Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకవింశో7ధ్యాయః

-: పుష్కర మాహాత్మ్యమ్‌ :-

పులస్త్య ఉవాచ :- ఆసీత్పురా బృహత్కల్పే ధర్మమూర్తిర్జనాధిపః | సుహృచ్ఛక్రస్య నిహతా యేన దైత్యాస్సహస్రశః || 1

సోమసూర్యాదయో యస్య తేజసా విగతప్రభాః | భవంతి శతశో యేన దానవాశ్చ పరాజితాః || 2

యథేచ్ఛరూపధారీ చ మానుషోప్యపరాజితః | తస్య భానుమతీ భార్యా సతీ త్రైలోక్యసుందరీ || 3

లక్ష్మీసదృశా రూపేణ నిర్జితామరసుందరీ | రాజ్ఞస్తస్యాగ్రమహిషీ ప్రాణభ్యోపి గరీయసీ || 4

దశనారీసహస్రాణాం మధ్యే శ్రీరివ రాజతే | నృపకోటిసహస్రేణ న కదాచిత్సముచ్యతే || 5

-:పుష్కర మాహాత్మ్యము :-

పులస్త్యడనియె : మున్ను బృహత్కల్పమందు ధర్మమూర్తి ధనాధిపుడు ఇంద్రుని మిత్రుడు రాక్షసుల నెందఱినో సంహరించెను. అతని తేజస్సుముందు చంద్రసూర్యాదులు వెల వెల పోయిరి. మనుజుడైన నే రూపము కావలెనన్న నదే ధరించుచుండెను. ఆతని భార్య త్రిలోకసుందరి పతివ్రత భానుమతి. అందములో లక్ష్మి వంటిది. దేవసుందరుల పైచేయి ఆ రాజున కామె పెద్దభార్య. ప్రాణప్రియ పదివేలకోట్లమంది సుందరులలో నామే లక్ష్మివలె రాజిల్లెను. 5

కదాచిదాస్థానగతః పప్రచ్ఛ స్వపురోహితం | విస్మయేనావృతో నత్వా వశిష్ఠమృషి సత్తమమ్‌ || 6

భగవన్కేన ధర్మేణ మమ లక్ష్మీరనుత్తమా | కస్మాచ్చ విపులం తేజో మచ్ఛరీరే సదోత్తమమ్‌ || 7

వశిష్ఠ ఉవాచ :- పురా లీలావతి నామ వేశ్యా శివపరాయణా | తయా దత్తశ్చతుర్దశ్యాం పుష్కరే లవణాచలః || 8

హేమవృక్షామరై ః సార్థం యథావద్విధిపూర్వకం | శూద్రః సువర్ణకారశ్చ కర్మకృత్యోభవత్త దా || 9

భృత్యో లీలావతీ గేహే తేన హైమా వినిర్మితా!| తరవో హేమపుష్పాశ్చ శ్రద్ధాయుక్తే న పార్థివ || 10

అతిరూపేణ సంపన్నా ఘటితాస్తే సుశోభనాః | ధర్మకార్యమితి జ్ఞాత్వా న గృహీతం చ వేతనమ్‌ || 11

ఉజ్జ్వలితాశ్చ తే పత్న్యా సువర్ణమయపాదపా | లీలావతీ గృహే చాపి పరిచర్యా చ పార్థవ || 12

కృతా తాభ్యామశాఠ్యేన గురుశుశ్రూణాదికా | సా చ లీలావతీ వేశ్యా కాలేన మహతానఘ || 13

సర్వపాపవినిర్ముక్తా జగామ శివమందిరం | యో 7సౌ సువర్ణకారశ్చ దరిద్రోప్యతిసత్త్వవాన్‌|| 14

న మూల్యమాదాద్ద్వేశ్యాతః యతః స భవానివ సాంప్రతం | సప్త ద్వీపపతిర్జాతః

సూర్యకోటి సమప్రభః || 15

యయా సువర్ణకారస్య తరవో హేమనిర్మితాః | సమ్యగుజ్వలితాః పత్న్యా సేయం భానుమతీ తవ || 16

తస్మాన్నృలోకేష్వపరాజితస్త్వమారోగ్య సౌభాగ్యయుతా చ లక్ష్మీః | తస్మాత్త్వమప్యత్ర విధానపూర్వం దాన్యాచలాదీన్‌ నృపతే కురుష్వ || 17

ఒక తఱి నత డాస్థానమందుండి తన పురోహితుని వశిష్ఠ ఋషి సత్తము నాశ్చర్యపడుచు ఎల్లపుడు నా శరీరమందీ తేజస్సెందువల్ల నిట్లు భాసించుచున్నదని యడిగెను. అపుడు వసిష్ఠు లనిరి. మున్న శివభక్తురాలు లీలావతి యను వేశ్య యుండెను. ఆమె పుష్కరమందు లవణాచలము ఉప్పు కొండను బంగారు చెట్లతో యథా శాస్త్రముగ దానము సేసెను. ఆమె దగ్గర నొక శూద్రుడు బంగారు పనివాడు నౌకరుండెను. అతడా బంగారు చెట్లను బంగారు పూలతో జక్కగా తయారు సేసెను. అందుచే నీవును యథావిధిగా ధాన్యాబలాది దానములను జేయుమనెను. ఇది

వాని ధర్మకార్యము గురుశుశ్రూష యని భావించి యేలాటి మూర్ఖత గొనక యామెనుండి చేతికూలి (మజూరీ) తీసికొనలేదు. అతని భార్య వానికి మెఱుగువెట్టెను. ఆ వేశ్యలీలావతి సర్వపాపముల వాసి చాలకాలము జీవించి శివమందిరమున కేగెను. ఆ బంగారు

పనివాడు దరిద్రుడయ్యు సత్య సంపన్నుడై సూర్య సమప్రభ గలవాడై సప్త ద్వీపాధిపతి యయ్యెను. స్వర్ణకాండ్రుసేసి బంగారు చెట్లకు మెఱుగులు పెట్టిన వేశ్య యామెయే భానుమతి పేర నీ పత్నియైనది. అందువలననే నీవు పరాజితుడైతివి నీ భార్య సౌభాగ్యవతి లక్ష్మి యయ్యెను. అది విని మీరన్నది యది యట్లేయని ధర్మమూర్తి వశిష్టులకు ధాన్యాబలాది దానములు సేసెను. దేవతలచే బూజింపబడు శివ లోకమున కేగెను. 17

పులస్త్య ఉవాచ:- తథేతి సంపూజ్య సుదర్మమూర్తిర్వచో వశిష్ఠస్య దదౌ చ సర్వాన్‌ | 18

ధాన్యాచలాదీన్‌ విధినా స్మరారే లోకం గతో 7సౌ సురపూజ్యమానః ||

పశ్యేద్యదీమానుపనీయమానాన్‌ స్పృశేన్మనుషై#్యరిహ దీయమానాన్‌ |

శృణోతి భక్త్యాథ మతిం దదాతి వికల్మషః సోపి దివం ప్రయాతి || 19

దుస్స్వప్నః ప్రశమముపైతి పఠ్యమానై ః శైలేంద్రైర్భవభయభేదనై ర్మనుష్యః |

యః కుర్యాత్కిము నృపపుంగవేహ సమ్యక్‌ శాంతాత్మా సకలగిరీంద్రసంప్రదానమ్‌ || 20

భీష్మ ఉవాచ :- కిమభీష్టవియోగశోకసంధానలముద్దర్తుముపోషణం వ్రతం వా | విభవధృవకారి భూతలేస్మిన్భవభీతేరపి సూదనం చ వుంసః || 21

పులస్త్యుడనియె! ధర్మమూర్తి యా రాజు వశిష్ఠని మాటను ఆలించి ధాన్యాది పర్వత దానములు యథావిధి నిచ్చి దేవతలచే పూజింపబడుచు శివలోక మేగెను. భక్తితో నిది విన్నవాడు ఇట మనసు పెట్టినవాడు కూడ పాపమెడలి స్వర్గ మేగును. ఇది చదివిన దుస్స్యప్నములు శమించును. ఇట చెప్పిన ధాన్యపర్వతాది దానములు సేసిన మానవుడే సర్వ శుభములందు సర్వ పర్వత దానములు సేసిన రాజోత్తముల పుణ్యమేమీ సెప్పవలెను. ఆ రాజు పరమశాంత మనస్కుడై తీరును. అని భీష్ముడనియె. 20

పులస్త్య ఉవాచ:- పరివృష్టమిదం జగత్ర్పియం తే విబుధానామపి మహత్వాత్‌ |

తవ భక్తిమతస్తథాపి వక్ష్యే వ్రతమింద్రాసురమానవేషు గుహ్యమ్‌ || 22

ఇష్టబంధు వియోగ దుఃఖాగ్ని నుండి మానవు నుద్దరించుటకు ఉపవాసవ్రత మవసరమా | సుస్థిరైశ్వర్యమును గూర్చుటకు సంసారభీతి నడంచుటకు సాధనమేదో యాన తిమ్మన పులస్త్యుడనియె. లోకమునకు ప్రియమైన విషయమిది నీ వడిగితివి దేవతలకే యిది దుర్లభము. అయినా భక్తిసంపన్నుడవని నీకీ వ్రతము సెప్పెద! ''నీది యింద్రాదులకు అసురులకు మానవులకేని రహస్యమిది యాలింపుము.

పుణ్యమాశ్వయుజౌ మాసి విశోకద్వాదశీవ్రతం, దశమ్యాం లఘుభుగ్విద్వా న్ర్పారభేత్‌ నియమేన తు|| 23

ఉదజ్ఞ్ముఖః ప్రాజ్హుఖో వా దంతధావన పూర్వకం | ఏకాదశ్యాం నిరాహారః సమ్యగభ్యర్చ్య కేశవమ్‌ || 24

శ్రియం చాభ్యర్చ్య విధివిద్భోక్ష్యే7హం చాపరేహని | ఏవం నియమకృత్సుప్త్వా ప్రాతరుత్థాయ మానవః || 25

స్నానం సర్వౌష ధైః కుర్యాత్పంచగవ్వజలేన తు | శుభ్రమాల్యాంబరధరః పూజయేచ్ఛ్రీశముత్పలైః || 26

ఆశ్వయుజ మాసమున చేయవలసిన పుణ్యవ్రతము విశోక ద్వాదశీవ్రతము. దీనిని తెలిసినవాడు లఘువుగా భుజించి ఆశ్వయుజశుద్ద దశమీ నాడారంభింపవలెను. ఉత్తరముగానో, తూర్పుగానో తిఱిగి దంతధావనముసేసి యేకాదశినాడు ఉపవాస ముండి విష్ణుని జక్కగ నర్చించి లక్ష్మీపూజకూడ చేసి మరునాడు నేను భోజనము చేయుదునని నియమముగొని మేల్కొని ప్రాతః స్నానము సేయవలెను. అందు సర్వౌషధులు (మూలికలు) పంచగవ్యముతోని ఆవుపాలు పెరుగు వెన్న నెయ్యి పేర జలములతో స్నానము సేయవలెను. పరిశుభ్రములైన వస్త్రములు మాల్యములు ధరించి కలువపూలతో శ్రీపతిని పూజింపవలెను. 26

విశోకాయ నమః పాదౌ జంఘే చ వరదాయ వై | శ్రీశాయ జానునీ తద్ద్వద్దూరూ చ జలశాయినౌ || 27

కందర్పాయ నమో గుహ్యం మాధవాయ నమః కటిమ్‌ | దామోదరాయేత్యుదరం పార్శ్యేచ విపులాయ వై || 28

నాభిం చ పద్మనాభాయ హృదయం మన్మథాయ వై | శ్రీధరాయ విభోర్వక్షః కరౌ మధుభిదే నమః || 29

వైకుంఠాయ నమః కంఠమాస్యం పద్మముఖాయ వై | నాసామశోకనిధయే వాసుదేవాయ చాక్షిణీ || 30

లలాటం వామనాయేతి హరయే చ పునర్భవే | అలకం మాధవాయేతి కిరీటం విశ్యరూపిణ || 31

నమః సర్వాత్మనే తద్వచ్ఛిర ఇత్యభిపూజయేత్‌ | ఏవం సంపూజ్యం గోవిందం ధపమాల్యానులేపనైః || 32

తతస్తు మండలం కృత్వా స్థండిలాం కారయేన్మృదా | చతురశ్రం సమంతాచ్చ రత్నిమాత్రముదక్ల్పవమ్‌ || 33

శ్లక్షం హృద్యం చ పరితో వప్రత్రయసమావృతం | త్రిరంగులోచ్ఛితా వప్రాస్తద్విస్తారో ద్విరంగులః || 34

స్థండిలస్యోపరిష్టాత్తు భిత్తి రష్టాంగులా భ##వేత్‌ | నదీవాలుకయా సర్యే లక్ష్మ్యాః ప్రతికృతిం న్యసేత్‌ || 35

స్థండిలే సూర్యమధ్యస్థలక్ష్మీమభ్యర్చయేద్భుదః | నమో దేవ్యై నమః శాంత్యై నమో లక్ష్మై నమః శ్రియే || 36

నమస్తుష్టయై నమః పుష్టయై సృష్టియై ద్రష్టయై నమో నమః | విశోకా దుఃకనాశాయ విశోకా వరదాస్తుతే || 37

విశోకా మేస్తు సంపత్యై విశోకా సర్వసిద్ధయే | తతః శుభ్రాంబరైః సూర్యమావేష్ట్య సంపూజయేత్ఫలైః || 38

భ##క్ష్యైర్ననావిధైః తద్వత్సువర్ణకమలేన చ | రాజతీషు చ పాత్రేషు న్యసేద్దర్భోదకం బుధః ||39

తతస్తు నృత్యగీతాని కారయేత్సకలాం నిశాం | యామత్రయే వ్యతీతే తు తత ఉత్థాయ మానవః || 40

అభిగమ్య చ విప్రాణాం మిధునాని చ పూజయేత్‌ | శక్తితస్త్రీణి చైకం వా వస్త్రమాల్యానులేపనైః || 41

శయనస్థాని పూజ్యాని నమోస్తు జలశాయినే | తతస్తు గీతవాద్యేన రాత్ర్యాం జాగరణ కృతే || 42

ఆ పూజ విశోకాయ యను నామము మొదలు ఆయా నామములతో పాదాది నమః సర్వాత్మనే యన్నదాక శిరస్సు దాక ప్రత్యంగ పూజ చేయవలెను. (ఇట మూలము చూడుడు.) ఈలా గోవిందుని గంధ, పుష్ప మాల్యధూపదీప నైవేదాదులచే దర్చించి యవలమండల మేర్పరచి మన్నుతో నలుచదరముగా ఆరత్ని మాత్రముగ ఉత్తరపువైపు పల్లముగా నరుగు నేర్పరుపవలెను. ఆది మెంతో సాపుగా నందముగా మూడువైపుల వక్రములు మూడంగుళముల యెత్తు మూడు తీగె లేర్పరుపవలెను. వాని వైశాల్యము రెండంగుళము లుండవలెను. ఆ స్ఠండలము (అరుగు) మీద గోడ ఎనిమిది అంగుళము లెత్తుండపలెను. నదిలోని యిసుకతో సూర్యునియందు లక్ష్మి విగ్రహము నుంచవలెను. సూర్యుని మధ్యనున్న లక్ష్మిని తెలిసినవాడర్పించవలెను. ఆయర్చన నమోదేవ్యై అన్ననామము దగ్గరనుంచి సర్వసిద్ధియేదాకా శ్లోకరూపమగు నీ మంత్రములు చదివి పూజసేయవలెను. ఆపై శుభవస్త్రములు సూర్యునికి గప్పి పండ్లతో నానాభక్ష్యములతోబంగారు కమలముతో పూజింపవలెను. వెండిగిన్నెలలో దర్భోదకము నుంచవలెను. ఆపైని నృత్య గీతాదిమేళనము సేయవలెను. మూడుజాములైన తరువాతలేచి బ్రహ్మణ మిథునములను బూజింప వలెను. శక్తినిబట్టి యొకటి మొదలు ముగ్గురు దంపతులను వస్త్రమాల్య గంధాదులచే శయనమందుంచి పూజింపవలెను. నమో7స్తు జలశాయినే ''జలమునం బరుండు స్వామికి నమస్కారమనియూ పూజసేయవలెను. అవ్వల నృత్యగీతవాద్యాదు లతో రాత్రి జాగరణము సేసి ప్రభాతమందు (వేకువను) స్నానముసేసి దంపతీపూజ సేయవలెను. యధాశక్తి డబ్బులోభముగొనక వారికి భోజనముం బెట్టవలెను. భక్తితో పురాణములను విని యారోజు గడుపవలెను. ఈ విధానముతో ప్రతిమాసము యొక్క సంవత్సరము వ్రతమాచరింపవలెను.

ప్రభాతే చ తతః స్నానం కృత్వా దాంపత్పయమర్చయేత్‌ | భోజయేచ్ఛ యథాశక్తివిత్తశాఠ్యేన వర్జితః || 43

భక్త్వా శ్రుత్వా పురాణాని తదహశ్చాతివాహయేత్‌ | అనేన విధినా సర్వం మాసి మాసి సమాచరేత్‌ || 44

వ్రతాంతే శయనం దద్యాద్గుడధేనుసమన్వితం | సోపధానం సవిశ్రామం స్వాస్తరావరణం శుభమ్‌ || 45

యథా లక్ష్మీర్వరేశ త్వాం న పరిత్యజ్య గచ్చతి | తథా సురూపతారోగ్యమశోకం చాస్తు మే సదా || 46

యథా దేవేన రహితాన లక్ష్మీర్జయతే క్వచిత్‌ | తథా విశోకతా మేస్తు భక్తిరగ్ర్యాచ కేశ##వే || 47

మంత్రేణానేన శయనం గుడధేనుసమన్వితం | సూర్యశ్చ లక్ష్మ్యాసహితో దాతవ్యో భూతిమిచ్ఛతా || 48

ఉత్పలం కరవీరం వాప్యవ్లూనం చైవ కుంకుమం | కేతకం సింధువారం చ మల్లికా గంధపాటలా || 49

కదంబం కుబ్జకం జాతీ శస్తాన్యేతాని సర్వదా |

భీష్మ ఉవాచ :- గుడధేనువిధానం చ సమాచక్ష్వ మునీశ్వర || 50

వ్రతోద్యాపనమందు గుడధేనువుతో చక్కని పరుపు పక్క తలగడలతో శయ్యాదానము సేయవలెను. లక్ష్మి ప్రభుత్వము వన్ను వదలిపోనట్లు - అలాగే చక్కని రూపురేఖలు ఆరోగ్య మశోకము గూడ నాకెప్పుడు నుండుగాక. దేవునితో గాకుండ లక్ష్మి యెట్లు జయశాలిని యెప్పుడు గాదో, అలా నాకు నిరతమశోక తృణము విష్ణువందు పరమభక్తి యుండుగాక అను యథాలక్ష్మీః అను శ్లోకము మొదలు భక్తిరగ్ర్యాచకేశ##వే రెండు శ్లోకముల రూపమున నున్న నీ మంత్రము సెప్పి గుడ ధేనువుతో శయ్యా దానమును లక్ష్మితో గూడిన సూర్య విగ్రహమనును యైశ్వర్యముకోరువాడు దానమీయవలెను. వాడని కలువలు కరవీర పువ్వులు, కుంకుమ పువ్వు, మొగిలి, సిందూరము (వాలివి), మల్లి, గులాబి, కదంబము, కడిమి, కుబ్జకము, జాజీ యను పూవులివ్వి ప్రశస్తములు ఎప్పుడూ దానమీయ వలసినవి.

భీష్ముడనియె:- గుడధేనుదానవిధానమానతిమ్ము మునీశ్వరా ! గుడధేను స్వరూప మేమి? ఏ మంత్రముతో ఏది యీయవలె నిట వాకొనుము. అన పులుస్తుండనియె :

-: గుడధేను దానము :-

కిం రూపా కేన మంత్రేణ దాతవ్యా తదిహోచ్యతాం |

పులస్త్య ఉవాచ:- గుడధేనువిధానస్య యద్రూపమిహ యత్ఫలమ్‌ || 51

తదిదానం ప్రవక్ష్యామి సర్వపాపవినాశనం | కృష్ణాజినం చతుర్హస్తం ప్రాగ్‌గ్రీవం విన్యసేద్భువి || 52

గోమయేనానులిప్తాయాం దర్భానా స్తీర్య సర్వతః || లఘ్వేణకాజినం తద్వత్‌ వత్సం చ పరికల్పయేత్‌ || 53

ప్రాజ్ఞ్ముఖీం కల్పయేద్ధేనుం మృదా వా గాం సవత్సకాం | ఉత్తమా గుడధేనుః స్యాత్సదా భారచతుష్టయం || 54

వత్సం భారేణ కుర్వీత భారాభ్యాం మధ్యమా స్మృతా | అర్ధభారేణ వత్సః స్యాత్‌ కనిష్టా భారకేణ తు || 55

చతుర్ధాంశో న వత్సః స్యాద్గృహవిత్తానుసారతః | ధేనువత్సౌకృతౌ చోభౌమిత సూక్ష్మాంబరావృతౌ || 56

నాల్గు మూరల కృష్ణాజినము తూర్పు మెడగా భూమిపై బరువవలెను. ఆ భూమి ముందు ఆవు పేడతో నలికి దరృలు పరచి, పలుచని లేడి చర్మము పరచి, దూడను గూర్చి తూర్పు మొగంగా మట్టతోనట్లు నాల్గు మణగుల బెల్లముతో ఆవును దూడను కూర్చవలెను. దూడ నొక్క మణుగుతో, నాల్గు మణుగులతో జేసినది ఉత్తమము. రెండు మణుగులతోడి మధ్యమము, అర్ధ భారము (మణుగులో సగము దూడ) ఒక్క మణుగుతోడిది కనిష్టము (ఆఖరు రకము) నాలగవ వంతు బెల్లముతో కూడా ఆ దూడను ఆవును యథాశక్తి నేర్పరుపనగును. వానికి పలుచని వస్త్రములు కప్పవలెను. 56

శు(శ)క్తికర్ణావిక్షుపాదౌ శుచి ముక్తాఫలేక్షణౌ| సితసూత్రసిరాజాలౌ సితకంబలకంబలౌ || 57

తామ్రగండకపృష్టౌ ద్వౌ సితచామరలోమకౌ | విద్రుమభ్రూయుగావేతౌ నవనీతస్తనాన్వితౌ || 58

కాంచనాక్షియుగో పేతావింద్రనీలకనీనికౌ | క్షౌమపుచ్ఛౌ కాంస్యదేహౌ శుభ్రాతికమ నీయకౌ || 59

సువర్ణశృంగాభరణౌ రాజతాఢ్యఖురౌ చ తౌ | నానాఫలసమాయుక్తౌ ఘ్రాణగంధకరండకౌ || 60

ముత్యపు చిప్పలు చెపులు, చెఱకుగడలు పాదములు, తెల్లని ముత్యాలు కన్నులు, తెల్లని దారాలు సిరలు పేగులు. తెల్ల కంబశులు కంబలము. రాగితో జేసిన చెక్కిళ్ళు, పృష్ట భాగములు కలవి తెల్లని వింజామరలను రామములు, పవడములు కనుబొమలు వెన్న పొదుగులు, బంగారపు కన్నులు, ఇంద్రనీల మణులు కనురెప్పలు, పట్టుబట్ట తోకలు, కంచుచెంబు, పాలచెంబు, తెల్లనివి, చక్కనివి బంగారపు కొమ్ములు, వెండి డెక్కలుగా ఆవును దూడను బొమ్మలుగా తయారు చేయవలెను. ఆపైని రకరకాల పండ్లు, మంచి గంధము లత్తరులు నింపిన కరండకములు.

ఇత్యేవం రచయిత్వా తు ధూపదీపైస్తదార్చయేత్‌ | యా లక్ష్మీస్సర్వభూతానాం యా చ దేవేష్వవస్థితా || 61

ధేనురూపేణ సా దేవీ మమ పాపం వ్యపోహతు | విష్ణోర్వక్షసి యా లక్ష్మీః స్వాహా యా చ విభావసౌ || 62

చంద్రార్కశక్రశక్తిర్యా సా ధేనుర్వరదాస్తు మే | స్వధా త్వం పితృముఖ్యానాం స్వాహా యజ్ఞభుజాం యతః || 63

సర్వపావహరా ధేనుస్తస్మాద్భూతిం ప్రయచ్ఛ మే | ఏవమామంత్ర్య తాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌ || 64

విధానమేతద్ధేనూనాం సర్వాసామపి పఠ్యతే | యాస్తు పాపవినాశిన్యః పఠ్యంతే దశ##ధేనవః || 65

ఈలా పూజ సామాగ్రి యేర్పరచి దూపదీపాదులచే నర్చించవలెను. సర్వ భూతముల లక్ష్మి యెవరో యే దేవి సర్వ దేవతలందున్నదో ఆ తల్లి గోవు రూపమున నా పాపమును పోగొట్టు గావుత. విష్ణు వక్షఃస్థలము లక్ష్మిగా, యగ్నియందు స్వాహా దేవిగా, చంద్ర సూర్యుల ఇంద్రుని యొక్క శక్తియే గోవు. ఆ ఆవు నాకు వరములిచ్చు గావుత. పితృదేవతలకీవు స్వధాదేవివి, యజ్ఞములందు హవిస్సు లారగించు దేవతలకు స్వాహా దేవివి నీవే కావున గోమాతా నా ఐశ్వర్యమును నా కనుగ్రహింపుము. అని ఈ విధముగా గో పూజా దాన విధానము పురాణములందు జదువబడి యున్నది. పాపములెల్ల పొనడచునవి దశ ధేనువులు సెప్పబడినవి. వాని స్వరూపమును, వాని పేర్లను జెప్పెద రాజా! వినుము.

తాసాం స్వరూపం వక్ష్యామి నామాని చ నరాధిప | ప్రధమా గుడధేనుస్స్యాద్‌ ఘృతధేనుర థాపరా || 66

తిలధేనుస్త్రుతీయా చ చతుర్థీ జలనామికా | క్షీరధేనుః పంచమీ చ మధుధేనుస్తదా పరా || 67

సప్తమీ శర్కరాధేనురష్టమీ దధికల్పితా | రసధేనుశ్చ నవమీ దశమీ స్యాత్స్వరూపతః || 68

కుంభాస్స్యూరసధేనూనామితరాసాం స్వరశయః | సువర్ణధేనుం చాప్యత్ర కేచిదిచ్ఛంతి మానవాః || 69

నవనీతేన తైలైశ్చ తథాన్యేపి మహర్షయః | ఏతదేవ విధానం స్యాత్త ఏవోపస్కరా స్మృతాః || 70

మంత్రావాహనసంయుక్తాః సదా పర్వణి పర్వణి | యథా శ్రాద్ధం ప్రదాతవ్యా భుక్తిముక్తి ఫలప్రదాః || 71

1. గుడ ధేనువు. 2. దృత ధేనువు, 3. తిల ధేనువు. 4. జల ధేనువు, 5. క్షీర ధేనువు, 6. మధు (తేనె) ధేనువు 7.శర్కరా (పంచదార) ధేనువు, 8. దధి ధేనువు, 9. రస ధేనువు, 10. కేవలము ఆవు, కొందరిట సువర్ణ ధేనువును గూడ యిష్టపడుదురు. వెన్న, నువ్వులతోడి ధేనువును మరి కొందరు ఋషులభిలషించిరి. అన్నిటికినిదే పూజా విధానము. ఇదే పూజా సామాగ్రిని స్మృతులు సెప్పినవి. ప్రతి పర్వమందు మంత్ర పూర్వకముగా ఆవాహనము చేసి పితృదేవతలకు జరుపు శ్రాద్ధమట్లు యీ గోవు లీయవలసినవి. ఇది భుక్తిని, ముక్తిని గూడ యిచ్చును. 71

గుడధేనుప్రసంగేన సర్వాస్తన మయోదితాః | అశేషయజ్ఞఫలదాః సర్వపాపహరాః శుభాః || 72

వ్రతానుముత్తమం యస్మద్విశోకద్వాదశీవ్రతం | తదంగత్వేన చైవాత్ర గుడధేనుః ప్రశస్యతే || 73

ఆయనే విషువే పుణ్య వ్యతీపాతే తథా పునః| గుడధేన్వాద యే దేయా ఉపరాగాదిపర్వసు || 74

విశోకద్వాదశీ చైషా సర్వపాపహరా శుభా | యాముపోష్య నరో యాతి తద్విష్టోః పరమం పదమ్‌ || 75

ఇహలోకే ససౌభాగ్యమాయురారోగ్యమేవ చ | వైష్ణవం పురమాప్నోతి మరణ స్మరణాద్‌ హరేః || 76

నవార్బుదసహస్రాణి దశ చాష్టౌ చ ధర్మవిత్‌| న శోకదుఃఖదౌర్గత్యం తస్య సంజాయతే నృప || 77

నారీ వా కురుతే యా తు విశోకద్వాదశీమిమాం | నృత్యగీతాపరా నిత్యం సాపి తత్పలమాప్నుయాత్‌ || 78

యస్మాదగ్రే హరేర్నృత్యమనంతం గీతవాదనం |

ఇతి పఠతి య ఇత్థం శృణోతీహ సమ్యక్‌ మధుమురనరకారేరర్చనం వాధపశ్యేత్‌ || 79

మతిమపి చ జనానాం యో దదాతీంద్రలోకే స వసతి విబుధౌఘైః పూజ్యతే కల్పమేకం |

భీష్మ ఉవాచ:- భగవాన్‌ శ్రోతుమిచ్ఛామి దానమాహాత్మ్యముత్తమమ్‌ || 80

గుఢ ధేనువు ప్రశక్తిలోనే నీ యొల్ల ధేనువులను గూర్చి చెప్పితిని. ఇవన్ని ధేనువులును సర్వయజ్ఞ ఫలమునిచ్చును. సర్వ పాప హరములు, శుభములు. విశోక ద్వాదశీ వ్రతము సర్వోత్తమ మగుటచే నా ప్రసంగమున నిట గుడ ధేను దానము గడు ప్రశస్తం. ఉత్తర దక్షిణాయన పుణ్యకాలములందు విషువమందు రాత్రి పగలు సమ ప్రమాణములో నున్న వేళ విషువమందురు. విషువత్తు అని యనవచ్చును వ్యతీపాత యందు అపరాగములందు గుడధేన్వాదులవి యన్నియు నీయదగినది. ఈ విశోక ద్వాదశి గూడ సర్వపాపహరము. శుభకరము, ఇందుపవాసమున్న మానవుడా విష్ణు పరమపదమందును మరణమువేళ హరిస్మరము సేసిన ధన్యుడు. విష్ణువు పురమునకు (వైకుంఠము) ఏగును. ధర్మవిదుడాతడు నూట ఎనిమిది వేల అర్బుదముల కాలము ఈ లోకము సౌభాగ్యము ఆయుర్ధాయంతో ఆరోగ్యము నందును. వాని శోకము దుర్గతి గలుగవు. స్త్రీయైన నృత్య గీతాదులతో నీవు వ్రతమాచరించిన నదేఫలమందును. విష్ణువు ముందు నృత్యము గీత వాదనము పాట పాడిన అనంతమగును. ఒకమాటు సేసినను అనంత ఫలమిచ్చును. నే నిట్లు మధు - ముర - నరక + అరి : మధువు - వరుడు - నరకుడను ముగ్గురకు శత్రువైన హరి ఛరిత్రమును ఎవ్వడు శ్రద్దగా వినునో ఆ దేవుని అర్చనము గనునో, జనులందరికీ యాలోచన నిచ్చునో అతడు ఇంద్రలోకమున (స్వర్గమందు) ఒక్క కల్పకాలము నివసించును. దేవతా సంఘములచే పూజింపబడును. 80

యదక్షయం పరే లోకే దేవర్షిగణపూజితం |

పులస్త్య ఉవాచ:- మేరోః ప్రదానం వక్ష్యామి దశధా నృపసత్తమ || 81

యత్ప్రదాతా7నంత లోకానాప్నోతి సురపూజితాన్‌ | పురాణషు చ వేదేషు యజ్ఞేష్వాయతనేషు చ || 82

భీష్ముడు, భగవంతుడా పరలోకమున దేవతలు ఋషులు పూజించునది అక్షయమగునదియునైన యుత్తమ దాన మహాత్మ్యమాలింప గోరెదను. ఆన పుతస్తుడిట్లనియె. రాజోత్తమ! పది విధములైన '' మేరు దానము''ను గూర్చి చెప్పెదను. అవి యిచ్చినతడు దేవతలు పూజించు పుణ్యలోకములందును. ఈ నేను జెప్పిన దానములను గురించి చదివిననూ విన్ననూ ఆచరించిననూ గలుగుఫలము పురాణములందు వేదములందు యజ్ఞములందు దేవాలయములం దెందును లేదు. అందుచే నీ పర్వత దానమును గూర్చి ముచ్చటింతును. 82

న తత్ఫలమధీతేషు కృతేష్విహ యదశ్నుతే | తస్మాద్దానం ప్రవక్ష్యామి పర్వతానామనుక్రమాత్‌ || 83

ప్రథమో ధాన్యశైలః స్యాద్ధ్వితీయో లవణాచలః | గుడాచలస్త్రుతీయస్తు చతుర్థో హేమపర్వతః || 84

పంచమస్తిలశైలఃస్యాత్‌ షష్ఠః కార్పానపర్వతః | సప్తమో ఘృతశైలః స్యాద్రత్నశైలస్తథా ష్టమః || 85

రాజతో నమవ స్తద్వద్దశమః శర్కరాచలః | వక్ష్యే విధాన మేతేషాం యథావదామపూర్వశః || 86

ఆయనే విషువే పుణ్య వ్యతీపాతే దినక్షయే | శుక్లపక్షే తృతీయాయాముపరాగే శశిక్షయే || 87

వివాహోత్సవయజ్ఞేషు ద్వాదశ్యామథవా పునః | శుక్లాయాం పంచదశ్యాం వా పుణ్యర్ష్కే వా విధానతః || 88

ధాన్యశైలాదయో దేయాః కార్తిక్యాం జ్యేష్ఠపుష్కరే తీర్ధేష్వాయతనే వాపి గోష్టే వా భవనాంగణ || 89

మండపం కారయేద్బక్త్యా చతురశ్రముదజ్ఞ్ముఖం | ప్రాగుదక్ప్రవణం పుణ్యం ప్రాజ్ఞ్ముఖం వా విధానతః || 90

గోమయేనానులిప్తాయాం భూమావా స్తీర్య వై కుశాన్‌ | తన్మధ్యే పర్వతం కుర్మాద్విష్కంభం పర్వతాన్వితమ్‌ || 91

ధాన్యద్రోణసహస్రేణ భ##వేద్గిరిరిహోత్తమః | మధ్యమః పంచశాతకైః కనిష్టశ్చ త్రిభిః శ##తైః || 92

మేరుర్మ హావ్రీమయస్తు మధ్యే సువర్ణవృక్షత్రయసంయుతః స్యాత్‌ |

మూర్ధన్యవస్థానమథాంబరేణ కార్యం త్వనేకం చ పునర్ధ్విజాగ్రైః || 93

చత్వారి శృంగాణి చ రాజతాని నితంబభాగా అపి రాజతాస్యుః |

పూర్వేణముక్తాఫలవజ్రయుక్తో యామ్యేన గోమేదకపద్మరాగైః 94

పశ్చాచ్చ గారుత్మతనీలరత్నైః సౌమ్యేన వైడూర్యకపుష్యరాగైః |

శ్రీఖండఖండై రభితః ప్రవాలైర్లతాన్వితో మౌక్తిక ప్రస్తరాఢ్యః || 95

ధ్యానశైలము లవణ 3 గుడఁ బెల్లము బంగారు నువ్వులు ప్రత్తి నెయ్యి రత్నము వెండి ೧೦ శర్కరాచలము = పంచదారకొండ, వీనిని దానము చేయు విధానము వరుసగా జెప్పెద, అయనమందు విషువత్తునందు పుష్యమాసమందు వ్యతీపాతయందు దినక్షయమందు శుక్లపక్ష తృతీయమందు ఉపరాగమందు చంద్ర క్షయం తిథియందు వివాహమందు ఉత్సవమందు యజ్ఞములందు ద్వాదశియందు శుక్లపక్ష పూర్ణిమయందు శుభ నక్షత్రమందు ధాన్య శైలాది దానములు సేయవలెను. జ్యేష్ఠ పుష్కరమందు కార్తిక మాసమందు జేయవలెను. తీర్థములందు దేవాలయము లందు గోశాలలో తన యింటి ముంగిట గాని భక్తితో మండపము నలు చదరముగ నుత్తరాభి ముఖముగా వేయవలెను. ఈశాన్య దిశగా నైన కేవలము తూర్పు ముఖముగా నైనను మంచిదే. ఆపు పేడతో నలికిన యా మండపమున భూమిపై దర్భలు పరచి ఆ నడుమ పర్వతముతోడి విష్కంభము నుంచవలెను. ఇచట వేయి ద్రోణముల ధాన్యము ప్రోవు పర్వతాకారమున నుంచుట ఉత్తమ పక్షము. అయిదువందలు మధ్యమము మూడు వందలు కనిష్ఠము. మధ్య మూడు బంగారు వృక్షములతో మహావ్రీహి (వెదవడు అను నొక రకము ధాన్యము)తో మేరువు నా మండపము మధ్య నేర్పరుపవలెను. ఆకసమందైనను. మీదుగా నైనను అది వేయవచ్చును. ఆ పర్వతమునకు మీదుగా నాలుగు శిఖరములు వెండివి కొండకు పిఱిదియందు వెనుక భాగము నిల్పవలెను. అందు తూర్పు దానికి ముత్యాలు వజ్రము, దక్షిణ శిఖరమును గోమేదము పద్మరాగము పడమట గరుడ నీలము ఉత్తరమున వైడూర్య పుష్పరాగములు రత్నములు పొదుగవలెను. చందనము చెక్కలచేత పవడములనే పూల తీగలతో ముత్యాల వేదిక యేర్పఱుపవలెను. 95

బ్రహ్మాథ విష్ణుర్భగవాన్పురారిర్దివాకరోప్యత్ర హిరణ్మయః స్యాత్‌ |

తథేక్షువంశావృతకందరస్తు ఘృతోదకప్రస్రవణో దిశాసు || 96

శుభ్రాంబరాణ్యంబుధరావలిః స్యాత్‌ పూర్వేణ పీతాని చ దక్షిణన |

వాసాంసి పశ్చాదథ కర్బురాణి రక్తాని చైవోత్తరతో ఘనాని || 97

రౌప్యాన్మహేంద్రప్రముఖాంస్తథాష్టౌ సంస్థాప్య లోకాధిపతీన్ర్కమేణ |

నానావనాలీ చ సమంతతః స్యాన్మనోరమమ్మాల్యవిలేపనం చ || 98

వితానకం చోపరి పంచవర్ణమవ్లూనపుష్పాభరణం సితం చ |

ఇత్థం నివేశ్యామరశైలమగ్ర్యం మేరోస్తు విష్కంభగిరీన్ర్కమేణ || 99

తురీయభాగేన చతుర్దిశం చ సంస్థాపయేత్పుణ్య విలేపనాఢ్యం |

పూర్వేణ మందరమనేకఫలైశ్చ యుక్తం కామేన కాంచనమయేన విరాజమానమ్‌ || 100

భగవంతులు బ్రహ్మ విష్ణువు శివుడు సూర్యుడు నను బంగారుమూర్తులనిట ప్రతిష్ఠింప వలెను. నలుదెసల చెఱకులు వెదుళ్ళ ఆవరణమేర్పరచి నేయి, అభిషేకోదకము జాలు వారుటకు దారులేర్పరుపవలెను. తూర్పుదెస దక్షిణ దెస తెల్లని వస్త్రములు మేఘపంక్తి గాను పడమటిదెస కర్బూరములు (రంగుల) ఉత్తరపు వైపు ఎఱ్ఱనివి వస్త్రములు మేఘపంక్తిగా నేర్పరుపవలెను. వరుసగా ఇంద్రాది దిక్పాలురెనమండుగురను వెండి ప్రతిమలను నిలుపవలెను. చుట్టునంతట నానావనముల వరుసలు అందములైన పూలమాలలు రంగురంగుల గంధపు పూతమీద తెల్లని వస్త్రముపై పూలతో నేర్పరచిన పంచవర్ణ వితానకము (అయిదు రంగుల చాందిని) ఈలా మొట్టమొదలు మేరుగిరిని నేర్పఱచి దానికి విష్కంభ పర్వతములను దానికి నాలుగవవంతు ప్రమాణములో నలుదెసల నిలిపి చక్కగా రంగురంగులు పూసి తూర్పు బంగారు మందర పర్వతము నేర్పరుపవలెను. 100

యామ్యేన గంధమాదనో వినివేశనీయో గోధూమసంచయమయః కలధౌతవాంశ్చ |

హైమేన యజ్ఞపతినా ధృతమానసేన వస్త్రేణ రాజతవనైశ్చ స సంయుతః స్యాత్‌ || 101

పశ్చాత్తిలాచలమనేకసుగంధపుష్పసౌవర్ణపిప్పలహిరణ్మయహంసయుక్తం |

ఆకారయేద్రజతపుష్పవనేన తద్వద్వస్త్రాన్వితం దధిసితోదసర స్థథాగ్రే || 102

సంస్థాపత్యం తం విపులశైలమథోత్తరేణ శైలం సుపార్శ్యమపి మాషమయం సవస్త్రం |

పుషై#్పశ్చ హేమమయపాదపశేఖరం తమాకారయేత్కనకకేతువిరాజమానమ్‌ || 103

మాక్షీకభద్రసరసా చ వనేన తద్వద్రౌప్యేణ భాసురవితానయుతం విధాయ |

హోమశ్చతుర్భిరథ వేదపురాణవిద్భిర్దాంతైరనింద్యచరితాకృతిభిర్ద్విజేంద్రైః || 104

పూర్వేణ హస్తమితమత్ర విధాయ కుండం కార్యస్తిలైర్యవఘృతేన సమిత్కుశైశ్చ |

రాత్రౌ చ జాగరమనుద్ధతగీతరూపైరావాహనం చ కథయామి శిలోచ్చయానామ్‌ || 105

దక్షిణ దిశ గంధమాదనము అను పర్వతము గోధుమలతో కలధౌతము (బంగారము చేర్చి యేర్పరుపవలెను. బంగారముతో మానసాచాలమను కొండను చేతగొనిన యజ్ఞేశ్వరుని ప్రతిమ నతినిలువన చుట్టు వెండితో చేసిన వనములు ప్రతిమలు నిలుప వలెను. ఆ మీదిది తిలపర్వతము అనేక సుగంధ పుష్పములతో బంగరు రావి యాకులు బంగారు హంసలతో వెండిపూల వనముతో వస్త్రము పెరుగు తెల్లని నీటి సరసు గోవును నలిపి మినుమతోనైన కొండను వస్త్రముతో పూలతో బంగారపు వృక్షమును పైగా నిలిపి బంగారపు జెండా యేర్పరచి యా ప్రతిమను రూపొందింపవలెను. తేనెతోడి మంగళ సరస్సు వనముతో వెండి జెండాలతో నలంకరింపవలెను. వేద పురాణములు తెలిసిన ఉత్తమ చరిత్ర రూపురేఖలు కలవారి నల్గురు బ్రహ్మణశ్రేష్ఠులచే హోమము సేయింపవలెను. వారు తూర్పుగా ఒక్క వైశాల్యముగల కొండ యేర్పరచి నువ్వులు నేయి సమిధలు కుశలతో హోమమలుసేసి రాత్రి జాగరణము సేయవలెను. 105

త్వ సర్వదేవగణధామనిధే విరుద్దమస్మద్గృ హేష్వమరపర్వత నాశయాశు |

క్షేమం విధత్స్వకురు శాంతిమనుత్తమాం చ సంపూజితః పరమభక్తిమతా మయా హి || 106

త్వమేవ భగవానీశో బ్రహ్మవిష్ణుర్దివాకరః | మూర్తామూర్తమయం బీజమతః పాహి సనాతన || 107

యస్మాత్వం లోకపాలానాం విశ్వమూర్తేశ్చ మందిరం |

రుద్రాదిత్యవసూనాం చ తస్మాచ్ఛాంతిం ప్రయచ్ఛ మే || 108

యస్మాదశూన్యమమరైర్నారీభిశ్చ శిరస్తవ | తస్మాన్మాముద్ధరాముష్మాద్‌ దుఃఖసంసార సాగరాత్‌ || 109

ఏవమభ్యర్చ్య తం మేరుం మందరం చాభిపూజయేత్‌ | యస్మాచ్చైత్రరథేన త్వం భద్రాశ్వేన చ పర్వత || 110

శోభ##సే మందర క్షిప్రమతస్తుష్టికరో భవ | యస్మాచ్చూడామణిర్జంబూద్వీపే త్వం

గంధమాదన || 111

ఆచరణలో ఆలోచనలో నేలాటి తొందరపాటులేక వారా పై చేయవలసిన పర్వతముల ఆవాహనము రీతి సెప్పెదను. ఓ తిల పర్వతమూర్తీ ! సర్వదేవతా సంమము భాగ్యనిధివి మా యింటి జరుగునే దేని విరుద్దమును (కష్టమును) ఓ దేవమూర్తీ! వెంటనే వారింపుము. క్షేమము నొనరింపుము పరమశాంతి నలరింపుము. ఎంతో భక్తితో నిన్ను పూజించుచున్నాను. భగవంతుడివే యీశ్వరుడవు బ్రహ్మ విష్ణు సూర్య స్వరూపుడవు - లోకపాలుర సాకారము (మూర్తము) నిరాకారము (అమూర్తము) నైనవాడవు వసు రుద్రాదిత్యులకు విశ్వమూర్తివి నీవు మందిరమగు స్థానమవు. అందువలన శాంతిననుగ్రహింపుము నాకు. నీ శిరసు నందసురులు సమరులు నెప్పుడుండకపోరు. వారికది యాధారము. కావు నన్ను సంసార సాగరమునుండి యుద్ధరింపుము అని యిలా ఆ మేరువును మందర పర్వతమును పూజింపవలెను. ఓ మందర పర్వతమూర్తీ! నీవు చైత్రరథునితో భద్రాశ్వ పర్వత రాజముతో నెల్లపుడు శోభిల్లుదువు గావున వెనువెంటనే సంతోషము కూర్పుము. 111

గంధర్వగణశోభావాంస్తతః కీర్తర్దృఢాస్తు మే | యస్మాత్వం కేతుమాలేన వైభ్రాజేన వనేన చ || 112

హిరణ్మయాశ్మవోభావాం స్తస్మాత్పుష్టిర్ధృవాస్తు మే | ఉత్తరైః కురుభిర్యస్మాత్సావిత్రేణ వనేన చ || 113

సుపార్శ్వ రాజసే నిత్యమతః శ్రీరక్షయా7స్తు మే | ఏవమామంత్ర్య తాన్సర్వాన్ప్రభాతే విమలే పునః 114

స్నా త్వా తు గురవే దద్యాన్మధ్యమం పర్వతోత్తమం |

విష్కంభపర్వతాన్‌ దద్యాదృత్విగ్భ్యః క్రమశోనృప || 115

గావో దేయాశ్చతుర్వింశదదధవా దశ పార్ధివ | శక్తితః సప్త చాష్టౌ వా పంచ దద్యాదశక్తిమాన్‌ || 116

ఏకాపి గురవే దేయా కపిలాథ పయస్వినీ | పర్వనామశేషాణామేష ఏవ విధిః స్మృతః || 117

త ఏవ పూజనే మంత్రాస్త ఏవోపస్కరాః స్మృతాః | గ్రహాణాం లోకపాలానాం బ్రహ్మాదీనాం చ సర్వతః || 118

స్వమంత్రేణౖవ సర్వేషు హోమః శైలేషు పఠ్యతే | ఉపవాసీ భ##వేన్నిత్యమశక్తౌనక్తమిష్యతే || 119

విధానాం సర్వశైలానాం క్రమశః శృణుపార్ధివ | దానేషు చైవ యే మంత్రాః పర్వతేషు యథాఫలమ్‌ || 120

అన్నం బ్రహ్మ యతః ప్రోక్తమన్నం ప్రాణాః ప్రకీర్తితాః | అన్నాద్భవంతి భూతాని జగదన్నేన వర్ధతే || 121

అన్నమేవ యతో లక్ష్మీరన్నమేవ జనార్దనః | ధాన్యపర్వతరూపేణ సాహి తస్మాన్నగోత్తమ || 122

అనేన విధినా యస్తు దద్యాద్ధాన్యమయం గిరిం | మన్వంతరశతం సాగ్రం దేవలోకే మహీయతే || 123

అప్సరోగణగంధర్వైరాకర్ణేన విరాజితః | విమానేన దివః పృష్టమాయాతి నృపసత్తమ || 124

కర్మక్షయే రాజరాజ్యమాప్నోతి న సంశయః | ఆథాతః సంప్రవక్ష్యామి లవణాచలముత్తమమ్‌ || 125

జంబూ ద్వీపమందు వీపు చూడామణిని (శిరోరత్నమవు) గంధమాదనా! గంతర్వ సంఘముతో నెల్లపుడు శోభింతువు. నీవలన నాకు కీర్తి (పేరు ప్రతిష్టలు) కలుగుగాక! కేతుమాలునితో వైభ్రాజ వనముతో బంగారు గనుల శోభ గలవాడవు గావున నీవలన నా కెల్లపుడు సంతుష్టి కలుగుగాక! ఉత్తర కురువులతో సావిత్ర వనముతో (సూర్యదేవతాక మయిన వనము) రాణించుచుందువు. సుపార్శ్య పర్వత ప్రభూ! నా యైశ్వర్య మక్షయమగునుగావుత! ఈలా ఆ పర్వతమూర్తులను ఆవాహనము సేసి వేకువను వెలుగు రాగానే స్నానము సేసి మధ్యమ పర్వతమును గురువునకు దాన మీయవలెను. విష్కంభ పర్వతములను ఋత్విక్కులకీయవలెను. భీష్మరాజా! గోవులను సమృద్ధిగా నీయవలెను. ఇరువది నాల్గుగాని పదిగాని శక్తిననుసరించి యేడు ఎనిమిది యైదుగాని యీయవచ్చును. ఆపై పాలిచ్చు కపిల గోవొక్కటియేని గురువునకీయవలెను. సర్వ పర్వత దానవిధి యిది యిలా స్మృతులందు వినబడుచున్నది. పూజలో నవే మంత్రాలు అవే పూజాది సామగ్రి గ్రహములకు లోకపాలురకు బ్రహ్మాది దేవతలకు నంతట నాయా దేవతా మంత్రమున నాయా దేవతలకు హోమము పర్వతదానమందు పఠింపబడినది. నిత్యము నుపవాసము సేయవలెను. అశక్తుడైన నక్తము సమ్మతమే. సర్వశైల దాన విధానము క్రమముగా వినుము. అందు మంత్రములు వాని ఫలము లాలింపుము. ధాన్యపర్వత దాన మంత్రము; అన్నము బ్రహ్మ అన్నములు ప్రాణములు. భూతములు పుట్టును అన్నముచే జగత్తు వృద్ధినొందును. అన్నమే లక్ష్మి అన్నమే విష్ణువు. ఈ మంత్రమున ధాన్య పర్వత రూపమున నన్ను కాపాడుమని దానమీయవలెను. ఈలా యిచ్చినతడు నూరు మన్వంతరముల కాలము దేవలోకమున వసించును. అప్సరసలు గంథర్వులుతో విహరించును.

లవణాచల దానము (ఉప్పు) :

యత్ర్పదాన్నాన్నరో లోకమాప్నోతి శివసంయుతం | ఉత్తమః షోడశద్రోణౖః కర్తవ్యో లవణాచలః || 126

మధ్యమశ్చ తదర్ధేన చతుర్భిరధమస్స్ముతః | విత్తహీనో యథాశక్తి ద్రోణాదూర్ధ్వం చ కారయేత్‌ ||127

దీని వలన శివలోకము గల్గును. పదునారు ద్రోణముల ఉప్పు ఉత్తమము. దానిలో సగముకు మద్యమము నాలుగు అధమము. పేదవాడొక్క ద్రోణము పైగా నీయవలెను. (ద్రోణము= కుంచము) దాన విధానమింత ముందన్నట్లే. 127

చతుర్ధాంశేన విష్కంభపర్వతాన్కారయేత్ప్రధక్‌ | విధానం పూర్వవత్కుర్యాద్ర్బహ్మా దీనాం న సర్వదా|| 128

తధ్వద్ధేమమయం సర్వలోకపాలనివేశనం | సరాంసి వనవృక్షాది తద్వచ్చాన్యాని ననివేశ##యేత్‌ || 129

కుర్యాజ్ఞాగరమత్రాపి దానమంత్రాన్ని భోధత | సౌభాగ్యరససంయుక్తో యతోయం లవణ రసః || 130

తదాత్మకత్వేన చ మాం పాహ్యాపన్నం నగోత్తమ | యస్మాదన్యే రసాః సర్వే నోత్కటా లవణం వినా || 131

ప్రియశ్చ శివయోర్నిత్యం తస్మాచ్ఛాంతిప్రదో భవ | విష్ణుదేహసముద్భూతో యస్మాదారోగ్యవర్ధనః || 132

తస్మాత్పర్వతరూపేణ పాహి సంసారసాగరాత్‌ | అనేన విధినా యస్తు దద్యాల్లవణపర్వతమ్‌ || 133

ఇక విష్కంభ పర్వతదానము. పదునాల్గు విష్కంభ పర్వతములు బ్రహ్మాది దేవతలనుద్దేశించి యీ మున్ను జెప్పిన విధినే యీయవలెను. అలాగే బంగారు గృహముల బ్రహ్మ మొదలగు పదునల్గురు లోకపాలుర నుద్దేశించి లవణ పర్వత రూపముల బంగారమీయవలెను. దానవిధాన మింతమున్ను జెప్పినట్లే. సరస్సులు అడవిచెట్లు వాటి గృహ సామాగ్రి నేర్పరుపవలెను. ఈనాడు జాగరము సేయవలెను. దాన మంత్రములు ''సౌభాగ్యరస సంయుక్తః'' అన్న మంత్రమిది నుపయోగింపవలెను. ఉప్పు సౌభాగ్యరసముతో రుచితో గూడినది. ఆ రస స్వరూపుడవై పర్వతమూర్తీ నన్ను కష్టముల గట్టెక్కింపుము నీవు శివులకు (పార్వతీపరమేశ్వరులకు) ప్రియుడవు కావున నెప్పుడు శాంతి ననుగ్రహింపుము. విష్ణువు శరీరమునుండి పుట్టితివి గావున ఆరోగ్యము పెంపొందింతువు. కావున లవణ పర్వతమూర్తివై సంసార సాగరమునుండి రక్షింపుము. ఈ లవణపర్వత దానము సేసి నతడు కల్పకాలము ఉమాలోకమందు నందుండి యాపై మోక్షమందును. 133

ఉమాలోకే వసేత్కల్పం తతో యాతి పరాం గతిం | అతః పరం ప్రవక్ష్యామి గుడపర్వతముత్తమమ్‌ || 134

యత్ర్పదానాన్నరః స్వర్గం ప్రాప్నోతి సురపూజితః | ఉత్తమో దశభిర్భరైర్మధ్యమః పంచభిర్మతః || 135

త్రిభిర్భరైః కనిష్ఠః స్సాత్తదర్ధేనాల్పవిత్తవాన్‌ | తద్వదామంత్రణం పూజాం హైమవృక్షాన్సురార్చనం || 136

విష్కంభపర్వతాంస్తద్వత్సరాంసి వనదేవతాః | హోమం జాగరణం తద్వల్లోకపాలాధివాసనమ్‌ || 137

ధాన్యపర్వతవత్కురా%్‌యదిమం మంత్రముదీరయేత్‌ | యథా దేవేషు విశ్వాత్మా ప్రవరోయం జనార్దనః || 138

సామవేదస్తు వేదానాం మహాదేవస్తు యోగినాం | ప్రణవః సర్వమంత్రాణాం నారీణాం పార్వతీ యథా || 139

తథా రసానాం ప్రవరః సదైవేక్షురసో మతః | మమ తస్మాత్పరం లక్ష్మీం దదాతు గుడవర్వతః || 140

యస్మాత్సౌభాగ్యదాయిన్యా ధామ త్వం గుడపర్వత| నిర్మితశ్చాసి పార్వత్యా తస్మాన్యాం పాహి సర్వదా || 141

ఆనేన విధినా యస్తు దద్యాద్గుడమయం గిరిం | సంపూజ్యమానో గంధర్వైర్గౌరీలోకే మహీయతే || 142

పునః కల్పశతాంతే చ సప్తద్వీపాధిపో భ##వేత్‌ | ఆయురారోగ్యసంపన్నః శత్రుభిశ్చాపరాజితః || 143

గుడపర్వతదానము:- ఇది సేసినతడు దేవతల పూజలందుచు స్వర్గమందుండును. పది ఐదు మూడు మణుగులు బెల్లము. పేదవాడు అరమణుగులీయవలెను. ఆమంత్రణము పూజ బంగారు వృక్షము దేవతాపూజ విష్కంభ పర్వతదానము సరస్సులు వనదేవతలు హోమవిధి జాగరణ లోకపాలుర అధివాస కీ మంత్రమిదంతయు ధాన్య పర్వతదానమునకట్లే. దేవతలయందు విశ్వాత్ముడు విష్ణువువలె వేదములందు సామవేదమట్లు యోగులకు మహాదేవుడట్లు సర్వ మంత్రములకు ప్రణవమట్లు స్త్రీలకు పార్వతి యట్లు రసములకెల్ల గుడము బెల్లము పరమోత్తమ రసముగా పార్వతిచే నిర్మింపబడితివి గావున నన్నెల్లప్పుడు గావుము అను నీ యర్ధముగల మంత్రముతో గుడపర్వత దానమిచ్చినవాడు గంధర్వులతో గౌరీలోకమందు వసించును. నూరు కత్పములటనుండి యాపై వచ్చి సప్త ద్వీపాధిపతియగును. ఆయురారోగ్య సంపన్నుడు శత్రువుల వలన పరాజయమందనివాడై అతడు రాణించును.

అథ పాపహరం వక్ష్యే సువర్ణాచలముత్తమం | యస్య ప్రదానాద్భవనం వైరించం యాంతి మానవాః || 144

ఉత్తమః పలసాహస్రో మధ్యమః పంచభిః శ##తైః | తదర్ధేనాధమస్తద్వదల్పవిత్తోపి మానవః || 145

దద్యాదేకపలాదూర్ధ్వం యధాశక్తి విమత్సరః | ధాన్యపర్వతవత్సర్వం విదధ్యాద్రజాసత్తమ || 146

విష్కంభ##శైలాం స్తద్వచ్చ ఋత్విగ్భ్యః ప్రతిపాదయేత్‌ | నమస్తే సర్వబీజాయ బ్రహ్మగర్భాయ వై నమః || 147

యస్మాదనంతఫలదః తస్మాత్పాహి శిలోచ్చయ | యస్మాదగ్నేరపత్యం యస్మాత్పుత్రో జగత్పతేః || 148

హేమపర్వతరూపేణ తస్మాత్పాహి నగోత్తమ | అనేన విధినా యస్తు దద్యాత్కనకపర్వతమ్‌ || 149

స యాతి పరమం బ్రహ్మలోకమానందకారకం | తత్ర కల్పశతం తష్టేత్తతో యాతి పరాం గతిమ్‌ || 150

అధాతః సంప్రవక్ష్యామి తిలశైలం విధానతః | యత్ప్రదానాన్నరో యాతి విష్ణులోకమనుత్తమమ్‌ || 151

సువర్ణాచల దానవిధి:- ఇది సర్వపాపహరము. ఇది యిచ్చిన దాత బ్రహ్మ భవనము (లోకము) నందును. వేయి పలముల బంగారము ఉత్తమము. అయిదు వందల పలముల తూకము మధ్యమము. దానిలో సగమధమము. పేదవాడొక్క మాత్సర్యము గొనక శక్తికొలది ఫలము మించి యీయవచ్చును. ధాన్యపర్వతదానవిధానమే దీనికిని. విష్కంభ పర్వతములను ఋత్విక్కులకీయవలెను. మంత్రము ''నమస్తే మొదలు నగోత్తమ!'' దాక నమస్కారము సర్వబీజము బ్రహ్మయొక్క గర్భము నీవు అనంత ఫలదాతవు కావున నన్ను రక్షింపుము. సువర్ణ పర్వతా! అగ్ని నుండి పుట్టితివి. నీ జగత్పతికి బంగారు కొండవై పుట్టితివి కావున నగోత్తమా నన్ను రక్షింపుము అని యీ కనక పర్వత దానము సేసి నతడానందకారకమగు బ్రహ్మలోకమందును, అందు నూరు కల్పములు సుఖించి మోక్షమందును.

తిలపర్వత దానము :- ఈ దానమిచ్చినతడు పరమోత్తమమగు విష్ణులోకమందును.151

ఉత్తమో దశభిర్ధ్రోణౖర్మధ్యమః పంచభిః స్మృతః | త్రిభిః కనిష్ఠో రాజేంద్ర తిలశైలః ప్రకీర్తితః || 152

పూర్వవచ్చాపరం సర్వవిష్కంభపర్వతాదికం | దానమత్రప్రవక్ష్యామి యథా చ నృపపుంగవ || 153

యస్మాన్మధువధే విష్ణోర్దేహస్వేదసముద్భవాః | తిలాః కుశాశ్చ మాషాశ్చ తస్మాచ్ఛాంతిప్రదో భవ || 154

హవ్యకవ్యేషు యస్మాచ్చ తిలా ఏవ హి రక్షణం | లక్ష్మీం చ కురు శైలేంద్ర తిలాచల నమోస్తు తే || 155

ఇత్యామంత్ర్య చ యో దద్యాత్తిలాచలమనుత్తమం | స వైష్ణవం పదం యాతి పునావృత్తిదుర్లభమ్‌ || 156

పది ద్రోణములుత్తమము. సగము మధ్యమము మూడు కనిష్టము. విష్కంభ పర్వతాదిక మంతయు నీ మున్ను జెప్పినట్లే. ఇక దానమంత్ర మావింపుము.

మధువను రాక్షసుని వధించినపుడు విష్ణువు మేని చెమటనుండి పుట్టినవి తిలలు (నువ్వులు) కుశలు (దర్భలు) మాషములు (మినుములు). కావున శాంతిననుగ్రహింపుము. దేవతల నుద్దేశించిన హవ్యమందు పితృ దేవతల నుద్దేశించు కవ్యమందు రక్షణమిచ్చునవి తిలలే. ఓ తిలపర్వత సార్వభౌమా! లక్ష్మిని (సంపదను) నాకు గూర్పుము నీకిదే నమస్కారము. ఈలా మంత్రము సెప్పి తిలాచలమిచ్చి నతడు పునావృత్తి లేని విష్ణుపదము (వైకుంఠము) నందును.

కార్పాసపర్వతశ్చైవ వింశద్భారైరిహోత్తమః | దశభిర్మధ్యమః ప్రోక్తః కనిష్ఠః పంచభిర్మతః || 157

భారేణాల్పధనో దద్యాద్విత్తశాఠ్యవివర్జితః | ధాన్యపర్వతవత్సర్వమాసాద్యం రాజసత్తమ||158

ప్రభాతాయాం చ శర్వర్యాం దద్యాదిదముదీరయేత్‌ | త్వమేవావరణం యస్మాల్లోకానామిహ సర్వదా || 159

కార్పాసాద్రే సమస్తస్మాదఫ°ఘద్వంసనో భవ | ఇతి కార్పాసశైలేంద్రం యో దద్యాచ్ఛర్వసంనిధౌ || 160

కార్పాన పర్వత దానము :- (పత్తి) ఇరువది పది యైదు భారముల పత్తి ఉత్తమ మధ్యమ కనిష్ట దానములుగా వర్ణింపబడినవి. బీదవాడొక్కటి మించి యీయవచ్చును. డబ్బు లోభము మాంత్రము పనికిరాదు. మిగతాదంతయు ధాన్యపర్వతమునట్లే. ఇది వేకువను లేక రాత్రి యీయవచ్చును. మంత్రము త్వమేవ---భవ అన్నదాక ఇట లోకులకావరణము నీవే. ఓ ప్రత్తి పర్వతమూర్తీ మా పాపములెల్ల ధ్వంసము సేయుము. అని శివసన్నిధిలో నీ దానము సేసినతడు రుద్రలోకమందు ఒక్క కల్పకాలముండును. 161

రుద్రలోకే వసేత్కల్పం తతో రాజా భ##వేదిహ | అథాతః సంప్రవక్ష్యామి ఘృతాచలమనుత్తమమ్‌ || 161

తేజోమయం ఘృతం పుణ్యం మహాపాతకనాశనం | వింశత్యా ఘృతకుంబానాముత్తమః స్యాద్‌ ఘృతాచలః|| 162

దశభిర్మధ్యమః ప్రోక్తః పంచభిస్త్వధమః స్మృతః | అల్పవిత్తోపి కుర్వీత ద్వాభ్యామిహ విధానతః || 163

విష్కమ్భపర్వతస్తద్వచ్చతుర్బాగేన కల్పయేత్‌ | శాలితండులపాత్రాణి కుంభోపరి నివేశ##యేత్‌ || 164

కారయేత్సంహతానుచ్చాన్యథాశోభం విధానతః | వేష్టయేచ్ఛుక్లవాసోభిరిక్షుదండ ఫలాదికైః || 165

ధాన్యపర్వతవత్సర్వం విధానమిహ పఠ్యతే | అధివాసనపూర్వం హి తద్వద్ధేమనురార్చనమ్‌ || 166

ప్రభాతాయాం చ శర్వర్యాం గురవే వినివేదయేత్‌ | విష్కంభపర్వతేభ్యస్తద్వదృత్విగ్భ్యః శాంతమానసః || 167

సంయోగాద్‌ ఘృతముత్పన్నం యస్మాదమృతతేజసీ | తస్మాద్‌ ఘృతార్చిర్విశ్చాత్మా ప్రీయతామత్ర శంకరః || 168

యస్మాత్తేజోమయం బ్రహ్మ ఘృతేచైవ వ్యనస్థితం | ఘృతపర్వతరూపేణ తస్మాన్నః పాహి భూధర || 169

అనేన విధినా దద్యాత్‌ ఘృతాచలమనుత్తమం | మహాపాతకయుక్తోపి లోకమాయాతి శాంభవమ్‌ || 170

ఘృతాచలదానము :- ఘృతము (ఆవునెయ్యి) తేజోమయము పుణ్యము మహాపాతక నాశనము. ఇరువది కడవలు ఉత్తమము పది మధ్యమము అయిదు అధమము, అల్పదని రెండు కడవలిచ్చిన జాలును. విష్కంభ పర్వతములను వానిలో నాలుగోవంతు నేతితో నేర్పరుపవలెను. శాలిధాన్యము నించిన పాత్రలు పైనుంచవలెను. వానిపై శోభగా విధిననుసరించి మూత లుంచవలెను. తెల్లని వస్త్రములచే వానిని కప్పవలెను. చెఱకుగడలు పండ్లతో వానినలంకరింపవలెను. మిగతాదెల్ల ధాన్య పర్వత విధానమే. అధివాసన పూర్వముగా బంగారు దేవతా ప్రతిమల నర్చించవలెను. ప్రభాతమందు వేకువగాని రాత్రిగాని గురువునకవి నివేదింపవలెను. వేకువను శాంతమనస్కుడై విష్కంభ పర్వతములను ఋత్విక్కులకీయవలెను. విశ్వాత్మ విశ్వరూపుడు ఘృతార్చి-నేతితో దీపించువాడు కావున నిది శంకరుడు ప్రీతినందు గావుత. తేజోమయము బ్రహ్మగావున అది నీరూపమున నీయందున్నదిగావున నో ఘృతపర్వతరాజమా మమ్ము రక్షింపుము. ఈ విధిని ఘృత పర్వతదానము సేయవలెను. మహాపాపియైన నిద్దానిచే శివలోకమందును. 170

హంససారసయుక్తేన కింకిణీజాలమాలినా | వినూనేనాప్సరోభిశ్చ సిద్ధవిద్యాధరైర్వృతః || 171

విచరేత్పితృభిః సార్ధం యావదాభూతసంప్లవం | అధాతః సంప్రవక్ష్యామి రత్నాచలమనుత్తమమ్‌ || 172

ముక్తాఫలసహస్రేణ పర్వతస్స్యాదనుత్తమః | మధ్యమః పంచశతికస్త్రిశ##తేనాధమః స్మృతః || 173

చతుర్ధంశేన విష్కంభపర్వతాః స్యుః సమంతతః | పూర్వేణ వజ్రగోమేదైర్దక్షిణనేంద్రనీలకైః || 174

పుష్యరాగైర్యుతః కార్యో విద్వద్భిర్గంధమాదనః | వైడూర్యవిద్రుమైః పశ్చాత్సంమిశ్రో విపులాచలః || 175

పద్మరాగైః ససౌవర్ణైరుత్తరేణాపి విన్యసేత్‌ | ధాన్యపర్వతవత్సర్వమత్రాపి పరికల్పయేత్‌ || 176

తద్వదావాహనం కృత్వా వృక్షాన్దేవాంశ్చ కాంచనాన్‌ | పూజయేత్పుష్పగంధాద్యైః ప్రభాతే స్యాద్విసర్జనమ్‌ || 177

పూర్వవద్గురుఋత్విగ్భ్యి ఇమం మంత్రముదీరయేత్‌ | యథా దేవగణాః సర్వే సర్వరత్నేష్వవస్థితాః || 178

త్వం చ రత్నమయో నిత్యమతః పాహి మహాచల | యస్మాద్రత్న ప్రదానేన తుష్టిమేతి జనార్ధనః || 179

పూజామంత్రప్రసాదేన తస్మాన్నః పాహి పర్వత | అనేన విధినా యస్తు దద్యాద్రత్నమయం గిరిమ్‌ || 180

స యాతి వైష్ణవం లోకమమరేశ్వరపూజితః | యావత్కల్పశతం సాగ్రం వసేత్తత్ర నరాధిప|| 181

రూపారోగ్యగుణోపేతః సప్తద్వీపాధిపో భ##వేత్‌ | బ్రహ్మహత్యాదికం కించిదత్రాముత్రాథవా కృతమ్‌ || 182

తత్సర్వం నాశమాయాతి గిరిర్వజ్రాహతో యథా | అథాతః సంప్రవక్ష్యామి రౌప్యాచలమనుత్తమమ్‌ || 183

హంసలు, సారసములుతో (బెగ్గురు పక్షులతో) కూడి చిఱుగంటల మ్రోయ పూలమాల లింపుగొల్పు విమానమునందప్సరసలతో సిద్దులు విద్యాధరులతో పితరులతో అభిమానమున భూతప్రళయము విహరించును. రత్నాచలదానము వేలకొలది ముక్తాఫలములతో నిర్మింపబడును (ముత్యాలకొండ) ఉత్తమము వేయి ముత్యాలతో మద్యమము అయిదు వందలు మూడువందల యేబదితో అధమము నిర్మింపవలెను. తూర్పున వజ్రములు గోమేదములు దక్షిణమున ఇంద్ర నీలములు పుష్యరాగములు పద్మ రాగములు పడమట వైడూర్యములు విద్రుమములు (పగడములు) ఉత్తరమున పద్మరాగములు గరుడమణులతో గంధమాదనమను పేర నీరత్న పర్వతము కూర్పవలెను. మిగిలినదంత ధాన్యపర్వతమున కిట్లే జరుపవలెను. అలాగే వృక్షములను దేవతలను ఆవాహనము సేసి గంధపుష్పాదులచే బూజించి ప్రభాతమందు విసర్జన మొనరింపవలెను. మున్నట్లు గురువునకు ఋత్విక్కులకు దానమీయవలెను సర్వదేవతలు సత్వరత్నాలయందున్నారు. నీవు రత్నమయుడవు కొండదేవతవు మమ్మెప్పుడు రక్షింపుము అను మంత్రము పఠించవలెను. రత్నదానముచే జనార్దనుడు సంతోషించును. మంత్రప్రసాదపూర్వకముగా పూజ జరిగినది కావున నోరత్నగిరీ! మమ్ము రక్షింపుము అని యిట్లు రత్నగిరినిచ్చినతడు దేవేశ్వరులచే బూజలందుకొనిరి. విష్ణులోకమున కేగును. నూరుకల్పములు పైగా నట నివసించును. రూపము ఆరోగ్యము సుగుణసంపద గలిగి సప్తద్వీపాధీశుడగును. బ్రహ్మ హత్యాదిపాతకమే కొంచెమిహమందు పరమందు చేసినదెల్ల వజ్రముచే (పిడుగుచే) కొండవలె సర్వము నశించును. ఈ పైని రౌప్యాచలదానము సెప్పెద.

యత్ప్రదానాన్నరో యాతి సోమలోకం నరోత్తమ | దశభిః పలసాహసై#్రరుత్తమో రజతాచలః || 183

పంచభిర్మధ్యమః ప్రోక్తస్తదర్ధేనాధమః స్మృతః | అశక్తో వింశ##తేరూర్ధ్వం కారయేచ్ఛక్తితః సదా || 185

విష్కంభపర్వతాం స్తద్వత్తురీయాం శేన కల్పయేత్‌ | పూర్వవద్రాజతాన్‌ కుర్యాన్మందరాదీన్విధానతః || 186

కలధౌతమయాంస్తద్వల్లోకేశాన్‌ కారయేద్‌ బుధః | బ్రహ్మావిష్ణ్వర్కవాన్కార్యో నితంబోత్ర హిరణ్మయః || 187

దీని వలన నరుడు సోమలోకమందును ఈ వెండికొండ పదివేల పలముల వెండితో జేసినది ఉత్తమము. అయిదు వేలది మధ్యమము. దానిలోసగమధమము. శక్తిలేనివారు ఇరువది పలములపైగా వెండితో చేయింపవలెను. వానిలో నాలుగోవంతుగొని విష్కంభ పర్వతాలు సేయవలెను. లోగడవలె మందరాది పర్వతములను వెండితో యధావిధి జేయవలెను. తెలిసినతడు వెండితో లోకపాలుర ముద్రలను జేయింపవలెను. ఈపర్వతము నితంబమునందు (పిరిదిభాగము) బంగారముతో బ్రహ్మవిష్ణు సూర్యుల ప్రతిమలను గూర్చవలెను.

రాజతం స్యాత్తదన్యేషాం పర్వతానాం చ కాంచనం | శేషం చ పూర్వత్కుర్యాద్దేమజాగరణాదికమ్‌ || 188

దద్యాత్తద్వత్‌ ప్రభాతౌ తు గురవే రౌప్యపర్వతం | విష్కంభ##శైలమృత్విగ్భ్యః పూజ్యవస్త్రవిభూషణౖః || 189

ఇమం మంత్రం పఠన్దద్యాద్దర్భపాణిర్విమత్సరః | పితౄణాం వల్లభం యస్మదిన్దోర్వై శంకరస్య చ 190

రజతం పాహి తస్మాన్నః శోకసంసారసాగరాత్‌ | ఇత్థం నివేశ్య యే దద్యాద్రజతాచలముత్తమమ్‌ || 191

గవామయుతసాహస్రఫలమాప్నోతి మానవః | సోమలోకే సగంధ ర్వైఃకిన్నరప్సరసాం గణౖః || 192

పూజ్యమానో వసేద్విద్వాన్యావదాభూతసంప్లవం | అథాతః సంప్రవక్ష్యామి శర్కరాచలముత్తమమ్‌ || 193

మిగిలిన పూజాది విధానము మున్ను పర్వతములకట్లు గావింపవలెను. వెండి కొండను ప్రభాతమందు గురువున కీయవలెను. విష్కంభ##శైలము ఋత్విక్కులకు వస్త్రభూషణాదులచే నర్చించి యీయవలను. ఆ రౌప్యపర్వతము గురువున కొసగవలె. దర్భను చేతబూని యీ మంత్రము పఠించుచు మచ్చరము గొనక నిదితయీయవలెను. ఈ రజతము (వెండి) పితరులకు చంద్రునికి శంకరునికెంతో యిష్టముగదా! ఓ రజతపర్వతరాజా! శోక సంసారసాగరమునుండి మమ్ముద్ధరింపుము. అని యిట్లుంచి వెండికొండ నర్పించినతడు పదివేల గోవులనిచ్చిన ఫలమందును. సోమగంధర్వులు కిన్నరు లప్సరసలగణములతో పూజలందుచు జ్ఞానియై ప్రళయము దాక వసించును.

యస్య ప్రదానాద్విష్ణ్వర్కరుద్రాస్తుష్యంతి సర్వదా | అష్టభిః శర్కరాభారైరుత్తమః స్యాన్మహాచలః || 194

చతుర్భిర్మధ్యమః ప్రోక్తో భారాభ్యామధమః స్మృతః | భారేణ చార్ధభారేణ కుర్యాద్యః స్వల్పవిత్తవాన్‌ || 195

విష్కంభపర్వతాన్కుర్యాత్తురీయాంశేన మానవః | ధాన్యపర్వతవత్సర్వం హైమాంబరసుసంయుతమ్‌ || 196

మేరోరుపరితః స్థాప్యం హైమం తత్ర తరుత్రయం | మందారః పారిజాతశ్చ తృతీయః కల్పపాదపః || 197

ఏతద్వృక్షత్రయం మూర్ధ్ని సర్వేష్వపి నివేశ##యేత్‌ | హరిచందనసంతానే పూర్వపశ్చిమభాగయోః || 198

నివేశ్యో సర్వశైలేషు విశేషాచ్ఛర్కరాచలే | మందరే కామదే వస్తుప్రత్యగ్వక్తృః సదా భ##వేత్‌ || 199

గంధమాదనశృంగే తు ధనదః స్యాదుదఙ్ఞ్ముఖః | ప్రాజ్ఞ్ముఖే వేదమూర్తిస్తు హంసః స్వాద్విపులాచలే || 200

హైమీ భ##వేత్సుపాశా తు సురభీ దక్షిణాముఖీ | ధాన్యపర్వతవత్సర్వ మావాహనమఖాదికమ్‌ || 201

కృత్వాథ గురవే దద్యాన్మధ్యమం పర్వతోత్తమం | ఋత్విగ్భిశ్చతురః శైలానిమాన్మం త్రానుదీరయేత్‌ || 202

శర్కరాచలము (చక్కరకొండ) దానము, దీనివలన విష్ణు సూర్యరుద్రులు సంతోషింతురు. ఎనిమిది నాలుగు రెండు భారముల పంచదారతో నిది మూడు సామాన్యుడొక్కటి లేక సగముతో చేయవచ్చును.నాలుగోవంతుచే విష్కంభపర్వతములు నిల్వవలెను. బంగారు జరీవస్త్రము కప్పవలెను. మిగిలిన కలాపము ధాన్యపర్వతమట్లే, మేరువుపై బంగారుచెట్లు నిల్వవలెను. (ప్రతిమలుగా) మందారము పారిజాతము కల్పము, హరిచందనము తూర్పున సంతానముంచవలె. శర్కర పర్వతములందు తప్పక యుంచనగును. మందరమున దేవత కాముడు (మన్మధుడు) పడమటి భాగముగా నుండవలెను. గంధమాదన శిఖరమును కుబేరుడు ఉత్తరాభిముఖుడుగ మధ్యమును విపులమను పర్వతముననుంచి తూర్పు ముఖమై వేదమూర్తిహంసను, దక్షిణముఖముగ సురభి (కామధేనువు) బంగారపు పలువుతో దక్షిణాభిముఖముగ నుంచవలెను. ధాన్యపర్వతమునట్లు ఆవాహనాదులు చేసి గురువునకీయవలెను. నాల్గు విష్కంభపర్వతములను ఋత్విక్కుల కీయవలెను. అచట నీమంత్రములను జదువవలెను. 202

సౌభాగ్యానృతసారోయం పరమః శర్కరాచలః | తస్మాదానందకారీ త్వం భవ శైలేంద్ర సర్వదా || 203

అమృతం పిబతాం యే తు పతితా భువి శీకరాః | దేవానాం తత్సమృద్ధస్త్వం పాహి నః శర్కరాచల || 204

మనోభవధనుర్మధ్యాదుద్భూతా శర్కరా పునః | తన్మయోసి మహాశైల పాహి సంసారసాగరాత్‌ || 205

యే దద్యాచ్చర్కరాశైలమనేన విధినా నరః | సర్వపాపవినిర్ముక్తః ప్రయాతి బ్రహ్మమందిరమ్‌ || 206

ఈ చక్కెర కొండ పరమ సౌభాగ్యామృతసారము. అందుచే నామూర్తిగొన్న నీవెల్లపుడు నాకానందము కూర్పుము. దేవతలమృతమును ద్రావునపుడు చిందులు భూమిపై పడెను. వానిచే సర్వసమృద్ధుడైన పర్వతమూర్తివి నివు నన్ను సంసార సాగరము నుండి కాపాడుము. అను మంత్రముచే నీదానముచేసినతడు సర్వపాపము వెడలి బ్రహ్మమందిరమునకేగును. 206

చంద్రసూర్యప్రతీకాశమధిరుహ్యానుజీవిభిః | సమైవ యాసముత్తిష్ఠేత్తతో విష్ణుప్రభోదివి || 207

తతః కల్పశతాంతే తు సప్తద్వీపాధిపో భ##వేత్‌ | ఆయురారోగ్యసంపన్నో యావజ్జన్మాయుత త్రయమ్‌ || 208

చంద్రసూర్యప్రభ##మైన విమానమెక్కి తనపై నాధారపడి బ్రతుకు జనముతో గూడ విష్ణువలె ప్రకాశించుచు వైకుంఠమున భాసించును. నూరుకల్పములట్లుండి సప్తద్వీపాధిపతియగును. ముప్పదివేల జన్మములు ఆయురారోగ్యసంపన్నుడై రాణించును. 208

భోజనం శక్తితః కుర్యాత్సర్వశైలేష్వమత్సరః | స్వయం చాక్షారలవణమశ్నీయా త్తనుజ్ఞయా || 209

పర్వతోపస్కరాన్సర్వాన్ప్రాపయేద్బ్రాహ్మణాలయం | ఏతత్తే సర్వమాఖ్యాతం శైలదానమనుత్తమమ్‌ || 210

ఈ పర్వతదానములన్నిటియందు యథాశక్తి మాత్సర్యము గొనక యధాశక్తి నుప్పుకారము లేకుండ బ్రాహ్మణానుజ్ఞ గొని తాను భోజనము సేసి వారి యిండ్లకు సర్వసామాగ్రి పంపవలెను. సర్వశైలదానము పరమోత్తమము. నీకు తెలిపితిని. ఇంక నీవేది యిష్టమడుగుమది భీష్మప్రభూ నీకు తెల్పితి నన భీష్ముడు ఇట్లనియె. 210

యదన్యద్రోచతే తుభ్యం తన్మాం పృచ్ఛస్వ పార్థివ | భీష్మ ఉవాచ :- భగవన్భవసంసారసాగరోత్తారకారకమ్‌ 211

సంసారసాగరాత్తోవకము ఆరోగ్యకరము చిన్న వ్రతమొకటి ఆనతిమ్మున పులస్త్యుడిట్లనియె : 211

కించిద్ర్వతం సమాచక్ష్వ స్వర్గారోగ్యఫలప్రదం | పులస్త్య ఉవాచ:-సౌరధర్మం ప్రవక్ష్యామి నామ్నా కల్యాణ సప్తమీమ్‌ || 212

విశోకసప్తమీం తద్వత్తృతీయాం ఫలసప్తమీం | శర్కరాసప్తమీం కుర్యాత్తధా కమలసప్తమీమ్‌ || 213

మందారసప్తమీం షష్ఠీం సప్తమీం శుభసప్తమీం | సర్వాః పుణ్యఫలాః ప్రోక్తాః సర్వదేవర్షి పూజితాః || 214

సౌరధర్మమిదివినుము. కల్యాణ సప్తసప్తమీ వ్రత విధ్యుపాసన విషయము సప్తమి తిధియందు చేయవలసిన ఆరాధనలివి. కల్యాణ సప్తమ మొదలగు సప్తసప్తములు (ఏడు రకములు) అన్నియు పుణ్యమిచ్చునవి. దేవతలు పూజించునవి.

విధానమాసాం వక్ష్యామి యథావదానుపూర్వశః | యథా తు శుక్లసప్తమ్యామాదిత్యస్య దినం భ##వేత్‌ || 215

సా తు కల్యాణినీ నామ విజయా చ నిగద్యతే | ప్రాతర్గవ్యేన పయసా స్నానం నద్యాం సమాచరేత్‌ || 216

శుక్లాంబరధరః పద్మమక్షతైః పరికల్పయేత్‌ | ప్రాఙ్ఞ్ముఖోష్టదలం మధ్యే తద్వద్వృత్తాం చ కర్ణికామ్‌ || 217

పుష్పాక్షతాభిర్దేవేశం విన్యసేత్సర్వతః క్రమాత్‌ | పూర్వేణ తపనాయేతి మార్తాండాయేతి వై తతః || 218

యామ్యే దివాకరాయేతి విధాత్ర ఇతి నైఋతే | పశ్చిమే వరుణాయేతి భాస్కరాయేతి చానిలే 219

వికర్తనాయేతి దేవాయేత్యష్టమే దలే | ఆదావంతే చ మధ్యే చ నమోస్తు పరమాత్మనే || 220

మంత్రైసై#్తస్సమభ్యర్చ్య నమస్కారాంతదాపితైః | శుక్లైర్వసై#్త్రః ఫలై ర్భక్ష్యైర్ధూపమాల్యానులేపనైః || 221

స్థండిలే పూజయేద్భక్త్యా గుడేన లవణన వై | తతో వ్యాహృతిమంత్రేణ విసృజ్య ద్విజపుంగవాన్‌ || 222

వీని విధాన సక్రమముగా చెప్పెదను. శుక్లపక్షములో భానువారము సప్తమి కలిసివచ్చనప్పుడది కల్యాణిసప్తమి విజయసప్తమి యనబడును. ప్రాతః కాలమున ఆవుపాలతో నదీ స్నానము చేయవలెను తెల్లని వస్త్రములు ధరించి యక్షతలతో తూర్పు ముఖముగా కూర్చుండి అష్టదళ పద్మము నడుమ గుండ్రని కర్ణికతో గూర్పవలెను. పూలతో నక్షతలతో చుట్టును సూర్యభగవానుని న్యాసము చేయవలెను. తూర్పున దివాకరాయ, దక్షిణమున మార్తాండాయ నైరుతిని దివాకరాయ పడమట దివాకరాయ వాయవ్య మూల ఉత్తరమున కర్తనాయ వాయవ్యమున 8వ రేకున దేవాయ యని మొదట మధ్య చివర నమోస్తు పరమాత్మనే అని మంత్రములచే నర్చించి సూర్యనమస్కారములుచేసి తెల్లని వస్త్రములచేత పండు భక్ష్యములచే, గంధముచే మాలలచే దూపదీపములచే స్థండిలమున (అరుగుమీద) బెల్లముచే గాని యుప్పుచేగాని భక్తితో సూర్యభగవానునర్చింపవలెను. ఆపై వ్యాహృతి మంత్రముతో.

శక్తితస్తర్పయోద్భక్త్యా గుడక్షీరఘృతాదిభిః | తిలపాత్రం హిరణ్యం చ బ్రాహ్మణాయ నివేదయేత్‌ || 223

ఏవం నియమకృత్సుప్త్యా ప్రాతరుత్థాయ మానవః | కృతస్నానజపో విపై#్రః సహైవ ఘృతపాయసమ్‌ || 224

భుక్త్వా చ వేదవిదుషి వైడాల ప్రతివర్జితే | ఘృతపాత్రం సకనకం సోదకుంభం నియేదయేత్‌ || 225

ప్రీయతామత్ర భగవాన్పరమాత్మా దివాకరః | అనేన విధినా సర్వం మాసి మాసి సమాచరేత్‌ || 226

బ్రాహ్మణోత్తములను విసర్జించి యథాశక్తి భక్తితో బెల్లము పాలు నెయ్యి మొదలయిన వానితో వారికి సంతర్పణము సేయవలెను. తిలపాత్రమ బంగారమును బ్రాహ్మణునికి సమర్పింప వలెను. ఈలా నియమానుసారము సేసి ప్రొద్దున లేచి స్నానజపాదులు సేసికొని విప్రులతో నేయిపాయసముతో భోజనముసేసి బిడాల వ్రతములోలేని బ్రాహ్మణ విద్వాంసునికి నేయి పాత్రను నీటి బిందెతో దివాకరుడు సూర్యభగవానుడు ప్రీతిసెందుగాక యని నివేదింప వలెను. ఈలా ప్రతి మాసమున సప్తమినాడు సేయవలెను. 226

తతస్త్రయోదశే మాసి గాశ్చ దద్యా త్త్రయోదశ | వస్త్రాలంకారసంయుక్తాః స్వర్ణశృంగాః పయస్వినీః || 227

ఏశామపి ప్రడద్యాచ్ఛ విత్తహీనో విమత్సరః | న విత్తశాఠ్యం కుర్వీత యతో మోహాత్సత్యథః || 228

అనేన విధినా యస్తు కుర్యాత్కల్యాణసప్తమీం| సర్వపాపవినిర్ముక్తః సూర్యలోకే మహీయతే || 229

త్రయోదశినాడు మూడు పాలిచ్చుగోవులను వస్త్రాలంకారములతో బంగారు తొడుగుల కొమ్ములతో దానమీయవలెను. పేదవాడైనచో మాత్సర్యము గొనక యొక్కదానినైన యీయవలెను. పిసినిగొట్టు కాకూడదు. దానివలన నథోగతిపాలౌను. ఈలా కల్యాణసప్తమీ వ్రతము సేసినతడు సర్వపాపముక్తుడై సూర్యలోకమున విలసిల్లును. ఆయురారోగ్యైశ్వర్యము లక్షయముగా పొందును. 229

ఆయురారోగ్యమైశ్వర్యమనంతమిహ జాయతే | సర్వపాపహరా చేయం సర్వదైవతపూజితా || 230

సర్వదుష్టోపశమనీ సదా కల్యాణసప్తమీ | ఇమామనంత ఫలదాం యస్తు కల్యాణసప్తమీం || 231

శృణోతి యః పఠేద్వాపి స చ పాపైః ప్రముచ్యతే | విశోకసప్తమీం తద్వద్వక్ష్యామి నృపసత్తమ || 232

యాముపోష్య నరః శోకం న కదాచిదిహాశ్నుతే | మాఘే కృష్ణతిలైఃస్నాతః పంచమ్యాం శుక్లపక్షతః || 233

కృతాహారః కృసరయా దంతధావనపూర్వకం | ఉపవాసవ్రతం కృత్వా బ్రహ్మచారీ నిశి స్వపేత్‌ || 234

తతః ప్రభాత ఉత్ఠాయ కృతస్నానజపః శుచిః | కృత్వా తు కాంచనం పద్మమర్కాయేతి ప్రపూజయేత్‌ || 235

మాఘశుక్ల పంచమినాడు పండ్లతో నువ్వులతో స్నానము సేసి జపము సేసికొని జావమాత్రము త్రావి ఉపవాసవ్రత మూని బ్రహ్మచారియై రాత్రి పరుండవలెను. ఆపై తెల్లవారినంత లేచి స్నానజపాదులు సేసికొని శుచియై బంగారుపద్మమును చేసి ''అర్కాయ'' అని పూజించవలెను. 235

వీరేణ రక్తేన రక్తవస్త్రయుగేన చ | యథా విశోకం భువనం త్వయైవాదిత్య సర్వదా || 236

తదా విశోకతా మేస్యాత్త్వద్భక్తిః ప్రతిజన్మ చ | ఏవం సంపూజ్య షష్ట్యాం తు భక్త్యా సంపూజయేద్విజాన్‌ || 237

స్వయం సంప్రాశ్య గోమూత్రముత్థాయ కృతనైత్యకః | సంపూజ్య విప్రాన్యత్నేన గుడపాత్రసమన్వితమ్‌ || 238

సద్వస్త్రయుగ్మం పద్మం చ బ్రాహ్మణాయ నివేదయేత్‌ | అతై లలవణం భుక్త్వా సప్తమ్యాం మౌనసంయుతః 239

తతః పురాణశ్రవణం కర్తవ్యం భూతిమిచ్ఛతా | అనేన విధినా సర్వముభయోరపి పక్షయోః || 240

కుర్యాద్యావత్పునర్మాఘశుక్లపక్షస్య సప్తమీ | వ్రతాంతే కలశం ధద్యాత్సువర్ణకమలాన్వితమ్‌ || 241

శయ్యాం సోపస్కరాం దద్యాత్కపిలాం చ పయస్వినీం | ఆనేన విధినా యస్తు వితశాఠ్యేన వర్జితః || 242

విశోకసప్తమీం కుర్యాత్స యాతి పరమాం గతిం | యావజ్జన్మంసహస్రాణం సాగ్రం కోటిశతం భ##వేత్‌ || 243

తావన్న శోకమప్నోతి రోగదౌర్గత్యవర్జితః | యం యం కామయతే కామం తం తం ప్రాప్నోతి పుష్కలమ్‌ || 244

నిష్కామం కురుతే యస్తు స పరం బ్రహ్మ గచ్ఛతి | యః పఠేచ్ఛ్రుణుయాద్వాపి విశోకాఖ్యాం తు సప్తమీమ్‌ ||245

సోపీంద్రలోకమాసాద్యన దుఃఖీ జాయతే క్వచిత్‌ | అన్యామపి ప్రవక్ష్యామి నామ్నా తు ఫలసప్తమీమ్‌ || 246

యాముపోష్య నరః పాపైర్విము క్తః స్వర్గభాగ్భవేత్‌ | మార్గశీర్షే శుభే మాసి పంచమ్యాం నియతవ్రతః || 247

షష్ఠీముపోష్య కమలం కారయిత్యా తు కాంచనం | శర్కరసంయుతం దద్యాద్ర్బాహ్మాణాయ కుటుంబినే 248

ఎర్రకరవీరపువ్వులతో ఎఱ్ఱ వస్త్రముల చావుతో ఆదిత్యా ! నీచేత నెల్లపుడు లోకము శోకరహితమగునో యిట్లు నాకు శోకము లేకుండుగావుత. నీపై ప్రతి జన్మమందు భక్తి నాకుండుగాక, అని షష్టియందు పూజించి బ్రహ్మణులను బూజింపవలె. బెల్లము పాత్రములతో బూని యిట్లు పూజించి మంచి వస్త్రముల చావు పద్మమును బ్రాహ్మణునికి సమర్పింపవలెను. నూనె ఉప్పు లేకుండ సప్తమియందు భోజనము సేసి మౌనముని పురాణ శ్రవణము సేయవలెను. ఐశ్వర్యము కోరునతడు చేయవలసినది. ఇట్లు రెండు పక్షములందు సేయవలె తిరిగి మాఘ శుక్ల సప్తమిదాక సేయవలెను. వ్రతము చివర బంగారు కమలముతో చెంబును,పరుపుతో శయ్యను, పాలిచ్చు కపిలగోవును దానమీయవలెను. ఈలా లోభింపక యథావిధి యెనరించినతడు శోకము పొందడు. రోగాది దురవస్థలందడు. ఏ కోరికలు లేనియతడు పరబ్రహ్మమునందును. ఇది చదివిన విన్నవాడుకూడ యింద్రలోకమందును ఇక దుఃఖము నొందడు.

ఫలసప్తమీ వ్రతము

మార్గశిర పంచమినాడు వ్రత సంకల్పమొనరించి షష్ఠినాడుపవసించి బంగారపు కమలము చేయించి పంచదారతో కుటుంబియగు బ్రాహ్మణుని కీయవలెను. 248

రూపం చ కాంచనం కృత్వా ఫలసై#్యకస్య దర్మవిత్‌ | దద్యాద్వికాలవేలాయాం భానుర్మే ప్రీయతామతి 249

శక్త్యా తు విప్రాన్‌ సంపూజ్య సప్తమ్యాం క్షీరభోజనం | కృత్వా కుర్యాత్పలత్యాగం యావత్స్యాత్కృష్ణసప్తమీ || 250

తాముపోష్యాథ విధివదనేనైవ క్రమేణ తు | తద్వద్ధేమఫలం దత్వా సువర్ణకమలాన్వితమ్‌ || 251

శర్కరాపాత్రసంయుక్తం వస్త్రమాలాసమన్వితం | సంవత్సరమనేనైవ విధినోభయసప్తమీమ్‌ || 252

ఒక పలము బంగారముతో సూర్యునిరూపుచేయించి భానువు నాయెడ ప్రీతినందుగాక యని విప్రుని కీయవలెను. 'దద్యాద్వికాలమేలాయామ్‌' శక్తి ననుసరించి విప్రులను పూజించి సప్తమినాడు పాలుమాత్రము త్రావి మార్గశిర బహుళ సప్తమిదాక పండు తినరాదు. ఈలా విశోకసప్తమీవ్రతము సేసినతడు పరమగతి నందును. కోట్లు వేలు జన్మలటనానందించును. నూతన వస్త్రములు పూలమాలలతో శర్కరాపాత్రదాన మీతీరున శుక్ల కృష్ణ సప్తములు రెండింటను జేయవలెను. ఈ మంత్రము జపింపవలెను.

ఉపోష్య దద్యాత్ర్కమశః సూర్యమంత్రముదీరయేత్‌ | భానురర్కోరవిర్బ్రహ్మా సూర్యః శక్రో హరిః శివః 253

శ్రీమాన్విభావసుస్త్వష్టా వరుణః ప్రీయతామతి | ప్రతిమాసం చ సప్తమ్యామేకైకం నామ కీర్తయేత్‌ || 254

ప్రతిపక్షం ఫలత్యాగమేతత్కుర్వన్సమాచరేత్‌ | వ్రతాంతే విప్రమిధునం పూజయేద్వస్త్రభూషణౖః || 255

శర్కరాకలశం దద్యాద్ధేమపద్మఫలాన్వితం | యధా న విఫలః కామస్త్వద్భక్తానాం సదా భ##వేత్‌ || 256

తథానంతఫలావాప్తిరస్తు మే జన్మజన్మని ఇమామనంతఫలదాం యః కుర్యాత్పలసప్తమీమ్‌ || 257

భూతభవ్యాంశ్చ పురుషాంస్తారయేదేకవింశతిం | యః శృణోతి పఠేద్వాపి సోపి కల్యాణభాగ్భవేత్‌ || 258

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే | సురాపానాదికం కించిదత్రాముత్ర చ వా కృతమ్‌ || 259

''భానురర్క'' ఇత్యాదిగ పండ్రెండు సూర్యనామములు. చైత్రాదిగ నొక్కొక్క పేరు జపింపవలెను ఫలమును త్యాగముచేసి యిలా చేసిన భక్తులకనంత ఫలమనగా మోక్షము గల్గును. అనంతఫలమే నాకు గలుగుగాక అన్న యీ మంత్రమును గూడ జపించవలెను. ఇది యనంతఫలదా సప్తమిని జేసిన ధన్యుడు ఇరువదియొక్క పూర్వము, రాబోవు తరముల వారిని గూడ యుద్దరించును. ఈ విషయమును చదివిన విన్న పుణ్యుడు కల్యాణ వంతుడగును. పాపముక్తుడై సూర్యలోకమందును. ఫలసప్తమి సురాపానాది పాపములనెల్ల నశింపజేయును. 259

తత్సర్వం నాశమాయాతి యః కుర్యాత్ఫలసప్తమీం | శర్కరాసప్తమీం వక్ష్యే తద్వత్కల్మషనాశినీమ్‌ || 260

ఆయురారోగ్యమైశ్వర్యం యయానంతం ప్రజాయతే | మాధవస్య సితే పక్షే సప్తమ్యాం నియతవ్రతః || 261

ప్రాతః స్నాత్వా తిలైః శుభైః శుద్దమాల్యానులేపనః | స్థండిలే పద్మమాలిఖ్య కుంకుమేన సకర్ణికమ్‌ ||262

తస్మిన్నమః సవిత్రేతి గంధపుష్మం నివేదయేత్‌ | స్థాపయేదుదకుంభం చ శర్కరాపాత్రసంయుతమ్‌ || 263

శుక్లవసై#్త్రరలంకృత్య శుక్లమాల్యానులేపనైః | స్వర్ణపుష్పసమాయుక్తం మంత్రేణానేన పూజయేత్‌ || 264

విశ్వవేదమయో యస్మాత్వం వేదేషు చ పఠ్యసేః | త్వమేవామృత సర్వస్వమతః శాంతిం ప్రయచ్ఛ మే || 265

పంచగవ్యం తతః పీత్వా స్వపేత్తత్పార్శ్వతః క్షితౌ | సౌరసూక్తం జపన్నాస్తే పురాణశ్రవణన చ 266

అహోరాత్రే గతే పశ్చాదష్టన్యూం కృతనైత్యకః | తత్సర్వం వేదవిదుషే బ్రాహ్మణాయ నివేదయేత్‌ || 267

భోజయేచ్ఛక్తితో విప్రాన్శర్కరాఘృతపాయసైః | భుంజీతాతైలలవణం స్వయమప్యథ వాగ్యతః || 268

అనేనవిధినా సర్వం మాసి మాసి సమాచరేత్‌ | సంవత్సరాంతే శయనం శర్కరాకలశాన్వితమ్‌ || 269

సర్వోపస్కరసంయుక్తం తథైకాంగాం పయస్వినీం | గృహంచ శక్తి మాన్దద్యాత్సమస్తోపస్కరాన్వితమ్‌ || 270

సహస్రేణాథ నిష్కాణాం కృత్వా దద్యాచ్ఛతేన వా | దశభిర్వా త్రిభిర్వాపి నిష్కేణకేన వా పునః || 271

పద్మం స్వశక్తితో దద్యాత్పూర్వవన్మంత్రపఠనం | విత్తశాఠ్యం న కుర్వీత కుర్వన్ధోషాన్సమశ్నుతే || 272

అమృతం పిబతో వక్రాత్సూర్యస్యామృతబిందవః | సముత్పేతుర్ధరణ్యాం యే శాలిముద్గేక్షవస్తు తే || 273

శర్కరాయా రస స్తస్మాదిక్షుసారోమృతాత్మవాన్‌ | ఇష్టా రవేరతః పుణ్యా శర్కరా హవ్యకవ్యయోః || 174

శర్కరాసప్తమీ చేయం వాజిమేధఫలప్రదా | సర్వదుష్టోపశమనీ పుత్రపౌత్రాదివర్దినీ || 275

యః కుర్యాత్పరయా భక్త్యా స పరంబ్రహ్మ గచ్ఛతి | కల్పమేకం వసేత్స్వర్గే తతో యాతి పరం పదమ్‌ || 276

ఇదమనఘ శృణోతియః స్మరేద్వా పరిపఠతీహ సురేశ్వరస్య లోకే | మతిమపి చ దధాతి సోపి దేవైరమరపురే పరిపూజ్యతే మునీంద్రైః 277

శర్కరాసప్తమీ వ్రతము

ఆయురారోగ్యైశ్వర్యము లనంతములగుట కిది చేయవలెను. మాఘ శుద్ద సస్తమినుండి చేయవలసినదిది. సర్వవేదమయుడవు నీవు వేదములందు పేర్కొనబడినవావు. అమృత సంపదయంతయు నీ స్వరూపమే కావున నాకు శాంతినిమ్ము అను నర్థముగల మంత్రమిది పఠింపవలెను. తక్కిన విధానమంతా లోగడ సప్తముల విధముగానే చేయవలె. సూర్యదేవుడమృతము త్రావుచుండనాయన ముఖమునుండి యమృతబిందువు రాలినవట. అవే శాలిధాన్యము, పెసలు, చెఱకుగా నేర్పడినవి. చక్కెర వానిరూపమే. కనుక యిది సూర్యభగవానుని కెంతో ఇష్టము. ఈ సప్తమీ వ్రతమశ్వమేధఫలమిచ్చును. హోమములందు దేవతలకు కవ్యములందు పితృదేవతలకిది ఎంతో ఇష్టము. సర్వపాపహరము. పుత్రపౌత్రాది వర్దని. ఈ శర్కరా సప్తమీవ్రతము ఫలశ్రుతిదాక చదువవలెను. 277

అతః పరం ప్రవక్ష్యామి తద్వతోమలసప్తమం | యస్యాస్సంకీర్తనాదేవ తుష్యతీహ దివాకరః || 278

వసంతామలసప్తమ్యాం సుస్నాతో గౌరపర్షపైః | తిలపాత్రే చ సౌవర్ణం నిధాయ కమలం శుభమ్‌ || 279

వస్త్రయుగ్మావృతం కృత్వా గంధపుషై#్పరథార్చయేత్‌ | నమస్తే పద్మహస్తాయ నమస్తే విశ్వధారిణ 280

దివాకర నమస్తేస్తు ప్రభాకర నమోస్తు తే | తతో ద్వికాలవేలాయాముద కుంభసమన్వితమ్‌ || 281

విప్రాయ దద్యాత్సంపూజ్య వస్త్రమాల్యావిభూషణౖః | శక్తితః కపిలాం దద్యాదలంకృత్య విధానతః || 282

అహోరాత్రే గతే పశ్చాదష్టమ్యాం బోజయేద్ద్విజాన్‌ | యథాశక్తి చ భుంజీత విమాంసం తైలవర్జితం || 283

ఆనేన విధినా శుక్లసప్తమ్యాం మాసిమాసి చ | సర్వం సమాచరేద్భక్త్య్‌ విత్తశాఠ్యవిర్జితః || 284

వ్రతాంతే శయనం దద్యాత్సువర్ణకమలాన్వితమ్‌ | గాశ్చ ప్రద్యాచ్ఛక్త్యా తు సువర్ణస్య పయస్వినః || 285

భాజనాసనదీపాదీన్‌ దద్యాదిష్టానుపస్కారాన్‌ | అనేన విధినా యస్తు కుర్యాత్కమలసప్తమీం || 286

లక్ష్మీమనంతామభ్యేతి సూర్యలోకే చ మోదతేః కల్పే కల్పే తతో లోకాన్‌ సప్త గత్వా పృథక్‌ పృథక్‌ || 287

అప్సరోభిః పరివృత స్తతో యాతి ఫరాం గతిం | పశ్యేదిమాం యః శృణుయాన్ముహుర్తే పఠేచ్ఛ భక్త్యాథ మతిం దదాతి 288

సోప్యత్ర లక్ష్మీ మమలామవాప్య గంధర్వవిద్యాధరలోకమేతి | అతః పరం ప్రవక్ష్యామి సర్వపాప ప్రణాశినీం || 289

కమలసప్తమీవ్రతము

చైత్ర వైశాఖ శుక్ల సప్తమినాడు చేయవలసినది. తెల్లావాలతోడి నీళ్లలో స్నానము సేయవలెను. నమస్తే పద్మ హస్తాయ 281 శ్లోకమిట మంత్రము. ద్వికాల వేళలో ప్రాత సంధ్య రాత్రి కాలములో రెండిటి సంధిలో నిందుదానాదికము సేయవలె. 289

సర్వకామప్రదాం పుణ్యాం నామ్నా మందారసప్తమీమ్‌ | మాఘస్యామలపక్షేతు పంచమ్యాం లఘుభుక్‌ నరః || 290

దంతకాష్టం తతః కృత్వా షష్టీముపవసేద్బుధః | విప్రాన్సంపూజయిత్యా తు మందారం ప్రార్దయేన్నిశి || 291

తతః ప్రభాత ఉత్థాయ కృత్వా స్నానం పునర్ధ్విజాన్‌ | భోజయేచ్ఛక్తితః కుర్యాన్మందారకుసుమాష్టకం || 292

సౌవర్ణం పురుషం తత్వత్పద్మహస్తం సుశోభనమ్‌ | పద్మం కృష్ణతిలైః కృత్యా తామ్రపత్రేష్టపత్ర కరే || 293

హేమమందారకుసుమైర్భాస్కరాయేతి పూర్వతః | నమస్కారేణ తద్వచ్చ సూర్యాయేత్యమలే దలే || 294

దక్షిణ తద్వదర్కాయ తధార్యమే చ నైఋతే | పశ్చిమే వేదధామ్నే చ వాయవ్యే చండభానవే || 295

పూష్ణే చోత్తరతః పూజ్య ఆనందాయేతి తత్పరమ్‌ | కర్ణికాయం చ పురుషః స్దాప్యః సర్వాత్మనేపి చ || 296

శుక్లవసై#్త్రః సమావేష్ట్య భ##క్ష్యైక్ష్వైర్మాల్యఫలాదిభిః | ఏవమభ్యర్ఛ్య తత్సర్వం దధ్యాద్వేదవిదే పునః || 297

భుంజీతాతై లలవణం వాగ్యతః ప్రాజ్ఞుఖో గృహీ | 298

అనేన విధినా సర్వం సప్తమ్యాం మాసి మాసి చ | కుర్యాత్సంవత్సరం యావద్విత్తశాఠ్యవివర్జితః || 299

ఏతదేవ వ్రతాంతే తు నిధాయ కలశోపరి | గోభిర్విభవతః సార్ధం దాతవ్యం భూతిమిచ్ఛతా || 300

నమో మందారనాథాయ మందారభవనాయ చ | త్వం రవే తారయస్వాస్మానస్మాత్సంసారసాగరాత్‌ || 301

అనేన విధినా యస్తు కుర్యాన్మందారసప్తమీం | విపాప్మా స సుఖీమర్తః కల్పం చ దివి మోదతే || 302

ఇమామఫ°ఘపటలభీషణధ్వాంతదీపికాం | గచ్ఛన్సంగృహ్య సంసారశర్వర్యాం న స్ఖలేన్నరః || 303

మందారసప్తమీమేతామీప్సితార్దఫలప్రదాం | యః పఠేచ్ఛ్రుణుయాద్వాపి సోపి పాపైః ప్రముచ్యతే || 304

మందార సప్తమీవ్రతము

మాఘశుద్ద పంచమి నారంభము - బంగారు మందారపువ్వు భాస్కరునకర్పింప వలెను. ఎనిమిది దిశలందు ఎనిమిది నామములు సెప్పబడినవి. కర్ణికయందపరమహావిష్ణుని నిలుపవలెను. (కేవల పరబ్రహ్మము) 304

అథాన్యామపి వక్ష్యామి శోభనాం శుభసప్తమీం | యాముపోష్య నరో రోగశోకౌఘాత్తు ప్రముచ్యతే || 305

పుణ్యమాశ్వయుజే మాసి కృతస్నాన జపః శుచిః | వాచయిత్వా తతో విప్రానారభేచ్ఛుభసప్తమీమ్‌ || 306

కపిలాం పూజయేద్భక్త్యా గందమాల్యానులేపనైః | నమామి సూర్యసంభూతామ శేషభువనాలయాం || 307

త్వామహం శుభకల్యాణి స్వశరీరవిశుద్ధయే | అథ కృత్వా తిలప్రస్థం తామ్రపాత్రేణ సంయుతమ్‌ || 308

కాంచనం వృషభం తద్వద్వస్తమాల్యగుడాన్వితం | సోపధానం చ విశ్రామభాజనాసనసంయుతమ్‌ || 309

ఫలైర్నానావిధైర్భక్ష్యైః ఘృతపాయససంయుతైః | దద్యాద్ధ్వికాల వేలాయామర్యమా ప్రీయతామతి || 310

పంచగవ్యం చ సంప్రాశ్య స్వపేద్భూమావసంస్తరే | తతః ప్రభాతే సంజాతే భక్త్యా సంతర్పయేద్ద్విజాన్‌ || 311

అనేన విధినా దద్యాన్మాసి మాసి సదా నరః | వాససీ వృషభం హైమం తద్వద్గాం కాంచనోద్భవామ్‌ || 312

సంవత్సరాంతే శయనమిక్షుదండగుడాన్వితం | తామ్రపాత్రే తిలప్రస్థం సౌవర్ణం వృషభం తథా || 313

దద్యాద్వేదవిదే సర్వం విశ్వాత్మా ప్రీయతామితి | అనేన విధినా విద్వాన్‌ కుర్యాద్యః శుభసప్తమీమ్‌ || 314

తస్య శ్రీర్విమలా కీర్తిర్భవేజ్జన్మని | అప్సరోగణగంధర్వైః పూజ్యమానః సురాలయే || 315

వసేద్గణాధిపో భూత్వా యావదాభూతసంప్లవమ్‌ | కల్పాదావవతీర్ణశ్చ సప్తద్వీపాధిపో భ##వేత్‌ || 316

భ్రూణహత్యాసహస్రస్య బ్రహ్మహత్యాశతస్య చ | నాశాయాలమియం పుణ్యా పఠ్యతే శుభసప్తమీ || 317

ఇమాం పఠేద్యః శృణుయాన్ముహూర్తం పశ్యేత్ర్పసంగాదపి దీయమానం |

సోప్యత్ర సర్వాఘవిముక్తదేహః ప్రాప్నోతి విద్యాధరనాయకత్వమ్‌ || 318

యావత్సమాస్సప్త నరః కరోతి యః సప్తమీం సప్తవిధానయుక్తాం |

స సప్తలోకాధిపతిః క్రమేణ భూత్వా పదం యాతి పరం మురారేః || 319

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

పుష్కరమాహాత్మ్యే ఏకవింశోధ్యాయః .

శుభసప్తమీ వ్రతము

ఆశ్వయుజ శుక్ల సప్తమినాడు ప్రారంభము చేయవలసినదిది. ఈ సప్తమీవ్రతములేడేండ్లు యథావిధి నొనరించిన పుణ్యుడు సప్తలోకాధీశ్వరుడై విష్ణువుయొక్క పరమపదమందును 319

ఇది సృష్టి ఖండమున పుష్కర మాహాత్మ్యమందు ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది.

Sri Padma Mahapuranam-I    Chapters