Sri Sivamahapuranamu-I
Chapters
అథ త్రయోదశోeôధ్యాయః సదాచారము - శౌచము - ధర్మమానుష్ఠానము ఋషయ ఊచుః | సదాచారం శ్రావయాశు యేన లోకాన్ జయేద్బుధః | ధర్మాధర్మమయాన్ బ్రూహి స్వర్గనారకదాం స్తథా ||
1 ఋషులిట్లు పలికిరి - సదాచారము వలన వివేకి పుణ్యలోకములను జయించగల్గును. అట్టి సదాచారమును మాకు వెంటనే వినిపింపుము. స్వర్గము నిచ్చు ధర్మకార్యములను, నరకమును కల్గించు అధర్మకార్యములను కూడ చెప్పుము (1). సూత ఉవాచ | సదాచార యుతో విద్వాన్ బ్రహ్మణో నామ నామతః | వేదాచార యుతో విప్రో హ్యేతై రేకైక వాన్ ద్విజః || 2 అల్పాచారోeôల్ప వేదశ్చ క్షత్రియో రాజసేవకః | కించిదాచారవాన్ వైశ్యః కృషివాణిజ్యకృత్తయా || 3 శూద్ర బ్రాహ్మణ ఇత్యుక్తః స్వయమేవ హి కర్షకః | అసూయాలుః పరద్రోహి చండాలద్విజ ఉచ్యతే || 4 పృథివీపాలకో రాజా ఇతరే క్షత్రియా మతాః | ధాన్యాది క్రయవాన్ వేశ్య ఇతరో వణిగుచ్యతే|| 5 సూతుడిట్లు పలికెను - సదాచారము కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడనియు, వేదోక్త కర్మలను అనుష్ఠించువాడు విప్రుడనియు నామమును పొందుదురు. సదాచారము, విద్య వేదోక్త కర్మానుష్ఠానము అనువాటిలో ఏదో ఒక గుణము గలవాడు ద్విజుడనబడును (2). తక్కువ ఆచారము, తక్కువ వేదాధ్యయనము కలిగి, రాజసేవ చేయు బ్రాహ్మణుడు క్షత్రియ బ్రాహ్మణుడనబడును. కొద్ది ఆచారము కలిగి, వ్యవసాయ వ్యాపారములను చేయు బ్రాహ్మణుడు వైశ్య బ్రాహ్మణు డనబడును. (3). స్వయముగా భూమిని దున్ను బ్రాహ్మణుడు శూద్రబ్రాహ్మణు డనబడును. ఇతరుల యందు అసూయ కలిగి, వారికి ద్రోహము చేయు బ్రాహ్మణుడు చండాల బ్రాహ్మణుడనబడును (4). భూమిని పాలించువాడు రాజు అనియు, ఇతర రాజవంశీయులు క్షత్రియులనియు అనబడుదురు. ధాన్యాదులను అమ్మువాడు వైశ్యుడనియు, ఇతర వైశ్యవంశీయులు వణిక్ అనియు పిలువబడుదురు (5). బ్రహ్మ క్షత్రియ వైశ్యానాం శుశ్రూషు శ్శూద్ర ఉచ్యతే | కర్షకో వృషలో జ్ఞేయ ఇతరే చైవ దస్యవః || 6 సర్వో హ్యుషః ప్రాచీముఖశ్చింతయే ద్దేవపూర్వకాన్ | ధర్మానర్ధాంశ్చ తత్ క్లేశానాయం చ వ్యయమేవ చ || 7 ఆయుర్ద్వేషశ్చ మరణం పాపం భాగ్యం తథైవ చ | వ్యాధిః పుష్టిస్తథా శక్తిః ప్రాతరుత్థాన దిక్ ఫలమ్ || 8 నిశాంత్యా యా మోషా జ్ఞేయా యామార్ధం సంధిరుచ్యతే | తత్కాలే తు సముత్థాయ విణ్మూత్రే విసృజేద్ద్విజః || 9 గృహాద్దూరతో గత్వా బాహ్యతః ప్రవృతస్తథా | ఉదఙ్ముఖః సమావిశ్య ప్రతిబంధేeôన్య దిఙ్ముఖః || 10 బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవచేయువాడు శూద్రుడు అనియు, వ్యవసాయము చేయు ఇతరులు కర్షకులనియు, మిగిలినవారు దస్యులనియు తెలియవలెను (6). వీరందరు ఉషఃకాలము నందు తూర్పువైపు తిరిగి పరమేశ్వరుని ధ్యానించి, ధర్మార్థ ములను, వాటిలోని క్లేశములను, ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచించవలెను (7). ప్రాతః కాలము నందు నిద్రను వీడే సమయమును, పద్ధతిని బట్టి, మానవులకు ఆయుర్దాయము, ద్వేషము, మరణము, పాపము, సంపద, వ్యాధి పుష్టి మరియు శక్తి అను ఫలములు కలుగును (8). రాత్రిలోని ఆఖరి యామమునకు ఉషస్సు అనియు, దానిలోని సగభాగమునకు సంధి అనియు పేరు. ద్విజుడు ఆ సమయములో లేచి, కాలకృత్యములను తీర్చుకొనవలెను (9). ఇంటికి దూరముగా బయటకు వెళ్లి ఉత్తరముఖముగా కూర్చుండవలెను. దానికి ఇబ్బంది ఉన్నచో ఇతర దిక్కునకు అభిముఖముగా కూర్చుండవలెను (10) జలాగ్ని బ్రహ్మణాదీనాం దేవానాం నాభిముఖ్యతః | లింగం పిధాయ వామేన ముఖమన్యేన పాణినా || 11 మలముత్సృజ్య చోత్థాయ న పశ్యేచ్చైవ తన్మలమ్ | ఉద్ధృతేన జలేనైవ శౌచం కుర్యాజ్జలాద్బహిః || 12 అథవా దేవపిత్రార్ష తీర్థావతరణం వినా | సప్త వా పంచ వా త్రీన్ వా గుదం సంశోధయేన్మృదా || 13 లింగే కర్కోట మాత్రం తు గుదే ప్రసృతి రిష్యతే | తత ఉత్థాయ పద్ధస్త శౌచం గండూషమష్టకమ్ || 14 జలము, అగ్ని, బ్రాహ్మణుడు మొదలగు వాటికి, దేవతలకు ఎదురుగ కూర్చుండరాదు. ఎడమచేతితో గుహ్యమును, కుడిచేతితో నోటిని మూసి (11), మలవిసర్జన చేసి, పైకిలేచి, దానిని చూడరాదు. జలాశయము నుండి బయటకు తీసుకువచ్చిన జలముతో మాత్రమే శౌచము నాచరించవలెను. దేవ, పితృ, ఋషి తీర్థములలో దిగకుండగా, ఏడు, ఐదు లేక మూడుసార్లు మట్టితో గుదమును శుద్థి చేయవలెను (13). కొద్ది మట్టితో గుహ్యమును, చేతినిండా మట్టితో గుదమును శుద్ధి చేయవలెను. తరువాత లేచి, కాళ్లను చేతులను కడుగుకొని ఎనిమిది సార్లు నీటిని పుక్కిలించి ఉమ్మి వేయవలెను (14). యేన కేన చ పత్రేణ కాష్ఠేన చ జలాద్బహిః | కార్యం సంతర్జనీం త్యజ్య దంతధావన మీరితమ్ || 15 జలదేవాన్నమస్కృత్య మంత్రేణ స్నానమాచరేత్ | అశక్తః కంఠదఘ్నం వా కటి దఘ్న మథాపి వా || 16 ఆజాను జల మావిశ్య మంత్రస్నానం సమాచరేత్ | దేవాదీం స్తర్పయేద్విద్వాంస్తత్ర తీర్థ జలేన చ || 17 ధౌతవస్త్రం సమాదాయ పంచకచ్ఛేన ధారయేత్ | ఉత్తరీయం చ కిం చైవ ధార్యం సర్వేషు కర్మసు || 18 ఏదో ఒక ఆకుతో గాని, పుల్లతో గాని జలాశయమునకు బయట చూపుడువ్రేలిని ఉపయోగించకుండగా దంతధావనమును చేయాలి (15). జలాధిష్ఠాన దేవతలకు నమస్కరించి మంత్రపూర్వకముగా స్నానము చేయవలెను. కంఠము వరకు నీటిలో దిగి, అట్లు చేయ శక్తి లేనిచో, నడుము వరకు (16), లేదా మోకాళ్ల వరకు గాని నీటిలో దిగి, మంత్రపూర్వక స్నానమును చేయవలెను. విద్వాంసుడచటనే తీర్థజలముతో దేవ పితృ తర్పణములను చేయవలెను (17). తెల్లని వస్త్రమును తీసుకొని, అయిదు కచ్చలతో ధరించవలెను. సర్వ కర్మల యందు ఉత్తరీయమును తప్పక ధరించవలెను (18). నద్యాది తీర్థస్నానే తు స్నానవస్త్రం న శోధయేత్ | వాపీకూప గృహాదౌతు స్నానాదూర్ధ్వం న యేద్బుధః || 19 శిలాదార్వాదికే వాపి జలే వాపి స్థలేeôపి వా | సంశోధ్య పీడయేద్వస్త్రం పితౄణాం తృప్తయే ద్విజాః || 20 జాబాలకోక్త మంత్రేణ భస్మనా చ త్రిపుండ్రకమ్ | అన్యథా చేజ్జలే పాత ఇతస్తన్నరకమృచ్ఛతి || 21 ఆపోహిష్ఠేతి శిరసి ప్రోక్షయే త్పాపశాంతయే | యస్యేతి మంత్రం పాదే తు సంధిప్రోక్షణ ముచ్యతే || 22 నదుల యందు, ఇతర తీర్థముల యందు స్నానము చేసినప్పుడు స్నానవస్త్రమును అచట ఉతకరాదు. విద్వాంసుడు స్నానాంతరము దానిని బావి వద్దకు గాని, ఇంటికి గాని తీసుకువెళ్లి (19), రాతిపై గాని, దుంగపై గాని, గట్టి నేలపై గాని, లేదా నీటి యందు గాని ఉతికి పిండవలెను. ఓ ద్విజులారా! ఆ వస్త్రజలము పితృదేవతలకు తృప్తినిచ్చును (20). జాబాలోపనిషత్తులోని 'అగ్నిరితి భస్మ' అను మంత్రమును ఉచ్చరించి, భస్మతో త్రిపుండ్రమును ధరించవలెను. అట్లు గాక, భస్మను నీట పారవేసినచో, ఆ వ్యక్తి దేహ త్యాగనంతరము నరకమును పొందును. పాపమును తొలగించుట కొరకై 'ఆపో హిష్ఠా' అను మంత్రముతో జలమును శిరస్సుపై చల్లుకొనవలెను.'యస్య క్షయాయ' అను మంత్రముతో పాదములపై చల్లుకొనవలెను. దీనికి సంధ్యాప్రోక్షణమని పేరు (22). పాదే మూర్ధ్ని హృది చైవ మూర్ధ్ని హృత్పాద ఏవ చ | హృత్పాదమూర్ధ్ని సంప్రోక్ష్య మంత్రస్నానం విదుర్బుధాః || 23 ఈషత్ స్పర్శేచ దౌః స్వాస్థ్యే రాజ రాష్ట్ర బయేeôపి చ | అత్యాగతి కాలే చ మంత్రస్నానం సమాచరేత్ || 24 ప్రాతస్సూర్యానువాకేన సాయ మగ్న్యనువాకతః | అపః పీత్వా తథా మధ్యే పునః ప్రోక్షణమాచరేత్ || 25 గాయత్ర్యా జప మంత్రాంతే త్రిరూర్ధ్వం ప్రాగ్వినిక్షిపేత్ | మంత్రేణ సహచైకం వై మధ్యేeôర్ఘ్యం తు రవేర్ద్విజాః || 26 ఆపోహిష్ఠేత్యాది మంత్రములతో పాదమును, శిరస్సును, హృదయమును, ఆ తరువాత, శిరస్సును, హృదయమును, పాదమును, మరియు హృదయమును, పాదమును, శిరస్సును సంప్రోక్షణ చేయవలెను. పండితులు దీనిని మంత్ర స్నానమందురు (23). అపవిత్ర స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు గాని, ఆరోగ్యము లేనప్పుడు గాని రాజునకు, రాష్ట్రమునకు భయము కలిగినప్పుడుగాని, యాత్రాకాలము నందు గాని మంత్రస్నానము చేయవలెను (24). ఉదయము 'సూర్యశ్చ' అను మంత్రముతో, సాయంకాలము 'అగ్నిశ్చ' అను మంత్రముతో నీటిని త్రాగి, మరల మంత్ర ప్రోక్షణమును చేయవలెను (25). ఓ బ్రహ్మణులారా! ఉదయము గాయత్రితో అభిమంత్రించిన జలమును తూర్పున కభిముఖముగా సూర్యునకు ఆర్ఘ్యము నీయవలెను. మధ్యాహ్నము మంత్రపూర్వకముగా ఒకే అర్ఘ్యము నీయవలెను (26). అథ జాతే చ సాయాహ్నే భువి పశ్చిమ దిఙ్మఖః | ఉద్ధృత్య దద్యాత్ప్రాతస్తు మధ్యాహేం eôగులిభిస్తథా || 27 అంగులీనాం చ రంధ్రేణ లంబం పశ్యేద్దివాకరమ్ | ఆత్మ ప్రదక్షిణం కృత్వా శుద్ధాచమన మాచరేత్ || 28 సాయం మూహూర్తా దర్వాక్తు కృతా సంధ్యా వృథా భ##వేత్ | అకాలాత్కాల ఇత్యుక్తో దినేeôతీతే యథాక్రమమ్ || 29 దివాeôతీతే చ గాయత్రీం శతం నిత్యే క్రమాజ్జపేత్ | ఆదశాహాత్పరాతీతే గాయత్రీం లక్షమభ్యసేత్ || 30 మాసాతీతే తు నిత్యే హి పునశ్చోపనయం చరేత్ | సాయం సంధ్యలో భూమిపై కూర్చుండి పడమర వైపుకు తిరిగి అర్ఘ్యము నీయవలెను. ఉదయము తూర్పువైపుకు తిరిగి నీటిని కొద్దిగా పైకి విసిరి అర్ఘ్యము నీయవలెను. మధ్యాహ్నము వ్రేళ్లనుండి అర్ఘ్యము నిచ్చి (27), వ్రేళ్ల మధ్య గుండా లంబముగా సూర్యుని చూడవలెను. తరువాత ఆత్మ ప్రదక్షిణము చేసి, శుద్ధాచమనమును చేయవలెను (28). సాయంకాల సంధ్య నుండి గంట దాటిన తరువాత సంధ్యను ఉపాసించుట వ్యర్థము. కాలాతిక్రమము కాకుండా సంధ్యోపాసనమును చేయవలెను (29). నిత్య కర్మలేకుండా ఒక దినము గడచినచో, వంద గాయత్రిని జపించవలెను. నిత్యకర్మ పది దినములు లుప్తమైనచో లక్ష గాయత్రిని చేయవలెను (30). నిత్య కర్మ అయిన సంధ్యావందనము మాసము దాటి లుప్తమైనచో, మరల ఉపనయనమును చేయవలెను. ఈశో గౌరీ గుహో విష్ణుర్బ్రహ్మా చేంద్రశ్చ వై యమః || 31 ఏవం రూపాంశ్చవై దేవాంస్తర్పయే దర్థ సిద్ధయే | బ్రహ్మార్పణం తతః కృత్వా శుద్ధా చమన మాచరేత్|| 32 తీర్థ దక్షిణ తశ్శస్తే మఠే మంత్రాలయే బుధః | తత్ర దేవాలయే వాపి గృహే వా నియతస్థలే || 33 సర్వాన్ దేవాన్నమస్కృత్య స్థిరబుద్ధిః స్థిరాసనః | ప్రణవం పూర్వమభ్యస్య గాయత్రీమభ్యసేత్తతః || 34 జీవబ్రహ్మైక్య విషయం బుద్ధ్వా ప్రణవమభ్యసేత్ | శివుడు, గౌరి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, మరియు యముడు (31) మొదలగు దేవతల నుద్దేశించి కార్య సిద్ధి కొరకు తర్పణముల నీయవలెను. తరువాత బ్రహ్మర్పణమును, శుద్ధాచమనమును చేయవలెను (32). విద్వాంసుడు తీర్థమునకు దక్షిణముగా నుండే ప్రశస్తమైన మఠములో గాని, మంత్రాలయములో గాని, దేవలయములో గాని, గృహము నందు గాని, ఒక నియమిత స్థలము నందు గాని (33), స్థిరమగు ఆసనము నందున్నవాడై, నిశ్చలమగు మనస్సు గలవాడై, దేవతలందరికీ నమస్కరించి, ముందుగా ఓంకారమును, తరువాత గాయత్రిని జపించవలెను (34). జీవబ్రహ్మల అభేదమును అనుసంధానము చేయుచూ, ఓంకారమును జపించవలెను. త్రైలోక్య సృష్టి కర్తారం స్థితి కర్తారమచ్యుతమ్ || 35 సంహర్తారం తథా రుద్రం స్వప్రకాశముపాస్మహే | జ్ఞాన కర్మేంద్రియాణాం మనోవృత్తీర్ధియస్తథా || 36 భోగమోక్ష ప్రదే ధర్మే జ్ఞానే చ ప్రేరయే త్సదా | ఇత్థమర్ధం ధియా ధ్యాయన్ బ్రహ్మ ప్రాప్నోతి నిశ్చయః || 37 కేవలం వా జపేన్నిత్యం బ్రహ్మణ్యస్య చ పూర్తయే | సహస్రమభ్యసేన్నిత్యం ప్రాతర్బ్రాహ్మణ పుంగవః || 38 అన్యేషాం చ యథాశక్తి మధ్యాహ్నే చ శతం జపేత్ | సాయం ద్విదశకం జ్ఞేయం శిఖాష్టక సమన్వితమ్ || 39 'ముల్లోకములను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త యుగు విష్ణువును (35), సంహారకర్త యగు రుద్రుని ఆత్మ ప్రకాశరూపముగా ఉపాసించెదము. ఓంకారము మా యొక్క జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనోవృత్తులను, ధీవృత్తులను (36), సర్వకాలముల యందు, భోగమోక్షముల నిచ్చు ధర్మము నందు, మరియు జ్ఞానము నందు ప్రేరేపించుగాక!' ఈ తీరున ఓంకారము యొక్క అర్థమును బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయముగా మోక్షమును పొందును (37). ఈ అర్థము తెలియకున్ననూ బ్రాహ్మణ్యము పరిపూర్తి చెందుటకై నిత్యము ఓంకారమును జపించవలెను. బ్రాహ్మణుడు ప్రతిదినము గాయత్రిని ఉదయము వేయి జపించి (38), యథాశక్తి ఇతర మంత్రములను కూడ జపించవలెను. మధ్యాహ్నము గాయత్రిని వందసార్లు, సాయంకాలము నందు ఇరువది ఎనిమిది సార్లు జపించవలెనని తెలియవలెను (39). మూలాధారం సమారభ్య ద్వాదశాంత స్థితాంస్తథా | విద్యేశ బ్రహ్మ విష్ణ్వీ శ జీవాత్మ పరమేశ్వరాన్ || 40 బ్రహ్మ బుద్ధ్యా తదైక్యం చ సోeôహం భావనయా జపేత్ | తానేవ బ్రహ్మరంధ్రాదౌ కాయాద్బాహ్యేచ భావయేత్ || 41 మహత్తత్త్వం సమారభ్య శరీరం తు సహస్రకమ్ | ఏకైక స్మాజ్జపాదేక మతిక్రమ్య శ##నైశ్శనైః || 42 పరస్మిన్ యోజయేజ్జీవం జపతత్త్వ ముదాహృతమ్ | మూలాధారము నుండి సహస్రారము వరకు గల ఆరు చక్రములలో విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ , పరమాత్మలను ధ్యానించవలెను (40). 'సోeôహం (అది నేనే)' అను పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యమును భావన చేయుచూ, గాయత్రిని జపించవలెను. మరియు, ఆ దేవతలను బ్రహ్మ రంధ్రము నందు, దేహమునకు బయట కూడ భావన చేయవలెను (41). మహత్తత్త్వము నుండి ఈ వేలాది శరీరములు బయల్వెడలినవి. ఒక్కొక్క గాయత్రీ జపముచే ఒక్కొక్క శరీరమును మెల్లమెల్లగా అతిక్రమించి (42), జీవుని పరమాత్మ యందు లీనము చేయవలెను. ఇదియే జపము యొక్క తత్త్వము అని చెప్పబడినది. శతద్వి దశకం దేహం శిఖాష్టక సమన్వితమ్ || 43 మంత్రాణాం జప ఏవం హి జపమాదిక్రమాద్విదుః| సహస్రం బ్రాహ్మదం విద్యాచ్ఛతమైంద్రప్రదం విదుః || 44 ఇతరస్త్వాత్మరక్షార్థం బ్రహ్మయోనిషు జాయతే | దివాకర ముపస్థాయ నిత్యమిత్థం సమాచరేత్ || 45 లక్ష ద్వాదశయుక్తస్తు పూర్ణ బ్రహ్మణ ఈరితః | గాయత్ర్యా లక్షహీనం తు వేదకార్యే న యోజయేత్ || 46 గాయత్రిని వందగాని, ఇరువది ఎనిమిది గాని జపించవలెను (43). ఈ విధముగా భావనలో శరీరమును అధిగమించి (తాదాత్మ్యమును వీడి) జపించవలెను. వేయి జపము వలన బ్రహ్మలోకము, వంద జపించినచో ఇంద్రలోకము లభించును (44). ఇతరులు గాయత్రిని జపించి ఉత్తమ జన్మను పొంది ఆత్మోద్ధారమును గాంచెదరు. ఈ తీరున జపము చేసి సూర్యున కభిముఖముగా ఉపస్థానమును చెప్పవలెను (45). పన్నెండు లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణు డనబడును. లక్షకు తక్కువ గాయత్రిని జపించిన వాడు వైదిక కర్మలకు అర్హుడు కాడు (46). ఆ సప్తతేస్తు నియమం పశ్చాత్ర్పవ్రాజనం చరేత్ | ప్రాతర్ద్వాదశ సాహస్రం ప్రవ్రాజీ ప్రణవం జపేత్ || 47 దినే ది దినే దినే త్వతిక్రాంతే నిత్యమేవం క్రమాజ్జపేత్ | మాసాదౌ క్రమశోeôతీతే సార్ధలక్ష జపేన హి హి || 48 అత ఊర్ధ్వ మతిక్రాంతే పునః పై#్రషం సమాచరేత్ | ఏవం కృత్వా దోషశాంతి రన్యథా రౌరవం వ్రజేత్ || 49 డెబ్బది ఏండ్ల వరకు నియమములను పాటించి, తరువాత సన్న్యసించవలెను. సన్న్యాసి ఉదయమే పన్నెండు వేలు ఓంకారమును జపించవలెను (47). ఒకరోజు జపమును వీడినచో, మరునాడు రెండురోజుల జపమును పూర్తి చేయవలెను. నెలరోజులు జపమును మానినచో, ఏభై వేలు జపించిన ఆ దోషము తొలగును (48). అంతకు మించి జపమును వీడినచో, మరల గురువు వద్ద దీక్షను పొందవలెను. అట్లు చేసినచో, దోషము శాంతించును. లేదా, రౌరవ నరకమును పొందును (49). ధర్మార్థయోస్తతో యత్నం కుర్యాత్కామీన చేతరః | బ్రాహ్మణో ముక్తి కామస్స్యాద్ర్బహ్మజ్ఞానం సదాభ్యసేత్ || 50 ధర్మాదర్థోeôర్థతో భోగో భోగాద్వైరాగ్య సంభవః | ధర్మార్జితార్థ భోగేన వైరాగ్యముపజాయతే || 51 విపరీతార్థ భోగేన రాగ ఏవ ప్రజాయతే | ధర్మశ్చ ద్వివిధః ప్రోక్తో ద్రవ్య దేహద్వయేన చ || 52 ద్రవ్య మిజ్యాది రూపం స్యాత్తీర్థ స్నానాది దైహికమ్ | ధనేన ధన మాప్నోతి తపసా దివ్యరూపతామ్ || 53 నిష్కామశ్శుద్ధి మాప్నోతి శుద్ధ్యా జ్ఞానం న సంశయః | కామనలు గలవాడు ఆ కామనలను సిద్ధింపజేసే వేదోక్త కర్మలను ఆచరించుటకు యత్నించవలెను. వాటి కొరకు ధనమును సంపాదించవలెను. కామనలు లేనివానికి ఈ ప్రయత్నము అనావశ్యకము. బ్రాహ్మణుడు ముముక్షువు అయి, సర్వదా బ్రహ్మజ్ఞానమును అభ్యసించవలెను (50). ధర్మము వలన ధనము, ధనము వలన భోగము లభించును. ధర్మముగా సంపాదించిన ధనముతో లభించిన భోగము వైరాగ్యమునకు హేతువు అగును (51). అధర్మార్జితమైన ధనముతో అనుభవించే భోగములు రాగమును కలిగించును. ధర్మము ద్రవ్య ధర్మము, దేహధర్మము అని రెండు రకములు (52). యజ్ఞము మొదలగునవి ద్రవ్యధర్మములు. తీర్థములలో స్నానము చేయుట మొదలగునవి దేహధర్మములు. ధనము వలన మరింత ధనము పుట్టును. తపస్సు వలన దివ్యరూపము లభించును (53). నిష్కామముగా ధర్మము నాచరించినచో, అంతఃకరణ శుద్ధి కలుగును. శుద్ధి వలన జ్ఞానము కలుగుననుటలో సందియము లేదు. కృతాదౌ హి తపః శ్లాఘ్యం ద్రవ్యధర్మః కలౌయుగే || 54 కృతే ధ్యానాత్ జ్ఞాన సిద్ధిః త్రేతాయాం తపసా తథా | ద్వాపరే యజనాత్ జ్ఞానం ప్రతిమాపూజయా కలౌ || 55 యాదృశం పుణ్యపాపం వా తాదృశం ఫలమే వ హి | ద్రవ్య దేహాంగభేదేన న్యూనవృద్ధి క్షయాదికమ్ || 56 అధర్మో హింసికారూపో ధర్మస్తు సుఖరూపకః | అధర్మాద్ధుఃఖ మాప్నోతి ధర్మాద్వై సుఖమేధతే || 57 విద్యా ద్దుర్వృత్తితో దుఃఖం సుఖం విద్యాత్సువృత్తితః | ధర్మార్జన మతః కుర్యాత్ భోగమోక్ష ప్రసిద్ధయే || 58 కృతము మొదలగు యుగములలో తపస్సు ప్రశస్తమైనది కాగా, కలియుగములో ద్రవ్యధర్మము (దానము) ప్రశస్తమైనది (54). కృతయుగములో ధ్యానము వలన, త్రేతా యుగములో తపస్సు వలన, ద్వాపరములో యజ్ఞానుష్ఠానము వలన, కలియుగములో మూర్తిపూజ వలన జ్ఞానము కలుగును (55). పుణ్యపాపములు ఎట్టివియో, వాటి ఫలము కూడ అట్టిదిగనే యుండును. దానాదులలో ద్రవ్యమును బట్టి, తపస్సులో కాయక్లేశమును బట్టి పుణ్యఫలములో హేచ్చుతగ్గులు ఉండును (56). అధర్మము పీడను, ధర్మము సుఖమును వర్థిల్లజేయును (57). మంచి ప్రవర్తన వలన దుఃఖము, సత్ర్పవర్తన వలన సుఖము కలుగును. కావున, భోగమోక్షములు సిద్ధించుట కొరకై ధర్మమును సంపాదించవలెను (58). సకుటుంబస్య విప్రస్య చతుర్జన యుతస్య చ | శతవర్షస్య వృత్తిం తు దద్యాత్తద్బ్రహ్మలోకదమ్ || 59 చాంద్రాయణ సహస్రం తు బ్రహ్మలోకప్రదం విదుః | సహస్రస్య కుటుంబస్య ప్రతిష్ఠాం క్షత్రియశ్చ రేత్ || 60 ఇంద్రలోకప్రదం విద్యాదయుతం బ్రహ్మలోకదమ్| యాం దేవతాం పురస్కృత్య దాన మాచరతే నరః || 61 తత్తల్లోక మవాప్నోతి ఇతి వేద విదో విదుః అర్థ హీనస్సదా కుర్యాత్తపసా మార్జనం తథా|| 62 తీర్థాచ్చ తపసా ప్రాప్యం సుఖమక్షయ్య మశ్నుతే | నల్గురు వ్యక్తులతో కూడిన కుటుంబము గల బ్రాహ్మణునకు వంద సంవత్సరముల వరకు జీవకను సమకూర్చినచో, అట్టి దానము వలన బ్రహ్మలోకము లభించును (59). వేయి చాంద్రాయణ వ్రతములను చేసినచో, బ్రహ్మలోకము లభించునని చెప్పుదురు. వేయి కుటుంబములకు జీవికను సమకూర్చిన క్షత్రియుడు (60) ఇంద్రలోకమును పొందును. పదివేల మందికి జీవికను కలుగుజేసినచో, బ్రహ్మలోకము లభించును. మానవుడు ఏ దేవతను ఉద్దేశించి దానము చేయునో (61), ఆ లోకమును పొందునని వేదవేత్తలు చెప్పుదురు. ధనము లేనివాడు అన్నివేళలా తపస్సును ఆర్జించవలెను (62). తీర్థసేవనము వలన, తపస్సు వలన అక్షయ సుఖము లభించును. అర్థార్జనమథో వక్ష్యే న్యాయతః సుసమాహితః || 63 కృతాత్ప్రతిగ్రహాచ్చైవ యాజనాచ్చ విశుద్ధితః | అదైన్యాదనతి క్లేశాత్ బ్రాహ్మణో ధనమర్జయేత్ || 64 క్షత్రియో బాహువీర్యేణ కృషిగోరక్షణా ద్విశః| న్యాయార్జితస్య విత్తస్య దానాత్సిద్ధిం సమశ్నుతే || 65 జ్ఞాన సిద్ధ్యా మోక్షసిద్ధిః సర్వేషాం గుర్వనుగ్రహాత్ | మోక్షాత్స్వరూప సిద్ధి స్స్యాత్పరానందం సమశ్నుతే || 66 సత్సంగా త్సర్వమేతద్వై నరాణాం జాయతే ద్విజాః | ధన ధాన్యాదికం సర్వం దేయం వై గృహమేధినా || 67 ఇపుడు న్యాయముగా ధనము నార్జించు విధమును చెప్పెదను (63). బ్రాహ్మణుడు సమాహిత చిత్తము గలవాడై పవిత్రమగు ప్రతిగ్రహము వలన, పవిత్రమగు యాజనము (యజ్ఞాదులను చేయించుట) వలన ధనమును సంపాదించవలెను. ధనార్జనలో దైన్యమునకు, అత్యధిక శ్రమకు తావీయరాదు (64). క్షత్రియుడు భుజబలముతోను, వైశ్యులు వ్యవసాయము చేత, గోపాలన చేత ధనార్జన చేయవలెను. న్యాయముగా సంపాదించిన ధనమును దానము చేయుట వలన జ్ఞానము సిద్ధించును (65). గురువు యొక్క అనుగ్రహముచే జ్ఞానము ఉదయించిన సర్వులకు మోక్షము సిద్ధించును. మోక్షము వలన ఆత్మ సాక్షాత్కారము కలిగి, పరమానందము లభించును(66). ఓ ద్విజులారా! ఇది అంతయూ మానవులకు సత్సంగము వలన లభించును. గృహస్థు ధనధాన్యాదులను ఇతరులకు దానము చేయవలెను (67). యద్యత్కాలే వస్తుజాతం ఫలం వా ధాన్యమేవ చ | తద్యత్సర్వం బ్రాహ్మణభ్యో దేయం వై హిత మిచ్ఛతా || 68 జలం చైవ సదా దేయమన్నం క్షుద్వ్యాధిశాంతయే క్షేత్రం ధాన్యం తథాeôeôమాన్న మన్నమేవం చతుర్విధమ్ || 69 యావత్కాలం యదన్నం వైభుక్త్వా శ్రవణమేధతే | తావత్ కృతస్య పుణ్యస్య త్వర్ధం దాతుర్న సంశయః|| 70 గ్రహీతా హి గృహీతస్య దానాద్వై తపసా తథా | పాపసంశోధనం కుర్యాదన్యథా రౌరవం వ్రజేత్ || 71 ఏయే కాలముల యందు ఏయే వస్తువులు, ఫలములు, మరియు ధాన్యములు లభించునో, వాటి నన్నిటినీ, హితము గోరు మానవుడు బ్రాహ్మణులకు ఈయవలెను (68). ఇతరులకు త్రాగునీటిని సర్వదా ఈయవలెను. ఆకలి అను రోగమును శాంతింపజేయుటకై అన్నము నీయవలెను. భూమిని, ధాన్యమును, బియ్యమును, భక్ష్యభోజ్య లేహ్య చోష్యములను నాల్గు విధముల అన్నమును దానము చేయవలెను (69). దాత పెట్టిన అన్నమును తినిన వ్యక్తి ఆ శక్తితో ఎంతవరకు శ్రవణాదులచే పుణ్యమును సంపాదించునో, దానిలో సగము పుణ్యము ఆ దాతకు లభించు ననుటలో సందేహము లేదు (70). దానమును స్వీకరించిన వ్యక్తి దానిలో కొంత భాగమును మరల దానము చేసి, మరియు తపస్సును చేసి, ఆ పాపమును పోగొట్టుకొనవలెను. అట్లు గానిచో, రౌరవనరకమును పొందెదరు (71). ఆత్మ విత్తం త్రిధా కుర్యాత్ ధర్మ వృద్ధ్యాత్మ భోగతః | నిత్యం నైమిత్తికం కామ్యం కర్మ కుర్యాత్తు ధర్మతః || 72 విత్తస్య వర్ధనం కుర్యాత్ వృద్ధ్యం శేన హి సాధకః | హితేన మిత మేధ్యేన భోగం భాగాంశతశ్చరేత్ || 73 కృష్యర్జితే దశాంశం హి దేయం పాపస్య శుద్ధయే | శేషేణ కుర్యాద్ధర్మాది అన్యథా రౌరవం వ్రజేత్ || 74 అథవా పాపబుద్ధి స్స్యాత్ క్షయం వా సత్యమేష్యతి | వృద్ధి వాణిజ్యకే దేయః షడంశో హి విచక్షణౖః || 75 మానవుడు తనవద్దనున్న ధనమును, ధర్మ, వృద్ధి, భోగముల కొరకు మూడు భాగములు చేసి, ధర్మ భాగముతో నిత్య నైమిత్తిక, కామ్య కర్మలను చేయవలెను (72). వృద్ధి భాగముతో ధనమును వృద్ధి చేసుకొనవలెను. సాధకుడు భోగభాగముతో హితము, పవిత్రము నగు భోగమును మితముగా సేవించవలెను. (73). వ్యవసాయము వలన లభించే ధనములో పదవ వంతును పాప నిర్మూలన కొరకు దానము చేయవలెను. మిగిలిన ధనముతో ధర్మ, వృద్ధి, భోగములను చేయవలెను. అట్లు గానిచో రౌరవ నరకమును పొందును (74). లేదా, పాపముతో నిండిన బుద్ధి కలవాడగును; లేదా నిశ్చితముగా వినాశమును పొందును. వివేకులైన వారు వ్యాపారుములో లభించిన ధనములో ఆరవ భాగమును దానము చేయవలెను (75). శుద్ధ ప్రతిగ్రహే దేయ శ్చతుర్థాంశో ద్విజోత్తమైః | అకస్మాదుత్థితేeôర్థే హి దేయమర్థం ద్విజోత్తమైః|| 76 అసత్ర్పతిగ్రహం సర్వం దుర్దానం సాగరే క్షిపేత్ | ఆహూయ దానం కర్తవ్య మాత్మభోగ సమృద్ధయే || 77 పృష్టం సర్వం సదా దేయ మాత్మ శక్త్యనుసారతః | జన్మాంతరే ఋణీ హి స్యాదదత్తే పృష్ట వస్తుని || 78 పరేషాం చ తథా దోషం న ప్రశంసే ద్విచక్షణాః | విశేషేణ తథా బ్రహ్మాన్ శ్రుతం దృష్టం చ నో వదేత్ || 79 బ్రహ్మణులు తాము పొందిన పవిత్రమగు ప్రతిగ్రహములో నాల్గవ వంతును, అకస్మాత్తుగా లభించిన ధనములో సగమును దానము చేయవలెను (76). అపవిత్రమగు ప్రతి గ్రహము వలన లభించిన సర్వమును సముద్రములో పడవేయవలెను. మానవుడు తనకు భోగభాగ్యములు కలుగుట కొరకై విద్వాంసులను ఆహ్వానించి, దానము చేయవలెను (77). యాచకుడు అడిగిన వాటిని సర్వమును తన శక్తి మీరకుండగా దానము చేయవలెను. కోరిన వస్తువును దానము చేయనిచో, కోరబడినవాడు ఆ ఋణమును మరుజన్మలో తీర్చవలయును (78). వివేకులు ఇతరుల దోషమును వర్ణించరాదు. ఓ బ్రాహ్మణులారా! మనము కనిన, లేక వినిన పరదోషములను ప్రకటించరాదు (79). న వదేత్సర్వ జంతూనాం హృది రోషకరం బుధః | సంధ్యయో రగ్ని కార్యం చ కుర్యాదైశ్వర్య సిద్ధయే || 80 అశక్తస్త్వేకకాలే వా సూర్యాగ్నీ చ యథావిధి | తండులం ధాన్యమాజ్యం వా ఫలం కందం హవిస్తథా || 81 స్థాలీపాకం తథా కుర్యా ద్యథాన్యాయం యథావిధి | ప్రధానహోమ మాత్రం వా హవ్యాభావే సమాచరేత్ || 82 నిత్య సంధాన ముక్తం తమజస్రం విదుర్బుధాః | అథవా జపమాత్రం వా సూర్యవందనమేవ చ || 83 వివేకి ఇతరుల హృదయమునకు దుఃఖమును కలిగించే విధంగా పలుకరాదు. ఐశ్వర్యప్రాప్తి కొరకై ఉభయసంధ్యలలో అగ్నిహోత్రమును అనుష్ఠించవలెను (80). రెండుసార్లు అగ్నిహోత్రమును చేయుటకు శక్తి లేనిచో ఏకకాలము నందైననూ సూర్యాగ్నులకు బియ్యము, ధాన్యము, నేయి, పండు, దుంప, ఇత్యాది హవిస్సును యాథాశాస్త్రముగా అర్పించవలెను (81). మరియు, యథావిధిగా స్థాలీపాకమును చేయవలెను. హవిస్సు లేనిచో ప్రధాన హోమమునైననూ చేయవలెను (82). ఏనాడూ ఆరిపోని అగ్నిని విద్వాంసులు అజస్రమని పిలుతురు. అట్లు అగ్నిని ఉపాసించలేనివాడు జపమునైననూ, కనీసము సూర్యునకు నమస్కారమునైననూ చేయవలెను (83). ఏవమాత్మర్థినః కుర్యురర్థార్థీ చ యథావిధి | బ్రహ్మయజ్ఞరతా నిత్యం దేవపూజారతాస్తథా || 84 అగ్ని పూజా పరా నిత్యం గురుపూజా రతాస్తథా | బ్రహ్మణానాం తృప్తి కరాస్సర్వే స్వర్గస్య భాగినః || 85 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయాం త్రయోదశోeôధ్యాయః (13). ఆత్మ జ్ఞానమును గోరువారు, మరియు ధనమును కోరువారు ఈ విధముగా యథాశాస్త్రముగా ఉపాసించవలెను. బ్రహ్మయజ్ఞమును శ్రద్ధతో అనుష్ఠించువారు, ప్రతిదినము ఈశ్వరుని పూజించువారు (84). అగ్ని ఉపాసనాపరులు, గురు శశ్రూషను శ్రద్ధగా చేయువారు, బ్రాహ్మణులకు తృప్తిని కలిగించువారు వీరందరు స్వర్గమును పొందెదరు (85). శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు పదమూడవ అధ్యాయము ముగిసినది (13).