Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకోనత్రింశోధ్యాయః

-: వ్రతాధ్యాయము :-

పులస్త్య ఉవాచ : - తథైవాన్యత్‌ ప్రవక్ష్యామి సర్వకామఫలవ్రదం ||

సౌభాగ్యశయనం నామ యత్పురాణవిదో విదుః 1

పురా త్రిషు లోకేషు భూర్భువఃస్వర్మహాదిషు | సౌభాగ్యం సర్వభూతానామేకస్థమభవత్తదా|| 2

వైకుంఠం సర్వమాసాద్య విష్ణోర్వక్షస్థలే స్థితం | తతః కాలేన కియతా పునః సర్గవిధౌ నృప || 3

అహంకారావృతే లోకే ప్రధానపురుషాన్వితే | స్పర్ధాయాం చ ప్రవృద్దాయాం కమలాసనకృష్ణయోః || 4

పింగాకారా సముద్భూతా వహ్ని జ్వాలాతిభీషణా | తయాభితప్తస్య హరేర్వక్షసస్తద్వినిః స్మృతమ్‌ || 5

యద్వక్షఃస్థలమాశ్రిత్య విష్ణోః సౌభాగ్యమాస్థితం | రసరూపం న తద్యావదాప్నోతి వసుధాతలే || 6

ఉత్‌క్షిప్తమంతరిక్షాత్తు బ్రహ్మపుత్రేణ ధీమతా | దక్షేణ పీతమాత్రం తద్రూపలావణ్యకారకమ్‌ || 7

బలం తేజో మహాజ్జాతం దక్షస్య వరమేష్టినః | శేషం యదపతధ్భూమావష్టధా తద్ద్యజాయత || 8

-: వ్రతాధ్యాయము :-

పులస్త్యుడనియె:- సర్వాభీష్టములిచ్చు సౌభాగ్యశయనము అను వ్రతమును గూర్చి తెల్పెదను. మున్ను భూర్భువ స్స్వరాది లోకములందు సర్వభూతముల సౌభాగ్యమొక్కచో నెలవుకొన్నది. అది వైకుంఠమెల్లజొచ్చి విష్ణువు వక్షస్థలమునందున్నది. ఆపై కొంతకాలానికి సృష్టి జరుగునెడ, లోక ప్రధాన పురుషునితో కూడ అహంకారావృతమై నంత, బ్రహ్మకు కృష్ణునకు తగవురాగా నగ్నియందు భయంకరమగు నెఱ్ఱని యగ్నిజ్వాల లేచెను. దానిచే దపించిన హరియొక్క వక్షఃస్థలము మందట్లే నిలిచియుండెను. అది రస రూపమును (జలరూపమును) బొందలేకట్లేయుండి సౌభాగ్య రూపమైయున్నంత బుద్దిమంతుడు బ్రహ్మపుత్రుడు దక్షుడు రూపమును లావణ్యను గూర్చు దాని నెత్తి త్రాగినంత నా దక్షప్రజాపతికి బలము తేజస్సునెంతో కల్గినవి. ఆ త్రాగగా భూమిపై బడినంత నాచినుకు ఎనిమిది భాగములయ్యెను. 8

తతస్త్వోషధయో జాతాః సప్త సౌభాగ్యదాయికాః | ఇక్షవస్తరురాజశ్చ నిష్పావాశ్శాలిధాన్యకమ్‌ || 9

వికారవచ్చ గోక్షీరం కుసుంభం కుసుమం తథా | లవణం చాష్టమం తద్వత్సౌభాగ్యాష్టకముచ్యతే || 10

పీతం యద్ర్బహ్మపుత్రేణ యోగజ్ఞానవిదా పురా | దుహితా సాభవత్తస్మాద్యా సతీత్యభిధీయతే || 11

దాని నుండి ఓషధులేడు (మూలికలు) సౌభాగ్యమునిచ్చునవి జనించినవి - చెఱుకు నిష్పావములు, శాలిధాన్యము, పెరుగు, వెన్న మొదలగు రూపముల ఆవుపాలు, కుసుంభముపువ్వు ఎనిమిదవదిగ ఉప్పు నని సౌభాగ్యాష్టకమని పేరు. నెనిమిది వస్తువులు పుట్టినవి. యోగజ్ఞానమెఱిగినవాడు బ్రహ్మ కుమారుడు దక్షుడు తాగినందున నాయనకొక కూతురు సతియను పేర నుదయించెను.

లోకానతీత్య లాలిత్యాల్లలితా తేన చోచ్యతే | త్రైలోక్యసుందరీం దేవీముపయేమే పినాకధృత్‌ || 12

త్రివిశ్వ సౌభాగ్యమయీం భుక్తిముక్తిఫలప్రదాం | తామారాధ్య పుమాన్భక్త్యా నారీ వా కిం న విందతి || 13

లోకములనెల్ల మించిన లాలిత్యము (సౌందర్యము) గలదౌట వలన నామెకతడే లలితాయను పేరు పెట్టెను.

త్రైలోక్య సుందరియగు నాదేనిని పినాకపాణి (శంకరుడు) వివాహమాడెను. సౌభాగ్య స్వరూపిణిని ఆ దేవిని ఆరాదించి నతడందని సౌభాగ్యమేమున్నది. 13

భీష్మ ఉవాచ : కథమారాధనం తస్యా లలితాయా మునే వద ||

యద్విధానం చ జగతః శాంతయే తద్వదస్వ మే | 14

పులస్త్య ఉవాచ : వసంతమాసమాసాద్య తృతీయాయాం జనప్రియః ||

శుక్లపక్షస్య పూర్వహ్ణే తిలైః స్నానం సమాచరేత్‌ | 15

భీష్మడనియె :- మునీశ్వర ! ఆ లలితాదేవి యారాధనమెట్టు సేయవలె. జగత్తునకు శాంతి కల్గుటకు విధానమదియానతిమ్మన పులస్త్యుడనియె. 15

తస్మిన్నహని సా దేవీ కిల విశ్వాత్మనా సతీ | పాణిగ్రహణికైర్మంత్రైరుదూఢా6 వరవర్ణినీ || 16

తయా నహైవ విశ్వేశం తృతీయాయామథార్చయేత్‌ | ఫలైర్నానావిధైర్దీపైర్ధూపైర్నై వేద్య సంయుతైః || 17

ప్రతిమాం పంచగవ్యేన తథా గంధోదకేన చ | స్నాపయిత్వార్చయేద్గౌరీమిందుశేఖరసంయుతామ్‌ || 18

వసంత ఋతువు రాగానే శుక్ల తృతీయ తిథియందు పూర్వాహ్ణమున నువ్వులతో స్నానము చేయవలెను. ఆనాడే కదా ఆ దేవీ సుందరి విశ్వాత్మ కుడగు శివునిచే పాణిగ్రహణ మంత్రములతో వివాహము సేసికొనబడినది. ఆమెతోగూడ విశ్వేశ్వరు నా తదియనాడు అర్చింపవలెను. రకరకాల పండ్లతో దూపదీపములతో నైవేద్యములతో నావేళ పూజింపవలెను. ఆ దేవతల ప్రతిమను పంచగవ్యముతో గంధజలములతో ఇందుశేఖరునితో గూడ గౌరీదేవినభిషేకించి యర్చింపవలెను. 18

నమోస్తు పాటలాయై తు పాదౌ దేవ్యాః శివస్య చ | శివాయేతి చ సంకీర్త్య జయాయై గుల్ఫయోర్ధ్వయోః || 19

త్ర్యంబకాయేతి రుద్రస్య భవాన్యై జంఘయోర్యుగం | శిరో రుద్రేశ్వ్రాయేతి విజయాయై చ జానునీ || 20

సంకీర్త్య హరికేశాయ తథోరువరదే నమః | ఈశాయేతి కటిం రత్యై శంకరాయేతి శంకరమ్‌ 21

కుక్షిద్వయం చ కోట్యై శూలినం శూలపాణయే | మంగలాయై నమస్తుభ్యముదరం చాభిపూజయేత్‌ ||22

సర్వాత్మనే నమో రుద్రమీశాన్యై చ కుచద్వయం | శివం వేదాత్మనే తద్వద్రుద్రాణ్యౖ కంఠమర్చయేత్‌ || 23

త్రిపురఘ్నాయ విశ్వేశమనంతాయై కరద్వయం | త్రిలోచనాయేతి హరం బాహుకాలానలప్రియే || 24

సౌభాగ్యభవనాయేతి భూషణాని సదార్చయేత్‌ | స్వాహా స్వధాయై చ ముఖమీశ్వరాయేతి శూలినమ్‌ || 25

అశోకవనవాసిన్యై పూజ్యావోష్ఠౌ చ భూతిదే | స్థాణవే చ హరం తధ్వదాస్యం చంద్రముఖప్రియే || 26

నమోర్దనారీశహరమసితాంగీతి నాసికాం | నమ ఉగ్రాయ లోకేశం లలితేతి పునర్ర్భువే|| 27

శర్వాయ పురహర్తారం వాసుదేవ్యై వాసుదేవ్యై తథాలకం | నమః శ్రీకంఠనాథాయ శివకేశాం స్తథార్చయేత్‌ || 28

భీమోగ్రభీమరూపిణ్యౖ శిరః సర్వాత్మనే నమః | హరమభ్యర్చ్య విధివత్సౌభాగ్యాష్టకమగ్రతః || 29

-: శ్రీ లలితా చంద్రశేఖరార్చనము :-

పాటలయై నమః (పాదౌ పూజయామి) దేవ్యాః శివస్య పాదౌ పూజయామి అని ప్రారంభించి పాదాదిశిరః పర్యంతము గల విధానమున నర్చింపవలెను. 29

స్థాపయేత్స్నిగ్ధనిష్పావాన్‌ కుసుంభక్షీరజీరకం | తరురాజేక్షులవణం కుస్తుంబురుమథాష్టమం || 30

దద్యాత్సౌభాగ్యకృద్యస్మాత్సౌభాగ్యాష్టకమిత్యుత | ఏవం నివేద్య తత్సర్వమగ్రతః శివయోః పునః || 31

చైత్రే శృంగాటకాన్ర్పాశ్య స్వపేద్భూమావరిందమ | పునః ప్రభాతే చ తథా కృతస్నానజపః శుచిః ||

32

సంపూజ్య ద్విఙదాంపత్యం మాల్యవస్త్రం విభూషణౖః | సౌభాగ్యాష్టకసంయుక్తం సౌవర్ణం ప్రతిమాద్వయమ్‌ || 33

ప్రీయతాం మేత్ర లలితా బ్రాహ్మణాయ నివేదయేత్‌ | ఏవం సంవత్సరం యావత్తృతీయాయాం సదా నృప || 34

శివపార్వతుల నిట్లలించి నైవేదము సమర్పించి చైత్రమున శృంగాటకముల భుజించి, ప్రాతఃకాలమున స్నానమును. జపమును ముగించుకొని శుచిగా ద్విజదంపతులను మాల్య, వస్త్రములతో పూజించి సౌభాగ్యాష్టకముతోని రెండు బంగారు బొమ్మలను ''లలితా ప్రసన్నురాలవుగాత'' యని బ్రాహ్మణునికి దానమివ్వవలెను. ఇట్లు ఓ రాజా! సంవత్సరకాలము ప్రతి తదియ చేయవలెను. ఇక ఆహార, మంత్రవిశేషములను వినుము.

ప్రాశ##నే దానమంత్రే చ విశేషోయం నిబోధ మే | గోశృంగాంబు మధౌ ప్రోక్తం వైశాఖే గోమయం పునః || 35

జ్యేష్టే మందారకుసుమం బిల్వపత్రం శుచౌ స్మృతం | శ్రావణ దధి సంప్రాశ్యం నభ##స్యే తు కుశోదకమ్‌ || 36

క్షీరం చాశ్వయుజే మాసి కార్తికే పృషదాజ్యకం | మార్గశీర్షే తు గోమూత్రం పౌషే సంప్రాశ##యేద్ఘృతమ్‌ || 37

మాఘే కృష్ణతిలాంస్తద్వత్పంచగవ్యం చ ఫల్గునౌ | లలితా విజయా భద్రా భవానీ కుముదా శివా || 38

వాసుదేవీ తథా గౌరీ మంగలా కమలా సతీ | ఉమా చ దానకాలే తు ప్రీయతామితి కీర్తియేత్‌ || 39

తస్మింస్తు ద్వాదశే మాసి ద్వదశ్యాం కృష్ణమర్చయేత్‌ | తథా లక్ష్మీంచ తత్రైవ భర్త్రా సార్ధమథార్చయేత్‌ || 40

ఆవుకొమ్ము ఉదకము చైత్రమందు, వైశాఖమునందావుపేడ, జ్యేష్ఠమున మందారపువ్వు, ఆషాఢమున మారేడాకు, పెరుగు శ్రావణమున, నభస్యమందు - భాద్రపదమున కుశోదకము, ఆశ్వయుజమున ఆవుపాలు, కార్తికమందు పృషదాజ్యము, మార్గశిరమున గోమూత్రము, పుష్యమందు ఆవునెయ్యి, మాఘమున నల్లనువ్వులు, పాల్గుణమందు పంచగవ్యము ప్రాశనము చేయవలెను. (తినవలెను) లలితా అన్న నామము మొదలు ఉమానామముదాక చైత్రాది ఫాల్గుణముదాక దేవనామములు పండెండ్రు చైత్రము మొదలు ఫాల్గునముదాక కీర్తించి ధ్యానములు సేయవలెను. పండ్రెండవ నెలలో ఫాల్గునములో ద్వాదశినాడు కృష్ణు నర్చింపవలెను. భద్రాసహితముగా నానాడు కృష్ణునితో లక్ష్మి నర్చించ వలెను. 40

పౌర్ణమాస్యామతస్తద్వత్సపత్నీకః పీతామహః | ఉపాసనీయో విదుషా పరత్రాభీతిమిచ్ఛతా || 41

సౌభాగ్యాష్టకం తద్వచ్చ దాతవ్యం భూతిమిచ్ఛతా | మల్లికాశోకకమలం కదంబోత్పలచంపకమ్‌ || 42

కుబ్జకం కరవీరం చ బాణమల్లానుపంకజం | సిందువారం చ సర్వేషు మాసేషు కుసుమం స్మృతమ్‌ || 43

జపాకుసుంభకుసుమం మాలతీ శతపత్రికా | యథాలాభం ప్రశస్తాని కరవీర్యం చ సర్వదా || 44

ఏవం సంవత్సరం యావదుపోష్య విధివన్నరః | స్త్రీ చ నక్తం కుమారీ చ శివమభ్యర్చ్య భక్తితః || 45

వ్రతాంతే శయనం దద్యాత్సర్వోపస్కరసంయుతం | ఉమామహేశ్వరౌ హైమౌ వృషభం చ గవా సహ || 46

పూర్ణిమనాడు బ్రహ్మను పత్ని సరస్వతితో పరలోకమందభయము కోరు జ్ఞాని యర్పింప వలెను. అలాగే సౌభాగ్యష్టకము ఐశ్వర్యము కోరువాడు దానమీయవలెను. అవి ఎనిమిది పువ్వులు : మల్లి, అశోకము, కమలము, కదంబము కడిమి, ఉత్పలము (కలువ), చంపకము, కుబ్జము, కరవీరము (గన్నేరు) బాణము-వాడని తామరపువ్వు, సిందువారము-వావిలి అన్నిమాసములందీయదగినదే. జపా=మందారము కుసుంభము (కుసుంబాపువ్వు) మాలతి శతపత్రిక ఈయవలసినవే. సంవత్సరముత దొరికినంతవరకు ఉపవాసముండి స్త్రీయును పెళ్లికాని పిల్లయు భక్తితో నిట్లు శివుని లలితను భక్తితోగొలిచి వ్రతసమాప్తియందు (ఉద్వాసనలో) సర్వోపస్కరములతో (సాధనసామగ్రితో) శయ్యాదానము సేయవలెను. 46

స్థాపయిత్వా చ శయనం బ్రాహ్మణాయ నివేదయేత్‌ | ద్వాదశ్యాం వత్సరం త్వేకం మహాలక్ష్మ్యా చ కేశవమ్‌ || 47

బ్రహ్మాణం సహ సావిత్ర్యా పూజయిత్యా నరస్త్విహ | సర్వాన్కా మానవాప్నోతి మనసా సమభీప్సితాన్‌ || 48

అన్యాన్యపి యథాశక్తి మిథునాన్యంబరాదిభిః | ధాన్యాలఙ్కారగోదానైరన్యైశ్చ ధనసఞ్చితైః || 49

విత్తశాఠ్యేన రహితః పూజయేద్గతవిస్మయః | ఏవం కరోతి యః సమ్యక్‌ సౌభాగ్యశయనవ్రతమ్‌ || 50

సర్వాన్కామానవాప్నోతి పదం వా నిత్యమశ్నుతే | ఫలసై#్యకస్య చ త్యాగమేతత్కుర్వన్సమాచరేత్‌ || 51

ఉమామహేశ్వరుల బంగారు విగ్రహములు, వృషభము, గోవుతో బ్రాహ్మణదానమును వీనిని స్థాపించి శయ్యాదానము సేయవలెను. సంవత్సరమెల్ల ద్వాదశినాడు కేశవుని మహాలక్ష్మితో, సావిత్రితో బ్రహ్మను నిలిపి పూజించి మానవుడెల్లకోరికలనందును యథాశక్తి మిధునములను (దంపతులను) వస్త్రాదులచే బూజించి ధాన్యము అలంకారములు = ఆభరణములు గోవులను మఱియుంగల ధనములను సమర్పించి లోభింపక వింతగొనక సమర్పింప వలెను. ఈలా సౌభాగ్యశయనవ్రత మాచరించినతడు సర్వాభీష్టములనందును. శాశ్వతపుణ్యలోకమందును. ఇందు ఫలమేదేనొకటి త్యాగము సేయుటయు చాలమంచిది. 51

యశః కీర్తి మవాప్నోతి ప్రతిమాసం నరాధిప | సౌభాగ్యారోగ్యరూపైశ్చ వస్త్రాలంకారభూషణౖః || 52

న వియుక్తో భ##వేద్రాజన్సౌభాగ్యశయనప్రదః | యస్తు ద్వాదశవర్షాణి సౌభాగ్యశయనవ్రతమ్‌ || 53

కరోతి సప్తచాష్టౌ వా బ్రహ్మలోకే మహీయతే | పూజ్యమానే వసేత్సమ్యక్‌ యావత్కల్పాయుతం నరః || 54

విష్ణోర్లోకమథాసాద్య శివలోకగతస్తథా ||

దానిచే యశస్సు కీర్తియునందును. సౌభాగ్యమారోగ్యము సౌందర్యముగొని వస్త్రాలంకారభూషణము లెడవడవక సౌభాగ్యశయనదానము చేసినతడు రంజిల్లును. ఎవడు పండెండ్రేళ్లు లేదా ఏడెనిమిదేండ్లు వ్రతమాచరించనతడు బ్రహ్మలోకమందు చక్కగ పూజింపబడుచు పదివేలకల్పములు విరాజిల్లును. ఆపై విష్ణులోకము (వైకుంఠము) నంది శివలోకమేగును. 54 1/2

నారీ వా కురుతే యా తు కుమారీ వా నరేశ్వర | సాపి తత్ఫలమాప్నోతి దేవ్యనుగ్రహలాలితా || 55

శ్రుణుయాదపి యశ్చైవ ప్రదద్యాదథ వా మతిమ్‌ | సోపి విద్యాధరో భూత్వా స్వర్గలోకే చిరం వసేత్‌ || 56

ఇదమిహ మదనేన పూర్వసృష్టం శతధనుషా చ కృతం నరేణ తద్వత్‌ | 57

కృతమథ పవనేన నందినా చ కిము జననాథ మహాద్భుతం న వా స్యాత్‌ || 58

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే వ్రతాధ్యాయో నామ ఏకోనత్రింశోధ్యాయః.

రాజా! స్త్రీ కాని, కుమారి (పెండ్లికానిది) కాని, లలితాదేవి యనుగ్రహలాలితమై యదేఫలమునందును. ఈ వ్రతవిధానము విన్నవాడును నిట బుద్ధినర్పించినవాడును విద్యాధరుడై (అమరుడై) స్వర్గలోకమందు చిరనివాసమందును. ఈ సౌభాగ్యవ్రతము సృష్టించినతడు మదనుడు (మన్మథుడు) శతధనుష్కుడు నరేశ్వరుడిది యాచరించెను. పవనుడు (వాయుదేవుడు) నందీశ్వరుడునొనరించెను. భీష్మరాజా ! మహాద్భుతముకాదాయిది. 58

ఇది వ్రతాధ్యాయము అను నిరువదితొమ్మిదవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters