Sri Padma Mahapuranam-I    Chapters   

చతుర్థాధ్యాయః

సముద్రమథనప్రస్తావే దుర్వాసస ఇంద్రాయ శాపదానమ్‌ !

భీష్మ ఉవాచ !

క్షీరాబ్దౌతు తదా లక్ష్మీః కి లోత్పన్నా మయా శ్రుతా | ఖ్యాత్యాం భృగోః సముత్పన్నే త్యేతదాహ కథం భవాన్‌ || 1

కథంచ దక్షదుహితా దేహం త్యక్తవతీ శుభా | మేనాయాం గర్భసంభూతి ముమాయా జన్మ ఏవచ|| 2

కిమర్థం దేవదేవేన పత్నీ హైమవతీ కృతా | విరోధం చాథ దక్షేణ భగవాంస్తు బ్రవీతు మే || 3

భీష్ముడనియె. లక్ష్మి పాలసముద్రమందు బుట్టెనని విన్నాను. ఆమె భృగువునకు ఖ్యాతియనుభార్యయందు జనించెనని నీవెట్లు పలికితివి? దక్షకన్య పరమకల్యాణి మే నేలవిడిచెను? ఆమె మేనయందెట్లు జనించెను. హైమవతిని (హిమవంతుని కూతురును) దేవదేవుడెందులకు భార్యనుగ జేసికొనెను? ఈశ్వరునికి దక్షునితో వైరమేమి? తెల్పుము. అన పులస్త్యుం డిట్లనియె.

పులస్త్య ఉవాచ ! --: మహాలక్ష్మీ ప్రాదుర్భావః :--

ఇదం చ శ్రుణు భూపాల యత్పృష్టో%హ మిహ త్వయా | శ్రీసంబంధో మయాప్యేష శ్రుత ఆసీ త్పితామహాత్‌ || 4

అత్రిపుత్రస్తు దుర్వాసాః పరిభ్రామ్య న్మహీ మిమామ్‌ | విద్యాధరీకరే మాలాం దృష్ట్వ సౌగంథికీం శుభామ్‌ || 5

యాచయామాస మే దేహి జటాజూటే కరో మ్యహమ్‌ | ఇతి విద్యాధరీ తేన పృష్టా సా ఋషిణా తథా || 6

దదౌ తసై#్మ ముదా యుక్తా తాం మాలాం సదా నృప | గృహీత్వా సుచిరం కాలం శిరోమాలాం బబంధః || 7

ఉన్మత్త ప్రేతవ ద్విప్రః శోభమానో%బ్రవీదిదమ్‌ | ఇయం విద్యాధరీ కన్యా పీనోన్నత పయోధరా || 8

శోభాలంకారసౌభాగ్యై ర్యుక్తాదృష్టా తతో మనః | క్షోభ మాయాతి మే చాద్య నాహం కామే విచక్షణః || 9

వ్రజామి తావ దన్యత్ర సౌభాగ్యం స్వ ప్రదర్శయన్‌ | ఏవముక్త్వా స రాజేంద్ర పరిబభ్రామ మేదినీమ్‌ || 10

ఐరావతంసమారూఢం రాజానం త్రిదివౌకసామ్‌ | త్రైలోక్యాధిపతిం శక్రం భ్రాజమానం శచీపతిమ్‌ || 11

తా మాత్మశిరసో మాలాం భ్రమదున్మత్తషట్పదామ్‌ | ఆదా యామరరాజాయ చిక్షేపోన్మత్త వన్మునిః || 12

గృహీత్వా దేవరాజేన మాలా సా గజమూర్ధని | ముక్తా రరాజ సా మాలా కైలాసే జాహ్నవీ యథా || 13

రాజా! ఇది వినుము. శ్రీదేవి అవతారము బ్రహ్మవలన విన్నాను. అత్రి కుమారుడు దుర్వాసుడు భూమి నంతట సంచరించి, ఒక విద్యాధర స్త్రీ చేతనున్న సువాసన నించుచున్న పూలమాలంగని ''నా జటాజూటమున ధరింతు నిది నాకిమ్మని'' యడిగెను. ఆమె సంతోషముతో దాని నాతనికిచ్చెను. అది చేకొని చిరకాలము దాని సొంపుగొని వెఱ్ఱిసంతోషముతో నిట్లనుకొనెను. ''ఈ విద్యాధరకన్య పీనోన్నతపయోధర. శోభగుల్కు నగలతో సౌభాగ్యముతో నాకు గనిపించినది. అప్పటి నుండి నా మనసు సంక్షోభ మందున్నది. నేనా కామప్రవృత్తి లేనివాడను. నా యందము ప్రదర్శించుచు నేనింకొక యెడ కేగెదనుగాక'' అని భూమి యంతట దిరుగాడెను. అవ్వల మూడులోకములకధిపతి శచీపతి యైరావతమెక్కి యింపుగుల్కుచు వచ్చుచున్న నాతని జూచి గండుతుమ్మెదలు ముసరుచున్న తనతలమీదిమాలను పిచ్చివాని యట్లాయింద్రునివైపు విసరెను. అది చేకొని దేవపతి ఏనుగుతలపైకి విసరగా నామాల కైలాసమందున్న గంగవలె శోభించెను.

మదాంధకారితాక్షో%సౌ గంధాఘ్రాణన వారణః | కరేణాదాయ చిక్షేప తాంమాలం పృథివీతలే || 14

తతస్తు క్రుద్దో భగవాన్‌ దుర్వాసా మునిపుంగవః | రాజేంద్ర దేవరాజానం క్రుద్ధ శ్చైద మువాచ హ || 15

ఐశ్వర్యమదదుష్టాత్మ న్నతిస్తబ్ధో%సి వాసవ | శ్రియోధామ స్రజం యస్మా న్మద్దత్తా న్నాభినందసి || 16

త్రైలోక్యశ్రీ రతో మూఢ వినాశ ముపయాస్యతి | మద్దత్తా భవతా మాలా క్షిప్తా యస్మా న్మహీతలే || 17

తస్మా త్ర్పణష్టలక్ష్మీకం త్రైలోక్యం తే భవిష్యతి | యస్య సంజాతకోపస్య భయ మేతి చరాచరమ్‌ || 18

తం మాం త్వ మతిగర్వేణ దేవరా జావమన్యసే | మహేంద్రో వారణస్కంధా దవతీర్య త్వరాన్వితః || 19

ప్రసాదయామాస మునిం దుర్వాస స మకల్మషమ్‌ | ప్రసాద్యమానః స తదా ప్రణిపాతపురఃసరమ్‌ || 20

నాహం క్షమిష్యే బహునా కిముక్తేన శతక్రతో | ఇత్యుక్త్వా ప్రయ¸° విప్రో దేవరాజో%పి తం పునః || 21

ఆరు హ్యైరావతం నాగం ప్రయయా వమరావతీమ్‌ | తతః ప్రభృతి నిశ్శ్రీకం సశక్రం భువనత్రయమ్‌ || 22

నయజ్ఞాః సంప్రవర్తంతే న తపస్యంతి తాపసాః | నచ దానాని దీయంతే నష్టప్రాయ మభూ జ్జగత్‌ || 23

ఏనుగావాసనగ్రహించి మదముచే కన్నుగానక తొండమెత్తి యందుకొని యామాలను నేలను వైచికొట్టెను. అంతట కోపమెచ్చి యమ్మునిపుంగవుడు దేవేంద్రునింగని ఓ దుష్టుడ ! ఐశ్వర్యముచే మదమెక్కి మిక్కిలి మొద్దువారితివి. లక్ష్మికి స్థానమైనది నేనిచ్చినది యీ మాలను నీ వభినందింపవైతివి. ఇందువలన నో మూర్ఖుడ ! నీ త్రిభువన సా మ్రాజ్యసంపద నష్టమగునుగాక! అందువలన నీ పాలనలోని యీ ముల్లోకములుగూడ లక్ష్మీహీనములగును. ఎవడు కోపించిన చరాచర ప్రపంచము హడలిపోవునో అట్టి నన్ను మిక్కిలి పొగరెక్కి యవమానించితివి. అన విని దేవేంద్రుడు ఐరావతమునుండి సత్వరమ దిగి పరమపుణ్యుని దుర్వాసుని బ్రతిమాలుకొనెను. అడుగులవ్రాలి యింద్రు డెంత వేడికొనినను నేను క్షమింపను, పలుమాటలేలయని యవ్విప్రుడు వెళ్ళిపోయెను, దేవరాజును నైరావతమెక్కి యమరావతి కరిగెను. నాటినుండి యింద్రునితోబాటు భువనత్రయము సిరిదరిగి వెలవెలబోయెను, యజ్ఞములు సాగుటలేదు. తాపసులు తపస్సులు సేయరు. దానములు లేవు. ధర్మములు లేవు. జగత్తు నష్ట ప్రాయమయ్యెను

ఏవ మత్యంతనిశ్శ్రీకే త్రైలోక్యే సత్వవర్జితే | దేవా న్ర్పతి బలోద్యోగం చక్రు ర్దైతేయ దానవాః || 24

విజితా స్త్రిదశా దైత్యై రింద్రాద్యాః శరణం యయుః | పితామహం మహాభాగం హుతాశనపురోగమాః || 25

యథావత్కథితే దేవై ర్ర్బహ్మా శ్రుత్వా తదాసురారైః | క్షీరోద స్యోత్తరం కూలం జగామ నహసా హరిమ్‌ || 26

గత్వా జగాద భగవాన్‌ వాసుదేవం పితామహః | ఉత్తిష్ఠ విష్ణో శీఘ్రం త్వం దేవతానాం హితం కురు || 27

త్వయావినా దానవైస్తు జితాః సర్వే పునః పునః | ఇత్యుక్తో పుండరీకాక్షః పురుషః పురుషోత్తమః || 28

అపూర్వరూపసంస్థానా న్దృష్ట్వా దేవా నువాచ హ | తేజసో భవతాం దేవాః కరిష్యా మ్యుపబృంహణమ్‌ || 29

వదా మ్యహం యత్ర్కియతాం భవద్భి స్తదిదం సురాః | ఆనీయ సహితా దైత్యైః క్షీరాబ్దౌ సకలౌషధీః || 30

మంథానం మందరం కృత్వా వేత్రం కృత్వాచ వాసుకిమ్‌ | మథ్యతా మమృతం దేవాః సహాయే మ య్యవస్థితే || 31

సామపూర్వంచ దైతేయా స్తత్ర సంభాష్య కర్మణి || సమానఫలభోకార్తో యూయం చాత్ర భవిష్యథ || 32

మథ్యమానే చ తత్రాబ్దౌ యత్సము త్పద్యతే7మృతమ్‌ | తత్పానా ద్బలినో యూయ మమరాః సంభవిషథ్య || 33

తథైవాహం కరిష్యామి యథా త్రిదశవిద్విషః | న ప్రావ్స్యం త్య మృతం దేవాః కేవలం క్లేశ భాగినః || 34

ఇత్యుక్తా దేవదేవేన సర్వఏవ తతః సురాః | సంధాన మసురైః కృత్వా యత్న వంతో7మృతే భవన్‌ || 35

ఇట్లు జగత్త్రయ మత్యంతనిశ్మ్రీకమయి సత్తువ గోల్పడ దైత్యదానవులు దేవతల పై దండయాత్ర సాగించిరి. ఇంద్రాదు లోడిపోయి అగ్ని పురస్సరముగ బ్రహ్మను శరణందిరి. పూసగ్రుచ్చినట్లంతయుందెల్ప విని యవ్విధి వేల్పులతో పాలకడలియెడ్డునకేగి వావుదేవు నుద్దేశించి విష్ణూ! లెమ్ము లెమ్ము దేవతలకు హితముసేయుము. నీవుదప్ప నెల్లదేవతలము దానవుల కోడిపోయినాము. అనవిని పురుషోత్తముడు వెలవెలపోయిన సురలంగని మీకుమరల తేజస్సు పెంపొందింతును. మీరు దైత్యులతో జతగూడి సకలౌషధులను క్షీరసముద్రమందుంచి మందరగిరిం గవ్వము సేసి వానుకిని తరిత్రాడు గావించి నేను సహాయుడుగా అమృతముకొఱకు మధింపుడు. కార్యావసరముగ మంచిగ మీరు నీపనిలో సమానఫలభోక్తలు గండని లాలించెను. అట్లుత్రచ్చినంత నందమృతము పుట్టును, దానిం ద్రావి మీరు బలశాలురు నమరులునగుదురు సురద్వేషుల కమృతము దక్కకుండ క్లేశ##మే మిగులునట్లు నేనంతయుం జేసెద నన సురలెల్లరు నసురులతో సంధిచేసికొని యమృతముకొఱకు యత్నము సేసిరి.

సర్వోషధీః సమానీయ దేవదైతేయదానవాః | క్షిప్త్వా క్షీరాబ్దిపయసి శరదభ్రామలత్విషి || 36

మంథానం మందరం కృత్వా వేత్రం కృత్వచ వాసుకీమ్‌ | తతో మథితు మారేభూ రాజేంద్ర తర సామృతమ్‌ || 37

విబుదాః సహితాః సర్వే యతః పుచ్ఛాంతతః స్థితాః | విష్ణునా వాసుకే దైత్యాః పూర్వకాయనివేశితాః || 38

తేతస్య ప్రాణవాతేన వహ్నినా చ హతత్విషః | నిస్తేజసో7సురాః సర్వే బభూవు రమరద్యుతే || 39

తేనైవ ముఖ నిశ్శ్యాసవాయునాథ బలాహకైః | పుచ్ఛప్రదేశే వర్షద్భి స్తదా చాప్యాయితాః సురాః || 40

క్షిరోదమధ్వే భగవాన్‌ బ్రహ్మా బ్రహ్మవిదాం వరః | మహాదేవో యహాతేజా విష్ణుపృష్ఠనివాసినౌ || 41

బాహుభ్యాం మందరం కృత్వా పద్మవ త్స పరంతపః | శృంఖలేచ తదా కృత్వా గృహీత్వా మందరాచలమ్‌ || 42

దేవానాం దానవానాంచ బలమధ్యే వ్యవస్థితః | క్షీరోదమధ్యే భగవా న్కూర్మరూపీ స్వయం హరిః || 43

అన్వేనతేజసా దేవా నుపబృంహితవా న్హరిః | మథ్యమానే తత స్తస్మిన్‌ క్షీరాబ్దౌ దేవదానవైః || 44

హవిర్ధా న్యధవ త్పూర్వం సురభి: సురపూజితా | జగ్ము ర్ముదం తదా దేవా దానవాశ్చ మహామతే || 45

దేవతలు దైత్యులును ఓషధులనెల్ల శరత్కాలమేఘమట్లు తెల్లగనున్న పాలకడలిలోనికి విసరి మందరాద్రింగొని మధింప నారంభించిరి. మొదట రాసుకితలనున్న దేవతలను తోకకుమార్చి మొదట తోకను పట్టు కొన్న రాక్షసులను దలవైపున బట్టుడని హరినియోగించెను. పాములకు విషము తలనుండునుగావున వాసుకి ఫణామండలము రాపిడిగొన్న కొలది విషజ్వాలలు ఱగినంత నామంటలకు దైత్యులు నిస్తేజస్కులైరి. తోకవైపుననున్న దేవత లావైపున క్రమ్మిన మేఘములచే జల్లనిగాలిచే నాప్యాయితులైరి. క్షీరాబ్ధిమధ్యమందు బ్రహ్మయు శివుడును విష్ణువు పృష్ఠమందుండిరి. ఆయన మందరగిరిని పద్మమునట్లు రెండుబాహువులచేబట్టి వాసుకి రూపమైనత్రాటింజుట్టి దేవదానవులనడుమ నిల్చి, సముద్రములోపల కూర్మరూపియునై మఱియొక తేజస్సుతో (రూపముతో) దేవతలకు బుష్టికూర్చుచునుండెను. అట్లుతఱుపబడుచుస్న పాలసముద్రంనుండి హవిర్ధానియు సురపూజితయునైన సురభి(కామధేనువు) మొదట యావిర్భవించెను. దేవదానవులానందభరితులైరి. మావిర్ధాని=మావిస్సునుంచుపాత్ర (స్థాఠి)

వ్యాక్షిప్త చేతసః సర్వేబభూవుస్తిమితేక్షణాః | కిమేతదితిసిద్ధానాం దివి చింతయతాం తదా || 46

కృతావర్తా తత స్తస్మా త్ర్పస్ఖలంతీ పదేపదే | ఏకవస్త్రా ముక్తకేశీ రక్తాంత స్తబ్ధలోచనా || 47

రిభూవ వారుణీదేవీ మదాషూర్ణితలోచనా | అహం బలప్రదాదేవీ మాం వా గృహ్ణంతు దానవాః || 48

అశుచిం వారుణీం మత్వా త్యక్తవంత స్తదా సురాః | జగృహ స్తాం తదాదైత్యా గ్రహణాం త్తే సురా భవత్‌ || 49

మంథనే పారిజాతో7భూద్దేవశ్రీనందనేద్రుమః | రూపౌదార్యగుణోపేతా స్తత శ్చాప్సరసాం గణాః || 50

షష్టికోట్యన్తదా జాతా స్సంమాన్యా దేవదాసవైః | సర్వా స్తాః కృతపూర్వాస్తు సామ్యానాః పుణ్యకర్మణామ్‌ || 51

తతః శీతాంశు రభవ ద్దేవానాం ప్రీతిదాయకః | యయాచే శంకరో దేవో జటాభూషణకృ న్మమ || 52

భవిష్యతి న సందేహో గృహీతోయం మయా శశీ | అను మేనేచ తం బ్రహ్మా భూషణాయ హరస్యతు || 53

తతో విషం సముత్పన్నం కాలకూటం భయావహమ్‌ | తేన చై వార్దితా స్సర్వే దానవాః సహదైవతైః || 54

మహాదేవేన తత్పీతం విషం గృహ్య యదృచ్ఛయా | తస్యపానాన్నీ లకంఠ స్తదా జాతో మహేశ్వరః || 55

పపుర్నాగాస్తతచ్ఛేషం క్షీరాబ్ధేస్తు సముత్థితమ్‌ | పీతావశేషం నాగాస్తు క్షీరాబ్ధేస్తు సముత్థితమ్‌ ||

అందరును మనస్సులు చెదరి చూపులు లట్టేనిలిపి ''యిదేమని'' సిద్ధులు ఆలోచించుచుండ మత్తుచే దిరుగుడు వడుచూపులతో వారుణియను వొకానొక శక్తి యావిర్భివించెను. అడుగడుగున తూలుచు వొంటివలువతో జుట్టు విరబోసికొని కనులెరుపుంగొన ''నేను బలమునిచ్చు దేవతను. వారుణియను దానను. దానవులారా! నన్ను గైకొనుడు'' అని పలికెను. దేవత లామె యశుచియని వదలివేసిరి. దైత్యులామెను గ్రహింపగనే యామె మద్యమయినది. మఱికొంత చిలుకగా దేవతల భాగ్యమై పారిజాతము జనించి నందనవన మలంకరించెను. మఱియు రూపౌదార్యాది గుణసంపద్యుతమై అరువదికోట్ల యప్సరోగణ మావిర్భవించెను. వారందరు పుణ్యజీవులు దేవదానవులచేత గౌరవింపబడిరి. పుణ్యాత్ములందరు నమానముగా ననుభవింపదగినవారు. ప్రీతికల్పించు చలువలరేడు (చంద్రుడు)పుట్టెను. నాజడలలో బూషణము గావలెనని యాచంద్రుని శంకరుడు కోరెను. బ్రహ్మ అందులకనుమతించెను. అవ్వల భయంకరమైన కాలకూట విషము పుట్టెను. దానిచేత దేవతలు రాక్షసులు నుడికిపోయిరి. పరమశివుడుదానగైకొని ద్రావెను. ఆ ద్రాగిన విషము కడుపులోనికి బోకుండ కుత్తుకంబట్టి యుండుటచేత నమ్మహేశ్వరుడు నీలకంఠుడయ్యెను. మిగిలిన యా గరళమును నాగులు త్రావిరి.

--: ధన్వంతర్యాద్వవతారాః :--

తతో ధన్వంతర్జాతః శ్వేతాంబరసధర స్స్వయమ్‌ || 56

బిభ్రత్కృమండలుం పూర్ణా మమృతేన సముత్థితః | తతః స్వస్థమనస్కాస్తే వైద్య రాజస్య రర్శనాత్‌ || 57

తతః శ్చాశ్వః సముత్పన్నో నాగ శ్చైరావత స్తథా | తతః స్ఫురత్కాంతిమతి వికాసికమలే స్థితా || 58

శ్రీ ర్దేవీ పయస స్తస్మా దుత్థితా ధృతఫంకజా | తాం తుష్టువు ర్ముదా యుక్తాః శ్రీసూక్తేన మహర్షయః || 59

విశ్వావసుముఖా స్తస్యా గంధర్వాః పురతో జగుః | ఘృతాచీప్రముఖా న్తత్ర ననృతు శ్చాప్సరోగణాః || 60

గంగాద్యాః సర్గిత స్తోయైః స్నానార్థ ముపతస్థిరే | దిగ్గజ హేమపాత్రస్థ మాదాయ విమలం జలమ్‌ || 61

స్నాపయాం చక్రిరే దేవీం సర్వలోక మహేశ్వరీమ్‌ | క్షీరోదస్తు స్వయం తస్త్యె మాలా మవ్లూన పంకజామ్‌ || 62

దదౌ విభూషణాన్యంగే విశ్వకర్మా చకారహ | దివ్యమాల్యాంబరధరాం స్నాతాం భూషణభూషితమ్‌ || 63

ఇంద్రాద్యా శ్చమరగణా విద్యాధరమహోరగాః | దానవాశ్చ మహాదైత్యా రాక్షసాః సహగుహ్యకైః || 64

కన్యా మభిలషంతిస్మ తతో బ్రహ్మా ఉవాచ హ | వాసుదేవ త్వమేవైనాం మయా దత్తాం గృహాణవై || 65

దేవాశ్చ దాసవాశ్చైవ ప్రతిషిద్ధా మయా త్విహ | తుష్టో7హం భవత స్తావ ద్ధౌత్యే నేవేహ కర్మణా || 66

సాతుశ్రీః బ్రహ్మణాప్రోక్తా దేవి గచ్ఛస్వ కెశవమ్‌ | మయాదత్తం పతిం ప్రాప్య మోదస్వ త్వం వరాసనే|| 67

పశ్యతాం సర్వ దేవానాం శ్రితా వక్షస్థలం హరేః | తతో వక్షః స్థితా సాచ దేవంవచన మబ్రవీత్‌ || 68

నాహం త్యాజ్యా త్వయాదేవ సదైవాదేశకారిణీ | వక్ష స్థలే నివత్స్యామి సర్వస్య జగతః ప్రియ || 69

తయావలోకితా దేవా విష్ణువక్షస్థలస్థయా | లక్ష్మ్యా రాజెంద్ర సహసా పరాం నిర్వృతి మాగత్లాః || 70

--: ధన్వంతర్యాద్యవతారములు :-

అవ్వల అమృతపూర్ణకుంభముం జేకొని తెల్లని వస్త్రములందాల్చి ధన్వంతరి యావర్భవించెను. ఆవైద్య రాజుం దర్శించి వారందఱు స్వస్థచిత్తులైరి. అటు పై నుచ్చైశ్రవ మను గుఱ్ఱము ఐరావత మను నేనుగుం జనించినవి. అంత వికసించిన తామరపూవుగద్దెపై గూర్చుండి మహాద్భుత ప్రభతో బద్మముజేతదాల్చి పాల్కడలినుండి శ్రీదేవి అవతరించెను. మహర్షు లానందభరితులై నాతల్లిని శ్రీ సూక్తముతో స్తుతించిరి. ఆమెముందు విశ్వావసు ప్రముఖులైన గంధర్వులు పాడిరి. ఘృతాచి ప్రముఖులైన యప్సరస లాడిరి. గంగాది నదు లామెస్నానార్ధము మేతెంచిరి. దిగ్గజములు కుంభస్ధలముల స్వర్ణకుంభమున స్వచ్ఛజలములంగొని సర్వలోకేశ్వరియైన యా దేవిని స్నానమాడించినవి. క్షీరసాగరుడు స్వయముగ వాడని పద్మమాల నా దేవికి గాన్కవెట్టెను. విశ్వకర్మ యా మంగళ##దేవత యంగములను మంగళాభరణముల నలంకరించెను. సుస్నాతయై దివ్యమాలలు దాల్చి దివ్యాభరణభూషితయైన యా కన్యకం గనియింద్రాది దేవతలు, విద్యాధరులు, పన్నగులు, దానవులు మహాదైత్యులు గుహ్యకులు ఎవరికి వారు మాకు మాకని యభిలషించిరి. అంతట బ్రహ్మ ''వాసుదేవ! నేనొసంగెద నీమెను నీవే స్వీకరింపుము. నేను దేవతలను దానవులను వారించితిని. నీవీమె యెడ జూపిన వలపునకు నేను సంతుష్టుడనైతిని. దేవీ! నీవు విష్ణువును బొందుము. నేనొసంగిన స్వామి గైకొని యనంతకాల మానందింపుము'' అని నంతట నెల్ల దేవతలు చూచుచుండ నా లోకమాత హరి వక్షః స్థల మ్మలంకరించెను. మఱియు నా దేవునిం గని ''నన్నెన్నడూ విడువవలదు. నీ యాజ్ఞ నొనరింతును, సర్వజగద్వల్లభుడైన నీ వక్షోభాగమున వసించెద'' ననయె. అవ్వల దేవతలు విష్ణు వక్షః స్థలము నందు లక్ష్మి వేసిన పూలమాలంగని యమితానంద భరితులైరి. 70

ఉద్వేగం చ పరం జగ్ము ర్దైత్యా విష్ణు పరాజ్ముఖాః || త్యక్తాస్తు దానవా లక్ష్మ్యా విప్రచిత్తి పురోగమాః || 71

తతస్తే జగృహుర్దైత్యా ధన్వంతరి కరస్థితమ్‌ | అమృతం తన్మహా వీర్యా ద్దైత్యాః పావసమన్వితాః || 72

మాయయా లోభ యిత్వాతు విష్ణుః స్త్రీరూప సంశ్రయః | ఆగత్య దానవాన్ప్రాహ దీయతాం మే కమండలుః || 73

యుష్మాకం వశగాభూత్వా స్ధాస్యామి భవతాం గృహే | తాందృష్ట్వా రూపసంపన్నాం నారీం త్రైలోక్యసుందరీమ్‌ || 74

ప్రార్థ యంత వపుషం లోభోవహత చేతనః | దత్త్వా7మృతం తదా తసై#్య తతో7పశ్యంత తే7గ్రతః || 75

దానవేభ్య స్తదాదాయ దేవేభ్యః వ్రదదే7మృతమ్‌ | తతః వపుః సురగణాః శక్రాద్యాస్త త్తదామృతమ్‌ || 76

విష్ణువునకు బెడమొగము వెట్టినవారై విప్రచిత్తి మొదలగు రాక్షసులు లక్ష్మిచే విడువబడినందున మిక్కిలి యాందోళన మందిరి. అవ్వల ధన్వంతరి చేతనున్న అమృతమును పావబుద్ధులై లాగికొనిరి. అప్పుడు విష్ణువు మాయంగొని స్త్రీ రూపముం దాల్చి (జగన్మోహినీ రూపమూని) దానవులంగని ''అమృత కమండలువును నాకిండు. మీకు లోబడి నేను మీ యింట నుండెద'' నన వారా త్రిలోక సుందరింగిని యామె శరీరము నర్ధించి లోభవశులై యమృతము నామెకిచ్చి ముందు నిల్చి చూచుచుండిరి. ఆమె యది గ్రహించి దేవతల కిచ్చెను. ఇంద్రాసుర గణము దానిం ద్రావిరి.

ఉద్యతాయుధ నిస్త్రింశా దైత్యాం స్తాం స్తే సమభ్యయః | పీతే7మృతే చ బలిభిర్జితా దైత్య చమూన్తతః || 77

వధ్యమానా దిశో భేజుః పాతాళం వివిశుశ్చతే | తతో దేవా ముదాయుక్తాః శంఖ చక్ర గదాధరమ్‌ || 78

ప్రణివత్య యథా పూర్వం యయుస్తే త్రివిష్టవమ్‌ | తతః ప్రభృతి తే భీష్మ స్త్రీలోలా దానవా భవన్‌ || 79

అవధ్యాతాస్తు కృష్ణేన గతాస్తేతు రసాతలమ్‌ | తతః సూర్యః వ్రసన్నాభః వ్రయ¸°స్వేన వర్త్మనా || 80

జజ్వాలభ గవాంచ్చోచ్ఛై శ్చారుదీప్తి ర్హుతాశనః | ధర్మేచ సర్వభూతానాం తదామతి రజాయత || 81

శ్రియా యుక్తం చత్రైలోక్యం విష్ణునా ప్రతిపాలితం | దేవాస్తు తే తదా ప్రోక్తా బృహ్మణా లోకధారిణా || 82

భవతాం రక్షణార్థాయ మయా విష్ణు ర్నియోజితా || ఉమాపతిశ్చ దేవోశో యోగక్షేమం కరిష్యతః || 83

ఉపాస్యమానౌ సతతం యుష్మత్షేమ కరౌయతః || తతః క్షేమ్యౌ నదాచైతౌ భవిష్యేతే వరప్రదౌ || 84

ఏవ ముక్త్వాతు భగవాన్‌ జగామ గతిమాత్మనః | ఆదర్శనం గతేదేవే సర్వలోక పితామహే || 85

దేవలోకం గతే శ##క్రే న్వంలోకం హరిశంకరౌ | ప్రాప్తౌతు తక్షణాద్దేవౌ స్థానం కైలాస మేవచ || 86

తతస్తు దేవరాజేన పాలితం భువన త్రయమ్‌ | ఏవం లక్ష్మీ ర్మహా భాగా ఉత్పన్నా క్షీర సాగరాత్‌ || 87

పునః ఖ్యాత్యాం సముత్పన్నా భృగో రేషా ననాతనీ | శ్రియా నహ సముత్పన్నా భృగుణాచ మహర్షిణా || 88

స్వ నామ్నా నగరీచై వ కృతా పూర్వం నరిత్తటే | నర్మదాయాం మహారాజా బ్రాహ్మణా చాను మోదితా || 89

లక్ష్మీః పురం స్వ పిత్రే స్వం సహ కుంచికయా7 ర్ప్యచ | అగతా దేవలోకం సా7యాచతా గత్యవైపునః || 90

లోభాన్న దత్తంతు పరం ప్రార్థనాయాం యదాపునః | భృగోః సకాశా న్నావావ తదా చైవాహ కేశవమ్‌ || 91

రాక్షసు లాయుధములంగొని దేవతలపై నెత్తిరి. అమృతపానమునేసి బలవంతులైన వేల్పుల చేతిలో రాక్షస సేన యోడి పోయెను. చావునకు గురియై తప్పించుకొని వాండ్రు పాతాళమునకుం బోయిరి. నలుదెసలకు బారిపోయిరి. అమరులుప్పొంగి శంఖ చక్ర గదాధారికి మ్రొక్కి ముందటియట్ల స్వర్గమున కేగిరి. అది మొదలు దానవులు స్త్రీలోలులైరి. కృష్ణునిచే నుపేక్షితులై పాతాళమునకుం జనిరి. అవ్వల సూర్యుడు ప్రసన్న కాంతితో దన దారిం జనెను. అగ్ని మిక్కిలి తేజస్సుచే బ్రకాశించెను. అన్ని భూతములకు ధర్మ మందు బుద్ధి గలిగెను. ముల్లోకములు విష్ణు పరిపాలన మందు లక్ష్మీ సంపన్నములయ్యె. అంతట బ్రహ్మ వేల్పులతో నేను మీ రక్షణకు విష్ణుని నియోగించితిని. ఉమాపతియును మీకు యోగక్షేమములు సేయును. వారుభయులు మీ కుపాస్యులు. వరప్రదాతలు నయ్యెదరు. అని పలికి చతుర్ముఖుడు సత్యలోకమేగెను. ఇంద్రుడు స్వర్గమునకు, శంకరుడు కైలాసము నేగిరి. అవ్వల దేవరాజు భువనత్రయ పరిపాలనము నేసెను. మహాలక్ష్మి యిట్లవతరించినది. ఈ సనాతనమూర్తి మఱి భృగువునకు ఖ్యాతి యందు జనించినది. (భార్గవి యైనది) ఆమెతోబాటు భృగుమహర్షిచేత మున్నొక నగరము గూడ తనపేర నర్మదాతీరమందావిర్భవింపజేయబడినది. దానిని బ్రహ్మగూడ యనుమోదించెను. తన తండ్రి కా పురమును కుంచికతో (తాళము చెవితో) గూడ సమర్పించి దేవలోకమున కేతెంచి మఱల యాపురమును దానమిమ్మని యాచించెను. కాని యాతడు లోభముచే నీయడయ్యెను. అంతట లక్ష్మి విష్ణునితో నిట్లనియె.

పరీభూతాతు మిత్రాహం గృహీతం నగరం మమ | తస్యహస్తాత్వ మాక్షిప్య పురం తచ్చానయ స్వయమ్‌ || 92

తం గత్వా పుండరీకాక్షో దేవ శ్చక్ర గదాధరః | భృగుం సానునయం ప్రాహ కన్యాయై పురమర్పయ || 93

కుంచికా తా లికే చోభే దీయేతాం చ ప్రసాదతః | భృగు స్తం కుపితః ప్రాహ నా ర్పయి ష్యామ్యహం పురమ్‌ || 94

నలక్ష్మ్యా స్తత్పురం దేవమయాచేదం స్వయం కృతమ్‌ | భగవన్నైవ దాస్యామి త్యజాక్షేవంతు కేశవ || 95

తం ప్రాహ దేవో భూయో7పి లక్ష్మ్యా స్తత్పురమర్పయ | సర్వధాతు త్వయా త్యాజ్యం వచనాన్మే మహామునే || 96

తతః కోపనమావిష్టో భృగు రప్యాహ కేశవమ్‌ | పక్షపాతేన మాం సాధో భార్యాయా బాధసే7ధునా || 97

నృలోకే దశ జన్మాని లిప్స్యసే మునిపుంగవ | భార్యాయాస్తే వియోగేన దుఃఖాన్యను భవిష్యసి || 98

ఏవం శాపం దదౌ తసై#్మ భృగుః పరమ కోపనః | విష్ణునాచ పునస్తస్య దత్తః శాపో మహాత్మనా || 99

నచాపత్య కృతాం ప్రీతిం ప్రాప్స్యసే మునిపుంగవ | శాపం దత్వా ఋషేస్తస్య బ్రహ్మలోకం జగామహ || 100

మా తండ్రి నన్నవమానించినాడు. నా నగరమును లాగికొన్నాడు. నీ వాతని నుండి గైకొని నాకిమ్ము. అన చక్రధారి చని భృగు మహర్షిని దయతో నీపురమున తాళము తాళము చెవితోగూడ మీ కూతురన కిమ్మని బ్రతి మాలెను. ఆయన కుపితుడై యీయను. ఇది లక్ష్మీపురము గాదు నాదే. నేను నిర్మించికొన్నది. స్వామీ యేమైన నీయను. నిర్బంధింపకు మన హరి వెండియు నెల్లవిధముల నీవిద్దాని వదలుకొనుము. నేను జెప్పుచున్నాను గద యన నమ్మహర్షి కోపముంగొని సాధువవే కాని నీవు భార్య యెడ పక్షపాతమున నన్ను బాధించుచున్నావు. కావున మానవ లోకమున పది జన్మములు విషయ లేపమందుదువు గాక యని శాపమిచ్చెను. విష్ణువును నాతనికిని సంతానమువలని యానంద మీవనుభవింపవని ప్రతిశాపమిచ్చెను. ఇట్లు శపించి హరి బ్రహ్మలోకమేగెను.

పద్మజన్మాన మాహేదం దృష్ట్వా దేవస్తుకేశవః | భగవం స్తవ పుత్రోసౌ భృగుః పరమకోపనః || 101

నిష్కారణంచ తేనాహం శప్తో జన్మాని మానుషే | లప్స్యసే దశధాత్వంహి తతో దుఃఖాన్యనేక శః || 102

భార్యాని యోగజా పీడా బలపౌరుష నాశినీ | త్యక్త్వాచాహ మిమంలోకం శయిష్యేచ మహోదధౌ || 103

దేవకార్యేషు పునశ్చావాహం న క్రియాః | తథా బ్రువంతం తందేవం బ్రహ్మలోక గురుస్తథా || 104

ప్రసాదనార్థం విష్ణోస్తు స్తుతిమేతాం చకారహ |

-: బ్రహ్మకృత విష్ణుస్తుతిః :-

త్వయా నృష్టం జగదిదం పద్మం నాభౌ వినిఃసృతమ్‌ || 105

తత్రచాహం సముత్పన్న స్తవ వశ్యశ్చ కేశవ | త్వం త్రాతా సర్వలోకానాం న్రష్టాత్వం జగతఃప్రభో ||

త్రైలోక్యం నత్వయాత్యాజ్యమేషఏవ వరో మమ || 106

దశజన్మ మనుష్యేషు లోకానాం హితకామ్యయా | స్వయం కర్తానతే శక్తః శాపదానాయ కోపివా || 107

కో7యం భృగుః కథంతేన శక్త్యం శప్తుం జనార్దన | మానయస్వ సదావిప్రాన్‌ బ్రాహ్మణాస్తే తనుస్స్వయమ్‌ || 108

యోగనిద్రా ముపాస్యత్వం క్షీరాబ్ధౌ న్వపి హీశ్వర | కార్యకాలే పునస్త్వాంతు బోధయిష్యామి మాధవ || 109

భగవ న్నేష తావత్తు త్వయాచేవోపబృ హితః | సర్వకార్యకరఃశక్ర స్తవైవాంశేన శత్రుహా || 110

త్రైలోక్యం పాలయన్నే ప త్వాదాజ్ఞాం స కరిష్యతి | ఏవం స్తుత స్తదా విష్ణు ర్ర్బహ్మాణ మిద ముక్తవాన్‌ || 111

గతే దేవే తదా విష్ణౌ బ్రహ్మలోక పితామహః | భూయశ్చకార వై నృష్ణిం లోకానాం ప్రభవః ప్రభుః || 112

తం దృష్ట్వానారదః ప్రాహ వాక్యం వాక్యవిదాం వరః | సహస్ర శీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్‌ || 113

సర్వవ్యాపీ భువః స్పర్శాదధ్య తిష్ఠ ద్దశాంగులమ్‌ || 114

యద్భూతం యచ్చవై భావ్యం సర్వమేవ భవా న్యతః | తతో విశ్వ మిదం తాత త్వత్తోభూతం భవిష్యతి || 115

త్వత్తోయజ్ఞః సర్వహుతః పృషదాజ్యం పశు ర్ద్విధా | ఋచస్త్వత్తో7థ సామాని త్వత్తఏవాభిజజ్ఞిరే || 116

త్వత్తోయజ్ఞా స్త్వజాయంత త్తత్తో7శ్వాశ్చైవ దంతినః | గావస్త్వత్తః సముద్భూతాః త్వత్తో జాతా వయోమృగాః || 117

త్వన్ముఖాత్‌ బ్రాహ్మణాజాతా స్త్వత్తః క్షత్ర మాజాయత | వైశ్యా స్తవోరుజాః శూద్రా స్తవ పద్భ్యాం సముద్గతాః || 118

అక్ష్నోః సూర్యో7నిలః శ్రోత్రా చ్చంద్రమా మనసస్తవ | ప్రాణోంతః సుషిరాజ్జాతో ముఖాదగ్ని రజాయత || 119

నాభితో గగనం ద్యౌశ్చ శిరనః సమవర్తత | దిశః శ్రోత్రా తితిః పద్భ్యాంత్వత్తః సర్వమభూదిదమ్‌ || 120

న్యగ్రోధః సుమహా నల్పే యధా బీజే వ్యవస్థితః | ససర్జ విశ్వ మఖిలం బీజభూతే తదా త్వయి || 121

బీజాంకుర సముద్భూతో న్యగ్రోధః సముపస్థితః | విస్తారంచ యథాయాతి త్వత్తః నృష్ఠౌ తథా జగత్‌ || 122

యథాహికదశీ నాన్యా త్త్వ కృత్రేభ్యో7భిదృశ్యతే | ఏవం విశ్వ మిదంనాన్య త్వత్థ్సమీశ్వర దృశ్యతే || 123

హ్లాదినీ త్వయిశక్తిస్సా త్వయ్యేకా సహభావినీ | హ్లాదతాప కరీ మిశ్రా త్వయి నో గుణవర్జితే || 124

వృథగ్భూతైకభూతాయ సర్వభూతాయ తేనమః | వ్యక్తం ప్రధాన పురుషో విరా ట్సమ్రా ట్తథా భవాన్‌ || 125

సర్వస్మిన్సర్వ భూత స్త్వం సర్వః సర్వస్వరూపధృక్‌ | సర్వం త్వత్తః సముద్భూతం నమః సర్వాత్మనే తతః || 126

సర్వాత్మకో7సి సర్వేశ సర్వభూతస్థితో యతః | కథయామి తతః కిం తే సర్వం వే త్సిహృది స్థితమ్‌ || 127

యోమే మనోరథో దేవ సఫలః సత్వయాకృతః | తప్తం సుతప్తం సఫలం యద్ధృష్టో7సిజగత్పతే || 128

అట్లేగి హరి బ్రహ్మంగని స్వామీ! నీ కొడు కీ భృగుమహర్షి వరముకోరి మనుష్యలోకమునందు బదిజన్మము లెత్తుదువు. పలుదుఃఖములను గుడుతువు. నీ బలము పౌరుషము తఱుగ భార్యావియోగమందెదవని శపించినాడు. దేవలోకముంబాసి యే నిప్పుడపోయి సముద్రమున బరుండెదను. దేవకార్యముల నేనిక జక్కబెట్టనన లోక గురువగు చతుర్ముఖుడు విష్ణువు ప్రసన్ను డగుట కిట్లు స్తుతించెను.

-: బ్రహ్మ విష్ణువును స్తుతించుట :-

ఈ జగత్తును నీవు సృజించితివి. నీ నాభినుండి కమల ముదయించినది. అందు నేను బుట్టితిని. నీకె వశుడను. నీవు సర్వజగద్రక్షకుడవు. నీవు త్రిలోకములను విడిచిపోవలదు. ఇది నాకీయవలసిన వరము. నీవు స్వతంత్రుడవు. నీవు పదిచిన్నములు లోకమునకుపకారముచేయ నీకు శాపమీయగలవాడెవ్వడు? ఈ భృగుడెవ్వడు? నిన్ను శపింప వాని కెట్లు శక్యమగును. విప్రులను గౌరవింపుము. వారు నీ మూర్తులు. ఈశ్వర! యోగనిద్రగొని పాల్కండలియందీపు శయనింపుము మాధవా! పనివచ్చినపుడు మఱి నిన్ను మేల్కొల్పెద. ఈ యింద్రుడు నీచే బెంపబడినాడు. నీయంశ##చేతనే శత్రుసంహారము మొదలగు సర్వకార్యములు చక్కబెట్టగలవాడు. భువనత్రయముం భావించుచు నితడు నీయాజ్ఞను నిర్వహించును. అని యిట్లు స్తుతింపబడి విష్ణువు విధాతంగని యిట్లనియి. 111

విష్ణు వటుసన బితామహుండు జగత్‌ సృష్టిసేయనారంభించెను. అతనింగని నారదుడిట్లనియె. పురుషసూక్త మంత్రార్థస్తుతి. పురుషుడనబడు పరమాత్మ సహన్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్రసాదుడు, అతడు భూమినెల్లనంటి వ్యాపించి మీద పదియంగుళములు మిగిలియున్నాడు. లోగడనైనది కానున్నది యెల్లనీవు. కావున నీవలన నీ విశ్వము పుట్టినది. పుట్టనున్నది. నీ వలన నీసర్వదేవతోద్దేశ్యముగ జేయబడు సర్వహుతమైన యజ్ఞము వృషదాజ్యము పశువు నను రెండువిధములయిన హుతమెల్ల నీవలన నైనదియు, ఋక్కులు అవ్వల సామములు నీనుండియే పొడమినవి. నీవలన యజ్ఞము లావిర్భవించినవి. గుఱ్ఱములు నేనుగులు పుట్టినవి. గోవులు నీనుండి రూపొందినవి. గొఱ్ఱలు లేళ్లు నీవలన జనించినవి. నీమోమునుండి బ్రాహ్మణులు పుట్టిరి. బాహువులనుండి క్షత్రియులు జన్మించిరి. వైశ్యులు నీ తొడలనుండి శూద్రులు నీ పాదములనుండి గల్గిరి. కన్నులనుండి సూర్యుడు చెవి నుండి యనిలుడు మనసు నుండి చంద్రుడు ప్రాణము (ఊపిరి) అంతశ్శుషిరమునుండి (లోపలి రంధ్రం నుండి) ముఖము నుండి అగ్ని బొడ్డునుండి గగనము శిరస్సు నుండి ద్యులోకము ప్రవర్తించెను. శ్రోత్రము నుండి దిక్కులు పాదములనుండి భూమి నీనుండి యిదెల్ల రూపొందినది. చిన్నవిత్తునందు పెద్దమఱ్ఱిచెట్టు ఉన్నట్లు బీజమైననీయందే ఈ విశాలవిశ్వమున్నది. జనించినది. విత్తునుండి మొలక, యందుండి కొమ్మలు ఱమ్మలుగ మఱ్ఱిచెట్టు విస్తరించినట్లు నీయందీ జగత్తెల్ల విస్తరించినది. పై పట్టలు ఆకుల కంటె వేరుగ నరటిచెట్టెట్లు గనబడదో నీయందున్న విశ్వము నీకంటె వేఱుగ గనబడదు. నీయందే హ్లాదిని యనుశక్తి యున్నది. నిర్గుణుడైన నీయందిదిలేదు. హ్లాదము (చలువ) తాపము =వేడిమి మిశ్రా=ఈ రెండిటి కలయికయునైన శక్తిత్రయము నీ యందున్నదియు లేనిదియు గూడ వేరై యొక్కటై సర్వమునైయున్న నీకు నమస్కారము. వ్యక్తము ప్రధానము పురుషుడు విరాట్టు నమ్రాట్టు అంతయు నీవే. అంతట నంతయు నీవే సర్వుడవు సర్వస్వరూపుడవు నీవు. సర్వము నీనుండి పుట్టినది. సర్వమైన నీకు నమస్కారము. నీవు సర్వాత్ముడవు. సర్వేశుడవు. సర్వభూతస్థుడవు. కావున నీకేమి తెల్పెదను? హృదయమందున్న దెల్ల నీవెఱుంగుదువు. నామనోరథమేదో యది నీవలన ఫలించినది. నీవు గనబడినావు. గావున నేను జేసిన తపస్సు సుశోభనమైనది. సఫలమైనది. అన హరి యిట్లనియె.

తపస స్తత్ఫలం పుత్ర యద్ద ష్టోహం త్వయాధునా | మద్దర్శనం హి విఫలం నారదేహ నజాయతే || 129

వరం వరయ తస్మాత్వం యథాభిమత మాత్మనా | సర్వం సంపద్యతే తాత మయి దృష్టివథంగతే || 130

నారద ఉవాచ !

భగవాన్‌ సర్వభూతేశ | సర్వ స్యాస్తే భవాన్‌ హృది | కిమాజ్ఞాతం తవ స్వామి న్మనసా యన్మయేప్సితమ్‌ || 131

కృతాత్వయా యథా సృష్టి ర్మయా దృష్టా తథావిభో | తేనమే కౌతుకం జాతం దృష్ట్వా దేవర్షిదానవాన్‌ || 132

నీ జేసినతపస్సు ఫలమే నీకు నాదర్శనము. అది వ్యర్థముగాదు అభీష్టవరమడుగుము. నేను గనిపించినయెడ సర్వము సుసంపన్నమగును. సర్వభూతపతీ! నీవందరి హృదయమున నున్నావు. నాకేమి యిష్టమో నీకు దెలియనిదా? నీవే సృష్టి సేసితివి నేను జూచితిని. నీచేసిన దేవతలను దానవులను జూచి నాకు ముచ్చట గల్గినది.

పులస్త్య ఉవాచ!

నారదస్య పితా తుష్టో బ్రహ్మదేవో దివస్పతిః | నారదాయ వరం ప్రాదా దృషీణా ముత్తమో భవాన్‌ || 133

భవితా మత్ర్పసాదేన కలికేలికథాప్రియః | గతిశ్చ తే7ప్రతిహతా దివిభూమౌ రసాతలే || 134

యజ్ఞోపవీతసూత్రేణ యోగపట్టావలంబినా | ఛత్రికాచ తథావీణా అలంకారాయతే7నఘ || 135

విష్ణో స్సమీపే రుద్రస్య తథా శక్రస్య నారద | ద్వీపేషు పార్థివానాం తు సదా ప్రీతించలప్స్యసే || 136

వర్ణానాంతు భవాన్‌ శాస్తా వరోదత్తో మయాతవ | తిష్ఠ పుత్ర యథా కామం నేవ్యమానః సుర్తైర్దివి || 137

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే ''లక్ష్మీప్రాదుర్భావాది వర్ణనంనామ''

చతుర్ధో7ధ్యాయః

ఇట్లు నారదుని స్తుతివిని బ్రహ్మసంతుష్టుడై నా యనుగ్రహముచే నీవు ఋషులకెల్ల నుత్తముడవు గాగలవు. కలహప్రియుడవగుదువు. ముల్లోకములందు నీ సంచార మప్రతిహతము. జందెముతోబాటు యోగపట్టము గొడుగు వీణ నీ కలంకారములగును. హరిహరేంద్రుల సన్నిధిని రాజులేలు నాయాద్వీవములందు జరించుచు ప్రీతినందెదవు. నీవు వర్ణములకు శాసకుడవయ్యెదవు. స్వర్గమందు దేవతల సేవలందుచు నీయిచ్చవచ్చినట్లుండుము.

ఇది పద్మపురాణమున సృష్టిఖండమున లక్ష్మీప్రాదుర్భావాదివర్ణనమను 4వ అధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters