Sri Padma Mahapuranam-I    Chapters   

వింశోధ్యాయః

-: బహూనాం వ్రతానాం ప్రశంసా :-

అత్యాశ్చర్యవతీ రమ్యా కథేయం పాపనాశనీ | విస్తరేణ చ మే బ్రూహి యథాతథ్యేన పృచ్ఛతః || 1

మాహాత్మ్యం మధ్యమస్యాపి ఋషిభిః పరికీర్తితమ్‌ | ఫలం చాన్నస్య కథితం మాహాత్మ్యం చ దమస్య తు || 2

విష్ణునా చ పదన్యాసః కృతో యత్ర మహామునే | కనీయసస్తథోత్పత్తిర్యథా భూతా వదస్వ మే || 3

పులస్త్య ఉవాచ : పురా రథంతరే కల్పే రాజాసీత్‌ పుష్పవాహనః |

నామ్నా లోకేషు విఖ్యాతస్తేజసా సూర్యసన్నిభః || 4

తపసా తస్య తుష్టేన చతుర్వక్త్రేణ భారత | కమలం కాంచనం దత్తం యథా కామగమం నృప || 5

సప్తద్వీపాని లోకం చ యథేష్టం వై చరత్సదా | కల్పాదే తు సమం ద్వీపం తస్య పుష్కరవాసినా || 6

లోకేన పూజితం తస్మాత్‌ పుష్కరద్వీపముచ్యతే | తదేవ బ్రహ్మణా దత్తం యానమస్య తతోంబుజమ్‌ || 7

పుష్పవాహన ఇత్యాహుస్తస్మాతం దేవదానవాః |

నౌపమ్యమస్తీహ జగత్రయేపి బ్రహ్మాంబుజ స్థస్య చ తస్య రాజ్ఞః || 8

తపోనుభావాదథ తస్య రాజ్ఞీ నారీసహసై#్రరభివంద్యమానా |

నామ్నాచ లావణ్యవతీ బభూవ యా పార్వతీవేష్టతమా భవస్య || 9

తస్యాత్మజానామయుతం బభూవ ధర్మాత్మనా మగ్ర్యధనుర్ధరాణాం | తధాత్మజాంస్తానభివీక్ష్య రాజా ముహుర్ముహుర్విస్మ యమాససాద || 10

భీష్ముడు పుష్కరక్షేత్ర మధ్యప్రదేశము కథ చాలా వింతైనది చక్కనిది పాపనాశనమునైన మహిమ. ఇది ఋషులు వర్ణించినారు. చివరి ప్రదేశకథ సెప్పితిరి. ఇచ్చట విష్ణువు పాదము నుంచుట మొదలుగ పుష్కరక్షేత్రము తుది ప్రవేశకథను సవిస్తరముగా దెలుపుమన పులస్త్యు డనియె:- మునుపు రథంతర కల్పమందు పుష్పవాహనుడను రాజు లోకప్రసిద్ధుడు. సూర్యుని వంటి తేజస్వి యొకడుండెను. అతని తపస్సుకు సంతుష్టుడై బ్రహ్మ బంగారు తామరపువ్వు ననుగ్రహించెను. కామగవిమానమది యెక్కి యా రాజు సప్త ద్వీపములందు యధేష్టముగ సంచరించెను. ఆ కల్పము ముందది యొక ద్వీపమట్టులై సువిశాలమై పుష్కరద్వీపమను ప్రసిద్ధినందెను. పుష్కరము= తామరపువ్వు. ఆ పుష్పమే యతనికి వాహనమైనందున నతనిని పుష్పవాహనుడని దేవతలు దానవులు పేర్కొనిరి. మూడు లోకములందు తపః ప్రభావమున నా రాజునకు సాటి యెవ్వరు లేరు. ఆతని రాణి లావణ్యవతియను పేర ప్రసిద్ధిగని వేలకొలది స్త్రీల ప్రశంలసందినది. పరమేశ్వరునికి పార్వతి యట్లా ఱనికెంతేని యిష్టురాలయ్యెను. ఆతనికి పదివేల మంది కొడుకులు గలిగిరందరు పరమ ధర్మాత్ములు, పరమశూరులు. వారింగని యాతడెంతో యాశ్చర్యపడుచుండెను. 10

సోభ్యాగతం పూజ్యమునిప్రవీరం ప్రచేతసం వాక్యమిదం బభాషే |

కస్మాద్విభూతిర చలామరమర్త్యపూజా జాతా కథం కమలజా సదృశీసు రాజ్ఞీ || 11

భార్యా మయాల్పతపసా పరితోషితేన దత్తం మమాంబుజగృహం చ మునీంధ్రదత్తమ్‌ |

యస్మిన్‌ ప్రవిష్టమపి కోటిశతం నృపాణాం సామాత్యకుంజరరథౌఘజనావృతానామ్‌ || 12

నాలక్ష్యతే క్వగతమంబరగామిభిశ్చ తారాగణందుర విరశ్మిభిరప్యగమ్యమ్‌ |

తస్మాత్‌ కిమన్యజననీజఠరోద్బవేన ధర్మాధికం కృతమశేషజనాతిగం యత్‌ || 13

సర్వైర్మయాథ తనయైరథవా మయాపి సద్భార్యయా తదఖిలం కథయ ప్రచేతః |

సోప్యభ్యధాదథ భవాంతరితం నిరీక్ష్య పృథ్వీపతే శృణు తదద్భుతహేతువృత్తమ్‌ || 14

జన్మాభవత్తవ తు లుబ్ధకులేపి ఘోరం జాత స్త్వర మప్యనుదినం కిల పాపకారీ | వపురప్యభూత్తవ పునః పురుషాంగసంధిదుర్గంధిసత్వకునఖాభరణం సమంతాత్‌ || 15

న చ తే సుహృన్న సుతబంధుజనో న తాదృక్‌ నైవ స్వసా న జననీ చ తదాభిశస్తా | అతిసమ్మతా పరమభీష్టతమాభిముఖీ జాతా మహీశ తవ యోషిదియం సురూపా || 16

అభూదనావృష్టిరతీవ రౌద్రా కదాచనాహారనిమిత్తమస్యామ్‌ |

క్షుత్పీడితేన భవతా తు యదా న కించిదాసాదితం వన్యఫలాదిభక్ష్యమ్‌ || 17

అథాభిదృష్టం మహదంబుజాఢ్యం సరోవరం పంకపరీతరోధః |

పద్మాన్యథాదాయ తతో బహూని గతః పురం వైదిశనామధేయమ్‌ || 18

తన్మూల్యలాభాయ పురం సమస్తం భ్రాంతం త్వయా శేషమహస్తదాసీత్‌ |

క్రేతా న కశ్చిత్కమలేషు జాతః క్లాంతః పరం క్షుత్పరిపీడితశ్చ ||19

ఒకతఱి వ్రచేతసుడను మహర్షి యభ్యాగతుడైనంత నతనిం బూజించి యా రాజు తనకు గల్గిన యా విభూతి వైభవమనుసమానము శాశ్వతము దేవమానవుల పూజలందినది సాక్షాత్తు కమలజు (కమలమందుదయించిన మహాలక్ష్మి) నాధర్మపత్ని గృహలక్ష్మినీ నా చేసిన కొలది తపస్సునకే మెచ్చి పరమేష్టి గృహముగ బద్మము ననుగ్రహించెను. నా గృహమందు మంత్రం యేనుగులు, రథములు, భటపరివారము వందలు కోట్లుగా నా గృహమలంకరింపబడి నిత్య శోభనమైనది. తారాగ్రహ నక్షత్రాదులకు సూర్య చంద్ర కిరణములకు నాకాశ సంచారులగు దేవతలకుం గూడ చోరరానిది యెటు పోయినదో గుర్తింపరాని గగన వధమున స్వేచ్ఛా సంచారము సేయు దివ్వ విమాసము నాకిది యెట్లు లభించినది? ఇంకొక తల్లి కడుపునం బుట్టిన మఱి యే జీవి సేయని ధర్మము నేనేమి సేసితి? నా బిడ్డలు సేసినారా? నా భార్య సేసినదా? ప్రచేతమహర్షి సత్తమ! ఆనతిమ్మన నమ్ముని జన్మాంతరమున నీవు చేసిన యద్భుత చరిత్రమది దీనికి కారణ మాలింపుమని యమ్ముని యిట్లనుగ్రహించెను.

మునుపొక బోయకులమందు నీకు అతి ఘోరమైన జన్మ కలిగినది. నీ శరీరమంతటా కీళ్ళు సడలి, దుర్గంధము కలదై, గోళ్ళు కలగినదైయుండెను. నీకు మిత్రుడు, బంధువులు, పుత్రులు, సోదరి, తల్లి ఎవరూ లేకుండిరి. రాజా! అపుడు నీకు ఈ స్త్రీ ఎక్కువ ఇష్టమైనదై యుండెను. ఒకప్పుడు ఘోరమైన అనావృష్టి కలుగగా, ఆకలి బాధతో నీవు ఆహారమునకై తిరిగి ఏదీ పొందలేక ఒక పద్మములతో నిండిన సరస్సును చూచితివి. పద్మములను పెక్కు గ్రహించి అమ్ముటకై విదిశాపురానికి వెళ్ళి దాని నమ్ముటకు పురమంతా తిరిగిననూ ఎవరూ కొనరైరి - నీవు అలసి ఆకలి బాధచేత పీడింపబడితివి. 19

-: పుష్పవాహనుని పూర్వజన్మ వృత్తాంతము :-

ఉపవిష్టస్త్వమేకస్మిన్‌ సభార్యో భవనాంగణ | తతో రాత్రౌ భవాంస్తత్రాశ్రేషీన్‌ మంగళధ్వనిం || 20

సభార్యస్తత్ర గతవాన్‌ యత్రాసౌ మంగళధ్వనిః | తత్ర మండలమప్యస్య విష్ణోరర్చా విలోకితా || 21

వేశ్యానంగవతీ నామ బిభ్రతీ ద్వాదశీవ్రతం | సమాప్య మాఘమాసస్య ద్వాదశ్యాం లవణాచలమ్‌ || 22

న్యవేదయత్తు గురవే శయ్యాంచోపస్కరాన్వితాం | అలంకృత్య హృషీకేశం సౌవర్ణసమమాదరాత్‌ || 23

సా తు దృష్టా తతస్తాభ్యామిదం చ పరిచింతితం | కిమేభిః కమలైః కార్యం వరం విష్ణురలంకృతః || 24

ఇతి భక్తిస్తదా జాతా దంపత్యోస్తు నరేశ్వర | తత్ర్పసంగాత్‌ సమభ్యర్చ్య కేశవం లవణాచలం || 25

శయ్యా చ పుష్పప్రకరైః పూజితా భూశ్చ సర్వశః | అధానంగవతీ తుష్టా తయోర్ధాన్యశతత్రయమ్‌ || 26

దీయతామాదిదేశాధ కలధౌతఫలత్రయం | న గృహీతం తతస్తాభ్యాం మహాసత్వావలంబనాత్‌ || 27

అనంగావత్యా చ పునస్తయోరన్నం చతుర్విధం ప| ఆనీయ వ్యాహృతం చాన్నం భుజ్యతామివ భూపతే || 28

తాభ్యాం చ తదపి త్యక్తం భోక్ష్యావహ శ్వో వరాననే | ప్రసంగాదుపవాసోనే తవాద్యాస్తు శుభావహః || 29

జన్మప్రభృతి పాపిష్ఠావావాం దేవి ధృడవ్రతే | తత్ప్రసాదాత్‌ భవద్గేహే ధర్మ వేశోస్తు నావిహ || మ30

ఇతి జాగరణం తాభ్యాం తత్ర సంగాదనుష్టితం | ప్రభాతే చ తయా దత్తా శయ్యా సలవణాచలా || 31

గ్రామశ్చ గురవే భక్త్యా విప్రేభ్యో ద్వాదశైవ తు | వస్త్రాలంకారసంయుక్తా గావశ్చ కనకాన్వితాః || 32

భోజనం చ సుహృన్మిత్రదీనాంధకృపణౖస్సహ | తతో లుబ్ధక దాంపత్యం పూజయిత్వా విసర్జితమ్‌ || 33

న భవాన్‌ లుబ్దకో జాతః సపత్నీకో నృపేశ్వరః | పుష్కరప్రకరాత్తస్మాత్కేశవస్య తు పూజనాత్‌ || 34

వినష్టాశేషపావస్య తవ పుష్కరమందిరం | తస్యసత్యస్య మాహాత్మ్యాదలోభతపసా నృప || 35

ప్రాదాత్కామగమం యానం లోకనాథశ్చతుర్ముఖః | సంతుష్టస్తవ రాజేంద్ర పుష్కరం త్వం సమాశ్రయ || 36

కల్పం స త్వం సమాసాద్య విభూతిద్వాదశీవ్రతం | కురు రాజేంద్ర నిర్వాణమవశ్యం సమవాప్స్యసి || 37

ఏతదుక్త్వా తు సముని స్తత్రైవాంతరధీయత | రాజా యథోక్తం చ పునః ప్రకరోత్‌ పుష్పవాహనః || 38

ఆకలికి బక్కచిక్కి పెండ్లాముతో నొక్కడవు నింటి ముంగిట గూర్చున్నావు. అప్పుడు రాత్రి నీవొక మంగళ ధ్వని విన్నావు. భార్యతో నది (వేదిక) వినిపించిన చోటి కేగితివి. అచట విష్ణు పూజా మండలము అట అనంగవతి యను వేశ్య ద్వాదశీ వ్రతము చేయుచు మాఘ మాసమున ద్వాదశీ వ్రతము సేసి గురువునకు లవణ పర్వతము పరుపు తలగడలు మొదలగు సామాగ్రితో శయ్యను దానము సేసెను. బంగారు విష్ణు విగ్రహమును అలంకరించి చక్కగా పూజ సేసెను. ఆమెను జూచి యా బోయదంపతులిట్లనుకొనిరి. ఈ కమలములతో మనకేమి పని? వీనితో విష్ణువు నలకంరింతమనిభక్తి

గొని విష్ణువును బూజించి తామర పూలతో శయ్యనేర్పరచి యా ప్రదేశమునం జక్కగా బూజింతిరి. అనంగవతి (వేశ్య) యా దంపతుల భక్తి చూచి మూడువందల బస్తాల ధాన్యము, మూడు బంగారు ఫలములు (పండ్ల) నిమ్మని పరివారమున కాజ్ఞ యిచ్చెను. కాని యా దానము నా బోయలు కేవల సత్త్వగుణ సంపత్తిచే తీసికొనరైరి. పోనిమ్మని యా వేశ్య వారికి భక్ష్య భోజ్య శోష్య పేయ రూపములగు ఆహారము విందుచేసి భుజింపుడని కోరెను. అదియు నా యిద్దరు నీవేళ వద్దు రేపు తిందుమనిరి. నీ వ్రతము సందర్భములో మేము నుపవాసమున్నచో శుభమగుననిరి. పుట్టినది మొదలు మేమిద్దరము పరమ పాపిష్టులము. దేవీ మహా పుణ్యురాలవు వ్రతనిష్టురాలవు. నీ యింట నీ ప్రసాదమున మా మేను లేశమాత్రమీ ధర్మము కల్గుగాక అని యా యిద్దరు నా యింట నారాత్రి జాగరణము సేసిరి. వేకువనే యా దంతులకా వేశ్య ఉప్పు కొండతో శయ్యాదానము గూడ సేసెను. గురువునకు భక్తితో నొక గ్రామము. బ్రాహ్మణులకు వస్త్రాలంకార సహితముగా బండ్రెండు గోవులను గూడ దానము సేసెను. కుంటి గ్రుడ్డి వాండ్లతో బీదలతో ఆప్తమిత్ర బంధులతో భోజనము విందు సేసెను. అంతయునైన తరువాత నా దంపతులను బూజించి సాగనంపెను. ఆ బోయవు, ఆనీ పెండ్లామే యిప్పుడు రాజును రాణియునై పుట్టినారు. పుణ్యాత్ములు తమరు.

విష్ణువును పుష్కర ప్రకరమున (పద్మముల రాశిచే) ఇట్లు పూజించుట వలననే పాపమెల్ల మోయు నీకీ పుష్కరము మందిరమైనది. రాజా ఆ సత్యముయొక్క మహిమ ఆ అలోభము (ఆశ లేకపోవుట) అను తపస్సు వలన చతుర్ముఖుడు సంతుష్టుడై నీకీ కామగ విమానమును అనుగ్రహించెను. కావున నీవిక పుష్కర క్షేత్రమున నివసింపుము. సత్త్వకల్ప మాశ్రయించి కేవల సత్త్వగుణ సంపన్నుడవై విభూతి ద్వాదశీ వ్రతము సేయుము. అది చేసితివేని తప్పక మోక్షమందెదవు. అని సెప్పి యమ్ముని యక్కడనే అంతర్ధాన మయ్యెను. పుష్పవాహన మహారాజు ముని సెప్పినట్లు సేసెను. 38

ఇదమాచరతో రాజన్నఖండవ్రతతా భ##వేత్‌ | యధాకథంచిత్కాలేన ద్వాదశద్వాదశీః నృప || 39

కర్తవ్యా శక్తితో దేవ విప్రేభ్యోదక్షిణా నృపా | జేష్ఠే గావః ప్రదాతవ్యా మధ్యమే భూమిరుత్తమా || 40

కనిష్టే కాంచనం దేయమిత్యేషా దక్షిణా స్మృతా | ప్రధమం బ్రహ్మదైవత్యం వైష్ణవం తథా || 41

తృతీయం రుద్రదైవత్యం త్రయో దేవాస్త్రిషు స్థితాః | ఇతి కలుషవిదారణం జనానాం పఠతి చ యస్తు శృణోతి చాపి భక్త్యాః || 42

మతిమపి చ స యాతి దేవలోకే వసతి చ రోమసమాని వత్సరాణి | అధాతః సంప్రవక్ష్యామి వ్రతానాముత్తమం వ్రతమ్‌ || 43

రాజా! ఇది సేసినచో నిక నెన్నడు వ్రతభంగము కలుగనే కలుగదు. సమయము దప్పక పండెండ్రు ద్వాదశీ వ్రతములు యధాశక్తినెట్లయిన యీ వ్రతము నిర్వర్తించ వలసినదే.

ఇక విప్రులకు దక్షిణ:- జేష్ఠ పుష్కరమందు పుష్కరక్షేత్రము మొదట గోవులు మధ్యమందు భూదానము కనిష్ఠ పుష్కరమందు (చిర) బంగారమును దక్షిణగా నీయవలెనని స్మృతులున్నవి. మొదటిది బ్రహ్మదేవ తాకము ద్వితీయము వైష్ణవము తృతీయము రుద్ర దేవతాకము. ఈలా త్రిమూర్తులు సంతుష్టినందుదురు. ఇది జనముల పాపములనెడలు పుణ్యకధ భక్తితో చదివిన విన్నను జ్ఞానమును బొందును. దానము చేసిన యాగోవు రోమములెన్ని గలవన్ని యేండ్లు దేవలోకమున నివసించును.

కథితం తేన రుద్రేణ మహాపాతకనాశనం | నక్తమబ్ధం చరితా తు గవా సార్థం కుటుంబినే || 44

హైమం చక్రం త్రిశూలం చ దద్యాద్విప్రాయ వాససీ | ఏవం యః కురుతే పుణ్యం శివలోకే స మోదతే || 45

ఏతద్దేవవ్రతం నామ మహాపాతకనాశనం | యస్త్వేకభ##క్తేన క్షి పేద్దేనుం వృషనమన్వితామ్‌ || 46

ధేనుం తిలమయీం దద్యాత్‌ న పదం యాతి శాంకరం | ఏతత్‌ రుద్రవ్రతం నామ భయశోకవినాశనమ్‌ || 47

యశ్చ నీలోత్పలం హైమం ళర్క రాపాత్రసంయుతం | ఏకాంతరితనక్తాసీ సమాంతే వృషసంయుతమ్‌ || 48

వైష్ణవం స పదం యాతి నీలవ్రతమిదం స్మృతం | ఆషాఢాదిచతుర్మాసమభ్యంగం వర్జయేన్నరః || 49

భోజనోపస్కరం దద్యాత్‌ స యాతి భవనం హరేః | జనప్రీతికరం నౄణాం ప్రీతివ్రతమిహోచ్యతే || 50

వర్జయిత్వా మధౌ మస్తు దధిక్షీరఘృతైక్షవం | దద్యాత్‌ వస్త్రాణి సూక్ష్మాణి రసపాత్రేణ సంయుతమ్‌ || 51

సంపూజ్య విప్రమిథునం గౌరీ మే ప్రీయతామితి | ఏతత్‌ గౌరీవ్రతన్నామ భవానీలోకదాయకం || 52

పుష్యాదౌ యస్త్రయోదశ్యాం కృత్వా నక్తమథోపునః | అశోకం కాంచనం దద్యాదిక్షుయుక్తం దశాంగులమ్‌ 53

విప్రాయ వస్త్రసంయుక్తం ప్రద్యుమ్నః ప్రీయతామితి | కల్పం విష్ణుపురే స్థిత్వా విశోకస్యాత్పునర్‌ నృప 54

ఏతత్‌ కామవ్రతం నామ సదా శోకవినాశనం | ఆషాఢాదివ్రతే యస్తు వర్జ్యయేద్యః ఫలాశనం || 55

చాతుర్మాస్యే నివృత్తే తు ఘటం సర్పిర్గుడాన్వితం | కార్తిక్యాం తత్పునర్‌హైమం బ్రాహ్మణాయ నివేదయేత్‌ || 56

స రుద్రలోకమాప్నోతి శివవ్రతమిదం స్మృతమ్‌ | వర్జయేద్యస్తు పుష్పాణి హేమంతే శిశిరావృతే || 57

పుష్పత్రయం చ ఫాల్గున్యాం కృత్వా శక్త్యా చ కాంచనమ్‌ | దద్యాద్ధ్వికాలవేళాయాం ప్రీయేతాం శివకేశవౌ || 58

దత్త్వా పరం పదం యాతి సౌమ్యవ్రతమిదం స్మృతమ్‌ | ఫాల్గుణాదితృతీయాయాం లవణం వస్తు వర్జయేత్‌ || 59

సమాంతే శయనం దద్యాత్‌ గృహం చోపస్కరాన్వితం | సంపూజ్య విప్రమిథునం భవానీ ప్రీయతామితి || 60

గౌరీలోకే వసేత్‌ కల్పం సౌభాగ్యవ్రతముచ్యతే | సంధ్యామౌనం నరః కృత్వా సమాంతే ఘృతకుంభకం || 61

వస్త్రయుగ్మం తిలాన్‌ ఘంటాం బ్రహ్మణాయ నివేదయేత్‌ | లోకం సారస్వతం యాతి పునరావృత్తిదుర్లభం || 62

ఈపై నిక వ్రతములకెల్ల నుత్తమమగు నింకొక వ్రతమానతిత్తును. ఇది మహా పాతక నాశనము రుద్రుడానతిచ్చినదిది. ఒక యేడాది నక్తవ్రతమాచరించి (రాత్రి మాత్రమే భోజనముసేసి) ఒక కుటుంబికి బ్రహ్మణునికి గోవుతో బంగారు చక్రము త్రిశూలము దానమీవలెను. ఇట్లు సేసినతడు శివలోకమందును దేవత్రతమును పేరు నిది పరమపుణ్యము. ఒంటిపూజ భోజనము సేసి ఎద్దుతో ఆవునువును వదలవలెను. తిలధేను దానము కూడా చేయవలెను. పుణ్యవ్రతమిది సేసి నతడు శివలోకమందానందించును. ఇది భద్రవ్రతము భయశోకములను హరించును. బంగారు నీలోత్పలము (నల్ల కల్వపూవు) చేయించి పంచదార నింపిన పాత్రతో దానమీయవలెను. ఏడాది రోజు విడిచి రోజు నక్త భోజనము (రాత్రి మాత్రమే భోజనము) సేసి వృషభముగూడ దానమిచ్చి నతడు విష్ణులోకమందును. ఆషాఢ పూర్ణిమ మొదలు నాల్గు మాసములు చాతుర్మాస్యము తలంటు మానివేసి భోజన పాత్రము దానము సేసిన విష్ణు భవనమందును, వసంత ఋతువులో పెరుగు పాలు నేయి వదలి (తాను భుజింపక) రసపాత్రముతో గూడ సన్నని వస్త్రములు దానము సేసినచో గౌరీవ్రతమనబడును. ఇవి యిచ్చునపుడు ''గౌరీమే ప్రీయతామ్‌'' నాయెడల గౌరీదేవి ప్రసన్నురాలగును గావుత అని పలికి యీయవలెను. ఇది సేసిన భవానీ లోకమునందును పుష్యశుద్ద త్రయోదశినాడు నక్తముసేసి బంగారపు అశోకపుష్పమును పది యంగుళముల పొడవైన చెఱకు గడతో విప్రునికి వస్త్రముతోగూడ ''ప్రద్యుమ్నః ప్రీయతామతి'' ప్రద్యుమ్నుడు ప్రసన్నుడుగాగావుతమని యీయవలెను. ఇది సేసి నతడు విష్ణులోకమందు ఒక కల్పము నివసించి యే శోకములేనివాడై జన్మించును. ఇది కామవ్రతము అను పేరిది. శోక నాశనము - ఆషాఢాది వ్రతమందు చాతుర్మాస్యమందు (నాల్గు నెలలు) ఏ పండుగాని తినక చివర బ్రాహ్మణునికి బెల్లముతోగూడ నేతితోడి బంగారు పాత్రము దానమిచ్చిన ఫాల్గున శుక్ల తృతీయ నుంచి యొక్క సంవత్సరము ఉప్పును తినగూడదు. సంవత్సరము చివర శయ్యాదానము సర్వసామాగ్రితో గృహమును విప్ర దంపతులను బూజించి ''భవానీ ప్రీయతామ్‌'' భవాని (గౌరి) ప్రీతిసెందుగావుతమని యీయవలెను. సౌభాగ్యమను పేరి యీ వ్రతము సేసిన పుణ్యుడు గౌరీలోకనుందొక కల్పముండును. మానవుడు సంధ్యవేళల మౌనవ్రతమూని యేడాది చివర నేతి కడవను బట్టలచాపు (రెండు వస్త్రములను) తక్కెడ ఘంటను బ్రాహ్మణునకీయవలె. పునరావృత్తిలేని (తిఱిగిరాని) సారస్వతలోకమును (సరస్వతీలోకమును) బొందును. సారస్వత వ్రతమను పేర నిది రూపమును (అందమును) విద్యను యొసంగును. 62

ఏతత్సారస్వతం నామ రూపవిద్యాప్రదాయకమ్‌ | లక్ష్మీమభ్యర్చ్య పంచమ్యాముపవాసీ భ##వేన్నరః || 63

సమాంతే హేమకమలం దద్యాద్ధేనుసమన్వితం | స వై విష్ణుపదం యాతి లక్ష్మీఃస్యాత్‌ జన్మజన్మని || 64

ఏతత్‌ లక్ష్మీ వ్రతన్నామ దుఃఖశోకవినాశనం | కృత్వోపలేపనం శంభోరగ్రతః కేశవస్య చ|| 65

పంచమి తిథియందు లక్ష్మీ దేవినర్చించి యుపవాసముండి యేడాది చివర బంగారము దక్షిణగా బంగారు కమలమీయవలెను. అటుసేసిన యతడు విష్ణులోకమందును, జన్మజన్మలకును లక్ష్మి గల్గును. లక్ష్మివ్రతమనునది దుఃఖశోకవినాశకము. 65

యావదబ్ధం పునర్ధేయా ధేనుర్జలఘట స్తదా | జన్మాయుతం స రాజా స్యాత్తతః శివపురం వ్రజేత్‌ || 66

ఏతదాయుర్ర్వతన్నామ సర్వకామప్రదాయకం | అశ్వత్థం భాస్కరం గంగాం ప్రణమ్యైకాగ్రమానసః || 67

శివునిముందు విష్ణువుముందు (దేవాలయములో) అలికి మ్రుగ్గులువెట్టి యారు మాసాలు పూజించి చివర గోవును జలకుంభమును దానమిచ్చినచో నతడు పదివేలేండ్రు ప్రభువై పైని శివపురమునందును, ఇది ఆయుర్ర్వతము సర్వకామప్రదము. 67

ఏకభక్తం నరః కుర్యాదబ్దమేకం విమత్సరః | వ్రతాంతే విప్రమిథునం పూజ్యం ధేనుత్రయాన్వితం || 68

వృక్షం హిరణ్మయం దద్యాద్‌ సోశ్వమేధఫలం లభేత్‌ | ఏతత్కీర్తివ్రతన్నామ భూతికీర్తిఫలప్రదమ్‌ || 69

రావిచెట్టును భాస్కరుని గంగను ఏకాగ్ర మనస్కుడై మ్రొక్కి యొక్క యేడు ఏకభక్తముసేసి మాత్సర్యము విడిచి సమాప్తియందు బ్రాహ్మణ దంపతులను బూజించి మూడావులతో బంగారు వృక్షమును దానమిచ్చిన యతడు అశ్వమేధముసేసిన ఫలమందును. కీర్తివ్రతమను పేరనిది యైశ్వర్యమును కీర్తిని యిచ్చును.

ఘృతేన స్నపనం కృత్వా శంభోర్వా కేశవస్య వా | అక్షతాభిః సుపుప్పాభిః కృత్వా గోమయమణ్ణలమ్‌ || 70

సమాంతే హేమకమలం తిలధేనుసమన్వితం | శూలమష్టాంగులం దద్యాత్‌ శివలోకే మహీయతే || 71

సామగాయనకం చైవ సామవ్రతమిహోచ్యతే | నవమ్యాం ఏకభక్తం తు కృత్వా కన్యాశ్చ శక్తితః || 72

భోజయిత్వా సమం దద్యాత్‌ హేమకంచుకవాససీ | హైమం సింహం చ విప్రాయ దద్యాచ్ఛివపదం వ్రజేత్‌ || 73

జన్మార్బుదం సురూపః స్యాచ్ఛతృభిశ్చాపరాజితః | ఏతద్వీరవ్రతం నామ నరాణాం చ సుఖప్రదం || 74

హరినిగాని హరునిగాని నేతితో నభిషేకముసేసి పూలతో అక్షతలతో నర్చించి గోమయముతో మండలమొనరించి యర్చించి యేడాది చివర బంగారు కమలమును తిలధేనువుతో కలిపి యెనిమిదంగుళాల శూలముతో దానమీయవలెను. ఇది సేసిన శివలోక మందును ఈ దానము సామవేదియగు విప్రునికీయవలెను. సామవ్రతమని ప్రసిద్దము.

నవమినాడు ఏకభక్తముసేసి బంగరు జరీ రవికెలు వస్త్రములు బంగారు సింహముద్ర విప్రునికీయవలెను. ఇది శివవ్రతము. ఇది సేసిన ధన్యుడు.

అర్బుదము: జన్మలు అందగాడై శత్రువులకు జయింప వశముగాక ప్రభువై శోభించును. ఇది వీర వ్రతమను పేర మానవులకు సుఖప్రదము.

చైత్రాదిచతురో మాసాన్‌ జలం దద్యాద్దయాన్వితః | వ్రతాంతే మణికం దద్యాదన్నం వస్త్రసమన్వితం || 75

తిలపాత్రం హిరణ్యం చ బ్రహ్మలోకే మహీయతే | కల్పాంతే భూతజననమానందవ్రతముచ్యతే ||76

చైత్రాదిగ నాలుగు మాసములు దయగొని జలదానము సేయవలెను. వ్రతము చివర అన్నము వస్త్రములతో మణికము (రత్నము) తిలపాత్రను బంగారమును నొసంగవలెను. దీనిచే బ్రహ్మలోకమందును కల్పాంతము దనుక ఐశ్వర్యమిచ్చును. ఇది ఆనందవ్రతమనబడును.

పంచామృతేన స్నపనం కృత్వా సంవత్సరం విభోః | వత్సరాంతే పునర్దద్యాద్ధేనుం పంచామృతాన్వితాం || 77

విప్రాయ దద్యాచ్ఛంచ స పదం యాతి శాంకరం | రాజా భవతి కల్పాంతే ధృతివ్రతమిదం శ్రుతం || 78

వర్జయిత్వా పుమానహింసాం వ్రతాంతే గోప్రదో భ##వేత్‌ | తద్వద్ధేమమృగం దద్యాత్‌ సోశ్వమేఫలం లభేత్‌ || 79

అహింసావ్రతమిత్యుక్తం కల్పాంతే భూపతిర్భవేత్‌ |

శంకరునికి ఒక్క సంవత్సరము పంచామృత స్నానము గావించి చివర మరల పంచామృతములతో గూడ గోవును విప్రునికి శంఖముతోనీయవలెను. ఆ పుణ్యుడు శాంకర స్థానమందును ఒక్క కల్పమునుండి యాపై భూమిపై ప్రభువౌను. ఇది ధృతివ్రతమను పేర విననైనది. మానవుడు హింస వదలి యేడాది చివర గోదానము సేసినచో నిది అహింసా వ్రతము 79 1/2

కల్యముత్థాయ వై స్నానం కృత్వా దాంపత్యమర్చయేత్‌ || 80

భోజయిత్వా యథాశక్తి మాల్యవస్త్రవిభూషణౖః | సూర్యలోకే వసేత్కల్పం సూర్యవ్రతమిదం శ్రుతం || 81

వ్రతము చివర బంగారు వెండిని గోవును దానముసేసిన నతడు అశ్వమేధ ఫలమందును అహింసా వ్రతమను పేర నిది సేసి నతడు కల్పాంతమునందు ప్రభువగును. వేకువన లేచి స్నానముసేసి దంపతి పూజ సేసి భోజనము వెట్టి యథాశక్తి పూల మాలల వస్త్రములచే భూషణములచే బూజించిన పుణ్యశీలియొక్క కల్పము సూర్యలోకమందుండును. సూర్య వ్రతమను పేరనిది వినబడినది.

ఆషాఢాదిచతుర్మాసం ప్రాతఃస్నాయీ భ##వేన్నరః | విప్రాయ భోజనం దత్వా కార్తిక్యాం గోప్రదో భ##వేత్‌ || 82

ఆషాఢము మొదలు నాల్గు మాసములు ప్రాతఃస్నానము సేసి దంపతులకు భోజనము వెట్టి కార్తీకమాసమందు గోవునిచ్చిన నతడు విష్ణులోకమందును ఇది వైష్ణవ వ్రతము.

స వైష్ణవపదం యాతి విష్ణువ్రతమిదం శ్రుతం | అయనాదయనం యావద్వర్జయేత్‌ పుష్పసర్పిషీ || 83

తదంతే పుష్పమన్నాని ఘృతధేన్వా సహైవ తు దత్వా శివపదం యాతి విప్రాయ ఘృతపాయసం || 84

ఏతచ్ఛీలవ్రతం నామ శీలారోగ్యఫలప్రదం | యావత్సమం భ##వేద్యస్తు పంచదశ్యాం పయో వ్రతః || 85

సమాంతే శ్రాద్ధకృద్దద్యాద్గాశ్చ పంచ పయస్వినీః | వాసాంసి చ పిశంగాని జలకుంభయుతాని చ ||86

స యాతి వైష్టవం లోకం పితౄణాం తారయేచ్ఛతమ్‌ || 87

కల్పాంతే రాజరాజేంద్ర పితృవ్రతమిదం స్మృతమ్‌ | సంధ్యాదీపప్రదో యస్తు ఘృతైసై#్తలం వివర్జయేత్‌ ||88

ఒక అయనమునుండి యింకొక అయనముదాక ఆఱు మాసాలు పువ్వు తాకరాదు. నేయి వాడరాదు. ఆమీద గోవుతో పూవులు అన్నము ఘృత ధేనువుతో గలిపి బ్రాహ్మణునికొసగి నతడు శివలోకమేగును. ఇది శీలవ్రతమనబడును. ఇది ఉత్తమ శీలమును ఆరోగ్యముచ్చును.

ఒక సంవత్సరము త్రయోదశి తిథియందు పాలు మాత్రము త్రాగి సంవత్సరము చివర పితృ దేవతలకు శ్రాద్ధమువెట్టి యైదు పాలిచ్చు గోవులను ఎఱ్ఱరంగు వస్త్రములను జలకుంభములను దానమిచ్చినతడు విష్ణులోకమేగును. పితరుల నూరు తరాల వారినుద్ధరించును. కల్పాంతమందు సార్వభౌముడగును. పితృవ్రతమును పేర నిది స్మృతిసిద్ధము. 88

సమాంతే దీపకం దద్యాచ్ఛక్రం శూలం కాంచనమ్‌ | వస్త్రయుగ్మం చ విప్రాయ స తేజస్వి భ##వేన్నరః || 89

వత్సరాంతమును దీపమును, చక్రమును, శూలమును, బంగారమును దానమివ్వవలెను విప్రునకు వస్త్రయుగ్మము కూడా ఇచ్చు నరుడు తేజస్వి యగును.

రుద్రలోకమవాప్నోతి దీప్తివ్రతమిదం స్మృతమ్‌| కార్తికాదితృతీయాయాం ప్రాశ్య గోమూత్రయావకమ్‌ || 90

రుద్రలోకమునూ పొందును. ఇది దీప్తివ్రతమని పేరొందినది. కార్తీకము మొదులు మూడవ నెలయందు గోమూత్రమును, యవలద్రవమును త్రావి.

నక్తం చరేదబ్దమేకమబ్తాన్తే గోప్రదో భ##వేత్‌ | గౌరీలోకే వసేత్కల్పం తతో రాజా భ##వేదిహ || 91

ఒక సంవత్సరము వరకు రాత్రి గడిపి, సంవత్సరము చివర గోవును దానమివ్వవలెను. అట్లైన కల్పమువరకు గౌరీలోకమున నుండి, తరువాత రాజగును. 91

ఏతద్రుద్రవ్రతం నామా సదా కల్యాణకారకమ్‌ | వర్జయేచ్చతురో మాసాన్‌ యస్తు గంధానులేపనమ్‌ || 92

శుక్తిగంధాక్షతాన్‌ దద్యాద్విప్రాయ సితవాససీ | వారుణం పదమాప్నోతి దృఢవ్రతమిదం స్మృతమ్‌ || 93

ఇది ఎల్లప్పడూ కల్యాణము కలిగించు రుద్రవ్రతమనునది - గంధానులేపనాన్ని నాలుగు నెలలు వదిలి విప్రునకు ముత్యపు గంధాక్షతలను, శుభ్రవస్త్రములను దానమివ్వవలెను. వరుణ పదమున ప్రాప్తింపజేయు దృఢవ్రతమిది. 93

వైశాఖే పుష్పలవణం వర్జయేదథ గోప్రదః | భూత్వా విష్ణుపదే కల్పం స్థిత్వా రాజా భ##వేదిహ || 94

ఏతచ్ఛాన్తివ్రతం నామ కీర్తికామఫలప్రదమ్‌ | బ్రహ్మాండం కాంచనం కృత్వా తిలరాశి సమన్వితమ్‌ || 95

ఘృతేనాన్యప్రదోభూత్వావహ్నిం సంతర్ప్యసద్ద్విజమ్‌ | సంపూజ్య విప్రదాంపత్యం మాల్యవస్త్ర విభూషణౖః || 96

శక్తితస్త్రిపలాదూర్ధ్వం విశ్వాత్మా ప్రీయతామితి | పుణ్యహ్ని దద్యాదపరేబ్రహ్మ యాత్యపునర్భవమ్‌ || 97

వైశాఖమున పూలు, ఉప్పు వదలి గోదానము చేసిన విష్ణుపదమున కల్పము వరకు వుండి రాజగును. కీర్తికామఫలములనొసగు ఇది శాంతివ్రతమనబడును - బంగారముతో, తిలరాశిలోనుంచిన బ్రహ్మాండమును చేసి బ్రాహ్మణుని, వహ్నిని సంతర్పించి వివ్రదంపతులను మాల్యవస్త్ర విభూషణాలతో పూజించి యథాశక్తి మూడు పలములకు పైన ఉండునట్లు చేసి మంచి రోజున 'విశ్వాత్మ ప్రీతి చెందుగాత'యని దానమిచ్చిన మోక్షమునందును.

ఏతద్‌ బ్రహ్మవ్రతం నామ నిర్వాణఫలదం నృణామ్‌ | యశ్చోభయముఖీం దద్యాత్‌ ప్రభూతసకలాన్వితమ్‌ || 98

దినం పయోవ్రతం తిష్ఠేత్‌ స యాతి పరమం పదమ్‌| ఏతద్వై సువ్రతం నామ పునరావృత్తిదుర్లభమ్‌ || 99

మోక్షమునిచ్చు ఇది బ్రహ్మవ్రతము - పగలంతా పాలను మాత్రమే స్వీకరించి గోదానమును చేయువాడు పరమపదమును పొందును. ఇది సువ్రతమనునది.

త్ర్యహం పయోవ్రతః స్థిత్వా కాంచనం కల్పపాదపమ్‌ | పలాదూర్థ్వం యథాశక్తి తండులప్రస్థసంయుతమ్‌ || 100

దత్త్వా బ్రహ్మపదం యాతి భీమవ్రతమిదం స్మృతమ్‌ | మాసోపవాసీ యో దద్యాద్ధేనుం విప్రాయ శోభనామ్‌ || 101

న వైష్ణవపదం యాతి భీమవ్రతమిదం స్మృతమ్‌ | దద్వాద్వింశత్పలాదూర్ధ్వం మహీం కృత్వా తు కాంచనీమ్‌ ||102

దినం పయోవ్రతస్తిష్ఠేద్రుద్రలోకే మహీయతే | ధనప్రదమిదం ప్రోక్తం సప్తకల్పశతానుగమ్‌ || 103

మూడురోజులు క్షీరమునే గ్రహించి పలముకంటే ఎక్కువ వుండునట్లు బంగారు కల్పవృక్షమును బియ్యంలో వుంచి దానమిచ్చిన బ్రహ్మపదమునొందును. ఇది బ్రహ్మవ్రతము. ఒకనెల ఉపవసించి బ్రాహ్మణునికి అందమైన గోవును దానమిచ్చువాడు విష్ణులోకమునొందును - ఇది భీమవ్రతము. రోజంతా పాలనే స్వీకరించి ఇరువది పలములకంటె పైన వుండునట్లు బంగారుభూమి నిచ్చువాడు రుద్రలోకమునొందును. ధనమునొసగు ఏడువందల కల్పములు వెంటనుండును. 103

మాఘేమాస్యథ చైత్రే వా గుడధేనుప్రదో భ##వేత్‌ | గుడవ్రతం తృతీయాయాం గౌరీలోకే మహీయతే || 104

మాఘమాసములో లేదా చైత్రామాసములో గుడదేనువును దానమిచ్చిన గుడవత్ర మనబడును దీనినే గౌరిలోకమును పొందును. 104

మహావత్రమిదం నామ పరమానంద కారకమ్‌ | పక్షోపవాసీ యో దద్యాద్విప్రాయ కపిలాద్వయమ్‌ || 105

స బ్రహ్మలోకమాప్నోతి దేవాసురనుపూజితః | కల్పాన్తే సర్వరాజా స్యాత్‌ ప్రభావ్రతమిదం స్మృతమ్‌ || 106

పరమానందమునిచ్చు ఇది మహావ్రతము. పక్షమురోజులు ఉపవసించి విప్రుడికి తెల్లని గోవుల రెంటిని దాన మిచ్చిన బ్రహ్మలోకమున దేవాసురులచే పూజనొందును. కల్పాంతమున రాజగును. ఇది ప్రభావ్రతము 106

వత్సరం త్వేకభక్తాశీ సభక్ష్యజలకుంభదః | శివలోకే వసేత్కల్పం ప్రాప్తి వ్రతమిదం స్మృతమ్‌ || 107

ఒక వత్సరము ఒకపూట భోజనమే చేయుచూ భక్ష్యములు, జలముగల కుంభమును దానమిచ్చిన శివలోకమున కల్చమువరకు వుండును. ఇది ప్రాప్తివ్రతము 107

నక్తాశీ త్వష్టమీషు స్యాద్వత్సరాంతే తు ధేనుదః | పౌరందరం పురం యాతి సుగతివ్రతముచ్యతే || 108

ఇంధనం యో దదేద్విప్రే వర్షాదీంశ్చతురస్త్యృతూన్‌ | ఘృతధేనుప్రదోంతే చ స పరం బ్రహ్మ గచ్ఛతి || 109

వైశ్యానరవ్రతం నామ సర్వపాపప్రణాశనమ్‌ | ఏకాదశ్యాం తు నక్తాశీ యశ్చక్రం వినివేదయేత్‌ || 110

కృత్వా సమాంతే సౌవర్ణం విష్ణోః పదవాప్నుయాత్‌ | ఏతత్‌ కృష్ణవ్రతం నామ కల్పాంతే రాజ్యలాభకృత్‌ || 111

అష్టమిలయందు రాత్రి మాత్రమే భుజించి సంవత్సరం చివర్లో ధేనువును దానమిచ్చువాడు స్వర్గమును చేరును ఇది సుగతివ్రత మనబడును. సంవత్సరాది మొదలుగ నాలుగు ఋతువుల యందు విప్రుడికి ఇంధనమును దానమిచ్చువాడు, చివరఘృతధేనువును దానమిచ్చిన పరబ్రహ్మను పొందును ఇది అన్ని పాపముల నశింపచేయు వైశ్వానరవ్రతము - ఏకాదశిన రాత్రి మాత్రమే భుజించి సంవత్సరాంతమున సువర్ణ చక్రమును దానమిచ్చుట కృష్ణవ్రతము. దీనిచే విష్ణుపదము లభించును. కల్పాంతమున రాజ్యలాభమును కలిగించును. 111

పాయసాశీ సమాంతే తు దద్యాద్విప్రాయం గోయుగమ్‌ | లక్ష్మీలోకేవసేత్కల్పమేతద్దేవీవ్రతం స్మృతమ్‌ || 112

సప్తమ్యాం నక్తభుగ్ధద్యాతమాప్తే గాం పయస్వినీమ్‌ | సూర్యలోకమవాప్నోతి భానువ్రతమిదం స్మృతమ్‌ || 113

పాయసమునే భుజించుచూ సంవత్సరాంతమున విప్రునికి రెండు గోవుల దానమిచ్చుట దేవీ వ్రతము. దీనిచే కల్పకాలము లక్ష్మీలోకమున నివసించును. సప్తమియందు రాత్రి మాత్రమే భుజించుచూ సంవత్సరము గడిపి చివర పాలిచ్చు గోవును దానమిచ్చుట భానువత్రము. దీనిచే సూర్యలోకము లభించును. 113

చతుర్థ్యాం నక్తభుగ్ధద్యాద్దేమంతే గోయుగం తథా | ఏతంద్వైనాయకం నామ శివలోకఫలప్రదమ్‌ || 114

మహాఫలాని యస్త్యక్త్వా చాతుర్మాస్యం ద్విజాతయే | హైమాని కార్తికే దద్యాద్దేమంతే గోయుగం తథా || 115

ఏతత్‌ సౌరవ్రతం నామ సూర్యలోకఫలప్రదమ్‌ | ద్వాదశ ద్వాదశీర్యస్తు సమాప్యోపోషణ నృప || 116

గోవస్త్రకాంచనైర్విప్రాన్‌ పూజయేచ్ఛక్తితో నర | పరం పదమవాప్నోతి మిష్ణువ్రతమిదం స్మృతమ్‌ || 117

చతుర్ధశ్యాం తు నక్తాశీ సమాంతే గోయుగప్రదః | శైవం పదమవాప్నోతి త్రైయంబికమిదం స్మృతమ్‌ || 118

హేమంతమున చతుర్థియందు రాత్రి మాత్రమే భుజించి, రెండు గోవుల దానమిచ్చుట వైనాయక వత్రము. దీనిచే శివలోకము లభించును. చాతుర్మాస్యమున మహాఫలముల వదలి హేమంతమున రెండు గోవులను, కార్తికమున బంగారుపళ్ళనుదానమిచ్చుట సౌరవ్రతము. దీనిచే సూర్యలోకము ప్రాప్తించును. ద్వాదశ ద్వాదశిలు ఉపవాసము చేసి యథాశక్తి బ్రాహ్మణుని గోవు, వస్త్రములు, కాంచనములచేత పూజించుట విష్ణువ్రతము. దీనిచే పరమపదము నొందును. చతుర్ధశినాడు రాత్రి మాత్రమే భుజించి సంవత్సరం చివరలో గోవుల రెంటిని దానమిచ్చుట త్రైయంబిక వ్రతము. దీనిచే శివపదము ప్రాప్తించును. 118

సప్తరాత్రోషితో దద్యాద్‌ ఘృతకుంభం ద్విజాతయే | వరవ్రతమిదం ప్రాహుర్బ్రహ్మలోక ఫలప్రదమ్‌ || 119

అసౌ కాశీం సమాసాద్య ధేనుం దత్తే వయస్వనీమ్‌ | శక్రలోకే వసేత్కల్పమిదం మంత్రవ్రతం స్మృతమ్‌ || 120

ముఖవాసం పరిత్యజ్య సమాంతే గోప్రదో భ##వేత్‌ | వారుణం లోకమాప్నోతి వారుణవ్రత ముచ్యతే || 121

చాంద్రాయణం చ యః కుర్యాద్దేమం చంద్రం నివేదయేత్‌ | చంద్రవ్రతమిదం ప్రోక్తం చంద్రలోకఫలప్రదమ్‌ || 122

ఏడురాత్రు లుపవసించి విప్రునికి ఘృత కుంభమును దానమిచ్చుట వరవత్రము. దీనిచే బ్రహ్మలోకము లభించును. కాశీలో గోవును దానమిచ్చుట మంత్రవ్రతము. దీనిచే

ఇంద్రలోకము లభించును. ముఖవాసమును విడిచి సంవత్సరాంతమున గోదానమిచ్చుట వారుణవ్రతము. దీనిచే వరుణ లోకము లభించును- చాంద్రాయణమాచరించి బంగారు చంద్రుని దానమిచ్చుట చంద్రవ్రతము. దీనిచే చంద్రలోకము లభించును.

జ్యేష్ఠే పంచతపా యో ంతే హేమధేనుప్రదో దివమ్‌ | యాత్యష్టమీ చతుర్ధశ్యో రుద్రవ్రతమిదం స్మృతమ్‌ || 123

సకృద్విధానకం కుర్యాత్తృతీయాయాం శివాలయే | సమాప్తే ధేనుదో యాతి భవానీవ్రతముచ్యతే || 124

మాఘే నిశ్యార్ద్రవాసాః స్యాత్సప్తమ్యాం గోప్రదో భ##వేత్‌ | దివి కల్పం వసీత్వేహ

రాజా స్యాత్పవనవత్రమ్‌|| 125

జ్యేష్టమాసమున అయిదగ్నులమధ్య నిలచి సంవత్సరం చివరలో బంగారు గోవును దానమిచ్చుట రుద్రవ్రతము. దీనిచే స్వర్గము నొందును. తృతీయనాడు శివాలయమున ఒక్కమారైన విధిపూర్వకముగా పూజించి సమాప్తినాడు ధేనువును దానమిచ్చుట భవానీవ్రత మనబడును. మాఘమున రాత్రి తడిబట్టలు ధరిస్తూ సప్తమిన గోవును దానమిచ్చుట పవనవ్రతము. దీనిచే కల్పము స్వర్గమున ఉండి చివర రాజగును.

త్రిరాత్రోపోషితో దద్యాత్‌ పాల్గుణ్యాం భవనం శుభమ్‌ | ఆదిత్యలోక మాప్నోతి ధామవ్రతమిదం స్మృతమ్‌|| 126

త్రిసంధ్యం పూజ్య దాంపత్యముపవాసీ విభూషణౖః | దదన్మోక్షమ వాప్నోతి మోక్షవ్రతమిదం స్మృతమ్‌ || 127

దత్త్వా సితద్వితీయాయామిందౌ లవణభాజనమ్‌ | సమాప్తే గోప్రదో యాతి విప్రాయ శివమందిరమ్‌ || 128

మూడురాత్రు లుపవసించి ఫాల్గునమున శుభమగు భవనమును దానమిచ్చుట ధామవ్రతము. దీనిచే ఆదిత్యలోకము నొందును- ఉపవసిస్తూ మూడు సంధ్యలు విప్రదంపతులను విభూషణములతో పూజించి దానమిచ్చుట మోక్షవ్రతము. దీనిచే మోక్షము లభించును. శుక్ల విదియనాడు ఉప్పు పాత్రను, గోవును విప్రుడికి దానమిచ్చువాడు శివమందిరము నొందును. 128

కాంస్యం సవస్త్రం రాజేంద్ర దక్షిణాసహితం తథా| సమాప్తే గాం చ యో దద్యాత్స యాతి శివమందిరమ్‌|| 129

కల్పాంతే రాజరాజస్సాత్‌ సోమవ్రతమిదం స్మృతమ్‌ |ప్రతిపత్స్వేకభక్తాశీ సమాప్తే చ ఫలప్రదః || 130

వైశ్వానరపదం యాతి శిఖివ్రతమిదం స్మృతమ్‌ | హైమం పలద్వయాదూర్ధ్వం రథమశ్వయుగాన్వితమ్‌ || 131

దద్యాత్కృతోపవాసః స దివి కల్సశతం వసేత్‌ | తదంతే రాజరాజస్స్యాదశ్వవ్రతమిదం స్మృతమ్‌|| 132

తద్వద్దేమరథం దద్యాత్కరిభ్యాం సంయుతం పునః | సర్వలోకే వసేత్కల్పం సహస్రమపి భూమిపః || 133

భ##వేదిహాగతో భూమ్యాం కరివ్రతమిదం స్మృతమ్‌ | దశమ్యామేకభక్తాశీ సమాప్తే దశ##ధేనుదః || 134

దీపం చ కాంచనం దద్యాద్బ్రహ్మాండాధిపతిర్భవేత్‌ | ఏతద్విశ్వవ్రతం నామ మహాపాతకనాశనమ్‌ || 135

కన్యాదానం తు కార్తిక్యాం పుష్కరే యః కరిష్యతి | ఏకవింశద్గుణోపేతో బ్రహ్మలోకం గమిష్యతి || 136

వస్త్రము, దక్షిణ వుండునట్లు కంచు పాత్రను దానమిచ్చుటచే, చివర గోదానముచే శివమందిరము నేగును. ఇది సోమవ్రతము. దీనిచే కల్పాంతమున రాజరాజగును. పాడ్యమినాడు ఒక్కపూట భుజించి దానమిచ్చుట శిఖివ్రతము. దీనిచే వైశ్వానర పదము నొందును. రెండు గుర్రాలలోనున్న రథమును రెండు ఫలములకంటె ఎక్కువ బంగారముతో చేయించి, ఉపవసించి దానమిచ్చునవాడు నూరు కల్పములు స్వర్గమున నుండును. చివర రాజరాజగుమ. ఇది అశ్వవ్రతమనబడును. అట్లే రెండు ఏనుగులతో బంగారు రథమును చేయించి దానమిచ్చుట కరివ్రతము. దీనిచే వేయి కల్పములు సత్యలోకమున నుండి భూమికి వచ్చిననూ రాజగును. దశమినాడు ఒక్కపూట భుజించి సమాప్తికాగా పదిగోవుల దానమిచ్చుట, బంగారు దీపమును దానమిచ్చుట విశ్వవ్రతము. బ్రహ్మాండాధిపతి యగును. కార్తీక పుష్కరమున కన్యాదానము చేయువాడు ఇరువదియొక్క గుణములు కలిగి బ్రహ్మలోకమును చేరును. 136

కన్యాదానత్పరం దానం నైవ చాస్త్యధికం క్వచిత్‌ | పుష్కరేణ తు విశేషేణ కార్తిక్యాం తు విశేషతః || 137

విప్రాయ విధివద్దేయం తేషాం లోకో క్షయో భ##వేత్‌ | తిలపిష్టమయం కృత్వా గజం రత్నసమన్వితం || 138

విప్రాయ యే ప్రయచ్ఛంతి జలమధ్యే స్థితా నరాః || తేషాం చైవాక్షయో లోకో భవితా భూ తసంప్లవం || 139

కన్యాదానముకంటె గొప్పదానము మరొకటి లేదు. విశేషముగా కార్తీకమాసాన, పుష్కరమున కన్యాదానము మిక్కిలి ప్రశస్తము- విప్రులకు విధిపూర్వకముగా దానమిచ్చువారికి అక్షయలోకము కలుగును. నువ్వుల పిండితో ఏనుగును చేసి రత్నములతోసహా నీటి మధ్యలో నిలచి విప్రునికి ఇచ్చువారికి ప్రళయమువరకు అక్షయలోకము కలుగును. 139

యః పఠేచ్ఛు%ృణుయాద్వాపి వ్రతపుష్టిమనుత్తమాం | మన్వంతరశతం సోపి గంధర్వాధిపతిర్భవేత్‌ || 140

షష్టివ్రతం భారత పుణ్యమేతత్‌ తవోదితం విశ్వజనీనమద్య | శ్రోతుం యదీచ్ఛా తవ రాజరాజ శృణు ద్విజాతే కరణీయమేతత్‌ || 141

-: ద్విజులు తప్పక సేయవలసిన ధర్మములు :-

ఈ వ్రత పుష్టిని సంపదను ఎవ్వడు చదువునో, వినునో అతడు నూరు మన్వంతరములు గందర్వ లోకాధిపతియగును. విశ్వప్రసిద్దమైన ఈ పుష్టివ్రతము పరమ పుణ్యము భారతా: భీష్మాచార్యా నీకిపుడు తెల్పితిని. ఇక వినవలెననుకోరిక గలదేని ద్విజులకు అపశ్యకరణీయ ధర్మముల దెలిపెద నాలింపుము. 141

-: అవశ్యాచరణీయాః ధర్మాః :-

నైర్మల్యం భావశుద్దిశ్చ వినా స్నానం న విద్యతే | తస్మాన్మనోవిశుద్ద్యర్దం స్నానమాదౌ విధీయతే || 142

అనుద్దృతైరుద్దృతై ర్వా జలైః స్నానం సమాచరేత్‌ | తీర్థం ప్రకల్పయేత్‌ విద్వాన్‌ మూలమంత్రేణ మంత్రవిత్‌ || 143

నమో నారాయణాయేతి మూలమంత్ర ఉదాహృతః | స దర్భపాణిర్విధినా ఆచాంతప్రయతః శుచిః ||144

చతుర్హస్తసమాయుక్తం చతురశ్రం నమంతతః ప్రకల్ప్యావాహయేత్‌ గంగామేభిర్మత్రైర్విక్షణః || 145

విష్టోః పాదప్రసూతాసి వైష్ణవీ విష్ణదేవతా | త్రాహి నస్త్వేనసస్తస్మాదాజన్మ మరణాంతికాత్‌ || 146

త్రిస్రకోట్యోర్థకోటి చ తీర్ధానాం వాయురబ్రవీత్‌ | దివి భువ్యంతరిక్షే చ తాని తే సంతి జాహ్నవీ || 147

నందినీత్యేవ తే నామ దేవేషు నలిసీతి చ | దక్షా పృధ్వీ చ శుభగా విశ్వకాయా శివా సితా || 148

విద్యాధరీ సుప్రసన్నా తథా లోకప్రసాదినీ | క్షేమా చ జాహ్నవీ చైవ శాంతా శాంతిప్రదాయినీ || 149

శరీరశ్శుద్ధి మనశుద్దియు స్నానము సేయక కలుగవు. అందుచే స్నానము మొట్టమొదట విధింపబడినది, నదీప్రముఖ ప్రవాహములందు స్నానము సేయవలెను. అనుద్దృత జలము=తోడుకొనకుండ వచ్చు నీరు ప్రశస్తము. తెలిసినమంత్రవేత్త మూల మంత్రముతో తీర్థమును మొదట కల్పించుకొనవలెను. నమో నారయణాయ అనునది మూల మంత్రము, దర్భచేతధరించి శుచియై నియమ మూని యాచమనము సేయవలెను. నాల్గుమూరల మేర చతురశ్రముగ (నలు చదరముగ) యొక హద్దు నేర్పరచి ఈ క్రింది మంత్రములతో గంగను ఆవాహనము సేయవలెను. ఆ మంత్రములు - మూలములో 146-149

ఏతాని పుణ్యనామాని స్నానకార్యే ప్రకీర్తయేత్‌ | భ##వేత్సన్నిహితా తత్ర గంగా త్రిపథగామినీ || 150

సప్తవారాభిజప్తేన కరసంపుటయోజితం | మూర్ధ్ని కుర్యాజ్జలం భూయస్త్రిచతుః పంచ సప్తధా || 151

స్నానం కుర్యాన్మృదా తద్వదామంత్ర్యతు విధానతః | అశ్వక్రాన్తే రథక్రాన్తే విష్ణుక్రాన్తే వసుంధరే || 152

విష్ణుపాదమునం బుట్టితివి వైష్ణవివి. విష్ణవు నీ దేవత. కావున పుట్టినదాది చివరదాక మమ్ము పాపముల నుండి రక్షింపుమమ్మ : ముప్పదిన్నరకోట్లు తీర్థములు భూమిపై నాకసమందంతరిక్షమున గలవని వాయుదేవుడు సెప్పెను. జాహ్నవి నందిని నలిని యనునవి దేవతలందు నీ పేర్లు ప్రసిద్ధములు. దక్ష పృథ్వి శుభగ విశ్వకాయ శివసిత విద్యాధరి సుప్రసన్న లోక ప్రసాదిని యను నీ పుణ్య నామములు స్నానమందు కీర్తింపవలెను. అప్పుడు త్రిపథగామిని ( భూమి ఆకాశము పాతాళము లందు ప్రవహించునది) యేడుసార్లు కరసంపుట మొనరించి చూపించినంత సన్నిధి దయసేయును. ఆ మీద మూడు నాల్గు ఐదు ఏడు మారులు ఆయా మంత్రముల లెక్క ననుసరించి జలమును నడి నెత్తిన జల్లుకొనవలెను. ఆ పైని మృత్తిక (మన్ను) చేకొని 152

మృత్తి కే హర మే పాపం యన్మయా దుష్కృతం కృతం | ఉద్దృతాసి వరాహేణ విష్ణునా శతబాహునా || 153

సమస్తే సర్వలోకానాం ప్రభవారణి సువ్రతే | ఏవం స్నాత్వా తతః పశ్చాదాచమ్య తు విధానతః || 154

ఉత్ధాయ వాససీ శుభ్రే శుద్దౌ తు పరిధాయ వై | తతస్తు తర్పణం కుర్యాత్రైలోక్యప్యాయనాయ వై|| 155

బ్రహ్మాణం తర్పయేత్‌ పూర్వైర్విష్ణుం రుద్రం ప్రజాపతిం | దేవా యక్షాస్తథా నాగా గంధర్వాప్సరసాం గణాః || 156

క్రూరాస్సర్పాః సుపర్ణాశ్చ తరవో జంభకాదయః | విద్యాధరా జలధరాస్తథైవాకాశగామినః || 157

నిరాధారాశ్చ యే జీవాః పాపధర్మరతాశ్చ యే | తేషామాప్యాయనాయైతద్దీయతే సలిలం మమ || 158

అశ్వక్రాంతా: రథక్రాంతా: విష్ణుక్రాంతా: వసుంధరా: మృత్తికా: నా పాపము హరింపుము నా చేసిన చెడుపనిని హరింపుము. వరాహమూర్తి విష్ణువు నూరు బాహువులుగల వానిచే మున్ను నీ వుద్దరింపబడితివి. సర్వలోకములు పుట్టటకు అరణివి (అగ్నికి మేడియట్లు) సుప్రతవు నీవు అను నీ భావముగల యీమంత్రములచే స్నానము సేసి యా పైని యథావిధిని ఆచమనము సేసి మడిబట్టల గట్టుకొని ఆపై త్రైలోక్య మా ప్యాయనముకొరకు దేవర్షి పితృ తర్పణము సేయవలెను. ఆ వరుస యెట్లన: బ్రహ్మ విష్ణువు రుద్రుడు ప్రజాపతి దేవతలు యక్షులు నాగులు గంధర్వులు అప్సరోగణము క్రూర సర్పములు (నాగులు) సుపర్ణులు తరువులు జంభకాదులు విధ్యాధరులు జలధరులు ఆకాశగాములు (ఆకాశ సంచారులు) నిరాధారులు పాపరతులు ధర్మపరులైన జీవులు కూడ అప్యాయన మునకిదిగో నేను నీరు వదులుచున్నాను. అని మంత్రము పఠించి తర్పణము సేయ వలెను.

కృతోపవీతో దేవేభ్యో నివీతీ చ భ##వేత్తతః | మనుష్యాం స్తర్పయేద్బక్త్యా ఋషిపుత్రానృషీంస్తథా || 159

దేవతలకు ఉపవీతముగను, మనుష్యులకు (ఋషులను) నివీతిగను భక్తితో సేయవలెను. 159

సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః | కపిలశ్చాసురిశ్చైవ వోడు పంచశిరస్తధా || 160

సర్వేతే తృప్తిమాయాంతు మద్దత్తేనాంబునా సదా | మరీచి రత్ర్యంగిర పులస్త్యం పులహం క్రతుం ప్రచేతసం సకల || 161

వశిష్ఠం చ భృగుం నారదమేవ చ ! దేవబ్రహ్మఋషీన్సర్వాక తర్పయేస్సాక్షతోదకైః || 162

మనుష్యులలో చేరువారు ఋషులు ఋషిపుత్రులు సనకుడు, సనందుడు సనాతనుడు కపిలుడు అసురి, వోడ పంచశిరుడు వీరందరు నెప్పుడు నా యిచ్చిన యుదకముచే దృప్తినందుదురు గాక : మరీచి అంగిరస్సు పులస్త్యుడు పులహుడు క్రతువు ప్రచేతనుడు వశిష్టుడు భృగువు నారదుడు మొదలగు నందరిని బేర్కొని యందరు తృప్తులగుదురు. ఈలా దేవ బ్రహ్మర్షుల నందరును నక్షతలతోడి జలములచే తర్పణము సేయవలెను. 162

ఆపసవ్యం తతః కృత్వా సవ్యం జానుం చ భూతలే | అగ్నిష్పాత్తాంస్తదా సౌమ్యాం హవిష్మతస్తతోష్మపాన్‌ || 163

సుకాలినో బర్హిషదస్తదా చైవాద్యపాన్‌ పునః | సంతర్పయేత్పిత్రూన్‌ భక్త్యా సతిలోదకచందనైః || 164

ఆమీద అపసవ్యముగా (ప్రాచీనావీతిగా) మోకాలు నేలకానించి అగ్నిష్పాత్తులు సౌమ్యులు హవిష్మంతులు ఊష్మపులు సుకాలినులు బర్హిషదులు ఆద్యపులు మొదలగు పితృదేవతలను భక్తితో నువ్వులు, చందనముతోడి జలముతో తర్పణము సేయవలెను. 164

సదర్బపాణిర్విధినా పతౄన్సన్తర్పయేత్‌ త్తతః | పిత్రాదీన్‌ నామగోత్రేణ తథా మాతామహీనపి || 165

సంతర్ప్య విధిపద్ధత్యా ఇమం మంత్రముదీరయేత్‌ | యే బాంధవా యే చాన్యజన్మని బాంధవాః || 166

తే తృప్తిమఖిలా యాంతు యేప్యస్మత్తోయకాంక్షిణః | ఆచమ్య విధినా సమ్యగాలిఖేత్పద్మమగ్రతః || 167

ఆ మీద మన పితరులను ప్రాచీనావీతిగానే పితృపితామహాది వర్గమున వరుసగా నామగోత్రాదులను పేర్కొని మాతామహాపర్గమును, ఈ జన్మమున బంధువులు వాటి యితర జన్మములందు బంధువులైన వారందరు తృప్తి నందుదురుగాక. నాయిచ్చు నుదకము కాక్షించు నందరికి తృప్తిగల్గుగాక యని యక్షతలతో భూతలమునందేనిచ్చు నీ యుదకములచే దృప్తిసెందుదురు గావుత మని తర్పణము భక్తితో నొనరింపవలె. 167

సాక్షాతాభిస్సపుష్పాభిః సతిలారుణచందనైః | అర్ఘ్యం దద్యాత్ర్పయత్నేన సూర్యనామానుకీర్తనైః || 168

నమస్తే విశ్వరూపాయ నమస్తే విష్ణురూపిణ | సర్వదేవ నమస్తేస్తు ప్రసీద మమ భాస్కర || 169

దివాకర నమస్తేస్తు ప్రబాకర నమోస్తుతే | ఏవం సూర్యం నమస్కృత్య త్రిః కృత్వా తు ప్రదక్షిణం || 170

ద్విజం గాం కాంచనం చైవ దృష్ట్వా స్పృష్ట్వా గృహం వ్రజేత్‌ | స్వగేహస్థాం తతః పుణ్యాం ప్రతిమాం చాపి పూజయేత్‌ || 171

భోజనం చ తతః పశ్చాద్ద్విజపూర్వకం చ కారయేత్‌ | అనేన విధినా సర్వఋషయః సిద్ధిమాగతాః 172

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే స్నానవిధిర్నామ వింశోధ్యాయః ||

పితృతర్పణమయిన తరువాత ఆచమనము సేసి ముందు యథావిధిని పద్మమును లిఖింపవలెను. ఆ పై పూలు అక్షతలు నువ్వులు రక్తచందనముతో సూర్యనామములు సెప్పుచు సూర్యుని కర్ఘ్యమీయవలెను. అపై విశ్వరూప : అనునది మొదలు ప్రభాకర అనుదాక సూర్యనామములు పేర్కొని సూర్యభగవానునికి నమస్కరించి మూడుసార్లు ప్రదక్షిణము సేసి బ్రాహ్మణుని గోవును బంగారమును జూచి చేతదాకి యింటికి వెళ్ళవలయును. తన యింట సూర్యభగవానుని ప్రతిమనుగూడ పూజింపవలెను. అటు తరువాత బ్రాహ్మణులు భోజనము చేసిన పిమ్మట భోజనము చేయవలెను. ఈ విధిచేత ఋషులందరు సిద్దిని పొందిరి. 172

ఇది శ్రీ పద్మపురాణమున మొదటిసృష్టిఖండమందు స్నానవిధియను ఇరువదియవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters