

ప్రయత్నముచేసి ఇసుక నుండి చమురు తీయవచ్చును. ఎండమావులందు సైతం నీరు సంపాదించి త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్ము సాదింపవచ్చును; కాని మూర్ఖుల మనస్సును రంజింపజేయలేము.

----

నచికేతుడు

పూర్వము వాజశ్రవుడను ఋషిపుంగవుడు కలడు. ఆయన కుమారుడు నచికేతుడు. నచికేతుడు బుద్దికుశలుడు; బ్రహ్మచర్య దీక్షావ్రతుడు. వాజశ్రవుడు''విశ్వజిత్తు'' అను పేరుగల యజ్ఞము చేశాడు. ఆ మహాయాగం నిర్వహించే యజమాని తన సర్వస్వమును దక్షిణగా బ్రాహ్మణులకు దానం చేయాలని నియమం. వాజశ్రవుడుకూడా తనవద్దగల ధనాన్ని, పశుసంపదలను దానం చేశాడు. ఆ విధంగా దానం చేయడంలో తనవద్దనున్న పాలివ్వనివి, వట్టిపోయినవి, ముసలివి అయిన ఆవులను గూడా దానం చేయసాగాడు. నచికేతునకు తండ్రి చేసిన ఈ దానం నచ్చలేదు- ''అయ్యో? నాతండ్రి దానమివ్వడానికి పనికిరాని వాటిని కూడా దానం చేసి చేయకూడని పనిచేస్తున్నాడని బాధపడ్డాడు. నెమ్మదిగా తండ్రిని సమీపించి ''పూజ్యపాదా! మీ సంపదలో నేనుకూడా ఒక భాగమేకదా! నన్ను ఎవరికి దానం చేస్తున్నారు'' అని మళ్లీ మళ్లీ అడిగాడు నచికేతుడు. ముందు తండ్రి వాడి మాటలు పట్టించుకోలేదు. చివరికి వాజశ్రవుడు కుపితుడై ''నిన్ను యమధర్మరాజుకు దానమిస్తున్నాను, వెళ్లు'' అన్నాడు. వెంటనే తన తొందరపాటుకు నొచ్చుకున్నాడు. కాని ఏమి ప్రయెజనం? అనృత దోషాన్ని ఆహ్వానించలేడు గదా? నచికేతుడు ప్రశాంతచిత్తుడై యమలోకానికి ప్రయాణమై వెళ్లాడు. పితృవాక్య పరిపాలనా భంగము కారాదు. తండ్రిని అసత్యదోషం అంటరాదు.

నచికేతుడు యమధర్మరాజు గృహానికి చేరే సమయానికి యముడు లేడు. కార్యార్థియై అన్యత్రవెళ్లాడు. యముడు మూడు రోజుల వరకు రాలేదు. నచికేతుడు యమునికొరకు మూడురోజులు ప్రతీక్షిస్తూ ద్వారం వద్ద వేచియున్నాడు. మూడు రోజులపాటు క్షుత్పిపాసలతో తన కొరకై వేచియున్న అగ్నిశిఖాతేజస్సముడైన నచికేతుని యముడు చూచాడు. ''అయ్యో! ఈ బ్రాహ్మణుడు మూడుదినముల నుండి నా యింటి వద్ద అతిథిగానున్నాడు. కాని నేను అతిథి పూజ చేయలేకపోయానే'' అని విచారించాడు. నచికేతుని చూచి - ఓ విప్రశ్రేష్ఠుడా! అతిథి సాక్షాత్తు విష్ణురూపుడని శాస్త్రములు చెపుతున్నవి. అయినను నేను నీకు తగిన అతిథి మర్యాదలు చేయలేకపోయినాను. నీవు కోపగించకుము. నా సత్కారములు లేక మూడు రోజలు నా యింట నున్నందుకు ప్రతిఫలంగా మూడు వరములు ఇస్తున్నాను. సహృదయతతో స్వీకరింపుము'' అని కోరాడు.

నచికేతుడు సంతోషమానసు డయ్యాడు. ''యమధర్మరాజా! నీవు ధర్మస్వరూపుడవు. నీకు తెలియని ధర్మమేమున్నది? నీ యానతి ప్రకారం నేను కోరుకునే మొదటి వరం ఏమనగా-నేను ఇంటికి తిరిగి వెళ్ళినపుడు నాతండ్రి నాపై క్రోధము లేకుండ సంతోషముతో ప్రేమతో నన్ను పలుకరించాలి.'' యముడు నచికేతుని పితృభక్తికి సంతసించి ఆవరం అనుగ్రహించాడు. రెండవ వరంగా నచికేతుడు ''ఓ మృత్యు దేవా! స్వర్గవాసులకు జరామరణములు, ఆకలి దప్పులు ఉండవట! అచటివారు దుఃఖమంటే ఏమిటోకూడ ఎరుగరట! అట్టి స్వర్గసౌఖ్యములు పొందుటకు ''అగ్నిచయనము'' అనే యజ్ఞమును చేయాలట! ఆ యజ్ఞమునకు సంబంధించిన విజ్ఞానం నాకు బోధించుము'' అని కోరాడు. యముడు ఆ క్రతుజ్ఞానమంతా నచికేతునకు బోధించాడు. తాను ఆ విద్య సంపూర్ణంగా గ్రహించినదీ లేనదీ నిర్థారణ చేసుకొనుటకు దానిని యమునకు అప్పగించాడు. నచికేతుని బుద్ధికుశలతకు, ధారణకు సంబరపడి యమధర్మరాజు ''నచికేతా! నీ జ్ఞాపకశక్తి అద్భుతం. నీ శ్రద్ద మెచ్చుకోదగినది. సంతోషాంతరంగుడ నైనాను. నేటినుండి ఆ ''అగ్నిచయనము'' నీ పేరుమీదుగా ''నాచికేతాగ్ని చయనము'' అని పిలువబడుతుంది అని మరో వరాన్ని అనుగ్రహించాడు.

తాను పొందిన రెండు వరాలు నచికేతునికి తృప్తినివ్వలేదు. అతి గుహ్యమైనది, సమస్త మానవాళికి లక్ష్యమైన ఆత్యవిద్యకై అతడు ఆరాటపడ్డాడు. చేతులు ముకుళించి వినమ్రుడై- ''ధర్మస్వరూపా! మానవుడు మరణానంతరం ఏమౌతాడు? శరీరంకంటె భిన్నమైన ఆత్మ మానవుని మరణానంతరం ఏ మవుతుంది? ఆ ఆత్మ స్వరూపం ఎట్టిది? నాకు ఈ ఆత్మజ్ఞానం ప్రసాదించు; ఇదే నా మూడవ వరం'' అన్నాడు. గూఢతమమైన ఆత్మజ్ఞానం బోధించడానికి నచికేతుడు అర్హుడా కాడా అన్న సందేహం యమునకు కల్గింది. అందువలన నచికేతుని పరీక్షించాడు. ''నచికేతా! దేవతలే ఈ విద్యను అర్థంచేసుకోడానికి తికమక పడతారు. అంత కష్టమైదనీ ఆత్మవిద్య. ఇదికాక మరో వరం కోరుకో'' మన్నాడు యముడు.

నచికేతుని పట్టుదల ఎక్కువైనది. ''ప్రభూ! నీవంటి గురువు మరెవరున్నారు? విజ్ఞులకు, పండితులకు దుష్కరమైనదానిని మాబోంట్లకు అర్థమగునట్లు చెప్పుటకు మరొకరికి సాధ్యంగాదు. మరే వరమైనా దీనితో సమంకాదు'' అని నచికేతుడు ఆత్మవిద్యనే కోరాడు. యమధర్మరాజు అతని దృష్టిని మరలించగోరి-''బాలకా! నీకు వలసిన ధనాన్ని, రాజ్యాన్ని కర్ణపేయమైన సంగీతంతో సదా నిన్ను ఆనందింపజేయు అప్సరోగణాన్ని ఇస్తాను, కోరుకో. ఈవిద్యనుమాత్రం అపేక్షించకు'' అన్నాడు. యముడు చెప్పిన పై వస్తువు లేవీ నచికేతుని మనస్సును మార్చలేక పోయినాయి. ఈ విజ్ఞానంముందు అన్నీ తృణప్రాయములుగా అతడు భావించాడు. ఆ ఆత్మజ్ఞాన జిజ్ఞాసతో యమునకు నమస్కరించి ''యమధర్మరాజా! అశాశ్వతములు, అల్పసుఖ ప్రదాయకములూ అయిన ఈరాజ్యాలు, సంపదలు నాకు అవసరంలేదు. శాశ్వతానం దాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానం తప్ప నేను మరేమీ కోరను'' అన్నాడు.

నచికేతుని పట్టుదలకు, జ్ఞాన పిపాసకు యమధర్మరాజూ ఆనందించాడు. ''నచికేతా! నీయెడల ప్రేమతో చెపుతున్నాను విను. మానవులనుసరించు మార్గాలు రెండు విధాలు: ఒకటి శ్రేయోమార్గం- రెండవది ప్రేయోమార్గం. ఒకటి ఆధ్యాత్మికమైనది. మరొకటి భౌతికమైనది. ఆత్మశక్తి ఇంద్రియముల ద్వారా బహిర్గతమై బాహ్యవస్తువులందు లగ్నమైనపుడు మానవుడు విషయలంపటుడై జనన మరణములందు చిక్కుకుని దుఃఖము లనుభవిస్తుంటాడు. అట్లుగాక ఆత్మశక్తి అంతర్ముఖమైనపుడు విషయలంపటుడుగాక సర్వావస్థలందు సాక్షిరూపుడై సచ్చిదానందము అనుభవించును. అట్టివానికి జన్మరాహిత్యము కలుగును'' అని విశదీకరించుచు ఆత్మతత్త్వమును బోధించాడు.

పట్టుదలతో కూడిన విజ్ఞాన సముపార్జనకు నచికేతుడు మనకు ఒక ఆదర్శం .

ప్రశ్నలు

1. వాజశ్రవు డెవరు? అతడేమి దానము చేయుచుండెను?

2. నచికేతుడు యముని ఏమి కోరెను?

3. నచికేతు డెట్టి వాడు?

Neetikathamala-1    Chapters    Last Page