Sri Sivamahapuranamu-II    Chapters   

అథ నవమో%ధ్యాయః

దేవాసుర సంగ్రామము

బ్రహ్మోవాచ |

దేవ దేవ గుహ స్వామిన్‌ శాంకరే పార్వతీసుత | న శోభ##తే రణో విష్ణుతారకాసురయోర్వృథా || 1

విష్ణునా నహి వధ్యో%సౌ తారకో బలవానతి | మయా దత్తవరస్తస్మాత్సత్యం సత్యం వదామ్యహమ్‌ || 2

నాన్యో హంతాస్య పాపస్య త్వాం వినా పార్వతీసుత | తస్మాత్త్వయా హి కర్తవ్యం వచనం మే మహాప్రభో || 3

సన్నద్ధో భవ దైత్యస్య వధాయాశు పరంతప | తద్వధార్థం సముత్పన్న శ్శంకరాత్త్వం శివాసుత || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవా! గుహా! స్వామీ! పార్వతీ పరమేశ్వర సుతా! వ్యర్తమగు ఈ విష్ణుతారకుల యుద్ధము శోభించుట లేదు (1). అతిబలవంతుడగు ఈ తారకుడు విష్ణువు చేతిలో మరణించడు. నేను వానికి వరమునిచ్చితిని. అందువలననే ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (2). ఓ పార్వతీ పుత్రా! నీవు తక్క మరియొకరు ఈ పాపిని సంహరించలేరు. ఓ మహాప్రభూ! కావున నీవు నా మాటను నిలబెట్టుము (3). శత్రువలను తపింపజేయు పార్వతీపుత్రా! ఆ రాక్షసుని వధించుటకు నీవు సంసిద్ధుడవు కమ్ము. నీవు వాని వధకొరకై శంకరుని నుండి జన్మించితివి (4).

రక్ష రక్ష మహావీర త్రిదశాన్‌ వ్యథితాన్‌ రణ | న బాలస్త్వం యువా నైవ కిం తు సర్వేశ్వరః ప్రభుః || 5

శక్రం పశ్య తథా విష్ణుం వ్యాకులం చ సురాన్‌ గణాన్‌ | ఏనం జహి మమాదైత్యం త్రైలోక్యం సుఖినం కురు || 6

అనేన విజిత శ్చేంద్రో లోకపాలైః పురా సహ | విష్ణుశ్చాపి మమావీరో తర్జితస్తపసో బలాత్‌ || 7

త్రైలోక్యం నిర్జితం సర్వమసురేణ దురాత్మనా | ఇదానీం తవ సాన్నిధ్యాత్పునర్యుద్ధం కృతం చ తైః || 8

మహావీరా! యుద్ధము నందు వ్యథను పొందియున్న దేవతలను రక్షేంచుము. నీవు బాలుడవు గాని, యువకుడవు గాని కావు. నీవు సర్వేశ్వరుడవు, ప్రభుడవు (5). ఆదుర్దా పడు చున్న ఇంద్రుని, విష్ణువును, దేవతలను, మరియు గణములను చూడుము. ఈ మహా రాక్షసుని సంహరించి ముల్లోకములకు సుఖమును కలుగజేయుము (6). వీడు ఇంద్రుని, మరియు లోకపాలకులను జయించినాడు. వీడు తపోబలముచే మహావీరుడగు విష్ణువును కూడ బెదిరించినాడు (7). దుష్టుడగు ఈ రాక్షసుడు మల్లోకములను జయించినాడు. ఇపుడు నీవు ప్రక్కన ఉండుటచే వారు ఆతనితో యుద్ధమునకు దిగినారు (8).

తస్మాత్త్వయా నిహంతవ్యస్తారకః పాపపూరుషః | అన్యవధ్యో న చైవాయం మద్వరాచ్ఛంకరాత్మజ || 9

ఇతి శ్రుత్వా మమ వచః కుమారశ్శంకరాత్మజః | విజహాస ప్రసన్నాత్మా తథాస్త్వితి వచో%బ్రవీత్‌ || 10

వినిశ్చిత్యాసురవధం శాంకరిస్స మహాప్రభుః | విమానాదవతీర్యాథ పదాతిరభవత్తదా || 11

పద్భ్యాం తదాసౌ పరిధావమానో రేజే%తి వీరశ్శివజః కుమారః |

కరే సమాదాయ మహాప్రభాం తాం శక్తిం మహోల్కా మివ దీప్తి దీప్తామ్‌ || 12

ఓ శంకరపుత్రా! కావున నీవు పాపాత్ముడగు తారకుని సంహరించవలెను. వీడు ఇతరుల చేతిలో మరణించకుండునట్లు నేను వరమును ఇచ్చితిని (9). శంకరపుత్రుడగు కుమారుడు నా ఈ మాటను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై నవ్వి 'అటులనే అగుగాక!' అని పలికెను (10). మహా ప్రభుడగు ఆ శంకర పుత్రుడు రాక్షసుని సంహరింప నిశ్చయించి మిమానము నుండి దిగి పాదచారిఆయెను (11). మహావీరుడు, శివపుత్రుడు అగు కుమారుడు పెద్ద ఉల్క వలె గొప్ప కాంతులను విరజిమ్ముచున్న శక్తిని చేతబట్టి ఇటునటు వేగముగా నడచుచూ విరాజిల్లెను (12).

దృష్ట్వా తమాయాంత మతి ప్రచండం అవ్యాకులం షణ్ముఖమప్రమేయమ్‌ |

దైత్యో బభాషే సురసత్తమాన్‌ స కుమార ఏష ద్విషతాం ప్రహంతా || 13

అనేన సాకం హ్యహమేకవీరో యోత్స్యే చ సర్వానహమేవ వీరాన్‌ |

గణాంశ్చ సర్వానపి ఘాతయామి సలోకపాలాన్‌ హరినాయకాంశ్చ || 14

ఇత్యేవముక్త్వా స తదా మహాబలః కుమారముద్దిశ్య య¸° చ యోద్ధుమ్‌ |

జగ్రాహ శక్తిం పరమాద్భుతాం చ స తారకో దేవవరాన్‌ బభాషే ||

మిక్కిలి భయంకరాకారుడు, కంగారు లేనివాడు, ఆరు మోములవాడు, ఇంతటివాడు అని చెప్ప వీలుకానివాడు అగు ఆతడు వచ్చుచుండగా చూచి ఆ రాక్షసుడు దేవతలతో నిట్లనెను : ఈతడు శత్రుసంహారకుడగు కుమారుడు (13). ఏకైక వీరుడనగు నేను ఈతనితో యుద్ధమును చేసెదను. వీరులనందరినీ, మరియు సర్వగణములను, లోకపాలకులను, హరి మొదలగు నాయకులను సంహరించెదను (14). మహాబలుడగు ఆతడు అపుడు ఇట్లు పలికి యుద్ధము చేయుట కొరకు కుమారుని వైపునకు వెళ్లెను. ఆ తారకుడు మహాద్భుతమగు శక్తిని చేతబట్టి నిట్లనెను (15).

తారక ఉవాచ |

కుమారో మే%గ్రతశ్చాద్య భవద్భిశ్చ కథం కృతః | యూయం గత త్రపా దేవా విశేషాచ్ఛక్రమేశ్వరౌ || 16

పురైతాభ్యాం కృతం కర్మవిరుద్ధం వేదమార్గతః | తచ్ఛృణుధ్వం మయా ప్రోక్తం వర్ణయామి విశేషతః ||17

తత్ర విష్ణుశ్ఛలీ దోషీ హ్యవివేకీ విశేషత ః | బలిర్యేన పురా బద్ధశ్ఛల మాశ్రిత్య పాపతః || 18

తేనైవ యత్నతః పూర్వమసురౌ మధుకైటభై | శిరోహీనౌ కృతౌ ధౌర్త్యాద్వేదమార్గే వివర్జతః || 19

తారకుడిట్లు పలికెను -

మీరు నా యెదుటకు ఇప్పుడు కుమారుని ఎట్లు పంపగల్గితిరి? ఓ దేవతలారా! మీరు సిగ్గు లేనివారు. ఇంద్రవిష్ణువులు అసలేసిగ్గులేనివారు (16). వీరిద్దరు పర్వము వేదమార్గ విరుద్ద మగు కర్మను చేసినారు. నేను దానిని విశేషముగా వర్ణించెదను. వినుడు (17). వారిద్దరిలో విష్ణువు విశేషించి మోసగాడు, దోషి, వివేకము లేనివాడు. అతడు పూర్వము పాపమార్గములో మోసము చేసి బలిని బంధించినాడు (18). వేదమార్గ విహీనుడగు నాతడు పూర్వము మధుకైటభులను రాక్షసులను మోసముచే శిరస్సుల నపహరించి సంహరిచినాడు (19).

మోహినీరూపతో%నేన పంక్తిభేదః కృతో పి వై | దేవా సుర సుధాపానే వేదమార్గో విగర్హితః ||20

రామో భూత్వా మతా నారీ వాలీ విధ్వంసితో హి సః | పునర్త్వె శ్రవణోవిప్రో హతో నీతిర్హతా శ్రుతేః || 21

పాపం విని స్వకీయా స్త్రీ త్యక్తా పాపరతేన యత్‌ | తత్రాపి శ్రుతిమార్గశ్చ ధ్వంసితస్స్వార్థ హేతవే || 22

స్వ జనన్యాశ్శిరశ్ఛిన్న మవతారే రసాఖ్యకే | గరుపుత్రాపమానశ్చ కృతో %నేన దురాత్మనా || 23

దేవదానవులు అమృతపానము చేసే సందర్భములో ఈతడు మోహినీరూపమును దాల్చి పంక్తి భేదమును చేసి వేదమార్గమును కళంకితము చేసినాడు (20). ఇతడు రాముడై స్త్రీని చంపి, వాలిని వధించి, మరియు బ్రాహ్మణుడగు రావణుని చంపి వైదిక నీతిని చెడగొట్టినాడు (21). ఈతడు స్వార్ధము కొరకు పాపియై ఏ పాపము నెరుంగని ఇల్లాలిని విడనాడి వేదమార్గమును ధ్వంసము చేసినాడు(22). ఇతడు పరశు రామావతారములో తన తల్లి యొక్క తలను నరకినాడు. ఈ దుష్టుడు గురుపుత్రుని అవమానించినాడు (23).

కృష్నో భూత్వాన్య నార్యశ్చ దూషితాః కులధర్మతః | శ్రుతిమార్గం పరిత్యజ్య స్వవిహహాః కృతాస్తథా || 24

పునశ్చ వేదమార్గో హి నిందితో నవమే భ##వే | స్ధాపితం నాస్తికమతం వేదమార్గ విరోధకృత్‌ || 25

ఏవం యేన కృతం పాపం వేదమార్గం విసృజ్య వై | స కథం విజయేద్యుద్ధే బవేద్ధర్మ వతాం వరః |7 26

భ్రాతా జ్యేష్ఠశ్చ యస్తస్య శక్రః పాపీ మహాన్‌ మతః | తేన పాపాన్యనేకాని కృతాని నిజహేతుతః || 27

ఈతడు కృష్ణుడై వేదమార్గములను విడనాడు ఇతరస్త్రీలకు కులధర్మమును చెడగొట్టి తాను వివామమాడినాడు (24). మరల తొమ్మిదవ అవతారములో వేదమార్గమునను విరోధించే నాస్తిక మతమును స్థాపించి వేదమార్గమును నిందించినాడు (25). ఈ విధముగా ఎవడైతే వేదమార్గమును వీడి పాపమును చేసినాడో, అట్టివాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడుగా పరిగణింపబడుచున్నాడు. అట్టివాడు యుద్ధములో విజయమునెట్లు పొందును? 926). ఆతని పెద్ద అన్నగారు, పాపాత్ముడు అగు ఇంద్రుడు మహాత్మునిగా పరిగణింపబడు చున్నాడు. వాడు స్వార్థము కొరకై అనేక పాపములను చేసియుండెను (27).

నికృత్తో హి దితేర్గర్భ స్స్వార్థ హేతో ర్విశేషతః | ధర్షితా గౌతమస్త్రీ వై హతో వృత్రశ్చ విప్రజః || 28

విశ్వరూపద్విజాతేర్వై బాగినేయస్య యద్గురోః | నికృత్తాని శీర్షాని తదధ్వా ధ్వంసితశ్శుతేః || 29

కృత్వా బహూని పాపాని హరిశ్శక్రః పునః పునః | తేజోభిర్విమతావేవ నష్ట వీర్యౌ విశేషతః || 30

తయోర్బలేన నో యూయం సంగ్రామే జయమాప్స్యథ | కిమర్థం మూఢతాం ప్రాప్య ప్రాణాంస్త్యక్తుమిహాగతాః || 31

ఇతడు పచ్చి స్వార్థమును గోరి దితి గర్భమును నరికినాడు. గౌతముని భార్యను చెడగొట్టి, బ్రాహ్మణవంశములో పుట్టిన వృత్రుని సంహరించినాడు (28). బ్రాహ్మాణుడు, సోదరియొక్క కుమారుడు, గురువు అగు విశ్వరూపుని తలలను నరికి ఈతడు వేదమార్గమును భ్రష్టమొనర్చినాడు (29). ఇంద్రుడు, విష్ణువు అనేక పర్యాయములు అనేక పాపములను చేసి తేజస్సును, పరాక్రమమును పూర్తిగా పోగొట్టుకొనిరి (30). మీరు వారిద్దరి బలముతో యుద్ధములో విజయమును పొందజాలరు. మీరు మూర్ఖులై ప్రాణములను పోగొట్టు కొనుటకు ఇచటకు ఏల వచ్చితిరి ? (31)

జానంతౌ ధర్మమేతౌ న స్వార్థలంపటమానసౌ | ధర్మం వినా%మరాః కృత్యం నిష్ఫలం సకలం భ##వేత్‌ || 32

మహాధృష్టామౌ మే%ద్య కృతవంతౌ పురశ్శిశుమ్‌ | అహం బాలం వధిష్యామి తయోస్సో%పి భవిష్యతి || 33

కిం బాల ఇతో యాయాద్దూరం ప్రాణపరీప్సయా | ఇత్యుక్త్వోద్దిశ్య చ హరీ వీరభద్రమువాచ సః || 34

పురా హతాస్త్వయా విప్రా దక్షయజ్ఞే హ్యనేకశః | తత్కర్మణః ఫలం చాద్య దర్శయిష్యామి తే%నఘ || 35

స్వార్థముచే కలుషితమైన మనస్సు గల వీరిద్దరు ధర్మమునెరుంగరు. ఓ దేవతలారా! ధర్మ విహీనమైన కార్యములన్నియూ నిష్ఫలముగు (32). మిక్కిలి గర్వితతులైన వీరిద్దరు ఈనాడు శిశువును నా ఎదుట ఉంచినారు. నేనీ శిశువును వధించెదను. ఆ పాపమును కూడ వారిద్దరూ పొందగలరు (33). ప్రాణమలను రక్షించు కొన గోరి ఈ బాలుని ఇంత దూరము తీసుకొని వచ్చితిరా? అని ఇంద్ర విష్ణువులతో పలికి, ఆతడు వీరభద్రునితో నిట్లనెను (34). నీవు పూర్వము దక్ష యజ్ఞములో అనేక విప్రులను సంహరించితివి. ఓ పుణ్యాత్మా! ఆ కర్మ యొక్క ఫలములను నీకీనాడు చూపించెదను (35).

బ్రహ్మోవాచ |

ఇత్యేవముక్త్వా తు విధూయ పుణ్యం నిజం తన్నిందన కర్మణా వై |

జగ్రహ శక్తిం పరమాద్భుతాం చ స తారకో యుద్ధవతాం వరిష్ఠః || 36

తం బాలాంతిక మాయాంతం తారకాసురమోజసా | ఆజఘాన చ వజ్రేణ శక్రో గుహపురస్సరః || 37

తేన వజ్రప్రహారేణ తారకో జర్జరీకృతః | భౌమౌ పపాత సహసా నిందాహతబలః క్షణమ్‌ || 38

బ్రహ్మ ఇట్లుపలికెను -

ఆతడిట్లు పలికి వారిని నిందించుట వలన తన పుణ్యమును పోగొట్టు కొనెను. యుద్దవీరులలో శ్రేష్ఠుడగు ఆ తారకుడు అత్యద్భుతమగు శక్తిని చేతబట్టెను (36). ఇంద్రుడు గుహుని ముందిడుకొని ఆ బాలుని సమీపమునకు వచ్చుచున్న తారకాసురుని బలముగా వజ్రముతో కొట్టెను (37). నిందచే నష్టమైన బలము గల ఆ తారకుడు ఆ వజ్రపు దెబ్బచే శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే క్షణకాలము నేలపై బడెను(38).

పతితో%పి సముత్థాయ శక్త్యా తం ప్రాహరద్రుషా | పురందరం గజస్థం హి పాతయా మాస భూతలే || 39

హాహాకారో మహాసీత్పతితే చ పురందరే | సేనాయాం నిర్జరాణాం హి తద్దృష్ట్వా క్లేశ ఆవిశత్‌ || 40

తారకేణాపి తత్రైవ యత్కృతం కర్మ దుఃఖదమ్‌ | స్వనాశకారణం ధర్మ విరుద్ధం తన్నిబోధ మే || 41

పతితం చ పదాక్రమ్య హస్తాద్వజ్రం ప్రగృహ్యవై | పునరుద్వజ్రఘాతేన శక్రమాతాడయద్భృశమ్‌ || 42

ఆతడు క్రిందపడిననూ మరల పైకి లేచి ఏనుగుపై నున్న ఆ ఇంద్రుని కోపముతో శక్తితో కొట్టి నేలపై బడవేసెను (39). ఇంద్రుడు పడుటను గాంచిన దేవసేనలో పెద్ద హాహాకారము బయల్వెడలెను. దేవతలను దుఃఖము ఆవేశించెను (40). తారకుడా సమయములో దుఃకము నిచ్చునది, తన నాశమునకు హేతవు అయినది, ధర్మమునకు విరుద్ధమైనది అగు కర్మను ఆచరించినాడు. దానిని నేను చెప్పెదను. తెలుసుకొనుము(41). పడియున్న ఇంద్రుని ఆతడు కాలితో తన్ని వజ్రమును చేతినుండి లాగుకొని దానితో మిక్కుటముగా ఆతనిని కొట్టెను (42).

ఏవం తిరస్కృతం దృష్ట్వా శక్రం విష్ణుః ప్రతాపవాన్‌ | చక్రముద్యమ్య భగవాంస్తారకం స జఘాన హ || 43

చక్రప్రహారాభిహతో నిపపాత క్షితౌ మి సః | పురుత్థాయ దైత్యేంద్ర శ్శక్త్యా విష్ణుం జఘాన తమ్‌ || 44

తేన శక్తి ప్రహారేణ పతితో భువి చాచ్యుతః | హాహాకారో మమానాసీచ్చుక్రుశుశ్చాతి నిర్జరాః |7 45

నిమేషేణ పునర్విష్ణు ర్యావదుత్తిష్ఠతే స్వయమ్‌ | తావత్స వీరభద్రో హి తత్‌క్షణా దాగతో%సురమ్‌ || 46

ఈ విధముగా ఇంద్రుడు అవమానింపబడుటను గాంచి ప్రతాపశీలుడగు విష్ణు భగవానుడు చక్రమును పైకెత్తి తారకుని కొట్టెను(43). చక్రముతో గొట్టిన దెబ్బకు అతడు నేలపై బడెను. కాని ఆ రాక్షసరాజు మరల లేచి శక్తితో విష్ణువును కొట్టెను (44). ఆ శక్తి యొక్క దెబ్బకు అచ్యుతుడు నేలపై బడెను. అపుడు దేవతలు పెద్ద హాహాకారముతో అధికముగా ఆక్రోశించిరి (45). కాని ఒక నిమేషకాలములో విష్ణువు స్వయముగా లేచి నిలబడెను. ఇంతలో వీరభద్రుడు తత్‌క్షణమే రాక్షసుని పైకి వెళ్లెను (46).

త్రిశూలం చ సముద్యమ్య వీరభద్రః ప్రతాపవాన్‌ | తారకం దితిజాధీకం జఘాన ప్రసభం బలీ || 47

తత్త్రిశూల ప్రహారేణ స పపాత క్షితౌ తదా | పతితో%పి మహాతేజాస్తారకః పునరుత్థితః || 48

కృత్వా క్రోధం మహావీరస్సకలాసురనాయకః | జఘాన పరయా శక్త్యా వీరభద్రం తదోరసి || 49

వీరభద్రో%పి పతితో భూతలే మూర్ఛితః క్షణమ్‌ | తచ్ఛక్త్యా పరయా క్రోధాన్నిహతో వక్షసి ధ్రువమ్‌ || 50

ప్రతాపశాలి, బలవంతుడు అగు వీరభద్రుడు త్రిశూలమునెత్తి రాక్షసరాజగు తారకుని గట్టిగా కొట్టెను (47). అపుడాతడు ఆ త్రిశూలపు దెబ్బచే నేలపై బడెను. మహాతేజశ్శాలియగు తారకుడు క్రింద బడిననూ మరల లేచి నిలబడెను (48). మహావీరుడు, సమస్త రాక్షసులకు నాయకుడు అగు తారకుడు కోపించి అపుడు గొప్ప శక్తితో వీరభద్రుని వక్షస్థ్సలముపై గొట్టెను (49). ఆ గొప్ప శక్తిచే క్రోధముతో వక్షస్థ్సలము నందు బలముగా కొట్టబడిన వీరభద్రుడు క్షణకాలము మూర్ఛిల్లి నేలపై బడెను (50).

సగణాశ్చైవ దేవాస్తే గంధర్వోరగరాక్షసాః | హాహాకారేణ మహతా చుక్రుశుశ్చ ముహుర్ముహుః || 51

నిమేషు మాత్రాత్సహసా మహౌజాః స వీరభద్రో ద్విషతాం నిహంతా |

త్రిశూలముద్యమ్య తడిత్ప్రకాశం జాజ్వల మానం ప్రభయా విరేజే || 52

గణములు, దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు కూడా పెద్ద హాహాకారములను చేసి అనేక పర్యాయములు ఆక్రోశించిరి(51). గొప్ప బలశాలి, శత్రునాశకుడు అగు ఆ వీరభద్రుడు క్షణకాలములో లేచి మెరుపు వలె ప్రకాశిస్తూ నిప్పులను వెదజల్లే త్రిశూలమును చేత బట్టి విరాజిల్లెను (52).

స్వరోచిషా భాసితదిగ్వితానం సూర్యేందు బింబాగ్ని మండలమ్‌ |

మహాప్రభం వీరభయావహం పరం కాలాఖ్య మత్యంతకరం మహోజ్జ్వలమ్‌ || 53

యావత్త్రిశూలేన తదా హంతుకామో మహాబలః | వీరభద్రో%సురం యావత్కుమారేణ నివారితః || 54

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే దేవాసుర యుద్ధ వర్ణనం నామ నవమో%ధ్యాయః (9).

ఆ త్రిశూలము తన కాంతులచే దిక్కులన్నిటినీ ప్రకాశింప జేయుచూ సూర్యచంద్ర బింబములవలె, అగ్ని మండలమువలె గొప్ప ప్రభలు గలదై, ప్రళయ కాలాగ్ని వలె మహో జ్వలముగా నున్నదై వీరులకు గొప్ప భయమును కలిగించెను (53). మహాబలుడగు వీరభద్రుడు త్రిశూలముతో ఆ రాక్షసుని చంపుటకు ఉద్యుక్తుడగుచుండగా కుమారస్వామి నివారించెను (54).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో దేవాసురసంగ్రామ వర్ణన మనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Sri Sivamahapuranamu-II    Chapters