Sri Padma Mahapuranam-I    Chapters   

మూడవ అధ్యాయము

కాలపరిణామాదివర్ణనమ్‌

భీష్మ ఉవాచ

నిర్గుణాస్యాప్రమేయస్య శుద్ధస్యాథ మహాత్మనః | కధం సర్గాది కర్త్రుం బ్రహ్మణోహ్యువ పద్యతే || 1

పులస్త్య ఉవాచ |

శక్తయ స్సర్వభావానా మచింత్యా జ్ఞానగోచరాః | యత్తతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్యా భావశక్తయః || 2

ఉత్పన్నః ప్రోచ్యతే విద్వాన్నిత్య ఏవోపచారతః | నిజేన తస్యమానేన ఆయుర్వర్షళతం స్మృతమ్‌ || 3

తత్పరాఖ్యం పరార్తంచ తదర్ధం పరికీ ర్తితమ్‌ | కాష్ఠా పంచదశాఖ్యాతా నిమిషో నృపనత్తమా || 4

కాష్ఠాస్త్రింశత్కాలా స్త్రింశత్కాలా మౌహూర్తికోవిధిః | తావత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషంస్మృతమ్‌ || 5

ఆహోరాత్రిణి తావంతి మాసః పక్షద్వయాత్మకః | తైః షడ్భిరయనం వర్షమయనే దోక్షిణోత్తరే || 6

ఆయనం దక్షిణం రాత్రి ర్దేవానా ముత్తరం దినమ్‌ | దివ్యైర్వర్ష సహసై#్రస్తు కృతేజితాది సంజ్ఞతమ్‌ || 7

చతుర్యుగం ద్వాదశభి స్తద్విభాగం నిబోధయే | చత్వారి త్రీణి ద్పేచైకం కృతాదిషు యథాక్రమమ్‌ || 8

దివ్యాబ్దానాం సహస్రాణి యుగేష్వాహుః పురావిదః | తత్ర్పమాణౖః శ##తైః సంధ్యా పూర్వాతత్రాభిధీయతే || 9

సంధ్యాంశకశ్చ తత్తుల్యో యుగస్థానాంతరో హి యః | సంధ్యా సంధ్యాంశయోరంతః కాలోయో నృపసత్తమ || 10

యుగాఖ్యః సతు విజ్ఞేయః కృతత్రేతాది సంజ్ఞితః | కృతంత్రేతా ద్వాపరంచ కలిశ్చైవ చతుర్యుగమ్‌ || 11

ప్రోచ్యతే తత్సమస్రంతు బ్రహ్మణో దివసం నృప | బ్రహ్మణో దివసే రాజన్‌ మనవశ్చ చతుర్దశ || 12

భవంతి పరిమాణంచ తేషాం కాలకృతం శ్రుణు | సప్తర్షయః సురాః శక్రో మనుస్తత్సూనవోనృప || 13

ఏకకాలేహి సృజ్యంతే సంహ్రియంతే స్వపూర్వవత్‌ | చతుర్యుగానాం సంఖ్యాతా సాధికాహ్యేక సప్తతిః || 14

మన్వంతరం మనోః కాలః సురాదీనాంచ పార్థివ | అష్ఠౌ శతసహస్రాణి దివ్యాయా సంఖ్యయా స్మృతః || 15

ద్విపంచాశత్తథాన్యాని సహస్రాణ్యధికానిచ | త్రింశత్కోట్యస్తు సంపూర్ణాః సంఖ్యాతాః సంఖ్యయానృప || 16

సప్తషష్టిస్తథాన్యాని నియుతాని మహామతే | వింశతిశ్చ సహస్రాణి పాలోయ మధికంవినా || 17

మన్వంతరస్య సంఖ్యేయం మానుషైరిహవత్సరైః | చతుర్దశ గుణోహ్యేషః కాలో బ్రహ్మమహః స్మృతః || 18

బ్రాహ్మో నైమిత్తికో నామ తస్యాంతే ప్రతిసంచరః | తదాహి దహ్యతే సర్వం త్రైలోక్యం భూర్భువాదికమ్‌ || 19

జనం ప్రయాంతి తాపార్తా మహర్లోక నివాసినః | ఏకార్ణేవేతు త్రైలోక్యే బ్రహ్మా బ్రహ్మవిదాంవర || 21

భోగిశయ్యాగతః శేతే త్రైలోక్యప్రాస బృంహితః | జనస్థైర్యోగి భిర్దేవ శ్చింత్యమానో జగద్విభుః || 22

సత్ర్పమాణాం హి తాం రాత్రిం తదంతే సృజతేపునః | ఏవంతు బ్రహ్మణో వర్షమేవం వర్షశతం చ తత్‌ || 23

శతం మి తస్య వర్షాణాం వరమాయుర్మహాత్మనః | ఏకమస్య ప్యతీతం తు పరార్థం బ్రహ్మణో%నధ || 24

తస్యాంతే7భూన్మహాకల్పః పాద్మ ఇత్వభి విశ్రుతః | ద్వితీయస్య పరార్థస్య వర్తమానస్య వై నృప || 25

వరాహ ఇది కల్పో7యం పరికల్పితః || 26

భీష్మ ఉవాచ

బ్రహ్మా నారాయణాఖ్యో7సౌ కల్పాదౌ భగవాన్‌యథా | ససర్జ సర్వభూతాని తదాచక్ష్వ మహామునే || 27

పులస్త్య ఉవాచ !

ప్రజా ససర్జ భగవాననాదిః సర్వసంభవః | అతీత కల్పావసానే నిశాసుప్తో స్థితః ప్రభుః || 28

విష్ణురూపం తదాజ్ఞాత్వా పృథివీం వోఢం స్వతేజసా | మత్స్య కూర్మాదికాం చాన్యాం హీం తనుమావిశత్‌ || 29

వేదయజ్ఞ మయం రూపమాశ్రిత్య జగతః స్థితౌ | స్థితః స్థిరాత్మా సర్వాత్మా పరమాత్మా ప్రజాపతిః || 30

ప్రవివేశ తదా తోయం తోయాధారే ధరాధరః || 31

నిరీక్ష్య తం తదాదేవీ పాతాళతల మాగతమ్‌ | తుష్టాచ ప్రణతా భూత్వ భక్తినమ్రా వసుంధరా || 32

-: పృథ్వీకృత వరాహస్తుతిః :-

పృథి వ్యువాచ

నమస్తే సర్వభూతాయ నమస్తే పరమాత్మనే || 33

మా ముద్ధరాస్మాదద్యత్వం త్వత్తో%హం పూర్వముత్థితా | పరమాత్మన్‌ సమసై#్తస్తు పురుషాత్మన్‌ నమోస్తుతే || 34

ప్రథాన వ్యక్తరూపాయ కాల భూతాయతే నమః | త్వం కర్తా సర్వభూతానాం త్వం పాతా వినాశకృత్‌|| 35

భీష్ముడిట్లనియె. ఏ గుణములేని బుద్ధికందని శుద్ధుడైన పరబ్రహ్మ సృష్ట్యాది వ్యాపారము సేయుట యెట్లు పొసగునని యడుగ పులస్త్యుం డిట్లనియె.

సర్వవస్తుపుల యొక్క శక్తులు మనసుసకందవు. జ్ఞానమునకు గోచరములగును. అందుచేత పరబ్రహ్మ యొక్క సృష్టి మొదలైన భావశక్తులు నిత్యసత్యమై పరతత్త్వమునందు స్వభావసిద్ధములు. నిత్యుడయ్యు పరమాత్మ పుట్టినాడని చెప్పుట జౌపచారికము. వస్తుతత్వబోధకు తాత్కాలికముగ జేయబడిన కల్పనమాత్రమన్నమాట. ఆ పరబ్రహ్మ యొక్క ఆత్మమానముచే నాయనకు నూరేండ్లాయుర్దాయమని చెప్పబడుచున్నవి. ఆ ఆయువు పరమని పరార్ధ మని దానిలోసగమని లెక్కింపబడును. ఆమానమిట్లు; పదునైదు కాష్ఠలొక నిమేషము. ముప్పది కాష్ఠలు ఒకకల ముప్పది కలలొక ముహూర్తము. ముప్పది ముహూర్తములొక దివసము (రాత్రి పగలునైన యొక రోజన్న మాట, ముప్పది యహోరాత్రములొక మాసము. అందు పక్షములు రెండు. పదునేను రోజులు శుక్లపక్షము. పదునేను రోజులు కృష్ణపక్షము. ఆ మాసము లారొక యయనము. అవే దక్షిణాయనము. ఉత్తరాయణము. దక్షిణాయనము దేవతలకు రాత్రి ఉత్తరాయణమువారికి పగలు. వేయి దివ్యవర్షములు కృత త్రేతా ద్వాపర కలియను నాల్గు కలిసి మహాయుగములు పండ్రెండు జరుగు కాలము దివ్యమహాయుగము. అట్టి నాల్గువేల దివ్యాబ్దములు కృతయుగము. మూడువేల దివ్యాబ్దములు త్రేతాయుగము, రెండువేల దివ్యసంవత్సరములు ద్వాపరము. ఒక్కవేయి దివ్య సంవత్సరములు కలియుగము. అదేలెక్కననుసరించిన నూరు దివ్యసంవత్సరములాయాయుగముల సంధికాలము. అది పూర్వ సంధ్య. సంధ్యాంశకాలము కూడ అంతే. సంధ్యాంశకకాలమనగా రెండు యుగముల చివరి భాగము, మొదటి భాగము కలిసినదన్న మాట. వేయిమహా యుగములు బ్రహ్మకొక్క పగలు. అందు మనువులు పదునల్గురు. సప్తర్షులు దేవతలు ఇంద్రుడు మనువు ఆయన కొడుకులు నేకకాలముననే సృజింపబడుదురు ఏకకాలమందే ఉపసంహరింపబడుదురు. 71 మహాయుగములు ఒక మన్వంతరము. మనువుయొక్క కాలమన్నమాట. అదే దేవతల యొక్కయు కాలము.

బ్రహ్మయొక్క నైమిత్తిక ప్రళయమందు ముల్లోకములు భూర్భువ స్స్వర్లోకములను పేరనున్నవి ప్రళయ కాలాగ్నిచే దగ్ధములగును. మహర్లోకవాసులు దానమడిసెదరు. ముల్ణోకములొకే సముద్రమయిన తరి బ్రహ్మ, బ్రహ్మ వేత్తలందగ్రేసరుడు ముల్లోకముల ప్రాసముచే నుపబృంహితుడై శేషశయ్యయందు పండుకొనును. జనలోకమందుండు యోగులాయనను ధ్యానించుచుందురు.

సర్గాదౌ యః పరోబ్రహ్మా విష్ణురుద్రాత్మ రూపధృక్‌ | భక్షయిత్వా చ సఫలం జగత్యేకార్ణవీకృతే || 36

శేషే త్వమేవ గోవింద చింత్యమానో మనీషిభిః | భవతో యత్పరం రూపం తన్నజానాతి కశ్చన || 37

అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః | త్వామారాధ్య పరం బ్రహ్మ యాతాముక్తిం ముముక్షవః || 38

వాసుదేవ మనారాధ్య కోహి మోక్షమవాప్స్యతి | యద్రూపం మనసా గ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః || 39

బుద్ధ్యాచ యత్పరిచ్ఛేద్యం తద్రూప మఖిలం తవ | త్వన్మయ్యహం త్వదాధారా తత్సృష్టా త్వాముపాశ్రితా || 40

మాధవీ మితి లోకో7యమభి ధత్తేతతో హి మామ్‌ | ఏవం సంస్తూయ మానస్తు పృథివ్యా పృథివీధరః || 41

సామస్వరధ్వనిః శ్రీమాన్‌ జగర్జ పరిఘర్ఘరమ్‌ | తతః సముక్షిప్త ధరాం స్వ దంష్ట్ర్యా మహావరాహః స్ఫుటపద్మలోచనః రసాతలాదుత్పుల పత్రసన్ని భః సముస్థితో నీల ఇవాచలో మహాన్‌ ||

ఉత్తిష్ఠతా తేన ముఖానిలాహం తదా ప్లవాంభో జనలోకసంశ్రియాన్‌ |

సనందనా దీనపకల్మషాన్‌ మునీం శ్చకార భూయోపి పవిత్రతాస్పదమ్‌ |

ప్రయాంతి తోయాని ఖురాగ్రవీక్షతే రసాతలే7థః కృతశబ్ద సంతతిః |

బలాహకానాంచ తతిస్తుతస్య శ్వాపానిలాస్తే పరితః ప్రయాంతి ||

ఉత్తిష్ఠత స్తస్య జలార్ద్రకుక్షే ర్మహావరాహస్య మహీం విదార్య |

విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థా మునయో జుషంతి |

జనేశ్వరాణాం పరమేశ కేశవ ప్రభు ర్గదాసంఘదరాసి చక్రధృత్‌ |

ప్రభూతినాశస్థితిహెతు రీశ్వర స్త్వమేవ నాన్యత్‌ పరమంచ యత్పదమ్‌ || 46

పాదేషు వేదా స్తప యూపదంష్ట్రా దంతేషు యజ్ఞాః శ్రుతయశ్చ వక్త్రే |

హుతాశజిహ్వొ7సి తనూరుహాణి దర్భాః ప్రభో యజ్ఞపుమాం స్త్వమేవ || 47

ద్యావాపృథివ్యో రతులప్రభావ యుదంతరం తద్వపుషా తవైవ |

వ్యాప్తం జగ ద్వాపి సమన్తమే త ద్ధితాయ విశ్వస్య విభోభవ త్వమ్‌ || 48

పరమాత్మా త్వమైవేకో నాన్యో7స్తి జగతః పతే | తవై ష మహిమా యేన వ్యాప్తమేత చ్చరాచరమ్‌ || 49

జ్ఞానస్వరూప మఖిలం జగ దేవత దబుద్దయః || 50

అర్థస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే తమసః ప్లవే | యేతు జ్ఞాతవిదః శుద్ధచేతస స్తే7ఖిలం జగత్‌ || 51

జ్ఞానాత్మకంప్రపశ్యంతి త్వద్రూపం పరమేశ్వర | ప్రసీద సర్వభూతాత్మన్‌ భవాయ జగత స్త్విమామ్‌ || 52

ఉద్ధరోర్వీమమేయాత్మ న్నిమగ్నా మబ్జలోచన | సత్వోదృక్తో7సి భగవన్‌ గోవింద పృథివీ మిమామ్‌ || 53

సముద్ధర భవాయేశ కురు సర్వజగద్ధితమ్‌ | ఏవం సంస్తూయ మానశ్చపరమాత్మా మహీధరః || 54

ఉజ్జహార క్షితిం క్షిప్రం సమీకృ త్వాచినోద్గిరీన్‌ | యథావిభాగాం భగవాననాదిః పురుషోత్తమః || 55

భూవిభాగం తతః కృత్వా సప్తద్వీపాం యథాతథామ్‌ | భూరాద్యాం శ్చతురో లోకాన్‌ పూర్వవత్‌ సమకల్పయత్‌ || 56

బ్రహ్మణ విష్ణునా పూర్వమేతదేవ ప్రదర్శితమ్‌ | తుష్టేన దేవదేవేన త్వం దేవః పురుషోత్తమః || 57

త్వయా మయా జగచ్చేదం ధార్యా పాలల్య్నాచ యతతః | ఏషాం త్వసుర ముఖ్యానాం పరో దత్తో మయాధునా || 58

దేవానాం హితకామేన హంతవ్యా స్తే త్వయావిభో | అహం సృష్టిం కరిష్యామి సాచ పాల్యా త్వయా విభో || 59

ఏవముక్తో గతో విష్ణు ర్దేవాదీ నసృజ ద్విభుః | అబుద్ధిపూర్వక స్తస్య ప్రాదుభ్భూత స్తమోమయః || 60

-: బ్రహ్మకృత నవవిధ సృష్టివర్ణనమ్‌ :-

తమో మోహోమహామోహ స్తామిస్రో హ్యంధసంజ్ఞికః | పంచధావస్థితః సర్గో ధ్యాయతస్తు మహాత్మనః || 61

బహిరంతశ్చాప్రకాశః సంవృతాత్మా నగాత కః | ముఖ్యావగా యత శ్చోక్తా ముఖ్యసర్గ స్తత స్త్వయమ్‌ || 62

తం దృష్ట్వా సాధకం సర్గ మమన్య దపరం ప్రభుః తస్యాభిధ్యాయతః సర్గ స్థిర్యక్‌స్రోతో7భ్యవర్తత || 63

యస్మాత్తిర్యక్‌ ప్రవృత్తిః స్యాత్తిర్యక్‌స్రోత స్తతః స్మృతః| పశ్వాదయస్తే విఖ్యాతా స్తమప్రాయా హ్యవేదినః || 65

ఉత్పథద్రోహిణశ్చైవ తే7జ్ఞానే జ్ఞానమానినః | అహంకృతా స్త్వహంమానా అష్టావింశతిధాత్మకాః |

అంతః ప్రకాశాస్తే సర్వ ఆవృతాస్తే పరస్పరమ్‌ || 65

తమ వ్యసాధకం మత్వా ధ్యాయతో7న్యస్తతో7భవత్‌ | ఊర్ధ్వస్రోత స్తతీయస్తు సాత్వికస్సమవర్తత || 66

తే సుఖప్రీతిబహుళా బహిరంత రనావ తాః | ప్రకాశా బహిరంతశ్చ ఊర్ధ్వస్రోతా స్తతః స్మృతాః || 67

తుష్టాత్మన స్తృతీయస్తు దేవసర్గస్తు సంస్కృతః | తస్మిన్‌ పరే7భవత్‌ ప్రీతి ర్నిష్పన్నే బ్రహ్మణ స్తదా 68

తతో7న్యం సతదా దధ్యౌ సాధకం సర్గముత్తమమ్‌ | అసాధకాంస్తు తాన్‌ జ్ఞాత్వా ముఖ్యసర్గాదిసంభవాన్‌ || 69

తదాభిధ్యాయత స్తస్య సత్యాబిధ్యాయినస్తతః | ప్రాదుర్భూత స్తదా వ్యక్తా దర్వాక్‌ స్రోతస్తు సాధకః || 70

యస్మా దర్వాక్‌ ప్రవర్తంతే తతో7ర్వాక్‌ స్రోతసస్తు-తే | తేచ ప్రకాశబహుళా స్త మోద్రిక్తా రజోధికాః || 71

తస్మాత్తే దుఃఖబహులా భూయోభూయశ్చకారిణః | ప్రకాశా బహిరంతశ్చ మనుష్యాః సాధకాశ్చతే || 72

పంచమో7నుగ్రహః సర్గంః స చతుర్ధా వ్యవస్థితః | విపర్యయేణ సిద్ధ్యాచ శక్త్యా తుష్ట్యా తథైవచ || 73

వివృత్తం వర్తమానాంచ తేన జానంతి వైపునః | భూతాదికానాం భూతానాం షష్ఠః సర్గః స ఉద్యతే || 74

తే పరిగ్రాహిణః సర్వే సవిభాగతరాస్తు తే | చోదనా జాప్యశీలాశ్చ జ్ఞేయా భూతాదికా స్తుతే || 75

ఇత్యేతే కథితాః సర్గాః షడత్ర నృపసత్తమ | ప్రథమో మహతః సర్గో ద్వితీయో బ్రహ్మణస్తు యః || 76

తన్మాత్రాణాం ద్వితీయస్తు భూత సర్గోహి సంస్మృతః | వైకారిక స్తృతీయస్తు సర్గశ్చైంద్రియకః స్మృతాః || 77

ఇత్యేష ప్రాకృతః సర్గః సంభూతో బుద్ధిపూర్వకః | ముఖ్యసర్గశ్చతుర్థస్తు ముఖ్యావై స్థావరాః స్మృతాః || 78

తిర్యక్‌ స్రోతశ్చ యః ప్రోక్త స్తిర్యగ్యో7న్యః స ఉచ్యతే | తతోర్ధ్వ్రస్రోతసాం షష్ఠో దేవసర్గస్తు స స్మృతః || 80

తతో7ర్వాక్‌స్రోతసాం సర్గః సప్తమః సతు మానుషః | అష్టమో7నుగ్రహః సర్గః సాత్విక స్తామసస్తు సః || 81

పంచైతే వైకృతాః సర్గాః ప్రాకృతాస్తు త్రయః స్మృతాః | ప్రాకృతో వైకృతశ్చైవ కౌమారో నవమః స్మృతః || 82

ఏతే తవ సమాఖ్యతా నవసర్గాః ప్రజాపతేః | ప్రాకృతా వైకృతాశ్చైవ జగతో మూలహేతవః || 83

సృజతో జగదీశస్య కీ మన్య చ్ర్ఛోతు మర్హంః 84

భీష్మ ఉవాచ |

సంక్షేపాత్‌ కథితాః సర్గా దేవాదీనాం గురో త్వయా | విస్తరాత్‌ శ్రోతుమిచ్ఛామి త్వత్తో మునివరోత్తమ || 85

పులస్త్య ఉవాచ |

కర్మభి ర్భావితాః సర్వే కుశలాకుశ##లైస్తు తే || 86

ఖ్యాత్యా తయా హ్యనిర్ముక్తాః సంహారే హ్యువసంహృతాః | స్థావరాంతాః సురాద్యాస్తు ప్రజా రాజం శ్చతుర్విధాః || 87

బ్రహ్మణః కుర్వతః సృష్ఠిం జజ్ఞిరే మాససా! స్మృతాః | తతో దేవాసుర పితౄన్‌ మానుషాంస్తు చతుష్టయమ్‌ || 88

సిసృక్షు రంభాం స్యేతాని స్వ మాత్మాన మయూయుజత్‌ | ముక్తాత్మన స్తతో జాతా దురాత్మానః ప్రజాపతేః || 89

సిసృక్షో ర్జఘనాత్‌ పూర్వం జజ్ఞిరే త్వసురాస్తతః | తత్యాజ తాం తత సృష్ట్వాన్తమో మాత్రాత్మికాం తనూమ్‌ || 90

సాతు త్యక్తా తనుస్తేన రాజేంద్రా భూ ద్విభావరీ | సిసృక్షు రన్య దేవస్యః ప్రీతిమాపుః తతః సురాః || 91

సత్వోద్రిక్తాః సముధ్పూతా ముఖతో బ్రహ్మణోనృప | త్యక్తా సాపి తనుస్తేన సత్వప్రాయ మభూద్ధినమ్‌ || 92

తతోహి బలినో రాత్రా వసురా దేవతా దివా | సత్వమాత్రాత్మికాంచైవ తతో7న్యాం జగృహేతనుమ్‌ || 93

పితృవన్మన్యమాసస్య పితర స్తస్య జజ్ఞిరే | ఉత్ససర్జ పితౄన్‌ కృత్వా తత స్తామపి స ప్రభుః || 94

సాచోత్సృష్టాభవత్‌ సంధ్యా దివనస్యాంతరా స్థితిః | రజోమాత్రాత్మికా మన్యాం జగృహే స తనుం తతః 95

రజోమాత్రోట్కటా జాతా మనుష్యాః కురుసత్తమ | తమ ప్యాసు స తత్యాబ తమ మాద్యాం ప్రాజాపతిః || 96

జ్యోత్సా సమభవచ్చాపి ప్రాక్సంధ్యాయా మధీయతే | జ్యోత్సాగమేతు బలినో మనుష్యాః పితర స్తథా || 97

రాజేంద్ర సంధ్యాసమయే తస్మాత్తే ప్రభవంతివై | జ్యోత్సా రాత్ర్యహనీ సంధ్యా చత్వార్థేతాని వై విభోః || 98

బ్రహ్మణస్తు శరీరాణి త్రిగుణోపాశ్రయాణి చ | రజోమాత్రాత్మికామేవ తతో7న్యాం జగృహేతనుమ్‌ || 99

తతః శుద్ధబ్రహ్మణ జజ్ఞే కోపస్తయా కృతః | క్షుతామో హ్యంధకారేతు సో7సృజద్భగవాంస్తతః || 100

విరూపా అత్తుకామాస్తే సమధావంత తంప్రభుమ్‌ | రక్షత్షామేష యైరుక్తం రాక్షసాస్తే తతో7భవన్‌ || 101

ఊచు ర్యక్షామ ఇత్యన్యే యే చ యక్షాస్తు తే7భవన్‌ | అతిభీతస్య తాన్‌ దృష్ట్యా కేశాః శీర్యంతి వేదసః || 102

హీనాశ్చ శిరసోభూయః సమారోహంతి తే శిరః | సర్పణాత్తే7భప న్సర్పా హీనత్వా దహయః స్మృతాః || 103

తతః క్రుద్ధేన వైస్రష్టా క్రోధాత్మానో వినిర్మితాః | వర్ణేన కపిశేనోగ్రా భూతాస్తే పిశితాశినః || 104

ధయతో గాం సముద్భూతా గంధర్వా స్తస్య తత్‌క్షణాత్‌ | పిబంతో జజ్ఞిరే వాచం గంధర్వాస్తేన తే7భవన్‌ || 105

ఏతాని సృష్ట్యా భగవాన్‌ బ్రహ్మాతచ్ఛక్తి చోదితః | తతః స్యచ్ఛందతో7న్యాని వయాంసి వయసో7సృజత్‌ || 106

అవయో వక్షస శ్చర్రే ముఖతోయాంశ్చ నృష్టవాన్‌ | సృష్టవానుదరా ద్గాశ్చ మహిషాంశ్చ ప్రజాపతి || 107

పద్ఢ్యాంచాశ్వాన్‌ స మాతంగాన్‌ రాసభాన్‌ గవయాన్‌మృగాన్‌ | ఉష్ణ్రానశ్వ తరాంశ్చైవ న్యంకూనన్యాశ్చజాతయ || 108

ఔషధ్యః ఫలమూలిన్యో రోమభ్య స్తస్య జజ్ఞిరే | త్రేతాయుగముఖే బ్రహ్మా కల్పస్యాదౌ నృపోత్తమ || 109

సృష్ట్వా పశ్వౌషధీః సమ్యక్‌ యుయోజ స తదాధ్వరే | గ్రామజం మహిషం మేష మశ్వాశ్వతరగర్ధభాన్‌ || 110

ఏతాన్‌ గ్రామ్యపశూ నాహు రారణ్యాంశ్చ నిబోధమే | శ్వాపదో ద్విఖురో హస్తీ వానరః పంచమః ఖగః || 111

ఉష్ట్రకాః పశవః షష్టాః సప్తమాస్తు సరీసృపాః | గాయత్రంచ ఋచశైవ త్రివృత్సోమం రథంతరమ్‌ || 112

అగ్నిష్టోమంచ యజ్ఞానాం నిర్మమే ప్రథమా న్ముఖాత్‌ | యజూంషి త్రైష్టుభం ఛదః స్తోమం పంచదశం తథా || 114

వైరూప మతిమాత్రంచ పశ్చిమాదసృజ స్ముఖాత్‌ | ఏకవింశమథర్వాణ మప్తోర్యామాణ మేవచ || 115

అనుష్టుభం సవై రాజ ముత్తరా దసృజన్ముఖాత్‌ | ఉచ్ఛావచాని భూతని గాత్రేభ్య స్తస్య జజ్ఞిరే || 116

సురాసురపితౄన్‌ సృష్ట్వా మనుష్యాంశ్చ ప్రజాపతిః | తతః పునః ససర్జాసౌ స కల్పాదౌ పితామహః || 117

యక్షాన్‌ పిశాచాన్‌ గంధర్వాన్‌ స్తథైవాప్సరసాం గణాన్‌ | సిద్ధకిన్నర రక్షాంసి సింహాన్‌ పక్షిమృగోరగాన్‌ || 118

అవ్యయంచావ్యయంచైవ యదిదం స్థాణు జంగమమ్‌ | ససర్జ చ తదాబ్రహ్మా భగవా నాదికృద్విభుః || 119

తేతు యాన్వేవ కర్మాణి కర్మాణి ప్రక్సృష్ట్యాం ప్రతి పేదిరే | తాన్వేవ ప్రతిపద్యంతే సృజ్యమానా పునః పునః || 120

హింస్రా హింస్రే మ దుక్రూరే ధర్మాధర్మా వృతానృతే | తద్భావితాః ప్రపద్యంతే తస్మా తత్తస్య రో చతే || 121

ఇంద్రియార్ధేషు భూతేషు శరీరేషు స సవైప్రభుః | నానాత్వం వినియోగంచ ధాతైవ వ్యసృజత్స్వయమ్‌ || 122

నామరూపంచ భూతానాం కృత్యానాంచ ప్రపంచనమ్‌ |వేదశ##బ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకార సః || 123

ఋషీనాం నామధేయాని యథావేదే శ్రుతానివై | యథా నియోగ యోగ్యాని అన్యేషామపి సో7కరోత్‌ || 124

యథర్తావృత లింగాని నానారూపాణి పర్యయే | దృశ్యంతే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు || 125

కరోత్యేవం విధాంసృష్టిం కల్పాదౌ స పునః పునః | సిసృక్షు శ్మక్తి యుక్తో సౌ సృజ్యశక్తిప్రచోదితః || 126

భీష్మ ఉవాచ !

ఆర్వా క్ర్సోతాస్తు కధితో భవతా యస్తు మానుషః | బ్రహ్మన్‌ విస్తరతో బ్రూహి బ్రహ్మా త మసృజ ద్యథా || 127

యథా సవర్ణాసృజద్‌ గుణాంశ్చ స మహామునే | యచ్చ తేషాం స్మృతం కర్మ విప్రాదీనాం త దుచ్యతామ్‌ || 128

పులస్త ఉవాచ ! బ్రాహ్మణాది సృష్టి

సత్త్వాభిధ్యాయినః పూర్వం సిసృక్షో ర్ర్బహ్మణః ప్రజాః | అజాయంత కురుశ్రేష్ఠ సర్వోద్రిక్తా ముఖాత్ర్పజాః || 129

పక్షసో రజసోద్రిక్తా సథాన్యా బ్రహ్మనో7భనన్‌ | రజస స్తమసశైవ సముద్రిక్తాస్తథోరుతః || 130

పద్భ్యామన్యాః ప్రజా బ్రహ్మా ససర్జ కురుసత్తమ| తమః ప్రధానాస్తాః సర్వా శ్చాతుర్వర్ణ్య మిదం తతః || 131

బ్రహ్మణాణో క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ నృపసత్తమ | ముఖవక్షఃస్థలో రుభ్యః పాదాభ్యాంచ సముద్గతాః || 132

యజ్ఞనిష్పత్తయే సర్వమేతద్‌ బ్రహ్మా చకారహ | చాతుర్వర్ణ్యం మహారాజ యజ్ఞసాధనముత్తమమ్‌ || 133

యజ్ఞేనాప్యాయితా దేవా వృష్ట్యుత్సర్గేణ మానవాన్‌ | ఆప్యాయంతే ధర్మయజ్ఞా యతః కళ్యాణహేతవః || 134

నిష్పద్యంతే నరైస్తేతు సుకర్మనిరతైః సదా | విరుద్ధాచరణా పేతైః స్భభిః సన్మార్గ గామిభిః || 135

స్వర్గాపవర్గేర్గ మానుష్యాత్‌ ప్రాప్నువంతి నరానృప | యచ్చాభి రుచితం స్థానం తద్యాంతి మనుజా విభో || 136

ప్రజా స్తా బ్రహ్మణాసృష్టా శ్చాతుర్వర్ణ్యవ్యవస్థితౌ | సమ్యక్‌ శుద్ధః సమాచారాచరణా నృపసత్తమ || 137

యధేచ్ఛావాసనిరతాః సర్వబాధావివర్జితాః | శుద్ధాంతఃకరణాః శుద్ధా ధర్మానుష్ఠాన నిర్మలాః || 138

శుద్ధే చ తాసాం మనసి శుద్ధాంతఃసంస్థితే హరౌ | శుద్ధజ్ఞానం ప్రపశ్యంతి బ్రహ్మాఖ్యం యేన తత్పదమ్‌ || 139

తతః కాలాత్మకో యో7సౌ విరించావాస ఉచ్యతే | సంసారపాతచుత్యర్థం ఘోర మల్పాల్ప సారపత్‌ || 140

అధర్మబీజభూతం త త్తమోలోభసముద్గతమ్‌ | ప్రజాసు తాసు రాజేంద్ర రాగాది క్రమసాధనమ్‌ || 141

తతః సా సహజా సిద్ధి స్తేషాం నాతీవ జాయతే | రాజన్‌ వశ్యాదయశ్చాన్యాః సిద్ధయా7ష్టౌ భవంతియాః || 142

తాసు క్షీణా స్వశేషాషు వర్దమానేచ పాతకే | ద్వంద్వాభిభవదుఃఖార్తా స్తా భవంతి తతః ప్రజాః || 143

తతో దుర్గాణి తాశ్చక్రుర్వారక్షం పార్వత మౌదకమ్‌ | ధాన్వనంచ తథా దుర్గం పురం ఖార్వటకాది యత్‌ || 144

గ్వహాణి చ యథాన్యాయం తేషు చక్రుః ఫురాదిషు | శీతాతపాది బాధానాం ప్రశమాయ మహామతే || 145

ప్రతిహారమిమం కృత్వా శీతాదే స్తాః ప్రజాః పునః | వార్తోపాయం తత శ్చక్రు ర్హస్త సిద్ధించ కర్మజామ్‌ || 146

వ్రీహయశ్చ యవాశైవ గోధూమా అణవ స్తిలాః | ప్రియంగూకో విదారాశ్చ కోరదూషాః సచీనకాః || 147

మాషా ముద్గమసూరాశ్చ నిష్టావాః సకులుత్థుకాః | ఆఢకాశ్చణకాశైవ శణాః సప్తదశ స్మృతాః || 148

ఇత్యేతా ఓషధీనాంతు గ్రామ్యాణాం జాతయో నృప | ఓషధ్యో యజ్ఞియాశైవ గ్రామ్యా వన్యా శ్చతుర్దశ || 149

వ్రీహయః సయవా మాషా గోధూమా అణవస్తిలాః | ప్రియంగు సప్తమాహ్యేతా అష్టమాస్తు కులుత్థకాః || 150

శ్యామాకాస్త్వథ నీవారా వర్తులః సగవేధుకః | అధ వేణుయవాః ప్రోక్తా స్తద్వస్మర్కటకా నృప || 151

గ్రామ్యావన్యాః స్మృతా హ్యేతా ఓషథ్యశ్చ చతుర్దశ | యజ్ఞనిష్పత్తయే తద్వత్తథాసాం హేతు రుత్తమః || 152

ఏతాశ్చ సహయజ్ఞేన ప్రజానాం కారణం పరమ్‌ | పరాపరవిదః ప్రాజ్ఞా స్తతో యజ్ఞాన్‌ వితన్వతే || 153

అహన్యహ న్యనుష్ఠానం యజ్ఞానాం పార్థివోత్తమ | ఉపకారకరం పుంసాం క్రియమాణం ఫలార్థినామ్‌ || 154

ఏషాంచ కాలసృష్టో7సౌ పపాబిందు ర్మహామతే | మర్యాదాం స్థాపయామాస యథాస్థానం యథాగుణం || 155

పర్ణానామాశ్రమాణాంచ ధర్మాన్‌ ధర్మభృతాంవర | లోకాంశ్చ సర్వవర్ణానాం సమ్యగ్ధర్మాను పాలినామ్‌ || 156

ప్రాజాపత్యం బ్రహ్మణానాం స్మృతం స్థానంతు పార్థివ | స్థానమైంద్రం క్షత్రియాణాం || 157

వైశ్యానాం మారుతం స్థానం స్వధర్మ మనువర్తినామ్‌ | గంధర్వం శూద్రజాతీనాం పరిచర్యాసు వర్తినామ్‌ || 158

అష్టాశీతిసహసాణాం యతీనా మూర్ధ్యరేతసామ్‌ | ప్రాజాపత్యం గృహస్థానాం న్యాసినాం బ్రహ్మ సంజ్ఞితమ్‌ || 159

సప్తర్షీణాంచ యత్థ్సానం బ్రహ్మణః పరమం పదమ్‌ | ఏకాంతినః సదోద్యుక్తా ధ్యాయినో యోగినోహి యే || 160

తేషాం తత్పరమం స్థానం యత్తత్‌ పశ్యంతి సూరయః | గతాగతా నివర్తంతే చంద్రాదిత్యాదయో గ్రహాః || 161

అద్యాపి న నివర్తంతే నారాయణపరాయణాః | తామిస్ర మంధతామ్రిసం మహారౌరవరౌరవమ్‌ || 162

అసిపత్రవనం ఘోరం కాలసూత్ర మవీచిమత్‌ | వినిందకానాం వేదస్య యజ్ఞవ్యాఘాత కారిణామ్‌ || 163

స్థానమేతత్‌ సమాఖ్యాతం స్వధర్మత్యాగినాంసృప | తతో7భిధ్యాయతస్తస్య జజ్ఞిరే మానసాః ప్రజాః || 164

తచ్ఛరీరసముత్పన్నైః కాయస్థైః కరణౖః సహ | క్షేత్రజ్ఞాః సమవర్తంత గాత్రేభ్యస్తస్య ధీమతః || 165

తే సర్వే సమవర్తంత యే మయా ప్రాగుదాహృతాః | దేవాద్యాః స్థావరాంతాశ్చ త్రైగుణ్య విషయే స్థితాః || 166

ఏవం భూతాని సృష్ణాని స్థావరాణి చరాణిచ | యదాస్య తాః ప్రజాసర్వా నవ్యపర్దంత ధీమతః || 167

అతథాన్యాన్మానసాన్‌ పుత్రాన్‌ సదృశా నాత్మనో7సృజత్‌ | భృగుం మాం పులహంచైవ క్రతుమంగిరసం తథా || 168

మరీచిం దక్ష మత్రించ వసిష్ఠంచైవ మానసాన్‌ | నవబ్రహ్మాణ ఇత్యేతే పురాణ నిశ్చయం గతాః || 169

సనందనాదయో యేచ పూర్వం సృష్టౌస్తు వేధసా | నతే లోకే ష్వసజ్జంత నిరపేక్షాః ప్రజాసు తే || 170

సర్వే హ్యగతవిజ్ఞానా వీతరాగా విమత్సరాః | తేష్వేవం నిరవక్షేషు లోకాసృష్టౌ మహాత్మనః || 171

బ్రహ్మాణో7భూన్మహాన్‌ క్రోధ సై#్రలోక్యదహనక్షమః | తస్య క్రోధాత్‌ సముద్భూతం జ్వాలామాలావ దీపితం || 172

బ్రహ్మణస్తు తదాజ్యోతి త్రైలోక్యమఖిలం దహత్‌ | భృకుటీకుటిలా తస్య లలాటా త్ర్కోధ దీపితాత్‌ || 173

సముత్పన్న స్తదా రుద్రో మధ్యాహ్నార్కసమప్రభః | అర్ధనారీనరవపుః ప్రచండో7తిశరీరవాన్‌ || 174

విభజాత్మాన మిత్యుక్త్వా తం బ్రహ్మాంతర్ధధే తతః | తథోక్తో7సౌ ద్విధాస్త్రీత్వం పురుషత్వం తథాకరోత్‌ || 175

బిభేద పురుషత్వంచ దశధా చైకధా చ సా | సౌమ్యాసౌమ్యై స్తథారూపైః శాంతైః స్త్ర్వీత్వంచ సప్రభుః || 176

బి భేద బహుదా చైవ స్వరూపై రసితైః సితైః | తతోబ్రహ్మా స్వయంభూతం పూర్వం స్వాయంభువంప్రభుమ్‌ || 177

ఆత్మానమేవ కృతవాన్‌ ప్రాజాపత్యే మనుం నృప | శతరూపాంచ తాం నారీం తపోనిర్ధూతకల్పషామ్‌ || 178

స్వాయంభువో మనుర్నామ పత్నీత్వే జగృహే వ్రభుః | తస్మాచ్చ పురుషా ద్దేవీ శతరూపా ప్రసూయత || 179

ప్రియవ్రతోత్తాసపాదప్రసూత్యాకూతి సంజ్ఞితమ్‌ | దదౌప్రసూతిం దక్షాయ ఆకూతిం రుచయే పురా || 180

ప్రజాపతిః స జగ్రాహ; తయోర్జజ్ఞే సదక్షిణః | పుత్రో యజ్ఞో మహాభాగ దంపత్యో ర్మిధునం తతః || 181

యజ్ఞస్య దక్షిణాయాంతు పుత్రా ద్వాదశ జజ్ఞిరే | యామా ఇతి సమాఖ్యాతా దేవాః స్వాయంభువే మనౌ || 182

ప్రసూత్వాంచ తథా దక్ష శ్చతస్రో వింశతిం తథా | ససర్జ కన్యా స్తాసాంతు సమ్యజ్నా మాని మేశ్రుణు || 183

శ్రద్ధా లక్ష్మీః ధృతిః పుష్టిః తుష్టిర్మేధా క్రియా తధా | బుద్ధి ర్లజ్ఞా వపుః శాంతిః రృద్ధిః కీర్తిస్త్రయోదశీ || 184

పత్న్యర్ధం ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయిణీః ప్రభుః | తాభ్యః శిష్టా యవీయస్య ఏకాదశ సులోచనాః || 185

ఖ్యాతిః స త్యథ సంభూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా | సన్నతి శ్చాన సూయాచ ఊర్జా స్వాహా స్వధా తథా || 186

భృగు ర్భవో మరీచిశ్చ తథాచై వాంగిరా మునిః | అహంచ పులహశైవ క్రతు ర్మునివర స్తధా || 187

శ్రద్ధాకామం బలం లక్ష్మీ ర్నియమం ధృతి రాత్మజమ్‌ | సంతోషంచ తథాతుష్టిర్లోభం పుష్టి రసూయత || 188

మేధాశ్రుతం క్రియాదండం నయం వినయమేవచ | బోధం బుద్ధి స్తథా లజ్జా వినయం వపు రాత్మజమ్‌ || 189

వ్యవసాయం ప్రజజ్ఞేవై క్షేమం శాంతి రసూయత | సుఖ మృద్ధిర్యతః కీర్తి రిత్యేతే ధర్మ సూనపః || 190

కామా న్నందీసుతం హర్షంధర్మపౌత్ర మసూయత | హింసాభార్యా త్వ ధర్మస్య తస్య జజ్ఞే తదానృతమ్‌ || 191

కన్యా చ నికృతిస్తాభ్యాం భయం నరక ఏవచ | మాయాచ వేదనాచైవ మిధునం ద్వంద్వమేవచ || 192

తయోర్జజ్ఞే7థవై మాయా మృత్యుం భూతాపహారిణమ్‌ | వేదనాయా స్తతశ్చాపి దుఃఖం జజ్ఞే7థరౌరవాత్‌ || 193

మృత్యోర్వ్యాధిజరాశోక తృష్ణాక్రోధాశ్చ జజ్ఞిరే | దుఃఖోత్తరాః స్మృతాహ్యేతే సర్వే చాధర్మలక్షణాః || 194

నైషాం భార్యాస్తి పుత్రోవా తే సర్వే హ్యూర్ధ్వరేతనః | రౌద్రా ణ్యతాని రూపాణి బ్రహ్మణో నృవరాత్మజ || 195

నిత్యం ప్రళయహేతుత్వం జగతో7స్య ప్రయాంతివై | రుద్రసర్గం ప్రవక్ష్యామి యథాబ్రహ్మా చకారహ || 196

కల్పాదా వాత్మన స్తుల్యః సుతః ప్రధ్యాయతస్తతః | ప్రాదురాసీ త్ర్పభోరంకే కుమారో నీలలోహితః || 197

రుదన్వై సుస్వరంసో7థ ద్రవం శ్చ నృపసత్తమ | కిం రోదిషీతి తందేవో రుదంతం ప్రత్యువాచహ || 198

నామదేహీతి తం సో7థ ప్రత్యువాచ ప్రజాపతిమ్‌ | రోదనాద్రుద్రనామాసి మారోదీర్ఘైర్య మాపహ || 199

ఏవముక్తః పునస్థో7థ సప్తకృత్వో రురోదహ | తతో7న్యాని దదౌతసై#్మ సప్తనామాని వైప్రభుః || 200

మూర్తీనాం చైవ మష్టానాం స్థానా న్యష్టౌ చకారహ భవం శర్వ మథేశానం తథా పశుపతిం నృప 201

భీమ ముగ్రం మహాదేవ మువా చ స పితామహః సూర్యో జలం మహీవహ్ని ర్వాయు రాకాశ ఏవచ 202

దీక్షితో బ్రాహ్మణ స్సోమ ఇత్యేతా తనవః క్రమాత్‌ ఏవం ప్రకారో రుద్రో7సో సతీం భార్యా మవిందత 203

దక్షకోపాచ్చ తత్యాజ సా సతీం స్వం కలేబరం హిమవద్దు హితా సాభూ న్మేనాయాం నృపనత మ 204

ఉపయేమే పునశ్చైవ యాచిత్వా భగవా న్భవః దాక్షీ ధాతృ విధాతారౌ భృగోః ఖ్యాతి రసూయత 205

శ్రిమ యంచ దేవదేవస్య ప త్నీ నారాయణస్య యా 206

ఇది శ్రీ పాద్మేమహాపురాణ ప్రథమే సృష్టిఖండే కాలపరిమాణ సర్గ ప్రతిసర్గాది వర్ణనమ్‌

సృష్టిముందు పరమాత్మ విష్ణువవునగు నీవు రుద్రరూపము ధరించి సర్వజగద్భక్షణము సేసి, లోకమెల్ల యొకే సముద్రముంగావించి, అందు జ్ఞానులచే ధ్యానింపబడుచు పవ్వళింతువు. నీకు పైరూపము నెవ్వడు నెఱుంగడు. దేవతలు నీ అవతార స్వరూపమునే యర్చింతురు. ముముక్షుపులు నిన్ను కేవలమాత్మగా పరబ్రహ్మముగా నారాధించి ముక్తులౌదురు. మనసు నేత్రాదీంద్రియములచేత బుద్ధిచేత పరిచ్ఛేద్యమైనదెల్ల నీ సగుణ రూపమే. తన్మయమైనది (నీవేతానైయున్నది) నీ మీద నాధారపడియున్నదియు నేచేసృజింపడినదియు (అహం) అహం అనుశబ్దమున కర్ధమైనదియు నగు నాశక్తి స్వతంత్ర పదార్థముగాదు. అది నిన్నే యాశ్రయించుకొన్నది. అందుచేతనే నన్ను అనునర్థమిచ్చెడి ''మాం''అహం శబ్దముయొక్క ద్వితీయావిభక్తి రూపమయిన శబ్దమున కర్థమును మాం=లక్ష్మిని గా లోకము పేర్కొను చున్నది. ఆమెనే అహంకారశ క్తితత్త్వమును మాధవిగా (లక్ష్మినిగా) నీలోకము పేర్కొనుచున్నది.

సామవేదస్వరమే తనకంఠధ్వనియైన శ్రీజాని విష్ణువు షుర్ఘురమని గర్జించెను. విప్పారిన తామరపూవు వంటి నేత్రములుగల మహావరాహస్వామి తన కోరతో వసుంధర నెత్తి నీలగిరివోలె రసాతలమునుండి ప్తెకిలేచెను. ఆలేచిన స్వామి ముఖవాయువు తాకిడికి పొంగిన నీరు జనలోకవాసులగు సనందనాది మునులను సహజ పవిత్రులయిన వారిని బరమపవిత్రులంగావించెను. పరాహస్వామి డెక్కల రాపిడింగొన్న రసాతల మట్టడుగునంగల నీళ్లు పెనుసందడిం బొందినవి. వరాహమూర్తి నిశ్శ్వాస వాయువులచే వలాహకపంక్తి చెల్లాచెదరయ్యెను. నీటిందడిసిన కడుపుతో భూమింజీల్చుకొని మీదికిలేచి దులిపికొనినంత నందలి రోమకూపము లందున్న మునులా దేవుని వేదమయ శరీరముం గొనియాడిరి.

వరాహమూర్తిని సనక సనందనాదులు స్తుతించుట.

నీవు లోకేశుల కీశ్వరుడవు. గద-శంఖము-ఖడ్గము చక్రముం ధరించినావు. సృష్టి స్థితిలయ హేతువవు. నీకంటె మఱి పరమపదములేదు. నీపాదము వేదములు. నీకోర యూపస్తంభము (యజీయము) నీ దంతములందు యజ్ఞములున్నవి, నీ యోమున శ్రుతులున్నవి. నీ నాలుక హుతాశనుడు (అగ్ని) నీ మేనిరోమములు దర్భలు ప్రభూ! యజ్ఞపురుషుడవునీవే. భూనభోంతరమంతయు ననుపమాస ప్రభావుడవగు నీ మూర్తితో వ్యాప్తమైయున్నది. ఈయశేష విశ్వక్షేమమునకు నీవు కారణముగమ్ము ఓ జగత్పతీ! పరమాత్మవు నీవొక్కడవే. మఱియొకండులేడు. చరాచర ప్రపంచమిది నీ ప్రభావభావితము. ఈ అఖిల ప్రపంచము జ్ఞానస్వరూప మిది వస్తురూపముగజూచి (వాస్తవమనుకొని)

ఇది అత్యద్భుతమైన ఘట్టము. సృష్టి క్రమమును జెప్పుటలో నుపనిషత్తు ''అవ్యక్రాత్‌ మహత్‌ మహతః అహంకారః అహంకారాత్పంచ తన్మాత్రాణి'' అని వినిపించును. ఆ ఉపనిషత్తాత్పర్యమే యిక్కడ (పురాణములో) నుపబృంహితమైనది. దీని వివరణమిది. అవ్యక్తమనగా ముముక్షుపులు కేవలమాత్మగా నారాధించు బ్రహ్మవస్తువు. చిజ్జిడాత్మకమైనది. (సంకల్పరూపము) మనస్సు. దానికి మీదిది నిశ్చయాత్మకము బుద్ధి. ఇది తరువాతి స్థాయిగలది. కనుక ఆ బుద్ధి కందుబాటులోనున్న నీఅవతారరూపము (సగుణరూపము) త్వన్మయము. అదే మహత్తత్త్వము. దానినుండి వివృతమైనది వేదాపరిణమించి మూడవస్థానములోనున్న ''అహంకారతత్త్వము'' అస్మచ్ఛబ్ధ ద్వితీయావిభక్తికి అర్థమ్తెన వరకూ ష యొక్క శక్తిగా నిక్కడ వ్యాసభగవానులు వివరించినారు. అనగా అర్ధతః అభేదమేకాదు. పదతః శబ్దశక్తిచేతగూడ అభేదము సాధించి శబ్ధార్థముల అభేదమునుగూడ జ్ఞాపకముచేసి శక్తిమత్పదార్థములకేవలా ద్త్వెతమును సాధించి ద్త్వెతనిరాసము చేసినారు.

తమః ప్రవాహమందు భ్రమింతురు. ఎఱుకగనిన శుద్ధాంతఃకరణులయిన వారీజగమెల్ల కేవల జ్ఞానమయిన నీ స్వరూపముగ గుర్తింతురు,

సర్వభూతాత్మ ! ఈజగత్తు మనుగడకు ప్రసన్నుడమగుము. మునిగిన యీ యుర్వి నుద్ధరింపుము. సత్వగుణాతిశయుడవు. జగత్తు యొక్క (స్థితి) యునికి నీపైనాధారపడియున్నది, దీనివలన సర్వభువనములకు హిత వగును. అని కొనియాడ హరి వెంటనే పృథివి మీదికెత్తెను. మఱియు నిందలి పర్వతములను చదునుజేసి, సప్తద్వీప విభాగమొనరించి భూరాదిలోకములను మునుపటిరీతినుంచెను. ఈ యొనరించిన దెల్ల విష్ణువు బ్రహ్మకు జూపించెను. అపుడు బ్రహ్మ సంతోషించి, నీవు పురుషోత్తముడవు, నీవు నేను నీజగమును ధరింపవలెను. పాలిపవలెను. మున్నీ యుసురులకు నేను వరమిచ్చితిని. ఇపుడు దేవతల క్షేమముకోరి నీవీ యసురులం జంపవలయును. నేను సృష్టి సేసెదను. నీవు దానిం గాపాడుము. అని బ్రహ్మ పలికినంతట విష్ణువు విని తన దారిం దానరిగెను. అవ్వల బ్రహ్మ దేవాదులను సృజించెను.

-: బ్రహ్మకృత నవవిధసృష్టి -:

సంకల్పములేకుండ యాబ్రహ్మముందు తమోమయమైన సృష్టి యావిర్భవించెను. తమము మోహము మహామోహము తామిశ్రము అంధతా మిశ్రము నన నదియైదు విధములు. ధ్యానముచేసినంత (సంకల్పమువలననన్న మాట) నైదు విధముల సృష్టి యయ్యెను. అది వెలుపల లోపలగూడ అప్రకాశము నంవృతాత్మము. అనగా వానియందు చిత్ర్పకాశ మస్పష్టము, ఇదే అంతర్వివిదమని యింకొకచోట పురాణములందు పేర్కొనబడినది. వీనియందుగూడ చైతన్యముండునుగాని యదియున్నట్లు గనబడదు. పర్వత స్వరూపమది. సర్గమందు పర్వతములు ముఖ్యములగుటచే నిది ముఖ్యసర్గమనబడును. తన చేయు సృష్టికది సాధకమని గమనించి యింకొక సాధకసృష్టి చేయవలెనని పరమేష్ఠి మరల ధ్యానము సేసెను. అంతట తిర్యక్సోతస్సు సృష్టియొదవెను. ఈ సృష్టిలో జీవుల ప్రవృత్తి (నడక) తలక్రిందుగా నుండుటబట్టి దీని కాపేరు వచ్చినది. అదే పశువులు మొనలైనవి తమోగుణ ప్రచురములు. అవేదులు, జ్ఞానరహితము విశృంఖల ప్రవృత్తి గలవి, తెలివిలేకున్న తెలివిగల వారమనుకొనునవి. అహంకరించునవి. నేను నేనని దురభిమానము గలవి. అది ఇర్వదియెనిమిది రకములు. అంతఃప్రకాశములు ఒకటి కొకటి ఆవృతములు. ఒకదాని సంగతి యింకొక దానికి తెలియదన్నమాట.

అదికూడ పనికిమాలినదని బ్రహ్మ యనుకొని మరల ధ్యానముసేయ మూడవ సృష్టి ''ఊర్ధ్వ స్రోత్రము'' ఆను సాత్వికసృష్టి పైకిలేచెను. అందలి జీవులు నిండు సుఖము ప్రీతియుగలవారు వెలుపల లోపల నావరణము లేనివారు. ప్రకాశము గలవారు. ఊర్ధ్వ స్త్రోతసులనబడినారు. ఆ మూడవ సృష్టి యేర్పడినంత బ్రహ్మ సంతుష్టు డయ్యెను. ప్రీతిం బొందెను.

అమీద బ్రహ్మ ముఖ్యసర్గాదులందు జనించిన జీవులు తన సృష్టి కార్యమునకు సాధకులు (సహకారులు) గారని గ్రహించి మరల ధ్యానములోబడి సత్యస్తువగు పరబ్రహ్మను ధ్యానించినంత అవ్యక్తమునుండి అర్వా క్ర్సోతస్తు సృష్టి సాధకమై ఆవిర్భవించినది. ఇందు పుట్టిన జీవులు అర్వాక్ర్పవృత్తిగలవారగుటచే దీనికీ పేరు వచ్చినది. అర్వాక్రృ వృత్తియనగా ఆత్మవస్తువునకు పరాజ్ముఖముగా నుండుటయని యర్థము. తట్టివారు మనుష్యులు, ''పరాంచిఖాని వృతణత్‌ స్వయంభూః'' అను శ్రుతి బ్రహ్మ మానవుల యింద్రియములను పరాజ్మువీములనుగా సృష్టించెనని చెప్పుచున్నది. ఆ శ్రుతినే యీ పురాణ వచన మిక్కడ నుపబృంహణము సేసింది. (వివరించినది) ఇందు జనించిన మానవులు ప్రకాశులు=బహుళ ప్రకాశులు. అనగా వీరిలోని చైతన్యము (చేతనాశక్తి) పూర్తిగ నావృతముగాదు. వీరిలో తమోగుణ రజోగుణములు పెచ్చుపెరిగియుండును. అందువలననే నరులందు దుఃఖమెక్కువ. ఏ పనియైన మరల మరల జేయుచుందురు. వీరి జ్ఞాన కర్మేంద్రియములు కేవలప్రవృత్తి పరములన్న మాట. వీరిలో ప్రకాశము వెలుపల లోపలనుగూడ వ్యాప్తము. సూక్ష్మేంద్రియమైన అంతరంగము(మనస్సు)స్థూలములయి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు బహిరింద్రియములలోగూడ చైతన్యస్ఫురణము కానవచ్చునన్నమాట. వారు సృష్టికర్తకు సాధకులుగూడ. సృష్టి పెరుగుటకు సహకారులన్నమాట.

అయిదవది అనుగ్రహసర్గము. అది విపర్యయము సిద్ధి శక్తి తుష్టి అనువానిచేత నాల్గురకములైనది. ఈ సర్గ మందలి జీవులు జరిగిపోయినది జరుగుచున్నదియునైన విషయము నెఱుంగ నేర్తురు. ఆఱవసర్గముభూతములయొక్క సృష్టి. ఇందలి జీవులందరు పరిగ్రాహిణలు విభాగతరులు. భోధనము (జ్ఞానము) జాప్య=జపాను ష్ఠానము స్వభావముగాగలవారు. అట్టివారు భూతాధికులు. ఈ విధముగ నాఱు సర్గములిక్కడ జెప్పబడినవి. మొదటిది మహత్సర్గము (అవ్యక్త) బ్రహ్మకిది రెండవది. తన్మాత్రసర్గము రెండవది. మూడవది వైకారికము ఐంద్రియికము. (పంచతన్మాత్రసృష్టియన్న మాట). ఇది బుద్ధిపూర్వకము. ముఖ్యసర్గము నాల్గవది. ముఖ్యములనగా స్థావరములు పశు పక్ష్యాదులు తిర్యక్కులనబడును. వాని సృష్టి తిర్యక్ర్సోతస్సనబడును. దాని తర్వాత ఊర్ధ్వ స్రోతస్సులయొక్క సృష్టి ఆరవది. అది దేవసర్గమనబడును. ఆవల అర్వాక్ర్సోతస్సర్గము సప్తమము. అదే మానుషము అను గ్రహసర్గము. సాత్త్వికము తామసమునయిన దెనిమిదవది. ఈ యైదును వైకృత సర్గములనబడినవి. ప్రాకృతసర్గములు మూడు. ప్రాకృతము వైకృతము కౌమారము తొమ్మిదవది ఇది ప్రజాపతియొక్క సర్గములు తొమ్మిది. ఇవి ప్రాకృతములు వైకృతములు జగత్తునకు మూలకారణములు. సృష్టిచేయు జగత్ర్సభునకివి మూలకారణములు. మరి యేమివినవలతువన భీష్ముడిట్లనియె. సంగ్రహముగ దేవాది సర్గములను మీరానతిచ్చిరి, ఓ మునీంద్ర! ఇవి విస్తరముగ వినవలతునన పులస్త్యుడిట్లనియె. 85

-- సృష్టి స్వరూప వివరణము --

కుశలము అకుశలములైన కర్మములచే భావితులయినవారు ఖ్యాతి నుండి (కర్మవాసననుండి) విముక్తి నందని వారు సృష్టి సంహారమందు ఉపసంహృతులైనారు. దేవతలుమొదలుకొని స్థావరములదాక నున్న యా జీవులు నాల్గు విధములవారు.

బ్రహ్మయొక్క మనస్సునుండి పుట్టినవారు బ్రహ్మమానస పుత్రులు సనక సనందనాదులు. ఆవల దేవాసుర పితృ మనుష్య సృష్టి గావింపనెంచి సృష్టికర్త తనను ఉదకమునందు సంయోజించుకొనెను. ముక్తస్వరూపుడగు నతనినుండి దురాత్ములు జఘనము (పిరుందులు) నుండి అసురులు పుట్టిరి. కేవలతమోరూపమైన యా శరీరమును విడిచెను. అదే విభావరి (రాత్రి) యైనది. దానికతడు ప్రీతి నందెను. అవ్వల నతని ముఖము నుండి సత్వగుణోద్రిక్తులు సురలు పుట్టిరి. ఆమేనింగూడ యతడు విడిచినంత నది పగలయ్యెను. అందుచేతనే అసురులు రాత్రివేళ, దేవతలు పగలు బలవంతులైరి. అవ్వల కేవల సత్వగుణమాత్రమైన శరీరమును గైకొనెను. తాను జగత్పిత ననుకొన్నంత పితరులు జనించిరి, ఆయన యామేనింగూడ వదలినంత నది దివారాత్ర సంధిరూపమైన సంధ్యాకాలమయ్యెను. అంత నతడు రజోగుణమాత్ర శరీరమూనెను. అందు రజోగుణాతిశయులు మనుష్యులు పుట్టిరి. ఆ శరీరమును విడిచినంత నది జ్యోత్స్న (వెన్నెల) సంధ్య కంటె ముందు పుట్టినట్లు వేదములందు చదువబడినది. వెన్నెలలో మనుష్యులు పితృదేవతలు బలవంతులుగా నుందురు. వీరు సంధ్యయందు పుట్టుటయే దీనికి కారణము. వెన్నెల, రేయింబవళ్లు, సంధ్య యనునివి త్రిగుణాత్మకములు.

అటుపై కేవలరజోగుణ శరీరమింకొకటి స్వీకరింప శుద్ధబ్రహ్మమూర్తియగు నాయనకు కోపము పుట్టినది. ఆకలికి చిక్కెను. అంధకారమందు సృష్టిసేయబోవ వికృతరూపులు పుట్టి ఆకలిగొని ఆ బ్రహ్మనేతినివేయ బరువెత్తిరి. వారు 'రక్షతామ్‌ ''రక్షింతురుగాక'' అని ఆకలిగొని యరచినారు. దాన రాక్షసులను పేరందిరి. మఱికొందరు యక్షామ=యజ్ఞము సేయుదుమనినందున యక్షులైరి. వారింజూచి హడలిపోగా యాబ్రహ్మయొక్క జుట్టురాలిపోయెను. శిరస్సు హీనమయినది (బట్తతల యయ్యెనన్నమాట), ఆ తలపైకి వారెక్కిరి. సర్పణాత్‌ (ఆకలిచే నలుకులాడుచు ప్రాకులాడిరి. కావున సర్పములయినారు. హీనులగుటచే ఆహియను పేరందిరి. వారింగని బ్రహ్మ క్రుద్ధుడైనంత క్రోధస్వరూపులుగా జన్మించినవారు పిశితాశినులు (మాంసభక్షకులు) కపిశవర్ణులు. పుట్టిన వెంటనే గాం=భూమిని దయతః=కుడిచికొని, పిబంతః=త్రావిరి కావున వారు గంధర్వులైరి. ఇట్లు శక్తి ప్రేరణచే నీ జీవులను సృష్టించి ఆ మీద స్వేచ్ఛగా నెగిరెడి పక్షులను సృజించెను.

ఱొమ్ము నుండి గొఱ్ఱలను, ముఖమునుంచి మేకలను, కడవునుండి గోవులను, గేదెలను, పాదములనుండి గుఱ్ఱములను నేన్గులను కంచరగాడిదలను ఆడవిఆవులను ఒంటెలను ఆశ్వతరములను - వేసడములు - శ్యంకువులను మఱి యితర జాతులను సృజించెను. ఆయన రోమములనుండి ఓషధులు (పంట పండగానే అంతరించునవి) కల్పాదిని కృతయుగము మొదట నీ సృష్టి జరుపును. ఓషధీగణమును సృష్టించిన వెంటనే వానిని యజ్ఞముతో పొందు పరచెను. గ్రామములందు పుట్టిన గేదెలు మేకలు గొఱ్ఱలు అశ్వతరములు కంచరగాడిదలు ననునివి గ్రామ్యపశుపులందురు. ఇక ఆరణ్యములు. రెండు గొరిసెలుగలది శ్వాపదము=పెద్దపులి - (క్రూరమృగము) ఏనుగు - కోతి యైదవది పక్షి. ఆరు ఉష్ట్రములు, ఏడు పాములు. 111

-: చందస్సులు :-

గాయత్రము, ఋక్కులు త్రివృత్సోమము రధంతరములు అగ్నిష్టోమము నను నీ యజ్ఞములను మొదట ముఖమునుండి, యజుస్సులు త్రైష్టుభ ఛందస్సు స్తోమము (పదునైదవది) బృహత్సామ యను వీనిని కుడివైపు ముఖము నుండి, సామములు జగతీ ఛందస్సు స్తోమము సప్తదశము వైరూపము అతిరాత్రము పశ్చిమ ముఖమునుండి, ఏకవింశము (21) అధర్వణము ఆఫ్తోర్యాయము అణుష్టుభము వైరాజము నుత్తరముఖముంనుండి సృజించెను. ఆయన యవయవముల నుండి చిన్నవి పెద్దవియునగు భూతములు జనించినవి.

దేవాది ; వ్యయావ్యయములు, స్థావరజంగమము లివియన్నియు సృజించి ఆదికర్తయగు నా భగవంతుడు వాని వాని కర్మములు (పనులు) గూడ వెనుకటి సృష్టి మాదిరిగనే యేర్పరచెను. హింస అహింస మృదుక్రూరభావములు, ధర్మాధర్మములు ఋతానృతములు పూర్వజన్మములందు భావితములైన యాయాగుణములనే ఆయా జీవులు పొందుచుందురు. దీనినే సంస్కారమందురు. అదే వారికి రుచించుచుండును.

శబ్దాదీంద్రియములందు భూతములందు శరీరములందు నానాత్వమును వినియోగమును ధాతయే స్వయముగ సృష్టించెను. భూతముల నామరూపములు వానివాని కృత్యముల వివరణము వేదశబ్దములనుండియే దేవాదులకు మొదటనే యేర్పరచెను. ఋషులపేరు వేదములందువినబడినవిధముగ వారికి అధికారనియోగానుసారము యేర్పరచెను.

వసంతాది ఋతువులందు ఋతుచిహ్నములు నానారూపము లేర్పడినట్లు యుగములందు భావములు(వస్తువులు) యేర్పడుచుండును. బ్రహ్మ కల్పాదియందిట్లు తిరిగి తిరిగి యిట్లే (పూర్వకల్పానుసారముగ) సృజింపబడు నాయాజీవుల శక్తులప్రేరణచే (వానివాని ప్రాక్కర్మ బల ప్రేరణచే) తాను శక్తి వంతుడై యీ విధమై సృష్టిరచన గావించుచుండును.

మానుష సృష్టి అర్వాక్ర్సోతస్సని యంటివి. బ్రహ్మణ్యమూర్తీ ! దానిని బ్రహ్మయెట్లు సృజించెనో సవిస్తర ముగ నానతిమ్మన పులస్త్యుండిట్లనియె. సత్వగుణాభిధ్యానము చేయు సృష్టికర్త ముఖమునుండి సత్వగుణోద్రిక్తులగు జీవులు పుట్టిరి. వక్షస్థలమునుండి రాజసులు, రజస్తమోగుణములు రెండిటిచే నుద్రిక్తులైన జీవులు ఊరువులనుండి (తొడలనుండి), పాదములనుండి తక్కినవారు (శూద్రాదులు) తమోగుణప్రధానులు బయలుదేరిరి. ముఖములనుండి యావిర్భవించిన యీ చాతుర్వర్ణ్య వ్యవస్తయంతయు యజ్ఞసాధనకే గావింపబడినది. దేవతలు యజ్ఞములచే నాప్యాయితులుకాగా సృష్టియందు మానవులాప్యాయితులగుదురు. ధర్మయజ్ఞములు కల్యాణకరములగుటయే యిందులకు కారణము. విరుద్ధాచరణము విడిచి సన్మార్గమున వర్తించు సత్పురుషులచేత నా యజ్ఞములు జరుపబడును. స్వర్గము, మోక్షము, మనుష్యజన్మముచేతనే పొందుదురు. మనుజులు తమకేది అభిరుచించు నాస్థానమును బొందగలరు. బ్రహ్మచే సృష్టింపబడిన తమతమ వర్ణ ధర్మమందు దృఢనిష్ఠులయిన చాతుర్వర్ణ్య ప్రజలు పరమపావనులై సదాచారాచరణులైనవారు తాముకోరిన పుణ్యనివాసము లందు చరించుచు బాధలులేక శుద్ధాంతఃకరణులై శుద్ధులై ధర్మానుష్ఠాన నిర్మలులయ్యెదరు, వారు మనసు శుద్ధమైనంత వారి శుద్ధాంతఃకరణమందు హరి నిలిచినంత వారు శుద్ధ జ్ఞానమును గాంతురు. దానిచే బ్రహ్మ పదమందుదురు. అందుచేతనే కాలస్వరూపుడైన విరించియొక్క (బ్రహ్మయొక్క) వాసమిది బ్రహ్మపదమనబడెను. 139

అతిఘోర సంసార పాతము అత్యల్పసారము అధర్మబీజము తమోలోభసంభవము రాగద్వేషాది సాధనమునైన యాదుర్గతింబడు వారికి వెంటనే సిద్ధిగలుగదు, పశ్వాదిసిద్ధులు (జన్మలు) ఎనిమిది రకాలు గల్గును. ఆ సిద్ధులు క్షీణింప, సుఖదుఃఖ రాగద్వేషాది ద్వంద్వములకు వశులై ప్రజలు దుఃకార్తులయ్యెదరు. అందువలన నా ప్రజలు పార్వతములు (పర్వతములతో నేర్పరచుకొన్నవి) ఔదకం (జలసంబంధమైన) ధాన్వనములైనవి శీతవాతాతప నివారకములైన దుర్గములను (కోటలను) నిర్మించుకొందురు. పురము ఖర్వలు మొదలయినవి. వానియందిండ్లు యథాన్యాయముగ గట్టుకొనిరి. 145

ఇట్లు శీతవాతాది బాధలకు ప్రతిక్రియలు సేసికొని ఆపైని వార్తోపాయమాపై నొనరించుకొనిరి. (వర్తకమన్న మాట) అవ్వల నాయాకర్మములందు హస్తసిద్ధిని సాధించుకొనిరి. (వడ్రంగము, కమ్మరము మొదలయినవన్న మాట) ఆ మీదట నాహారముకొఱకు వ్రీహి=ఎఱ్ఱబుడమ యవ=గోధుమలు, అణుక=చిఱువడ్లు నువ్వులు ప్రియంగు=కొఱ్ఱలు మసుర=చిఱుసెనగలు దూష=ఆళ్లు మాష=మినుము ముద్గ=పెసర నిష్పాప=అనుములు ఆఢక=కందులు చణక=సెనగ శణ=జనుము మొదలగు పదునేడురకాలు గ్రామ్యములు వన్యములు నైనఓషధులు పదునాల్గురకములు. ఏడురకాలు శ్యామాకమలు=చామలు నీవారములు=తృణ ధాన్యము (నివ్వరి), వర్తులములు=ఒక రకము కాయధాన్యము, గవేధుకములు=అడవి గోధుమలు. వేణుయవలు మర్కటకములు ననునివి పదునాల్గురకాలు ప్రధానముగ యజ్ఞసాధనకు మఱి జీవుల యాహారము కొఱకు ప్రజలు యజ్ఞముతోబాటు సాధించుకొనిరి. అందులకే పరాపరము లెరిగి ప్రాజ్ఞులయినవారు యజ్ఞములు సేయుదురు. పుణ్యఫలార్థుల కీయజ్ఞముపకారకము. ఇది ప్రతిదినము ననుష్ఠింప వలసినదే. వీరికికాలాత్ముడగు భగవంతునిచే సృష్ఠింపబడినది వపాబిందువు. ఆమీద వర్ణాశ్రమ ధర్మవ్యవస్థకూడ యేర్పరుపబడినది. దానిననుసరించివచ్చు పుణ్యలోకములు నిర్ణయింపబడినవి - బ్రాహ్మణులకు ప్రజాపతి లోకము (బ్రహ్మలోకము) క్షత్రియుల కింద్రలోకము. స్వధర్మాచరణమొనరించు వైశ్యులకు వాయులోకము, పరిచర్యాది ధర్మములుచేయు శూద్రులకు గంధర్వలోకము. ఊర్ధ్వరేతస్కులైన ఎనుబదియెనిమిది వేలమంది యతీశ్వరులకే లోకము లభించునో యదేలోకము (బ్రహ్మలోకము) గురుకుల వాసులకును లభించును. 157

నిన్ను నీవు రెండుగా విభాగించికొమ్మని బ్రహ్మ అంతర్ధాన మందెను. ఆ ప్రకారము స్త్రీగా పురుషుడుగా నీతడు రూపుదాల్చెను. ఆ పురుషరూపమును గూడ పదిగా మఱి యొకటిగా శాంతరూపమున సౌమ్యములు అసౌమ్యములుగా రూపొందించెను. స్త్రీత్వమునుగూడ సౌమ్యములు-తెల్లనివి, అసౌమ్యములు-నల్లనివియునగు రూపములుగావించెను. ఆ మీద స్వయముగ తానై అవతరించిన తనను స్వాయంభువుగా రూపొందించి మనుప్రజాపతిం గావించెను. ఆ స్వాయంభువమనువు తపస్సుచే సర్వకల్మషములందలగిన శతరూపయను కన్యను బత్ని గా స్వీకరించెను. ఆమె యమ్మనువువలన ప్రియంతుడు ఉత్తానపాదుడు నను నిద్దరు కొడుకులను ప్రసూతి ఆకూతి యను నిద్దరుకూతుండ్రను గనెను, అతడు ప్రసూతిని దక్షునికిని ఆకూతిని రుచికి నొసంగెను. అవ్వల నాప్రజాపతికి ఒక మిధున ముదయించినది. అందు పురుషుడు యజ్ఞము, స్త్రీ దక్షిణ. యజ్ఞపురుషునికి దక్షిణయను నా భార్యయందు పదునొకండుపుత్రులుదయించిరి. వారు యాములను పేర దేవతలుగా ప్రసిద్ధులయిరి. దక్షుడు ప్రసూతియందిరువదినల్గురు గన్యలం గనెను. వారిపేరులు శ్రద్ధ, లక్ష్మి ధృతి పుష్టి తుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి బుద్ధి కీర్తి, దాక్షాయణులను వారిని (దక్షుని కూతుండ్రన్నమాట) ధర్ముడు పత్నులనుగా గ్రహించెను. తక్కిన పదునొకండుగురు కన్యలు 1. ఖ్యాతి 2. సతి 3. సంభూతి 4. సృతి 5. ప్రీతి 6. క్షమ 7. సన్నతి 8. అనసూయ 9. ఊర్జ 10. స్వాహా 11. స్వధ అనువారిని వరుసగా 1 భ్రుగువు 2 భవుడు (శివుడు) 3 మరీచి 4 అంగిరసుడు 5 నేను(పులస్త్యుడన్న మాట)6 పులహుడు 7 క్రతువు 8 అత్రి 9 వశిష్టులు భార్యలనుగా స్వీకరించిరి. శ్రద్ద కాముని లక్ష్మి బలుని ధృతి నియముని తుష్టి సంతుష్టుని పుష్టి లోభు శ్రుతి క్రియాదండుని నయుని వినయుని బుద్ధి బోధుని లజ్జ వినయుని వపువు వ్యవసాయుని శాంతి క్షముని బుద్ధి సుఖము కీర్తి యశుని గనిరి. వీరందరు ధర్మపుత్రులు. (గణవాచకములగు నీపదములిక్కడ వుంలింగవాచకములగుటచేత నాయాగుణాధిష్ఠాన దేవతలుగా వీరిని మనముగ్రహింపపలసియుండును) నంది యను నామె కాముని వలన హర్షుడను కొడుకుం గనెను. (ధర్మపౌత్రుడితడు)హింసయందు ధర్మునికి అనృతుడను కొడుకు నికృతియను కన్యయు గల్గిరి. వారికి భయుడు మాయ నరకుడు వేదనయునను రెండు మిధునములు గల్గెను. వారిలో మాయ భూతాపకారియగు మృత్యువుంగనెను. వేదనయను నామెకు రోదనునివలన దుఃఖుడు పుట్టినాడు. మృత్యువునకు వాధి జర శోకము తృష్ణకు క్రోధుడు గల్గిరి. దుఃఖునికి తరువాతివారు వీరందరు నధర్మలక్షణులు, వీరికి భార్యలేదు పుత్రులులేరు. వీరందరు నూర్ధ్వరేతస్కులు. బ్రహ్మయొక్క యీ రౌద్రరూపము లీ జగత్ర్పళయమునకు కారణములగుచుండును. ఇక రుద్రసర్గము జెప్పెద.

-: బ్రహ్మకృత రుద్రసర్గము :-

కల్పము మొదట బ్రహ్మ తనతో సమానుడగు కుమారుడు కావలెనని ధ్యానించుచుండగా నా ప్రభువు తొడపై నీలలోహితుడను కుమారు డావిర్భవించెను. అతడు సుస్వరముగ రోదించుచు (ఏడ్చుచు) ద్రవించుచు (పరుగెత్తుచు) నుండం జూచి ఎందుకేడ్తువని యడుగ నతడు నాకు పేరొకటి యిమ్మనియడుగ ప్రజాపతి రోదనముచేయుటవలన రుద్రుడను పేర పిలువబడుదువని నామకరణమొనరించి, ఇంకనేడవకము అని వారు దైర్యమూనుమన్నను నాతడు మఱియేడుమారులు రాగాలు వెట్టెను. అంతట నతనికి మరి యేడు పేర్లనొసంగెను. ఈ ఎనిమిది మూర్తులకు నెనిమిది స్థానములనుగూడ యేర్పరచెను. ఆ అష్టమూర్తులు రుద్రునితో కలిసి 2 భవుడు 3 శర్వుడు 4 ఈశానుడు 5 పశుపతి 6 భీముడు 7 ఉగ్రుడు 8 మహదేవుడు యెనమండుగురుగా పితామహుడు పేర్కొనెను. వీరి తనువులు (మూర్తులు శరీరములు) వరుసగా 1 సూర్యుడు 2 జలము 3 భూమి 4 అగ్ని 5 వాయువు 6 ఆకాశము 7 దీక్షితుడగు బ్రాహ్మణుడు 8 స్రోముడు నగువారు. ఈ విధమైన రుద్రుడు సతీదేవిని పత్నిగా గైకొనెను. అమె దక్షునియెడ కోపముగొని తన శరీరమును విడిచెను. అవ్వల హిమవంతునికి మేనాదేవియందు కుమార్తెయై యుదయించెను. భగవంతుడు భవుడు హిమ వంతునడిగికొని యామెం బెండ్లాడెను. దక్షకన్య ఖ్యాతి భృగునివలన దాతను విధాతను శ్రీదేవినిం గనెను. ఆమెయే నారాయణుని ధర్మపత్ని భార్గవి యనబడెను.

ఇది పద్మపురాణము సృష్టిఖండమున బ్రహ్మసర్గవర్ణనమను మూడవయధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters