Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

కుమారుని లీల

బ్రహ్మోవాచ |

అథ తత్ర స గాంగేయో దర్శయామాస సూతికామ్‌ | తామేవ శృణు సుప్రీత్యా నారద త్వం స్వభక్తిదామ్‌ || 1

ద్విజ ఏకో నారదాఖ్య ఆజగామ తదైవ హి | తత్రాధ్వరకరశ్శ్రీమాన్‌ శరణార్ధం గుహస్యవై || 2

స విప్రః ప్రాప్య నికటం కార్తికస్య ప్రసన్నధీః | స్వాభిప్రాయం సమాచఖ్యౌ సుప్రణమ్య శుభైస్త్సవైః || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట ఆ గంగా పుత్రుడు తన యందు భక్తిని కలిగించే ఒక చక్కని లీలను ప్రదర్శించెను. ఓ నారదా! ఆ లీలను ప్రీతితో వినుము(1). అదే సమయములో అచటకు యజ్ఞమును చేసిన శోభాయుక్తుడగు నారదుడనే ఒక బ్రాహ్మణుడు గుహుని శరణు పొందుటకు వచ్చెను (2). ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు కార్తికుని సమీపమునకు వచ్చి శుభస్తోత్రములతో ప్రణమిల్లి తన అభిప్రాయమును చెప్పెను (3).

విప్ర ఉవాచ |

శృణు స్వామిన్‌ వచో మే%ద్య కష్టం మే వినివారయ | సర్వబ్రహ్మాండ నాథస్త్వ మతస్తే శరణం గతః || 4

అజమేధాధ్వరం కర్తు మారంభం కృతవానహమ్‌ | సో%జో గతో గృహాన్మే హి త్రోటయిత్వా స్వబంధనమ్‌ || 5

న జానే స గతః కుత్రా%న్వేషణం తత్కృతం బహు | న ప్రప్తో%తస్స బలవాన్‌ భంగో భవతి మే క్రతోః || 6

త్వయి నాథే సతి విభో యజ్ఞభంగః కథం భ##వేత్‌ | విచార్యైవాఖిలేశాన కామం పూర్ణం కురుష్వమే || 7

త్వాం విహాయ శరణ్యం కం యాయాం శివసుత ప్రభో | సర్వబ్రహ్మాండనాథం హి సర్వామరసుసేవితమ్‌ || 8

బ్రాహ్మణుడిట్లు పలికెను -

ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని (4). నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది(5).అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది(6). విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము (7). ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభుడు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను?(8)

దీన బంధుర్దయాసింధుస్సుసేవ్యో భక్తవత్సలః | హరిబ్రహ్మాది దేవైశ్చ సుస్తుతః పరమేశ్వరః || 9

పార్వతీనందనస్స్కందః పరమేకః పరంతపః | పరమాత్మా%%త్మదస్స్వామీ సతాం చ శరణార్ధినామ్‌ || 10

దీనానాథ మహేశ శంకరసుత త్రైలోక్యనాథ ప్రభో మాయాధీశ సమాగతో%స్మి శరణం మాం పాహి విప్రప్రియ |

త్వం సర్వప్రభుప్రియో%ఖిల విద్‌ బ్రహ్మాది దేవైస్త్సు తః త్వం మాయాకృతి రాత్మ భక్త సుఖదో రక్షాపరో మాయికః || 11

నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు (9). పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి(10). దీనుల ప్రభువగు మహేశ్వరా! శవపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని . విప్రులు నీకు ప్రిరయమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు (11).

భక్తప్రాణగుణాకరస్త్రిగుణతో భిన్నో%సి శఃభుప్రియః శంభుశ్శంభు సుతః ప్రసన్నసుఖదస్సచ్చిత్స్వరూపో మహాన్‌ |

సర్వజ్ఞస్త్రి పురఘ్న శంకరసుతస్సత్ప్రేమవశ్యస్సదా షడ్వక్త్రః ప్రియసాధు రానతప్రియ స్సర్వేశ్వరశ్శంకరః ||

సాధుద్రోహకరఘ్న శంకరగురో బ్రహ్మాండనాథః ప్రభుః సర్వేషామమరాదిసేవితపదో మాంపాహి సేవాప్రియ || 12

వైరిభయంకర శంకర జనశరణస్య వందే తవ పాదపద్మం సుఖకరణస్య |

విజ్ఞప్తిం మమ కర్ణే స్కంద నిధేహి నిజభక్తిం జన చేతసి సదా విధేహి || 13

భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోయులు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు. సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము (12). శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము (13).

కరోతి కిం తస్య బలీ విపక్షో దక్షో%పి పక్షోభయపార్శ్వగుప్తః |

కిం తక్షకో%ప్యామిష భక్తకో వా త్వం రక్షకో యస్య సదక్ష మానః || 14

వివిధ గురురపి త్వాం స్తోతుమీశో నహి స్యాత్‌ కథమహం స్యాం మందబుద్ధి ర్వరార్చ్య |

శుచిరశుచిరనార్యో యాదృశస్తాదృశో వా పదకమల పరాగం స్కంద తే ప్రార్థయామి || 15

సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు? (14) అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను (15).

హే సర్వేశ్వర భక్తవత్సల కృపాసింధో త్వదీయో%స్మ్యహం భృత్యస్స్వస్య న సేవకస్య గణయస్యాగశ్శతం సత్ర్పభో|

భక్తిం క్వాపి కృతాం మనాగపి విభో జానాసి భృత్యార్తిహా త్వత్తో నాస్త్యపరో%వితా న భగవాన్‌ మత్తో నరః పామరః || 16

కల్యాణ కర్తా కలికల్మషఘ్నః కుబేర బంధుః కరుణార్ద్ర చిత్తః |

త్రిషట్క నేత్రో రస వక్త్ర శోభీ యజ్ఞం ప్రపూర్ణం కురమే గుహ త్వమ్‌ || 17

రక్షకస్త్వం త్రలోకస్య శరణాగతవత్సలః | యజ్ఞ కర్తా యజ్ఞ భర్తా హరసే విఘ్న కారిణామ్‌ || 18

ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు (16) . ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము (17). ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కవలిలగించు వారిని సంహరించెదవు (18).

విఘ్నవారణ సాధూనాం సరర్గకారణ సర్వతః | పూర్ణం కురు మమేశాన సుత యజ్ఞం నమో%స్తు తే || 19

సర్వత్రాతా స్కంద హి త్వం సర్వ జ్ఞాతా త్వమేవ హి | సర్వేశ్వరస్త్వమీశానో నివేశసకలావనః || 20

సంగీతజ్ఞ స్త్వమేవాసి వేదవిజ్ఞః పరః ప్రభుః | సర్వస్థాతా విధాతా త్వం దేవదేవస్సతాం గతిః || 21

భవాని నందన శ్శంభు తనయో వయునస్స్వరాట్‌ | ధ్యాతధ్యేయః పితౄణాం హి పితా యోనిస్సదాత్మనామ్‌ || 22

సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నాయజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక! (19) ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి (21). పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే (22).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య దేవసమ్రాట్‌ శివాత్మజః | స్వగణం వీరబాహ్వాఖ్యం ప్రేషయా మాస తత్కృతే || 23

తదాజ్ఞయా వీరబాహు స్తదన్వేషణహేతవే | ప్రణమ్య స్వామినం బక్త్యా మహావీరో ద్రుతం య¸° || 24

అన్వేషణం చకారాసౌ సర్వబ్రహ్మాండ గోళ##కే | న ప్రాప తమజం కుత్ర శుశ్రావ తదుపద్రవమ్‌ || 25

జగామాథ స వైకుంఠం తత్రాజం ప్రదదర్శ తమ్‌ | ఉపద్రవం ప్రకుర్వంతం గలయూపం మహాబలమ్‌ || 26

బ్రహ్మ ఇట్లు పలికెనున -

దేవ దేవుడగు శివపుత్రుడు ఆతని ఈ మాటను విని వీరబాహుడను పేరు గల తన గణమును ఆతని పనికొరకై పంపెను (23). ఆయన ఆజ్ఞను పొంది మహావీరుడగు వీర బాహుడు భక్తితో ఆ స్వామికి నమస్కరించి మేకను వెదుకుట కొరకై వెంటనే బయులుదేరెను (24). ఆతడు బ్రహ్మండములన్నింటినీ వెదికిననూ ఆ మేక దొరకలేదు. అపుడాతడు ఆ మేక చేసిన అలజడిని వినెను (25). అతడుఅపుడు వైకుంఠమునకు వెళ్లగా అచట అది కనబడెను. మహాబలశాలియగు ఆ మేక మెడలో యూపము వ్రేలాడు చుండెను. అది అలజడిని కలిగించు చుండెను (26).

ధృత్వా తం శృంగయోర్వీరో ధర్షయిత్వాతివేగతః | ఆనినాయ స్వామి పురో వికుర్వంతం రవం బహు || 27

దృష్ట్వా తం కార్తికస్సో%ర మారురోహ స తం ప్రభుః | ధృత బ్రహ్మాండ గరిమా మహాసూతికరో గుహః |7 28

ముహూర్త మాతత్రస్సో%జో బ్రహ్మాండ సకలం మునే | బభ్రామాశ్రమ ఏవాశు

పునస్తత్‌స్ధానమాగతః || 29

తత ఉత్తీర్య స స్వామీ సమువాస స్వమాసనమ్‌ | సో%జస్ధ్సితస్తు తత్రైవ స నారద ఉవాచ తమ్‌ || 30

ఆ వీరుడు దానిని మిక్కిలివేగముగా కొమ్ములయందు పట్టుకొని కూమారస్వామి ఎదుటకు దోడ్కొని వచ్చెను. ఆది పెద్ద ధ్వనిని చేయుచుండెను (27). దానిని చూచి, బ్రహ్మాండమునంతనూ ధరించిన మహిమ గలవాడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడు, గుహశబ్దవాచ్యుడు అగు ఆ కార్తిక ప్రభుడు వెంటనే దానిని అధిరోహించెను (28). ఓ మునీ! ఆ మేక శ్రమ లేకుండగనే ముహూర్తకాలములో బ్రహ్మాండమునంతనూ చుట్ట బెట్టి శీఘ్రముగా మరల అదే స్ధానమునకు వచ్చెను (29). అపుడా స్వామి దాన నుండి దిగి తన ఆసనమునధిష్ఠించెను. ఆ మేక అక్కడనే నిలబడి యుండగా, నాదుడు ఆయనతో నిట్లనెను (30).

నారద ఉవాచ |

నమస్తే దేవ దేవేశ దేహి మే%జం కృపానిధే | కుర్యామధ్వరమానందాత్సఖాయం కురు మామహో || 31

నానదుడిట్లు పలికెను -

ఓ దేవదేవా! నీకు నమస్కారము. ఓ దయానిధీ! నాకు మేకను ఇమ్ము. నేను ఆనందముతో యజ్ఞమును చేసెదను. నన్ను మిత్రునిగా చేసుకొనుము (31

కార్తిక ఉవాచ |

వధయోగ్యో న విప్రాజస్స్వ గృహం గచ్ఛ నరాద | పూర్ణో%స్తు తే%ధ్వరస్సర్వః

ప్రసాదాదేవ మే కృతః || 32

కార్తికుడిట్లు పలికెను -

ఓ విప్రా! మేకను వధించుట తగదు. నారదా! నీ ఇంటికి పొమ్ము. నీ యజ్ఞము నా అనుగ్రహముచే పరిపూర్ణము అగుగాక ! (32)

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య ద్విజస్స్వామి వచనం ప్రీతమానసః | జగామ స్వాలయం దత్త్వా తస్మా ఆశిషముత్తమామ్‌ || 33

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమారఖండే కుమారాద్భుత చరిత

వర్ణనం నామ షష్ఠో%ధ్యాయః (6)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ బ్రాహ్మణుడు ప్రభుని ఈ మాటను విని సంతసించిన మనస్సు గలవాడై ఆయనకు

ఉత్తమమగు ఆశీస్సులనిచ్చి తన గృహమునకు వెళ్ళెను (33).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు కుమారఖండలో కుమారుని అద్భుత చరితమును వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది(6).

Sri Sivamahapuranamu-II    Chapters