Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

అర్ధములు
శతావధానులు: శ్రీ వేలూరి శివరామశాస్త్రి

శతావధానులు: శ్రీ వేలూరి శివరామశాస్త్రి

పుట 1 ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా

దుర్లభంత్రయు మేవైతత్‌ దైవానుగ్రహహేతుకమ్‌,

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః ||

స్వవర్ణా శ్రమధర్మేణ తపసా హరితోషణాత్‌,

జ్ఞాన ముత్పద్యతే పుంసాంవైరాగ్యాదిచతుష్టయం ||

తథాప్యను గ్రహదేవ తిరుణందు శిఖామణః,

అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా ||

పుంసాం = పురుషులకు (జనమునకు) అద్వైతవాసనా = అద్వైతసంస్కారము. ఈశ్వరానుగ్రహాదేవ=ఈశ్వరుని అనుగ్రహమువలననే (కలుగును) దైవానుగ్రహహేతుకం = దైవముయొక్క అనుగ్రహమే హేతువుగాగల, ఏతత్‌ = ఈ త్రయమేవ = మూడూ, దుర్లభం = పొందరానివి, (ఒకటి) మనుష్యత్వం = మనుష్యుడై పుట్టుట. (రెండు) ముముక్షుత్వం = మోక్షేచ్ఛ కలుగుట. (మూడు) మహాపురుషసంశ్రయః = జ్ఞాని ఆశ్రయము దొరకుట, స్వవర్ణాశ్రమధర్మేణ = తమతమ వర్ణములయు ఆశ్రమములయు ధర్మముచేతను, తపసా =తపసు=చే, హరితోషణాత్‌ =భగవంతుని సంతసపరచుటచేతను, వైరాగ్యాది చతుష్టయం=వైరాగ్యాదులు నాలుగును. జ్ఞానమును: పుంసాం = పురుషులకు, ఉత్పద్యతే = కలుగును. తథాపి = అటులుఅయినప్పటికి, తరుణందుశిఖామణః=(బాలచంద్రుడే సిగలో మణిగా గల) శివునియొక్క, అనుగ్రహాదేవ = అనుగ్రహము వలననే, పుంసాం = పురుషులకు, అద్వైతవాసనా = అద్వైత సంస్కారము, జాయతే = కలుగుచున్నది.

పుట 3 వేదో నిత్యమధీయతాం తదుదితంకర్మ స్వనుష్ఠీయతాం

తేనేశస్యవిధీయతా మపచితిః కామ్యేమతిస్త్యజ్యతామ్‌,

పాపౌఘఃపరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతా

మాత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణంవిసర్గమ్యతా ||

నిత్యం=ఎల్లప్పుడును, వేదః = వేదము, అధీయతాం = అధ్యయనము చేయపడుగాక!, తదుదితం = వేదముచే చెప్పబడిన, కర్మ = కర్మ, స్వనుష్ఠీయతాం = సు-చక్కగా, అనుష్ఠియతాం = చేయబడుగాక!

తేన = దానిచే- ఆ వేదవిహితకర్మచే, ఈశస్య = ఈశ్వరునికి, అపచితిః = పూజ, విధీయతాం - చేయబడుగాక! కామ్యే = కోరికయందు - కామ్యకర్మలో, మతిః = బుద్ధి. త్యజ్యతామ్‌ = విడనాడబడుగాక!. పాపౌఘః = పాపసముదాయము. పరిధూయతామ్‌ = దులుపబడుగాక!, భవసుఖే = సంసారసుఖమునెడ, దోషః = దోషము (కలదని) మరలమరల ఆ సుఖమునందేఆసక్తి కలుగుట, ఆ సుఖము దుఃఖముగా పరిణమించుట యీ మొదలగు దోషములు కలవని; అనుసంధీయతామ్‌ = మరలమరల ఆలోచింపబడుగాక!, ఆత్మేచ్ఛా = ఆత్మనెరుగు నిచ్చ, వ్యవసీయతాం = నిర్ణయింపబడుగాక!, నిజగృహాత్‌ = స్వగృహమునుండి తూర్ణం = వడిగా, వినిర్గమ్యతాం = బయటబడబడుగాక!.

పుట 9 యోయోయాంయాంతనుంభక్తఃశ్రద్ధయార్చితుమిచ్చతి

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్‌ ||

యః యః = ఎవడెవడు, యాంయాం = ఏయే, తనుం = మూర్తిని, భక్త్యా = భక్తితో, శ్రద్ధయా = శ్రద్దతో, ఆర్చితుం = పూజించుటకు, ఇచ్ఛతి = ఇచ్ఛగించునో (భక్తః అని పాఠాంతరము. భక్త = భక్తుడై పూజింప నిచ్చగించనో అని అర్థము). తస్య తస్య = ఆయా వానికి, అహం = నేను, తామేవ = ఆమూర్తినే గురించిన, శ్రద్ధాం = శ్రద్ధను, అచలాం విదధామి = గట్టిషరతును (మావిటెంకయేని వేపగింజయేని మరి యే విత్తేని తమ తమ సంస్కారమునకు తగినటులు పరిణమించుటకు వానిలోని నీరు వానికి తగిన శక్తినొసగినటులు జీవులును, తమతమ సంస్కారముల కనురూపముగా ప్రవర్తించుట కెటె లిచ్చగింతురో అటులే ఆయా జీవుల బుద్ధియందున్న ఆత్మస్వసన్నిధిమాత్రమున ఆయా బుద్ధులకు ప్రతృత్త్యనురూపమగు శక్తిని ఇచ్చును. రౌతు గుర్రమును ఇచ్చవచ్చినటులు నడపినటులు ఆత్మతనయిచ్ఛకనుకూలముగా నడిపింపదు. ఆత్మ నిష్క్రియముకావున ప్రేరణ మసంభవమను తాత్పర్యమును శంకరానందీయమున చూచునది.)

పుట 9 యంశైవాస=ముపాసతే శివ ఇతి బ్రహ్మేతి, వేదాంతినః

బౌద్ధా బుద్ధఇతి ప్రమాణపటవః కరేతిన్తెయ్యా యికాః |

అర్హన్ని త్వథజైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః

సోయంవోవిదధాతువాంఛితఫలం త్రైలోక్యనాధోహరిః||

శైవాః = శైవులు. శివారాధకులు; యం = ఎవని, శివః ఇతి = శివుడనియు, వేదాంతినః = వేదాంతులు = ఔపనిషదులు; యం = ఎవని, బ్రహ్మఇతి = బ్రహ్మము అనియు, బౌద్ధా = బౌద్ధులు, యం = ఎవని, బుద్ధః ఇతి = బుద్ధుడనియు, ప్రమాణపటవః = తర్కములో సమర్ధులగు. నైయ్యాయికాః = న్యాయశాస్త్రజ్ఞులు, యం = ఎవని, కర్మా ఇతి = జగత్‌ కర్తయనియు, అథ= మఱి, జైన శాసనరతాః = జినుడు చెప్పిన శాస్త్రము సందనురక్తులు, యం = ఎవని, అర్హన్‌ ఇతి = అర్హతుడనియు, మీమాంసకాః = మీమాంసకులు, యం = ఎవనిని, కర్మ ఇతి = కర్మము అనియు, సముపాసతే = ఉపాసించుచున్నారో సః = ఆ, ఆయం = ఈ, త్రైలోక్య నాథః హరిః = ముల్లోకములకును ఏలిక యగు హరి, వః = మీయొక్క, వాంఛితఫలం = వాంఛితార్థములను కోరికలను: విదధాతు = ఈడేర్చుగాక! ఇచ్చుగాక!

పుట 11 ''నా7పృష్టః కస్యచిత్‌ బ్రూయాత్‌''

న ్శ అపృష్టఃఅడుగ బడనివాడై, కస్యచిత్‌ = ఎవనికిని, న బ్రూయాత్‌ = చెప్పరాదు (అడుగనిదే ఎవరికిని చెప్పరాదు.)

పుట 14 ''ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః''

లక్ష్మీః = సిరి, ఉద్యోగినం = ప్రయత్నశీలుడగు, పురుష సింహం = పురుషశ్రేష్ఠుని, ఉపైతి = పొందుచున్నది.

'' ''స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః''

మానవః = మనుజుడు, స్వకర్మణా = తనకర్మచేత, తం = అతనిని, అభ్యర్చ్య = పూజించి, సిద్ధిఁ = సిద్ధిని, విఁదతి = పొందుచున్నాడు.

'' ''వేదో నిత్య మధీయతాం'' (చూ. 116 పుట)

పుట 15 ''తేన ఈశస్య'' (చూ. 116 పుట)

'' ''సత్యాత్‌) న ప్రమదితవ్యం'' - తైత్తిరీయోపనిషత్‌

సత్యాత్‌ = సత్యమునుండి, న ప్రమదితవ్యమ్‌ = ప్రమాదము చెందరాదు, తొలగరాదు.

'' ''కామ్యే మతి'' (చూ. 116 పుట)

పుట 16 ''కుపుత్త్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి''

-- దేవ్యపరాధ క్షమాపణస్తోత్రమ్‌,

కుపుత్రః = దుష్టుడగు కొడుకు, జాయేత = పుట్టనగును. (కాని) క్వచిదపి = ఎపుడును ఎందును, కుమాతా = దుష్టురాలగు తల్లి, న భవతి = ఉండదు.

పుట 31 గీతి శీఘ్రీ శిరఃకంపీ తథా లిఖిత పాఠకః.

అనర్థజ్ఞః అల్పకంఠశ్చ షడైతే పాఠకాథమాః ||

గీతీ = దీర్ఘాలుతీయువాడును, శీఘ్రీ = తొందర తొందరగా చెప్పుకొనిపోవువాడును (పఠనము చేయునపుడు తల వణకించువాడు). శిరః కంపీ = తల వడకించుచు చెప్పువాడును, తథా = మరియు, లిఖిత పాఠకః = అర్థం వ్రాసినదానిని చదువువాడును, అనర్థజ్ఞః = అర్థమెరుగని వాడును, అల్పకంఠఃచ = ధ్వని పెకలనివాడును (అగు)= ఏతే = ఈ. షట్‌ = ఆరుగురును, పాఠకాథమాః = పాఠకాథములు.

పుట 40 ''జంతూనాం నరజన్మ దుర్లభ మతః

పుంస్త్వం తతో విప్రతా

తస్మాద్వైదిక ధర్మమార్గపరతా

విద్వత్వ మస్మాత్పరం -''

జంతూనాం = జీవులకు, నరజన్మ = మనుజుడై పుట్టుట, దుర్లభం = అశక్యమైనది, అతః = దానికంటె, పుంస్త్వ = మగవాడుగాపుట్టుట దుర్లభము, తతః = దానికంటె, విప్రతా = బ్రాహ్మణత్వము దుర్లభము, తస్మాత్‌ = దానికంటె, వైదికధర్మమార్కపరతా = వేదవిహితమైన ధర్మమునందు ఆసక్తత దుర్లభము, అస్మాత్‌ = దీని కంటె, విద్వత్త్వం = ఎరుక కలుగుట దుర్లభము.

పుట 64 ''మహాభాష్యం వా అధ్యేతవ్యం,

మహారాజ్యం వా శాసనీయమ్‌''

మహాభాష్యం వా = మహాభాష్యమేని, అధ్యేతవ్యం = అధ్యయనము చేయదగినది, (లేదేని) మహారాజ్యం వా = మహారాజ్యమేని, శాసనీయమ్‌ = ఏలదగినది. (''తింటే గారెలు తినాలి, వింటే భారతంవినాలి'' అను సామెతవంటిదిది).

పుట 72 'పృథ్వ్యాత్మనే గంధం సమర్పయామి'

పృథ్వ్యాత్మనే = భూరూపుడగుపరమాత్మకు; గంధం = గంధమును; సమర్పయామి = అర్పణమొనర్చుచున్నాను, ఇత్తును.

''వాయ్వాత్మనే ధూపం దర్శయామి''

వాయ్వాత్మనే = వాయురూపుడగుపరమాత్మకు, ధూపం = ధూపమును, దర్శయామి = చూపుదును, ఇత్తును.

'అగ్న్యాత్మనే దీపం దర్శయామి'

అగ్న్యాత్మనే = అగ్నిరూపుడగుపరమాత్మకు, దీపం = దివ్వెను, దర్శయామి = చూపుదును, ఎత్తుదును.

''ఆకాశాత్మనే పుష్పాణి సమర్పయామి''

'ఆకాశాత్మనే = ఆకాశరూపుడగు పరమాత్మకు, పుష్పాణి = పూలను, సమర్పయామి = ఇత్తును.

పుట 72 'అమృతాత్మనే నైవేద్యం సమర్పయామి'

అమృతాత్మనే = అమృతస్వరూపుడగు పరమాత్మకు, నైవేద్యం సమర్పయామి = నైవేద్య మిచ్చుచున్నాను.

పుట్‌ 73 ''లీయే పురహర జాయే

మాయే తవ తరుణ పల్లవ చ్చాయే

చరణ చంద్రాభరణ

కాంచీశరణ నత్తార్తి సంహరణః'' - మూక పఞ్చశతి.

పుర...... జాయే = త్రిపురములను హరించిన హరుని యిల్లాలా!, మాయే = ఓ మాయా!, చంద్రాభరణ = చంద్రు డాభరణముగాగల ఓయమ్మా!, కాంచీశరణ = కాంచియే యిల్లుగా గలదానా!, నతార్తిసంహరణ = మ్రొక్కువారిబాధలను బాపుదానా!, తవ = నీయొక్క, తరుణ = లేజిగురులచాయగల, చరణ = పాదము(ల)లో, లీయే = లయమగును. (నీయడుగులమీద వ్రాలుదును.)

పుట 77 ''యతిశ్చ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినా వుభౌ''

యతిః చ = యతియు, బ్రహ్మచారీచ = బ్రహ్మచారియు, ఉభౌ = ఈ యిరువురును, పక్వాన్న స్వామినౌ = వండిన యన్నముపొందదగువారు. (అనగా గృహస్థుడు వండిన అన్నమును వారికి పెట్టవలయునని తాత్పర్యము.)

పుట 81 ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత=వః|

మామకాః పాండవాశ్చైవకి మకుర్వత సంజయ|| - గీత. 11.

క్షేత్రే = శరీరము. ధర్మక్షేత్రే (సతి) = ధర్మమొనరింప సమర్థమయినదగుచుండగా, కురు = ధర్మమొనరింపుము. (ఎందులకిటులనరింపవలయు ననగా) మామకాః = (మమ) రాజస తామస గుణములు, పాండవాః = సాత్త్వికగుణములను 'పాండు' = తెలుపు. తెల్లనిగుణములు సాత్త్వికగుణములనుట ప్రసిద్ధము - కర్మ శుర్లా శుక్రమనినటులు), యుయుత=వః = పోరదలచి, సమవేతాః = సమకూడినవై, (ఈ అనర్థమును తప్పించు కొనుటకు) కి మకుర్వత = ఏమి చేసెను?, సన్‌! = ఓ సత్పురుషుడా! (శాస్త్రము చెప్పిన చొప్పున ఫలాభి సంధి లేని కర్మచేయుట యను ధర్మము నాచరించి) జయ = జయము పొందుమా!

పుట 82 తస్మాత్‌ శాస్త్రంప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ |

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి || - గీత. 16 - 24

తస్మాత్‌ = కావున, కార్యాకార్యవ్యవస్థితౌ = ఇటులు చేయవచ్చుననిగాని, ఇటులు చేయరాదనిగాని నిర్ణయింపవలసినపుడు; శాస్త్రం = శాస్త్రము, తే = నీకు, ప్రమాణం = జ్ఞానోపకరణము, ఇహ = ఈ యెడల, శాస్త్రవిధానోక్తం = ఇటులు చేయవచ్చును, ఇటులు చేయరాదు అని చెప్పు శాస్త్రవిధిని బట్టి. కర్మ= స్వకర్మను, కర్తుఁ = చేయుటకు, అర్హసి = తగుదువు.

పుట 82 ''విపరీతక్రమో ద్రష్టవ్యః''

(సంఖ్యాశాస్త్రమునందు) విపరీతక్రమః = ఎడమవయిపు నుండి కుడివయిపుగా 81 వచ్చుచో దానిని పదనెనిమిదిగా, ద్రష్టవ్యః = గ్రహింపదగినది. (''అంకానాం వామతో గతిః'')

''నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం |

దేవీం సరస్వతీంచైవ తతో జయముదీరయేత్‌ || (భారతము - ప్రథమశ్లోకము)

నారాయణం = నారాయణుని, నరోత్తమం = నరశ్రేష్ఠుడగు, నరంచైవ = నరునిని, సరస్వతీ దేవీం చైవ = సరస్వతిని, నమస్కృత్య = నమస్కరించి, తతః = పిమ్మట, జయం = జయమును, ఉదీరయేత్‌ = చెప్పునది.

పుట 83 యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్థరః|

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతి ర్మతి ర్మమ || (గీత. 1ౌటఙ)

యత్ర = ఎచట, యోగేశ్వరః = యోగప్రభువగు, కృష్ణః = కృష్ణుడు (ఉండునో), యత్ర = ఎచట, ధనుర్థరః = విల్లు దాల్చిన, పార్థః = అర్జునుడు (ఉందునో) తత్ర = అచట, శ్రీః = సిరియు, విజయః = జయమును, భూతిః = ఐశ్వర్యమును, ధ్రువా = అచలమగు, నీతిః = నీతియు (ఉండునని), మమ మతిః = నాయభిప్రాయము.

పుట 84 ''యో యో యాం యాం'' (చూ. 117పుట)

పుట 85 'తస్మాత్‌ యుధ్యస్వ భారత' (గీత . 2 - 18)

భారత = అర్జున, తస్మాత్‌ = దానివలన - జీవుడు నిత్యుడగుటవలన, యుధ్యస్వ = యుద్ధము చేయుమా! నాశము లేని విషయముకాని శరీరికి - జీవునకు ఈ శరీరములు నశించునని ఈ శ్లోకపాదము వెనుకమూడు పాదములలో కలదు.ొ

'' ఏవం జ్ఞాత్వాకృతంకర్మపూర్వైరపి ముముక్షుభిః,

కురుకర్మైవతస్మాత్త్వం పూర్వైఃపూర్వతరంకృతమ్‌|| (గీత.)

ముముక్షుభిః = మోక్షమును కోరిన, పూర్వైరపి = తొల్లిటివారిచేతను, ఏవం = ఈరీతిగా (నాకుకర్మఫలేచ్ఛ లేదనియు నేను కర్తను కాను అనియు), జ్ఞాత్వా = తెలిసికొని, కర్మ = కర్మ, కృతమ్‌ = చేయబడనెను, తస్మాత్‌ = కావున, త్వం = నీవు, పూర్వైః = తొల్లింటి వారిచే, కృతం = చేయబడిన, పూర్వతరం = మిగుల వెనుకటిదయిన. కర్మైవ = కర్మనే, కురు = చేయుమా!

'' అనాశ్రితః కర్మఫలం కార్శం కర్మకరోతి యః,

స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచా క్రియః || (గీత. 6 - 1)

యః = ఎవడు, కర్మఫలం = కర్మఫలమును, అనాశ్రితః = కోరనివాడై, కార్యం = చేయదగిన, కర్మ = కర్మను (నిత్యనైమిత్తికములను), కరోతి = చేయునో, సః = అతడు, న నిరగ్నిః (కేవలం) = కర్మ కుపకరణమగు అగ్నులు లేనివాడేకాక, నచ అక్రియః = (తపోదానాది) క్రియారహితుడేకాక, సన్న్యాసీ చ = సన్న్యాసియు, యోగీ చ = యోగియును.

పుట 85 నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్యకర్మణః,

శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యే దకర్మణః|| (గీత . 3 - 8)

త్వం = నీవు, నియంతం కర్మ = శాస్త్రము చెప్పిన నిత్య కర్మను. కురు = చేయుము, హి = ఏలయన, అకర్మ ణః = పని చేయకుండుటకంటె, కర్మ = పని (చేయుట), జ్యాయః = దొడ్డది, ఆకర్మణః = పని చేయకుండుట వలన - పని చేయనిచో, తే = నీకు, శరీరయాత్రాపి చ = శరీర నిర్వాహముకూడ. న ప్రసిద్ధ్యేత్‌ = జరుగదు.

'' యజ్ఞార్ధాత్‌ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః,

తద్ధర్మ్యం కర్మ కౌంతేయ ముక్తసంగ స=మాచర || (గీత . 3 - 9)

యజ్ఞార్థాత్‌ = పరమేశ్వరునికొరకైన, కర్మణః = కర్మ కంటె, అన్యత్ర = వేరు కర్మచే, అయం = ఈ, లోకః = లోకము, కర్మబంధనః = కర్మబంధము కలది (ఆ కర్మ లోకమును బంధించును), కౌంతేయ = అర్జునా!, ముక్త సంగః = విడిచిన సంగముకలవాడవై (సక్తిని విడనాడి), తదర్థమ్‌ = పరమేశ్వరుని కొరకు, కర్మ = కర్మమును సమాచర = చేయుము.

పుట 85 స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభ##తే నరః |

స్వకర్మ నిరతసి=ద్ధిం యథా విఁదతి తచ్ఛృణు || -గీత. 18 - 45.

స్వే స్వే కర్మణి = తన తన కర్మలో (41వ శ్లోకము కడ నుండి 44వ శ్లోకము వఱకును బ్రాహ్మణాదులకు చెప్పబడెను) అభిరతః = తత్పరుడై, నరః = మనుష్యుడు (ప్రతివాడు), సంసిద్ధి = (తమ తమ కర్మచేయుటచే అశుద్ధి తొలగగా, శరీరమును ఇంద్రియములును జ్ఞాననిష్ఠకు పనికివచ్చును. అట్టి) సిద్ధిని, లభ##తే = పొందును, స్వకర్మనిరతః = తనతనకర్మనే చేసికొనువాడు, యథా = ఎటులు సిద్ధిని, విందతే = పొందునొ తత్‌ = ఆమాటః శ్రుణు = విను. (తన పనిలో తానున్నమాత్రముననే సిద్ధికలుగదు. మరి యేమి చేయవలయు? 'స్వకర్మణా తమభ్యర్చ్య' (18-46)= తనతనకర్మచే ఈశ్వరారాధన మొనర్చియే జ్ఞాననిష్ఠకు యోగ్యతను సంపాదించును.)

పుట 86 సర్వకర్మాణి మనసా సంన్య స్యాస్తే సుఖం వశీ |

నవద్వారే పురే దేహీ నైవకుర్వన్న కారయన్‌ || -గీత. 5 - 31.

వశీ = ఇంద్రియవశము కల దేహీ = జీవుడు, మనసా = మనసుచే- ''కర్మణ్యకర్మయః పశ్య9, కర్మలో అకర్మను చూచువివేకముకలమనసుచే, సర్వకర్మాణి = అన్ని కర్మలను, సంన్యస్య = వదలిపెట్టి, నవద్వారే = తొమ్మిది గవకులు గల, పురే = పత్తనమందు- ఈ శరీరమునందు, నైవ కుర్వన్‌ = ఏమియు చేయనివాడె అయి, నకారయన్‌ = దేనిని చేయించనివాడే యయి, సుఖం ఆస్తే = సుఖముగా ఉండును.

పుట 86 యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః,

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః || -గీత . 6 - 10.

యోగీ = యోగి, రహసి = ఏకాంత స్థలమునందు, ఏకాకీ = ఒంటరియై, స్థితః = కూరుచున్నవాడై, యత చిత్తాత్మా = చిత్తమునుశరీరమునువశమునందుంచుకొన్న వాడై, నిరాశీః = కోరిక లేనివాడై, అపరిగ్రహః = ప్రతిగ్రహ మొనరింపనివాడై, సతతం = ఎప్పుడును, ఆత్మానం = అంతఃకరణమును, యుంజీత = సమాధాన పఱుపవలయును - సమాహిత మొనరింపవలయును.

'' యతః ప్రవృత్తిర్భూతానాం యేనసర్వమిదంతతమ్‌

స్వకర్మణా త మభ్యర్చ సిద్ధిం విందతి మానవః || -గీత 18. 46

భూతానాం = భూతముల, ప్రవృత్తిః = ప్రవర్తనము, యతః = ఎవనినుండియో, ఇదం సర్వం = యెల్లయు, యేన = ఎవనిచే, తతమ్‌ = వ్యాప్తమో, తం = అతనిని, స్వకర్మణా= తన కర్మచే, అభ్యర్చ్య = పూజించి, మానవః = మానవుడు, సిద్ధిఁ = జ్ఞాననిష్ఠకు యోగ్యతను, విందతి = పొందును.

పుట 86 ''భక్త్యా మామభిజానాతియావాన్‌ యశ్చాస్మిత త్త్వతః'' -గీత. 18 - 55.

యావాన్‌ = ఎంతవాడవో (సృష్టిలోని ఉపాధులు ఎన్నియో అవన్నియు ఆత్మవే, కావున ఇట్లనుట), తత్వతః = నైజముగా, యశ్చ అస్మి = ఎవడవో, (ఉపాధిభేదములు లేక ఆకాశము వంటివాడు కావున) భక్త్యా = భక్తి చేత అర్హుడు, జిజ్ఞాసువు, అర్థార్థి- వీరల భక్తికంటె నాలగవదగు పరభక్తి చేత-ఏభక్తిచే ఈశ్వరక్షేత్రజ్ఞబుద్ధి పోవునో అట్టి పరభక్తిచే, మాం= నన్ను, అభిజానాతి = తెలిసికొనును.

పుట 87 ''తతో మాంతత్త్వతో జ్ఞాత్వా విశ##తే తదనంతరమ్‌''

తతః = ఆ యెఱుకచే, తత్త్వతఃజ్ఞాత్వా తదనంతరమ్‌= నిక్కమెఱిగిన పిదప బ్రహ్మీభూతుడై, మాం విశ##తే = నన్ను చొచ్చును. అనగా బ్రహ్మీభూతుడగును.

పుట 89 మన్యే సృజన్త్వభినుతిం కవిపుంగవాస్తే

తేభ్యో రమారమణ మాదృశ ఏవ ధన్యః,

త్వద్వర్ణనే ధృతరసః కవితాతిమాన్ద్యాత్‌

యస్తత్తదంగ చిరచింతన భాగ్యమేతి ||

రమారమణ = నారాయణా!, కవిపుంగవాః = కవి వృషభులు, తే అభినుతిం = నీ స్తుతిని, సృజఁతి = (వడివడిగా) చేయుచున్నారు, (ఇతి = అని) మన్యే = తలతును (ఇది నిక్కమే కావచ్చును), త్వద్వర్ణనే = నీవర్ణనములో (నిన్ను), వర్ణించునెడల, ధృతరసః = ధరింపబడిన రసముకలవాడై- (రసదృష్టి కలవాడై -లగ్నచితుడై), కవితాతి మాంద్యాత్‌ = కవిత్వ మల్లు నెడల మెల్లదనమువలన, తత్తదంగ చిరచింతన భాగ్యం = ఆయా యీ అవయువములను చాలసేపు ధ్యానించు భాగ్యమును, యః = ఎవడు, ఏతి = పొందుచున్నాడో, (సః = అట్టి) మాదృశ ఏవ = నావంటివాడే, ధన్య ఇతి = గొప్ప కవి అని (ధన్యుడని), మన్యే = తలతును.

పుట 94 ఆత్మత్వంగిరిజామతిః పరిజనాఃప్రాణః శరీరంగృహం. పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః, సంచారఃపదయోః ప్రదక్షిణవిధిఃస్తోత్రాణి సర్వాగిరః, యద్యత్కర్మ కరోమితత్తదఖిలం శంభో తవారాధనమ్‌ శంభో = శివా!, ఆత్మా = నేను. త్వం = నీవు, మతిః = నామతియే. గిరిజా = పార్వతీ, ప్రాణాః = నా ప్రాణములే, ప్రియజనాః = చుట్టపక్కాలు, శరీరం = ఈనా శరీరమే, గృహం = యిల్లు, విషయోపభోగరచనా = విషయములను అనుభవించుట అను పనియే అనగా నావిషయోపభోగమే, తే = నీకు, పూజ, నిద్రా = నిదురయే, సమాధిస్థితిః = సమాధిలో ఉండుట పదయోః సంచారః = నడక; ప్రదక్షిణవిధిః = ప్రదక్షిణము చేయుట, సర్వాః = ఎల్ల, గిరః = మాటలు- నేను పలుకు మాటలు, స్తోత్రాణి = స్తోత్రములు, యత్‌ యత్‌ కర్మ = ఏ యే పనిని, కరోమి = చేయుదునో, తత్‌ తత్‌ అఖిలం = ఆ యది యెల్లయు, తన ఆరాధనమ్‌ = నీ సేవ (నా మంచి చెడ్డయు నీ కర్పించుచున్నాను. మంచిచెడ్డలలో చెడ్డనుగూడ అర్పించుట యేమి పని అనుకొనవచ్చును గాని ఇది అలవాటయిన పిదప మంచి చెడ్డలను మాటలే పోయి భగవానుడే శేషించును.)

పుట 96 భవాని త్వం దాసేమయి వితరదృష్టింసకరుణా

మితి స్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వమితి యః,

తదైవ త్వం దిశసి నిజసాయుజ్యపదవీం

ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజితపదామ్‌ ||

హే భవాని = ఓ భవానీ! భవపత్నీ!, దాసే = బంటు అయిన, మయి = నాయెడల, సకరుణాం = కరుణతో గూడిన, దృష్టిం = చూపును, వితర! = దానము చేయుమా! (నన్ను దయజూడుమా), ఇతి = ఇటులు, స్తోతుం = స్తుతించుటకు, వాంఛన్‌ = కోరుచు, యః = ఎవడు, ''భవానిత్వమ్‌'' = భవానిత్వమ్‌అని, కథయతి = పలుకుచున్నాడో, తదైవ = అప్పటి కపుడే, త్వం = నీవు. తసై#్మ = అతనికొఱకు (అతనికి), ముకుంద ...... పదాం = విష్ణుబ్రహ్మేంద్రుల చక్కని కిరీటములచే ఆరతియెత్తిన పాదములు కల (కిరీటములు పాదములమీదమ్రొగ్గినపుడు వానిలోగల రత్నముల కాంతులు ఆరతియిచ్చినటులున్నవనితాత్పర్యము) నిజసాయుజ్య పదవీం = నీసాయుజ్యమను, దిశసి = ఇచ్చుచున్నావు. ''భవానీ'' అనుపదమునకు (లోడంత భూధాతువునకు ఉత్తమ పురుషైక వచనము) ''అగుదునుగాక'' అనియు అర్థము. ''త్వం భవాని'' = నేను నీ వగుదుగాక అని అన్నంతనే అన్న భక్తున కీ యర్థ ముద్దిష్టముకాకున్నను ఈ యర్థమును చలామణిచేసి సాయుజ్యమిచ్చుచున్నావని చమత్కారము. నీ అనుగ్రహము అంత దొడ్డదని తాత్పర్యము.

పుట 150 'సర్వే జనా సుఖినో భవన్తు'

సర్వేజనాః = ఎల్లరు, సుఖినః = సుఖవంతులు, భవన్తు = అగుదురుగాక!


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page