Sri Sivamahapuranamu-I
Chapters
అథ చతుర్దశోSధ్యాయః మూడు యజ్ఞములు - ఏడు వారములు ఋషయ ఊచుః | అగ్ని యజ్ఞం దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం తథైవ చ | గురుపూజాం బ్రహ్మతృప్తిం క్రమేణ బ్రూహి నః ప్రభో ||
1 ఋషులు ఇట్లు పలికిరి - ఓ మహానుభావా! అగ్ని యజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మ యజ్ఞములను, గురుపూజను, బ్రహ్మ తృప్తిని గురించి మాకు క్రమముగా వివరింపుము (1). సూత ఉవాచ | అగ్నౌ జుహోతి యద్ద్రవ్యమగ్ని యజ్ఞస్స ఉచ్యతే | బ్రహ్మచర్యాశ్రమస్థానాం సమిదాధాన మేవ హి ||
2 సమిదగ్నౌ వ్రతాద్యం చ విశేషయజనాదికమ్ | ప్రథమాశ్రమిణా మేవం యావదౌపాసనం ద్విజాః ||
3 ఆత్మ న్యారోపితాగ్నీనాం వనినాం యతినాం ద్విజాః | హితం చ మితమే ధ్యాన్నం స్వకాలే భోజనం హుతిః ||
4 ఔపాసనాగ్ని సంధానం సమారభ్య సురక్షితమ్ | కుండే వాప్యథ భాండే వా తదజస్రం సమీరితమ్ ||
5 సూతుడిట్లు పలికెను- అగ్ని యందు హోమద్రవ్యమును సమర్పించే కర్మకు అగ్ని యజ్ఞమని పేరు. ఓ ద్విజులారా! బ్రహ్మ చర్యము అనే మొదటి ఆశ్రమము నందు ఉండువారు అగ్ని యందు సమిధలను హోమము చేయవలెను (2). వ్రతములను పాలించవలెను. గృహస్థాశ్రమమును స్వీకరించి, ఔపాసన కర్మను చేయునంతవరకు విశేష యజ్ఞములను చేయవలెను (3). ఓ ద్విజులారా! ఆత్మ యందు ఆవాహన చేయబడిన అగ్నులు గల వాసప్రస్థులకు, యతులకు హితకరము, పవిత్రమునగు ఆహారమును మితముగా సకాలములో భుజించుటయే అగ్ని యజ్ఞము అగును (4). ఔపాసనాగ్నిని స్థాపించిన నాటి నుండి ఒక భాండములో గాని, గర్తములో గాని ఆరిపోకుండా సురక్షితముగా నుంచినచో, దానికి అజస్రము అని పేరు (5). అగ్ని మాత్మన్యరణ్యాం వా రాజదైవవశాత్ ధ్రువమ్ | అగ్ని త్యాగ భయాదుక్తం సమారోపితముచ్యతే || 6 సంపత్కరీ తథా జ్ఞేయా సాయమగ్న్యాహుతిర్ద్విజాః | ఆయుష్క రీతి విజ్ఞేయా ప్రాతస్సూర్యా హుతి స్తథా || 7 అగ్ని యజ్ఞో హ్యయం ప్రోక్తో దివా సూర్యనివేశనాత్ | ఇంద్రా దీన్సకలాన్దేవా నుద్ది శ్యాగ్నౌ జహోతి యత్ || 8 దేవయజ్ఞం హి తం విద్యాత్ స్థాలీపాకాదికాన్ క్రతూన్ | చౌలాదికం తథా జ్ఞేయం లౌకికాగ్నౌ ప్రతిష్ఠితమ్ || 9 రాజ భయము వలన గాని, దైవము ప్రతికూలమగుట వలన గాని, అగ్నిని సంరక్షించలేని పరిస్థితిలోఆత్మ యందు, లేక అరణి యందు న్యాసము చేయబడిన అగ్నికి సమారోపితమని పేరు (6). ఓ ద్విజులారా! సాయంకాలమందు అగ్ని యందీయబడిన ఆహుతి సంపత్తును కలిగించును. ఉదయము ఈయబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని కలిగించును (7). పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడును. కావున, ఈ ఆహుతులకు అగ్ని యజ్ఞము అని పేరు వచ్చినది. స్థాలీపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతల నుద్దేశించి అగ్ని యందు హోమము చేయుదురు (8). అది దేవయజ్ఞ మనబడును. చూడా కరణాది సంస్కారములలో లౌకికాగ్ని యందు చేయబడే హోమము కూడ దేవయజ్ఞమనబడును (9). బ్రహ్మ యజ్ఞం ద్విజః కుర్యాత్ దేవానాం తృప్తయేsసకృత్ | బ్రహ్మయజ్ఞ ఇతి ప్రోక్తో వేదస్యాధ్యయనం భ##వేత్ || 10 నిత్యానంతరమాసాయం తతస్తు న విధీయతే | అనగ్నౌ దేవయంజనం శృణుత శ్రద్ధయాదరాత్ || 11 బ్రాహ్మణుడు దేవతల తృప్తి కొరకు నిత్యము బ్రహ్మయజ్ఞమును చేయవలెను. వేదాధ్యయనమునకు బ్రహ్మయజ్ఞమని పేరు (10). ఉదయము నిత్యకర్మను ఆచరించి, తరువాత సాయంకాలము వరకు వేదమును పఠించవలెను. రాత్రి యందు వేదపఠనమునకు విధి లేదు. అగ్ని లేకుండగనే చేయు దేవయజ్ఞమును సాదరముగా వినిపించెదను శ్రద్ధగా వినుడు. ఆది సృష్టౌ మహాదేవః సర్వజ్ఞః కరుణాకరః | సర్వ లోకోపకార్ధం వారాన్ కల్పితవాన్ ప్రభుః || 12 సంసారవైద్య స్సర్వజ్ఞ స్సర్వ భేషజమ్ | ఆదావారోగ్య దం వారం స్వవారం కృతవాన్ ప్రభుః || 13 సంపత్కరం స్వమాయాయా వారం చ కృతవాంస్తతః | జననే దుర్గతి క్రాంత్యై కుమారస్య తతః పరమ్ || 14 ఆలస్య దురతి క్రాంత్యై వారం కల్పితవాన్ ప్రభుః | రక్షకస్య తథా విష్ణోర్లోకానాం హిత కామ్యయా || 15 పుష్ట్యర్థం చైవ రక్షార్థం వారం కల్పితవాన్ ప్రభుః | ఆయుష్కరం తతో వార మాయుషాం కర్తురేవ హి || 16 త్రైలోక్య సృష్టి కర్తుర్హి బ్రహ్మణః పరమేష్ఠినః | జగదాయుష్య సిద్ధ్యర్ధం వారం కల్పితవాన్ ప్రభుః || 17 సర్వజ్ఞుడు, కరుణా సముద్రుడు, సర్వ సమర్థుడు నగు మహాదేవుడు సృష్ట్యాది యందు సర్వప్రాణుల క్షేమము కొరకై వారములను కల్పించెను (12). సంసారమనే రోగమునకు వైద్యుడు, సర్వజ్ఞుడు, సర్వ సమర్థుడు నగు శివుడు ఔషధములలో కెల్ల ఔషధమై ఆరోగ్యము నిచ్చు తన వారమును ముందుగా చేసెను (13). తరువాత సంపత్తుల నిచ్చే, తన మాయ యొక్క వారమును, ఆ తరువాత జన్మ సమయములో శిశువు యొక్క కష్టములను దాటుట కొరకై కుమారవారమును చేసెను (14). లోక కల్యాణమును చేయగోరి సర్వ సమర్థుడగు శివుడు, సోమరితనమును పోగొట్టే, రక్షకుడగు విష్ణువు యొక్క వారమును మానవుల పుష్టి కొరకు, రక్షణ కొరకు కల్పించెను (15). జగన్నాథుడగు శివుడు తరువాత, ముల్లోకములను సృష్టించి ప్రాణుల ఆయుష్షులను నిర్ణయించే (16) పరమేష్ఠియగు బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమగు వారమును మానవులకు ఆయుష్షు లభించుట కొరకై కల్పించెను (17). ఆదౌ త్రైలోక్య వృద్ధ్యర్ధం పుణ్యపాపే ప్రకల్పితే | తయోః కర్త్రోస్తతో వార మింద్రస్య చ యమస్య చ || 18 భోగప్రదం మృత్యుహరం లోకానాం చ ప్రకల్పితమ్ | ఆదిత్యాదీన్ స్వస్వరూపాన్ సుఖదుఃఖస్య సూచకాన్ || 19 వారేశాన్ కల్పయిత్వాదౌ జ్యోతిశ్చక్రే ప్రతిష్ఠితాన్ | స్వస్వవారే తు తేషాం తు పూజా స్వస్వ ఫలప్రదా || 20 ఆరోగ్యం సంపదశ్చైవ వ్యాధీనాం శాంతిరేవచ | పుష్టిరాయుస్తథా భోగో మృతేర్హాని ర్యథా క్రమమ్ || 21 సృష్ట్యాది యందు ముల్లోకముల అభివృద్ధి కొరకు పుణ్యపాపములు కల్పింపబడెను. తరువాత, వాటి పాలకులగు ఇంద్ర, యములకు వారములు కల్పింపబడెను (18). ఈ రెండు వారములు మానవులకు భోగముల నిచ్చి, మృత్యువును హరించును. మానవులకు సుఖదుఃఖములను సూచించునట్టియు, శివస్వరూపులైనట్టియు, వారములకు ప్రభువులైన ఆదిత్యాది దేవతలను (19) శివుడు సృష్ట్యాది యందు గ్రహమండలము నందు ప్రతిష్ఠించెను. ఆయా దేవతల వారములలో వారిని పూజించుట వలన ఆయా ఫలములు కలుగును (20). ఆరోగ్యము, సంపదలు, వ్యాధి నాశము, పుష్ఠి, ఆయుర్దాయము, భోగము, అమృతత్వము అను ఫలములు క్రమముగా కలుగును (21). వారక్రమఫలం ప్రాహుర్దేవ ప్రీతి పురస్సరమ్ | అన్యేషామపి దేవానాం పూజాయాః ఫలదశ్శివః || 22 దేవానాం ప్రీతయే పూజా పంచధైవ ప్రకల్పితా | తత్తన్మంత్ర జపో హోమో దానం చైవ తపస్తథా || 23 స్థండిలే ప్రతిమాయాం చ హ్యగ్నౌ బ్రాహ్మణ విగ్రహే | సమారాధన మిత్యేవం షోడశైరుపచారకైః || 24 ఉత్తరోత్తర వైశిష్ట్యో త్పూర్వా భావే తథోత్తరమ్ | ఆయా దేవతలు సంతసించినచో, క్రమముగా ఆయా వారఫలములు కలుగును. ఇతర దేవతలను పూజించిననూ, ఫలము నిచ్చువాడు శివుడు మాత్రమే (22). దేవతల ప్రీతి కొరకు ఐదు విధముల పూజ కల్పించబడినది. ఆయా మంత్రముల జపము, హోమము, దానము తపస్సు (23), మరియు సమారాధనము అనునవి ఐదు విధములు. సమారాధన మనగా వేదిని, ప్రతిమను, అగ్నిని, లేక బ్రాహ్మణుని షోడశోపచారములతో పూజించవలెను (24). ఈ నాలుగింటిలో ముందు దాని కంటె తరువాతది గొప్పది గనుక, పూర్వము లేకున్ననూ ఉత్తరమును పూజించవలెను. నేత్రయో శ్శిరసో రోగే తథా కుష్ఠస్య శాంతయే || 25 ఆదిత్యం పూజయిత్వా బ్రాహ్మణాన్ భోజయేత్తతః | దినం మాసం తథా వర్షం వర్షత్రయా మథాపి వా || 26 ప్రారబ్ధం ప్రబలం చేత్ స్యాన్నశ్యే ద్రోగజరాదికమ్ | జపాద్యమిష్టదేవస్య వారాదీనాం ఫలం విదుః || 27 పాపశాంతి ర్విశేషేణ హ్యాదివారే వివేదయేత్ | ఆదిత్య సై#్యవ దేవానాం బ్రహ్మణనాం విశిష్టదమ్ || 28 నేత్రరోగము, శిరోరోగము, మరియు కుష్ఠురోగము తగ్గుట కొరకై (25) ఆదిత్యుని పూజించి, బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఈ విధముగా ఒక దినము, మాసము, సంవత్సరము, లేక మూడు సంవత్సరములు చేయవలెను (26). అపుడు రోగము నిచ్చిన ప్రారబ్ధము బలీయమైననూ, రోగము, వృద్ధాప్యము మొదలగునవి తొలగిపోవును. ఆయా వారములలో ఇష్టదేవత నుద్దేశించి జపాదులను చేసినచో, ఆయా ఫలములు లభించును (27). ఆదివారమునాడు ఆదిత్యుని, ఇతర దేవతలను, బ్రాహ్మణులను పూజించినచో, పాపములు తొలగి గొప్ప ఫలము లభించును (28). సోమవారే చ లక్ష్యాదీన్ సంపదర్థే యజేద్బుధః | ఆజ్యాన్నేన తథా విప్రాన్ సపత్నీకాంశ్చ భోజయేత్ || 29 కాల్యాదీన్ భౌమవారే తు యజేద్రోగ ప్రశాంతయే | మాషముద్గాఢకాన్నేన బ్రాహ్మణాంశ్చైవ భోజయేత్ || 30 సౌమ్యవారే తథా విష్ణుం దధ్యన్నేన యజేద్బుధః | పుత్ర మిత్ర కలత్రాది పుష్టిర్భవతి సర్వదా || 31 ఆయుష్కామో గురోర్వారే దేవానాం పుష్టిసిద్ధయే | ఉపవీతేన వస్త్రేణ క్షీరాజ్యేన యజేద్బుధః || 32 భోగార్థం భృగువారే తు యజేద్దేవాన్ సమాహితః | షడ్రసోపేతమన్నం చ దద్యా ద్బ్రాహ్మణ తృప్తయే || 33 స్త్రీ ణాం చ తృప్తయే తద్వత్ దేయం వస్త్రాదికం శుభమ్ | వివేకి సోమవారము నాడు సంపద కొరకై లక్ష్మి మొదలగు దేవతలను ఆరాధించి, బ్రాహ్మణ దంపతులకు నేయి అన్నమును భోజనము పెట్టవలెను (29). మంగల వారము నాడు రోగములు తగ్గుట కొరకై కాళి మొదలగు దేవతలను పూజించి, మినుము, కంది, పెసర పప్పులతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను (30). బుధవారమునాడు పండితుడు పెరుగు అన్నమును నైవేద్యమిడి విష్ణువును ఆరాధించవలెను. అట్లు చేసినచో, కుమారులు, మిత్రులు, భార్య మొదలగు వారికి అన్ని కాలముల యందు ఆరోగ్యము కలుగును (31). ఆయుష్షును, ఆరోగ్యమును కోరే వివేకి గురువారమునాడు దేవతలను ఉపవీతముతో, వస్త్రములతో, పాలతో, నేయితో అర్చించవలెను (32). శుక్రవారమునాడు శ్రద్ధ గలవాడై దేవతలను పూజించినచో, భోగములు కలుగును. బ్రాహ్మణుల తృప్తి కొరకు షడ్రుచులతో కూడిన అన్నమును ఇచ్చుటయే గాక (33), స్త్రీల తృప్తి కొరకు శుభమగు వస్త్రములు మొదలగు వాటిని ఈయవలెను. అపమృత్యుహరం మందే రుద్రాదీంశ్చ యజేద్బుధః || 34 తిలహోమేన దానేన తిలాన్నేన చ భోజయేత్ | ఇత్థం యజేచ్చ విబుధానారోగ్యాది ఫలం లభేత్ || 35 దేవానాం నిత్యయజనే విశేష యజనేపి చ | స్నానే దానే జపే హోమే బ్రాహ్మణానాం చ తర్పణ || 36 తిథి నక్షత్ర యోగే చ తత్తద్దేవ ప్రపూజనే | ఆదివారాది వారేషు సర్వజ్ఞో జగదీశ్వరః || 37 తత్తద్రూపేణ సర్వేషా మారోగ్యాది ఫలప్రదః | శనివారము నాడు రుద్రాది దేవతల నారాధించు వివేకి అపమృత్యువు నుండి తప్పించుకొనును (34). ఆనాడు తిలలతో హోమము చేసి, తిలలను దానమిచ్చి, తిలాన్నముతో పండితులకు భోజనము నిడినచో, ఆరోగ్యము మొదలగు ఫలములు లభించును (35). దేవతలను నిత్యము ఆరాధించవలెను. తీర్థములో స్నానమాడి, జప హోమ దానములను చేయవలెను. బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను (36). ఆది మొదలగు వారములలో తిథి నక్షత్రములు కలిసి వచ్చినప్పుడు ఆయా దేవతలను పూజించవలెను. సర్వజ్ఞుడు, జగత్ర్పభువు నగు శివుడు (37) ఆయా దేవతల రూపములో భక్తులందరికీ ఆరోగ్యము మొదలగు ఫలముల నిచ్చును. దేశకాలనుసారేణ తథా పాత్రానుసారతః || 38 ద్రవ్య శ్రద్దానుసారేణ తథా లోకానుసారతః | తారతమ్య క్రమాద్దేవస్త్వారోగ్యాదీన్ ప్రయచ్ఛతి || 39 శుభాదావశుభాంతే చ జన్మర్ క్షేషు గృహే గృహే | ఆరోగ్యాది సమృద్ధ్యర్థ మాదిత్యాదీన్ గ్రహాన్ యజేత్ || 40 తస్మాద్వై దేవ యజనం సర్వాభీష్ట ఫలప్రదమ్ | సమంత్రకం బ్రాహ్మణానాం అన్యేషాం చైవ తాంత్రికమ్ || 41 యథా శక్త్యను రూపేణ కర్తవ్యం సర్వదా నరైః | సప్తస్వపి చ వారేషు నరై శ్శుభఫలేప్సుభిః || 42 దేశము, కాలము, పాత్రల కనుగుణముగా (38), ద్రవ్యము, శ్రద్ధ, మరియు లోకములకు, తారతమ్యములకు అనురూపముగా మహాదేవుడు ఆరోగ్యము మొదలగు ఫలముల నిచ్చును (39). గృహస్థుడు తన గృహములో శుభకర్మలకు ఆదియందు, అశుభకర్మలకు అంతము నందు, జన్మ నక్షత్రము నాడు ఆరోగ్యాది సమృద్ధులు సిద్ధిం చుట కొరకు ఆదిత్యాది గ్రహములను పూజించవలెను (40). దేవతారాధనము కోరిన ఫలముల నన్నిటినీ ఇచ్చును. బ్రాహ్మణులు మంత్రయుక్తముగను, ఇతరులు తంత్రయుక్తముగను దేవయజ్ఞమును చేయవలెను (41). శుభ ఫలమును గోరు మానవులు ఏడు వారములలో తమ శక్తికి అనురూపముగా దేవపూజను చేయవలెను (42). దరిద్రస్తపసా దేవాన్ యజే దాఢ్యో ధనేన హి | పునశ్చైవం విధం ధర్మం కురుతే శ్రద్ధయా సహ || 43 పునశ్చ భోగాన్వివిధాన్ భుక్త్వా భూమౌ ప్రజాయతే | ఛాయాం జలాశయం బ్రహ్మ ప్రతిష్ఠాం ధర్మ సంచయమ్ || 44 సర్వం చ విత్తవాన్ కుర్యాత్సదా భోగప్రసిద్ధయే | కాలాచ్చ పుణ్యపాకేన జ్ఞానసిద్ధిః ప్రజాయతే || 45 య ఇమం శృణుతేsధ్యాయం పఠతే వా నరో ద్విజాః | శ్రవణ స్యోపకర్తా చ దేవయజ్ఞ ఫలం లభేత్ || 46 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయాం చతుర్దశోsధ్యాయః (14). దరిద్రుడు తపస్సుతో దేవతల నారాధించవలెను. ధనికుడు ధనమును వినియోగించి, శ్రద్ధతో దేవపూజనము మొదలగు ధర్మముల ననుష్ఠించినచో (43) పరలోకములో వివిధ భోగముల ననుభవించి, మరల భూలోకములో జన్మించును. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులను తవ్వించుట, వేద పాఠశాలలను స్థాపించుట ఇత్యాది అనేక ధర్మ కార్యములను (44) ధనవంతుడు చేసినచో, అనేక భోగములను పొందును. అట్టి దాత కాలక్రమములో పుణ్య ప్రభావముచే జ్ఞానసిద్ధిని కూడ పొందును (45). ఓ ద్విజులారా! ఏ మానవుడైతే ఈ అధ్యాయమును వినునో, పఠించునో, వినుటకు సహకరించునో, అతడు దేవయజ్ఞ ఫలమును పొందును (46). శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యాందు పదునాలుగవ అధ్యాయము ముగిసినది.