Sri Padma Mahapuranam-I    Chapters   

దశమోధ్యాయః

ఏకోద్దిష్టశ్రాద్ధవిధిః

పులస్త్య ఉవాచ :

ఏకోద్దిష్టం తతో వక్ష్యే యదుక్త మ్ర్బహ్మణా పురా | మృతే పుత్రై ర్యథా కార్యమాశౌచంచ పితుర్యది || 1

దశాహంశావ మాశౌచం బ్రాహ్మణస్య విధీయతే | క్షత్రియేషు దశ##ద్ద్వే చ పక్షం వైశ్యేషు చైవహి || 2

శూద్రేషు మాస మాశౌచం నపిండేషు విధీయతే | నైశ మాచూడ మాశౌచం త్రిరాత్రం పరతః స్మృతమ్‌ || 3

జననేప్యేవయేవస్యా త్సర్వపర్ణేషు సర్వదా | అస్తి సంచయనా దూర్ధ్వ మజ్గుస్పర్శో విధీయతే || 4

ప్రేతాయ పిండదానంతు ద్వాదశాహం సమాచరేత్‌ | పాధేయం తస్య తత్ర్పోక్తం యతః ప్రీతికరం మహత్‌ || 5

యస్మాత్ప్రేతపురం ప్రేతో ద్వాదశాహేన నీయతే | గృహే పుత్రకలత్రం చ ద్వాదశాహం ప్రవత్స్యతి || 6

తస్మాద్విధేయ మాకాశే దశరాత్రం వయస్తథా | సర్వదాహోపశాంత్యర్ధ మధ్వశ్రమ వినాశనమ్‌ || 7

తతస్త్యేకాదశాహేపి ద్విజా నేకాదశైవతు | గోత్రాది సూతకాంతే చ భోజయే న్మనుజో ద్విజాన్‌ || 8

-: ఏకోద్దిష్ట శ్రాద్ధవిధి :-

పులస్త్యు డనియె. బ్రహ్మ మున్నానతిచ్చిన ఏకోద్దిష్ట శ్రాద్ధవిధిం దెల్పెద. తండ్రి చనిపోగా కొడుకులు బ్రాహ్మణులు పదిరోజులు మైలపట్టవలెను. క్షత్రియుడు పండ్రెండు. వైశ్యుడు పదేనురోజులు పట్టవలెను. శూద్రుడొక్కనెల అశౌచము పట్టవలెను. పురుడుకూడ యిట్లే. పోయినవానికి పండ్రెండురోజులు పిండప్రదానమును శాస్త్రము విధించినది. కారణము ఆ పోయినవానికి (ప్రేత) యమవురి జేరుటకు బండ్రెండు రోజులుపట్టును. అందుచే నాజీవుని కీప్రయాణములో దారిబత్తె మవసరము. ఆ రోజులలో వాని పుత్రకళ త్రములు జ్ఞాతులు కూడ యింటినుండి దూరముగ నుందురు. పరస్పర రాగానుబంధముం బట్టి సుఖ దుఃఖములు కూడ పరస్పర మొకేరీతి ననుభవింపలయుం గావున ప్రేతలు గమ్యస్థానముం జేరక నిరాశ్రములై యున్నన్ని రోజులు నిక్కడ తదనుబంధులు ఇల్లువిడిచి నిరాశ్రయులుగా నుందురు. కావున దానినే మైలయనియనుట జరుగుచున్నదనిభావము) అందువలననే ఆకాశమందు (పితృలోకమందన్నమాట) సర్వదాహశాంత్యర్ధము దారిలో ప్రయాణశ్రమ శాంతించుటకు వారినుద్దేశించి నీళ్లువదలవలెనని విధియేర్పడినది. పదునొకండవరోజున సగోత్రులకు (జ్ఞాతులకు) మైల పోయినతర్వాత పదునొకండు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. 8

ద్వితీయేహ్ని పున స్తద్వదేకోద్దిష్టం సమాచరేత్‌ | ఆవాహనాగ్నౌ కరణం దైవహీనం విధానతః || 9

ఏకం పవిత్రమేకోర్ఘ ఏకః పిండో విధీయతే | ఉపతిష్ఠతామితి పదే ద్ధేయం పశ్చా త్తిలోదకమ్‌ || 10

స్వస్తి బ్రూయా ద్విప్రకరే విసర్గే చాభి గమ్యతాం | శేషం పూర్వవదత్రాపికార్యం వేదవిదోవిదుః || 11

అనేన విధినా సర్వమనుమాసం సమాచరేత్‌ | సూతకాంతే ద్వితియేహ్ని శయ్యాం దద్యా ద్విలక్షణామ్‌ || 12

కాంచనం పురుషం తద్వ త్ఫలవస్త్ర సమన్వితమ్‌ | ప్రపూజ్య ద్విజ దాంపత్యమ్‌ నానాభరణభూషితమ్‌ || 13

ఉపవేశ్యతు శయ్యాయాం మధుపర్కం తతో దదేత్‌ | రజతస్యతు పాత్రేణ దధి దుగ్ధసమన్వితమ్‌ || 14

అస్థి లాలాటికమ్‌ గృహ్య సూక్ష్మం కృత్వా విమిశ్రయేత్‌ | పాయయేద్విజదాంపత్యం పితృభక్త్యా సమన్వితః || 15

ఏష ఏవ విధి ర్దృష్టః పార్వతీయై ర్ద్విజోత్తమైః | తేన లుషాతు సా శయ్య స గ్రాహ్యాద్విజసత్తమైః || 16

గృహీతాయాంతు తస్యాం హి పునః సంస్కార మర్హతిం | వేదేచైవ పురాణచ శయ్యా సర్వత్ర గర్హితా || 17

రెండవరోజున గూడ ఆవిధముగా ఏకోద్దిష్టము సేయవలెను. ఆవాహనము సేయుట అగ్నౌకరణము వివ్వేదేవార్చనము లేకుండ పితృదేవతల నొక్కరికే యీ అర్చన సేయవలయును. (అందుచేతనే యిది ఏకోద్దిష్ట మనబడినది. అంతేగాక ఇందు పవిత్రమొక్కటే అర్ఘము (పూజ) అర్ఘ్యాదికము నొక్కటేపిండము నొక్కటే. ఇటకు దయచేయండి వెళ్లండి అని స్వస్తి=శుభమగుగాక! యని వచించి చివర సాగనంపుచు బ్రాహ్మణహస్తమందు తీలోదకము విడువవలెను. తరువాత తా నిష్టులతో భోనముచేయుట మొదలగు పనులు లోగడ జెప్పినట్లే కావింపవలెనని వేదవిదు లెఱుంగుదురు. ఈ తీరున ప్రతిమాసము (మాసికము) జరుపవలెను. సూతకమువెళ్ళిన మూడవరోజున శయ్యాదానము సేయవలెను. బంగారపు పురుషవిగ్రహము గావించి పండ్లు వస్త్రములతోగూడ నానాభరణభూషితు లయిన బ్రాహ్మణదంపతులను బూజించి మంచముపై కూర్చుండబెట్టి వెండిగిన్నెలో ఆవుపాలు పెరుగుతో మధుపర్కము (తేనె) నీయవలెను. పితృభక్తుడైన కర్త లలాటమందలి యెముక చిన్నది యా మధుపర్కమందు కలిపి బ్రాహ్మణ దంపతులచే నామధుపర్కమును ద్రావింపవలెను. పార్వతీయులగు (పర్వతప్రాంతవాసులు) బ్రాహ్మణులతో నీవిధానము కనబడును. అందుచే నీవిధముగ నిచ్చిన శయ్య (శయ్యాదానము) దుష్యము ఉత్తమ బ్రాహ్మణులీ దానము పట్టరాదు. అదిపట్టినచో నాబ్రాహ్మణుడు పునస్సంస్కారము చేసికోవలెను. (ఉపనయనాది సంస్కారాలు) ఈ శయ్యా దానవిధానము వేదమునందు పురాణమునందు గర్హింపబడినది. 17

గ్రహీతారస్తు జాయంతే సర్వే నరకగామినః | గ్రధితాం వసుజాలేన శయ్యాం దాంపత్య సేవితాం || 18

యే స్పృశంతి నజానంతః సర్వే నరకగామినః | నవశ్రాద్ధే నభోక్తవ్యం భుక్త్వా చాంద్రాయణం చరేత్‌ || 19

పితృ భక్త్యాతు పుత్రాణాం కర్యమేవ సదా భ##వేత్‌ | వృషోత్యర్జంచ కుర్వీత దేయాచ కపిలా శుభా || 20

ఉదకకుంభశ్చ దాతవ్యో భక్ష్య భోజ్య ఫలాన్వితః | యావదబ్దం నరశ్రేష్ఠః స తిలోదక పూర్వకమ్‌ || 21

తతస్సంవత్సరే పూర్ణే సపిండీకరణం భ##వేత్‌ | సపిండీకరణాదూర్ధ్వం ప్రేతః పార్వణ భుగ్యతః || 22

వృద్థిపూర్వేషు కార్యేషు గృహస్థస్య భ##వేత్తతః | సపిండీకరణం శ్రాద్ధం దేవ పూర్వం నియోజయేత్‌ || 23

పితౄణావహయేత్తత్ర పృథక్‌ప్రేతం వినిర్దిశేత్‌ | గంధోదక తిలైర్యుక్తం కుర్యాత్వాత్ర చతుష్ఠయం || 24

అర్ఘ్యార్ధం పితృపాత్రేషు ప్రేతపాత్రం వ్రసేచయేత్‌ | తద్వత్‌ సంకత్ప్య చతురః పిండాన్‌ పితృ వరస్తదా || 25

యేనమానా ఇతి ద్వాభ్యా మన్నస్తు విభ##జేత్రథా | అనేన విధినా చార్థ్యం పూర్వమేవ ప్రదాపయేత్‌ || 26

శయ్యాదానము పట్టినవారందరు నరకమునకుం బోదురు. బంగారముతో చేర్చి యిచ్చిన దంపతులచే ననుభవింపబడిన యా శయ్యను తెలియక తాకినను తాకినవారు నరకముం బొత్తురు. నవశ్రాద్ధమందు భుజింపరాదు. భుజించెనా చాంద్రాయణము సేయవలెను. పితృభక్తిచేత పుత్రులిది చేయవలసినదే. పితృదేవతల నుద్దేశించి వృషోత్సర్జనం (ఆబోతున కచ్చువేసి వదలుట) చేయవలసినది. కపిల గోదానము కర్తవ్యమే. భక్ష్యములతో భోజ్యములతో పండ్లతో గూర్చి ఉదకుంభదానము కూడ చేయనైనదే. ఇట్లు సంవత్సరము మాసికములు పెట్టిన తరువాత చివర సపిండీ కరణము కర్తవ్యము. ప్రేతుడు (మరణించినవాడు) సపిండీకరణమువలన నూర్ధ్వలోకమునందు పార్వణము భుజించును. గావున నిది అవశ్యకర్తవ్యం. వృద్ధిశ్రాద్ధాదులందు గృహస్థునకు సపిండీకరణ శ్రాద్ధము కర్తవ్యము. దానితోనే ముందు వానిని గలుపవలెను. పార్వణ శ్రాద్ధమందు పర్వములలో (అమావాస్యాది శ్రాద్ధములన్నమాట) పితృదేవతల నావాహింపవలెను. అందు ప్రేతుని వేరే నిర్దేశింపవలెను. గంధము, ఉదకము, నువ్వులు నింపిన నాల్గు పాత్రలు (దొన్నెలు) అక్కడ ఉంచవలెను. పితృపాత్రలందు ప్రేతపాత్ర నాసేచనము కీయవలెను-కూర్చతో నుదకము చల్లవలెనన్నమాట. అదేవిధముగా పితృతత్పరుడై నాల్గు పిండములనేర్పరచి ''యే నమానా'' అను మంత్రముతో నన్నమును రెండు రెండుగ విభజించవలెను. ఇదేవిధముగా అర్ఘ్యమునుగూడా మొదటనే పితరులకు ప్రేతకు వేరువేరుగా విభజించి యీయవలెను.

తతః పితృత్వ మాపన్న స్సచతుర్థ స్తదాత్వను | అగ్నిష్వార్తాది మధ్యేతు ప్రాప్నోత్యమృత ముత్తమమ్‌ || 27

సపిండీ కరణాదూర్థ్వం పృథక్‌ తసై#్మ నదీయతే | పితృష్యేవ చ దాతవ్యం తత్పిండం యేషుసంస్థితమ్‌ || 28

తతః ప్రభృతి సంక్రాంతావుపరాగాది పర్వసు | త్రిపిండ మాచరేత్‌ చ్ఛ్రాద్ధమేకోద్ధిష్టం మృతేహని || 29

ఏకోద్దిష్టం పరిత్యజ్య మృతాహేయః సమాచారేత్‌ | సదైవం పితృహాసస్యాత్తథా భ్రాతృ వినాశకః || 30

మృతాహే పార్వణం కుర్వం న్నథోయాతి సమానవః | సంపృక్తే స్వర్గపిర్భూత ప్రేత మోక్షయతో భ##వేత్‌ || 31

అమశ్రాద్ధం తదా కుర్యా ద్విధిజ్ఞః శ్రాద్ధదస్తతః | తేనాగ్నౌ కరణం కుర్యా త్పిండాంస్తేనైవ నిర్వపేత్‌ || 32

త్రిభిః సపిండీకరణం మాసైక్యే త్రయయే తథా | యథా ప్రాప్యతి కాలేన తదా ముచ్యేత బంధనాత్‌ || 33

ముక్తోపి లేప భాగిత్వమ్‌ ప్రాప్నోతి కుశమార్జనాత్‌ | లేవభాజశ్చతుర్థాద్యాస్త్రయః స్యుః పిండభాగినః || 34

పిండదః సప్తమస్తేషాం సపిండా సప్తః పురుషాః |

అలా చేయవలెను ప్రేత నాల్గవ పితృత్వము (పితృదేవతా భావముచు) పొంది అగ్నిష్వాత్తాది పితరులతో పాటుగ నుత్తమమైన అమృతమునందుకొనును. సపిండీకరణమైన తర్వాత నాప్రేతకు వేరుగా పిండప్రాదాన మీయబడదు. ఆ ప్రేతోద్దిష్టమైన పిండము పితరులతోనే యీయవలయుదు. అది వారియందు చేరియున్నది గావున. అది మొదలు సంక్రాంతి యందు గ్రహణాదిపర్వములందు పెట్టు తద్దినము (శ్రాద్ధము) త్రి పిండముగానే ఆచరింపవలెను. అనగా మూడే పిండము లందు విహితములు. ఏకోద్దిష్టము ఒక్క మృతదినమందే. మృతాహమందు ఏకోద్దిష్టము విదిచి దైవము- విశ్వేదేవతా సహితముగ నేదిచేసినను పితృదేవతా పరిహాసపాత్రుడగును. దానివలన భ్రాతృనష్టముకూడ గల్గును. మృత దినమందు పార్వణముచేసినచో నా ప్రేత అధోగతి పొందును. పితృదేవతలో గూడినవాడు (సపిండీకరణముద్వారా) స్వర్గము నందును. అందువలన ప్రేతత్వము నుండి మోక్షము=విడుదలయుం గల్గును. సాపిండ్యమందు ఆమ శ్రాద్ధము (పిండితో) పెట్టవలెను. పిండితోనే అగ్నౌకరణము పిండప్రదానముకూడ చేయవలెను. ఆమీద సపిండీకరణము ఒక మాస మందు లేదు మూడు మాసములుగాని జరుపబడినేని దానిం బొందిన జీవుడు ప్రేతత్వముక్తియేకాదు బంధముక్తియును బొందును (మోక్షమందునన్నమాట).

పిండదః సప్తమ స్తేషాం న పిండాః సప్తపూరుషాః |

భీష్మ ఉవాచ:- కథం హవ్యాని దేయాని కవ్యాని చ జనైరిహ || 35

గృహ్ణంతి పితృలోకే వా ప్రాయః కే కై ర్నిగద్యతే | యది మర్త్యో ర్ద్విజో ర్భుంక్తే హూయతే యది వానలే || 36

శుభాశుభాత్మకాః ప్రాయ స్తదన్నం భుంజతే కథం |

పులస్త్య ఉవాచ :- వసుస్వరూపాః పితరో రుద్రాశ్చైవ పితామహాః || 37

ప్రపితామహా స్తథాదిత్యా ఇత్యేషా వైదికీశ్రుతిః | నామగోత్రం పితౄణాం తు ప్రాపకం హవ్యకవ్యయోః || 38

శ్రాద్ధస్య మంత్రత స్తత్వ ముపలభ్యేత భక్తితః | అగ్నిష్వాత్తాదయ స్తేషా మాధిపత్యే వ్యవస్థితాః || 39

నామగోత్రా స్తదా దేశా భవం త్యుద్భవతా మపి | ప్రాణినః ప్రీణయ త్యేత దర్హణం సముపాగతం 40

దివ్యో యది పితా మాతా గురుః కర్మానుయోగతః | తస్యాన్న మమృతం భూత్వా దివ్యత్త్వే వ్యసు గచ్ఛతి || 41

దైత్యత్వే భోగరూపేణ పశుత్వే పితౄణాం భ##వేత్‌ | శ్రాద్ధాన్నం వాయురూపేణ నాగత్వే ప్యుపతిష్ఠతి || 42

వారిలో పిండప్రదానము చేయువా డేడవవాడు. మొత్తము సపిండులు సమాన పిండ భోక్త లేడుగురు పురుషులు. ''సాపిండ్యం సాప్తపౌరుషమ్‌'' ఏడు తరములదాక సాపిండ్యముండునన్నమాట. హవ్యములు (దేవతల నుద్దేశించి యిచ్చు హోమ ద్రవ్యములు) కవ్యములు (పితృదేవతల నుద్దేశించి యిచ్చు ద్రవ్యములు) ఏ విధముగా నీయవలెను ? ఎవరిచే నీయబడిన యా కవ్యములు నెవ్వరిచ్చినవి యెవరందుకొందురు? మానవమాత్రులైన బ్రాహ్మణులు తిన్నది అగ్నిలో హోమముచేసినదియు నగు నా యన్నమును శుభులు అశుభులునైన ప్రేత లెట్లు తిందురు? అని భీష్ముడు ప్రశ్నింప పులస్త్యు డిట్లనియె. పితరులు వసురూపులు పితామహులు రుద్రులు ప్రపితామహు లాదిత్యరూపులు. ఈ విషయము వేదమునుండి వినబడుచున్నది. పేరు గోత్రమును పితృదేవతల కాయాహవ్యముల నందించును. శ్రాద్ధము యొక్క తత్త్వ మును (యథార్థ స్థితిని) మంత్రము ద్వారా భక్తితో పొందవలెను. పితృదేవతలకు అగ్ని ష్వాత్తాది పితృదేవత లధిపతులుగా నున్నారు. పోయిన తండ్రి తాత లింకొకచోట పుట్టినను (ఇంకొక జన్మ పొందినను) వారి నామగోత్రములు దేశ కాలాదులు వారికుండును. వారికి వారి పుత్రపౌత్రాదులు చేయు నీ అర్హణము = పూజ (శ్రాద్ధము) ఆ ప్రాణులను సంప్రీతులంజేయును. చనిపోయిన తండ్రి తల్లి తాతగాని కర్మానుకూలతంబట్టి దివ్యుడైనచో నప్పుడుగూడ వానినుద్దేశించి పెట్టిన యీ యన్నము దివ్యము (దేవతల కుచితమైన అమృతముగా) నా ప్రాణి కందును. దైత్యుడైనచో వారి కుచిత మైన భోగము మాంసాదిరూప మగును. పశువైనచో పశువుల కాహారమైన గ్రాసము గడ్డి మొదలయిన భోగరూపమగును. సర్వజన్మమెత్తినచో నదే శ్రాద్ధాన్నము వాయువగును. (సర్పములు వాయుభక్షకములు కనుక).

పానం భవతి యక్షత్వే తథా మిషం | దానవత్వే తథా పానం ప్రేతత్వే రుధిరోదకం || 43

మనుష్వత్వేన్నపానాది నానా భోగవతాం భ##వేత్‌ | రతిశక్తి స్త్రియః కాంతేన్యేషాం భోజనశక్తితా || 44

దానశక్తిః సవిభవా రూప మారోగ్య మేవచ | శ్రాద్ధం పుష్ప మిదం ప్రోక్తం ఫలం బ్రహ్మసమాగమః || 45

ఆయుః పుత్రాన్‌ ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ | ప్రయచ్ఛంతి తథా రాజ్యం ప్రీతాః పీతృగణా నృప || 46

శ్రూయతే చ పురా మోక్షం ప్రాప్తాః కౌశికసూనవః | పంచభి ర్జన్మసంబంధైః ప్రాప్తా బ్రహ్మ పరం పదం || 47

భీష్మ ఉవాచ :-

కథం కౌశిక దాయాదాః ప్రాప్తా యోగ మనుత్తమం | పంచభి ర్జన్మసంబంధైః కథం కర్మక్షయో భ##వేత్‌ || 48

యక్షుడైనచో పానమగును. రాక్షసుడైన మాంసమగును. దానవుడైన రక్తరూపమగు పానమగును. మనుష్య జన్మమెత్తిన నన్నపానాది రూపమగును. స్త్రీకి పురుషునికి రతి శక్తిగ ఇతరులకు భోజనశక్తి. వైభవముతోగూడిన దాన శక్తి రూపము ఆరోగ్యము మొదలగు పెక్కు విధముల రూపొందును. శ్రాద్ధ మిది పువ్వు. దీని ఫలము బ్రహ సాయుజ్యము (కేవల మోక్షము). రాజా ! అయువును పుత్రులను ధనమును విద్యను (జ్ఞానమును) స్వర్గము మోక్షానందమును రాజ్యమునుగూడ శ్రాద్ధాదులచే సంప్రీతులైన పితృగణము లిత్తురు. మున్ను కౌశికుని కుమారులు మోక్షముం బొందిరని (వేదముల వలన వినబడుచున్నది. వారైదు జన్మముల సంబంధము పొంది తుదకు పరమబ్రహ్మ పదము నందినారు నా విని భీష్ముడు, కౌశికజ్ఞాతులు ఆ వరమోత్తమ ముక్తియోగము నెట్లు పొందిరి? ఐదుజన్మములలోనే కర్మ క్షయ మెట్లయినది? అని యడుగ పులస్త్యు డిట్లనియె.

పులస్త్య ఉవాచ :-

కౌశికో నామ ధర్మాత్మా కురుక్షేత్రే మహాసృషిః | నామతః కర్మత స్తస్య పుత్రాణాం త న్నిబోధమే || 49

స్వనృపః క్రోధనో హింస్రః పిశునః కవి రేవచ | వాగ్దుష్టః పితృవర్తీచ గర్గ శిష్యా స్తదా భవన్‌ || 50

పిత ర్యువరతే తేషా మభూత్‌ దుర్భిక్ష ముల్బణం | అనావృష్టిశ్చ మహతీ సర్వలోకభయంకరీ || 51

గర్గాదేశా ద్వనే దోగ్ధ్రీం రక్షంతి చ తపోధనాః | ఖాదామః కపిలా మేతాం వయం క్షుత్పీడితా భృశం || 52

ఇతి చింతయతాం పాపం లఘుః ప్రాహ తదానుజః | య ద్యవశ్య మియం వధ్యా శ్రాద్ధరూపేణ యోజ్యతాం || 53

శ్రాద్ధే నియోజ్యమానాయాం పాపం నశ్యతి నో ధ్రువం | ఎవం కుర్వి త్యనుజ్ఞాతః పితృవర్తీ తదానుజైః || 54

చక్రే సమాహితః శ్రాద్ధ ముపయుజ్యాధ తాం పునః | ద్వౌథైవే భ్రాతరౌ కృత్వా పిత్ర్యేత్రీం శ్చాపరాన్‌ క్రమాత్‌

తథైక మతిథిం కృత్వా శ్రాద్ధదః స్వయ మేవతు | చకార మంత్రవ చ్ఛ్రాద్ధం స్మరన్‌ పితృపరాయణః || 56

తథాగత్యా విశంకా స్తే గురవేచ న్యవేదయన్‌ | వ్యాఘ్రేణ నిహితా ధేను ర్వ త్సోయం ప్రతిగృహ్యతాం || 57

ఏవం సా భక్షితా ధేనుః సప్తభి సై#్తః తపోధనైః | వైదికం బల మాశ్రిత్య క్రూరే కర్మణి నిర్భయాః || 58

తతః కాలే ప్రనష్టాస్తే వ్యాధా దశపురే భవన్‌ | జాతిస్మరత్వం ప్రాప్తాస్తే పితృభావేన భావితాః || 59

తత్ర విజ్ఞాయ వైరాగ్యం ప్రాణా నుత్సృజ్య ధర్మతః | లోకై రవీక్ష్య మాణాస్తే తీర్థాంతేనశ##నేనతు || 60

సంజాతా మృగరూపాస్తే సప్తకాలంజరే గిరౌ | ప్రాప్తవిజ్ఞానయోగాస్తే తత్యజుస్తే నిజాంతనుమ్‌ || 61

కౌశికుడను మహర్షి కురుక్షేత్ర మందుండువాడు అతని కొడుకుల పేర్లు వారు చేసిన చేతలనుబట్టి వచ్చినవే తెలిపెద వినుము : స్వనృపుడు క్రోధనుడు హింస్రుడు పిశునుడు కవి వాగ్దుష్టుడు పితృవర్తి అనువారు. అందరును గర్గాచార్యుల శిష్యులే. తండ్రి పోయిన తర్వాత తీవ్రమైన దుర్భిక్షము ఘోరమైన అనావృష్టియు వచ్చినది. ఆ తపోధనులు గర్గాజ్ఞతో గోవు నొకదాని నడవిలో మేపుచుండిరి. ఈ కపిల గోవును తిందము. మన మాకలికి జాల కుమిలిపోవుచున్నా మని పాపాలోచన సేయుచున్నతరి వారిలో (పితృవర్తి) చిన్నవాడు ఈ యావును తప్పనిసరిగా చంపవలసినదే యైనచో శ్రాద్ధరూపమున నాపని చేయుడు. ఆ గోవు శ్రాద్ధ వినియోగమైనచో మనకు గోహత్యా పాపము నశించును. ఇది నిక్కమనెను. అంతట నిట్లు సేయుమని యన్నలచే నాజ్ఞాపింపబడి పితృవర్తి యనువాడు శ్రద్ధతో దాని నుపయోగించి శ్రాద్ధముం బెట్టెను. ఆ తద్దినమందు వారిని దైవస్థానమందు (విశ్వేదేవస్థానమందు) ఇద్దరను పితృస్థానమందు ముగ్గురను అతిథిగా నొక్కని గూర్చండబెట్టి తాను తద్దినము పెట్టువాడై పితరులను స్మరించుచు మంత్రవత్తుగా శ్రాద్ధము పెట్టెను. అవ్వల నందరును శంకగొనక గురువునకు ఆవు పులివాతబడిన దిదిగో దూడ గైకొనుమనిరి. ఆ యేడ్వురు తపోధను లీలాగున నా ధేనువుం దినివేసిరి. అది యెంతేని క్రూరమైన పనియైనను వైదికమయిని బలము (వేదోక్తమైన పని చేసి నందువలని శక్తి). జడుపు విడిచి యా దుండగమున కొడబడి యావుం దినివేసిరి. అవ్వల కాలము జరిగి చనిపోయి వారు దశపురమందు కిరాతులై పుట్టిరి. పితృదేవతా భావభావితు లగుటచే వారు జాతిస్మరత్వముం బొందిరి, వారికి పూర్వజన్మ జ్ఞప్తి గల్గినదన్నమాట. ఆ జన్మమందు వైరాగ్యమెరింగికొని కర్మానుసారముగ ప్రాణములు విడిచి యొక తీర్థము చివర లోకుల కెవ్వరికి గనబడకుండ యనశనులై (ఆహారము లేక) పరమపదించి కాలంజరమను గిరియం దా యేడుగురు మృగములై జన్మించిరి. విజ్ఞానయోగమొంది వా రామేను విదిచిరి.

యయుః ప్రపతనే నాథ జాతవైరాగ్యమానసాః | మానసే చక్రవాకాస్తే సంజాతాః సప్త యోగినః || 62

నామతః కర్మతః సర్వే సుమనా కునుమో వసుః | చిత్తదర్శీ సుదర్శీచ జ్ఞాతా జ్ఞానస్య పారగః || 63

జ్యేష్ఠానురక్తాః శ్రేష్ఠాస్తే సపై#్తతే యోగపావనాః | యోగభ్రష్టా స్త్రయ స్తేషాం బభూవు శ్చలచేతసః || 64

విరక్తులై అవ్వల నా కొండనుండి క్రింది కురికి పడి చచ్చి (ప్రపాతమునంది) మానస సరస్సునం దా యేడ్వురు యోగులు చక్రవాకములై పుట్టిరి. పేరుచేత క్రియచేత వారు 1. సుమనుడు 2. కుసుముడు 3. వసు 4. చిత్తదర్శి 5. సుదర్శి 6. జ్ఞాత 7. జ్ఞానపారగుడు నయి జ్యేష్ఠు నునువర్తించుచు నయ్యేడ్గురు యోగపావను లయిరి. అందులో ముగ్గురు చిత్తము చలించి యోగభ్రష్టు లయిరి.

దృష్ట్వా విభ్రాజమానం తం అణుహం స్త్రీభి రన్వితం | క్రీడంతం వివిధై ర్భోగైః మహాబల పరాక్రమం || 65

పాంచాలాస్వయ సంభూతం ప్రభూత జలవాహనం | రాజ్యకామో భవ త్వేకః తేషాం మధ్యే బలౌక సాం || 66

అందులో నొకడు, అణుహుడను పాంచాలరాజు మిగుల తేజరిల్లుచు మగువలతో మహాబల పరాక్రముడై వివిధ భోగము లనుభవించుచు క్రీడించుచుండు వానిం జూచి వాని చతురంగబల వాహన వైభవముం జూచి యా చక్రవాక పక్షులలో నొక్కడు రాజ్యకాము డయ్యెను.

పితృవర్తీచ యో విప్రః శ్రాద్ధ కృ త్పితృ వత్సలః | అవరౌ మంత్రిణౌ దృష్ట్వా ప్రభూత బలవాహనౌ || 67

మంత్రిత్వే చక్రతు శ్చేచ్ఛా మస్మిన్‌ మర్త్యౌ ద్విజోత్తమౌ | విభ్రాజపుత్రస్త్వేకో భూత్‌ బహ్మదత్త ఇతి స్మృతః ||

మంత్రిపుత్రౌ తథాచైవ పుండరీకసుబాలకౌ | బ్రహ్మదత్తోభిషిక్తస్తు కాంపిల్యే నగరోత్తమే || 69

పంచాలరాజో విక్రాంత శ్రాద్ధకృత్‌ పితృవత్సలః | యోగ వి త్సర్వ జంతూనాం చిత్తవేత్తా భవత్‌ తదా || 70

ఇక పితృవర్తియను విప్రుడు శ్రాద్ధము పెట్టినవాడు పితృవత్సలుడును పైని జెప్పిన రాజు యొక్క మంత్రులను బలవాహన సమృద్ధులను జూచి తామాలాటి మంత్రులమైన బాగుండునని కోరి యీ మర్త్యలోకమున పుట్టిరి. విభ్రాజుని కొడుకు బ్రహ్మదత్తుడయ్యెను. మంత్రి కుమారులుగా పుట్టి పండరీకుడు సుబాలకుడు నను పేర్లందిరి. బ్రహ్మదత్తుడు కాపిల్య నగరమందభిషిక్తుడయ్యెను అతడే ముందటిజన్మమందు పితృవత్సలుడు. శ్రాద్ధకర్త పాంచాల రాజయ్యెను. యోగవేత్త సర్వజంతు చిత్తమెరిగిన వాడయ్యెను.

తస్య రాజ్ఞోభవ ద్భార్యా సుదేవ స్యాత్మజా తదా | సన్నతి ర్నామ విఖ్యాతా కపిలా యా భవత్పురా || 71

పితౄకార్యే నియుక్తత్వా దభవత్‌ బ్రహ్మవాదినీ | తయా చకార సహితః స రాజ్యం రాజనందనః || 72

ఆ పాంచాలరాజునకు సుదేవుని కుమార్తె సన్నతి యను నామె భార్యయయ్యెను. మున్ను శ్రాద్ధమందు జంపబడిన కపిలగోవే యిపుడు రాజ్ఞియైనది. పితృకార్యమందుపయోగింపబడుటచే నామె బ్రహ్మవాదిని యయ్యెను. ఆ రాజ నందనునండామెతో రాజ్యమేలెను.

కదాచి ద్గత ఉద్యానం తయా సహ స పార్థివః | దదర్శ కీటమిథున మనంగకలహాన్వితం || 73

ఒకతఱి నాత డామెతో నుద్యానమున కేగెను. అట కీటకముల జంట కామకలహమాడుకొనుచుండం గనెను.

పిపీలికా మథో వక్త్రాం పురతః కీటకాముఖః | పంచబాణాభితప్తాంగః సగద్గద మువాచహ || 74

న త్వయా సదృశీ లోకే కామినీ విద్యతె క్వచిత్‌ | మధ్యే క్షీణాతిజఘనా బృహద్వ క్త్రాతిగామినీ || 75

సువర్ణవర్ణ సదృశీ సద్వక్త్రా చారుహాసినీ | అలక్ష్యతేచ వదనం గుడశర్కరవత్సలం || 76

భోక్ష్యసే మయి భుక్తే త్వం స్నాసి స్నాతే తథా మయి | ప్రోషితే మయి దీనా త్వం క్రుద్ధేచ భయచంచలా || 77

కిమర్ధం వద కల్యాణి సదాథోవదనా స్థితా | సా త మాహ జ్వల త్కోపా కి మాలవసిరే శఠ || 78

త్వయామోదక చూర్ణంతు మాం విహా యాపి భక్షితం | ప్రాదాఃత్వం మా మతిక్రమ్య అన్యసై#్త సమన్మధః || 79

అక్కడ మగ కీటకము తలవంచికొనియున్న యాడు చీమం గని కామబాణముల మేనుడికి గద్గదికతో 'ఓసి! నీ కీడైన కామిని లోకమం దెందును లేదు. నడుము క్షీణము పెద్ద పిరుదులు. నిండు మొగము. చెంగుచెంగున నడతువు. మేని రంగు బంగారమే ముద్దుమొగము-మొలకనవ్వు. బెల్లము పంచదారపై మక్కువగొన్న నీ చక్కని మొగము కనిపించు చున్నది. నేను దిన్న నీవు తిందువు. నేను స్నానము చేసితినా నీవు స్నానము చేయుదువు. ఎటకేని నేనేగితినా దిగులు వడెదవు. కోపించితినా బెదరి కంగారుపడుదువు. ఎందుకే చెప్పు. కల్యాణి ! ఎప్పుడు తలవంచికొనియుందు వన విని, కోపమున మండిపడి యా యాడుచీమ యిట్లనియె. ఓరి! శఠ ! ఏమి ప్రేలుచుంటివి? మిఠాయి పొడి నన్ను విడిచి నీవ మెక్కితివ? లేదా ! చెప్పుము. నన్నుగాదని వలచి యింకొకదానికి మన సిచ్చితివిగదా.

పిపీలిక ఉవాచ :

త్వత్సాదృశ్యా న్మయాదత్త మన్యసై#్య వరవర్ణిని | తదేక మపరాధం మే క్షంతు మర్హంసి భామిని || 80

నైవం పునః కరిష్యామి త్యజ కోపంచ సుస్తని | న్పృశామి పాదౌ సత్యేన ప్రణతస్య ప్రసీదమే || 81

రుష్టాయాం త్వయి సుశ్రోణి మృత్యు ర్మే భ##వేత్‌ | తుష్టాయాం త్వయి వామోరు పూర్ణాః సర్వమనోరథాః || 82

పూర్ణచంద్రోపమం వక్త్రం స్వాదేమృత రసోదయమ్‌ | నిర్భరం పిబ సుశ్రోణి ! కామాసక్తస్య మే సదా || 83

పిపీలిక యిట్లనియె. చక్కనిదాన! నీ పోలిక గని నే నింకొకదానికి మనసిచ్చితిని. భామిని ! ఇదొక్క తప్పు సైరింపుము. ఇట్లు మఱి సేయను. సుస్తనికినుక విడుము. నిజము నీ పాదములాన ! పాదములంటి పలుకుచు ప్రణతుడ నైన నా యెడ దయగొను. సుశ్రోణి (వలుద పిఱుదులదాన) నీవు కోపించిన నీ యెదుట చావు సిద్ధము. వామోరు ! నీవు సంతుష్టురాలైన నా మనోరధములు సంపూర్ణములు. నా మోము పున్నమ చందమామ గద! తదాస్వాద మమృత రసోదయమే.

ఏతన్మత్వా శుభే కార్యా సర్వదాతు కృపా మయి | ఇతి సా వచనం శ్రుత్వా ప్రసన్నా చాభవ త్తతః || 84

ఆత్మాన మర్ప యామాన మోహనాయ పిపీలికా | బ్రహ్మదత్తోపి తత్సర్వం జ్ఞాత్వా సస్మయ మాహ నత్‌ || 85

వలపుకొనిన నా మోమది తనివార గ్రోలుము. ఇది గణించి ఓ కల్యాణి యెల్లవేళల నాయెడ దయ సూపుము అనవిని యవ్వల నా యాడుచీమ యా చీమ యెడ వలపుటలుక విడిచి ప్రసన్నమయ్యె. వాని వలపింప దసను దా నప్పనము సేసికొనెను.

సర్వసత్త్వరుతజ్ఞానీ ప్రభావా త్పూర్వ కర్మణః | కధం సర్వరుతజ్ఞోభూ ద్బ్రహ్మదత్తో నరాధిపః || 86

భీష్మ ఉవాచ :

తచ్చాపి చాభవ త్కుత్ర చక్రవాకచతుష్టయం | తన్మే కధయ సర్వజ్ఞ కులే కస్యచ సువ్రత|| 87

పులస్త్య ఉవాచ : తస్మిన్నేవ పురేజాతా శ్చక్రవాకా అధో నృప || 88

పూర్వకర్మవశమున సర్వసత్త్వరుత జ్ఞానమువలన బ్రహ్మదత్తు డా చీమ పలుకులన్నియు దెలిసి యల్లన నవ్వి యదెల్ల జెప్పెను. నావిని భీష్ముండు బ్రహ్మదత్తుడు సర్వభూతరుతజ్ఞాన మెట్లుపొందెను. ఆ చక్రవాకములు నాల్గు నెక్కడ యేకులమందు నేమైనవి? సర్వజ్ఞుడ పదియెల్ల నా కానతిమ్మన, పులస్త్యుడనియె.

వృద్ధ ద్విజస్య దాయాదా విప్రా జాతిస్మరా బుధాః | ధృతిమాం స్తత్వదర్శీచ విద్యావర్ణ స్తపోధికః || 89

నామతః కర్మతశ్చైవ సుదరిద్రస్య తే సూతాః | తపసే బుద్ధి రభవ త్తేషాంవై ద్విజ జన్మనామ్‌ || 90

యాస్యామః పరమాం సిద్ధి ముచు స్తే ద్విజసత్తమాం | త త్తేషాం వచనం శ్రుత్వా సుదరిద్రో మహాతపాః || 91

ఉవాచ దీనయావాచా కి మేతదితి పుత్రకాః | అధర్మ ఏషవః పుత్రా పితా తా నిత్యువాచ హ || 92

వృద్ధం పితర ముత్సృజ్య దరిద్రం వసవాసినం | క్వను ధర్మో త్ర భవితా మాం త్యక్త్వా గతి మేవచ || 93

ఊచుస్తే కల్పితావృత్తి స్తవతాత వచః శ్రుణు | వ్రత మేతత్పురా రాజ్ఞః సతే దాస్యతి పుష్కలమ్‌ || 94

ధనం గ్రామసహస్రాణి ప్రభాతే పఠత స్తవ | కురుక్షేత్రేతు యే విప్రా వ్యాధా దశ పురేతుమే || 95

కాలంజరే మృగా భూతా శ్చక్రవాకా స్తు మానసే | ఇత్యుక్త్వా పితరం జగ్ము స్తే వనం తపసే పునః || 96

ఆ పురమంద ఆ నాల్గు చక్రవాకము లొక వృద్ధ బ్రాహ్మణుని కొడుకులై జాతిస్మరులై పుట్టినారు. ధృతి మంతుడు తత్వదర్శి విద్యావర్ణుడు తపోధికుడు నను పేర్లవారు వారు పేరునకు దిగిన క్రియ గలవారు. వారందరకు తపసు సేయవలెనను తలంపు గల్గెను. మేము పరమతపస్సిద్ధి నందెదమన విని తండ్రి సుదరిద్రుడు మహాతవస్వి, దీనముగ నాయనలార ! ఇతి మీకు ధర్మముగాదు. ముదుసలిం దండ్రిని అందును నిరుపేద నడవిని విడిచిపోవు టిదేమి? నన్నుబాసి మీకు మరి ధర్మ మెక్కడ? గతి యెక్కడున్నది? అన వారు తండ్రీ! నీకు వృత్తి (బ్రతుకుతెరువు) ఏర్పరుపబడియే యున్నది. మా మాట విను. ఇది యీ భూమి నేలు రాజు వ్రతము. అతడు నీకు పుష్కలముగ నిచ్చును. కురు క్షేత్రమం దే విప్రులు దశపురమందు వ్యాధులెవరైరి. కాలంజర గిరిపై మృగములైరి వారు మానస సరస్సునందు చక్ర వాకములైరి. అని వేకువవేళ నీవు పఠించినంజాలు నీ కతను పుష్కలముగ నిచ్చును. అని తండ్రికిం జెప్పి వారు తపస్సునకు తిరిగి వనమునకుం జనిరి.

వృద్ధోపి స ద్విజో రాజన్‌ బభ్రామ స్వార్థసిద్ధయే | అణుహో నామ వైభ్రాజః పంచాలాధిపతిః పురా || 97

పుత్రార్థీ దేవదేవేశం పద్మయోనిం పితామహం | ఆరాధ యామాస విభుం తీవ్ర వ్రత పరాయణః || 98

ఆ వృద్ధ బ్రాహ్మణుడును స్వార్థసిద్ది కిట్టటు పరిభ్రమించెను. మున్ను పాంచాల రాజు అణుహుడును పుత్రార్థియై దేవదేవు నీశ్వరుల బ్రహ్మను బితామహు నారాధించెను.

తతః కాలేన మహతా తుష్టస్తస్య పితామహః | పరం పరయ భద్రంతే హృదయే భీప్సితం నృప || 99

అణురువాచ : పుత్రం మే దేహి దేవేశ మహాబలపరాక్రమం | పారగం సర్వవిద్యానాం ధార్మికం యోగినాం వరమ్‌ ||

సర్వసత్త్వరుతజ్ఞం మే దేహి యోగిన మాత్మజం | ఏవమ స్త్వితి విశ్వాత్మా తమాహ పరమేశ్వరః || 101

పశ్యతాం సర్వభూతానాం తత్రైవాంతరధీయత | తతః సతస్య పుత్రోభూత్‌ బ్రహ్మదత్తః ప్రతాపవాన్‌ || 102

సర్వ సత్వానుకంపీచ సర్వసత్వబలాధికః | సర్వ సత్వరుతజ్ఞశ్చ సర్వసర్వేశ్వరేశ్వరః || 103

అథసత్వేన యోగాత్మా స పిపీలిక మాగతః | యత్ర యత్కీటమిథునం రమమాణ మవస్థితమ్‌ || 104

తతః సా సన్నతి ర్దృష్ట్వా ప్రహసంతం సువిస్మితం | కి మప్యాశంకమానా సా త మపృచ్ఛ న్నరేశ్వరమ్‌ || 105

కొంతకాలమునకు సంతుష్టుడై బ్రహ్మ నీ యభీప్పిత మడుగుమనెను. అణువు నాకు దేవా! బలపరాక్రమ శాలింగొడుకు నిమ్ము. అతడు సర్వవిద్యాపారంగతుడు ధార్మికుడు యోగిపరుడును సర్వసత్త్వరుతజ్ఞానియుం గావలెనన బ్రహ్మ యట్లే యగుగాక యని యన్ని భూతములు చూచుచుండ నక్కడ యంతర్ధానమందెను. అవ్వల నతనికి బ్రహ్మదత్తుడు ప్రతాపశాలి సర్వసత్త్వయాపరుడు సర్వసత్వబలాధికుడు సర్వసత్వరుతజ్ఞుడు సర్వసర్వేశ్వశ్వరుడు కుమారుడుదయించెను.

ఆమీద యోగసత్త్వముతో (సత్వగుణసంపత్తితో) నాతడు చీమవద్దకు వచ్చెను. అక్కడనే క్రీడించు కీటక మిథునముం జూచెను. చూచి విస్మయమంది నవ్వుచున్న యాతనిం జూచి సన్నతి యేదో సంశయించుచున్నదియై యా నరనాధు నిట్లడిగెను.

సన్నతి రువాచ :

అకస్మా దతిహాసోయం కి మర్థ మభవ న్నృప | హాస్యహేతుం న జానామి యదకాలే కృతం త్వయా || 106

అపద ద్రాజపుత్రోసౌ తం పివీలిక భాషితం | రాగవ ద్విరసోత్పన్న మే తద్ధాస్యం వరాననే || 107

నచాన్య త్కారణం కించి ద్ధాస్యహేతుః శుచిస్మితే | న సా మన్యత తం దేవ ప్రా హాలీక మిదం తవ || 108

అహ మేవేహ హసితా న జీవిష్యేం త్వయాధునా | కథం పిపీలికాలాపం మర్త్యోవేత్తి సురా ద్ధృతే || 109

తస్మా త్వయాహమేవాద్య హసితా కి మతః పరం | తతో నిరుత్తరో రాజా జిజ్ఞాసు స్త ద్వద్వచో రహః || 110

అస్థాయ నియమం తస్తౌ సప్తరాత్ర మకల్మషః | స్వప్నాంతే ప్రాహతం బ్రహ్మ ప్రభాతే పర్యటన్‌ పురమ్‌ || 111

వృద్ధిద్విజోత్తమా ద్వాక్యం సర్వం జ్ఞాస్యతి తే ప్రియా | ఇత్యుక్త్వాంతర్దధే బ్రహ్మా ప్రభాతేచ నృపః పురాత్‌ || 112

నిర్గచ్చ స్మంత్రి సహితః సభార్యో వృద్ధమగ్రతః | గదంతం విప్రమాయాంతం వృద్ధంచ స దదర్శహ || 113

బ్రాహ్మణ ఉవాచ :

యే విప్రముఖ్యాః కురుజాంగలేషు దాశా స్తధా దాశ పురే మృగాశ్చ |

కాలంజరే సప్తచ చక్రవాకా యే మానసే తేత్రవసంతి సిద్ధాః || 114

ఇత్యాకర్ణ్య వచ స్తస్య సపపాత శుచాన్వితః | జాతిస్మరత్వ మగమ త్తౌచ మంత్రి వరాత్మజౌ || 115

రాజా! హఠాత్తుగ నీ కీ వెఱ్ఱినవ్వేల కల్గినది ? అసమయముననయిన యీ నవ్వునకు కారణమెరుంగకున్నాను. అన రాజకుమారు డా చీమ పలుకు విని, ఈ న వ్వనురాగభరితయే విరసముగ నేర్పడినది. ఓ చక్కని నవ్వుదాన ! ఈ నగవునకు మరి యేకొంచెము కారణము లేదనెను. అందుల కామె యంగీకరింపలేదు. మరియు నా దేవి ''నీ మాట యిది అబద్ధము. నన్నే పరిహసించితివి. నీతో నిపుడు నే జీవింపను. ఆడుచీమపలుకు దేవుడుగాక మనుజుడెట్లెరుంగగలడు? అందుచే నీచే నిపుడు నేనే పరిహసింపబదితిని, ఇంతకుపై నేమున్నది ? అనెను. అది విని రాజు మారుపల్కక హరి వచన మది యేమో తెలియగోరి యకల్మషుడై నియమమూని యేడురాత్రు లట్టె యుండెను. స్వప్నాంతమందు బ్రహ్మ ప్రభాత కాలమందు నగరమందు పర్యటించుచువచ్చి 'నీ ప్రియపత్ని వృద్ధబ్రాహ్మణోత్తముని వలన నా పలుకెల్ల నెరుగగలదని యంతర్థానమయ్యెను. వేకువనే రాజు భార్యతో మంత్రులతో పురము వెడలి యట ముందేదో పలుకుచువచ్చుచున్న యొక్క ముదుసలిం జూచెను. అపుడా బ్రాహ్మణుడు ''యే విప్రముఖ్యా....తే త్ర వసంతి సిద్ధాః'' అను శ్లోకము పఠించు చుండెను. అది విని యా రాజు శోకముగొని జాతిస్మరుండయ్యె. అతని యిద్దరు మంత్రులును నట్లే జన్మాంతర వృత్తాంత మెల్ల స్మరించినవారైరి.

కామశాస్త్ర ప్రణతాతు బాభ్రవ్యః సతు బాలకః | పంచాల ఇతి లోకేషు మిశ్రుతః సర్వశాస్త్రవిత్‌ || 116

పుండరీకోపి ధర్మాత్మా వేదశాస్త్ర ప్రవర్తకః | భూత్వా జాతి స్మరే శోకా త్పతితా వగ్రత స్తధా || 117

హా వయం కర్మ విభ్రష్టాః కామతః కర్మబంధనాత్‌ | ఏవం విలప్య బహు శ స్త్రయస్తే యోగ పారగాః || 118

విస్మయా చ్ఛ్రాద్ధ మాహాత్మ్యా మభినంద్య పునః పునః | సతు తసై#్మ ధనం దత్వా ప్రభూత గ్రామ సంయుతమ్‌ ||

విసృజ్య బ్రాహ్మణం తంచ వృద్ధం ధనమదాన్వితం | అత్మీయం నృపతిః పుత్రం నృపలక్షణ సంయుతమ్‌ 120

విష్వక్సేనాభిదానంచ రాజా రాజ్యేభ్యషేచయత్‌ | మానసే సలిలే సర్వే తతస్తే యొగినాం వరాః || 121

బ్రహ్మదత్తాదయ స్తస్మి న్పితృభక్తా విమత్సరాః | సన్నతిశ్చాభవ ద్దృష్టా మయైవ తపదర్శితమ్‌ || 122

రాజన్యోగఫలం సర్వం యదేత దభిలక్ష్యతే | తధేతి ప్రాహ రాజాలాపి పురస్తా దభినందయన్‌ || 123

త్పత్ప్రసాదా దిదం సర్వం మయైవం ప్రాప్యతే ఫలం | తతస్తే యోగమాస్థాయ సర్వ ఏవ వనౌకసః || 124

బ్రహ్మరంధ్రేణ పరమం పదమాపు స్తపోబలాత్‌ | ఏవ మాయుర్ధనం విద్యాం స్వర్గం మోక్ష సుఖానిచ || 125

ప్రయచ్ఛంతి సుతం రాజ్యం నౄణాంస్తుష్టా, పితామహాః | ఇదంచ పితృమాహాత్మ్యం బ్రహదత్తస్యవై నృప || 126

ద్విజేభ్యః శ్రావయే ద్విద్వాన్‌ శృణోతి పఠతేపివా | కల్ప కోటి శతం సాగ్రం బ్రహ్మలోకే మహీయతే || 127

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

పితృమాహాత్మ్య కథనం నామ దశమోధ్యాయః.

కామశాస్త్రరచయిత సర్వశాస్త్రవేత్త బాభ్రవ్యుడను నా బాలుడే పాంచాలరాజను పేరందెను. పుండరీకుడు ధర్మాత్ముడు వేదశాస్త్రప్రవర్తకుడయ్యెను. వారిద్దరు జాతిస్మరులై శోకించుచు నాముందు వ్రాలిరి. అయ్యో మేము కోరి కర్మ బంధమునబడి కర్మ విభ్రష్టులమైతిమి. అని యెంతో యేడ్చి యా యోగపారగులు లాశ్చర్యముగొని శ్రాద్ధమహిమను మరల మరల యభినందించిరి. అతడు నారాజునకు ధనము సర్వసమృద్ధమయిన గ్రామముల నొసంగి ధనమదముగొన్న యా ముదుసలి బ్రాహ్మణుని నట విడిచి రాజలక్షణసంపన్నుం దన పుత్రుని విష్వక్సేనుడను పేర వానిని రాజ్యమందు పట్టాభిషేకించెను. అవ్వల నా బ్రహ్మదత్తాదులు యోగివరులందరు మానససరోవర జలమ్మున పితృభక్తులు మచ్చర మేమి యును లేనివారై వసించిరి. సన్నతియు హర్షభరితయయ్యె. నేనే నీకిది చూపితిని. రాజా! యోగఫల మిదియెల్ల యెట్టయెదుట లక్షితమైనది. నీ యనుగ్రహమున నా కీ ఫలమెల్ల ప్రాప్తించినది. అని యభినందించెను. అటుపై యోగులు వారెల్లరు యోగమూని తపోబలముచే బ్రహ్మరంధ్రమున పరమపదించిరి. ఇట్లు పితామహులు తుష్టులై ఆయువు ధనము విద్య స్వర్గము మోక్షము సుఖములు సుతుని రాజ్యమును నరులకిత్తురు. ఇది బ్రహ్మదత్తుని పితృమాహాత్మ్య మును విద్వాంసుడై (తెలిసి) విప్రులకు వినిపించునేని వినునేని చదువునేని నూరుకోట్ల కల్పములకుపైని బ్రహ్మలోకము నందు దేజరిల్లును.

ఇది పితృమాహాత్మ్యకథనమను పదియవ యధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters