Sri Padma Mahapuranam-I    Chapters   

త్రింశోధ్యాయః

-: విష్ణుపదోత్పత్తి:-

భీష్మ ఉవాచ :- యజ్ఞపర్వతమాసాద్య విష్ణునా ప్రభువిష్ణునా | పదాని చేహ దత్తాని కిమర్థం పదపద్ధతిః || 1

కృతా వై దేవదేవేన తన్మే వద మహామతే | కతమో దానవస్తేన విష్ణునా దమితోత్ర వై || 2

కృత్వా వై పదవిన్యాసం తన్మే శం మహామునే | స్వర్లోకే వసతిర్విష్ణోర్వైకుంఠేస్య మహాత్మనః || 3

స కథం మానుషే లోకే పదన్యాసం చకార హ | దేవలోకేషు వై దేవదేవాః సేంద్రపురాగమాః || 4

తపసా మహతా బ్రహ్మన్‌ భక్తా యే సతతం ప్రభుం | శ్రీవారాహస్య వసతిర్మహర్లోకే ప్రకీర్తితా || 5

నృసింహస్య తథా ప్రోక్తా జనలోకే మహాత్మనః | త్రివిక్రమస్య వసతిస్తపోలోకే ప్రకీర్తితా || 6

లోకానేతాన్పరిత్యజ్య కథం భూయో పదద్వయం | క్షేత్రే పైతామహే చాస్మిన్పుష్కరే యజ్ఞపర్వతే || 7

పదాని కృతవాన్ర్బహ్మన్విస్త రాన్మమ కీర్తయ | శ్రుతేన సర్వపాపస్య నాశో వై భవితా ధ్రువమ్‌ || 8

-: విష్ణు పదోత్పత్తి:-

భీష్ముడనియె :- విష్ణువు సర్వసమర్ధుడు. యజ్ఞపర్వతమునకేగి యట నడుగులానించెను. ఈ పదపద్ధతి యెందుకొఱకు దేవదేవుడొనరించెను? మహామునీ, స్వర్గలోకమందు వైకుంఠమందుగద యీ మహాత్ముడు విష్ణువుయెక్కనివాసము. ఆయన మానుషలోకమందెట్లడుగిడెను? దేవా ! బ్రాహ్మణోత్తమా ! ఎల్లప్పుడు భక్తులు మహాతపస్సుచే సతతము నారాధించినవారు దేవతలు, ఇంద్రాదులు దేవలోకమున గదా యుందురు. శ్రీ వరాహమూర్తి వసతి మహర్లోకమున గదా! మహానృసింహమూర్తి జనోలోకమునందున్నారు గదా! త్రివిక్రముడు వామనమూర్తి యుండునది తపోలోకమనబడినది కదా! ఈ లోకములన్నిటిని వదలి భూమిమీద బ్రహ్మక్షేత్రమందిక్కడ పుష్కరమంధు యజ్ఞపర్వతముపై నడుగులుంచబడినవి. బ్రహ్మణ్య ! యాకథ విస్తరముగ నా కానతిమ్ము. విన్నదాన సర్వపాపనాశమగుట నిశ్చయముగదా! అన పులస్త్యుడిట్లనియె. 8

పులస్త్య ఉవాచ :- నమ్యక్‌ పృచ్ఛసి భోస్త్యం యత్‌ సంశృణు త్వం సమాహితః |

యథా పూర్వం పదన్యాసః కృతో దేవేన విష్ణునా || 9

యజ్ఞపర్వతమాసాద్య శీలపర్వతరోధసి | పురా కృతయుగే భీష్మ దేవకర్యార్ధసిద్దయే || 10

విష్ణునా చ కృతం పూర్వం పృధివ్యర్థే పరంతప | త్రిదివం సర్వమానీతం దానవైర్బలవత్తరైః || 11

త్రైలోక్యం వశమానీయ జిత్వా దేవాన్సవాసవాన్‌ | దానవా యజ్ఞభోక్తారస్తత్రాసన్‌ బలవత్తరాః || 12

చక్కగ నడిగితివాలింపుము మనసువెట్టి. మున్ను విష్ణువు కృతయుగమందు దేవకార్యసిద్ధికొఱకు యజ్ఞపర్వతమునకు వచ్చి శీలపర్వతపుటొడ్డున వాదముంచెను. అది భూలోకముపకారమునకే. మిగుల బలవంతులైన దానవులు ఇంద్రునితో నెల్లదేవతలనోడించి స్వర్గమెల్ల వశముసేసికొనిరి. ముల్లోకములను లోబరచుకొనిరి. బలవత్తరులగుటచే నట దానవులు యజ్ఞభోక్తలైరి. 12

కృతా బాష్కలినా సర్వే దానవానేన బలీయసా | ఏవంభూతే తదా లోకే త్రైలోక్యే సచరాచరే || 13

పరమార్తిం య¸° శక్రో నిరాశో జీవితే కృతః | సబాష్కలిర్దానవేంద్రోవధ్యోయం మమ సంయుగే || 14

బ్రాహ్మణో వరదానేన సర్వేషాం తు దివౌకసాం | తదహం బ్రహ్మణో లోకే వృతః సర్వైర్దివౌకసైః || 15

వ్రజామి శరణం దేవం గతిరన్యా న విద్యతే | ఏవం విచింత్య దేవేంద్రో వృతః సర్వైర్దివౌకసైః || 16

జగామ త్వరితో భీష్మ యత్ర దేవః పితామహః | బ్రహ్మణః సంపదం ప్రాప్య వృతసై#్తశ్చ దివౌకసైః || 17

అబ్రవీత్‌ జగతః కార్యం ప్రాప్తామాపదముత్తమాం | కిం న జానాసి వై దేవ యతో నో భయమాగతమ్‌ || 18

దైత్యైర్యదాహృతం సర్వం వరదానాచ్చ తే ప్రభో | కథితం వై మయా సర్వం భాష్కలేశ్చ దురాత్మనః || 19

క్రియతాం చావిలంబేన పితా త్వం నః పితామహః | తత్త్వం చింతయ దేవేశ శాంత్యర్ధం జగతస్త్విహ || 20

బాష్కలిచే దానవులెల్ల నిట్లు మిగుల బలవంతులుగా చేయబడిరి. చరాచరము ముల్లోకమిట్లయినంత యముడు పరమబాధకు లోనయ్యెను. ఇంద్రుడు బ్రతుకుపై నాశగోల్పోయెను. ఆ బాష్కలి యమునితోడి యుద్ధమందవధ్యుడయ్యెను. బ్రహ్మవరమున వాడిట్లయ్యెను. నేనిక దేవతలందరితో బ్రహ్మలోకమునకేగి బ్రహ్మను శరణుసొచ్చెద నికవేరుగతిలేదని చింతించి పితామహుని సత్వరము శరణొందెను. జగత్కార్యము విన్నవించి ప్రాప్తించిన పరమవిపత్తును సెప్పికొని ప్రభూనీవిచ్చిన వరదానముచే బ్రాప్తించిన భయము దెలిపితిని. వెంటనే నీవు మాతండ్రివిగాన శాంతికైచేయనగునది నీవాలోచింపుము. 20

తేషాం చ పశ్యతాం కించిచ్ఛ్రౌతస్మర్తాదికాః | న ప్రావర్తన్త హానిస్తు తై రస్మాకం దినే దినే || 21

యథా హి ప్రాకృతః కశ్చిత్స్వార్థముద్దిశ్య భాషతే | విజ్ఞాప్యసే తథాస్మాభిర్నిరస్తోపకృతైః సదా || 22

యద్యేనోపకృతం యస్య సహస్రగుణితం పునః | యో న తస్యోపకారాయ తత్కరోతి వృథా మతిః || 23

తస్యోపకారదగ్ధస్య నిస్త్రపస్యాసతః పునః | నరకేష్వపి సంవాసస్తస్య దుష్కృతకారిణః || 24

నైతావతైవ సాధుత్వం కృతే యా తు ప్రతిక్రియా | స్వార్ధైకనిష్ఠబుద్ధినా మే తన్నాపి ప్రవర్తతే || 25

యద్యస్య నాభవస్థానం జగతోహ్యత్ర దుఃఖదం | శతధా హృదయం దీర్ణం తన్న త్పప్తిముపాగతమ్‌ || 26

తత్ర వా యత్ర గంతాస్మి నిమగ్నానుద్ధరస్వ నః | ఉపాయకథనేనాస్య యేన తేజః ప్రవర్తతే || 27

యథాఖ్యాతం మయాం దృష్టం జగత్‌ తత్థ్సమవేక్ష్యతాం | నిఃస్వాధ్యాయవషట్కారం నివృత్తోత్సవమంగలమ్‌ || 28

త్యక్తాధ్యయనసంయోగం ముక్తవార్తపరిగ్రహం | దండనీత్యా పరిత్యక్తం శ్వాసమాత్రావశ్రోషితమ్‌ || 29

జగదార్తిమపి ప్రాప్తం పునః కష్టతరాం దశాం | ఏతావతా హి కాలేన వయం గ్లానిముపాగతాః || 30

ఆ రాక్షసులు చూచుచుండ శ్రౌతస్మార్తాదిక్రియలు జరుగుటలేదు. అందుచే మాకు దినదినగండమేర్పడినది. సామాన్యమానవుడు స్వార్ధముకోరియే మాటలాడునట్లు ఉపకరింపని పనికి మేమిట్లు మాట్లాడుచున్నాము. ఎవడెవని కుపకారము సేయునో దానికి వేయిరెట్లు ఈతడు ప్రత్యుపకారము సేయడేని వానికిచేసిన యుపకారము వ్యర్ధమనబడును. ఆ పాపకర్మునికి నరకవాసము తప్పదు. ప్రత్యుపకారము సేసినంతమాత్రముననది సాధుత్వము మంచితనముగాదు. స్వార్ధమేకోరువాండ్రయెడనిది వర్తించదు. ఎవనికెచట స్థానముండవలసినదో దుఃఖకరము వానికదిలేనిచో హృదయము నూరుముక్కలగును. గాని సంతృప్తి పొందదు. ఎటకైన పోయెదము. కష్టములో మునిగినమమ్ముద్ధరింపుము. ఉపాయముసెప్పినందువలన వీనికి తిరిగి తేజస్సు గలుగగలదు. జగత్తుపరిస్థితి నేచెప్పినట్లున్నదోలేదో చూడుము. స్వాధ్యాయనములు లేవు వషట్కారములు లేవు. (యజ్ఞములు హోమాలు లేవన్నమాట) మంగళోత్సవములాగిపోయినవి. వేదాధ్యయనముతో సంబంధమే వదలిపోయినది. వార్త వాణిఙ్యాదులాగిపోయినవి. దండనీతి లేనేలేదు. ఊపిరిమాత్రముతో బ్రతుకు మిగిలినది. జగత్తు దుఃఖవశ##మైనది. కష్టదశ పాలైనది. ఇంతకాలము మేము శుష్కించిపోయినాము, అని ఘోషింప బ్రహ్మ యిట్లనియె. 30

బ్రహ్మోవాచ ;- జానామి బాష్కలిం తం తు వరదానాచ్చ గర్వితం |

అజేయం భవతాం మన్యే విష్ణుసాధ్యో భవిష్యతి || 31

నిరుధ్య సంస్థితో బ్రహ్మాభావం తత్వమయం తదా | సమాధిస్థస్య తసై#్యవ ధ్యానమాత్రాచ్చతుర్భుజః || 32

స్తోకేనైవ హి కాలేన చింత్యమానఃస్వయంభువా | ఆజగామ ముహుర్తేన సర్వేషామేవ పశ్యతామ్‌ || 33

నీ వరమిచ్చుటచే భాష్కలి పొగరెక్కినట్లు నేనెఱుగుదును. మీకు జయింపనలవికాదు. విష్ణువునకే సాధ్యము. అని బ్రహ్మ తత్త్వమయమైన భావమునపుడు నిరోధించి కూర్చుండెను. సమాధియందు నిలిచి ధ్యానించినంతకొలది సమయము లోనే చతుర్భుజుడు విష్ణువు అందరు చూచుచుండ అటకు దయచేసెను. మఱి యిట్లు పలికెను. 33

విష్ణురువాచ :- భో! భో! బ్రహ్మన్నివర్తస్వ ధ్యానాదస్మాన్నివారితః |

యదర్థమిష్యతే ధ్యానం సోహం త్వా సముపాగతః || 34

బ్రహ్మోవాచ :- మహాప్రసాద ఏషోత్ర స్వామినో హి ప్రదర్శనం |

కస్యాన్యస్య భ##వేచ్చైషా చిన్తా యా జగతః ప్రభోః || 35

మమైవ తావదుత్పత్తిర్జగదర్థే వినిర్మితా | జగదేతత్త్వదర్థీయం తత్వతో నాస్తి విస్మయః || 36

భవతా పాలనం కార్యం సంహరేద్రుద ఏవ తు | ఏవంభూతే జగత్యస్మిన్‌ శక్రస్యాస్య మహాత్మనః || 37

హృతం రాజ్యం బాప్కలినా త్రైలోక్యం సచరాచరం | భృత్యస్య క్రియతాం సాహ్యం మంత్రదానేన కేశవ || 38

ఓ బ్రహ్మా! ఈ సమాధినుండి మరలుము. ఎందుకొఱకు ధ్యానము సేసితివో ఆ నేనిదె వచ్చితినన బ్రహ్మయనియె. 'మహాప్రసాదమిది స్వామియనుగ్రహమునాకు జగత్ప్రభూ ! ఇంకెవనికిది లభించును ? నాపుట్టువే జగనిమిత్తముగా తమచే నిర్మింపబడినది. ఈ లోకము నీ తత్త్వమును బట్టి నీ నిమిత్తమైనదే. ఇందు వింతలేదు. తమరే జగద్రక్షణ సేయవలయును. రుద్రుడు సంహరించును. ఈలాయున్న యీ జగత్తునందిపుడు మహాత్ముడింద్రుని రాజ్యమును బాష్కలి హరించినాడు. కేశవ నీ సేవకునికి మంత్రమిచ్చి సహాయము సేయుడు' అన వాసుదేవు డిట్లనియె. 38

వాసుదేవ ఉవాచ:- భవతో వరదానేన అవధ్యః స తు సాంప్రతం |

బుద్ధిసాధ్యః స వై కార్యో బంధనాదిహ దానవః || 39

వామనోహం భవిష్యామి దానవానాం వినాశకః | మయా సహ వ్రజత్వేష భాష్కలేస్తు నివేశనమ్‌ || 40

తత్ర గత్వా వరంత్వేష మదర్థే యాచతామిమం | వామనస్యాస్య విప్రస్య భూమే రాజన్పదత్రయమ్‌ || 41

ప్రయచ్ఛస్వమహాభాగా యాజ్చైషా తు మయా కృతా | శ##క్రేణోక్తో దానవేంద్రో దద్యాత్స్వమపి జీవితమ్‌ || 42

గృహ్య ప్రతిగ్రహం తస్య దానవస్య పితామహ | త్వం బధ్వా చ తతో యత్నాత్కృత్వా పాతాలవాసినమ్‌ || 43

సౌకరం రూపమాస్థాయ వధార్ధం దురాత్మనః | భవిష్యామి న సందేహో వ్రజ శక్ర త్వరాన్వితః || 44

నీ వరదానమున వాడిప్పుడు అవధ్యుడు. బంధించి వానిని బుద్ధిచే (తెలివిచే) నిపుడు సాధింపవలెను. నేను దానవనాశమునకేనిపుడు వామనుడనయ్యెదను. నావెంéట నీ యింద్రుడు బాష్కలి యింటికేగుగాక : అచటకేగి యటలాడుకొనుచు నితడు నాకొఱకు యీ వామనునికి (ఈ పొట్టిబాపనికి) రాజా : మూడడుగుల భూమి యిమ్మని బాష్కలినితడు యాచించుగాక. నన్ను శరణిందింతివిగాన నీకొఱకే నీయాచన సేసెదను. ఇంద్రుడు చెప్పగానే దానవేంద్రుడు తనప్రాణమైన యిచ్చును. దానవుని వలన దానము పట్టి పితామహ : వానిని భార్యతో పాతాళనివాసిగా ప్రయత్నపూర్వకముగా నొనరించి నేను వానిం జంపుకొఱకు పరాహరూపముగొని సన్నద్ధుడయ్యెదను. సందేహములేదు. ఇంద్రా ! నీవు త్వరగా నటకు వెళ్ళుము' అని విష్ణువిట్లుముగించి యంతర్ధానమందెను. 44

విరరామ తము క్త్వైవమంతర్థానం గతశ్చ వై | అథ కాలాంతరే విష్ణావదితేర్గర్భతాం గతే || 45

నిమిత్తాన్యతిఘోరాణి ప్రాదుర్భూతాన్యనేకశః | సమస్తజగదాధారే విష్ణౌ గర్భత్వమాగతే || 46

శోభనం హి తదా జాతం నిమిత్తం చైవమూర్జితం | మాలతీకుసుమానాం తు సుగంధః సురభిర్వవౌ || 47

ఆపైని కొండొకకాలమునకు సర్వజగదాధారుడు విష్ణువదితి గర్భమయినంత ననేక ఘోరనిమిత్తములు కనిపించినవి. అపుడు శుభ నిమిత్తముగూడ గొప్పదిటు కనిపించెను. మాలతీ, కుసుమము సువాసనలు నెల్లడ చిమ్ముకొనెను. 47

అథ విహితవిధానం కాలమాసాద్య దేవస్త్రిదశగణహితార్థం సర్వభూతానుకంపీ ||

విమలవిరలకేశశ్చంద్రశంభోదయశ్రీరదితితనయభావం దేవదేవశ్చకార || 48

అవతరతి చ విష్ణౌ సిద్ధదేవాసురాణామనిమిషనయనానాం విప్రసేదుర్ముఖాని |

అతివిరతరజోభిర్వాయుభిః సంవహద్భిర్దినమపి చ తదాసీజ్ఞన్మవిష్ణోఃసుగర్భే || 49

అదితిరజనగర్భా సాపి దేవీ ప్రయాంతీ నతజఘనభరార్తా మందసంచారరమ్యా ||

అలసవదనఖేదం పాండుభావం వహంతీ గురుతరమవగాఢం గర్భమేవోద్వహంతీ || 50

సర్వభూతానుగ్రహమూర్తి విష్ణువు కార్యసాధనకనుకూలమైనకాలమునంది సురగణహితము కొఱకు స్వచ్చమైన విప్పారిన జుట్టుతో, చంద్రుని, శంఖమువంటి యచ్చమైన కాంతితో నదితికి తనయత్వమందెను. ఆలా విష్ణుడవతరింపగా దేవాసురసిద్ధ సంఘమల ముఖములు రెప్పపాటుగొనక ప్రసన్నములయ్యెను. ఏమాత్రము ధూళిలేక నల్లనవీచు వాయువులతో విష్ణుజన్మదినమది యెంతో శోభనమయ్యెను. ప్రసవించుదాక అదితికూడ గర్భభారమున నడుమువంగి నడచుచు నల్లన మెల్లని నడక నింపుగొలుచుచును అలసిన ఖేదమునుపొందు భావమును (తెలుపుని)బూని మిగులబరువైన గర్భమును మోయుచుండెను. 50

తతః ప్రవిష్టే ఖలు గర్భవాసం నారాయణ భూతభవిష్యయోగాత్‌ |

వినా పదం ప్రాప్తమనోరథాని భూతాని సర్వాణి తదా బభూవుః || 51

సమీరణో వాతి చ మందమందం పతత్సు వర్షేషు నగోద్భవేషు |

వివిక్తమార్గేషు దిగంతరేషు జనేషు వై సత్యముపాగతేషు || 52

విముచ్యమానే గగనే రజోభిః శ##నైశ్శనైర్నశ్యతి చాందకారే | ఉదరాంతర్గతే విష్ణౌ ద్రోహబుద్ధిస్తథాభవత్‌ || 53

తాం నిశామయ రాజేంద్ర దేవమాతుర్యథాక్రమం | కిమనుక్రమణనైవ లంఘయామి త్రివిష్టపమ్‌ || 54

భాష్కలిం దానవేంద్రం తం కుర్యాం పాతాలవాసినం | శక్రస్య తు మయా దత్తం ధనం లావణ్యమేవ చ || 55

దానవానాం వినాశాయ ఏకైవ ప్రభవామ్యహం | క్షపామి శరజాలాని చక్రయానాన్యనేకశః || 56

గదావ్రతాంశ్చ వివిధాన్‌ దానవానాం వినాశ##నే | విబుధాన్‌ దేవలోకస్థానథోభూమేస్తు దానవాన్‌ || 57

కరోమి కాలయోగేన తత్తు కార్యం వ్రతేన మే | నిస్సృతా సహసా వాణీ వక్త్రమేవాభిసంస్థితా || 58

జరిగిన జరుగనున్న యోగానుసారము నారాయణుడు గర్భవాసమున జొచ్చియున్నంత, కొండలపైనున్న నెమలిపురులు రాలుచుండ, నలుదెసలనొత్తిడిలేని దారులందు జనము సంచరించుచుండ, నాకాశము ధూళిగ్రమ్మక మిగుల స్వచ్ఛముగనున్న కతన చీకటులెల్ల తొలగ, విష్ణువు గర్భమునందున్న తఱి నదితి బుద్ధిద్రోహభరితమయ్యెను. భీష్మరాజేంద్ర : వేల్పులతల్లి కపుడు కలిగిన తలంపది వినుము. త్రివిష్టపమును నడుగులువేసికొనుచునే దాటుదునా! బాష్కలిని వానిని పాతాళ వాసి నొనరింతునా! ధనము లావణ్యమును నేనింద్రునకే యిచ్చియున్నాను. దానవుల వినాశమునకేనొక్కడను సమర్దుడను బాణములను చక్రముసుడులంజిమ్మదునుగద నెన్నొ త్రిప్పులంద్రిప్పుదును, విబుధుల దేవలోకవాసులుగను, దానవుల పాతాశవాసులను కాలముపయోగింపనొనరింతును. అది నేను వ్రతనిష్ఠతో నియమముతో జేయవలసినది. వాణి హఠాత్తుగ వెడలి ముఖమున నిల్చినది. 58

యేనేదం చిన్త్యతే పూర్వం యన్న దృష్టం న చ శ్రుతం | బంధం వై దనుముఖ్యస్య కృతం కోపేన పశ్య మే || 59

కశ్యపాయ పురా దత్తం ధనం లావణ్యమేవ చ | కిమయం విగతోత్సాహో వాయవోథ సమాకులాః || 60

భ్రమతీవ హి మే దృష్టిర్మైతద్రూపం ప్రచింతితం | ఆవిష్టో కిమహం వచ్మి కేనాప్యసదృశ వచః || 61

వికల్పవశమాపన్నా ఖీక్‌ష్ణం హృదిమమర్శ సా | దధార దివ్యం వర్షాణాం సహస్రం దివ్వమీశ్వరమ్‌ || 62

తతః సమభవత్త స్యాం వామనో భూతవామనః | జాతేన యేన చక్షూంషి దానవానాం హృతాని వై || 63

జాతమాత్రే తతస్తస్మిన్‌ దేవదేవే జనార్దనే | నద్యః స్వచ్ఛాంబువాహిన్యో వవౌ గంధవహోనిలః || 64

కశ్యపోపి సుఖం లేభే తేన పుత్రేణ భాస్వతా | సర్వేషాం మానసోత్సాహసై#్రలోక్యాంతర వాసినామ్‌ || 65

మున్నెన్నడు చూడనిది విననిది యిపుడూహింపబడుచున్నది. దనుజముఖుని కోపముగొని బంధించెనిదె చూడుము. మున్ను కశ్యపునికి దనము లావణ్యము నీయబడినవి. ఇతడుత్సాహము తొలగెనా? వాయువులాకులములైనవి. నాచూపు చెదురుచున్నట్లున్నది. ఈరూపమెన్నడు నేననుకొనలేదు. ఏదో ఆవేశమున నెందుచేతనో ఆడరానిమాటలాడుచుంటిని. ఆదితి యిట్లెంతో విమర్శలోబడి హృదయమందిట్లు విమర్శించుకొనెను. వేయి దివ్వసంవత్సరములదితి యీశ్వరుని దనగర్భబందు మోసెను. ఆపై భూతవామనః=భూతములనెల్ల సుందరుడు వామనుడు-పొట్టివాడు వామనావతారమూర్తి జన్మించెను పుట్టగానే దానవులకన్నులు హరింపబడెను. దేవదేవుడు జనార్ధనుడాయన పుట్టినంతనే నదులు తేరుకున్నవి. వాయువు సువాసనలతో వీచెను. కశ్యపుడు నా తేజశ్శాలి యాబిడ్డచే తనివిసెందెను. త్రిలోకములం దందరిమనస్సు లుత్సాహభరితములయ్యెను. 65

సంజాతమాత్రే తు తతో జనాధిప జనార్ధనే | స్వర్గలోకా దుందుభయో వినేదుసై#్తశ్చ తాడితాః || 66

అతిప్రహర్షాత్తు జగత్త్రయస్య మోహశ్చ ధుఃఖాని చ నాశమీయుః |

జగౌ చ గంధర్వగణోతిమాత్రం భావస్వరైర్భర్తృభిరాశ్రితాశ్చ || 67

సురాఙ్గనాశ్చాపి చ భావయుక్తా నృత్యంతి తత్రాప్సరసాం సమూహాః |

తథైవ విద్యాధరసిద్ధసంఘా విమానయానైర్ముదితా భ్రమంతి || 68

వదంతి సత్యానృతకార్యనిర్ణయం తథాభిరంగం ప్రతిదర్శయంతి |

గాయంతి గేయం వినివృత్తరాగా ముహుర్ముహుర్ధుఃఖసుఖప్రభూతాః || 69

అతడు పుట్టగానే రాజా! స్వర్గమందు దేవదుందుభులు మ్రోగెను. అత్యానందముచే ముల్లోకమున మోహము దుఃఖములు నశించెను. గంధర్వగణము భర్తలతో భావముతో స్వరసంపదతోపాడిరి. సురాంగనలు అప్సరసస్సమూహము భావముతో నెగసి (అనురక్తితో) నాడిరి. విద్యాధర సిద్ధసంఘములుప్పొంగుచు విమానములపై విహరించిరి. సత్యము (నిజము) అనృతము-అబద్ధమునైన కార్యముల నిర్ణయము సేసి రంగస్థలమున చూపించుచుండిరి. రాగరహితులై పాటపాడిరి. దేనియందు ననురాగములేనివారై విరాగులై మాటిమాటికి దుఃఖము సుఖముచే వివశులై రాగాలాపన సేసిరి. 69

నృత్యంతి వై స్వర్గగతాశ్చ తే తు ధర్మార్జితః స్వర్గమితో వ్రజంతి |

ఇతి విగతవిషాదే నిర్మలే జీవలోకే తిమిరనికరముక్తా నిర్వృతిం ప్రాప్నుకామాః || 70

స్వర్గమందుండియు వారు ధర్మార్జితమైన స్వర్గము నిక్కడనుండి యేగుదురని దుఃఖము విడిచి నిర్మలమైన జీవ లోకమునందు చీకటిలెల్లదొలగి నిర్వృతిని-పరమానందానుభవమును పొందగోరి యటనుండి స్వర్గమునకేగగలరని పాడుచుండి రాడుచుండిరి. 70

తత్రోచుః కాశ్చిదుర్వ్యాం జయ జయ భగవన్సంప్రహృష్టాశ్చ

కేచిత్వేవం ప్రోక్తంప్రణాదైవరవిరలమనసశ్చాను వాదైస్తధాన్యే |

ధ్యాయంత్యన్యే నిగూఢం జననభయజరామృత్యువిచ్ఛేదహేతోరిత్యేవం కృత్స్న

మాసీజ్జగదిదమఖిలం సర్వతః సంప్రహృష్టమ్‌ || 71

అట కొందరు హర్షించుచు భగవంతుడా . అవనియందు జయింపుజయింపుమని జయజయధ్వానములు సేయుచుండిరి. కొందరిట్లు వ్రాలి నమస్కరించుచు మనసుని చెదరకుండ వంతపాడుచుండిరి. కొందరు పెక్కుపుట్టువులతోగూడిన జరామరణముల విచ్ఛేదముకొఱకని ధ్యాననిమగ్నులగుచుండిరి. ఈలా యీజగమెల్ల యెల్లయెడల నానందభరితమై యుండెను. 71

పరమాసాద్య యం విష్ణుం బ్రహ్మాహ జగతః కృతే | జాతోయం భవతామర్ధే వామనో యదపీశ్వరః || 72

ఏష బ్రహ్మా చ విష్ణుశ్ఛ ఏష ఏవ మహేశ్వరః | ఏష వేదాశ్చ యజ్ఞాశ్చ స్వర్గశ్చైష న సంశయః || 73

విష్ణువ్యాప్తమిదం సర్వం జగత్‌ స్థావరజంగమం | ఏకః స తు పృథక్త్వేన స్వయం భూరితివిశ్రుతః || 74

యధార్థవర్ణకే స్థానే విచిత్రః స్పాటికో మణిః | తతో గుణవశాత్తస్య స్వయంభోరనువర్తనమ్‌ || 75

యథాహి గార్హపత్యోగ్నిరన్యసంజ్ఞాం పున ర్వ్రజేత్‌ | లభేత సంజ్ఞాం భగవాన్‌ బ్రహ్మాదిషు తథాహ్యసౌ || 76

సర్వథా వామనో దేవో దేవకార్యం కరిష్యతి | ఏవం చింతయతాం తేషాం భావితానాం దివౌకసామ్‌ || 77

బ్రహ్మ పరమేశ్వరులు విష్ణునిజేరి జగత్‌క్షేమము కొఱకు నీయన ఈశ్వరుడేయైనను మీ ప్రయోజనము కొఱకు బుట్టినాడు. ఈయనయె పరమేశ్వరుడు. ఈయన బ్రహ్మ విష్ణువు డతడే మహేశ్వరుడును. ఇతడు వేదములు. స్వర్గమితడే సంశయము లేదు. స్థావరజంగమ మీజగత్తెల్ల విష్ణువుచే వ్యాప్తమైయున్నది. ఒక్కడేయాయన వేరుగ బ్రహ్మయని విశ్రుతుడయ్యెను. (వేదములందు వినబడెను.) నిజమైన ఒక్కరంగు స్పటికమణి నాయాతావుల పెక్కురంగులదైనట్లు స్వయంభవుడగు విష్ణువునకు గుణవశమున నాయారూపానువర్త నము జరుగుచుండును. గార్హపత్యాగ్ని వేరేపేరందినట్లు భగవంతుడీయన బ్రహ్మాదులందాయాపేరులందుచుండును. అన్ని విధముల వామనుడు దేవుడు దేవకార్యము సేయగలడు. అని యిట్లు విమర్శించుచు యా దేవతలవెంట నింద్రునితో బాష్కలి నివాసమునకు విష్ణువు వెళ్ళెను. 77

జగామ శక్రసహితో బాష్కలేశ్చ నివేశనం | దూరాదేవ చ తాం దృష్ట్వా పురం తస్య సమావృతమ్‌ || 78

పాండురైః ఖగమాగమ్యైః సర్వరత్నోపశోభితైః | శోభితాం భవనైర్ముభ్యైస్సువిభక్త మహాపథైః || 79

నిత్యప్రభిన్నైర్మాతంగైరంజనాచలసన్నిభైః | దేవనాగకులోత్పన్నైః శతసంఖ్యైర్విరాజితామ్‌ || 80

నిర్మాంసగాత్రైస్తురగైరల్పకర్ణైర్మనోజవైః | దీర్ఘ గ్రీవాక్షికూటైశ్చ మనోజ్ఞైరుపశోభితామ్‌ || 81

పద్మగర్భ సువర్ణాభాః పూర్ణచంద్రనిభాననాః | సంల్లాపోల్లాపకుశలాస్తత్ర వేశ్యాః సహస్రశః || 82

న తత్పుణ్యం న సా విద్యా న తచ్ఛిల్పం న సా కలా | వాష్క లేర్న పురే స్యాథ నివాసం ప్రతి గచ్ఛతి || 83

ఉద్యానశతంసంబాధం సమాజోత్సవమాలిని | అన్వితే దనుముఖ్యైశ్చ సర్వైరంతకవర్జితైః || 84

వీణావేణుమృదంగానాం శ##బ్దైః సర్వత్రనాదితే | సదా ప్రహృష్టా దనుజా బహురత్నోపశోభితాః || 85

క్రీడామానాః ప్రదృశ్యంతే మేరావివ యథామరాః | బ్రహ్మఘోషా మహాంస్తత్ర దనువృద్ధైరుదీరతః || 86

-: బాష్కలిపుర వర్ణనము :-

దూరమందుండియే ఆ పురముంజూచెను. దేవతలకు లేదా విమానములకు వెళ్ళశక్యముగానివి, సర్వరత్నశోభితములు తెల్లని చక్కని భవనములతో, జక్కగా విడమర్చిన రాచబాటలతో, కాటుకకొండలట్లు నిత్యము, విడమర్చి నిలిపిన వేల్పుల యేనుగుల జాతిలోబుట్టిన వందలకొలది యేనుగులతో రాజిల్లుచున్నది. మాంసమెత్తుగలేనివి, చిన్నచెవులు, పొడవైన మెడలు కన్నులతో, మనస్సుతో సమానవేగము గలవియునగు గుఱ్ఱములతో నానగరము శోభించుచున్నది. తామరపూవుబొడ్డువంటి (పసుపుపచ్చనివి) రంగు, పున్నమచందురునివంటి మోములు గలవారు, పై యెత్తున మాటలాడు నెఱజాణలు వేలకొలది వేశ్యలటనున్నారు. బాష్కలి ఆపురమున నునికిగొనని పుణ్యములేదు. విద్య, శిల్పము, కళయు నేదిలేదు. వందలకొలది యుద్యానముల యొత్తిడిగొన్నది. ఎల్లపుడు కొలువులుదీరిన సమాజోత్సవములతో చావన్నదిలేని దైత్య శ్రేష్ఠులతో సమర్ధముగొన్నది. ఎటుజూచిన వీణావేణు మృదంగ నినాదముతో ప్రతిధ్వనించునది. నిత్యానందభరితులై యనేకరత్నశోభితులై మేరుపునందమరులట్లసురులట నాటలాడుచు గనిపింతురు. అట దనువృద్దులు బ్రహ్మ ఘోష (వేదఘోష) యెంతో యట జరుపుచుందురు. 86

సాజ్యధూమేన చాగ్నినాం వాయునా నష్టకిల్బిషే | సుగంధధూపవిక్షేపసురభీకృతమారుతే || 87

సుగంధిదనుజాకీర్ణే పురే తస్మింస్తు బాష్కలిః | త్రైలోక్యం తు వశే కృత్వా సుఖేనాస్తే స దానవః || 88

అగ్నుల నిరంతరాజ్యధూమము విగురువాయుపులచే భావమెల్లవోయి సువాసనలనించు దనుజులతో నలముకొన్న యాపురమందు బాష్కలి ముల్లోకములు వశము నేసికొని దానవులతో సుఖముగనుండును. 88

తత్రస్థః పాలయన్నాస్తే త్రైలోక్యం సచరాచరమ్‌ | ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాదీ జితేంద్రియః || 89

సుదర్శః పూర్వదేవానాం నయానయవిచక్షణః | బ్రహ్మణశ్చ దీనానామనుకంపకః || 90

వేదమంత్రప్రభూత్సాహసర్వశక్తిసమన్వితః | షాడ్గుణ్యవిషయోత్సాహః స్మితపూర్వాభిభాషితః || 91

సచరాచర త్రైలోక్యమును బాలించుచుండును. అతడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాది, జితేంద్రియుడు. పూర్వ దేవతలకు (దేవద్వేషులగు దానవులకు) చూడ ముచ్చటైన వాడును న్యాయాన్యాయ విచక్షణుడై దీనులపాలిటి దిక్కైదయా చూపు గలవాడై, వేద ప్రభు మంత్రోత్సాహ శక్తులు గలవాడై సంధి విగ్రహాదిషాడ్గుణ్య ఉత్సాహము గలవాడై చిఱునవ్వు ముందుగా మాటలాడువాడై విలసిల్లెను. 91

వేదవేదాంగతత్వజ్ఞో యజ్ఞయాజీ తపోరతః | న చ దుంశీలనిరతః స సర్వత్రావిహింసకః || 92

మాన్యా మానయితా శుద్దః సుముఖః పూజ్యపూజకః | సర్వార్ధవిదనాధృష్యః సుభగః ప్రియదర్శనః || 93

బహుధాన్యో బహుధనో బహునశ్చ దానవః త్రివర్గసాధకో నిత్యం త్రైలోక్యో వరపూరుషః || 94

స్వపురీనిలయో నిత్యం దేవదానవదర్పహా | స చైవం పాలయామాస త్రైలోక్యా సకలాః ప్రజాః || 95

నాధమః కశ్చిదప్యాస్తే తస్మిన్‌ రాజని దానవే | దీనో వా వ్యధితో వాపి అల్పాయురథ దుఃఖితః || 96

మూర్ఖో వా మందరూపో వా దుర్భగో వా నిరాకృతః |

ఏవం యుతం తం విమలైర్గుణౌఘైర్దృష్ట్వా చ మత్వా చ నివిష్టబుద్దిమ్‌ || 97

ప్రసాదయన్‌ దైత్యవరం మహాత్మా పురందరస్తం తు దనుప్రధానం |

తేజోయుక్తం దానవంతం తపంతమివ భాస్కరమ్‌ || 98

త్రైలోక్యధారణ శక్తం విస్మితః సోభవత్తదా | ఇంద్రం పురాగతం దృష్ట్వా దానవేంద్రోథ పార్ధివ || 99

వేదవేదాంగ రహస్యము లెఱుగును. యజ్ఞము లొనరించెను. తపశ్శాలి. గౌరవింపదగు వారిని గౌరవించును. పూజింపదగువారిని పూజించును. శుద్దాంతః కరణుడు. సుముఖుడు. అన్నీ తెలిసినవాడు. అనాదృష్యుడు , సుభగః= చూడముచ్చటైన వాడు. ధన ధాన్య సమృద్దుడు, బహు దాత. ధర్మార్థ కామములు మూడు ఎప్పుడూ పురుషార్దములను సాధించువాడు ముల్లోకమున నుత్తమ పురుషుడు. ఎప్పుడునూ తన రాజధానియందుండేవాడు. దేవదానవుల దర్పము నణచువాడు. అతడిట్లు ముల్లోకమున బ్రజలనెల్ల పాలించెను. ఈలా స్వచ్చమైన గుణసంపద గల యాతనిం జూచి బుద్ది నిలుకడ గలవాడనీ యూహించి మహాత్ముడింద్రుడా దానవేశ్వరుని సూర్యుడట్లువ్రతాపశీలిని త్రైలోక్యము బాలింపగలవాడని ఆశ్చర్యమందెను. రాజా| ఆ దానవేంద్రుడు తన పురమునకు వచ్చిన దేవేంద్రుని గని యాశ్చర్య మందెను. 99

ఇదమూచుస్తదా గత్వా దానవా యుద్దదుర్మదాః | ఆశ్చర్యమితి వై కృత్వా ఇంద్రోభ్యేతి పురీం తవ || 100

ఏకాకీ ద్విజముఖ్యేన వామనేన సహ ప్రభో | అస్మాభిర్యదనుష్టేయం సాంప్రతం నో వద స్వరాట్‌ || 101

యుద్ద దుర్మదులు దానవులు పురమునకు వచ్చిన యింద్రుని జూచి బాష్కలి దరికేగి వింతయని ప్రభూ! నీ పురికి యింద్రుడు ఒంటరిగా బ్రాహ్మణోత్తముడగు వామనునితో వచ్చినాడు. ఇప్పుడు మేమేమి యాచరింపవలెను? సార్వభౌమా! అనతిమ్ము అనిరి. 101

దానవానబ్రవీత్సర్వాన్పురే తిష్ఠత సంకులం | ప్రవేశ్యతాం దేవరాజః పూజ్యః స తు మమాథ వై || 102

ఏతస్మిన్నేవ కాలే తు వామనః స చ వాసవః | ఆగతే దనునాధేనప్రేవ్ణూ చైవావలోకితే || 103

కృతార్థం మన్యతాత్మానం ప్రణిపాతపురఃసరం | ఉవాచ వచనం రాజా దానవానాం దురంధరః | 104

బాష్కలియనియె. మీరు పురమందు గుంపుగూడి నిలుపుడు. దేవరాజునిట ప్రవేశ##పెట్టుడు. ఆయన పూజింపవలసిన వాడు గదా నాకనెను. ఇంతలో వామనుడు నా యింద్రుడును నటకేతించిరి. దనునాథుడు ప్రేమతో వారిం దిలవెంచెను గూడ! దానవేశ్వరుడు, సర్వకార్య దురంధరడు తనను ధన్యునిగా దలచికొని సాష్టాంగ ప్రణామ మొనర్చి యిట్లు పల్కెను. 104

అద్య వై త్రిషు లోకేషు నాస్తి దన్యతరో మయా !

యోహం శ్రియా వృతః శక్రం వశ్యామి గృహమాగతమ్‌ || 105

అర్థిత్వకామ్యయా యస్తు మామయం యాచయిష్యతి | గృహాగతస్య తస్యాహం దాస్యే ప్రాణనపి ధృవమ్‌ || 106

దారాన్‌ పుత్రాం స్తథాగారం త్రైలోక్యా కా కథా మమ | ఆగత్య సంముఖం తస్య అంకమానీయ సాదరమ్‌ || 107

ఇప్పుడు ముల్లోకములందు నాతో సాటియైన పరమ ధన్యుడు లేడు. సర్వైశ్యర్య సంపన్నుడనై యింటి కరుదెంచిన యింద్రుని దర్శించుచున్నాను. యాచకుడై కోరి యితడు నన్నడుగుకొననున్నాడు. ఇంటికి వచ్చిన యతనికి ప్రాణాలైన నీయగలను నిక్కము, భార్యలను పుత్రులను, ఇట్లు మున్నుగ ముల్లోకముల చెప్పవలసిన దేమున్నది? యేదైన నిత్తును. అని యెదురు వచ్చి యాదరమునం దన తొడపై నుంచికొని కౌగలించుకొని ఆనందించి తన యింటం బ్రవేశింప జేసికొనెను.

వరిష్వజ్యాభినన్ద్యైనం గృహం ప్రావేశయత్స్వకం | తస్య స్వాగతమర్ఘ్యాద్యైః కృత్వా పూజాం ప్రయత్నతః || 108

అద్య మే సఫలం జన్మ పూర్ణాః సర్వే మనోరథాః | యస్త్వాం పశ్యామి శక్రాద్య స్వయమేవ గృహాగతమ్‌ || 109

ఖ్యాప్యోహం దనుముఖ్యానాం దేవరాజ త్వయా కృతః |

ఆగచ్ఛతా మమ గృహం పుణ్యతా తు పరా హి మే || 110

అగ్నిష్టోమాదిభిర్యజ్ఞెస్సమ్యగిష్టైస్తు యత్ఫలం | తత్ఫలం సమవాప్యేత త్వయి దృష్టే పురందర || 111

యత్ఫలం భూమిదానేన గవాం దానేన ఋత్విజే | మమాద్య తత్ఫలం భూతమథ వా రాజపూయకమ్‌ || 112

నాల్పేన తపాసా లభ్యం దర్శనం తవ వాసవ | ఏవం గేహో మయా యత్తేప్రియం కార్యం తదుచ్యతామ్‌ || 113

వికల్పోన్యో న భవతా హృది కార్యః కథంచన | కృతం చ తద్విజానీయాద్యది స్యాత్యుదుష్కరమ్‌ || 114

పుణ్యోహం పుణ్యతాం ప్రాప్తో దర్శనాత్తవ శత్రుహన్‌ | యత్తే దేవవరైర్వంద్యే వందితౌ చరణౌ మయా || 115

కిమాగమనకృత్యం తే వద సర్వం మయిప్రభో | అత్యాశ్చర్యమిదం మన్యే తవాగమనకారణమ్‌ || 116

ఆయన కర్ఘ్య పాద్యాదులచే స్వాగతము పలికి పూనిక మైపూజ సేసి, ఇప్పుడు నా జన్మ సఫలమైనది. అన్ని మనో రథములు తీరినవి. ఇంద్రా! నీయంత నాయింటికి వచ్చిన నిన్ను జూచుచున్నాను. దేవరాజ! నీవలన దను ముఖ్యులకెల్లరం పేరు ప్రతిష్టలం గన్న వాడను గావింపబడినాను. నా యింటికి దయసేయుము. నా పరమావధి పుణ్యమిది. అగ్నిష్టోమాది యజ్ఞములు చక్కగ జేసినం గల్గు ఫలము నీదర్శనమైనంత నే పొందెదను. భూమి గోవులను ఋత్విక్కుల దానము చేసిన ఫలమిపుడు గల్గినది. రాజసూయ మొనరించిన సుకృతమొదవినది. వాసవా! నీ దర్శనము కొలది మాత్రమగు తపస్సుచే లభించునది గాదు. నే నింటనిపుడు చేయవలసినది నీ కిష్టమైన పని యది యానతిమ్ము. తాము హృదయమందు వేరొక యాలోచన నేమాత్రము సేయదగదు. అది యెంత వలనుగాని పనియైనను నే జేసెద ననుగ్రహింపుము శత్రు సంహారకా! పుణ్యుడను నేను నీ దర్శనము వలన పుణ్యాత్ముడనైతిని. ఉత్తమ దాసులచే మ్రొక్కదగిన నీ పాదములిదే నేను మ్రొక్కుచున్నాను. వచ్చిన పని యేదది యెల్ల ప్రభూ! నానతిమ్ము. నీ వచ్చిన కారణమది యత్యద్భుత మనుకొందును. అన ఇంద్రుడనియె.

ఇంద్ర ఉవాచ. జానేహం దనుముఖ్యానాం ప్రధానం త్వాం తు వాష్కలే ||

నాత్యాశ్చర్యమిదం భాతి త్వయి దృష్టేసురోత్తమ | 117

విముఖా నార్థినో యాంతి భవతో గృహమాగతాః అర్ధినాం కల్పవృక్షోసి దాతా చాన్యో న విద్యతే || 118

ప్రభాయాం సూర్యతుల్యోసి గాంభీర్యే సాగరోపమః | సహిష్ణుత్వే ధరా చైవ శ్రియా నారాయణోపమః || 119

బ్రాహ్మణః కశ్యపకులజాతోయం వామనః శుభే | ప్రార్థితోహమనేనైవం భూమేర్దేహి పదత్రయమ్‌ ||120

మమాగ్నిశరణార్థాయ యత్ర కుర్యాం మఖం త్వహం | తదస్య కారణం కృత్వా అర్ధితైషా మమ ప్రభో || 121

లోకత్రయం మేపహృతం త్వయా విక్రమ్యబాష్కలే | నిర్వృత్తికో నిర్ధనోస్మి యద్దిత్సే న తదస్తి మే || 122

ఎఱుగుదును నేను దనుజ ముఖ్యులకెల్ల ముఖ్యుడవని నిన్నేనెఱిగి యున్నాను. అసురవర! నీవు కనబడుట యిది పెద్దవింతగా తోచుటలేదు. అడిగిన వారి కిచ్చునది కల్పవృక్షము మఱి యింకొకటి లేదు. ప్రభలో సూర్యుడట్లున్నావు. లోతులో సాగరుడట్టివాడవు. (నీ గుండె చాల లోతైనది) ఓరిమలో భూమిని, సంపదలో నారాయణుని సాటివాడవు. ఇదుగో యీ వామనుడు బ్రహ్మణుడు. కశ్యపుని శుభ వంశమున బుట్టినాడు. ఈ గుజ్జుపారుడడుగును మూడడుగుల భూమి యితనికిమ్ము. నేనేమో యజ్ఞము సేయుదును. నా యగ్ని దానమునకది కావలెను.

ఆ నిమిత్తముననే ప్రభూ! నేను యాచింపవలసి వచ్చినది. వాష్కలీ ! నా ముల్లోకములు నీవు పరాక్రమించి కాజేసితివి. నిర్వ్యాపారిని నిర్ధనుడనైతి. 122

భవంతం యాచయిష్యామి పరార్థేనాపి చాత్మనా | అర్థిత్వేన మమాప్యస్య యద్యోగ్యం తత్సమాచర|| 123

జాతోసి కాశ్యపే చత్వం వంశే వంశవివర్ధనః | దిత్యాస్త్వం గర్భసంభూతః పితా త్రైలోక్యపూజితః || 124

ఏవంభూతమహం జ్ఞాత్వా తేన త్వాం యాచయామ్యహం | అస్యాగ్నిశరణార్దాయ దీయతాం భూపదత్రయం || 125

అతీవహ్రస్వగాత్రస్య వామనస్యాస్య దానవ | భూమిభాగే చ పారక్యే దాతుం న త్వహముత్సహే || 126

ఏతదేవ మయా దత్తం యద్భవానర్తితోసి మే | గురవో యది మన్యంతే మంత్రిణో వా పదత్రయమ్‌ || 127

అర్ధిత్వేన మదీయేన స్వకులే బాంధవేపి చ | గృహాయాతే మయి తథా యద్యోగ్యం తత్సమాచర || 128

యది తే రుచితం వీర దానవేంద్ర మహాద్యుతే | తదసై#్మ దీయతాం శీఘ్రం వామనాయ మహాత్మనే || 129

తమను ఇతరునికొఱకు నేనడుగుకొనుచున్నాను. నా యాచకత్వమున గూడ యితనికేది యుచితమది సేయుము. కాశ్యప వంశమున వంశ వర్ధనుడవై పుట్టితివి. దితి గర్భమందుదయించితివి. తండ్రి త్రైలోక్య పూజితుడు. ఈలాటి వాడవని తెలిసి నే నిన్నడుగుచున్నాను. అగ్నిశాలకై మరుగుజ్జునకు వామనునకు మూడడుగులిమ్ము. ఆపై నీవు నిన్నందరికి పరమాశ్రయముగా చూడగలవు. నీపై భారముంచి బ్రహ్మ సుఖముగా నుండును. 129

బాష్కలిరువాచ : దేవేంద్ర స్వాగతం తేస్తు స్వస్తి | ప్రాప్నుహి మా చిరమ్‌ ||

త్వం సమీక్షస్వధాత్మానం సర్వేషాం చ పరాయణమ్‌ || 130

త్వయి భారం సమావేశ్య సుఖమాస్తే పితామహః | ధ్యానధారణయా యుక్తశ్చంతయానః పరం పదమ్‌ || 131

సంగ్రామైర్బహుభిః భిన్నో జగచ్చింతామపాస్య తు | క్షీరాబ్దిద్వీపమాశ్రిత్య సుఖం స్వపితి కేశవః || 132

అన్యే చ దానవాః సర్వే బలినః సాయుధాస్త్వయా | అసహాయేనైవ శక్ర సర్వేపి వినిపాతితాః || 133

ఆదిత్యా ద్వాదశై వేహ రుద్రాస్త్వేకాదశాపి వా || ఆశ్వినౌ వసవశ్చైవ సనాతనః || 134

త్వద్బాహుబలమాశ్రిత్య త్రిదివే మఖభాగినః | త్వయా ఋతుశ##తైరిష్టం సమాప్తవరదక్షిణౖః || 135

ధ్యానధారణ ఆలోచించుచు బ్రహ్మ విష్ణువు పెక్కు యుద్ధములచే ఖేదమంది నతడు జగత్తును గూర్చిన ఆలోచనను వదలి క్షీరాబ్ధి ద్వీపమందు సుఖముగా నిద్రపోవును. పెక్కు బలవంతులు సాయుధులు రాక్షసులే సహాయము లేకయే యింద్రా! నీచే కూల్చబడినారు. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, సనాతనులు ధర్మము నీ బాహుబల మాధారముగా స్వర్గమందు సుఖముగనున్నారు. నీవు నూరు ఋతువులు యజ్ఞములు సేసి ఉత్తమ దక్షిణలిచ్చి సమాప్తి చేసితివి. 135

త్వయా చ ఘాతితో వృత్రో నముచిః పాకశాసన | త్వదాజ్ఞాకారిణా పూర్వం విష్ణునా ప్రభవిష్ణునా || 136

హిరణ్యకశిపోత్భాతా హిరణ్యాక్షోపి ఘాతితః | హిరణ్యకశిపుర్యోత్ర జంఘే చారోప్య ఘాతితః || 137

వజ్రపాణినమాయాంతం మైరావణశిరోగతం | సంగ్రామభూమౌ దృష్ట్వా త్వాం సర్వే నశ్యంతి దానవాః 138

యే త్వయా విజితాః పూర్వం దానవా బలవత్తరాః | సహస్రాంశేన తత్తుల్యో న భవామి కథంచన || 139

ఏవంవిధోసి దేవేంద్ర మమ కా గణనా భ##వేత్‌ | మాం సముద్ధర్తుకామేన త్వయైవాగమనం కృతమ్‌ || 140

కరిష్యామి న సందేహో దాస్యే ప్రాణానపి ధృవం | కిమర్ధం దేవరాజోక్తా భూమిరేషా త్వయా హి మే || 141

ఇమే దారాః సుతా గావో యచ్చాన్యద్విద్యతే వసు | త్రైలోక్యరాజ్యమఖిలం విప్రస్యాస్య ప్రదీయతామ్‌ || 142

అపకీర్తిర్భవేన్మహ్యం పూర్వేషాం చ న సంశయః | గృహాయాతస్య శక్రస్య దత్తం బాష్కలినా న తు || 143

అన్యోపి యోర్థి మే ప్రాప్తః స మే ప్రియతరః సదా | భవానత్ర విశేషేణ విచారం మా కృథాః క్వచిత్‌ || 144

పాకశాసనా ! నీచే వృతాసురుడు నముచియు సంహరింపబడిరి. నీయాజ్ఞ సాలించి సర్వసమర్ధుడగు విష్ణువుచే హిరణ్య కశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మడిసెను. హిరణ్య కశిపుడు పిక్కలపై నానించి చంపబడెను. ఐరావణుని తలపై కూర్చుని వజ్రము చేబూని సమరభూమి నిన్ను చూచి దానవులెల్ల నశింతురు. వేయవవంతుననైన నీ కేలాగునను సాటిగాను. ఈలాటి వాడవు దేవేంద్రా! నాతోని నీకు లెక్కయేమి? నన్నుద్ధరించుటకే యీ నీవిటు వచ్చినావు. దేవరాజ! ఈభూమి నాదని యెందులకన్నాను? ఈ భార్యలు, కొడుకులు, గోవులు నింకను గల ధనము త్రైలోక్య రాజ్యమెల్ల విప్రునికీయబడు గాక ! బాష్కలి యింద్రునికిచ్చిన రాజ్యము నేను తిరిగి తీసికొన్నానన్న అపకీర్తి నాకు నా పూర్వుకులకు కలుగకుండుగాక! ఇంకెవడేని యాచకుడు నాకు ప్రాప్తించినచో నతడు నాకు యెల్లప్పుడు నెంతేని ప్రేమపాత్రుడే. విశేషించి ప్రస్తుతము తమరు నట్లే. విచారింపకుము. 144

బృహత్త్రపా మే దేవేంద్ర యద్భూమేస్తు పదత్రయం | బ్రాహ్మణస్య విశేషేణ ప్రార్ధితం తు త్వయా విభో || 145

దాస్యే గ్రామవరానస్య భవతస్తు త్రివిష్టపం | అశ్వాన్గజాన్‌ భూమిదనం స్త్రియశ్చోద్భిన్న చూచుకాః || 146

యాసాం దర్శనమాత్రేణ వృద్ధోపి తరుణాయతే | తా స్త్రియో వసుధాం చైతాం వామనస్య ప్రతిగ్రహమ్‌ || 147

ప్రతిదాస్యామి దేవేంద్ర ప్రసాదః క్రియతాం హి మే | ఏతావదుక్తే వచనే తదా బాష్కలినా నృప || 148

ఆ వామనునికి మూడడుగుల నేల బ్రాహ్మణుడని నీవు ప్రార్థింపగా నిచ్చితివి. ఇది యెంతో సిగ్గుచేటు ప్రభూ | ఈయన కుత్తమ గ్రామములిత్తును. నీకు స్వర్గమిత్తును. ఏనుగుల, గుఱ్ఱముల, ధనమును చూచిన మాత్రాన ముదుసలియేని యువకుడగునట్టి ఉద్విగ్న చూచకములు (విరిసిన చనుమొనలు) గల యువతులను నీ వామనునికి ప్రతిగ్రహముగా సమర్పించెదను. దేవేంద్రా! నన్ననుగ్రహింపుమనెను.

పురోధాస్తూశనా ప్రాహ దానవేంద్రం తదా వచః | భవాన్‌ రాజా దానవేంద్ర ఐశ్వరే ష్టవిధే స్థితః || 149

యుక్తాయుక్తం న జానాసి దేయా కస్య మయా క్వచిత్‌ | మంత్రిభిః సుసమాలోచ్య యుక్తాయుక్తం పరీక్ష్య చ || 150

ప్రాప్తం త్రైలోక్యరాజ్యం జిత్వా దేవాన్‌ సవాసవాన్‌ | వాక్యస్యాస్యావసానేవ భవాన్‌ ప్రాప్స్యతి బంధనమ్‌ || 151

య ఏష వామనో రాజన్విష్ణురేవ సనాతనః | నాస్య వైభవతా దేయం పితా తే ఘాతితః స్వయమ్‌ || 152

అయం తే పితృహా ప్రాప్తో మాతృహా బంధుఘాతకః | వంశోచ్ఛేదకరస్తుభ్యం భూతశ్చైవ భవిష్యతి || 153

న చైష ధర్మం జానాతి శక్రాదీనాం హితే రతః | మాయావినా దానవా యే మాయయా యేన నిర్జితాః || 154

మాయయా బ్రాహ్మణం రూపం వామనం చ ప్రదర్శితం | అత్ర కిం బహునో క్తేన నాస్య దేయం తు కించన ||155

మక్షికాపాదమాత్రం తు భూమిరస్య ప్రతిగ్రహః ! వినాశ##మేష్యసి క్షిప్రం సత్యం సత్యం మయా శ్రుతమ్‌ || 156

అపుడు పురోహితుడు శుక్రాచార్యుడు దానవేంద్రునితో నిట్లనెను. దానవేశ్వర! నీవు రాజువు. అష్టైశ్వర్య సంపన్నుడవు ఐశ్వర్యము లెనిమిది ధనము, ధాన్యము, బంధువు, నౌకరు, దాసి, వస్త్రము, వాహనము, కొడుకు ననునవి. ఎవనికేది నీయవలెనని ఉచితానుచితము లెన్నడు నెఱుగవు. మంత్రులతో బాగుగ నాలోచించి యుక్తాయుక్తములను పరీక్షించియు ఇంద్రాది దేవతలం గెలిచి త్రైలోక్య రాజ్యముం బొందిన నీవు వీని మాటకు పర్యవసానముగ బంధము పాలౌదువు. ఈ పొట్టివా డెవరో తెలుసునా? పురాణ పురుషుడు విష్ణువే. వీనికి నీ వీయకూడదు. నీ తండ్రి స్వయముగ వీనిచేత జంపబడెను. ఇంద్రాదుల జంపినవాడు యిపుడు వచ్చినవాడు మాతృ హంతకుడు, బంధు ఘాతకుడు , వంశోచ్ఛేదకుడు డంతమునై నాడు ముందుకాగల వాడు వచ్చినాడు. మాయతో బ్రాహ్మణ రూపమున గుజ్జు రూపమును ప్రదర్శించినాడు. ఎందులకిట నెక్కువ మాటలాడుట. ఈగ కాలంతైన మాత్రమేని భూమి వీనికీయరాదు. వెంటనే వినాశమటనెదవు, నిజము, నిజము నే విన్నాను. 156

గురుణాప్యేవముక్తస్తు భూయో వాక్యమథాబ్రవీత్‌ | ధర్మార్ధినా మయా సర్వం ప్రతిజ్ఞాతం గురోస్త్విదమ్‌ || 157

ప్రతిజ్ఞాపాలనం కార్యం సతాం ధర్మః సనాతనః | యద్యేష భగవాన్‌ విష్ణుర్నాస్తి ధన్యతరో మయా || 158

గృహ్య ప్రతిగ్రహం మత్తో యది దెవాన్‌ బుభూషతి ! భూయోపి ధన్యతాం నీతో దేవేనానేన వై గురో || 159

యం యోగినో ధ్యానయుక్తా ధ్యాయమానా హి దర్శనం |

న లభంతే తథా విప్రా సోయం దృష్టో మయాద్య వై || 160

దానాని యే ప్రయచ్ఛంతి సకుశోదకపాణినా | ప్రీయతాం భగవాన్‌ విష్ణుః పరమాత్మా సనాతనః || 161

ఏవముక్తే తు వచనే అపవర్గస్య భాగినః | యదత్ర కార్యకరణ వికల్పో మే బభూవ హ || 162

ఉపదిష్టోస్మి భవతా బాలత్వే చావధారితం | శత్రవపి గృహాయాతే మాస్త్వదేయం తు కించన ||163

ఏతదేవ వించిత్యాహం ప్రాణానపి స్వకాన్‌ గురో | వామనస్య ప్రదాస్యామి శక్రస్యాపి త్రివిష్టపమ్‌ || 164

అపీడకారి యద్దానం తద్దానమిహ దీయతే | పీడకారి చ యద్దానం తద్దానం సమలమ్‌ స్మృతమ్‌ || 165

ఏతచ్ర్ఛుత్వా గురుస్తత్ర త్రపయాధోముఖః స్థితః |

వాష్కలిరువాచ :- అర్దితా భవతో దేవ దేయా సర్వా ధరా మయా || 166

ఈలా గురుడు పలుక బాష్కలి వెండియు నిట్లు పలికెను. గురూ! ధర్మముకోరి నీ ప్రతిజ్ఞ సర్వము సేసితిని.ఇతడు భగవంతుడు విష్ణువే యగునా నాతో సాటియగు మహా ధన్యుడ మరిలేడు. గురూ! నా వలన దానముపట్టి దేవతలనలరించునేని యీ దేవునిచే నేనెంతేని ధన్యత్వమందింపబడిన వాడౌదును. ధ్యాన నిష్ఠులు, యోగులు ధ్యానించియు దర్శనమందలేరా విప్రుడే యతడిప్పుడు నాచే గనబడెను గదా! కుశోదక పాణితోయే నెవ్వరు దానము లిత్తురో వారు భగవంతుడు, పరమాత్మ విష్ణువు ప్రీతి సెందుగాక యని పలికికదా యిచ్చి మోక్షమందుదురు. ముక్తినందుదురు. ఇట నీ పని చేయుటలో నాకు వికల్పము (మార్పు) వచ్చినది. తమచేనుపదేశింపపడితిని. బాలుడనుగా విన్నాను. గూఢ శత్రువైన నింటికి వచ్చిన నీయరానిది కొంచము లేదు. ఇదే నే నాలోచించి గురుదేవా! నా ప్రాణములైన వామనుని కిత్తును. శక్రునికి స్వర్గము నిత్తును. ఎవరికి పీడగూర్పని దానమిట సేయపడుచున్నది. పీడ (బాధ) గూర్పెడు దానమది సమలము అశుద్దము అనబడును. ఇది విని గురువట సిగ్గునందలవంచికొని నిలిచెను. 166

త్రపాకారం భ##వేన్మహ్యం యదస్య భూపదత్రయం |

ఇంద్ర ఉవాచ: సత్యమేతద్దానవేంద్ర యదుక్తం భవతా హి మే || 167

భూమేః పదత్రయార్దిత్వం ద్విజేనానేన మేకృతం | ఏతావతా త్వయం చార్దీ మయాప్యస్య కృతే భవాన్‌ || 168

ధనుపుత్రో యాచితోసి వరమేతత్ర్పదీయతాం|

భాష్కలిరువాచ : పదత్రయం వామనాయ దేవరాజ ప్రతీచ్ఛమే || 169

తత్రత్వం సుచిరం కాలం సుఖీ సురపతే వస | ఏవముక్త్వా వాష్కలినా వామనాయ పదత్రయమ్‌ || 170

తోయపూర్వం తదా దత్తం ప్రీయతాం మే హరిః స్వయం |

దత్తే తు దానవేంద్రేణ త్యక్త్వా రూపం చ వామనమ్‌ || 171

హరిరాచక్రమే లోకాన్‌ దేవానాం హితకామ్యయా | యజ్ఞ పర్వతమాసాద్య గత్వా చైవ ఉదజ్ముఖః || 172

బాష్కలి చెప్పెను. మీరు కోరిన భూమినంతయు నేను దానమివ్వ వలెను. మూడడుగుల నేలను మాత్రమిచ్చుట నాకు సిగ్గును కలిగించును. అనగా ఇంద్రుడు , 'దానవేంద్రా! నీవన్నది నిజమే! ఈ ద్విజుడు మూడడుగుల నేలను కోరుట నే చేసినదే. ఇంత మాత్రముననే ఇతడు అర్థి ఇతని కోరకు నేను దనుపుత్రుడివైన నిన్ను యాచించితిని. ఈ వరము నిమ్ము' అనెను. అపుడు బాష్కలి, 'దేవరాజా! వామనుడికి మూడడుగుల నేల నిచ్చుచుంటి చూడుము. నీవు చాలా కాలము సుఖముగా నుండుము' అని పలికి బాష్కలి వామనునికి మూడడుగుల నేలను నీటితో 'నాకు హరి స్వయముగా ప్రసన్నుడగు గాక |' అని దానమిచ్చినంత తన వామన రూపమును విడిచి హరి దేవతల హితమును గోరి లోకములన్నింటిని ఆక్రమించెను. యజ్ఞ పర్వతమును చేరి పైకి వెళ్ళసాగెను. 172

దేవస్య వామచరణ నివిష్టో దానవాలయః | తత్ర క్రమం సప్రథమం దదౌ సూర్యే జగత్పతిః || 173

ద్వితీయం చ ధృవే దేవస్తృతీయేన చ పార్దివ | బ్రహ్మాండస్తాడితస్తేన దేవేనాద్భుతకర్మణా || 174

అంగుష్టాగ్రేణ భిన్నేండే జలం భూరి వినిఃసృతం | ప్లావయిత్వా బ్రహ్మలోకాన్‌ సర్వాన్‌ లోకాననుక్రమాత్‌ || 175

ధృవస్థానం సూర్యలోకం ప్లావ్య తం యజ్ఞ పర్వతం | ప్రవిష్టా పుష్కరం ధారా ధౌత్వా విష్ణుపదాని సా || 176

పదాని యాని జాతాని వైష్ణవాని ధరాతలే | తత్రాశ్రమే తుయో గత్వా స్నానం వాప్యాం సమాచరేత్‌ || 177

అశ్వమేధఫలం తస్య దర్శనాదేవ జాయతే | ఏవవింశగణో పేతో వైకుంఠే వాసమాప్నుయాత్‌ || 178

భుక్త్వా తు విపులాన్‌ భోగాన్‌ కల్పానాం తు శతత్రయం |

తదంతే జాయతే రాజా సార్వభౌమః క్షితావిహ || 179

విష్ణువు ఎడమకాలు దానవుని నివాసమున నుండెను. మొట్ట మొదట పాదమును జగత్పతి సూర్యూనియందుంచెను. రెండవ అడుగును ధృవుని యందుంచి మూడవ అడుగుచే బ్రహ్మాండమును తాకగా బొటన వ్రేలి తాకిడికి బ్రహ్మాండము బ్రద్దలై నీరు పుష్కలంగా స్రవించినది. బ్రహ్మలోకము మొదలుగా లోకము లన్నింటినీ ముంచి వేసినది. దృవస్థానమును, సూర్యలోకమును యజ్ఞ పర్వతమును ముంచివేసి ఆ ధార పుష్కరమును ప్రవేశించి విష్ణు పదములను తడిపెను. దానిచే వైష్ణవ పదములేర్పడెను. ఆ ఆశ్రమమునకు వెళ్ళి బావియందు స్నానమాడినవాడు దర్శనము చేతనే అశ్వమేధ ఫలము నొందును. ఇరువది యొక్క గుణములు గలిగి వైకుంఠమున నివసించును. మూడు వందల కల్పములు అన్ని భోగముల ననుభవించి, చివర సార్వభౌముడగు రాజుగా జన్మించును. 179

తోయధారా తు సా భీష్మ అంగుస్టాగ్రాద్వినిఃసృతా | నదీ సా వైష్ణవీ ప్రోక్తా విష్ణుపాదసముద్భవా || 180

అనేన కారణభూద్గంగా విష్ణుపదీ నృప | యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్‌ || 181

అంగుష్టాగ్రక్షతా దండాద్యత్ప్రవిష్టం జలం శుభం | ప్రాప్తం దేవనదీ త్వం యాతు విష్ణుపదీ నదీ || 182

దేవనద్యా తయా వ్యాప్తం బ్రహ్మాండం సచరాచరం | విభూతిభిర్మహాభాగ సర్వానుగ్రహకామ్యయా || 183

న బాష్కలిర్వామనేన ఉక్తః పూరయ మే క్రమాన్‌ | అధోముఖస్తదా జాత ఉత్తరం నాస్య విందతి || 184

మౌనీభూతం తు తం దృష్ట్వా పురోధా వాక్య మబ్రవీత్‌ | స్వాభావికీ దానశక్తిర్న తు స్రష్టుం వయం క్షమాః 185

యావతీయం ధరా దేవ సా దత్తానేన తే ప్రభో | ఉక్తో బాష్కలినా విష్ణుర్యావన్‌మాత్రా వసుంధరా|| 186

బీష్మా ! ఆ జలధార విష్ణువు అంగుష్టము చివరి నుండి బయల్వెడలినది.కనుక ఆ వైష్ణవీ నది విష్ణుపాద సముద్భవయని అందురు. ఈ కారణము చేత గంగ విష్ణుపదియైనది. దానిచే చరాచరమగు ముల్లోకములన్నీ నిండినవి. బొటనవ్రేలు తాకుటచే బ్రహ్మండం బద్దలుకాగా బయల్వెడలిన శుభమగు జలము దేవనదియై విష్ణుపది యనబడినది. ఆ దేవనదిచే బ్రహ్మాండమంతా నిండినది. అందరినీ అనుగ్రహించ గోరి వామనుడు బాష్కలిని మూడడుగులనూ పూర్తిచేయమని అడిగెను. బాష్కలి సమాధానము లేక తలదించి నిల్చుండెను. అతను మౌనముగా నుండుట జూచి పురోహితుడు 'దానశక్తి స్వాభావికమైనది. సృజించుటకు మేము తగిన వారము కాము. పృధ్వి ఎంత వున్నదో అదంతా నీకు బాష్కలి దానమిచ్చెను.' అనగా బాష్కలి కూడా విష్ణువుతో ఇట్లనెను. 186

యా నృష్టా భవతా పూర్వం సా మయా న చ గోపితా | అల్పాభూమిర్భవాన్‌ దీర్ఘో న తు సృష్టేరహం క్షమః || 187

ఇచ్చాశక్తిః ప్రభవతి ప్రభోస్తే దేవ సర్వదా| నిరుత్తర స్తదా విష్ణుర్మత్వా తం సత్యవాదినమ్‌ || 188

బ్రూహి దానవముఖ్యత్వం కంతే కామం కరోమ్యహం |

మమ హస్తగతం తోయం త్వయా దత్తం తు దానవ || 189

తేన త్వం వరయోగ్యోసి వరాణాం భాజనం శుభం | దాస్యేహం భవతః కామమర్థీ యేన వృణుష్వ హ | 190

విజ్ఞప్తో హి తదా తేన దేవదేవో జనార్జనః | భక్తిం వృణోమి దేవేశ త్వద్దస్తాన్మరణం హి మే || 191

వ్రజామి శ్వేతద్వీపం తే దుర్లభం తు తపస్వినాం | ఆహైవముక్తే విష్ణుస్తం తిష్ఠసై#్వవ యుగాంతరమ్‌ || 192

వారాహరూపే యాదాహం ప్రేవక్ష్యామి ధరాతలం | తదా హవిష్యేహం త్వాం తు మదగ్రే చ యదైష్యసి|| 193

' భూమి ఎంత గలదో, ఎంత పరిమాణము గలదిగా పూర్వము నీవు సృజించితివో, దానిని నేను దాచలేదు, భూమియేమో అల్పముగా నున్నది. నీవేమో దీర్ఘముగా నుంటివి. సృష్టి చేయుటకు నేనశక్తుడను. దేవా! నీ ఇచ్ఛాశ క్తయే ఎల్లప్పుడూ సమర్ధమైనది' అనగా విష్ణువు నిరుత్తరుడై బాష్కలి సత్యవాదియని తలచి అనెను. 'దానవరాజా! నీ ఏ కోరిక పూర్తి చేయవలెనో తెలుపుము. నా చేతిలో నున్న నీరు నీవు దానమిచ్చినదే. దానిచే నీవు వరము నొందుటకు యోగ్యుడవైనావు. వరములకు పాత్రుడవైతివి. నీవు కోరిన దానినిచ్చెదను. కోరుము' అనగా బాష్కలి దేవదేవుడగు జనార్ధనుని ఇట్లు వేడుకొనెను. 'దేవేశా! నీ పట్ల భక్తి నిమ్ము. నీ చేతిలో మరణము కలుగుగాక! దానిచే నేను తపస్వి జనులు కూడా పొందలేని నీ శ్వేతద్వీపమును చేరగలను' బాష్కలి అట్లు అడుగగా , విష్ణువు 'వేరొక యుగము వరకు వేచియుండుము. వరాహరూపమున నేను భూతలమును ప్రవేశించునపుడు నిన్ను సంహరించెదను. అపుడు నీవు నా వద్దకు వచ్చెదవు' అనెను. 193

ఉక్తోథ దానవస్తేన ఆపాసర్ప్య తదగ్రతః | వామనేన సమాక్రాంతాః సర్వలోకాస్తదా నృప || 194

అసురైసై#్తస్తదా త్యక్తం దేవానాం సత్యభాషణం | దేవో హృత్వా తు త్రైలోక్యం జగామాదర్శనం విభుః || 195

పాతాలనిలయశ్చాపి సుఖమాస్తే స బాష్కలిః | శక్రోపి పాలయామాస విపశ్చిద్భువనత్రయ

మ్‌ || 196

ఆయం త్రైవిక్రమో నామ ప్రాదుర్భావో జగద్గురోః | గంగాసంభవసంయుక్తసర్వ కల్మషనశనః || 197

అపుడు బాష్కలి వామనుని ఎదుటి నుండి వైదొలగగా వామనుడు అన్ని లోకముల నాక్రమించెను. దేవతల సత్యభాషణమును అపుడు అసురులు విడచివేసిరి. విష్ణువు ముల్లోకముల హరించి కనిపించకుండా పోయెను. బాష్కలి పాతాళమును జేరి సుఖముగా నుండెను. విజ్ఞుడగు ఇంద్రుడు ముల్లోకముల పాలంచసాగెను. ఇది త్రైవిక్రమమనునది, జగద్గురువగు వామనుని ప్రాదుర్భావము. గంగాసంభవముతో కలిసి పాపములన్నింటినీ నశింపజేయును. 197

విష్ణోః పదానామేషా త ఉత్పత్తిః కథితా నృప | యాం శృత్వా నరో లోకే సర్వపాపైః ప్రముచ్యతే || 198

దుఃస్వప్నం దుర్విచింత్యం చ దుఃష్కరం దుష్కృతాని చ | క్షిప్రం హి నాశమాయాంతి దృష్టే విష్ణుపదత్రయే || 199

యుగానుక్రమశో దృష్ట్వా పాపినో జంతవస్తథా | సూక్ష్మతా దర్శితా భీష్మ విష్ణునా పదదర్శనే || 200

యస్త్వారోహతి తస్మింస్తు మౌనవాన్మానవో భువి | కృత్వా త్రిపుష్కరీయాత్రామశ్వమేధఫలం వ్రజేత్‌ || 201

ముచ్యతే సర్వపాపైశ్చ మృతో విష్ణుపురం వ్రజేత్‌ || 202

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

విష్ణుపదోత్పత్తిర్నామ త్రింశోధ్యాయః

ఓ రాజా! ఈ విధంగా నేను నీకు విష్ణుపదముల ఉత్పత్తిని చెప్పితిని. దీనిని వినిన నరుడు లోకమున అన్ని పాపములనుండి ముక్తుడగును. విష్ణుపదత్రయమును చూచిన దుఃస్వప్నము, దుశ్చింత, కష్టము, పాపములు వెంటనే నాశనమును పొందును. పాపిష్టులగు జంతువులను యుగక్రమమున చూచి విష్ణువు తన పదదర్శనమున సూక్ష్మతను జూపించెను. ఏ మానవుడు మౌనముతో అవి ఆరోహణము నుండగా త్రిపుష్కరీ యాత్రను జేయునో అతడు అశ్వమేధ ఫలమొందును. అన్ని పాపములనుండి ముక్తుడై విష్ణుపురమును జేరును. 202

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టిఖండమందు ముప్పదియవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters