Sri Padma Mahapuranam-I    Chapters   

త్రయస్త్రింశోధ్యాయః

మార్కండేయాశ్రమదర్శనమ్‌

భీష్మ ఉవాచ:- మార్కండేయేన వై రామః కథమత్ర ప్రబోధితః |

కథం సమాగమే భూతః కస్మిన్కాలే కదా మునే || 1

మార్కండేయః కస్య సుతః కథం జాతో మహాతపాః | నామ్నోస్య నిగమం బ్రూహి యథాభూతం మహామునే || 2

పులస్త్య ఉవాచ ;- అథ తే సంప్రవక్ష్యామి మార్కండేయోద్భవం పునః |

పురా కల్పే మునిః పూర్వం మృకండూర్నామ విశ్రుతః || 3

భృగోః పుత్రో మహాభాగః సభార్యస్తప్తవాంస్తవః | తస్య పుత్రస్తదా జాతో వసతస్తు వనాంతరే || 4

ముప్పదిమూడవ అధ్యాయము

మార్కండేయాశ్రమదర్శనము

భీష్ముడనియె. మునీంద్రా! శ్రీరాముడు మార్కండేయుని వలన నిట నెట్లు కొన్ని ముఖ్యవిషయాలు తెలుసుకొనినది వారిద్దరు నెప్పుడెట్లు కలిసికొన్నారు? మునీ! మార్కండేయుడెవ్వని కుమారుడు ? ఆ మహాతపస్వి యెట్లు జన్మించెను? రాముడక్కడికెట్లు వెళ్ళెను? ఎప్పుడు వెళ్ళెనన పులస్త్యుడిట్లనియె. మార్కండేయుని జననవృత్తాంత మిదె తెల్పద. పూర్వకల్పమందు మృకండువను ముని ప్రసిద్ధుడు. భృగుమహర్షి కుమారుడు. భార్యతో మహానుభావుడు తపస్సు చేసెను. కొండొకదినమందు వారికొక కొడుకు కలిగెను.

స పంచవార్షికో భూతో బాల ఏవ గుణాధికః | జ్ఞానినా స తదా దృష్టో భ్రమన్‌ బాలస్తదాంగణ || 5

స్తిత్వా స సుచిరం కాలం భావ్యర్థం ప్రత్యబుధ్యత | తస్య పిత్రా స వై పృష్టః కియదాయుః సుతస్య మే || 6

సంఖ్యా యాచక్ష్వ వర్షాణి తస్యాల్పాన్యధికాని వా | మృకండునైవముక్తస్తు స జ్ఞానీ వాక్యమబ్రవీత్‌ || 7

షణ్మాసమాయుః పుత్రస్య ధాత్రా సృష్టం మునీశ్వర | నైవ శోకస్త్వయా కార్యో సత్యమేతదుదాహృతమ్‌ || 8

స తచ్ఛృత్వా వచో భీష్మ జ్ఞానినా యదుదాహృతం | అథోపనయనం చక్రే బాలకస్య పితా తదా || 9

ఆహ చైనం పితా పుత్రమృషీంస్త్వమభివాదయ | ఏవముక్తః స వైపిత్రా ప్రహృష్ఠశ్చాభివాదనే || 10

న వర్ణావర్ణతాం వేత్తి సర్వవర్ణాభివాదనః | పంచమాసాస్త్వతిక్రాంతా దివసాః పంచవింశతిః || 11

మార్గేణాథ సమాయాతా ఋషయస్తత్ర సప్త వై | బాలేన తేన తే దృష్టాః సర్వే చాప్యభివాదితాః || 12

ఆయుష్మాన్భవ తైరుక్తః స బాలో దండమేఖలీ ! ఉక్వైవం తే పునర్బాలమపశ్యన్‌ క్షీణజీవితమ్‌ || 13

అయిదేండ్ల వయసులోనే యా పిల్లవాడు మంచిగుణశాలియై యొప్పెను. ఇంటిముంగిట దిఱుగుచు నతడు మంచి జ్ఞానిగాకనిపించెను. చిరకాలమునుండి యతడు జరుగబోవు విషయము గుర్తింప నేర్చెను. తండ్రి నీ యాయుర్దాయమెంత? లెక్కించి సరిగా తెల్పుమన నతడాఱుమాసములు బ్రహ్మయిచ్చినది. నీవు శోకింపనేవలదు. నిజము సెప్పితిననెను. అదివిని బాలుని కుపనయనము సేయవలయునని కావించెను. కొడుకును గని తండ్రి, మహర్షులు వీరినందరికి నమస్కరింపుమని జెప్పెను. తండ్రిమాట విని వారికి మ్రొక్కుట కానందభరితుడై సవర్ణుడా అపర్ణుడాతెలియక అన్ని వర్ణముల వారికి మ్రొక్కెను. ఆపై నైదునెలల నిరువదిరోజులు గడిచినవి. అప్పుడు సప్తర్షులు దారిని వెళ్లుచు నటకు వచ్చిరి. పిల్లవానికి కనబడిరి. అందఱు మ్రొక్కబడిరి. వారు ఆయుష్మాన్భవ పూర్ణాయుష్కుడవుగమ్ము యని దండము మేఖలగల యా చిన్న బిడ్డని దీవించిరి. వారిట్లని మరల క్షీణాయుష్కుడని యా బాలుని తలంచిరి. 13

దినాని పంచ తస్యాయుర్ఞాత్వా భీతాశ్చ తే నృప | తం గృహీత్వా బాలకం చ గతాస్తే బ్రహ్మణోంతికమ్‌ || 14

ప్రతిముచ్య చ తం రాజన్‌ ప్రణిపేతుః పితామహః | అయమవిదితసై#్తస్తు తేన బ్రహ్మాభివాదితః || 15

చిరాయుర్బ్రహ్మణా బాలః ప్రోక్తః స ఋషిసన్నిధౌ || తతస్తే మునయః ప్రీతాః శృత్వా వాక్యం పితామహాత్‌ || 16

పితామహో ఋషీన్‌ దృష్ట్వా ప్రోవాచ విస్మయాన్వితః | కార్యేణ యేన చాయాతః కోయం బాలో నివేద్యతామ్‌ || 17

తతస్త ఋషయో రాజన్‌ సర్వం తసై#్మ న్యవేదయన్‌ | పుత్రో మృకండోః క్షీణాయుః సాయుషం కురు బాలకమ్‌ || 18

అల్పాయుషస్త్వస్య మునిర్భధ్వేమాం చాపి మేఖలాం | యజ్ఞోపవీతం దండం చ దత్వా చైనమబోధయత్‌ || 19

యం కంచిత్పశ్యసే బాల భ్రమంతం భూతలే జనం | తస్యాభివాదః కర్తవ్య ఏవమాహ పితా వచః || 20

అభివాదనశీలోయం క్షితౌ దృష్ఠః పరిభ్రమన్‌ | తీర్థయాత్రాప్రసంగేన దేవయోగాత్పితామహ || 21

చిరాయుర్భవ పుత్రేతి ప్రోక్తోసౌ తత్ర బాలకః | కథం వచో భ##వేత్సత్యమస్మాకం భవతామిహ || 22

వానికైదురోజులే యాయువని తెలిసి వారు భయపడి వానింగొని బ్రహ్మదరికేగి యటవిడిచి బ్రహ్మకు మ్రొక్కిరి. వారికి బ్రహ్మయెవరో తెలియలేదు. ఈతడు మూత్రము బ్రహ్మకు నమస్కరించెను. ఆ ఋషుల సన్నిధి నాబాలుని చిరాయువగుమని బ్రహ్మదీవించెను అంతట మునులు బ్రహ్మవాక్యము విని ప్రీతినొందిరి. వారింగని బ్రహ్మయాశ్చర్యమంది మీరువచ్చిన పనియేమి? యీ పిల్లవాడెవరు! నివేదింపుడనిన వారు సర్వము నివేదించిరి. మృకండువు పుత్రుడు. అల్పాయుష్కుడు వీని దీర్ఘాయువులగావింపుము. వీనిని తండ్రి యీ మేఖలను కట్టి జందెమును దండమునిచ్చి పంపినాడు. అబ్బాయీ! భూతలమున దిఱుగు నేమనుజునిం జూతువేని వానికి సమ్కరింపుమని తండ్రియనెను. అభివాదనము సేయు స్వభావము గల యీతడు తీర్థయాత్ర సందర్భములో భూమియందిరుగుచు దైవయోగమున గనబడినాడు. పుత్రా ! దీర్ఘాయుష్మంతుడగుమని దీవించితిమి. నీవాండ్రము మామాట యెట్లు సత్యమగుననిరి. 22

ఏవముక్తస్తదా తైస్తు బ్రహ్మా లోకపితాహః ఋతవాక్యాదియం భూమిః సంస్థితా సర్వతోభయా || 23

మత్సమశ్యాయుషా బాలో మార్కండేయో భవిష్యతి | కల్పస్యాదౌ తథా చాంతే మతో మే మునిసత్తమః || 24

ఏవం తే మునయో బాలం బ్రహ్మలోకే పితామహాత్‌ | సంసాధ్య ప్రేషయామాసుర్భూయోప్యేనం ధరాతలమ్‌ || 25

తీర్థయాత్రాం గతా విప్రా మార్కండేయో నిజం గృహం | జగామ తేషు యాతేషు పితరం స్వమథాబ్రవీత్‌ || 26

బ్రహ్మలోకమహం నీతో మునిభిర్బ్రహ్మవాదిభిః | దీర్ఘయుశ్చ కృతశ్చాస్మి వరాన్‌ దత్వా విసర్జితః || 27

అదివిని బ్రహ్మ ఈ భూమి (పుష్కరము) ఋతవాక్యమువలన సత్యము=పరమార్ధ సత్యవచనమువలన సర్వ విధాలనభయమై యున్నది, ఆయుర్దాయమున నీ పిల్లవాడు మార్కండేయుడు నాతో సమానుడగును. కల్పము మొదట చివర కూడ నుండునని నాయభిప్రాయము అని బ్రహ్మయనియె. ఈరీతి నమ్మునులు బ్రహ్మలోకమందు బ్రహ్మవలన కార్యసాధనసేసి బాలుని తిఱిగి భూమి కంపిరి. బ్రాహ్మణులు తీర్థయాత్రకు, మార్కండేయుడు తన యింటికినేగిరి. ఆ విప్రులందరు వెళ్లినతర్వాత బాలుడు తండ్రితో నిట్లనియె. బ్రహ్మవాదులగు మునులు నన్ను బ్రహ్మలోకమునకుం గొంపోయిరి. దీర్ఘాయుష్ముంతుంగావించిరి. వరములిచ్చి పంపిరి.

ఏతదన్యచ్చ మే దత్తం గతం చింతాకరం తవ | కల్పస్యాదౌ తథా చాంతే భవిష్యే సమనంతరే || 28

లోకకర్తు ర్బ్రహ్మణోహం ప్రసాదాత్తస్య వైపితః | పుష్కరం వై గమిష్యామి తపస్తప్తుం సముద్యతః || 29

తత్రాహం దేవదేవేశముపాసిష్యే పితామహం | సర్వకామావాప్తికరం సర్వారాతినిబర్హణమ్‌ || 30

సర్వసౌఖ్యప్రదం దేవమింద్రాదీనాం పరాయణం | బ్రహ్మాణం తోషయిష్యామి సర్వలోకపితామహమ్‌ || 31

మార్కండేయవచః శ్రుత్వా మృకండుర్మునిసత్తమః | జగామ పరమం హర్షం క్షణమేకం సముచ్ఛ్వసన్‌ || 32

ఇంకొకటిది వారు నాకు జేసినది, నీకు చింత కల్గించునది కల్పముముందు కల్పాంతమువరకు దండ్రీ నేనుందును. లోకకర్త యొక్క ప్రసాదము వలన తపస్సుచేయుటకు పుష్కరమునకేగెదను. నేనట దేవదేవుని బ్రహ్మనుపాసింతును. సర్వాభీష్టసిద్దిని గూర్చువాడు సర్వశత్రుభంజనుడు సర్వసౌఖ్యప్రదాతను ఇంద్రాదులకు పరమదైవము సర్వలోకపితామహుని బ్రహ్మనుపాసింతునన మార్కండేయునిమాటవిని మృకండుముని పరమహర్షమందెను. ఒక్క క్షణము మాత్రము నిట్టూర్పుపుచ్చెను. మంచి మనసుతో ధైర్మమూని యిట్లనియెను. 32

ధైర్యం సుమనాస్థాయ ఇదం వచనమబ్రవీత్‌ | అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్‌ || 33

సర్వస్య జగతాం స్రష్టా యేన దృష్టః పితామహః | త్వయా దాయాదవానస్మి పుత్రేణ వంశధారిణా || 34

త్వం గచ్ఛ పశ్యదేవేశం పుష్కరస్థం పితామహమ్‌ | దృష్టే తస్మిన్‌ జగన్నాధేన జరామృత్యురేవ చ || 35

నృణాం భవంతి సౌఖ్యాని తథైశ్వర్యం తపోక్షయం | త్రీణి శృజ్ఞాణి శుభ్రాణి త్రీణి ప్రస్రవణాని చ || 36

పుష్కరాణి తథా త్రీణి న విద్మస్తత్ర కారణం | కనీయాంసం మధ్యమం చ తృతీయం జ్యేష్టపుష్కరమ్‌ || 37

శృంగశబ్ధాభిధానాని శుభ ప్రస్రవణాని చ | బ్రహ్మా విష్ణుస్తథా రుద్రో నిత్యం సన్నిహితాస్త్రయః || 38

పుష్కరేషు మహారాజ నాతః పుణ్యతమం భువి | విరజం విమలం తోయం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ || 39

బ్రహ్మలోకస్య పన్థానం ధన్యాః పశ్యంతి పుష్కరం | యస్తు వర్షశతం సాగ్రమగ్నిహోత్రముపాసితా || 40

కార్తికీం వా వసేదేకాం పుష్కరే సమమేవ చ | కర్తుమ్మయా న శక్తిః కర్మణానైవ సాధికమ్‌ || 41

తదయత్వాత్వయా తాత మృత్యుస్సర్వహరో జితః | తత్ర దృష్టస్సదేవేశో బ్రహ్మా లోకపితామహః || 42

నాన్యో మర్త్యస్త్వయా తుల్యో భవితా జగతీతలే | అహం వై తోషితో యేన పఞ్చవార్షికజన్మనా || 43

వరేణ త్వం మదీయేన ఉపమాం చిరజీవినాం | గమిష్యసి న సన్ధేహస్తథాశీర్వచనమ్మమ || 44

ఏవం వదన్తి తే సర్వే వ్రజ లోకాన్యథేప్సితాన్‌ | ఏవం లబ్ధప్రసాదేన మృకణ్డుతనయేన చ || 45

ఆశ్రమః స్థాపితస్తేన మార్కణ్డాశ్రమ ఇత్యుత | తత్ర స్నాత్వా శుచిర్భూత్వా వాజపేయఫలం లభేత్‌ || 46

నాజన్మమిపుడు సఫలమైనది. బ్రతుకు మిక్కిలి చక్కని బ్రతుకైనది. సర్వజగత్ర్సష్ట పితామహుని దర్శనమైనది నా బిడ్డకు నీకు. వంశోధ్దారకుడవగు పుత్రుడవు నీతోడి కుటుంబినైతిని. నీవు వెళ్లి పుష్కరమందున్న దేవేశుని బితామహుని దర్శింపుము. జగన్నాథుడు కనబడిన అపమృత్యువుపాలుండదు. మానవుల కక్షయసౌఖ్యము ఐశ్వర్యము తపస్సు సిద్థించును. శుభ్రములయిన మూడు శృంగములు మూడతి వ్రసవణములు (వాగులు) మూడుపుష్కరములు సరస్సులు అన్ని యిటనుండుటకు కారణమెఱుగము. కనీయాంస (చివరిది) మధ్యమము మూడవది జ్యేష్టము పుష్కరమున శృంగములనుపేర శుభములగు ప్రస్రవణములు మూడు, ఇట త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు నను త్రిమూర్తులు నిత్య సన్నిహితులు. మహారాజా ! పరమపుణ్యుడుగా పుష్కరమందలి తీర్థము (జలము) విరజము (దుమ్ముధూళిలేనిది) విమలమునని ముల్లోకముల ప్రసిద్ధి గన్నది. బ్రహ్మలోకమునకు రాచబాట పుష్కరమును ధన్యులు దర్శింతురు. ఎవడు నూరేండ్లు చివరిదాక నట నగ్నిహోత్రౌపాసన సేసి నన్ను ఒక కార్తికమాసము వసించినను రెండు సమానములే. నేనదిచేయుటకు శక్తిలేదు. చేసిసాధించలేనైతి. తండ్రీ! నీచేత నప్రయత్నముగ సర్వము హరించు మృత్యువు గెలువబడినది. అచట కనబడు నా దేవేశుడు బ్రహ్మలోక పితామహుడు, నీకు భూతలమున నీతోదీటగు మర్త్యుండుండబోడు. ఐదేండ్ల బిడ్డవై పుట్టిననీచే నేను సంతోషింపబడినాను. నావరముచే నీవు చిరంజీవులకుదాహరణమౌదువు. సందియములేదు. అలానా ఆశీర్వచనము నీకు. ఈ నీకందరు దీవెనలు పలుకుదురు. కోరిన లోకములకేగుము. ఈలా అనుగ్రహమందిన మృకండు కుమారునిచే మార్కండేయా శ్రమము అను పేరనొక యాశ్రమమీపుష్కరమందు స్థాపింపబడెను. ఇట స్నానముచేసి శుచియై వాజపేయ ఫలమందును. సర్వపాపములుపోయి విశుద్దమనస్కుడై నరుడు చిరాయుష్మంతుడగును. 46

సర్వపాపవిశుద్ధాత్మో చిరాయుర్జాయతే నరః |

పులస్త్య ఉవాచ :- తథాన్యం ప్రవక్ష్యామి ఇతిహాసం పురాతనమ్‌ || 47

యథా రామేణ వై తీర్థం పుష్కరం తు వినిర్మితం | చిత్రకూటాత్పురా రామో మైథిల్యా లక్ష్మణన చ || 48

ఆత్రేరాశ్రమ మాసాద్య పప్రచ్ఛ మునిసత్తమం |

రామ ఉవాచ: - కాని పుణ్యాని తీర్థాని కిం హి క్షేత్రం మహామునే || 49

యత్ర గత్వా నరో యోగిన్‌ వియోగం సహ బందుభిః | నైవ ప్రాప్నోతి భగవన్‌ తన్మమాచక్ష్వ సువ్రత || 50

అనేన వనవాసేన రాజ్ఞస్తు మరణన చ | భరతస్య వియోగేన పరితప్యేహ్యహం త్రిభిః || 51

తద్వాక్యం రాఘవేణోక్తం శ్రుత్వా విప్రర్షభస్తదా | ధ్యాత్వా చ సుచిరం కాలమిదం వచనమబ్రవీత్‌ || 52

-: శ్రీరామ నిర్మిత పుష్కర తీర్థ ప్రశంస :-

పులస్త్యుడనియె: శ్రీరామునిచే నిర్మింపబడిన పుష్కరతీర్థముంగూర్చి నీకెఱింగించెద. రాముడు చిత్రకూటమునుండి సీతతో లక్ష్మణునితో నత్రిమహర్షి యాశ్రమమునకేగి యమ్మునీంద్రునడిగెను. మహామునీ ! పుణ్యపీర్థములు క్షేత్రములేవి యెక్కడనున్నవి. ఎటకేగి మానవుడు బంధువులతో నెడబాటునందడు? ఆ విశేషములు ఆనతిమ్ము. మీరు వ్రతనిష్ఠులు, భగవంతులు. ఈ అరణ్యవాసముచే దశరధ చక్రవర్తి మరణముచే భరతునితోడి యెడబాటుచే నేను దపించుచున్నానుగదా : అన యమ్మహర్షి చాలసేపు ధ్యానముసేసి యిట్లనెను. 52

అత్రిరువాచ :- సాధు పృష్టం త్వయా వీర రఘూణాం వంశవర్ధన |

మమ పిత్రా కృతం తీర్థం పుష్కరం నామ విశ్రుతమ్‌ || 53

పర్వతౌ ద్వౌ చ విఖ్యాతౌ మర్యాదాయజ్ఞపర్వతౌ | కుండత్రయం తయోర్మధ్యే జ్యేష్టమధ్యకనిస్టకమ్‌ || 54

తేషు గత్వా దశరథం పిండదానేన తర్పయ | తీర్థానం ప్రవరం తీర్థం క్షేత్రాణామపి చోత్తమమ్‌ || 55

అవియోగా చ సురసా వాపీ రఘుకులోద్వహ | తథాసౌ భాగ్యకూపోన్యః సుజలో రఘునందన || 56

తేషు పిండప్రదానేన పితరో మోక్షమాప్నుయుః | ఆభూతసంప్లవం కాలమేతదాహ పితామహః || 57

తత్ర రాఘవ గచ్చస్వ భూయోస్యాగమనం క్రియాః | తథేతి చోక్త్వా రామోపి గమనాయ మనో దధే || 58

వీరా : రఘువంశవర్థన : చక్కగ నడిగితివి. మాతండ్రి యేర్పరచినది పుష్కరతీర్థము ప్రసిద్దము. మర్యాదా పర్వతము యజ్ఞపర్వతమునన రెండుపర్వతములు ప్రసిద్దములు వానిమధ్య జేష్ఠ-మధ్య-కనిష్ఠకములుమూడున్నవి. అటకేగి దశరధుని పిండప్రదానముసేసి తర్పణము సేయుము. ఇవి చాల యుత్త మతీర్థక్షేత్రములు. ఆ వాసి చక్కని అవియోగ అని పేరొందినది. అది సేవించిన బంధువియోగము కలుగదన్నమాట. అందు పిండప్రదానముచేసినచో పితరులు భూత ప్రళయముదాక మోక్షమందుదురు. ఇది బ్రహ్మవచనము. అటకేగుము. ఇంక పలుమారు లటకురమ్ము. అన రాముడు నటకు జనవలెనని సంకల్పించెను. 58

ఋక్షపర్వతమభిక్రమ్య నగరం వైదిశం తథా| చర్మణ్వతీం సముత్తీర్య ప్రాప్తో7సౌ యజ్ఞపర్వతమ్‌ || 59

తమతిక్రమ్య వేగేన మధ్యమే పుష్కరే స్థితః | పితౄన్సంతర్పయామాస అద్భిర్దేవాంశ్చ సర్వశః || 60

స్నానావసానే రామేణ మార్కండో మునిపుంగవః | ఆగచ్ఛచ్ఛిష్యసంయుక్తో దృష్టిస్తత్రైవ ధీమతా || 61

గత్వా వై సంముఖం తస్య ప్రణిపత్య చ సాదరం | పృష్టో7వియోగదః కూపః కతమస్యాం దిశి ప్రభో|| 62

సుతో దశరథస్యాహం రామో నామ జనైః స్మృతః |

సౌభాగ్యవాపీం తాం ద్రష్టుమహం ప్రాప్తో7త్రిశాసనాత్‌ || 63

తత్‌స్థానం తే చ వై కూపా భగవాన్ర్పబ్రవీతు మే | ఏవముక్తశ్చ రామేణ మార్కండః ప్రత్యువాచ హ || 64

ఋక్ష పర్వతము విదిశానగరముదాటి చర్మణ్వతీ నదిని దాటి యజ్ఞ పర్వతము సేరెను. వేగముగ నదియుం దాటి మధ్య పుష్కరమునందు నిలిచెను. అందు పితరులకు దేవతలకు తర్పణము చేసెను. స్నానమైన తరువాత మార్కండ మహర్షి శిష్యులతో నట వచ్చెను. బుద్దిశాలి రామునిచే జూడబడెను. ఆయన కెదురుగా జని ఆదరముతో సాష్టాంగ ప్రణతుడై ప్రభూ! అవియోగవాపి (నూయి) యే దిశ నున్నదని యడిగెను. నేను దశరథ పుత్రుడను రాముడని పేరుగన్నాడను. అత్రి మహర్షి, సౌభాగ్యవాపిని దర్శించ వచ్చితిని. ఆ చోటు ఆ నూతులను భగవంతుదవీవు నాకు దెల్పుము, అన మార్కండేయ ముని యిట్లనియె. 64

మార్కండేయ ఉవాచ :- సాధు రాఘవ భద్రం తే సుకృతం భవతా కృతం ||

తీర్థయాత్రాప్రసంగేన యత్‌ ప్రాప్తోసీహ సాంప్రతమ్‌ | 65

ఏహ్యాగచ్ఛస్వ పశ్యస్వ వాపీం తామవియాగదాం | అవియోగశ్చ సర్వైశ్చ కూప ఏవాత్ర జాయతే || 66

ఆముష్మికే చైహికే చ జీవతోపి మృతస్య వా | ఏతద్వాక్యం మునీంద్రస్య శ్రుత్వా లక్ష్మణపూర్వజః || 67

సస్మార రామో రాజానం తదా దశరథం నృప | భరతం సహ శత్రుఘ్నం భ్రాతౄనన్యాంశ్చ నాగరాన్‌ || 68

ఏవం చింతయత స్తస్య సంధ్యాకాలో వ్యజాయత | ఉపాస్య పశ్చిమాం సంధ్యాం మునిభిః సహ రాఘవః || 69

సుష్వాప తాం నిశాం తత్ర భ్రాతృభార్యాసమన్వితః | విభావర్యపసానే తు స్వప్నాంతే రఘునందనః || 70

పిత్రా మాత్రా తథాచాన్యైరయోధ్యాయాం స్థితః కిల| వివాహమంగలే వృత్తే బహుభిర్బాంధవైః సమా || 71

సమాసీనః సభార్యోసావృషిభిః పరివారితః లక్ష్మణనా ప్యేవమేవ దృష్టో7సౌ సీతయా తథా || 72

బాగున్నది రాఘవా ! భద్రమగుత నీకు. పుణ్యము సేసినావు. తీర్థయాత్రా నిమిత్తముగ నిపుడిటకు వచ్చితివి. రారమ్ము వెళ్ళి అవియోగదాత్రి వాపిని దర్శింపుము. బంధు వియోగము జరుగును యిక్కడనే. ఈ వాపి బ్రతికియున్న వానికైకాకయు గతించిన వాని కాముష్మికము నిగ్చునది. లక్ష్మణునన్న రాముడు మునిమాట విని దశరథ రాజును దలచికొనెను. భరతుని శత్రుఘ్నుని మఱి యింకను గల పౌరులను త లచుకొనెను. ఇట్లు తలచుకొనుచుండగనే సంధ్యవేళయయ్యెను. సాయం సంధ్యోపాసన సేసి మునులతో, రాముడా రాత్రి తమ్మునితో, ధర్మపత్నితో నిదురపోయెను. వేకువ తుద కల చివర తల్లితో దండ్రితో మఱి యందరితో నయోధ్య యందుండెను. వివాహము మంగళము జరుగుచుండెను. పెక్కుమంది బంధువులతో గూడ పత్నితో ఋషులతో చుట్టువారుకొని లక్ష్మణునితో యున్నట్లు కనబడెను. 72

ప్రభాతే తు మునీనాం తత్సర్వమేవ ప్రకీర్తితం | ఋషిభిశ్చ తథేత్యుక్తః సత్యమేతద్రఘూత్తమ || 73

మృతస్య దర్శనే శ్రాద్దం కార్యమావశ్యకం స్మృతం | వృద్దికామాస్తు పితర స్తథా చైవాన్న కాంక్షిణః || 74

దదంతి దర్శనం స్వప్నే భక్తియుక్తస్య రాఘవ | అవియోగస్తు తే భ్రాతా పిత్రా చ భరతేన చ || 75

చతుర్దశానాం వర్షాణాం భవితా రాఘవ ధృవం | కురు శ్రాద్ధం తథావీర రాజ్ఞో దశరథస్య చ || 76

అమీ చ ఋషయః సర్వే తవ భక్తాః కృతక్షణాః | అహం చ జమదగ్నిశ్చ భారద్వాజశ్చ లోమశః 77

దేవరాతః శమీకశ్చ షడేతే వై ద్విజోత్తమాః | శ్రాద్దే చ తే మహాబాహో సంభారాంస్త్వముపాహార || 78

ముఖ్యం చేంగుదిపిణ్యాకం బదరామలకైః సహ | శ్రీఫలాని చ పక్వాని మూలం చోచ్చావచం బహు || 79

మార్గేణ చాథ మాంసేన ధాన్యేన వివిధేన చ | తృప్తిం ప్రయచ్ఛ విప్రాణాం శ్రాద్ధదానేన సువ్రత || 80

పుష్కరారణ్యమాసాద్య నియతో నియతాశనః | పితౄంస్తర్పయతే యస్తు సోశ్వమేథమవాప్నుయాత్‌ || 81

స్నానార్ధం తు వయం రామ గచ్చామో జ్యేష్టపుష్కరం |

ఇత్యుక్త్వా తే గతాః సర్వే మునయో రాఘవం నృప || 82

ప్రభాతవేళ నిదియెల్ల మునులకు వర్ణించి చెప్పెను. ఋషులు గూడ ఔనౌనది నిజము రఘునాధ! చనిపోయిన వ్యక్తి దర్శనమైనపుడు శ్రాద్దమవశ్య మాచరింపవలెనని స్మృతులన్నవి. పితరులు వృద్దిని కోరుదురు. అలాగే అన్నము కాంక్షింతురు. భక్తి గలవానికి కలలో దర్శనమిత్తురు. రాఘవా! పదునాల్గేండ్లు నీకు తమ్ములతో భరతునితో, తండ్రితో వియోగముండదు. దశరథ రాజునకు శ్రాద్దమొనరింపుము. ఇదుగో వీరు ఋషులు నీ భక్తులు. క్షణము గావించి వచ్చిరి. (భోక్తలుగా దయచేసిరన్నమాట). నేను జమదగ్ని, భారద్వాజుడు, లోమశుడు, దేవరాతుడు, శమీకుడు, వీరార్యుడు, బ్రాహ్మణులు నీ పెట్టు శ్రాద్ధమందు వచ్చినారు. సంభావములను సమకూర్చుకొనుము. ప్రధానమయినది గారకాయల పిండి. రేగుపండ్లు. ఉసిరికాయలు, మారేడు పండ్లు బాగాపండినవి దుంపలు పెద్దవి చిన్నవి, మృగ మాంసము, ధాన్యము రకరకాలు. వ్రతనిష్ఠుడవు శ్రాద్ధ దానముచే విప్రులకు తృప్తి సమకూర్చుము. పుర్కరారణ్యమేగి యాచారముతో ఆహార నియమముతో మీ పితరులనుతప్పింప జేయుము. ఇట్లు చేసినవాడశ్వమేధ ఫలమందును. మేము స్నానార్థము జ్యేష్ఠ పుష్కరమున వెళ్ళెదము, అని పలికి వారందఱు నటు జనిరి. 82

లక్ష్మ ణం చాబ్రవీద్రామో మేధ్యమాహర మే మృగం | శుద్ధేక్షణం చ శశకం కృష్ణశాకం తథా మధు || 83

జంబీరాణి చ ముఖ్యాని మూలాని వివిధాని చ | పక్వాని చ కపిత్థాని ఫలాన్యన్యాని యాని చ || 84

తాన్యాహరస్వ వై శ్రాద్దే క్షిప్రమేవాస్తు లక్ష్మణ | తథా తత్కృతవాన్‌ సర్వం రామాదేశాచ్చ రాఘవః || 85

బదరేఙ్గుదిశాకాని మూలాని వివిధాని చ | తత్రాహృత్య చ రామేణ కూటకారః కృతో మహాన్‌ || 86

రాముడమేధ్యము = పవిత్రమృగమునుతెమ్మని లక్ష్మణునితో జెప్పెను. శుద్దములగు కన్నులు గల శశకము. కృష్ణ శాకముతేనె జంబీరములు (దానిమ్మ పండ్లు) ముఖ్యములయిన దుంపలు రకా రకాలు పండిన వెలగపండ్లు యింకనుం గల పండ్లు తెమ్ము లక్ష్మణా వేగముగ జరుగవలెనన లక్ష్మణుడట్లు యంతయుం గావించెను. రేగిపండ్లు గగారకాయలు మొదలగు శాకములు మూలముల నన్నియు పెద్ద ప్రోగు పెట్టెను. 6

పరిపక్వం చ జానక్యా సిద్దం రామే నివేదితం | స్నాత్వా రామో యోగవాస్యాం మునీంస్తాననుపాలయన్‌ || 87

మధ్యాహ్నాచ్చలితే సూర్యే కాలే కుతపకే తథ | ఆయాతా ఋషయః సర్వే యే రామేణానుమంత్రితాః || 88

జానకి వండి రామునికి నివేదించెను గూడ. రాముడు యోగవాపియందు స్నానముసేసి యా మునుల కెదురుసూచుచు మధ్యాహ్నము దాటెను. సూర్యుడి కుతపకాలము రాగానే, రాముడును మంత్రము సేసిన (పిలిచిన) ఋషులందరు వచ్చిరి. 88

తానాగతాన్‌ మునీన్‌ దృష్ట్వా వైదేహి జనకాత్మజా | రామాంతికం పరిత్యజ్య వ్రీడితా7న్యత్ర సంస్థితా || 89

విస్మయోత్ఫల్లనయనా చింతయానా చ వేపతీ | బ్రాహ్మణాన్నేహ జానంతీ శ్రాద్దకాలే హ్యుపస్థితాన్‌ || 90

రామేణ భోజితా విప్రా ః స్మృత్యుక్తేన యథావిధి | వైదిక్యశ్చ కృతా స్సర్వాః సత్ర్కియా యాస్సమీరితాః || 91

పురాణోక్తో విధిశ్చైవ వైశ్వదేవిక పూర్వక ః | భుక్తవత్సు చ విప్రేషు దత్వా పిండాన్యథా క్రమమ్‌ || 92

ప్రేషితేషు యథాశక్తి దత్వా తేషు చ దక్షిణాం | గతేషు విప్రముఖ్యేషు ప్రియాం రామోబ్రవీదిదమ్‌ || 93

ఆ వచ్చిన మునులంజూచి వైదేహి జనకుని కూతురు రాముని సన్నిధిని వదలి సిగ్గుపడి వేఱొకచో నిలిచెను. ఆశ్చర్యమున కన్నులు విప్పార వణకుచు నిట్లనుకొనెను. బ్రహ్మణులెఱుగరు. శ్రాద్ద సమయానికి వచ్చినారు. స్మృతులు నొప్పినట్లు రామునిచే విప్రులు భోజనమువెట్టబడిరి. శాస్త్రోక్త మఱి వైదిక క్రియలన్ని జరుపబడినవి. పురాణోక్తమగు విధానము వైశ్వదేవి పూర్వకముగ పితృసమర్చన నర్వర్తింపబడినది. విప్రులు భోజనము సేసిన తర్వాత పిండములు క్రమముగా నొసగి దక్షిణలు యథాశక్తి నిచ్చి వారిని సాగనంపగా నా విప్రోత్తములు జన రాముడు జానకింగని యిట్లనియె. 93

కిమర్ధం సుభ్రూ నష్టాసి మునీన్‌ దృష్ట్వాత్విహాగతాన్‌ |

తత్సర్వం త్వమిదం తత్త్వం కారణం వద చిరమ్‌ || 94

భవితవ్యం కారణన తచ్చ గోప్యం న మే కురు | శాపితాసి మమ ప్రాణౖర్లక్ష్మణస్య శుచిస్మితే || 95

ఏవముక్త్వా తదా భర్త్రా త్రపయా7 వాఙ్ముఖీస్థితా | విముంచంతీ సా 7శ్రుపాతం రాఘవం వాక్యబ్రమవీత్‌ || 96

సుభ్రు! ఇట దయసేసిన మునులంగని యెందులకు లేచి వెళ్ళితివి? అదెల్ల నీవున్నదున్నట్లు కారణము సెప్పు. వెంటనే పరోపకారణమున జరిగియుండునదియు నాయెడ దాచరాదు. నాయొక్కయు లక్ష్మణుని యొక్కయు ప్రాణములతో శపథము సెసి చెప్పుచున్నాను. శుచిస్మితా, అని భర్తయన సీత సిగ్గుపడి తలవంచికొని నిలిచెను. కంటనీరు గ్రుక్కుకొనుచు నామె రాఘవుం గూర్చి యిట్లనెను. 96

శ్రుణు త్వం నాథ యద్దృష్టమాశ్చర్యమిహ యాదృశం |

రామ త్వయా చింత్యమానో రాజేంద్రస్త్విహ చాగతః || 97

సర్వాభరణసంయుక్తౌ ద్వౌ చాన్యౌ చ తథావిధౌ | ద్విజానాం దేహసంయుక్తాస్త్రయస్తే రఘునందన || 98

పితరస్తు మయా దృష్టా బ్రాహ్మణాంగేషు రాఘవ | దృష్ట్వా త్రపాన్వితా చాహంమపక్రాంతా తవాంతికాత్‌ || 99

త్వయా వై భోజితా విప్రాః కృతం శ్రాద్ధం యథావిధి | వల్కలాజినసంవీతా కథం రాజ్ఞః పురఃసరా|| 100

భవామి రిపువీరఘ్న సత్యమేతదుదాహృతం | కౌశేయాని చ వస్త్రాణి కై కేయ్యాపహృతాని చ || 101

నాథ ! నేనిట చూచిన వింత యేలాటిదో విను. నీవు తలచుకొనుచున్న రాజేంద్రుడు (దశరథుడు) ఇప్పడిటకు వచ్చెను. సర్వాభరణ భూషితుడు సరిగా నాయనలాయున్న అమరి ముగ్గురు బ్రాహ్మణుల దేహములంగూడిన పితరులను నేను జూచి సిగ్గువడి నీదరినుండి వెడలి చాటైతిని. నీవు బ్రహ్మణులకు వడ్డించితివిగదా! శ్రాద్దము యథావిధి జరుపబడినది. నారచీరలు కట్టుకొని లేడితోలు గప్పుకొని యెట్ల రాజుముందు తిరుగుచుండగలనా? శత్రువీర సంహార ! నిజమిది సెప్పితిని. పట్టుచీరలేమో కైకేయి కాజేసినది. 101

తతఃప్రభృతి చైవాహం చీరిణీ తు వనాశ్రయం | జ్ఞాత్వాహం స వదే కించిన్మా తే దుఃఖం భవత్వితి || 102

నాహం స్మరామి వై మాతుర్నపితుశ్చ పరంతప | కదా భవిష్యతీహాంతో వనవాసస్య రాఘవ || 103

ఏతదేవానిశం రామ చింతయంత్యాః పునఃపునః | వ్రజంతి దివసా నాథ తవ పద్భ్యాం శపామ్యహమ్‌ || 104

స్వహస్తేన కథం రాజ్ఞే దాస్యే వై భోజనం త్విదం | దాసానామపి యో దాసో నోపభుంజీత యత్క్వచిత్‌ || 105

ఏతాదృశీ కథం త్వసై#్మ సంప్రదాతుం సుముత్సహే | యాహం రాజ్ఞా పురా దృష్టా సర్వాలఙ్కారభూషితా || 106

వాలవ్యజనహస్తా చ వీజయంతీ నరాధిపం | సా స్వేదమలదిగ్ధాంగీ కధం పశ్యామి భూమిపమ్‌ || 107

వ్యక్తం త్రివిష్టపం ప్రాప్తస్త్వయా పుత్రేణ తారితః |

దృష్ట్వా మాం దుఃఖితాం బాలాం వనే క్లిష్టామనాగసమ్‌ | 108

శోకః స్యాత్పార్ధివ స్యాస్య తేన నష్టాస్మి రాఘవ! భవాన్ర్పాణసమో రామ న తే గోప్యం మమ త్విహః|| 109

ఆది మొదలగ నేను నారచీరలు గట్టుకొని అడవిపాలై తెలిసియు నీకు దుఃఖము గలుగగూడదని కొందెమేని యిది సెప్పెను. ఓ పరమతపస్వి! నేను మా అమ్మను నాన్నను తలచికొనుటలేదు. ఈ వనవాసానికి సమాప్తి ఎప్పుడు కాగలదో! ఇదే ఎల్లపుడు మఱిమఱి యూరక దలచుకొనుటలోనే రోజులు వెళ్ళుచున్నవి. స్వామీ! నీ పాదములు తోడుగా జెప్పుచున్నాను. నా చేతితో నేనీలాటి భోజనము రోజునకెట్లు వెట్టుదును? దాసులకు దాసుడైనవాడు (నౌకరులకందఱికంటె నౌకరు) కూడ యెన్నడు తినని యీలాటిది యీయనకు పెట్టుటకేలా నేనుత్సహింతును? ఆ రాజుచేనింత సర్వాలంకారసుమలంకృతనై వింజామర చేకొని యా త్రిభువునకు వీచుచు జూడబడిన నేనిపుడు చెమటచే దడిసిన మేనితో నెదురువడి యెట్లు ప్రభువులజూతును? అడవిలో క్లేశముల వశ##మై యేడ్చుచు నేమాత్రము కినియక పిల్లను నన్నుజూచిన ప్రభువునకు శోకము గల్గునని నేను జూడువీడితిని. రామచంద్రా! నా ప్రాణసముడవు నీవు. నీ దగ్గర గోప్యమిట లేనేలేదు. నిజమిది, ప్రమాణముచేసి నీ పాదములం దాకుచున్నాను అని జానకి పలికెను. 109

సత్యేన తేన చైవాథ స్పృశామి చరణౌ తవ |

తచ్ర్ఛుత్వా రాఘవః ప్రీతః ప్రియాం తాం ప్రియవాదినీమ్‌ || 110

అంకమానీయ సుదృఢం పరిష్వజ్య చ సాదరం | భుక్తౌ భోజ్యం తదా వీరౌ పశ్చాద్భుక్తా చ జానకీ || 111

ఏవం స్థితే తదా సాచతాం రాత్రిం తత్ర రాఘవౌ | ఉదితే చ సహస్రాంశౌ గమనాయ మనో దధుః 112

రాఘవుడది విని యెప్పుడు ప్రియమే పలుకు యా ప్రియురాలిని తన ఓడిచేర్చి యాదరముతో గాఢముగ కౌగిలించికొనెను. అపయి రామలక్ష్మణులు భోజనము సేసిరి. తర్వాత జానకి భుజించెను. 112

ప్రత్యజ్ముఖం గతః క్రోశం జ్యేష్టం యావచ్చ పుష్కరం | పూర్వభాగే పుష్కరస్య యావత్తిష్టతి రాఘవః || 113

శుశ్రావ చ తతో వాచం దేవదూతేన భాషితం | భో భో రాఘవ భద్రం తే తీర్థమేతత్సుదుర్లభమ్‌ ||114

అస్మిన్‌ స్థానే స్థితో వీర ఆత్మనః పుణ్యతాం కురు | దేవకార్యం త్వయా కార్యం హంతవ్యా దేవశత్రవః || 115

తతో హృష్టమనా వీరో హ్యబ్రవీల్లక్ష్మణం వచః | సౌమిత్రే7నుగృహీతోహం దేవదేవేన బ్రహ్మణా|| 116

పడమటి దెసగా నొక క్రోశమరిగి జ్యేష్ఠ పుష్కరముదాక పూర్వభాగమున రాఘవుడున్నంతసేపు దేవదూత మాట నాలించెను ఓ రాఘవా! భద్రమగుగాక నీకు ఈ తీర్థమెంతో దుర్లభము. ఓ వీరా! ఇచ్చోట నీవున్నావు. ఇట పుణ్యాత్ముని గావించుకొనుము. దేవకార్యము నీవు చక్కబెట్టవలెను. దేవశ్రతువులు నీచే జంపబడవలసియున్నారు. దేవదూత మాటవిని హర్షించి లక్ష్మణునితో నిట్లనియె. సుమిత్రా కుమారా ! దేవదేవుడగు బ్రహ్మ యనుగ్రహపాత్రుడైనతిని. 116

అత్రాశ్రమపదం కృత్వా మాసమేకం చ లక్షణ | వ్రతం చరితుమిచ్ఛామి కాయశోధనముత్తమమ్‌ || 117

తధేతి లక్ష్మణనోక్తే వ్రతం పరినమాప్య తు పిండదానాదిభిర్దానైః శ్రాద్ధెశ్చైవ పితామహాన్‌ || 118

పుష్కరే తు తథా రామో7తర్పయద్విధివత్తదా | కనకా సుప్రభా చైవ నందా ప్రాచీ సరస్వతీ | 119

పంచస్రోతాః పుష్కరేషు పితౄణాం తుష్టిదాయినీం |

దైనందినీం పితౄణాం తు పూజాం తాం పితృపూర్వికామ్‌ || 120

ఇటనొక యాశ్రమమేర్పరచుకొని యొక్క నెల కాయశోధనము (శరీరము శుద్ది) యగుటకు వ్రతమాచరింపగోరెదను. మంచి దాలాగే కానిమ్మని లక్ష్మణుడనగా వ్రతమిది పూర్తిసేసి యాపుష్కరమందు పిండదానాది దానములచే శ్రాద్దములచే పితామహా ప్రపితామహాదులను యధావిధి తర్పింపజేసెను. కనక, సుప్రభ, నంద, ప్రాచీ, సరస్వతియను నైదు స్రోతస్సులు పుష్కరమందు పితరులకు సంతుష్టిగూర్చువానింగూర్చి ప్రతిదినము సేయు పితృ దేవతల పూజను మాతృవరముతో మొదలిడి జరిపియపుడు రాముడు లక్ష్మణునిగూర్చి యొక మాట పల్కెను.

రచయిత్వా తదా రామో లక్ష్మణం వాక్య మబ్రవీత్‌ | ఏహి లక్ష్మణ శీఘ్రం పుష్కరాజ్జలమానయ || 121

పాదప్రక్షాలనం కృత్వా శయనం కురు సంస్తరే |

విభావర్యాం నివృత్తాయాం యాస్యామో దక్షిణాం దిశమ్‌ || 122

లక్ష్మణస్త్వబ్రవీద్వాక్యం సీతయానీయతాం పయః | నాహం రామ సర్వకాలే దాసభావం కరోమి తే || 123

ఇయం పృష్టా చ సుభృశం పీవరీ చ మమాప్యుత | కిం త్వం కరిష్యస్యనయా భార్యయా వద సాంప్రతమ్‌ || 124

కిం వామృతస్య వై పృష్ఠ ఇయం యాస్యతి తే ప్రియా | రక్షసే త్వం సదా కాలం సుపుష్టాం చైవ సర్వదా || 125

హృష్టా చైషా క్లేశయతి సతతం మాం రఘూత్తమ | త్వం చ క్లేశయసే రామ పరత్ర జాయతే క్షతిః || 126

త్వత్కృతే చ సదా చాహం పిపాసాం క్షుధయా సహ | సంసహామి న సందేహః పరత్ర చ నిశామయ || 127

మృతానాం పృష్టతః కచ్చిద్గతో నైవ చ దృశ్యతే | భార్యాపుత్రో ధనం చాపి ఏవమాహుర్మనీషిణః || 128

మృతశ్చ తే పితా రామ త్వక్త్వా రాజ్యమకంటకం | వినిక్షిప్య వనే త్వాం చ కైకేయ్యాః ప్రియకామ్యయా || 129

ఇహ స్థితా సా కైకేయీ ధనం సర్వే చ బాంధవాః మహారాజో దశరథ ఏక ఏవ గతో గతిమ్‌ || 130

మన్యేహం న త్వయా సార్ధం సీతా యాస్యతి వై ధృవం కరిష్యసే కిమనయా వద రాఘవ సాంప్రతమ్‌ || 131

శ్రుత్వా చాశ్రుతపూర్వం హి వాక్యం లక్ష్మణభాషితం | విమనా రాఘవ స్తస్థౌ సీతా చాపి వరాననా || 132

రమ్ము లక్ష్మణా! శీఘ్రము నీవు పుష్కరజలము తెమ్ము. కాళ్ళు గడిగికొని చాపపై పరుండుము. వేకువ గడచిన మీద దక్షిణదిశకు వెళ్ళుదమనెను. లక్ష్మణుడు యదివిని సీతమ్మ యాజలముగొని వచ్చుత! అన్నయ్యా! ఎప్పుడూ నీకు దాసత్వము (నౌకరీ) చేయుచున్నాను. ఈమెయో మిగుల పుష్టిగానున్నది ఓపికగా నున్నది. నాకంటె. ఇపుడు నీవీ భార్యతో ఏమిసేయుదువు? తెల్పు. శరీరపుష్టిగొని నీ వెంతేని గూర్చు నీమె పోయినవానికేమి చేసినట్లు? ఎల్లకాలమీమెను పుష్టిగా నుండునట్లు రక్షించుచున్నావు. ఈమెయో నిత్యము తానానందించుచు చక్కగ పుష్టిగొని నన్నెపుడు శ్రమ పెట్టుచున్నది. నీవునూ నన్నే శ్రమపెట్టుచున్నావు. నీ కొఱకు నేనెప్పుడు నాకలి దప్పికల నోర్చుకొనుచున్నాను. సందియములేదు. ఇక పరలోకమందునా? అది వినుము. గనిపింపదు. భార్య, పుత్రుడు యేదిగాని చచ్చిన వాని వెంట వెళ్ళు దొక్కటి గనిపింపదు. జ్ఞానులన్న మాట యిది. నీ తండ్రి, కైకేయి ప్రియము కోరి నిష్కంటకమయిన రాజ్యము విడిచి నిన్నడవిలో పడవేసి చనిపోయినాడు. ఆ కైకేయి ధనము అందరు చుట్టాలు ఇక్కడే యున్నారు. మహారాజు దశరథుడొక్కడే గతిం బొందినాడు. నీతో గూడ సీత వచ్చునని నేననుకొందును. నిజమిది. ఈమెతో నీ విపుడేమి సేయుదువు రామా! తెల్పుమనెను. మున్నెన్నడు వినని యీ లక్ష్మణుని పలుకాలించి మనస్సు చెడిపోయి రాఘవుడట్లే మనస్సు కలతచెంది తెల్లపోయి నిలిచెను. సీతయునంతే. 132

యదుక్తం లక్ష్మణనాథ సీతా సర్వం చకార హ | స్నాత్వా భుక్త్వా తతో వీరే పుష్కరే పుష్కరేక్షణ || 133

నీత్వా విభావరీం తత్ర గమనాయ మనో దధుః | ఏహ్యుత్తిష్ఠ చ సౌమిత్రే వ్రజామో దక్షిణాం దిశమ్‌ || 134

సౌమిత్రిర బ్రవీద్రామ నాహం యాస్యే కథంచన | వ్రజ త్వమనయా సార్ధం భార్యయా కమలేక్షణ || 135

నాన్యద్వనం గమిష్యామి నైవాయోధ్యాం చ రాఘవ | అస్మిన్వనే వసిష్యామి వర్షాణీహ చతుర్దశ || 136

మయా వినా త్వయోధ్యాయాం యది త్వం న గమిష్యసి | అనేన వర్త్మనా భూప ఆగంతవ్యం త్వయా విభో || 137

యది జీవామి తత్కాలం పునర్యాస్యే పితుః పురం | తపస్సంభావయిష్యామి మయా త్వం కిం కరిష్యసి || 138

వ్రజ సౌమ్యాశీ వః పంథామాచ తే పరిపంథీనః | పశ్యామి త్వాం పునః ప్రాప్తం సభార్యం కమలేక్షణమ్‌ || 139

పితృపైతామహం రాజ్యమయోధ్యాయాం నరాధిప | శత్రుఘ్నభరతేచోభే త్వదాజ్ఞాకరణ స్థితే || 140

అహం తే ప్రతికూలస్తు వనవాసే విశేషతః | అనారతం దివా చాహం రాత్రే చైవ పరంతప || 141

కర్మ కర్తుం న శక్నోమి వ్రజ సౌమ్య యథాసుఖం | ఏవం బ్రువాణం సౌమిత్రిమువాచ రఘునందనః || 142

లక్ష్మణుడనినదెల్ల జానకి సేసెను. పుష్కరేక్షణులు (తామర పూవువంటి కన్నులు గలవారు) రామలక్ష్మణులు స్నానము చేసి భోజనముచేసి రాత్రి గడిపి వ్రయాణమైరి సుమిత్ర కుమార! రా! లే, - దక్షిణ దిశగా వెళ్ళుదమన, కమలనయనా! నీవీమెతో వెళ్ళు నేనంకొక అడవికిబోను. అయోధ్యకును వెళ్ళను. పదునాలుగేండ్లు నీ యడవిలోనే వసింతును. నన్ను విడిచి నీ వయోధ్యకు వెళ్ళవేని యీ దారినే నాతో నీవు రావలెను. అన్నాళ్ళు నేను బ్రతికి యుంటినా తండ్రి పురమునకు తిరిగి వెళ్ళెదను. ఇది తపస్సుగా భావింతును. నాతో నీవేమి చేసెదవు? తిరిగి భార్యతో దిరిగి వచ్చిన నిన్ను కమలలోచనుం జూచెదను. తండ్రి తాతల రాజ్య మయోధ్య యందున్నది. శత్రుఘ్న భరతులిద్దరు నీ యాజ్ఞ నొనరించువారున్నారు. నీ ప్రకూలుడను. నేనా విశేషించి వనవాసమందు పగలు రాత్రి పనిచేయజాలను. సుఖముగా నీవేగుము. ఇట్లు పలుకు లక్ష్మణుని గూర్చి రఘుకుమారు డిట్లనియె. 142

కథం పూర్వమయోధ్యాయా నిర్గతోసి మయా సహ | వనే వత్స్యామ్యహం రామ నవ వర్షాణి పంచ చ || 143

న తు త్వయా విరహితః స్వర్గేపి నివసే క్వచిత్‌ | యా గతిస్తే నరవ్యాఘ్ర మమ సాపి భవిష్యతి || 144

ప్రసాదః క్రియతాం మహ్యం నయ మామపి రాఘవ | ఇదానీమర్ధమార్గేత్వం కథం స్థాస్యసి శతృహన్‌ || 145

లక్ష్మణ స్త్వబ్రవీద్రామం నాహం గంతా వనే పునః | లక్ష్మణం సంస్థితం జ్ఞాత్వా రామో వచనమబ్రవీత్‌ || 146

మామనువ్రజ సౌమిత్ర ఏకో యాస్యామి కాననం ద్వితీయా మే త్వియం సీతా రామేణోక్తస్తు లక్ష్మణః || 147

గృహీత్వా7థ సముత్తస్థౌ రామవాక్యం సలక్ష్మణః | మర్యాదాపర్వతం ప్రాప్తౌ క్షేత్రసీమాం పరంతపౌ || 148

అజగంధం చ దేవేశం దేవదేవం పినాకినం | అష్టాంగప్రణిపాతేన నత్వా రామస్త్రిలోచనమ్‌ || 149

తుష్టావ ప్రయతః స్థిత్వా శంకరం పార్వతీప్రియం | కృతాంజలిపుటో భూత్వా రోమాంచితశరీరకః || 150

సాత్వికం భావమాపన్నో వినిర్ధూతరజస్తమాః లోకానాం కారణం దేవం బుబుధే విబుధాధిపమ్‌ || 151

రామ ఉవాచ :- కృత్స్నస్య యోస్య జగతః సచరాచరస్య కర్తా కృతస్య చ పునః సుఖదుఃఖదశ్చ ||

నాతో గూడ యయోధ్యనుండి వెడలి యెట్లు వచ్చితివి? నిన్ను విడిచి స్వర్గమందేని యెన్నడు నుండను. శూరాగ్రేసర నీకేది గతియో నాకు నదే కాగలదు. నన్ననుగ్రహింపుము. నన్ను గూడ కొని యేగుము దారిలోన నీవెట్లుందువు? అన లక్ష్మణుడు నేనింక వనమునకు తిఱిగి పోననెను. అట్లు నిలిచినట్లు చూచి లక్ష్మణుని గూర్చి రాముడనెను. లక్ష్మణా నా వెంటరమ్ము. ఒంటరిగ నడవికేగుచున్నాను. నాతో నీవు నడువు రెండవది సీతయే అని రాముడు లక్ష్మణునితో ననెను. రాముని మాట గ్రమించి లక్ష్మణుడు లేచెను మర్యాదా పర్వతమునుంజేరి అజగంధుడను దేవేశుని పినాకిని శివుని దర్శించి సాష్టాంగ ప్రణామములు సేసి పార్వతీ ప్రియుని శంకరుని రాముడు నిలిని మనస్సు నిలిపి మేను గగుర్పాటు చెంద చేతులు మొగించి స్తుతించెను. రజస్తమో గుణముల విదళించి కేవల సాత్త్విక భావమూని వరమశివుని లోకకారణు సర్వ దేవాధీశునిగ తెలిసికొనెను. 151

-: శ్రీరాముడు చేసిన శంకరస్తుతి :-

సంహారహేతురపి యః పునరంతకాలే తం శంకరం శరణదం శరణం వ్రజామి || 152

యోయం సకృద్విమలచారువిలోలతోయం గంగాం మహోర్మవిషమాం గగనాత్పతంతీం |

మూర్ద్నా దధే స్రజమివ ప్రవిలోలపుష్పాం తం శంకరం శరణదం శరణం వ్రజామి || 153

కైలాసశైలశిఖరం పరికమ్య్పమానం కైలాసశృంగసదృశేన దశాననేన |

యత్పాదపద్మవిధృతం స్థిరతాం దధార తన శంకరం శరణదం శరణం వ్రజామి | 154

యేనాసకృద్దనుసుతాః సమరే నిరస్తా విద్యాధరోరగగనాశ్చ వరైః సమగ్రైః |

సంయోజితా మునివరాః ఫలమూలభక్షాస్తం శంకరం శరణదం శరణం వ్రజామి || 155

దక్షాధ్వరేచ నయనే చ తథా భగస్య పూష్ణస్తథా దశనపం క్తిమపాతయచ్చ |

తస్తంభయః కులిశయుక్తమథేంద్రహస్తం తం శంకరం శరణదం శరణం వ్రజామి || 156

ఏనఃకృతోపి విషయేష్వపిసక్తచిత్తా జ్ఞానాన్వయశ్రుతగుణౖరపి నైవ యుక్తా ః |

యం సంశ్రితాః సుశభుజః పురుషా భవంతి తం శంకరం శరణదం శరణం వ్రజామి || 157

అత్రిప్రసూతిరవికోటిసమానతేజాః సంత్రాసనం విబుధదానవసత్తమానాం |

యః కాలకూటమపిబత్ప్రసభం సుదీప్తం తం శంకరం శరణదం శరణం వ్రజామి || 158

బ్రహ్మేంద్రరుద్రమరుతాం చ సషణ్ముఖానాం దద్యాద్వరం సుబహుశో భగవాన్మ హేశ |

నన్దిం చ మృత్యువదనాత్‌ పునరుజ్జహార తం శంకరం శరణదం శరణం వ్రజామి || 159

ఆరాధితః సుతపసా హిమవన్నికుంజే ధూమవ్రతేన మనసాపి పరైరగమ్యే |

సంజీవనీమకథయద్ర్భుగవే మహాత్మా తం శంకరం శరణదం శరణం వ్రజామి || 160

నానావిధైర్గజబిడాలసమానవ కైర్దక్షాధ్వర ప్రమదనైర్బలిభిర్గణౖంద్రైః |

యోభ్యర్చితోమరగణౖశ్ఛ సలోకపాలైస్తం శంకరం శరణదం శరణం వ్రజామి || 161

శంఖేందుకుందధవలం వృషభం ప్రవీరమారుహ్య యః క్షితిధరేంద్రసుతానుయాతః |

యాత్యంబరం ప్రలయమేఘవిభూషితం చ తం శంకరం శరణదం శరణం వ్రజామి || 162

శాంతం మునిం యమనియోగపరాయణౖ సై#్తర్భీ మైర్మహో గ్రపురుషైః ప్రతినీయమానం |

భక్త్యా నతం స్తుతిపరం ప్రసభం ర రక్ష తం శంకరం శరణదం శరణం వ్రజామి || 163

యః సవ్యపాణికమలాగ్రనఖేన దేవస్తత్పంచమం ప్రసభ##మేవ పురస్సురాణాం |

బ్రాహ్మం శిరస్తరుణపద్మనిభం చకర్త తం శంకరం శరణదం శరణం వ్రజామి || 164

యస్య ప్రణమ్య చరణౌ వరదస్య భక్త్యా స్తుత్వా చ వాగ్భిరమలాభిరతంద్రితాత్మా ||

దీప్తస్తమాంపి నుదతే స్వకరైర్వివస్వాంస్తం శంకరం శరణదం శరణం వ్రజామి || 165

యే త్వాం సురోత్తమగురుం పురుషా విముఢా జానంతి నాస్య జగతః సచరాచరస్య |

ఐశ్వర్యమాననిగ మానుశ##యేన పశ్చాత్తే యాతనామనునుభవంత్యవిశుద్దచిత్తాః || 166

తసై#్యవం స్తువతో7వోచచ్ఛూలపాణిర్వృషధ్వజః ఉవాచ వచనం హృష్టో రాఘవం తుష్ట మానసః ||167

రుద్ర ఉవాచ:- రామ హృష్టోస్మి భద్రం తే జాతస్త్వం నిర్మలే కులే |

త్వం చాపి జగతాం వంద్యో దేవో మానుషరూపధృత్‌ || 168

త్వయా నాథేన వై దేవాః సుఖినః శాశ్వతీః సమా | సేవిష్యంతే చిరం కాలం గతే వర్షే చతుర్దశే || 169

అయోధ్యామాగతం త్వాం యే ద్రక్ష్యంతి భువి మానవాః |

సుఖం తే7త్ర భజిష్యంతి స్వర్గే వాసన్తథాక్షయమ్‌ || 170

దేవకార్యం మహత్కృత్వా ఆగచ్ఛేధాః పునః పురీం | రాఘవస్తు తథా దేవం నత్వా శీఘ్రం వినిర్గతః || 171

ఇంద్రమార్గాం నదీం ప్రాప్య జటాజూటం నియమ్య చ | అబ్రవీల్లక్ష్మణంరామ ఇదమర్పయ మే ధనుః ||172

రామవాక్యం తు తచ్ర్ఛుత్వా సీతాం వై లక్ష్మణోబ్రవీత్‌ | కిమర్ధం దేవి రామేణ త్యక్తోహం కారణం వినా|| 173

అపరాధం న జానామి కుపితో యన్మహాభుజః | రామేణాహం పరిత్యక్తః ప్రాణాం స్త్యక్ష్యామ్యసంశయమ్‌ || 174

నైవ మే జీవితేనార్థే ధిగ్దిఙ్మాం కులపాంసనం | ఆర్యస్య యేన వై మన్యుర్జనితః పాపకారిణా || 175

కాంస్తు లోకాన్గమిష్యామి అపధ్యాతో మహాత్మనా | ఉభౌ హస్తౌ ముఖే కృత్వా సాశ్రుకంఠోబ్రవీదిదమ్‌ || 176

ఇట్లు స్తుతించు రామునికి శూలపాణి వృషభద్వజుడు పరమ శివుడానందించ రుద్రుడిట్లనియె. రామభద్రా! సంతోషించితిని. భద్రమగుగాక నీకు. స్వచ్ఛమైన కులమున బుట్టితివి. నీవును సర్వజగద్వంద్యుడవు. మానుష రూపమూనిన భగవంతుడవు. అనాథ నాధుడువు. దిక్కు అయిన నీచే దేవతలు కలకాలము సుఖులయి యున్నారు. పదునాల్గేండు జరిగిన తర్వాత నిన్ను చిరకాలము సేవింతురు ఈ భూమినున్న మానవులయోధ్యకు తిరిగివచ్చి దర్శించు పదృష్టవంతులు సుఖమందుదురు. వారికి స్వర్గమందు నివాస మక్షయము. దేవకార్యమది చాలా పెద్దది నిర్వర్తించి తిరిగి పురమునకు రమ్ము అనిరి. రాముడునటు పరమేశ్వరుని మ్రొక్కి వెంటనే బయలుదేరెను.

ఇంద్రమార్గయైన (తూర్పుగా ప్రవహించు) నదినిజేరి జటాజూటమును బిగించికొని, లక్ష్మణుని ఈ నా ధనుస్సును నా కందిమ్మనెను. లక్ష్మణుడు విని సీతతో నిట్లనియె. దేవీ! నేను కారణము లేకుండ విడవబడితిని? నా తప్పు నే నెఱుగను. మహా వీరుడు కుపితుడైనాడు. నాకిక బ్రతుకుతో బనిలేదు. చీఛీ కులము చెడబుట్టిన వాడను. మహ్మాత్ముని మనసు చెఱచితి. నేనేలోకమున కేగుదునో? రెండు చేతుల మొగము గప్పుకొని కన్నీట కంఠము డగ్గుత్తికవడ నిట్లనియె. 176

నాపరాధ్యామి రామస్య కర్మణా మనసా గిరా | స్పృష్ఠౌ తే చరణౌ దేవి మమ నాన్యా గతిర్భవేత్‌ || 177

తతః సీతాబ్రవీద్రామం త్యక్తః కిమనుజస్త్వయా | వైషమ్యం త్యజ్యతాం బాలే లక్ష్మణ లక్ష్మివర్ధనే || 178

రాఘవస్త్వబ్రవీత్సీతాం నాహం త్యక్ష్యామి లక్ష్మణం | న కదాచిదపి స్వప్నే లక్ష్మణస్య మతం ప్రియే || 179

శ్రుతపూర్వం చ సుశ్రోణి క్షేత్రస్యాస్య విచేష్ఠితం | అత్ర క్షేత్రే జనాస్సత్యం సర్వే హి స్వార్ధతత్పరాః || 180

పరస్పరం న పశ్యంతి స్వాత్మనశ్చ హితం వచః | న శృణ్వంతి పితుః పుత్రాః పుత్రాణాం పితర స్తథా || 181

న శిష్యా హి గురోర్వాక్యం శిష్యస్యాపి తథా గురుః | అర్థానుబంథినీ ప్రీతిర్న కశ్చిత్కస్యచిత్ర్పియః || 182

ఇత్యేవం కథయన్నేవ ప్రాప్తో రేవాం మాహానదీం | చక్రే7భిషేకం కాకుత్థ్సః సానుజః సహ సీతయా|| 183

తర్పయిత్వా చ సలిలైః స్వాన్పితౄన్దైవతాన్యపి | ఉదీక్ష్య చ ముహుః సూర్యం దేవతాశ్చ సమాహితః || 184

కృతాభిషేకస్తు రరాజ రామః సీతాద్వితీయః సహ లక్ష్మణన |

కృతాభిషేకః సహశైలపుత్ర్యా గుహేన సార్థం భగవానివేశః || 185

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

మార్కండేయాశ్రమధర్శనం నామ త్రయస్త్రిం7శోధ్యాయః

త్రికరణములచేత (శరీరము, మనస్సు, మాటచేత) రామునియెడ నపరాధము నేసి యెఱుగను. దేవీ! నీ పాదములంటి ప్రమాణము సేయుచున్నానన సీతాదేవి రామునింగని తమ్ముని విడిచినట్లేనా ? పిల్లవాడు లక్ష్మివర్ధనుడు లక్ష్మణునియెడ వైషమ్యము విడువుడన రాఘవుడు సీతంగని నేను లక్ష్మణుని విడువను. ఎన్నడుగాని కలలోగాని. లక్ష్మణుని మతము విన్నాను. ఇదేదో యీక్షేత్రము యొక్క చర్య. ఈ క్షేత్రమందు జనులందరును స్వార్థపరులు. ఒకరి సంగతి నొకరు చూడరు. తమ శాంతమును మఱతురు. తండ్రిమాట కొడుకులు వినరు. కొడుకుల మాట తండ్రులు వినరు. శిష్యులు గురువు మాట గురువులు శిష్యుల మాట వినిపించికొనరు. ప్రీతి అనేది కేవలము డబ్బుతో ప్రయోజనముతో ముడివడియున్నది. ఎవ్వడు నెవ్వనికి స్నేహితుడులేడు. అని యిలా అనుచు రేవా మహానదిం జేరి తమ్మునితో సీతతో రాముడు చక్రాభిషేకముసేసి పితృదేవతలకు, దేవతలకు తర్పణములు నేసి సూర్యుని మఱిమఱి పలుసారులు దర్శించి యభిషేకము ముగించి సీతతో, లక్ష్మణునితో గిరిరాజ కన్యతో కుమారునితో గూడ యభిషేకము నిర్వర్తించిన భగవంతుడు పరమేశ్వరుడట్లు విరాజిల్లెను. 185

ఇది శ్రీరాముని మార్కండేయాశ్రమదర్శసమను ముప్పది మూడవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters