Sri Sivamahapuranamu-II    Chapters   

అథ సప్తమో%ధ్యాయః

యుద్ధారంభము

బ్రహ్మోవాచ |

హర్యాదయస్సురాస్తే చ దృష్ట్వా తచ్చరితం విభోః | సుప్రపన్నా బభూవుర్హి విశ్వాసాసక్త మానసాః || 1

వల్గంతః కుర్వతో నాదం భావితాశ్శివ తేజసా | కుమారం తే పురస్కృత్య తారకం హంతు మాయయుః || 2

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు ఆ దేవతలు ప్రభుని ఆ చరితమును గాంచి మిక్కిలి సంతసిల్లిరి. వారి మనస్సులో విశ్వాసము నెలకొనెను (1). శివుని తేజస్సుచే ప్రేరితులైన ఆ దేవతలు కుమారుని ముందిడు కొని గెంతుతూ సింహనాదమును చేయుచూ తారకుని సంహరించుటకు బయలు దేరిరి (2).

దేవానాముద్యమం శ్రుత్వా తారకో%పి మమాబలః | స్తెన్యేన మహతా సద్యో య¸° యోద్దుం సురాన్‌ ప్రతి || 3

దేవా దృష్ట్వా సమాయాంతం తారకస్య మహాబలమ్‌ | బలేన బహుకుర్వంత స్సింహనాదం విసిస్మియుః || 4

తదా నభోంగనా వాణీ జగాదోపరి సత్వరమ్‌ | శంకరప్రేరితా సద్యో హర్యాదీనఖిలాన్‌ సురాన్‌ || 5

దేవతల యుద్ధసన్నాహమును గురించి విన్న మహాబలశాలియగు తారకుడు కూడా వెంటనే పెద్ద స్తెన్యముతో దేవతలు ఉన్నచోటికి బయలు దేరెను (3). తారకుని మహాసైన్యము వచ్చు చుండగా చూచి దేవతలు బలముగా అనేకపర్యాయములు సింహనాదమును చేసిరి. ఆ స్తెన్యమును చూచి వారి ఆశ్చర్యమును పొందిరి (4). అపుడు శంకరునిచే ప్రేరేపింపబడిన ఆకాశవాణి వెంటనే విష్ణువు మొదలగు దేవతలనందరినీ ఉద్దేశించి ఆకసమునుండి ఇట్లు పలికెను (5).

వ్యోమ వాణ్యువాచ |

కుమారం చ పురస్కృత్య సురా యూయం సముద్యతాః | దైత్యాన్‌ విజిత్య సంగ్రామే జయినో%థ భవిష్యథ|| 6

ఆకాశవాణి ఇట్లు పలికెను -

ఓ దేవతలారా! మీరు కుమారుని ఎదుట నిడుకొని యుద్ధమునకు సన్నద్ధులై రాక్షసులను జయించి విజయమును పొందుడు (6).

బ్రహ్మోవాచ |

వాచం తు ఖేచరీం శ్రుత్వా దేవాస్సర్వే సముత్సుకాః | వీరశబ్దాన్‌ ప్రకుర్వంతో నిర్భయా హ్యభవంస్తదా || 7

కుమారం చ పురస్కృత్య సర్వే తే జాతసాధ్వసాః | యోద్ధుకామాస్సురా జగ్ముర్మహీ సాగరసంగమమ్‌ || 8

ఆజగామ ద్రుతం తత్ర యత్ర దేవాస్స తారకః | స్తెన్యేన మహతా సార్ధం సుర్తెర్బహుభిరావృతః || 9

రణదుందుభయో నేదుః ప్రలయాంబుదనిస్స్వనాః | కర్కశాని చ వాద్యాని పరాణి చ తదాగమే || 10

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడా ఆకాశవాణిని విని దేవతలందరు భయమును వీడి ఉత్సాహముతో పరాక్రమ సూచకములగు మాటలను పలికిరి (7). భయమును పొంది యున్న ఆ దేవతలందురు కుమారుని ముందిడుకొని యుద్ధమును చేయగోరి భూమి, సముద్రముల సంగమస్థానమునకు చేరిరి (8). ఆ తారకుడు గొప్ప స్తెన్యముతో గూడి దేవతలు ఉన్న స్థలమునకు శీఘ్రముగా వచ్చెను. ఆ స్థలమంతయూ దేవతలతో నిండియుండెను (9). ఆ స్తెన్యము రాగానే ప్రళయకాలమునందలి మేఘములవలె ధ్వని చేయు యుద్ధదుందుభులు, కర్ణ కఠోరమగు ఇతరవాద్యములు మ్రోగజొచ్చెను (10).

గర్జమానాస్తదా దైత్యాస్తారకేణాసురేణ హ | కంపయంతో బువం పాదక్రమై ర్వల్గున కారకాః || 11

తచ్ర్ఛత్వా రవమత్యుగ్రం సర్వే దేవా వినిర్భయాః | ఐక్యపద్యేన చోత్తస్థు ర్యోద్ధు

కామాశ్చ తారకమ్‌ || 12

గజమారోప్య దేవేంద్రః కుమారం హ్యగ్రతో%భవత్‌ | సురస్తెన్యేన మహతా లోకపాల్తెస్సమావృతః || 13

తదా దుందుభయో నేదుర్భేరీతూర్యాణ్యనేకశః | వీణా వేణు మృదంగాని తథా గంధర్వనిస్స్వనాః || 14

అపుడు తారకాసురునితో సహా రాక్షసులు గర్జిస్తూ గెంతజెచ్చిరి. వారి గెంతులకు భూమి కంపించెను (11). ఆ మిక్కిలి భయంకరమగు శబ్దము విని దేవతలందరు

నిర్భయులై తారకునితో యుద్దమును చేయగోరి ఒక్కుమ్మడిగా లేచి నిలబడిరి (12). దేవేంద్రుడు కుమారుని ఏనుగుపై ఎక్కించి, లోకపాలురతో మరియు దేవతల పెద్ద స్తెన్యముతో గూడి ముందు నడిచెను (13). అపుడుదుందుభులు, అనేక విధముల భేరీలు, తూర్యములు, వీణలు, వేణువులు, మద్దెలలు మ్రోగినవి. గంధర్వులు పాడజొచ్చిరి (14).

గజం దత్త్వా మహేంద్రాయ కుమారో యనామారుహత్‌ | అనేకాశ్చర్యసంభూతం నానారత్నసమన్వితమ్‌ || 15

విమాన మారుహ్య తదా మహాయాశః స శాంకరిస్సర్వగుణౖరుపేతః |

శ్రియా సమేతః పరయా బభౌ మహాన్‌ సంవీజ్య మానశ్చమరైర్మహాగ్ర భౌః || 16

ప్రాచేతసం ఛత్ర మతీవ సుప్రభం రత్నై రుపేతం వివిధైర్విరాజితమ్‌ |

ధృతం తదా తచ్చ కుమార మూర్ధ్నివై హ్యనంత చాంద్రైః కిరాణౖర్మహాప్రభైః || 17

కుమారుడు ఏనుగును ఇంద్రునకిచ్చి, అనేక వింతలతో గూడినది, నానావిధ రత్నములచే పొదగబడినది అగు విమానము నధిష్ఠించెను (15). గొప్ప కీర్తి గలవాడు, సర్వ సద్గుణ సంపన్నుడు, శోభా యుక్తుడు అగు ఆ శంకరపుత్రుడు విమానము నధిష్ఠించెను. అపుడు గొప్ప ప్రకాశము గల వింజామరలచే వీచు చుండా ఆ మహాత్ముడు గొప్పగా ప్రకాశించెను (16) మిక్కిలి శోభ గలది, రత్నములతో పొదిగినది అగు వరుణచ్ఛత్రమును కుమారుని శిరస్సుపై పట్టిరి. అపుడా ఛత్రము చంద్రకిరణముల వంటి గొప్ప కాంతులను అనంతముగా వెదజల్లెను (174).

మిలితాస్తే తదా సర్వే దేవాశ్శక్రపురోగమాః | సై#్వ స్స్వెర్బలైః పరివృతా యుద్ధ కామా మమాబలాః | 18

ఏవం దేవాశ్చ దైత్యాశ్చ యోద్ధుకామాస్ధ్సితా భువి | స్తెన్యేన మహతా తేన వ్యూహం కృత్వా పృథక్‌ పృథక్‌ || 19

తే సేనే సురదైత్యానాం శుశుభాతే పరస్పరమ్‌ | హంతుకామే తదాన్యోన్యం స్తూయమానే చ బందిభిః || 20

ఉభే సేనే తదా తేషామగర్జేతాం వనోపమే | భయంకరే%త్యవీరాణామితరేషాం సుఖావహే || 21

అపుడు ఇంద్రాది దేవతలందరు తమ తమ స్తెన్యములతో గూడి యుద్దమును చేయు కోరికతో ఒక చోట చేరిరి. మహాబలశాలురగు (18) దేవతలు, రాక్షసులు ఈ విధముగా యుద్ధమును చేయు కోరికతో భూమిపై నిలబడి యుండిరి. వారు తమ మహస్తెన్యములను వేర్వేరు వ్యూహములలో తీర్చిదిద్దిరి (19). స్తోత్రపాఠకులచే స్తుతింపబడుచున్న ఆ దేవదానవ స్తెన్యములు పరస్పరము సంహరించు కోరిక గలవై ఆ సమయములో విరాజిల్లినవి (20). వీరులు కాని వారికి మహాభయమును, వీరులకు ఆనందమును కలిగించు, ఆరణ్యముల వలె వ్యాపించియున్న ఆ రెండు సేనలు అపుడు గర్జించినవి (21).

ఏతస్మిన్నంతరే తత్ర బలోన్మత్తాః పరస్పరమ్‌ | దైత్యా దేవా మహావీరా యుయుధుః క్రోధవిహ్వాలాః || 22

అనీత్సు తుములం యుద్ధం దేవదైత్య సమాకులమ్‌ | రుండముండాంకితం సర్వం క్షణన సమపద్యత || 23

భూమౌ నిపతితాస్తత్ర శతశో%థ సహస్రశః | నికృత్తాంగా మహాశ##సై#్రర్నిహతా వీర సంమతాః || 24

కేషాంచిద్బాహవశ్ఛిన్నాః ఖడ్గ పాతై స్సుదారుణౖః | కేషాంచి దూరవశ్ఛిన్నా వీరాణాం మానినాం మృధే || 25

అపుడచట మహావీరులు, బలముచే మదించి యున్నవారు, క్రోధముతో మండిపడు చున్నవారునగు దేవదానవులు ఒకరితో నొకరు యుద్దమను చేయ మొదలిడిరి (22). దేవదానవులకు భయంకరమగు యద్ధము ఆరంభమయ్యెను. అచటి ప్రదేశమంతయూ క్షణములో మొండెములతో తలలతో నిండెను (23). అపుడు వేలాది వీరులు గొప్ప ఆయుధములచే తెగకొట్ట బడిన అవయవములు గలవారై నేల గూలిరి (24). భయంకరమగు కత్తి వ్రేటులచే కొందరి చేతులు తెగినవి. ఆ యుద్ధములో వీరాభిమానము గల మరికొందరి వీరుల తొడలు తెగినవి (25).

కేచిన్మథితసర్వాంగా గదాభిర్ముద్గరై స్తథా | కేచిన్నిర్భిన్నహృదయాః పాశైర్భల్లెశ్చ పాతితాః || 26

కేచిద్విదారితాః పృష్ఠే కుంత్తెర్‌ బుష్టిభిరంకుశైః | ఛిన్నాన్యపి శిరాంస్యేవ పతితాని చ భూతలే || 27

బహూని చ కబంధాని నృత్యమానాని తత్ర వై | వల్గ మానాని శతశ ఉద్యతాస్త్ర కరాణి చ || 28

నద్యః ప్రవర్తితాస్తత్ర శతశో%సృఙ్‌ వహాస్తదా | భూతప్రేతాదయస్తత్ర శతశశ్చ సమాగతాః || 29

కొందరు గదలచే, ముద్గరములచే సర్వావయములు మథితము కాగా నేలగూలిరి. మరికొందరు పాశములచే, భల్లములచే పగిలిన హృదయములతో, కత్తులతో, అంకుశములతో చీల్చి వేయబడిరి. తెగిన తలలు నేలపై పడుచుండెను (27). ఆ యుద్ధరంగములో వందలాది మొండెములు చేతులలో ఆయుధములనను ధరించి గెంతుతూ నాట్యమాడెను (28). వందలాది రక్త ప్రవాహములు నిర్మాణమయ్యెను. వందలాది భూతములు, ప్రేతములు మొదలగునవి అచటకు చేరుకొనెను (29).

గోమాయవశ్శివాస్తత్ర బక్షయంతః పలం బహు | తతా గృధ్రవటా శ్యేనా వాయసా మాంసభక్షకాః ||

బుభుజుః పతితానాం చ పలాని సుబహూని వై || 30

ఏతస్మిన్నంతరే తత్ర తారకాఖ్యో మహాబలః | స్తెన్యేన మహతా సద్యో య¸° యోద్ధుం సురాన్‌ ప్రతి || 31

దేవా దృష్ట్వా సమాయాంతం తారకం యుద్ధ దుర్మదమ్‌ | యోద్ధుకామం తదా సద్యో యయు శ్శక్రాదయస్తదా |

బభూవాథ మహోన్నాదస్సేనయోరుభయోరపి ||

మాంసమును బక్షిస్తూ నక్కలు అచట విహరించెను. మరియు గ్రద్దలు, రాబందులు, మాంసమును భక్షించే కాకులు నేల గూలిన వారి శరీరములనను భక్షించెను (30). ఇంతలో మహాబలుడగు తారకుడు పెద్ద స్తెన్యముతో దేవతలపై యుద్ధము కొరకు వచ్చెను (31). ఇంద్రాది దేవతలు కూడా అతిశయించిన యుద్ధ గర్వము గల తారకుడు యుద్ధము చేయు కోరికతో వచ్చుచుండుటను గాంచి వెంటనే సన్నద్ధులైరి. అపుడు రెండు స్తెన్యముల యందు పెద్ద నాదము బయల్వెడలెను (32).

అథాభూద్ద్వం ద్వయుద్ధం హి సురాసుర విమర్దనమ్‌ | యం దృష్ట్వా హర్షితా వీరాః క్లీబాశ్చ భయమాగతాః || 33

తారకో యుయుధే యుద్ధే శ##క్రేణ దితిజో బలీ | అగ్నినా సహ సంహ్రాదో జంభేనైవ యమస్స్వయమ్‌ ||34

మహాప్రభుర్నైర్‌ బుతేన పాశీ సహ బలేన చ | సువీరో వాయునా సార్ధం పవమానేన గుమ్యరాట్‌ || 35

ఈశానేన సమం శంభుర్యుయుధే రణవిత్తమః | శుంభ##శ్శేషేణ యుయుధే కుంభశ్చంద్రేణ దానవః || 36

తరువాత దేవదానవుల మధ్య వినాశకరమగు ద్వంద్వ యుద్ధము జరిగెను. దానిని చూచి వీరులు ఆనందించిరి. వీరులు కానివారు భయపడిరి (33). ఆ యుద్ధములో బలవంతుడగు తారకాసురుడు ఇంద్రునితో, సంహ్రాదుడు అగ్నితో, జంభుడు యమునితో (34). మహాప్రభుడు న్తెరృతునితో, బలుడు వరుణునితో, సువీరుడు వాయువుతో, పవమానుడు కుబేరునితో (35). రణవిద్యావిశారదుడగు శుంభుడు ఈశానునితో, శుంభుడు శేషునితో, కుంభాసురుడు చంద్రునితో యుద్ధమును చేసిరి (36).

కుంబరో మిహిరేణాజౌ హమహాబల పరాక్రమః | యుయుధే పరమాసై#్త్రశ్చ నానాయుద్ధవిశారదః || 37

ఏవం ద్వంద్వేన యుద్ధేన మహతా చ సురాసురాః | సంగరే యుయుధుస్సర్వే బలేన కృతనిశ్చయాః || 38

అన్యోన్యం స్పర్ధ మానాస్తే %మరా దైత్యా మహాబలాః | తస్మిన్‌ దేవాసురే యుద్ధే దుర్జయా అభవన్మునే || 39

మహాబలుడు, పరాక్రమశాలి, అనేకక యుద్ధముల పాండిత్యము గలవాడునగు కుంబరుడు ఆ సంగ్రాముములో మిహిరునితో పోరాడెను (37). దృఢమగు నిశ్చయము గల దేవదానవులు ఈ తీరున ఆ సంగ్రామములో బలమును ప్రదర్శించి గొప్ప ద్వంద్వయుద్ధమును చేసిరి (38). ఓ మునీ! ఆ దేవాసుర సంగ్రామములో మహాబలురగు దేవతలు, దానవులు ఒకరిని మించి మరియొకరు పోదాడిరి. కాని ఒకరినొకరు జయించలేక పోయిరి (39).

తదా చ తేషాం సురదానవానాం బభూవ యుద్ధం తుములం జయైషిణామ్‌ 7

సుఖావహం వీర మనస్వినాం వై భయావహం చైవ తథేతరేషామ్‌ || 40

మహీ మహారౌద్రతరా విష్టకైః సురాసురైర్వై పతితై రనేకశః |

తస్మిన్నగమ్యాతి భయానకా తదా జాతా మహాసౌఖ్యవహా మనస్వినామ్‌ || 41

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం కుమారఖండే యుద్ధ ప్రారంభ వర్ణనం నామ సప్తమో%ధ్యాయః (7).

అపుడు జయమును గోరు ఆ దేవదానవులకు తుముల (పక్షముల తేడా తెలియని) యుద్ధము జరిగెను. అభిమానవంతులగు వీరులకు ఆనందమును కలిగించు ఆ యుద్ధము ఇతరులకు భయమును గొల్పెను (40). వేలాదిగా నేలగూలిన దేవదానవులతో భూమి మిక్కిలి భయంకరముగా నుండి, అడుగు పెట్టుటకు చోటు లేకుండెను. అయిననూ వీరులకు మహాసౌఖ్యమే కలిగెను (41).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమార ఖండలో యుద్ధ ప్రారంభ వర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

Sri Sivamahapuranamu-II    Chapters