Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచమో%ధ్యాయః

కుమారాభిషేకము

బ్రహ్మోవాచ |

ఏతస్మిన్నంతరే తత్ర దదర్శ రథ ముత్తమమ్‌ | అద్భుతం శోభితం శశ్వత్‌ విశ్వకర్మవినిర్మితమ్‌ || 1

శతచక్రం సువిస్తీర్ణం మనోమాయి మనోహరమ్‌ | ప్రస్థాపితం చ పార్వత్యా వేష్టితం పార్షదైర్వరైః || 2

సమారోహత్తతో%నంతో హృదయేన విదూయతా | కార్తికః పరమ జ్ఞానీ పరమేశాన వీర్యజః || 3

తదైవ కృత్తికాః ప్రాప్య ముక్తకేశ్య శ్శుచాతురాః | ఉన్మత్తా ఇవ తత్త్రైవ వక్తు మారేభిరే వచః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇంతలో ఉత్తమమైనది, అద్భుతమైనది, నిత్మశోభ గలది, విశ్వకర్మచే నిర్మించబడినది, వంద చక్రములు గలది, మిక్కిలి విస్తీర్ణమైనది, మనోవేగముతో పయనించునది, మనోహరమైనది, పార్వతిచే పంపబడినది, శ్రేష్ఠగణములచే చుట్టు వారబడి యున్నది అగు రథము అచట కనబడెను (1,2). అనంతుడు, గొప్ప జ్ఞాని, పరమేశ్వర తేజస్సంభూతుడు అగు కార్తికుడు దుఃఖముతో నిండిన హృదయముతో రథము నెక్కెను (3). అదే సమయములో దుఃఖపీడితలైన కృత్తికలు ఉన్నతస్త్రీలవలె జుట్టు విరబోసుకొని అచటకు వచ్చి ఇట్లు పలికిరి (4).

కృత్తికా ఊచుః |

విహాయాస్మాన్‌ కృపాసింధో గచ్ఛసి త్వం హి నిర్దయః | నాయం ధర్మో మాతృవర్గాన్‌ పాలితో యత్‌ సుతస్త్యజేత్‌ || 5

స్నేహేన వర్థితో%స్మాభిః పుత్రో%స్మాకం చ ధర్మతః | కిం కుర్మః క్వ చ యాస్యామో వయం కిం కరవామ హ || 6

ఇత్యుక్త్వా కృత్తికాస్సర్వాః కృత్వా వక్షసి కార్తికమ్‌ | ద్రుతం మూర్ఛామవాపుస్తాస్సుతవిచ్ఛేద కారణాత్‌ || 7

కృత్తికలిట్లు పలికిరి -

ఓ దయాసముద్రా! నీవు నిర్దయుడవై మమ్ములను విడచి వెళ్లుచున్నావు. పెంచిన తల్లులను ఈ తీరున కుమారుడు విడిచి వెళ్లుట ధర్మము కాదు (5). నిన్ను మేము ప్రేమతో పెంచినాము గనుక, ధర్మము ప్రకారంగా నీవు మా కుమారుడవు: మేము ఏమి చేయుదుము? ఎచటకు వెళ్లెదము? (6) ఇట్లు పలికి ఆ కృత్తికలందరు కార్తికుని గుండెలకు హత్తుకొని కుమారుని వియోగము కారణంగా వెంటనే మూర్ఛిల్లిరి (7).

తాః కుమారో భోధయిత్వా అధ్యాత్మ వచనేన వై | తాభిశ్చ పార్షదైస్సార్థ మారురోహ రథం మునే || 8

దృష్ట్వా శ్రుత్వా మంగలాని బహూని సుఖదానివై | కుమారః పార్షదైస్సార్ధం జగామ పితృమందిరమ్‌ || 9

దక్షేణ నందియుక్తశ్చ మనోయాయి రథేన చ | కుమారః ప్రాప కైలాసం న్యగ్రోధాక్షయ మూలకే || 10

తత్ర తస్థౌ కృత్తి కాభిః పార్షదప్రవరైస్సహ | కుమారశ్శాంకరిః ప్రీతో నానాలీలా విశారదః || 11

ఓ మునీ! కుమారుడు వారికి అద్యాత్మ వచనములను బోధించి, వారిని దోడ్కొని శివగణములతో బాటు రథము నధిష్ఠించెను (8). కుమారుడు శివగణములతో బాటు అనేక సుఖకరములగు మంగళములను చూస్తూ, వింటూ, తండ్రి యొక్క మందిరమునకు వెళ్లెను (9). కుమారుడు మనో వేగముతో పయనింప సమర్ధమగు రథముపై నందీశ్వరునితో గూడి అక్షయవట వృక్ష మూలము నందు గలకైలాసమును చేరెను (10). అనేక లీలలను ప్రదర్శించుటలో సమర్ధుడగు ఆ శివ పుత్రుడైన కుమారుడు కృత్తికలతో, శివగణములతో కూడి ఆనందముగా అచట ఉండెను (11).

తదా సర్వే సురగణా ఋషయస్సిధ్ధ చారణాః | విష్ణునా బ్రహ్మణా సార్ధం సమాచఖ్యుస్తదా గమమ్‌ || 12

తదా దృష్ట్వా చ గాంగేయం య¸° ప్రముదితశ్శివః | అన్యైస్సమేతో హరిణా బ్రహ్మణా చ సురర్షిభిః ||13

శంఖాశ్చ బహవో నేదుర్భేరీతూర్యాణ్యనేకశః | ఉత్సవస్సుమహానాసీద్ధేవానాం తుష్ట చేతసామ్‌ || 14

తదానీమేవ తం సర్వే వీరభద్రదయో గణాః | కుర్వంతస్స్వన్వయుః కేళిం నానాతాలధరస్వరాః || 15

అపుడు దేవతాగణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరు విష్ణువుతో బ్రహ్మతో గూడి కుమారుని రాకను శివునకు చెప్పిరి (12). అపుడు గొప్ప హర్షముతో గూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచివెళ్లెను (13). అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధరీతులలో మ్రోగింపబడినవి. ఆనందముతో నిండిన మనస్సులు గల దేవతలు గొప్ప ఉత్పవమును చేసిరి (14). అదే సమయములో వీరభద్రుడు మొదలగు గణములన్నియూ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనుక నడచిరి (15).

స్తావకస్త్సూ యమానాశ్చ చక్రుస్తే గుణకీర్తనమ్‌ | జయశబ్దం నమశ్శబ్దం కుర్వాణాః ప్రీతమానసాః |క్ష| 16

ద్రష్టుం యయుస్తం శరజం శివాత్మజమనుత్తమమ్‌ || 17

పార్వతీ మంగలం చక్రే రాజమార్గం మనోహరమ్‌ | పద్మరాగాది మణిభిస్సంస్సృతం పరితః పురమ్‌ || 18

పతిపుత్ర వతీభిశ్చ సాధ్వీభిస్త్స్రీ భిరన్వితా | లక్ష్మ్యాదిత్రింశ##ద్ధేవీశ్చ పురః కృత్వా సమాయ¸° || 19

సంతసించిన మనస్సులు గలవారు, ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను, నమశ్శబ్దములను పలుకకుతూ శివుని గుణములను కీర్తిస్తూస్తుతించిరి(16). సర్వశ్రేష్టుడు, రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు ఆ శివపుత్రుని చూచుటకు వారు వెళ్లిరి (17). పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మణులచే అలంకరింపజేసి, సుందరముగా మంగళకరముగా చేసెను (18). ఆమె భర్త, పుత్రులు గల పతివ్రతలగు స్త్రీలతో కూడియున్నదై, లక్ష్మి మొదలగు ముప్పది దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను (19).

రంభాద్యప్సరసో దివ్యాస్సస్మితా వేషసంయుతాః | సంగీతనర్తనపరా బభూవుశ్చ శివాజ్ఞయా || 20

యే తం సమీక్షయామాసుర్గాంగేయం శంకరోపమమ్‌ | దదృశుస్తే మహత్తేజో వ్యాస్త మాసీజ్జగత్త్రయే || 21

తత్తేజసావృతం బాలం తప్త చామీకర ప్రభమ్‌ | వవందిరే ద్రుతం సర్వే కుమారం సూర్యవర్చసమ్‌ || 22

జహర్షుర్వానతక్కంధా నమశ్శబ్దరతాస్తదా| పరివార్యోపతస్థుస్తే వామ దక్షిణమాగతాః || 23

శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్యవేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి (20). శంకరునితో పోల్చదగిన గంగా పుత్రుడగు కుమారుని చూచినవారందరు ముల్లోకములలో వ్యాపించు చున్న గొప్ప తేజస్సును చూచిరి (21). అట్టి తేజస్సుచే చుట్టు వారబడి యున్నవాడు, బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు అగు కుమారునకు అందరు వెంటనే నమస్కరించిరి (22). వారు అతని ఎడమవైపున, కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశ్శబ్దమును పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి (22).

అహం విష్ణుశ్చ శక్రశ్చ తథా దేవాదయో%ఖిలాః | దండవత్పతితా భూమౌ పరివార్య కుమారకమ్‌ || 24

ఏతస్మిన్నంతరే శంభుర్గిరిజా చ ముదాన్వితా | మహోత్సవం సమాగమ్య దదర్శ తమయం ముదా|| 25

పుత్రం నిరీక్ష్య చ తదా జగదేక బంధుః ప్రీత్యాన్వితః పరమయా పరయా భవాన్యా ||

స్నేహాన్వితో భుజగభోగయుతో హి సాక్షాత్‌ సర్వేశ్వరః పరివృతః ప్రమథైః పరేశః || 26

అథ శక్తి ధరస్స్కందో దృష్ట్వా తౌ పార్వతీ శివౌ | అవరుహ్య రథాత్తూర్ణం శిరసా ప్రణనామ హ || 27

నేను, విష్ణువు, ఇంద్రుడు, మరియు సర్వదేవతలు కుమారుని చుట్టు ముట్టి భూమిపై దండమువలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి (24). ఇంతలో శివుడు, మహానందముతో నున్న పార్వతియు కలిసి మహోత్సవపురస్సరముగా విచ్చేసి ఆనందముతో కుమారుని చూచిరి (25). జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమ స్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు, పరమాత్మ అగు శివుడు పరాభట్టారికయగు భవానితో గూడి పుత్రుని గాంచి చాల ఆనందించెను (26). అపుడు శక్తిని ధరించి యున్న స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెను వెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను (27).

ఉపగుహ్య శివః ప్రీత్యా కుమారం మూర్ధ్ని శంకరః | జఫ్ర° ప్రేవ్ణూ పరమేశానః ప్రసన్నస్స్నేహకర్తృకః || 28

ఉపగుహ్య గుహం తత్ర పార్వతీ జాతసంభ్రమా | ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుతా || 29

తదా నీరాజితో దేవై స్సకలత్త్రైర్ముదాన్వితైః | జయశ##బ్దేన మహతా వ్యాప్తమాసీన్నభ స్థ్స లమ్‌ || 30

ఋషయో బ్రహ్మఘోషేణ గీతేనైవ చ గాయకాః | వాద్యైశ్చ బహవస్తత్రోపతస్థుశ్చ కుమారకమ్‌ || 31

మంగళకరుడు, పరమేశ్వరుడు, స్నేహ స్వరూపుడు అగు శివుడు ప్రసన్నుడై ప్రేమతో కుమారుని కౌగిలించు కొని శిరస్సుపై ముద్ధిడెను (28). మిక్కిలి తొందరతో కూడిన పార్వతి గుహుని కౌగిలించుకొని ప్రేమతో నిండిన హృదయము గలదైస్తన్యము నిచ్చెను (29). అపుడు దేవతలు భార్యలతో గూడి ఆనందముతో నీరాజనమిచ్చిరి. ఆకాశము జయఘోషతో నిండి పోయెను (30). ఋషులు వేదధ్వనితో, గాయకులు గానము చేయుచూ అనేకులు వాద్యములతో కుమారుని వద్దకు విచ్చేసిరి (31).

స్వాంకమారోప్య తదా మహేశః కుమారకం తం ప్రభయా సముజ్జ్వలమ్‌ |

బభౌ భవానీపతిరేవ సాక్షాత్‌ శ్రియాన్వితః పుత్రవతాం వరిష్ఠః || 32

కుమారస్స్వగణౖ స్సార్ధమాజగామ శివాలయమ్‌ | శివాజ్ఞయా మహోత్సాహై స్సహ దేవైర్మహాసుఖీ || 33

దంపతీ తౌ తదా తత్రైకపద్యేన విరేజతుః |వివంద్యమానావృషిభినావృతౌ సురసత్తమైః || 34

కుమారః క్రీడయామాస శివోత్సంగే ముదాన్వితః | వాసుకిం శివకంఠస్థం పాణిభ్యాం సమపీడయత్‌ || 35

భవానీ పతియగు మహేశ్వరుడు అపుడు దివ్యకాంతులతోవెలు గొందు చున్న కుమారుని తన తొడపై కూర్చుండ బెట్టుకొనెను. కుమారుడు కూర్చుండుటచే సాక్షాత్తు శివుడు శోభను పొంది పుత్రుడు గలవారిలో శ్రేష్ఠుడాయెను (32). మహాసుఖమును పొందిన కుమారుడు శివుని ఆజ్ఞచే మహోత్సాహ వంతులగు తన గణములతో మరియు దేవతలతో గూడి శివుని మందిరమునకు విచ్చేసెను (33). దేవతోత్తములు చుట్టు వారియుండగా, ఋషులు నమస్కరించు చుండగా ఒక్కచోటనున్న ఆ ఇద్దరు దంపతులు అపుడెంతయో ప్రకాశించిరి (34). కుమారుడు శివుని ఒడిలో ఆనందముతో నాడు కొనెను. శివుని కంఠము నందున్న వాసుకిని చేతులతో పీడించెను (35).

ప్రహస్య భగవాన్‌ శంభుశ్శశంస గిరిజాం తదా | నిరీక్ష్య కృపయా దృష్ట్వా కృపాలుర్లీలయా కృతిమ్‌ || 36

మందస్మితేన చ తదా భగవాన్మహేశః ప్రాప్తో ముదం చ పరమాం గిరిజాసమేతః |

ప్రేవ్ణూ స గద్గదగిరో జగదేకబంధుః నోవాచ కించన విభుర్భువనైక భర్తా || 37

అథ శంభుర్జజగన్నాథో హృష్టో లౌకిక వృత్తవాన్‌ | రత్నసింభాసనే రమ్యే వాసయామాస కార్తికమ్‌ || 38

వేదమంత్రాభిపూతైశ్చ సర్వతీర్థోరపూర్ణకైః | సద్రత్నకుంభశతకైస్స్నాపయామాన తం ముదా || 39

దయానిధియగు శంభుడు దయా దృష్టితో బాలుని చూచి నవ్వి గిరిజతో ఆ విషయమును చెప్పెను. శివుడు లీలచేత ఆ ఆకారమును ధరించెను (36). అపుడు పార్వతీ సమేతుడు, జగత్తునకు ఏకైక బంధువు, సర్వవ్యాపి, ముల్లోకములకు ఏకైక ప్రభుడు అగు మహేశ్వర భగవానుడు మహానందమును పొంది చిరునవ్వులను వెదజల్లెను. ప్రేమచే కంఠము బొంగురుపోవుట వలన ఆయన ఏమియూ మాటలాడలేదు (37). అపుడు జగన్నాధుడగు శంభుడు లోకాచారము ననుసరించి ఆనందమయుతో కార్తికుని సుందరమగు రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను (38). సర్వతీర్థముల జలములు రత్నములు పొదిగిన వంద ఘటములలో నుండెను. వేదమంత్రములచే పవిత్రములైన ఆ జలములతో శివుడు ఆనందముతో కుమారుని అభిషేకించెను (39).

సద్రత్న సారరచిత కిరీట ముకుటాంగదమ్‌ | వైజయంతీం స్వమాలాం చ తసై#్మ చక్రం దదౌ హరిః || 40

శూలం పినాకం పరశుం శక్తిం పాశుపతం శరమ్‌ | సంహారాస్త్రం చ పరమాం విద్యాం తసై#్మ దదౌ శివః || 41

అదామహం యజ్ఞ సూత్రం వేదాంశ్చ వేదమాతరమ్‌ | కమండలుం చ బ్రహ్మాస్త్రం విద్యాం చైవారి మర్దినీమ్‌ || 42

మిక్కిలి శ్రేష్ఠమగు రత్నములతో అలంకరింపబడిన కిరీటమును, అంగదములను, వైజయంతీ మాలను, మరియు చక్రమును విష్ణువు ఆతనికి ఇచ్చెను (40). శివుడు శూలమును, పినాకమనే ధనస్సును, పరశువును, శక్తిని, పాశుపత సంహారాస్త్రములను, పరమవిద్యను అతనికి ఇచ్చెను (41). నేను యజ్ఞ సూత్రమును, వేదములను, వేదమాతను, కమండలమును, బ్రహ్మాస్త్రములను మరియు శత్రు సంహార విద్యను ఇచ్చితిని (42).

గజేంద్రం చైవ వ్రం చ దదౌ తసై#్మ సురేశ్వరః | శ్వేతచ్ఛత్రం రత్నమాలాం దదౌ వస్తుం జలేశ్వరః || 43

మనోయాయిరథం సూర్యస్సన్నాహం చ మహాచయమ్‌ | యమదండం యమశ్చైవ సుధాకుంభం సుధానిధిః || 44

హుతాశనో దదౌ ప్రీత్యా మహాశక్తిం స్వసూనవే | దదౌ స్వశస్త్రం నిర్‌ఋతిర్వాయవ్యాస్త్రం సమీరణః || 45

గదాం దదౌ కుబేరశ్చ శూలమీశో దదౌ ముదా| నానాశస్త్రాణ్యుపాయాంశ్చ సర్వే దేవా దదుర్ముదా || 46

ఇంద్రుడు ఐరావతమును మరియు వజ్రమును అతనికి ఇచ్చెను. వరుణుడు తెల్లని గొడుగును, రత్నమాలను ఇచ్చెను(43). సూర్యుడు మనోవేగముతో పరుగెత్తే రథమును, గొప్ప శక్తిగల కవచమును, యముడు యమదండమును, చంద్రుడు అమృతకలశమును ఇచ్చెను (44). అగ్ని తన కుమారునకు ప్రేమతో మహాశక్తిని ఇచ్చెను. నిర్‌ఋతి తన శస్త్రమును, వాయువు వాయవ్యాస్త్రమును ఇచ్చెను (45). కుబేరుడు గదను, ఈశుడు శూలమును ఇచ్చెను. దేవతలందరు అనేక శస్త్రాస్త్రములను ప్రీతితో నిచ్చిరి (46).

కామాస్త్రం కామదేవో%థ దదౌ తసై#్మ ముదాన్వితః | గదాం దదౌ స్వవిద్యాశ్చ తసై#్మ చ పరయా ముదా || 47

క్షీరోదో%మూల్యరత్నాని విశిష్టం రత్ననూపురమ్‌ | హిమాలయో హి దివ్యాని భూషణాన్యంశుకాని చ || 48

చిత్ర బర్హణ నామానం స్వపుత్రం గరుడో దదౌ | అరుణ స్తామ్ర చూడాఖ్యం బలినం చరణాయుధమ్‌ || 49

పార్వతీ సస్మితా హృష్టా పరమైశ్వర్యముత్తమమ్‌ | దదౌ తసై#్మ మహాప్రీత్యా చిరం జీవిత్వ మేవ చ || 50

తరువాత కామదేవుడు అతనికి కామాస్త్రమును, గదను, తన విద్యలను పరమానందముతో నిచ్చెను (47). క్షీరసముద్రుడు అమూల్యములగు రత్నములను గొప్ప రత్ననూపురమును, హిమవంతుడు దివ్యములగు అలంకారములను, వస్త్రములను (48), గరుడుడు చిత్ర బర్హణడను పేరు గల తన కుమారుని ఇచ్చిరి. పాదములే ఆయుధములుగా గలవాడు, బలశాలి అగు తామ్రచూడుడను పేరుగల వానిని అరుణుడు ఇచ్చెను (49). మహానందముతో నవ్వుచున్న పార్వతి అతనికి పరమైశ్వర్యమును, చిరంజీవి త్వమును ప్రీతితో నిచ్చెను (50).

లక్ష్మీశ్చ సంపదం దివ్యాం మహాహారం మనోహరమ్‌ | సావిత్రీ సిద్ధ విద్యాం చ సమస్తాం ప్రదదౌ ముదా || 51

అన్యాశ్చాపి మునే దేవ్యో యా యాస్తత్ర సమాగతాః | స్వాత్మవస్తు దదుస్తసై#్మ తథైవ శిశు పాలికాః || 52

మహామహోత్పవస్తత్ర బభూవ మునిసత్తమ | సర్వే ప్రసన్నతాం యాతా విశేషాచ్చ శివాశివౌ || 53

ఏతస్మి న్నంతరే కాలే ప్రోవాచ ప్రహసన్ముదా | మునే బ్రహ్మాదికాన్‌ దేవాన్‌ రుద్రో భర్గః ప్రతాపవాన్‌ || 54

లక్ష్మి దివ్యసంపదను, రమణీయమగు గొప్పహారమును, సావిత్రి సంపూర్ణసిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి(51). ఓ మునీ! అచటకు వచ్చిన ఇతరదేవీ మూర్తులు, అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి (52). ఓ మహర్షీ! అచట గొప్ప ఉత్సవము జరిగెను. అందరు ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరులు విశేషముగా సంతోషంచిరి (53). ఆ సమయములో ప్రతాపశాలి, తేజశ్శాలి అగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను (54). శివ ఉవాచ |

హే హరే హే విధే దేవాస్సర్వే శృణుత మద్వచః| సర్వథాహం ప్రసన్నో%స్మి వరాన్‌ వృణుత ఐచ్ఛికాన్‌|| 55

శివుడిట్లు పలికెను-

ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! మీరందరు నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు(55).

బ్రహ్మోవాచ|

తచ్ఛ్రుత్వా వచనం శంభోర్మునే విష్ణ్వాదయస్సురాః | సర్వే ప్రోచుః ప్రసన్నాస్యా దేవం పశుపతిం ప్రభుమ్‌ || 56

కుమారేణ హతో హ్యేష తారకో భవితా ప్రభో | తదర్థమేవ సంజాతమిదం చరితముత్తమమ్‌ || 57

తస్మా దద్యైవ యాస్యామస్తారకం హంతు ముద్యతాః| ఆజ్ఞాం దేహి కుమారాయ స తం హంతు సుఖాయ నః || 58

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిరి (56). ఓ ప్రభూ! ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింబడ గలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది (57). కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. ఆతడు వానిని వధించి మాకు సుఖమును కలుగజేయుగాక! (58)

తథేతి మత్వా స విభుర్దత్తవాంస్తనయం తదా | దేవేభ్యస్తారకం హంతుం కృపయా పరిభావితః || 59

శివాజ్ఞయా సురాస్సర్వే బ్రహ్మవిష్ణుముఖాస్తదా | పురస్కృత్య గుహం సద్యో నిర్జగ్ముర్మిలితా గిరేః || 60

బహిర్నిస్సృత్య కైలాసాత్‌ త్వష్టా శాసనతో హరేః |విరేచే నగరం రమ్యమద్భుతం నికటే గిరేః || 61

తత్ర రమ్యం గృహం దివ్యమద్భుతం పరమోజ్జ్వలమ్‌ | గుహార్థం నిర్మమే త్వష్టా తత్ర సింహాసనమ్‌ వరమ్‌ || 62

అటులనే అని అంగీకరించి ఆ విభుడు అపుడు దయతో నిండిన హృదయము గలవాడై, తారకాసుర సంహారము కొరకు కుమారుని దేవతలకు అప్పగించెను (59). విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరు అపుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందిడుకొనివెంటనే కైలాసము నుండి బయలు దేరిరి(60). శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసమునుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము, అద్భుతము అగు నగరమును నిర్మించెను (61). దానిలో సుందరము, దివ్యము, అద్భుతము, గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గృహములో గొప్ప సింహాసనమును నిర్మించెను (62).

తదా హరిస్సధీర్భక్త్యా కారయామాస మంగలమ్‌ | కార్తికస్యాభిషేకం హి సర్వతీర్థ జలై స్సురైః || 63

సర్వధా సమలం కృత్య వాసయామాస సంగ్రహమ్‌ | కార్తికస్య విధిం ప్రీత్యా కారయామాస చోత్సవమ్‌ || 64

బ్రహ్మాండాధిపతిత్వం హి దదౌ తసై#్మ ముదా హరిః | చకార తిలకం తస్య సమానర్చ సురైస్సహ|| 65

అపుడు బుధ్ధిశాలియగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తికునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను (63). కార్తికుని అన్ని విధములగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చుయించెను (64). విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యము నిచ్చి, తిలకము దిద్ది, దేవతలతో కలిసి పూజించెను (65).

ప్రణమ్య కార్తికం ప్రీత్యా సర్వదేవర్షిభిస్సహ | తుష్టావ వివిధై స్త్సో త్రై శ్శివరూపం సనాతనమ్‌ || 66

వరసింహాసనస్థో హి శుశుభే%తీవ కార్తికః | స్వామిభావం సమాపన్నో బ్రహ్మాండస్యాపి పాలకః || 67

ఇతి శ్రీ శివమహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం కుమార ఖండే కుమారాభిషేక వర్ణనం నామ పంచమో%ధ్యాయః(5).

అతడు దేవతలతో, ఋషులతో గూడి, శివస్వరూపుడు, సనాతనుడు అగు కార్తికుని అనేక స్తోత్రములతో ప్రీతి పూర్వకముగా స్తుతించెను (66). గొప్ప సింహాసనము నందున్న వాడు, బ్రహ్మాండమునకంతకు ప్రభువు, రక్షకుడు అగు కార్తికుడు మిక్కిలి ప్రకాశించెను (67).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో కుమారాభిషేకమనే అయుదవ అధ్యాయము ముగిసినది(5).

Sri Sivamahapuranamu-II    Chapters