Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుస్త్రింశోధ్యాయః

అనరణ్యుడు

వసిష్ఠ ఉవాచ |

మనోర్వంశోద్భవో రాజా సోనరణ్యో నృపేశ్వరః | ఇంద్రసావర్ణి సంజ్ఞస్య చతుర్దశమితస్య హి || 1

అనరణ్యో నృపశ్రేష్ఠ స్సప్తద్వీపమహీ పతిః| శంభు భక్తో విశేషేణ మంగళారణ్యజో బలీ || 2

భృగుం పురోధసం కృత్వా శతం యజ్ఞాంశ్చకార సః |న స్వీచకార శక్రత్వం దీయమానం సురై రపి || 3

బభూవుశ్శత పుత్రాశ్చ రాజ్ఞ స్తస్య హిమాలయ |కన్యైకా సుందరీ నామ్నా పద్మా పద్మాలయాసమా || 4

వసిష్ఠుడిట్లు పలికెను |

ఇంద్ర సావర్ణి అను పేరు గల పదునాల్గవ మనువు యొక్క వంశములో అనరణ్యుడను చక్రవర్తి జన్మించెను (1). అనరణ్య మహారాజు ఏడు ద్వీపములతో గూడిన భూమండలమునకు ప్రభువు. మంగళారణ్యము నందు జన్మించిన బలశాలియగు ఆ మహారాజు ప్రత్యేకించి శివభక్తుడు (2).ఆయన భృగువును పురోహితునిగా చేసుకొని వంద యజ్ఞములను చేసెను. కాని దేవతలు ఇచ్చిననూ ఆయన ఇంద్ర పదవిని స్వీకరించలేదు (3). ఓ హిమాలయా! ఆ మహారాజునకు వందమంది కుమారలు ఉండిరి. మరియు పద్మయను పేరు గల లక్ష్మీ సమానురాలైన ఒక సుందరియగు కన్య ఉండెను (4).

యస్స్నేహః పుత్రశతకే కన్యాయాం చ తతోధికః | నృపస్య తస్య తస్యాం హి బభూవ నగసత్తమ || 5

ప్రాణాధి కా ః ప్రియతమా హహిష్యస్సర్వయోషితః | నృపస్య పత్న్యః పంచాసన్‌ సర్వ సౌభాగ్య సంయుతాః || 6

సా కన్యా ¸°వనస్థా చ బభూవ స్వపితుర్గృహే | పత్రం ప్రస్థాపయామాస సువరానయనాయ సః || 7

ఏకదా పిప్పలాదర్షి ర్గంతుం స్వాశ్రమముత్సుకః | తపస్ధ్సానే నిర్జనే చ గంధర్వం స దదర్శ హ || 8

ఆ మహారాజునకు వందమంది పుత్రలపై ఎంత ప్రేమ గలదో, అంతకంటె అధిక ప్రేమ ఆ కన్య యందు ఉండెడిది. ఓ పర్వతరాజా! (5) ఆ మహారాజునకు ప్రాణములకంటె అధికముగా ప్రియమైనవారు, సర్వసౌభాగ్యములతో గూడినవారు అగు అయిదుగురు భార్యలు ఉండిరి (6). ఆ కన్య తన తండ్రి ఇంటిలో పెరిగి ¸°వనములో అడుగిడెను. ఆ రాజు మంచి వరులను రప్పించుటకై పత్రములను పంపించెను (7). ఒకనాడు పిప్పలాదమహర్షి తన ఆశ్రమమునకు వెళ్లు తొందరలో నుండి నిర్జనమగు తపోవనములో ఒక గంధర్వుని చూచెను (8).

స్త్రీయుతం మగ్నచిత్తం చ శృంగారే రససాగరే | విహరంతం మహా ప్రేవ్ణూ కామశాస్త్ర విశారదమ్‌ || 9

దృష్ట్వా తం ముని శార్దూలస్సకామస్సంబభూవ సః | తపస్స్వ దత్త చిత్తశ్చా చింతయద్దారసంగ్రహమ్‌ || 10

ఏవం వృత్తస్య తసై#్యవ పిప్సలాదస్య సన్మునేః | కియత్‌ కాలో గతస్తత్ర కామోన్మ థితచేతసః || 11

ఏకదా పుష్ప భద్రాయాం స్నాతుం గచ్ఛన్ము నీశ్వరః | దదర్శ పద్మాం యువతీం పద్మామివ మనోరమామ్‌ || 12

స్త్రీలతో గూడి శృంగారరసముద్రములో మునిగిన మనస్సు గలవాడై మహాప్రేమతో విహరించుచున్న కామశాస్త్ర కోవిదుడగు (9) ఆ గంధర్వుని చూచి ఆ మహర్షి కామము గలవాడాయెను. ఆయన మనస్సును తపస్సునందు లగ్నము చేయజాలక వివాహమాడవలెనని తలపోసెను (10). ఈ తీరున కామముచే పీడింపబడిన మనస్సుగల ఆ పిప్పలాద మహర్షి కొంతకాలమును గడిపెను (11). ఒకనాడు ఆ మునీశ్వరుడు పుష్పభద్రా నదియందు స్నానము చేయుటకు వెళ్లుచూ, లక్ష్మివలె మనోరమ, ¸°వనవతి యగు పద్మను చూచెను (12).

కేయం కన్యేతి పప్రచ్ఛ సమీపస్థాన్‌ జనాన్‌ మునిః | జనా నివేదయాం చక్రుర్నత్వా శాపనియంత్రితాః || 13

ఆ మహర్షి సమీపములో నున్న జనులను 'ఈ కన్య ఎవరు?' అని ప్రశ్నించెను. శాపభీతులగు జనులు నమస్కరించి ఇట్లు నివేదించిరి (13).

జనా ఊచుః |

అనరణ్య సుతేయం వై పద్మా నామ రమాపరా | వరారోహా ప్రార్థ్య మానా నృపశ్రేష్ఠై ర్గుణాలయా || 14

జనులిట్లు పలికిరి |

అపర లక్ష్మీదేవి యనదగిన ఈ సుందరి అనరణ్యుని కుమార్తె. ఈమె పేరు పద్మ. సద్గుణములకు నిలయమగు ఈమెను వివాహమాడ వలెనని శ్రేష్ఠులగు రాజకుమారులు గోరుచున్నారు (14).

బ్రహ్మోవాచ|

తచ్ఛ్రుత్వా స మునిర్వాక్యం జనానాం తథ్య వాదినామ్‌ | చుక్షోభాతీవ మనసి తల్లి ప్సురభవచ్చ సః || 15

మునిస్స్నా త్వాభీష్టదేవం సంపూజ్య విధివచ్ఛివమ్‌ | జగామ కామీ భిక్షార్థ మనరణ్య సభాం గిరే || 16

రాజా శీఘ్రం మునిం దృష్ట్వా ప్రణనామ భయాకులః | మధుపర్కాదికం దత్త్వా పూజయామాస భక్తితః || 17

కామాత్సర్వం గృహీత్వా చ యయాచే కన్యకాం మునిః | మౌనీ బభూవ నృపతిఃకించిన్నిర్వక్తు మక్షమః || 18

బ్రహ్మ ఇట్లు పలికెను -

సత్యమును పలికే జనుల ఆ మాటలను విని ఆ మహర్షి మనస్సునందు చాల క్షోభను పొంది, ఆమెను పొందగోరినాడు (15). ఓశైలరాజా! కామియగు ఆ మహర్షి స్నానముచేసి ఇష్టదైవమగు శివుని యథావిధిగా పూజించి భిక్షకొరకై అనరణ్యుని సభకు వెళ్లెను (16). రాజు మునిని చూచి భయముతో కంగాపడిన వెంటనే నమస్కరించెను. మరియు మధుపర్కాదులనిచ్చి భక్తితో పూజించెను (17). ఆ మహర్షి సత్కార ద్రవ్యములలో తనకు నచ్చిన వాటిని స్వీకరించి కన్యను తనకిమ్మని కోరెను. రాజు ఏమియూ చెప్పజాలక మౌనముగా నుండి పోయెను (18).

మునిర్యయాచే కన్యాం స తాం దేహీతి నృపేశ్వరమ్‌ | అన్యథా భస్మసాత్సర్వం కరిష్యామి క్షణన చ || 19

సర్వే బభూవురాచ్ఛన్నా గణాసత్తత్తే జసా మునే | రురోద రాజా సగణో దృష్ట్వా విప్రం జరాతురమ్‌ || 20

మహిష్యో రురుదుస్సర్వా ఇతి కర్త్వవ్యతాక్షమాః | మార్ఛా మాప మహారజ్ఞీ కన్యామాతా శుచాకులా || 21

బభూవుస్తనయాస్సర్వే శోకాకులిత మానసాః | సర్వం శోకాకులం జాతం నృపసంబంధి శైలప || 22

' ఆ కన్యను నాకిమ్ము. లేనిచో, క్షణకాలములో సర్వమును భస్మము చేసెదను' అని ఆ ముని మహారాజును కోరెను (19). ఓ మహర్షీ! రాజపరివారమంతయూ ఆ మునియొక్క తేజస్సుచే దిగ్భ్రాంతులైరి. రాజు ఆముదుసలి బ్రాహ్మణుని చూచి బంధువులతో సహా రోదిల్లెను (20). ఆతని భార్యలందరు ఏమి చేయుటకు తోచక ఏడ్చిరి. కన్యయొక్క తల్లియగుమహారాణి దుఃఖపీడితురాలై మూర్ఛిల్లెను (21). కుమారులందరు శోకారులందరు శోకావిష్టమగు మనస్సు గల వారైరి. ఓ పర్వతరాజా! రాజ సంబంధి జనులందరూ శోకమును పట్టజాలకపోయిరి (22).

ఏతస్మిన్నంతరే ప్రాజ్ఞో ద్విజో గురురనుత్తమః | పురోహితశ్చ మతిమాన్‌ ఆగతో నృపసన్నిధిమ్‌ || 23

రాజా ప్రణమ్య సంపూజ్య రురోద చ తయోః | పురః | సర్వం నివేదయాం చక్రే పప్రచ్ఛోచితమాశు తత్‌ || 24

అథ రాజ్ఞో గురుర్విప్రః పండితశ్చ పురోహితః | అపి ద్వౌ శాస్త్రనీతిజ్ఞౌ బోధయా మాసతుర్నృపమ్‌ || 25

శోకాకులాశ్చ మహిషీర్నృప బాలంశ్చ కన్యకామ్‌ | ఉత్తమాం నీతి మాదృత్య సర్వేషాం హితకారిణీమ్‌ || 26

ఇంతలో ప్రాజ్ఞుడు, గొప్ప బ్రాహ్మణుడు అగు గురువు, బుద్ధిమంతుడగు పురోహితుడు రాజ సన్నిధికి విచ్చేసిరి (23). రాజు వారిద్దరికీ నమస్కరించి పూజించి వారి యెదుట భోరుమనెను. వారు ప్రశ్నించగా ఆతడు ఉచితరీతిని వృత్తాంతమునంతనూ నివేదించెను (24). అపుడు వేదవేత్తయగు గురువు, పండితుడగు పురోహితుడు కలిసి నీతి శాస్త్రజ్ఞులు గనుక, రాజునకు ఇట్లు బోధించిరి (25). శోకముచే వ్యాకులమైన మనస్సుగల రాజపత్నులకు, రాజకుమారులకు, రాజకన్యకు వారిద్దరు అందరికీ హితమును కలిగించే ఉత్తమనీతిని సాదరముగా విన్నవించిరి (26).

గురుపురోధసావూచతుః |

శృణు రాజస్మ హాప్రాజ్ఞ వచో నౌ సద్ధితావహమ్‌ | మా శుచస్సపరీవారశ్శాస్త్రే కురు మతిం సతీమ్‌ || 27

అద్య వాబ్ద దినాంతే వా దాతవ్యా కన్యకా నృప | పాత్రాయ విప్రాయాన్యసై#్మ కసై#్మచిద్వా విశేషతః || 28

సత్పాత్రం బ్రాహ్మణా దన్యన్న పశ్యావో జగత్త్రయే | సుతాం దత్వా చ మునయే రక్ష స్వాం సర్వసంపదమ్‌ || 29

రాజన్నేక నిమిత్తేన సర్వ సంపద్వినశ్యతి | సర్వం రక్షతి తం త్యక్త్వా వినా తం శరణాగతమ్‌ || 30

గురువు, రాజ పురోహితుడు ఇట్లు పలికిరి-

మహాప్రాజ్ఞా! రాజా! మంచి మితమును కలిగించు మా ఇద్దరి మాటను వినుము. బంధువర్గముతో గూడి దుఃఖించకుము. శాస్త్రమునందు సద్బుద్ధిని కలిగియుండుము (27). రాజా! ఈనాడుగాని, సంవత్సరము తరువాత గాని అమ్మాయిని యోగ్యుడగు బ్రాహ్మణునకు గాని, లేదా ఎవరికో ఒకనికి గాని ఈయవలసినదే గదా! (28) ముల్లోకములలో బ్రాహ్మణునికంటె యోగ్యమగు పాత్ర మాకు గానరాలేదు. కావున కుమార్తెను మహర్షికి ఇచ్చి నీ సంపదలన్నిటినీ రక్షించు కొనుము (29). రాజా ! ఒక్కరి కొరకై సర్వము నశించే సందర్భములో వానిని విడిచి సర్వమును రక్షించవలెను. ఈ నీతి శరణాగతుని విషయములో వర్తించదు (30).

వసిష్ఠ ఉవాచ|

రాజాప్రాజ్ఞ వచశ్శ్రుత్వా విలప్య చ ముహుర్ము హుః | కన్యాం సాలంకృతాం కృత్వా మునీంద్రాయ దదౌ కిల || 31

కాంతాం గృహీత్వా స మునిర్వివాహ్య విధివద్గిరే | పద్మాం పద్మోపమాం తాం వైముదితస్స్వాలయం య¸° || 32

రాజా సర్వాన్‌ పరిత్యజ్య దత్త్వా వృద్ధాయ చాత్మజామ్‌ |గ్లానిం చిత్తే సమాధాయ జగామ తపసే వనమ్‌ || 33

తద్భార్యాపి వనం యాతే ప్రాణనాథే తదా గిరే | భర్తుశ్చ దుహితు శ్శోకాత్ప్రాణాం స్తత్యాజ సుందరీ || 34

వసిష్ఠుడిట్లు పలికెను-

రాజు ఆ బుద్ధిమంతుల మాటలను విని అనేక పర్యాయములు రోదించి, కన్యను అలంకరించి, ఆ మహర్షికి అప్పజెప్పెను. (31). ఓ శైలరాజా! ఆ ముని కన్యను స్వీకరించెను. ఆతడు అక్ష్మివంటి ఆ పద్మను ఆనందముతో పరిణయమాడి యథావిధిగా తన గృహమునకు దోడ్కొని వెళ్లెను (32). రాజు వృద్ధునకు కుమార్తె నిచ్చుటచే అందరినీ వీడి మనస్సులో దుఃఖము గలవాడై తపస్సు కొరకు అడవికి పోయెను (33). ఆయన భార్య తన ప్రాణనాథుడు అడవికి పోగానే భర్తయొక్క వియోగము, కుమార్తె యొక్క దుఃఖమును సహింపలేకపోయెను. ఓ పర్వతరాజా! ఆసుందరి ప్రాణములను విడిచి పెట్టెను (34).

పూజ్యాః పుత్రాశ్చ భృత్యాశ్చ మూర్ఛామాపుర్నృపం వినా | శుశుచుశ్శ్వాస సంయుక్తం జ్ఞాత్వా సర్వే పరే జనాః || 35

అనరణ్యో వనం గత్వా తపస్తప్త్వాతి శంకరమ్‌ | సమారాధ్య య¸° భక్త్యా శివలోకమనామయమ్‌ || 36

నృపస్య కీర్తి మాన్నామ్నా జ్యేష్ఠపుత్రోథ ధార్మికః | పుత్ర వత్పాలయామాస ప్రజా రాజ్యం చకార హ || 37

ఇతి తే కథితం శైలానరణ్య చరితం శుభమ్‌ | కన్యాం దత్త్వా యథారక్ష ద్వంశం చాప్యఖిలం ధనమ్‌ || 38

శైలరాజ త్వమప్యేవం సుతాం దత్త్వా శివాయ చ | రక్ష సర్వకులం సర్వాన్‌ వశాన్‌ కురు సురానపి || 39

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీఖండే అనరణ్య చరిత వర్ణనం నామ చతుస్త్రింశోధ్యాయః (34)

రాజు లేకుండటచే పూజ్యులగు అమాత్యాదులు, రాజ పుత్రులు మరియు సేవకులు కూడా మూర్ఛను పొందిరి. ఈ వార్తను ఎరింగిన ఇతర జనులందరు నిట్టూర్పులను విడిచి దుఃఖించిరి (35). అనరణ్యుడు అడవికి వెళ్లి శంకరుని ఉద్దేశించి గొప్ప తపస్సును చేసి భక్తితో శివుని ఆరాధించి దుఃఖ రహితమగు శివలోకమును పొందెను (36). తరువాత ఆ రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు కీర్తిమంతుడు ధర్మబద్ధుడై ప్రజలను పుత్రుల వలె పాలించి రాజ్యము నేలెను (37). ఓ పర్వత రాజా! అనరణ్యుడు కన్యను ఇచ్చి సర్వసంపదలను, వంశమును రక్షించుకున్న ఈ శుభ వృత్తాంతమును నీకు వివరించితిని (38). ఓ శైలరాజా! నీవు కూడా ఇదే తీరున కుమార్తెను శివునకు ఇచ్చి, కులమునంతనూ రక్షించుకొనుము. మరియు, దేవతల నందరినీ నీకు వశులగునట్లు చేసుకొనుము (39).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో అనరణ్య చరిత వర్ణనమనే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).

Sri Sivamahapuranamu-II    Chapters