Sri Padma Mahapuranam-I    Chapters   

పంచమోధ్యాయః

''దక్షయజ్ఞ వ్విధంసనమ్‌''

-: పార్వతీ ప్రాదుర్భావము :-

భీష్మ ఉవాచ :

కథంనతీ దక్షసుతా దేహం త్యక్తవతీ శుభా | దక్షయజ్ఞస్తు రుద్రేణ విధ్వస్తః కేన హేతునా || 1

ఏతన్మే కౌతుకం బ్రహ్మ న్కంథం దేవో మహేశ్వరః | జగామక్రోధ వళాతాం త్రిపురా శశి ర్మహాయశాః || 2

పులస్త్య ఉవాచ !

భీష్ముడిట్లనియె. దక్షకన్య సతీదేవి దేహమేల విడిచినది? ఎందులకు రుద్రుడు దక్షయజ్ఞధ్వంసము సేసెను?

బ్రహ్మణ్య! త్రిపురాంతకు డేల కోపవశుడయ్యె. ఇది విన వేడుకయయ్యెడు నన పులస్త్యుం డిట్లనియె.

గంగాద్వారే పురాభీష్మ దక్షో యజ్ఞ మథారభత్‌ | తత్ర దేవాసురగణాః పితరో7థమహర్షయః || 3

నమాజగ్ముర్ముదా యుక్తాః సర్వేదేవాః సవాసవాః | నాగయక్షాః సువర్ణాశ్చ వీరుదో షధయస్తథా || 4

కశ్యపో భగవానత్రిః పులస్త్యః పులహః క్రతుః | ప్రచేతసాంగిరసాశ్చైవ వశిష్ఠశ్చమహాతపాః || 5

తత్రవేదీం నమాంకృత్వా చాతుర్హోత్రం న్యవేశయత్‌ | హోతావశిష్ఠ స్తత్రాసీ దంగిరాధ్వర్యుసత్తమః || 6

బృహస్పతి రధోద్గాతా బ్రహ్మావై నారదస్తథా | యజ్ఞకర్మప్రవృత్తౌతు హూయమానేషు చాగ్నిషు || 7

ఆగతా వసవః సర్వే ఆదిత్యా ద్వాదశైవను | అశ్వినో మరుతశ్బైవ మనవశ్చ చతుర్దశ || 8

ఏవం యజ్ఞేప్రవృత్తేతు హూయమనేషు చాగ్నిషు | విభూతిం తాం పరాం తత్ర భక్ష్యభోజ్య కృతాం శుభామ్‌ || 9

ఆలోక్య సర్వతో భూమిం సమంతా ద్దశ యోజనమ్‌ | మహేవేదీం కృతాంతత్ర సర్వై స్తత్ర సమన్వితై || 10

సర్వాన్‌ దేవాన్‌ శక్రముఖ్యాన్‌ యజ్ఞే దృష్ట్వా సతీశుభా | తదాసానునయం వాక్యం ప్రజాపతి మభాషత || 11

గంగాద్వారమందు మున్ను దక్షుడు యజ్ఞమారంభించెను. అటకు దేవాసురపితృమహర్షులు ఇంద్రాదులు నాగులు యక్షులు గరుడులు నస్యౌషథులు కశ్యప - ఆత్రి - పులస్త్య - పులహ - క్రతు - ప్రచేత సాంగిరసులు విచ్చేసిరి. వశిష్ఠమహర్షి వేదిని సమచతురస్రముగ నొనరించి చాతుర్హోత్రమందు బ్రతిష్టించెను. గార్హపత్యము ఆహవనీయము. దక్షిణాగ్ని యుంగల అందు వశిష్ఠుడు హోత అంగిరస్సు అధ్వర్యుడు బృహస్పతి ఉద్గాత నారదుడు బ్రహ్మయునైరి. యజ్ఞమునడచుచుండ అగ్నులందు హోమములు జరుగుచుండ ఆష్టవసువులు ఎకాదశరుద్రులు అశ్వినులు మరుత్తులుపదునల్గురు మనువులు నటకేతెంచిరి. ఇట్లయ్యజ్ఞము ప్రవర్తించుచుండ హోమములు జరుగుచుండ కల్యాణి సతీదేవి యందలి విందులను భక్ష్యభోజ్య పదార్ధసమృద్ధిని బదియోజనముల వైశాల్యముగల యయ్యజ్ఞశాలను నమ్మహాయజ్ఞవేదింగని యందఱతో బరివేష్టించియున్న యింద్రాది దేవతలునుంగాంచి యనునయముదోప తండ్రియగు దక్షప్రజాపతితో నిట్లనియె. 11

సత్యువాద :

ఐరావతం సమారూఢో దేవరాజః శతక్రతుః | పత్న్యా శచ్యా సహాయాతః కృతావాసః శతక్రతుః || 12

పాపానాం యో దమయితా ధర్మేణాధర్మిణాంప్రభుః | పత్న్యా ధూ మోర్ణయా సార్థమిహాయాతః సదృశ్యతే || 13

యాదసాంచ పతి ర్దేవో వరుణో లోకభావనః | గౌర్యా పత్న్యా సహాయాతః ప్రచేతా మండపే త్విహ || 14

సర్వయక్షాధిపో దేవః పుత్రో విశ్రవశో మునేః | పత్న్యాత్విహ సమాయాతః సహదేవ్యాధనాధిపః || 15

ముఖం యః సర్వదేవానాం జంతూనా ముదరే స్థితః | వేదా యదర్థముత్పన్నా స్సోయ మగ్ని రుపాగతః || 16

నిర్‌బుతః రాక్షసేంద్రో7సౌ దిక్పతిత్వే నియోజితః | నచత్విహాగతస్తాత పత్న్యాసార్థం కృతౌత్విహ || 17

ఆయుఃప్రదో జగత్యస్మిన్‌ బ్రహ్మణా నిర్మితః పురా | ప్రాణో7పానో వ్యాన ఉదానస్సమానా హ్వయస్తథా || 18

ఏకోనపంచాశ##త్కేన గణన పరివారితః | యజ్ఞే ప్రజాపతిశ్చాసౌ వాయు ర్దేవః సమాగతః || 19

ద్వాదశాత్మాగ్రహాద్యక్షః చక్షుష్మీ జగతస్తిహ | పాతివై భువనం సర్వం వేదానాం యః పలాయణః || 20

ఆయుషశ్చజనానాంచ దివసానాం పతిర్హియః | సంజ్ఞా పతిరిహాయాతో భాస్కరో లోకపావనః || 21

అత్రివంశ సముద్భూతో ద్విజరాజో మహాయశాః | నయనానంద జననో లోకనాథో ధరాతలే || 22

ఓషధీనాం పతి శ్చాపి వీరుధామపి సర్వశః | ఉడునాధః సపత్నీక ఇహాయాతః శశీ తవ || 23

వసవో7ష్టౌ సమాయాతా అశ్వినౌచ సమాగతౌ | వృక్షోవనన్పతిశ్చాపి గంధర్వా ప్సరసాం గణాః || 24

విద్యాధరా భూత సంఘా వేతాలా యక్షరాక్షసాః | పిశాచా శ్చోగ్ర కర్మాణ స్తథాన్యేజీవహారకాః || 25

నద్యో నదాః సముద్రాశ్చ ద్వీపాశ్చ సహపర్వతై | గ్రామ్యారణ్యాశ్చ పశవోయ దింగం యచ్చనేంగతి || 26

కశ్యపోభగవానత్రి ర్వశిష్ఠ శ్చావరైః సహ | పులస్త్యః పులహశ్చైవ సనకాద్యా మహర్షయః || 27

పుణ్యరాజర్షయశ్చైవ పృథివ్యాం యేచ పార్థివాః | వర్ణాశ్చాశ్రమిణశ్చైవ సర్వేయే కర్మకారిణః || 28

కిమత్ర బహునోక్తేన బ్రాహ్మీసృష్టిరిహాగతా | భగిన్యో భాగి నేయాశ్చ భగినీపతయ స్త్వియే || 29

స్వభార్యా సహితాః సర్వే న్సపుత్రాస్సహ బాంథవాః | త్వయా సమర్పితాః సర్వే దానమాన పరిగ్రహైః || 30

ఆమంత్రణా మంత్రితానాం సర్వేషాం మాననాకృతా | ఏక ఏవాత్ర భగవా న్పతిర్మే న సమాగతః || 31

వినాతేన త్యిదం సర్వం సూన్యవత్ర్పతిభాతిమే | మన్యేచాహంతు భవతా వతిర్మే న నియంత్రితః || 32

విన్మృతస్తే భ##వేన్నూనం సర్వంశంసతు మే భవాన్‌ |

సతి యిట్లనియె. ఐరావతమెక్కి దేవేంద్రుడు శచీదేవితోవచ్చి యిట విడిదిచేసినాడు. ధర్మముచే పాపులను శిక్షించుచు నధర్మవరులకు ప్రభువు (నిగ్రహించువాడు) దూమోర్ణయను భార్యతో నిటకేతెంచినాడు. ఉదకములకు ఱడు వరుణుడు లోకభావనుడు ప్రచేతసుడు గౌరి యను పత్నితోవచ్చి యజ్ఞమండపమునం దున్నాడు. యక్షులందరికి రాజు విశ్రవసుని కుమారుడు ధనేశుడు సహదేవియను దేవితో నేగుదెంచినాడు. సర్వదేవతలకు ముఖమ్ము ఎల్లజీవుల కడుపులో జఠరాగ్నిగ నుండువాడు, ఎవనికై వేదములు పుట్టెనో యా మహానుభావు డగ్ని దయచేసినాడు. నైరృతిమూలకధిపతి గావింప బడిన నిరృతి రాక్షసరాజింతితో నేతెంచెను. ఈ జగమందాయువు నిచ్చువాడుగా బ్రహ్మచే నిర్మింపబడినవాడు ప్రాణ-అపాన-వ్యాస-ఉదాన-సమానములను పేరనున్న వాయువు నలుబదితొంబది మరుత్తుల గణముతోగూడ యీ యజ్ఞమందు ప్రజాపతి దేవతగా నర్చింపబడు వాయుభగవాను డరుదెంచినాడు. జగత్తునకు నేత్రములయినవాడు గ్రహాధ్యక్షుడు ద్వాదశాత్మ (పండ్రెండు మాసములు పండ్రెండు మూర్తుల బ్రకాశించువాడు) సర్వభువనపరిపాలకుడు, వేదములకు పరాయణము (త్రయీమూర్తి యన్నమాట) (దేవతలకు పరమాగ్రస్థానము) ఆయుర్దాయమునకు దివసములకు ప్రభువు సంజ్ఞాదేవితో లోక పావనుడునగు భాస్కరుడిచటి కేతెంచెను. అత్రివంశజుడు ద్విజులకు రాజు కీర్తిశాలి నేత్రానంద కరుడు. లోకపతి భూమిపైగల యోషధులకు పంటలకు నధిపతి నక్షత్రములకు రాజు తారాపతి పత్నులతో (రోహిణితో) శశి (చంద్రడు) వచ్చినాడు. అష్టవసువులు అశ్వినీదేవతలు వనస్పతి గంధర్వాప్సరోగణములు విద్యాధరులు భూత సంఘములు భేతాశురు యక్షరాక్షసులు భయంకర కర్మలు ప్రాణాపహారులగు భూతప్రేత పిశాచులు నదులు నదములు సముద్రద్వీప పర్వతములు గ్రామ్యరణ్య పశుజాతులు ఇంగము=కదలునది నేంగము=కదలనిదయు (చరాచరభూత సంఘము) సర్వమేతెంచినది. కశ్యప-అత్రి వశిష్ఠ-పులస్త్యపులహ ననకాది మహర్షులు కర్మయోగనిరతులైన సర్వవర్ణశ్రమస్థులు వేయేల బ్రహ్మయొక్క నృష్టి యంతయు నిటకు వచ్చినది. అప్పనెల్లెండ్రు మేనల్లుండ్రు మేనకోడండ్రు బావమరదులు సపుత్ర మిత్రకశత్ర బాంధవముగా నందరు విచ్చేసిరి. నీ చేయ దానమాన స్వీకారములం దర్పింపబడి నారు. అహూతులందఱకు స్వాగతమిచ్చితివి. మర్యాదసేయవలసిన వారందఱికి మర్యాదలు సేసితివి. ఇక్కడకు నాస్వామి భగవంతుడాయన యొక్కడే రాడయ్యెను. ఆయన లేనందున నిది యెల్ల నాకు శూన్యముగ కనిపించుచున్నది. నీవు నాభర్తను బిలువలేదనుకొందును, బహుశః మఱచి యుందువు. ఉన్నదున్నట్లెల్ల నాకు జెప్పుము.

పులస్త్య ఉవాచ!

తస్యాస్తదుక్తం వచనం శ్రుత్వా దక్షః ప్రజాపతిః || 33

పతిస్నేహనమాయుక్తాం ప్రాణభ్యోపి గరీయసీమ్‌ | అంక మారోప్యతాం బాలాం సాధ్వీం పతిపరాయణామ్‌ || 34

పతివ్రతాం మహాభాగం పతిప్రియ హితైషిణీమ్‌ | ప్రాహగంభీర భావేన శ్రుణువత్సే యథా తథమ్‌ || 35

యేనాద్య కారణనేహ పతిస్తేన నిమంత్రితః | కపాలపాత్ర దృక్బమీం భస్మావృత తనుస్తథా || 36

శూలీ ముండీ చ నగ్నశ్చ స్మశానే రమతే సదా | విభూ త్యాం గాని సర్వాణి పరిమార్షిచ నిత్యశః || 37

వ్యాఘ్ర చర్మ పరీధానో హస్తిచర్మ పరిచ్ఛదః | కపాలమాలం శిరసి ఖట్వాంగం చ కరేస్థితమ్‌ || 38

కట్యాం వైగోనసం బధ్వా లింగే7స్థ్నాం వలయం తథా | పన్నగానాం తురాజాన ముపవీతంచ వాసుకీమ్‌ || 39

కృత్వా భ్రమతి చానేన రూపేణ సతతం క్షితౌ | నగ్నా గణాః పిశాచాశ్చ భూతసంఘాహ్యనేకశః || 40

త్రినేత్రశ్చత్రిశూలీచ గీతనృత్య రతస్సదా | కుత్సితాని తథాన్యాని సదాతే కురుతే పతిః || 41

త్రపాకరో భ##వేన్మహ్యం దేవానాం సన్నిధిః కథమ్‌ | కీదృక్చవననం తస్య కేతనం ప్రతినార్హతి || 42

ఏతైర్దోషై ర్మయావత్సే లోకానాం చైవలజ్జయా | నాహ్వానం తు కృతం తస్య కారణన మయాసుతే || 43

యజ్ఞస్యాస్య సమాప్తౌతు పూజాం కృత్వా త్వయాసహ | ఆనీయ తవభర్తారం త్వయా సహత్రిలోచనమ్‌ || 44

త్రైలోక్యస్యాధికాం పూజాం కరిష్యామి చ సత్కృతైః | ఏతత్తే సర్వమా ఖ్యాతం త్రపాయాః కారణం మహత్‌ || 45

నాత్ర మన్యుస్త్వయా కార్యః సర్వన్వం భాగమర్హతి | అన్య జన్మనియై ర్యాదృక్‌ కృతంకర్మ శుభాశుభమ్‌ || 46

ఇహ జన్మనితే తాదృక్పుత్రికే భుంజతే ఫలమ్‌ | పరితాపం మాకృథాస్త్వం ఫలం భుంక్ష్వు పురాణకృతమ్‌ || 47

శ్రియం పరగతాం దృష్ట్వా రూపసౌభాగ్య శోభనామ్‌ | రూపంచ కాంతి సౌభాగ్యం రమ్యా న్యాభరణానిచ || 48

కులే మహతివైజన్మ వపుశ్చాతీవ సుందరమ్‌ | పూర్వ భాగ్యైస్తు లభ్యంతే సరైరేతాని సువ్రతే || 49

మాత్మానం పరనిందేయా మాచ భాగ్యాని సువ్రతే | ఫలం చైవం విధికృతం దాతుం కస్యతు కఃక్షమః || 50

నాస్తివై బలవాన్కశ్చిన్‌ న మూఢో న చ పండితః | పాండిత్యం చ బలం చైవ జాయతే పూర్వకర్మణా || 51

ఏవమేవ దివం ప్రాప్తాః శోభమానాః స్థితాశ్చిరమ్‌ | పుణ్యన తపసా చైవ క్షేత్రేషు వివిధేషు చ || 52

యథేభి రార్జితం పుణ్యం తసై#్యతే ఫలభాగినః | ఏవ ముక్తా తతః సాతు సతీ భీష్మ రుషాన్వితా || 53

వినిందమానా పితరం క్రోధే నారుణితేక్షణా | ఏవమేత ద్యథా తాత ! త్వయా చోక్తం మమాగ్రతః || 54

సర్వోజనః పుణ్యభాగీ పుణ్యన లభ##తే శియమ్‌ | పుణ్యన లభ##తే జన్మ పుణ్య భోగాః ప్రతిష్ఠాతాః || 55

తదయం జగతా మీశః సర్వేషా ముత్తమోత్తమః | స్థానా న్యేతాని సర్వేషాం దత్తాన్యేతేన ధీమతా || 57

యేగుణాస్తస్య దేవస్య వక్తుం జిహ్వాపి వేధసః | నశక్తా ఖ్యాపనే తస్య దేవస్య పరమేష్ఠినః || 58

భస్మాస్థి చ కపాలాని శ్మశానే వనతి స్తథా || గోనసాద్యాశ్చ యే సర్పాః సర్వేతే భూషణీకృతాః || 59

భూత ప్రేతా గణాస్తస్యా పిశాచా గుహ్యకాస్తథా || ఏష ధాతా విధాతాచ ఏష పాలయితా దిశః || 60

ప్రసాదేనచ రుద్రస్య ప్రాప్త స్స్వర్గం పురందరః | యది రుద్రే7స్తి దేవత్త్వం యది సర్వగతః శివః || 61

సత్యేన తేన తే యజ్ఞం విధ్వంసయత శంకరః | యద్యస్తి మే తపః కించి త్కశ్చిద్దర్మో7ధవాకృతః || 62

ఫలేన తస్య ధర్మస్య యజ్ఞస్తే నాశమర్హతి | ప్రియాహం యది దేవస్య యది మాం తారయిష్యతి || 63

తేన సత్యేన తే గర్వః సమాప్తీ మభిగచ్ఛతు | ఇత్యుక్త్వా యోగమాస్థాయ స్వదేహ స్తేన తేజసా || 64

నిర్దదాహ తదాత్మానం సదేవాసుర పన్నగైః | కిం కిమేతడితి చ ప్రోక్తే గంధర్వగణగుహ్యకైః || 65

శ్రుత్వా రుద్రస్తు తద్వార్తాం పత్న్యా నాశంసుదుఃఖితః | హంతుం యజ్ఞం ధీ ర భవత్‌ దేవానా మిహవశ్యతామ్‌ || 66

గణకోటిః సమాదిష్టా గ్రహావై నాయకా స్తదా | భూత ప్రేత పిశాచాశ్చ దక్షయజ్ఞ వినాశ##నే || 67

తై ర్గత్వా వివిధాస్సర్వే యజ్ఞే నిర్జిత్యనాశితాః | హతే యజ్ఞే తదా దక్షో నిరుత్సాహో నిరుద్యమః || 68

ఉపగమ్యాబ్రవీత్‌ త్రస్తో దేవదేవం పినాకినం | నజ్ఞాతో7సి మయాదేవ దేవానాం ప్రభు రీశ్వరః || 69

త్వమస్య జగతో7ధీశః స్సురాస్సర్వే త్వయా జితాః | కృపాం కురు మహేశానగణాన్సర్వాన్నివర్తయ || 70

గణౖర్నానావిధైర్ఘోరైర్నానా భూషణ భూషితైః | నానావదన దంతౌష్ఠై ర్నానాప్రహరణోద్యతైః || 71

నానా నాగేంద్ర నందష్ట జటాభారోపశోభితైః | సుదృఢోద్ధత దర్పాఢ్యైః ఘోరై ర్ఘోర నిఘాతిభిః || 72

కామరూపై రకాంతైశ్చ సర్వకామ సమన్వితైః | అనివార్యబలైశ్చోగ్రై ర్యోగిభి ర్యోగగామిభిః || 73

వ్యాలోల కేశర జటై ర్దష్టోత్కటహసస్ముఖైః | కరీంద్రకరటాటోపపాటవైః సింహదేహిభిః || 74

కేచి త్పరమదాఘ్రాణ ఘూర్ణద్దీవ సమప్రభైః | విచిత్ర చిత్ర వసనై ద్ధీరై ర్ధీరవరాదిభిః || 75

మృగ వ్యాఘ్ర సింహరుతై స్తరక్ష్వజినధారిభిః | భుంగహార వలయకృతయజ్ఞోపవీతకైః || 76

శూలాసి పట్టిస ధరైః పరశుప్రాస హస్తకైః | వజ్ర క్రకచ కోదండ కాల దండాస్త్ర పాణిభిః || 77

గణశ్వరైః సుదుర్ధరైః వృతః సూర్యో గ్రహైరివ | దేవ దేవ మహాదేవ నష్టో యజ్ఞో దివంగతః || 78

మృగరూపధరోభూత్వా భయభీతస్తు శంకర | నమః శంఖా భ##దేవాయ సగణాయ సనందినే || 79

బలశాలి మూర్ఖుడు పండితుడు నన నేయొక్కడులేడు. పాండిత్యము బలము తెలివిననునివెల్ల పూర్వకర్మానుసారము గల్గును. చేసినకృతముంబట్టి స్వర్గమునకేగి చిరకాల మచట శోభించి పుణ్యతపఃపరిపాకముచే నుత్తమక్షేత్రములందు (ఉత్తములయిన తలిదండ్రులకు) పుట్టి మున్నెట్టిపుణ్య మార్జించికొని రట్లు ఫలమనుభవింతురు. అని యిట్లు దక్షుడు వలుక సతీదేవి రోషారుణితలోచనయై నాన్నా! నా ముందీవు పల్కిన దిదియంతయు నింతే, జనమెల్ల తాము చేసిన పుణ్యఫలముగ నైశ్వర్యమునందునన్న మాట ముమ్మాటికి నిజమే. పుణ్యముచే జన్మము వచ్చును. పుణ్యము నందు భోగములు ప్రతిష్ఠితములు. (భోగములకు పుణ్య మాధారమన్నమాట) అందువలన నీ యీ అల్లుడు జగదీశ్వరుడు సర్వోత్తమముడు. ఈ నీ యజ్ఞమునందు నీవు పిలువగా వచ్చిన యీదేవతలకందరికిని నాయాస్థానము లీ బుద్ధిమంతుడిచ్చినవే. ఆ మహానుభావుని యుత్తమలక్షణములను వర్ణింప చతుర్ముఖుని నాలుక కూడ చాలదు. బూడిద యెముకలు పుర్రెలు స్మశానవాసము గోనసాదిసర్పాలు యివన్నియు నీయనకు భూషణములే. వీవి రహస్య మెవ్వరుం గుర్తింపలేరు. కొనియాడలేరు. ఈయన ధాత విధాతయును. దిశాపాలకుడు. ఈ రుద్రుని యనుగ్రహమున నింద్రుడు స్వర్గాధిపతియైనాడు. రుద్రునియందు దేవత్వమే యున్నచో శివుడు సర్వాంతర్యామియే యైనచో నానిజముచే నీయజ్ఞము నీక్షణమున శంకరుడు ధ్వంసముసేయుగాక! నాకేదేని యించుక తపస్సు నేజేసిన ధర్మమునున్నచో నాధర్మఫలముగ నీయజ్ఞము నశింపదగియున్నది. ఆ దేవునికి నేను బ్రియురాలనేని స్వామి నన్ను దరింపజేయగలడేని యా సత్యముచే నీ గర్వమడగుగాక! అని పలికి యోగమూని యయ్యోగాగ్నిచే తననుదాను దేవాసుర నాగగంధర్వ ప్రధమగణ గుహ్యకాదు లిడియేమి యేమని యనుచుండ తనకుదాను దేహముంగాల్చుకొనెను. 65

రుద్రడు పత్ని గతించిన వార్తవిని మిగుల దుఃఖించి దక్షయజ్ఞ ధ్వంసముం జేయనెంచి ప్రమథగణకోటిని గ్రహముల నాయకత్వమున భూతప్రేతపిశాచాదులను యజ్ఞము జెరువ నాజ్ఞయిచ్చెను. వారేగి యటనందరిని నాశనము నేసిరి. యజ్ఞము చెడ నయ్యెడ దక్షుడుత్సాహము గోల్పడి చేయునదిలేక హడలిపోయి వచ్చి పినాకిని మహాదేవా ! నీవు దేవప్రభు వీశ్వరుడవని యెఱుంగనైతిని. నీవీ జగత్తునకు ప్రభువవు. అందరు వేల్పులు నీకొడినారు. దయ చూపుము. నీ గణముల మరలింపుము. వేవిధముల వారు నానాభూషణభూషితులు పెక్కురకములగుకోరలు పెదవులుంగలవారు నానావిధాయుధములబూని విజృంభించినారు. పెక్కురకాల విషసర్పములుం గరచుకొయుచ్న జటాభారముల శోభించుచున్నారు. దిటవుయై విజృంభించి దర్పముచేనతిఘోరులై ఘోరునెల్ల కూల్చుచున్నారు. అందరు కామరూపులు వికృతరూపులు సర్వకామసమృద్ధులు అనివార్యబలులు సత్యుగ్రులు యోగబలసమగ్రులు యోగ మార్గగాములు జూలును జటలుం గల్గి కసిగొని పెదవులంగఱచుచు నవ్వుమొగములతో గజేంద్ర గంఢస్థతాటోపమున గడుదిట్టలై సింహశరీరులై విజృంభించినారు. కొందరు శత్రుమదవాసనచేదూగుచు దీపమట్లెరుపెక్కిన (కందిన) కునులం జిత్రవిచిత్రవస్త్రములందాల్చి ఘెరతపములొనరించి బ్రహ్మాదులవలన బడసిన వరములచే గడుదిట్టలై సింహ వ్యాఘ్ర భల్లూకముట్లార్చుచు. పులితోళ్ళ గట్టుకొని మెడలో హారముల ట్లున్న పాముల చుట్టలం జందెములుగ గైనేసికొని శూలములు కత్తులుపట్టిసముల (అడకత్తులు) గండ్రగోడ్డళ్ళు ప్రాసములుం (ఈటెలు) జేకొనిన పరమదుర్ధర్షు లైనగణశ్వరులచే, గ్రహములచే సూర్యుడ ట్లావరింపబడి, దేవదేవా! మహాదేవా! యజ్ఞపురుడు హడలిపోయి ఇవేడింలోలేడియైడిదివమ్మునకు పాపోయినాడు. శంకరా! నమస్కారము, శంఖసమప్రభ శరీరా వందనము. 79

వృషాసనాయ సోమాయ క్రతుకాలాంతకాయచ | నమో దిక్చర్మ వస్త్రాయ నమస్తే తీవ్రతేజసే || 80

బ్రహ్మణ బ్రహ్మదేహాయ బ్రహ్మణ్యా యామితాయచ గిరిశాయ సురేశాయ ఈశానాయ నమోనమః || 81

రుద్రాయ ప్రతివజ్రాయ శివాయ క్రథనాయచ సురాసురాధిపతయే యతీనాం పతయే నమః

ధూమ్రోగ్రాయ విరూపాయ యజ్వనే ఘెరరూపిణ విరూపాక్షశుభాక్షాయ సహస్రాక్షాయ వై నమః 82

ముండాయ చండముండాయ వరఖట్వాంగధారిణ కవ్యరూవాయ హవ్యాయ సర్వసంహారిణ నమః 83

భక్తానుకంపినే7త్యర్థం రుద్రజాప్యన్తుతాయ చ విరూపాయ సురూపాయ రూపాణాం శతకారిణ 84

పంచాస్యాయ శుభాస్యాయ చంద్రాస్యాయ నమోనమః వరదాయ వరాహాయ కూర్మాయ చ మృగాయ చ 85

లీలాలకశిఖండాయ కమండలుధరాయ చ విశ్వనామ్నే7థ విశ్వాయ విశ్వేశాయ నమోనమః 86

త్రినేత్ర త్రాణ మస్మాకం త్రిపురఘ్న విధీయతాం వాజ్మనఃకాయభావైస్తు ప్రసన్నానాం మహేశ్వర 87

ఏవం స్తుత స్తదా దేవో దక్షే ణాపన్న దేహినా దివ్యే నానేన స్తోత్రేణ భృశ మారాధిత స్తదా 88

సమగ్రంతే యజ్ఞఫలం మాయాదత్తం ప్రజాపతే సర్వకామ ప్రసిద్ద్యర్ధం ఫలం ప్రాప్ర్య స్యనుత్తమమ్‌ 89

ఏవ ముక్తో భగవతా ప్రణ మ్యాథసురేశ్వరం జగామ స్వనికేతంతు గణానా మేవ పశ్యతామ్‌ 90

దేహాపాయ దశలోనున్న దక్షుడిట్లు స్తుతింప నీదివ్యస్తోత్రముచే మిక్కిలి యారాధింపబడి రుద్రుడు ఓ ప్రజాపతీ ! నీకు నీ యజ్ఞఫలము సంపూర్ణముగ నే నిచ్చుచున్నాను. సర్వాభిష్టసిద్ధిని బొందెదవు. అన నాతడు పరమేశ్వరుని మ్రొక్కి ప్రథమగణము లట్టె చూచుచుండ స్వగృహమునకుం జనెను. 90

పత్న్యా ళ్ళోకేన వైదేవో గంగాద్వారే తదాస్థితః తాం సతీం చింతయానస్తు క్వను సా మే ప్రియాగతా 91

తస్య శోకాభిభూతస్య నారదో భవసన్నిధౌ సా తే సతీ యా దేవేశ భార్యా ప్రాణసమా మృతా 92

హిమవద్దుహితా సాచ మేనాగర్భసముద్భవా జగ్రాహ దేహ మన్యం సా వేద వేదార్ధవేదనీ 93

శ్రుత్వా దేవ స్తదా ధ్యాన మవతీర్ణా మపశ్యత కృతకృత్య మథాత్మానం కృత్వా దేవ స్తదా స్థితః 94

సంప్రాప్త ¸°వనా దేవీ పునరేవ వివాహితా ఏవం వై కథితం భీష్మ యథా యజ్ఞో హతః పురా 95

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే దక్షయజ్ఞవిధ్వంసం పార్వతీ ప్రాదుర్బావో నామ పంచమో7ధ్యాయం

పరమేశ్వరుడును పత్నీవిరహశోకవిహ్వలుడై ఆ సతీదేవినే నా ప్రియురాలా యెటవోయినని తలచికొనుచుండ నారదుడు వచ్చి దేవేశ ! హిమవంతునికి మేనాదేవి యందేవి యవతరించినది, నీ ప్రాణప్రియ యింకొక మేనుదాల్చినది. ఆ తల్లి వేదవేదార్దవేదిని యన విని యీశ్వరుడు ధ్యానింప నాధ్యానమందెట్టయెదుట నవతరించిన యా దేవిం దర్శించి తాను కృతార్థుడనైతి ననుకొనెను. ఆమె ¸°వనము నొంది తిరిగి పరమేశ్వరుని పెండ్లాడినది.

ఇది పద్మపురాణమున సృష్టిఖండమున దక్షయజ్ఞవిధ్వంస పార్వతీ ప్రాదుర్భావాది వర్ణనమను నైదవ అధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters