Sri Sivamahapuranamu-I
Chapters
అథ అష్టాదశోsధ్యాయః శివలింగ మహిమ ఋషుయ ఊచుః | బంధమోక్ష స్వరూపం హి బ్రూహి సర్వార్థ విత్తమ | ఋషులిట్లు పలికిరి - సర్వశాస్త్రముల నెరింగిన వారిలో శ్రేష్ఠుడవగు ఓ సూతా! బంధమోక్షముల స్వరూపమును చెప్పుము. సూత ఉవాచ | బంధమోక్షం తథోపాయం వక్ష్యేsహం శృణుతాదరాత్ ||
1 ప్రకృత్యాద్యష్టబంధేన బద్ధో జీవస్స ఉచ్యతే | ప్రకృత్యాద్యష్ట బంధేన నిర్ముక్తో ముక్త ఉచ్యతే ||
2 ప్రకత్యాది వశీకారో మోక్ష ఇత్యుచ్యతే స్వతః | బద్ధ జీవస్తు నిర్ముక్తో ముక్త జీవస్స కథ్యతే ||
3 ప్రకృత్యగ్రే తతో బుద్ధి రహంకారో గుణాత్మకః | పంచనాత్మత్ర మిత్యతే ప్రకృత్యా ద్యష్టకం విదుః ||
4 సూతుడిట్లు పలికెను - బంధమును, మోక్షమును, మరియు మోక్షోపాయమును నేను వర్ణించెదను. మీరు శ్రద్ధతో వినుడు (1). ప్రకృతి మొదలగు ఎనిమిది బంధములచే బంధింపబడిన జీవుడు బద్ధుడనబడును. ప్రకృతి మొదలగు ఎనిమిది బంధముల నుండి విడుదల పొందిన జీవుడు ముక్తుడనబడును (2). ప్రకృతి మొదలగు వాటిని వశము చేసుకొనుటయే మోక్షమనబడును. మోక్షము స్వతస్సిద్ధము. బద్ధ జీవుడు ముక్తుడైన పిదప ముక్తజీవుడనబడును (3). ప్రకృతి, సమష్టి బుద్ధి, త్రిగుణాత్మకమగు అహంకారము, అయిదు తన్మాత్రలు (సూక్ష్మభూతములు) అను ఎనిమిది తత్త్వములకు ప్రకృత్యాద్యష్టకమని పేరు (4). ప్రకృత్యాద్యష్టజో దేహో దేహజం కర్మ ఉచ్యతే | పునశ్చ కర్మజో దేహో జన్మ కర్మ పునః పునః ||
5 శరీరం త్రివిధం జ్ఞేయం స్థూలం సూక్ష్మం చ కారణమ్ | స్థూలం వ్యాపారదం ప్రోక్తం మింద్రియ భోగదమ్ ||
6 కారణం త్వాత్మ భోగార్ధం జీవకర్మానురూపతః | సుఖం దుఃఖం పుణ్యపాపైః కర్మభిః ఫలమశ్నుతే ||
7 తస్మాద్ధి కర్మరజ్జ్వా హి బద్ధో జీవః పునః పునః | శరీరత్రయ కర్మభ్యాం చక్రవద్భ్రామ్యతే సదా ||
8 దేహము ఈ ప్రకృత్యా ద్యష్టకము నుండి పుట్టును. దేహము నుండి కర్మ పుట్టును. మరల కర్మ నుండి దేహము పుట్టును. ఇట్లు జన్మ నుండి కర్మ, కర్మ నుండి జన్మ మరల మరల పుట్టుచుండును (5). శరీరము స్థూల, సూక్ష్మ కారణరూపమున మూడు విధములుగ నున్నది. స్థూలశరీరము క్రియలను నిర్వర్తించును. సూక్ష్మ శరీరము ఇంద్రియభోగముల నిచ్చును (6). కారణశరీరము ఆత్మానందమును ఇచ్చును. జీవుడు తన కర్మల కనురూపముగా పుణ్య పాపములను, వాటి వలన సుఖదుఃఖరూప ఫలమును పొందును (7). ఇట్లు జీవుడు కర్మ యను త్రాటిచే కట్టబడి, మూడు శరీరములతో, కర్మలతో కూడి సర్వదా సంసార చక్రములో తిరుగాడుచుండును (8). చక్రభ్రమ నివృత్త్యర్థం చక్రకర్తార మీడయేత్ | ప్రకృత్యాది మహా చక్రం ప్రకృతేః పరతశ్శివః ||
9 చక్రకర్తా మహేశో హి ప్రకృతేః పరతో యతః | పిబతి వాథ వమతి జీవన్ బాలో జలం యథా ||
10 శివస్తథా ప్రకృత్యాది వశీకృత్యాధి తిష్ఠతి | సర్వం వశీకృతం యస్మాత్తస్మాచ్ఛివ ఇతి స్మృతః ||
11 శివ ఏవ హి సర్వజ్ఞః పరిపూర్ణశ్చ నిస్స్పృహః || 12 సర్వజ్ఞతా తృప్తిరనాది బోధః స్వతంత్రతా నిత్యమ లుప్త శక్తిః | అనంత శక్తిశ్చ మహేశ్వరస్య యన్మానసైశ్వర్య మవైతి వేదః ||
13 ఈ సంసార చక్ర భ్రమణమును నివారించుటకై చక్రమును సృష్టించిన ఈశ్వరుని ప్రార్ధించవలెను. ప్రకృత్యాద్యష్టకమే ఈ మహాచక్రము. శివుడు ప్రకృతి కంటె పైవాడు (9). ప్రకృతి కంటె ఉత్కృష్టుడగు మహేశ్వరుడు చక్రకర్త. బీజము నీటిని పీల్చి, ఉబ్బి, అంకురించును (10). అటులనే, శివుడు ప్రకృత్యాద్యష్టకమును వశపరచుకొని, సృష్టిని చేయును. సర్వము వశములో నుండుట చేతనే, ఆయనకు శివుడను పేరు వచ్చినది (11). శివుడే సర్వజ్ఞుడు. పరిపూర్ణుడు. కామనలు లేనివాడు (12). సర్వజ్ఞత్వము, తృప్తి, అనాది జ్ఞానము, స్వాతంత్ర్యము మరియు నిత్యమైన, లోపము లేని, అనంతమైన శక్తి మహేశ్వరునకు గలవు. శివుని ఈ ఐశ్వర్యములను వేదము మాత్రమే తెలియగలదు (13). అతశ్శివ ప్రసాదేన ప్రకృత్యాది వశం భ##వేత్ | శివప్రసాదలాభార్ధం శివమేవ ప్రపూజయేత్ ||
14 నిస్స్పృహస్య చ పూర్ణస్య తస్య పూజా కథం భ##వేత్ | శివోద్దేశకృతం కర్మ ప్రసా జనకం భ##వేత్ ||
15 లింగే బేరే భక్తజనే శివముద్దిశ్య పూజయేత్ | కాయేన మనసా వాచా ధనేనాపి ప్రపూజయేత్ ||
16 పూజయా తు మహేశో హి ప్రకృతేః పరమశ్శివః | ప్రసాదం కురుతే సత్యం పూజకస్య విశేషతః ||
17 కావున, శివుని అనుగ్రహమున్నచో ప్రకృత్యాదులు వశమగును. శివుని అనుగ్రహమును పొందుట కొరకై ఆయనను పూజిచవలెను (14). కామనలు లేనివాడు, పూర్ణడు అగు శివుని పూజించుట యెట్లు? శివుని ఉద్దేశించి చేసిన కర్మయే అనుగ్రహమును కలిగించును (15). లింగమునందు, మూర్తియందు, భక్తుని యందు శివుని భావన చేసి, శరీరముతో, మనస్సుతో, వాక్కుతో మరియు ధనముతో సాదరముగా పూజించవలెను (16). ప్రకృతి కంటె పైవాడగు శివుడు భక్తుని పూజచే మిక్కిలి సంతసించి నిశ్చయముగా విశేషానుగ్రహమును చేయును (17). శివప్రసాదాత్కర్మాద్యం క్రమేణ స్వవశం భ##వేత్ | కర్మారభ్య ప్రకృత్యంతం యదా సర్వం వశం భ##వేత్ ||
18 తదా ముక్త ఇతి ప్రోక్తః స్వాత్మారామో విరాజతే | ప్రసాదాత్పరమేశస్య కర్మ దేహో యదా వశః ||
19 తదా వై శివలోకే తు వాసః సాలోక్య ముచ్యతే | సామీప్యం యాతి సాంబస్య తన్మత్రే చ వశం గతే ||
20 తదా తు శివసాయుజ్యమాయు ధాద్యైః క్రియాదిభిః | మహాప్రసాద లాభే చ బుద్ధిశ్చాపి వశా భ##వేత్ ||
21 సాధకునకు శివుని యనుగ్రహము వలన కర్మ మొదలగునవి క్రమముగా స్వాధీనమగును. కర్మతో మొదలిడి ప్రకృతి వరకు గల సర్వము ఎవనికి స్వాధీనమగునో (18), వాడు ముక్తుడనబడును. ముక్తుడు ఆత్మారాముడై విరాజిల్లును. పరమేశ్వరుని అనుగ్రహము వలన కర్మ, దేహము వశము కాగానే (19), సాధకునకు శివలోక నివాసము లభించును. దీనికి సాలోక్యమని పేరు. తన్మాత్రలు వశము కాగానే, అతడు సాంబుని సామీప్యమును పొందును (20). దీని యందు ముక్తునకు శివునితో సమానమైన ఆయుధములు, క్రియలు మొదలగునవి సిద్ధించును. శివుని మహానుగ్రహము లభించిన సాధకునకు సమష్టిబుద్ధి కూడ వశమగును. బుద్ధిస్తు కార్య ప్రకృతేస్తత్సార్ ష్టి రితి కథ్యతే | పునర్మహా ప్రసాదేన ప్రకృతిర్వశ##మేష్యతి ||
22 శివస్య మానసైశ్వర్యం తదాsయత్నం భవిష్యతి | సార్వజ్ఞాద్యం శివైశ్వర్యం లబ్ధ్వా స్వాత్మని రాజతే ||
23 తత్సాయుజ్యమితి ప్రాహుర్వేదాగమ పరాయణాః | ఏవం క్రమేణ ముక్తిస్స్యాల్లింగా దౌ పూజయా స్వతః ||
24 అతశ్శివ ప్రసాదార్ధం క్రియాద్యైః పూజయేచ్ఛివమ్ | శివక్రియా శివతపః శివమంత్రజపః సదా ||
25 శివజ్ఞానం శివధ్యాన ముత్తరోత్తరమభ్యసేత్ | ఆ సుప్తే రామృతేః కాలం నయే ద్వై శివ చింతయాః ||
26 సద్యాదిభిశ్చ కుసుమై రర్చయేచ్ఛివ మేష్యతి | ప్రకృతి నుండి పుట్టిన సమిష్టి బుద్ధి వశ##మైనచో లభించు ముక్తికి సార్ ష్టి (శివునితో సమమగు శక్తిని కలిగి ఉండుట) అని పేరు. మరియు, శివుని మహానుగ్రహముచే భక్తునకు ప్రకృతి వశమగును (22). అపుడా భక్తునకు శివుని సర్వజ్ఞత్వాది మానసైశ్వర్యములు ప్రయత్నము లేకుండగనే లభించి, ఆతడు ఆత్మారాముడై ప్రకాశించును (23). వేదములు, శాస్త్రములు యెరింగిన పండితులు అట్టి ముక్తిని సాయుజ్యము అని అందురు. ఇట్లు లింగాదులను పూజించుట వలన ముక్తి క్రమముగా లభించును (24). కావున భక్తుడు శివుని అనుగ్రహమును పొందుటకై ఆయనను క్రియ మొదలగు వాటితో ఆరాధించవలెను. శివక్రియ, శివతపస్సు, సర్వకాలములలో శివమంత్రజపము (25), శివజ్ఞానము, శివధ్యానము అను వాటి ఒక దాని తరువాత మరియొక దానిని అభ్యసించవలెను. జీవించి యున్నంతకాలము, ప్రతిదినము నిద్రించువరుక శివుని స్మరిస్తూ గడుపలెను (26). శివుని 'సద్యోజాతం' ఇత్యాది మంత్రములతో పుష్పములతో అర్చించిన భక్తుడు శివుని పొందును. ఋషయ ఊచుః | లింగాదౌ శివపూజాయా విధానం బ్రూహి సర్వతః ||
27 ఋషులు ఇట్లు పలికిరి - లింగము మొదలగు వాటి యందు శివుని పూజించు విధానమును విస్తరముగా చెప్పుము (27). సూత ఉవాచ | లింగానాం చ క్రమం వక్ష్యే యథావచ్ఛృణుత ద్విజాః | తదేవ లింగం ప్రథమం ప్రణవం సార్వ కామికమ్ ||
28 సూక్ష్మ ప్రణవరూపం హి సూక్ష్యరూపం తు నిష్కలమ్ | స్ధూలలింగం హి సకలం తత్పంచాక్షరముచ్యతే || 29 తయెః పూజా తపః ప్రోక్తం సాక్షాన్మోక్ష ప్రదే ఉభే | పౌరుష ప్రకృతి భూతాని లింగాని సు బహుని చ ||
30 తాని విస్తరతో వక్తుం శివోవేత్తి న చాపరః | సూతుడిట్లు పలికెను - ఓ ద్విజులారా! లింగముల క్రమమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను. వినుడు. కోర్కెల నన్నటిని ఈడేర్చు సూక్ష్మప్రణవము (ఓం) మొదటి లింగము (28). అది నిరాకారము. సాకారమగు స్థూలప్రణవము (పంచాక్షరి) రెండవ లింగము (29). స్థూల, సూక్ష్మప్రణవములను రెండింటిని జపించినచో మోక్షము లభించును. ఇవియే గాక పురుష, ప్రకృతి లింగములనేకము గలవు (30). వాటి పూర్తి వివరములు శివునకు తక్క మరియొకనికి తెలియవు. భూవికారాణి లింగాని జ్ఞాతాని ప్రబ్రవీమి వః ||
31 స్వయం భూలింగం ప్రథమం బిందులింగం ద్వితీయకమ్ | ప్రతిష్ఠితం చరం చైవ గురులింగం తు పంచమమ్ ||
32 దేవర్షి తపసా తుష్ట స్సాన్నిధ్యార్థం తు తత్ర వై | పృథివ్యంతర్గత శ్శర్వో బీజం వై నాదరూపతః ||
33 స్థావరాంకురవద్భూమి ముద్భిద్య వ్యక్త ఏవ సః | స్వయం భూతం జాతమితి స్వయంభూరితి తం విదుః ||
34 తల్లింగ పూజయా జ్ఞానం స్వయమేవ ప్రవర్థతే | పృథివీ వికారములగు లింగములను నాకు తెలిసినంతవరకు మీకు చెప్పెదను (31). స్వయం భూలింగము మొదటిది. బిందులింగము రెండవది. ప్రతిష్ఠిత లింగము మూడవది. చర లింగము నాల్గవది. గురులింగము అయదవది (32). శివుడు దేవతల, ఋషుల తపస్సునకు మెచ్చి, వారికి తన సాన్నిధ్యము నీయ తలంచి, పృథివిలోపల నాదరూపములో నున్నవాడై (33), చెట్లు యొక్క బీజము భూమిని భేదించి అంకురించిన తీరున, ప్రకటమగును. ఇట్లు తనంత తానుగా ప్రకటమైన లింగమునకు స్వయంభూలింగమని పేరు (34). అట్టి లింగమును పూజించిన వానికి జ్ఞానము తనంత తానుగా వర్థిల్లును. సువర్ణరజతాదౌ వా పృథివ్యాం స్థండిలేsపివా || 35 స్వహస్తాల్లిఖితం లింగం శుద్ధు ప్రణవమంత్రకమ్ | మంత్రలింగం సమాలిఖ్య ప్రతిష్ఠావాహనం చరేత్ ||
36 బిందు నాదమయం లింగం స్థావరం జంగమం చ యత్ | భావనా మయ మేతద్ధి శివదృష్టం న సంశయః ||
37 యత్ర విశ్వస్యతే శంభుస్తత్ర తసై#్మ ఫలప్రదః | స్వహస్తాల్లిఖితే యంత్రే స్థావరాదా వకృతిమే ||
38 ఆవాహ్య పూజయే చ్ఛంభుం షోడశైరుపచారకైః | స్వయమైశ్వర్య మాప్నోతి జ్ఞానమభ్యాసతో భ##వేత్ ||
39 బంగరురేకుపై గాని, వెండిరేకుపై గాని, భూమియందు గాని, వేది యందు గాని (35) శుద్ధమగు ప్రణవమంత్ర రూపములో నున్న లింగమును సాధకుడు తన చేతులతో వ్రాసి దాని యందు శివుని ప్రతిష్ఠించి, ఆవాహన చేయవలెను (36). బిందు లింగ, నాదలింగములు స్థిర, చర భేదముతో నుండును. వాటి యందు శివుని దర్శించుట భావనారూపము మాత్రమే అనుటలో సందియము లేదు (37). సాధకునకు ఏ లింగమునందు శ్రద్ధ ఉండునో, ఆ రూపముగనే శివుడు ఫలము నిచ్చును. భక్తుడు తన చేతులతో లిఖించిన యంత్రము నందు, కృత్రిమముగాని వృక్షాదుల యందు శివుని ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలెను. అట్లు చేసిన భక్తుడు తాను ఈశ్వరత్వమును పొందును. పునః పునః పూజించిన భక్తుడు జ్ఞానమును పొందును (39). దేవైశ్చ ఋషిభిశ్చాపి స్వాత్మ సిద్ధ్యర్థమేవ హి | సమంత్రేణాత్మహస్తేన కృతం యచ్ఛుద్ద మండలే ||
40 శుద్ధభావనయా చైవ స్థాపితం లింగముత్తమమ్ | తల్లింగం పౌరుషం ప్రాహుస్తత్ర్పతిష్ఠితముచ్యతే ||
41 తల్లింగ పూజయా నిత్యం పౌరుషైశ్వర్య మాప్నుయాత్ | మహద్భి ర్బ్రాహ్మణౖ శ్చాపి రాజభిశ్చ మహా ధనైః ||
42 శిల్పినా కల్పితం లింగం మంత్రేణ స్థాపితం చ యత్ | ప్రతిష్ఠితం ప్రాకృతం హి ప్రాకృతైశ్వర్య భోగదమ్ ||
43 దేవతలచే, మరియు ఋషులచే ఆత్మ సిద్ధి కొరకు మంత్రపూర్వకముగా పవిత్రమగు మండలము నందు తమ చేతులతో (40), పవిత్రమగు మనస్సుతో స్థాపింపబడిన శ్రేష్ఠలింగమునకు పౌరుష లింగమనియు, ప్రతిష్ఠిత లింగమనియు పేరు (41). ఆ లింగమును నిత్యము పూజించినచో, పౌరుషైశ్వర్యము లభించును. మహాత్మలగు బ్రాహ్మణులచే, మరియు సుసంపన్నులగు రాజులచే (42) సమంత్రకముగా స్థాపింపబడిన శిల్పి నిర్మిత లింగము ప్రతిష్ఠిత లింగమనియు, ప్రాకృతలింగమనియు అనబడును. అట్టి లింగమును పూజించినచో, ప్రాకృతైశ్వర్యము, భోగములు లభించును (43). యదూర్జితం చ నిత్యం చ తద్ధి పౌరుషముచ్యతే | యద్దుర్బల మని త్యం చ తద్ది ప్రాకృతముచ్యతే ||
44 లింగం నాభిస్తథా జిహ్వా నాసాగ్రం చ శిఖా క్రమాత్ | కట్యాదిషు త్రిలోకేషు లింగమాధ్యాత్మికం చరమ్ ||
45 పర్వతం పౌరుషం ప్రోక్తం భూతలం ప్రాకృతం విదుః | వృక్షాది పౌరుషం జ్ఞేయం గుల్మాది ప్రాకృతం విదుః ||
46 షాష్టికం ప్రాకృతం జ్ఞేయం శాలిగోధూమ పౌరుషమ్ | ఐశ్వర్యం పౌరుషం విద్యాదణి మాద్యష్ట సిద్ధదమ్ ||
47 సుస్త్రీ ధనాది విషయం ప్రాకృతం ప్రాహురాస్తికాః | బలమైనది, నిత్యమైనది పౌరుషమనబడును. బలము లేనిది, అనిత్యమైనది ప్రాకృతమనబడును (44). నాభి, జిహ్వా, నాసికాగ్రము, శిఖా అను క్రమములో కటి, హృదయము, శిరస్సు అను మూడు స్థానములలో భావన చేయబడిన లింగము ఆధ్యాత్మిక లిగంమనియు, చర లింగమనియు చెప్పబడును (45). పర్వతము పౌరుష లింగమనియు, భూతలము ప్రాకృత లింగమనియు, వృక్షాదులు పౌరుష లింగమ లనియు, గుల్మాదులు ప్రాకృత లింగములనియు (46), తక్కువ నాణ్యము గల ధాన్యము ప్రాకృత మనియు, విలువైన ధాన్యము, గోధుమలు పౌరుషమనియు తెలియవలెను. అణిమా మొదగలు అష్టసిద్ధులనిచ్చు ఐశ్వర్యము పౌరషమనియు (47), భార్య, ధనము మొదలగు ఐశ్వర్యము ప్రాకృతమనియు ఆస్తికులు చెప్పుచున్నారు. ప్రథమం చర లింగేషు రసలింగం ప్రకథ్యతే ||
48 రసలింగం బ్రాహ్మణానాం సర్వాభీష్టప్రదం భ##వేత్ | బాణలింగం క్షత్రియాణాం మహారాజ్యప్రదం శుభమ్ ||
49 స్వర్ణలింగం తు వైశ్యానాం మహాధనపతిత్వదమ్ | శిలాలింగం తు శూద్రాణాం మహాశుద్ధికరం శుభమ్ ||
50 స్పాటికం బాణలింగం చ సర్వేషాం సర్వకామదమ్ | స్వీయా భావేsన్యదీయం తు పూజయాం న నిషిద్ధ్యతే ||
51 స్త్రీణాం తు పార్థివం లింగం సభర్తౄణాం విశేషతః | విధవానాం ప్రవృత్తానాం స్ఫాటికం పరికీర్తితమ్ ||
52 చర లింగములలో రసలింగము శ్రేష్ఠమని చెప్పబడినది (48). రసలింగము పూజించిన బ్రాహ్మణులకు కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. మంగళకరమగు బాణలింగము క్షత్రియులకు సామ్రాజ్యము నిచ్చును (49). బంగరు లింగము వైశ్యులకు గొప్పధనమును ఇచ్చును. మంగళకరమగు రాతిలింగము శూద్రులకు గొప్ప పవిత్రత కల్గించును (50). స్ఫటికముతో చేసిన బాణలింగము అందరికీ అన్ని కోర్కెలను ఇచ్చును. భక్తుడు తన వద్ద లింగము లేనిచో ఇతరుల లింగమును పూజించుట నిషేదము కాదు (51). భర్త గల స్త్రీలకు మట్టితో చేసిన లింగము మిక్కిలి ప్రశస్తము. ప్రవృత్తి మార్గములో నున్న భర్తృహీనలకు స్ఫటికలింగము శ్రేష్ఠము (52). విధవానాం నివృత్తానాం రసలింగం విశిష్యతే | బాల్యే వా ¸°వనే వాపి వార్ధకే వాపి సువ్రతాః ||
53 శుద్ధ స్ఫటిక లింగం తు స్త్రీణాం తత్సర్వభోగదమ్ | ప్రవృత్తానాం పీఠపూజా సర్వాభీష్టప్రదా భువి ||
54 ప్రాతేణౖవ ప్రవృత్తస్తు సర్వపూజాం సమాచరేత్ | అభిషేకాంతే నైవేద్యం శాల్యన్నేన సమాచరేత్ ||
55 పూజాంతే స్థాపయేల్లింగం సంపుటేషు పృథక్ గృహే | కరపూజా నివృత్తానాం స్వభోజ్యం తు నివేదయేత్ ||
56 నివృత్తి మార్గములో నున్న భర్తృహీనలకు రసలింగము శ్రేష్ఠము. గొప్ప వ్రతము గల ఓ ఋషులారా! స్త్రీలు బాల్యములో గాని, ¸°వనములోగాని, వార్ధక్యములో గాని (53) శుద్ధ స్ఫటిక లింగమును పూజించినచో, సర్వభోగములు లభించును. ప్రవృత్తి మార్గము నందున్న స్త్రీలు భూతలము నందు పీఠపూజను చేసినచో, కోర్కెలన్నియూ ఈడేరును (54). ప్రవృత్తి మార్గములో నున్న మానవుడు పూజాకార్యము నంతయూ యోగ్యుడగు గురువు యొక్క సహాయముతో చేయవలెను. అభిషేకము చేసి, విలువైన బియ్యముతో వండిన అన్నమును నైవేద్యమిడవలెను (55). పూజ అయిన తరువాత లింగమును ఇంటిలో వేరుగా సంపుటము నందు ఉంచవలెను. నివృత్తి మార్గములో నున్న వారు అరచేతి యందు లింగమును పూజించి, భిక్షాన్నమును నివేదన చేయవలెను (56). నివృత్తానాం పరం సూక్ష్మ లింగమేవ విశిష్యతే | విభూత్యభ్యర్చనం కుర్యా ద్విభూతిం చ నివేదయేత్ ||
57 పూజాం కృత్వాథ తల్లింగం శిరసా ధారయేత్సదా | విభూతి స్త్రి విధా ప్రోక్తా లోకవేద శివాగ్నిభిః ||
58 లోకాగ్ని జమథో భస్మ ద్రవ్య శుద్ధ్యర్థ మావహేత్ | మృద్దారులోహరూపాణాం ధాన్యానాం చ తథైవచ||
59 తిలాదీనాం చ ద్రవ్యాణాం వస్త్రాదీనాం తథైవ చ | తథా పర్యుషితానాం చ భస్మనా శుద్ధి రిష్యతే ||
60 శ్వాదిభిర్దూషితానాం చ భస్మనా శుద్ధిరిష్యతే | సజలం నిర్జలం భస్మ యథా యోగ్యం తు యోజయేత్ ||
61 నివృత్తి మార్గములో నున్న వారికి సూక్ష్మలింగమే మిక్కిలి ప్రశస్తమైనది. వారు విభూతితో అర్చించి, విభూతిని నివేదించవలెను (57). పూజ చేసి లింగమును సర్వదా శిరస్సు నందు ధరించవలెను. లోకాగ్నిజము, వేదగ్నిజము, శివాగ్నిజము అని విభూతి మూడు రకములుగా నున్నది (58). లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మను ద్రవ్యముల శుద్ధికొరకు వాడవలెను. మట్టి వస్తువులను, చెక్క వస్తువులను, లోహ వస్తువులను, ధాన్యములను (59). తిలాది ద్రవ్యములను, వస్త్రాదులను, మరియు పాతబడిన ఆహారపదార్ధములను భస్మతో శుద్ధి చేయవలెను (60). కుక్క మొదలగు జంతువులు స్పృశించిన వాటికి భస్మతో శుద్ధి చేయవలెను. భస్మను సందర్భానుసారముగా పొడిగా గాని, లేక నీటితో తడిపి గాని వినియోగించవలెను (61). వేదాగ్నిజం తథా భస్మ తత్కర్మాంతేషు ధారయేత్ | మంత్రేణ క్రియయా జన్యం కర్మాగ్నౌ భస్మరూపధృక్ ||
62 తద్భస్మదారణాత్కర్మ స్వాత్మన్యారోపితం భ##వేత్ | అఘోరేణాత్మ మంత్రేణ బిల్వకాష్ఠం ప్రదాహయేత్ ||
63 శివాగ్నిరితి సంప్రోక్తస్తేన దగ్ధం శివాగ్నిజమ్ | కపిలాగోమయం పూర్వం కేవలం గవ్యమేవ వా ||
64 శమ్యశ్వత్థ పలాశాన్వా వటారగ్వధ బిల్వకాన్ | శివాగ్నినా దహేచ్ఛుద్దం తద్వై భస్మ శివాగ్నిజమ్ ||
65 వేదాగ్ని హోత్రము నందు పుట్టిన భస్మను ఆ కర్మ పూర్తి కాగానే ధరించవలెను. వేద మంత్రములతో హవిస్సును సమర్పించే క్రియ నుండి పుట్టిన 'హవనము' అనే వైదిక కర్మ అగ్ని యందు భస్మరూపమును ధరించి యుండును (62). ఆ భస్మను ధరించినచో, భక్తుడు ఆ కర్మను తన యందు ఆరోపించుకున్నట్లే అగును. 'అఘోరేభ్యః' అను శివ మంత్రమునుచ్చరించి, మారేడు సమిధను అగ్నిలో వేయవలెను (63). ఆ అగ్నికి శివాగ్ని యని పేరు. దాని నుండి పుట్టిన భస్మ శివాగ్నిజము అగును. మరియు, కపిల గోమయముతో గాని, సాధారణ గోమయముతో గాని చేసిన పిడకలను (64), జమ్మి, రావి, పలాశము, మర్రి ఆరగ్వధము, మారేడు అను వృక్షముల సమిధలను శివాగ్ని యందు దహించినచో లభించు భస్మ శివాగ్నిజమనబడను (65). దర్భాగ్నౌవా దహేత్కాష్ఠం శివమంత్రం సముచ్చరన్ | సమ్యక్ సంశోధ్య వస్త్రేణ నవకుంభే నిధాపయేత్ ||
66 దీప్త్యర్థం తత్తు సంగ్రాహ్యం మన్యతే పూజ్యతేsపి చ | భస్మ శబ్దార్ధ ఏవం హి శివః పూర్వం తథాsకరోత్ || 67 యథా స్వవిషయే రాజా సారం గృహ్ణాతి యత్కరమ్ | యథా మనుష్యాస్సస్యాదీన్ దగ్ధ్వా సారం భజంతి వై ||
68 యథా హి జాఠరాగ్నిశ్చ భక్ష్యాదీన్ వివిధాన్ బహూన్ | దగ్ద్వా సారతరం సారాత్ స్వదేహం పరిపుష్యతి ||
69 శివమంత్రము నుచ్చరించుచూ, దర్భల జ్వాల యందు సమిధను కాల్చి, ఆ భస్మను వస్త్రముతో బాగుగా శుద్ధిచేసి, కొత్తకుండలో దాచుకొనవలెను (66). దానిని ధరించిన వ్యక్తి శోభను పొంది, జనుల మాన మర్యాదలకు పాత్రుడగును. శివుడు సృష్ట్యాది యందు భస్మ శబ్దము యొక్క అర్థము నిట్లు నిర్వహించెను (67). రాజు తన రాజ్యములో సారభూతమగు పన్నును గ్రహంచును. మనుష్యులు ధాన్యాదులను వేడిచేసి వాటి సారమును గ్రహింతురు (68). మనము తినే వివిద భక్ష్యాదులను పచనము చేసి, వాటి సారమును స్వీకరించి, జఠరాగ్ని దేహమునకు పుష్టిని కలిగించును (69). తథా ప్రపంచకర్తాపి స శివః పరమేశ్వరః | స్వాధిష్ఠేయ ప్రపంచస్య దగ్ధ్వా సారం గృహీతవాన్ ||
70 దగ్ధ్వా ప్రపంచం తద్భసమ స్వాత్మన్యారోపయచ్ఛివః | ఉద్ధూలనేన వ్యాజేన జగత్సారం గృహీత వాన్ ||
71 స్వరత్నం స్థాపయామాస స్వకీయే హి శరీరకే | కేశమాకాశ సారేణ వాయుసారేణ వై ముఖమ్ ||
72 హృదయం చాగ్నిసారేణ త్వపాం సారేణ వైకటిమ్ | జాను చావని సారేణ తద్వత్సర్వం తదంగకమ్ ||
73 అటులనే, ప్రపంచమును సృష్టించిన ఆ పరమశివుడు కూడ తనచే అధిష్ఠింపబడిన జగత్తును దహించి, సారమును గ్రహించి (70), భస్మరూపమున నున్న ఆ సారమును తన దేహమునందు పూసుకొనెను. శివుడు భస్మను ధరించే మిషతో జగత్సారమును స్వీకరించెను (71). తన రూపమే అయిన జగత్తు యొక్క శ్రేష్ఠసారమును తన శరీరము నందు స్థాపించుకొనెను. ఆకాశ సారముతో కేశములను, వాయు సారముతో ముఖమును (72), అగ్నిసారముతో హృదయమును, జలముల సారముతో నడుమును, పృథివీసరాముతో మోకాళ్లను, ఇదే విధముగా ఇతర అవయవములను ధరించెను (73). బ్రహ్మ విష్ణ్వోశ్చ రుద్రాణాం సారం చైవ త్రిపుండ్రకమ్ | తథా తిలకరూపేణ లలాటాంతే మహేశ్వరః ||
74 భవృద్ధ్యా సర్వమేతద్ధి మన్యతే స్వయమిత్య సౌ | ప్రపంచ సార సర్వస్వ మనేనైవ వశీకృతమ్ ||
75 తస్మాదస్మ వశీకర్తా నాస్తీతి స శివస్మ్సృతః | యథా సర్వమృగాణాం చ హింసకో మృగహింసకః ||
76 అస్య హింసామృగో నాస్తి తస్మాత్సింహ ఇతీరితః | బ్రహ్మ విష్ణు రుద్రుల సారభూతమైన భస్మను మహాశ్వరుడు లలాటము నందు త్రిపుండ్ర తిలకముగా ధరించును (74). విభూతిని ధరించినపుడు ప్రకాశము పెరిగినది. తన ఐశ్వర్యము సర్వమూ విభూతి మూలకమని శివుడు భావించును. ప్రపంచము యొక్క సారము నంతనూ శివుడు భస్మము చేత మాత్రమే వశము చేసుకొనేను (75). కావున, శివుని వశము చేసుకొనువాడు మరియొకడు లేడు. వశియగుట వలననే ఆయన శివుడైనాడు. సింహము మృగముల నన్నిటినీ హింసించును (76). కాని, సింహమును హింసించగల మృగము లేదు. అందువలననే దానికి సింహమను పేరు వచ్చినది. శం నిత్య సుఖమానంద మికారః పురుషః స్మృతః ||
77 వకారశ్శక్తి రమృతం మేలనం శివ ఉచ్యతే | తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వార్చయేచ్ఛివమ్ ||
78 తస్మాదుద్ధూలనం పూర్వం త్రిపుండ్రం ధారయేత్పరమ్ | పూజాకాలే హి సజలం శుద్ధ్యర్ధం నిర్జలం భ##వేత్ ||
79 దివా వా యది వా రాత్రౌ నారీ వాథ నరోపివా | పూజార్థం సజలం భస్మ త్రిపుండ్రేణౖవ ధారయేత్ ||
80 త్రిపుండ్రం సజలం భస్మ ధృత్వా పూజం కరోతి యః | శివపూజాఫలం సాంగం తసై#్యవ హి సునిశ్చితమ్ ||
81 శం అనగా శాశ్వతానందము. ఇకారము పురుషుని బోధించునని చెప్పబడినది (77). వకారము శక్తిని, అమృతమును బోధించును. వీటి కలయికకు శివుడనిపేరు. కావున, భక్తుడు తన ఆత్మను శివునిగా భావించి, శివుని అర్చించవలెను (78). ముందుగా భస్మను దేహావయవముల యందు ధరించి, తరువాత లలాటము నందు చక్కని త్రిపుండ్రమును ధరించవలెను. పూజాకాలము నందు విభూతిని తడిపి వాడవలెను. వస్తు శుద్ధి కొరకు పొడి విభూతిని వాడవలెను (79). పగలు గాని, రాత్రిగాని, స్త్రీ గాని, పురుషుడు గాని, పూజాసమయములో విభూతిని నీటితో తడిపి, లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను. ఎవడైతే నీటితో తడిపిన విభూతితో త్రిపుండ్రమును ధరించి పూజ చేయునో, వాడు మాత్రమే నిశ్చయముగా పూర్ణ శివపూజాఫలమును పొందును (81). భస్మ వై శివమంత్రేణ ధృత్వా హ్యత్యాశ్రమీ భ##వేత్ | శివాశ్రమీతి సంప్రోక్తశ్శివైక పరమో యతః ||
82 శివవ్రతైక నిష్ఠిస్య నాశౌచం న చ సూతకమ్ | లలాటేsగ్రే సితం భస్మ తిలకం ధారయేన్ముదా ||
83 స్వహస్తాద్గురు హస్తాద్వా శివభక్తస్య లక్షణమ్ | గుణాన్ రుంధ ఇతి ప్రోక్తో గురుశబ్దస్య విగ్రహః ||
84 సవికారాన్ రాజసాదీన్ గుణాన్ రుంధే వ్యహోహతి | గుణాతీతః పరశివో గురురూపం సమాశ్రితః ||
85 శివమంత్రము నుచ్చరిస్తూ భస్మను ధరించు వ్యక్తి అత్యాశ్రమి యగును. అట్టివాడు శివనిష్ఠా పరాయణుడై యుండును గాన, శివాశ్రమీ యనబడును (82). శివవ్రతమే ఏకైక నిష్ఠగా గల భక్తునకు మైల, పురుష దోషములు అంటవు. లలాటము నందు తెల్లని భస్మను ఆనందముతో తిలకముగా ధరించవలెను (83). తిలకమును తాను స్వయముగా పెట్టుకొనవచ్చును. లేదా, గురువు చేత పెట్టించుకొనవచ్చును. ఇట్లు తిలకమును ధరించుట శివభక్తుని లక్షణము. గురుశబ్దమునకు 'గుణాన్ రుంధే (గుణములను తొలగించును)' అని విగ్రహము (84). త్రిగుణాతీతుడగు పరమశివుడు గురూపము నాశ్రయించి, వికారములతో గూడిన రాజసాది గుణములను తొలగించివేయును (85). గుణత్రయం వ్యపోహ్యాగ్రే శివం బోధయతీతి సః | విశ్వస్తానాం తు శిష్టాణాం గురురిత్య భిధీయతే ||
86 తస్మాద్గురు శరీరం తు గురులింగం భ##వేద్బుధః | గురులింగస్య పూజా తు గురుశుశ్రూషణం భ##వేత్ ||
87 శ్రుతం కరోతి శుశ్రూషా కాయేన మనసా గిరా | ఉక్తం యద్గురుణా పూర్వం శక్యం వాsశక్యమేవ వా || 88 కరోత్యేవ హి పూతాత్మా ప్రాణౖరపి ధనైరహి | తస్మాద్వైశాసనే యోగ్యశ్శిష్య ఇత్యభి ధీయతే ||
89 ఆచార్యుడు విశ్వాసము గల శిష్యులకు ముందుగా మూడు గుణములను నిర్మూలించి, పిదప శివుని గురించి బోధించును. అందువలనే, ఆయనకు గురువు అను పేరు కలిగెను (86). కావున, గురుదేహమే గురులింగమని తెలియవలెను. గురువును శుశ్రూష చేసినచో, గురు లింగమును పూజించినట్లగును (87). శిష్యుడు గురువుకు శరీరముతో, మనస్సుతో, మరియు వాక్కుతో సేవను చేయవలెను. పవిత్రమైన మనస్సు గల శిష్యుడు గురువు యొక్క ఆజ్ఞను, శక్యమైనా, అశక్యమైనా (88), ప్రాణములను పణము పెట్టి, ధనమును వచ్చించి, నెరవేర్చి తీరును. శాసించదగిన వాడు గనుక శిష్యుడు అను పేరు కలిగెను (89). శరీరాద్యర్థకం సర్వం గురోర్దత్వా సుశిష్యకః | అగ్రపాకం నివేద్యాగ్రే భుంజీయాద్గుర్వనుజ్ఞయా ||
90 శిష్యః పుత్ర ఇతి ప్రోక్తస్సదా శిష్యత్వ యోగతః | జిహ్వాలింగాన్మంత్ర శుక్రం కర్ణయోనౌ నిషిచ్య వై ||
91 జాతః పుత్రో మంత్ర పుత్రః పితరం పూజయేద్గురుమ్ | నిమజ్జయతి పుత్రం వై సంసారే జనకః పితా || 92 సంతారయతి సంసారాద్గురుర్వై బోధకః పితా | ఉభయోరంతరం జ్ఞాత్వా పితరం గురుమర్చయేత్ ||
93 యోగ్యుడగు శిష్యుడు శరీరోపయోగి యగు సర్వ పదార్థములను గురువునకు సమర్పించును. ఆహారమును ముందుగా గురువునకు సమర్పించి, వారి అనుజ్ఞతో తాను భుజించును (90). గురువునకు శిష్యుడు పుత్రుడనబడును. జిహ్వ యను లింగము నుండి మంత్రమనే రేతస్సును కర్ణమను యోని యందు సేకము చేయుట వలన (91) మంత్ర పుత్రుడగు శిష్యుడు జన్మించినాడు కావున, శిష్యుడు గురువును తండ్రిని వలె పూజించవలెను. కన్న తండ్రి పుత్రుని సంసారములోనికి ఈడ్చును (92). కాని, ఆచార్యుడనే తండ్రి సంసారము నుండి శిష్యుని తరింపజేయును. వీరిద్దరికి గల ఈ తేడాను గుర్తించి, శిష్యుడు గురువును తండ్రిని వలె పూజించవలెను (93). అంగ శుశ్రూషయా చాపి ధనాద్వైః స్వార్జితైర్గురుమ్ | పాదాదికేశపర్యంతం లింగాన్యంగాని యద్గురోః ||
94 ధనరూపైః పాదుకాద్యైః పాద సంగ్రహణాదిభిః | స్నానాభిషేకనైవేద్యై ర్భోజనైశ్చ ప్రపూజయేత్ ||
95 గురుపూజైవ పూజా స్యాచ్ఛివస్య పరమాత్మనః | గురుశేషం తు యత్సర్వ మాత్మ శుద్ధికరం భ##వేత్ ||
96 గురోశ్శేషశ్శివోచ్ఛిష్టం జలమన్నాది నిర్మతమ్ | శిష్యాణాం శివభక్తానాం గ్రాహ్యం భోజ్యం భ##వే ద్ధ్విజాః ||
97 గురువు శరీరమునకు సేవ చేయవలెను. స్వార్జితమగు ధనము మొదలగు వాటిని గురువున కీయవలెను. పాదము మొదలు కేశముల వరకు గల గురువు యొక్క శరీరము శివస్వరూపమే (94). గురువును ధనముతో, పాదపూజతో, పాద సంవహనాదులతో, స్నానాభిషేకనైవేద్యములతో, భోజనముతో శ్రద్ధగా పూజించవలెను (95). గురువును పూజించినచో, పరమశివుని పూజించినట్లే యగును. గురుశేషము సర్వము శిష్యునకు అంతఃకరణశుద్ధిని కలిగించును (96). గురువు వీడిన నీరు, అన్నము మొదలగు శేషము శివోచ్ఛిష్టముతో సమానము. కావున, ఓ ద్విజులారా! శివభక్తులగు శిష్యులు వాటిని స్వీకరించి భుజించవలెను (97). గుర్వనుజ్ఞా విరహితం చోరవత్సకలం భ##వేత్ | గురోరపి విశేషజ్ఞం యత్నాద్గృహ్ణీతవై గురుమ్ ||
98 అజ్ఞానమోచనం సాధ్యం విశేషజ్ఞో హి మోచకః | ఆదౌ చ విఘ్నశమనం కర్తవ్యం కర్మపూర్తయే ||
99 నిర్విఘ్నేన కృతం సాంగం కర్మ వై సఫలం భ##వేత్ | తస్మాత్సకల కర్మాదౌ విఘ్నేశం పూజయేద్బుధః ||
100 సర్వ బాధానివృత్త్యర్ధం సర్వాన్దేవాన్ యజేద్బుధః | గురువు యొక్క ఆనుజ్ఞ లేనిదే దేనినైననూ స్వీకరించినచో, అది చౌర్యమగును. గురువు కంటె గొప్ప జ్ఞానము గలవాడు తటస్థపడినచో, ఆయనను ప్రయత్నపూర్వకముగా గురువును చేసుకొనవలెను (98). అజ్ఞాన విమోచనమే జీవితలక్ష్యము. గొప్ప జ్ఞానము గలవాడు మాత్రమే అజ్ఞానము నుండి విముక్తిని కలిగించగలడు. కర్మలు నిర్విఘ్నముగా పరిసమాప్తిని చెందాలంటే, ముందుగా విఘ్నశాంతిని చేయాలి (99). అన్ని అంగములను నిర్విఘ్నముగా చేసిన కర్మ మాత్రమే ఫలము నిచ్చును. కావున, కర్మలన్నిటికీ ముందుగా వివేకి విఘ్నేశ్వరుని పూజించవలెను (100). బాధలన్నియూ తొలగుట కొరకై వివేకి దేవతల నందరినీ పూజించవలెను. జ్వారాది గ్రంథి రోగాశ్చ బాధా హ్యాధ్యాత్మికా మతా ః||
101 పిశాచ జంబుకాదీనాం వల్మీకాద్యుద్భవే తథా | అకస్మాదేవ గోధాది జంతూనాం పతనేsపి చ ||
102 గృహే కచ్ఛప సర్ప స్త్రీ దుర్జనా దర్శనేsపి చ | వృక్ష నారీ గవాదీనాం ప్రసూతి విషయేsపి చ || 103 భావి దుఃఖం సమాయతి తస్మాత్తే భౌతికా మతాః | అమేధ్యాశని పాతశ్చ మహామారీ తథైవ చ ||
104 జ్వరమారీ విషూచిశ్చ గోమారీ చ మసూరికా | జన్మర్క్ష గ్రహసంక్రాంతి గ్రహ యోగా స్వరాశికే ||
105 దుస్స్వప్న దర్శనాద్యాశ్చ మతావై హ్యాధి దైవికాః | జ్వరము మొదలగు రోగములు, కీళ్ల నొప్పులు ఆద్యాత్మిక బాధలనబడును (101). పిశాచ పీడ, నక్కల గోల, పుట్టులు బయలుదేరుట, మొసలి మొదలగు జంతువులు హఠాత్తుగా మరణించుట (102), ఇంటిలో తాబేలు, పాము, దుర్జనుడు దర్శనమిచ్చుట మొదలగునవి చెట్లకు, స్త్రీలకు, గోవులకు, ఇతర పశువులకు, సంతానమునకు (103) రాబోవు దుఃఖమును సూచించును. వీటికి ఆధి భౌతిక బాధలని పేరు. ఆకాశము నుండి అశుచి పదార్థములు పడుట, పిడుగుపాటు, మహామారి (104), జ్వరములు, విషూచి, గోమారి, మసూచి, జన్మ నక్షత్రము నందు గ్రహముల ప్రవేశము, జన్మరాశి యందు గ్రహయోగము (105), చెడు కలలను గనుట మొదలగునవి ఆధిదైవిక బాధలనబడును. ఏతాదృశే సముత్పన్నే భావి దుఃఖస్య సూచకే ||
106 శాంతి యజ్ఞం తు మతిమాన్ కుర్యాత్తద్దోషశాంతయే | దేవాలయేsథ గోష్ఠే వాచ చైత్యే వాపి గృహాంగణ్ ||
107 ప్రాక్ దేశోన్నత ధిష్ణ్యే వై ద్విహస్తేయ స్వలంకృతే | భార మాత్ర వ్రీహి ధాన్యం ప్రస్థాప్య పరిసృత్య చ ||
108 మధ్యే విలిఖ్య కమలం తథా దిక్షు విలిఖ్యవై | తంతునా వేష్టింతం కుంభం నవగుగ్గుల ధూపితమ్ ||
109 మధ్యే స్థాప్య మహాకుంభం తథా దిక్ష్వపి విన్యసేత్ | రాబోవు దుఃఖములను సూచించు ఇట్టి ఘటన జరిగినపుడు (106), బుద్ధిమంతుడు ఆ దోషము శాంతించుట కొరకై శాంతి యజ్ఞమును చేయవలెను. దేవాలయములో గాని, గోశాలలో గాని, యజ్ఞ శాలలో గాని, ఇంటి వాకిలి యందు గాని (107), తూర్పున ఎత్తు ఉండే రెండు హస్తముల కొలత కలిగిన స్థానమును చక్కగా అలంకరించి, పుట్టెడు గోధుమలను అచట చతురస్సముగా చేసి (108), మధ్యలో మరియు నాల్గు మూలల పద్మమును లిఖించి దారముతో చుట్టిన, కొత్త గుగ్గుల ధూపమను వేసిన (109) మహాకుంభమును మధ్యలో ఉంచి, ఇతర కుంభములను దిక్కుల యందు ఉంచవలెను. సనాలామ్రక కూర్చాదీన్ కలశాంశ్చ తథాష్టసు ||
110 పూరయేన్మంత్ర పూతేన పంచద్రవ్యయుతేన హి | ప్రక్షిపేన్నవరత్నాని నీలాదీన్ క్రమశస్తథా ||
111 కర్మజ్ఞం చ సపత్నీక మాచార్యం వరయేద్బుధః | సువర్ణ ప్రతిమాం విష్ణో రింద్రాదీనాం చ నిక్షిపేత్ ||
112 సశిరస్కే మధ్య కుంభే విష్ణు మావాహ్య పూజయేత్ | ప్రాగాదిషు యథా మంత్రమింద్రాదీన్ క్రమశో యజేత్||
113 తత్తన్నామ్నా చతుర్థ్యాం చ నమోంతే న యథాక్రమమ్ | ఆవాహనాదికం సర్వమాచార్యేణౖవ కారయేత్ ||
114 మామిడి ఆకుల గుత్తులను ఉంచిన కలశములను ఎనిమిది దిక్కుల యందుంచి (110), పంచామృతములు గల జలముతో సమంత్రకముగా నింపవలెను. వాటి యందు నీలము మొదలగు తొమ్మిది రత్నములను ఉంచవలెను (11). వివేకి యగువాడు కర్మజ్ఞానము కలిగన ఆచార్యుని, ఆయన భార్యతో సహా వరణము చేయవలెను. విష్ణువు యొక్క బంగరు ప్రతిమను, ఇంద్రాది దేవతల ప్రతిమలను మంటపము నందుంచవలెను (112). మధ్య కుంభములో కొబ్బరి ఫలము నుంచి, విష్ణువును ఆవాహన చేసి పూజించవలెను. తూర్ప నందు ఇంద్రుని, ఇతర దిక్కుల యందు ఆయా దిక్పాలకులను క్రమముగా పూజించవలెను (113). ఆయా దేవతల నామముల చతుర్థీ విభక్తికి 'నమః' జోడించి పూజించవలెను. ఆవాహనము మొదలు పూజను పూర్తిగా ఆచార్యుని చేతనే చేయించవలెను (114). ఆచార్య ఋత్విజా సార్ధం తన్మంత్రాన్ ప్రజపేచ్ఛతమ్ | కుంభస్య పశ్చిమే భాగే జపాంతే హోమమాచరేత్ ||
115 కోటిం లక్షం సహస్రం వా శతమష్టోత్తరం బుధాః | ఏకాహం వా నవాహం వా తథా మండలమేవ చ ||
116 యథాయోగ్యం ప్రకుర్వీత కాలదేశానుసారతః | శమీ హోమశ్చ శాంత్యర్థే వృత్త్యర్థే చ పలాశకమ్ ||
117 సమిదన్నాజ్యకై ర్ద్రవ్యైర్నామ్నా మంత్రేణ వా హువేత్ | ప్రారంభే యత్కృతం ద్రవ్యం తత్ర్కి యాంతం సమాచరేత్ ||
118 యజమాని ఆచార్యునితో, ఋత్విక్కులతో కలిసి దేవతల మంత్రములను వందసార్లు జపించవలెను. జపము అయిన తరువాత, కుంభమునకు పశ్చిమ భాగములో హోమమును చేయవలెను (115). ఓ విద్వాంసులారా! కోటి గాని, లక్ష గాని, వేయి గాని, నూట యెనిమిది గాని పర్యాయములు హోమము చేయవలెను. ఒకటి, తొమ్మిది, లేక నలభై దినములు (116) దేశ కాలానుగుణముగా, యథాశక్తి హోమమును చేయవలెను. శాంతిని గోరినచో జమ్మి సమిధలతోను, ధనధాన్యములను గోరినచో మోదుగ సమిధలతోను హోమము చేయవలెను (117). సమిధలను, అన్నమును, నేయిని దేవతానామముతో గాని, మంత్రముతో గాని హోమము చేయవలెను. హోమమునకు ఆరంభములో ఉపయోగించిన ద్రవ్యమునే హోమము పూర్తి యగు వరకు వినియోగించవలను (118). పుణ్యాహం వాచయిత్వాంతే దినే సంప్రోక్షయేజ్జలైః | బ్రాహ్మణాన్ భోజయేత్పశ్చాత్ యావదాహుతి సంఖ్యయా ||
119 ఆచార్యశ్చ హవిష్యాశీ ఋత్విజశ్చ భ##వేద్బుధాః | ఆదిత్యాదీన్ గ్రహానిష్ట్వా సర్వహోమాంత ఏవ హి ||
120 ఋత్విగ్భ్యో దక్షిణాం దద్యాన్నవరత్నం యథాక్రమమ్ | దశదానం తతః కుర్యా ద్భూరిదానం తతః పరమ్ ||
121 బాలానా ముపనీతానాం గృహిణాం వనినాం ధనమ్ | కన్యానాం చ సభర్తృణాం విధవానాం తతః పరమ్ ||
122 తంత్రోపకరణం సర్వమాచార్యాయ నివేదయేత్ | ఆఖరు రోజున పుణ్యాహ వాచనము చేసి, ఆ జలములతో అంతటా చల్లవలెను. తరువాత, హోమము ఎన్ని పర్యాయములు చేయబడినదో, అంతమంది బ్రాహ్మణులకు భోజనమును పెట్టవెలను (119). ఓ విద్వాంసులారా! ఆచార్యుడు, ఋత్విక్కులు హవిస్సును భుజించలవెను. ఆదిత్యాది నవగ్రహ హోమమును చేయవలెను. హోమము లన్నియు పూర్తి అయిన పిదప (120), ఋత్విక్కులకు వరుసగా నవరత్నముల నీయవలెను. తరువాత దశదానములను చేసి, పిమ్మట విరివిగా ఇతర దానములను చేయవలెను (121). ఉపనయనము అయిన బాలురకు, గృహస్థులకు, వానప్రస్థులకు, కన్యలకు, ముత్తయిదువులకు, భర్తృహీనలకు (122) ధనము నీయవలెను. యజ్ఞ సామగ్రి నంతనూ ఆచార్యున కీయవలెను. ఉత్పాతానాం చ మారీణాం దుఃఖ స్వామీ యమఃస్మృతః ||
123 తస్మాద్యమస్య ప్రీత్యర్థం కాలదానం ప్రదాపయేత్ | శతనిష్కేణ వా కుర్యాద్దశ నిష్కేణ వా పునః ||
124 పాశాంకుశధరం కాలం కుర్యాత్పురుష రూపిణమ్ | తత్స్వర్ణ ప్రతిమాదానం కుర్యాద్దక్షిణయా సహ ||
125 తిలదానం తతః కుర్యా త్పూర్ణాయుష్య ప్రసిద్ధయే | ఆ జ్యావేక్షణం దానం చ కుర్యాత్ వ్యాధి నివృత్తయే ||
126 సహస్రం భోజయేద్విప్రాన్ దరిద్ర శ్శతమేవ వా | విత్తా భావే దరిద్రస్తు యథాశక్తి సమాచరేత్ ||
127 భైరవస్య మహాపూజాం కుర్యాద్భూతాది శాంతయే | మహాభిషేకం నైవేద్యం శివస్యాంతే తు కారయేత్ ||
128 ఉత్పాతములను, జ్వరములను కలిగించి, దుఃఖము నిచ్చువాడు యముడని చెప్పబడినది (123), కావున, యముని ప్రీతి కొరకు కాలదానము నీయవలెను. అనగా, వంద, లేక పది పలముల బంగారముతో పాశమును, అంకుశమును ధరించిన కాలపురుషుని ప్రతిమ చేయవలెను. ఆ ప్రతిమను దక్షిణతో సహా దానమీయవలెను (125). తరువాత, పూర్ణాయుర్దాయము లభించుట కొరకై తిలలను దానమీయవలెను. వ్యాధులను పోగొట్టుకొనుట కొరకై నేతిలో ముఖమును చూచి, దానిని దానమీయవలెను (126). వేయి, లేదా వందమంది బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ధనము లేనివాడు యథాశక్తి చేయవలెను (127). భూతాది దోషములు శాంతించుట కొరకై భైరవుని పూజించవలెను. తరువాత శివునకు మహాభిషేకమును, నైవేద్యమును చేయించవలెను (128). బ్రాహ్మణాన్ భోజయేత్పశ్చాత్ భూరిభోజనరూపతః | ఏవం కృతేన దోషశాంతి మవాప్నుయాత్ ||
129 శాంతి యజ్ఞమిమం కుర్యా ద్వర్షే వర్షే తు ఫాల్గునే | దుర్దర్శనాదౌ సద్యో వై మాసమాత్రే సమాచరేత్ ||
130 మహాపాపాది పంప్రాప్తౌ కుర్యాద్భైరవ పూజనమ్ | మహావ్యాధి సముత్పత్తౌ సంకల్పం పునరాచరేత్ ||
131 సర్వాభావే దరిద్రస్తు దీపదాన మథా చరేత్ | తదప్యశక్తః స్నాత్వావై యత్కించి ద్దాన మాచరేత్ ||
132 దివాకరం నమస్కుర్యాన్మంత్రేణాష్టోత్తరం శతమ్ | సహస్రమయుతం లక్షం కోటిం వా కారయేద్బుధః ||
133 తరువాత బ్రహామణులకు విరివిగా భోజనమును పెట్టవలెను. ఇట్లు యజ్ఞమును చేయుట వలన దోషములు శాంతించును (129). ఈ శాంతి యజ్ఞమును ప్రతి సంవత్సరము ఫాల్గున మాసములో చేయవలెను. ఉత్పాతములు కనబడినపుడు వెనువెంటనే గాని, ఒక నెల రోజులలో గాని చేయవలెను (130). మహా పాపము సంప్రాప్తమైనప్పుడు భైరవుని పూజించవలెను. మహా వ్యాధి కలిగినచో మరల సంకల్పము చేయవలెను (131). ధనము లేని దరిద్రుడు దీపదానమును చేయవలెను. అది కూడ చేయలేనివాడు స్నానము చేసి, ఏదో ఒక దానమును చేయవలెను (132). విద్వాంసుడు సూర్యమంత్రమును జపిస్తూ నూట యోనిమిది సూర్య నమస్కారములను చేయవలెను. వేయి, పదివేలు, లక్ష లేక కోటి నమస్కారములను చేయించవలెను (133). నమస్కారాత్మ యజ్ఞేన తుష్టాస్స్యుస్సర్వదేవతాః | త్వత్స్వరూపేsర్పితా బుద్ధిర్న తే శూన్యే చ రోచతి ||
134 యా చాస్త్యస్మ దహంతేతి త్వయి దృష్టే వివర్జితా | నమ్రోsహం హి స్వదేహేన భో మహాంస్తమసి ప్రభో ||
135 న శూన్యో మత్స్వరూపో వై తవ దాసోsస్మి సాంప్రతమ్ | యథా యోగ్యం స్వాత్మ యజ్ఞం నమస్కారం ప్రకల్పయేత్ ||
136 నమస్కారము అనే ఆత్మ యజ్ఞము చేత దేవతలందరు సంతసించెదరు. నా బుద్ధి నీ స్వరూపము నందు అర్పింపబడినది. నీవు లేని చోట నా బుద్ధి రమించదు (134). అహంకార మమకారములు నిన్ను చూడగానే తొలగిపోవును. నేను నీకు సాష్టాంగము చేయుచున్నాను. ఓ ప్రభూ! నీ మహిమ గొప్పది (135). నా స్వరము శూన్యము కాదు. నేనిపుడు నీకు దాసుడను. అని ఈ విధముగా యథోచితముగా నమస్కారమనే ఆత్మ యజ్ఞము ననుష్ఠించవలెను (136). అథాత్ర శివనైవేద్యం దత్త్వా తాంబూలం మాహరేత్ | శివప్రదక్షిణం కుర్యాత్స్వయ మష్టోత్తరం శతమ్ ||
137 సహస్ర మయుతం లక్షం కోటి మన్యేన కారయేత్ | శివ ప్రదక్షిణాత్సర్వం పాతకం నశ్యతి క్షణాత్ ||
138 దుఃఖస్య మూలం వ్యాధిర్హి వ్యాధేర్మూలం హి పాతకమ్| ధర్మేణౖవ హి పాపానామ పనోదన మీరితమ్ ||
139 శివోద్దేశకృతో ధర్మః క్షమః పాపవినోదనే | తరువాత భక్తుడు శివునకు నైవేద్యమును చేసి, తాంబూలమును సమర్పించవలెను. భక్తుడు తాను నూట యెనిమిది సార్లు శివునకు ప్రదక్షిణము చేయవలెను (137). వేయి, పదివేలు, లక్ష, లేక కోటిసార్లు ఇతరుల చేత ప్రదక్షిణము చేయించవలెను. శివప్రదక్షిణము వలన పాపము లన్నియూ క్షణములో నశించును (138). దుఃఖమునకు మూలము వ్యాధి. వ్యాధికి మూలము పాపము. పాపములు ధర్మము చేతనే తొలగునని చెప్పబడినది (139). శివుని ఉద్దేశించి చేసిన ధర్మము పాపములను పోగొట్టుటలో సమర్థమగును. అధ్యక్షం శివధర్మేషు ప్రదక్షిణ మితీరితమ్ ||
140 క్రియయా జపరూపం హి ప్రణవం తు ప్రదక్షిణమ్ | జననం మరణం ద్వంద్వం మాయా చక్రమితీరితమ్ ||
141 శివస్య మాయా చక్రం హి బలిపీఠం తదుచ్యతే | బలిపీఠం సమారభ్య ప్రాదక్షిణ్య క్రమేణవై ||
142 పదే పదాంతరం గత్వా బలిపీఠం సమావిశేత్ | నమస్కారం తతః కుర్యా త్ర్పదక్షిణ మితీరితమ్ ||
143 నిర్గమాజ్జననం ప్రాప్తం నమస్త్వాత్మ సమర్పణమ్ | జననం మరణం ద్వంద్వం శివమాయా సమర్పితమ్ ||
144 శివధర్మమములలో ప్రదక్షిణము సర్వోత్కృష్టమని చెప్పబడును (140). జపము క్రియయైనచో, ప్రదక్షిణము ప్రణవమగును. జనన మరణములనే ద్వంద్వమునకు మాయా చక్రమని పేరు (141). శివుని మాయా చక్రమునకు బలిపీఠమనియు పేరు గలదు. బలిపీఠము వద్ద మొదలిడి ఎడమ నుండి కుడికి (142) నడిచి, మరల బలిపీఠము వద్దకు రావలెను. అపుడు నమస్కారమును చేయవలెను. అది ఒక ప్రదక్షిణమగును (143). శివ మాయా నుండి బయటకు వచ్చుటనే జన్మ కలిగినది. నమస్కారము చేసి, ఆత్మ సమర్పణ చేసినచో, జననమరణములనే ద్వంద్వము శివమాయకు సమర్పితమగును (144). శివమాయార్పిత ద్వంద్వో న పునస్త్వాత్మ భాగ్భవేత్ | యావద్దేహః క్రియాధీనస్స జీవో బద్ధ ఉచ్యతే ||
145 దేహత్రయ వశీకారే మోక్ష ఇత్యుచ్యతే బుధైః | మాయాచక్ర ప్రణతా హి శివః పరమకారణమ్ ||
146 శివమాయార్పితం ద్వంద్వం శివస్తు పరిమార్జతి | శివేన కల్పితం ద్వంద్వం తస్మిన్నేవ సమర్పయేత్ ||
147 శివస్యాతి ప్రయం విద్యాత్ర్పదక్షిణం నమో బుధాః | ప్రదక్షిణ నమస్కారాః శివస్య పరమాత్మనః | |
148 షోడశై రుపచారైశ్చ కృతపూజా ఫల ప్రదా | ద్వంద్వమును శివమాయకు సమర్పించినచో, అది మరల బంధించదు. జీవుని దేహము కర్మాధీనముగ నున్నంతవరకు, ఆ జీవుడు బద్ధుడనబడును (145). మూడు విధముల దేహములను (స్తూల, సూక్ష్మ, కారణ) వశము చేసుకొనుటయే మోక్షమని పండితులు చెప్పెదరు. మాయా చక్రమును త్రిప్పే శివుడు జగత్తునకు పరమకారణము (146). శివమాయ యందు అర్పింపబడిన ద్వంద్వమును శివుడు మాత్రమే తుడిచివేయును. శివునిచే కల్పింపబడిన ద్వంద్వమును శివుని యందు మాత్రమే సమర్పించవలెను (147). ఓ విద్వాంసులారా! ప్రదక్షిణ నమస్కారములు శివునకు మిక్కిలి ప్రీతికరములని యెరుంగుము. పరమశివునకు ప్రదక్షిణము చేసి నమస్కరించినచో (148) షోడశోపచార పూజ చేసిన ఫలము లభించును. ప్రదక్షిణాsవినినాశ్యం హి పాతకం నాస్తి భూతలే ||
149 తస్మాత్ర్పదక్షిణనైవ సర్వం పాపం వినాశ##యేత్ | శివపూజాపరో మౌనీ సత్యాది గుణ సంయుతః ||
150 క్రియా తపో జప జ్ఞాన ధ్యానేష్వేకైక మాచరేత్ | ఐశ్వర్యం దివ్యదేహశ్చ జ్ఞానమజ్ఞాన సంశయః ||
151 శివసాన్నిధ్యమిత్యేతే క్రియాదీనాం ఫలం భ##వేత్ | కరణన ఫలం యాతి తమసః పరిహాపనాత్ ||
152 జన్మనః పరిమార్జిత్వాత్ జ్ఞ బుద్ధ్యా జనితాని చ | ప్రదక్షిణము నశింపచేయజాలని పాపము ఈ లోకములో లేదు (149). కావున, ప్రదక్షిణమును చేసి పాపములన్నింటినీ పోగొట్టుకొనవలెను. శివపూజ యందు నిష్ఠగల భక్తుడు మౌనమును పాటిస్తూ, సత్యము మొదలగు గుణములను కలిగి (150), శివకర్మ, తపస్సు, జపము, జ్ఞానము, ధ్యానము అను వాటిని ఒక్కొక్కటిగా ఆచరించవలెను. ఈ అయిదింటిని ఆచరించుట వలన ఐశ్వర్యము, దివ్యదేహము, జ్ఞానము, అజ్ఞాన నివృత్తి (151), శివుని సన్నిధి అను ఫలములు క్రమముగా లభించును. శివుని పూజను చేసి అజ్ఞానమును తొలగించుకొనుట వలన (152) జన్మ రాహిత్యము, జ్ఞానోదయము అను ఫలములు లభించును. యథా దేశం యథా కాలం యథా దేహం యథా ధనమ్ ||
153 యథా యోగ్యం ప్రకుర్వీత క్రియాదీన్ శివభక్తిమాన్ | న్యాయార్జిత సువిత్తేన వసేత్ర్పాజ్ఞశ్శివస్థలే ||
154 జీవహింసాది రహిత మతిక్లేశ వివర్జితమ్ | పంచాక్షరేణ జప్తం చ తోయమన్నం విదుస్సుఖమ్ ||
155 అథవాహుర్దరిద్రస్య భిక్షాన్నం జ్ఞానదం భ##వేత్ | శివభక్తస్య భిక్షాన్నం శివభక్తి వివర్ధనమ్ ||
156 శంభు సత్రమితి ప్రాహుర్భిక్షాన్నం శివయోగినః | శివభక్తుడు దేశకాలములకు, తన దేహమునకు, తన వద్ద నున్న ధనమునకు (153) అనురూపముగా పైన చెప్పిన క్రియాదులను యోగ్యత ననుసరించి చేయవలెను. జ్ఞాని శివక్షేత్రములో న్యాయముగా సంపాదించిన ధనముతో జీవించవలెను (154). జీవహింస చేయనివాడై, అధిక కష్టమును పరిహరించి జీవించవలెను. పంచాక్షరీ మంత్రముతో ప్రోక్షించిన నీరు, అన్నము సుఖమును కలిగించును (155). లేదా, భక్తుడు దరిద్రుడైనచో, భిక్షాన్నముతో జీవించవలెను. అట్లు చేయుట వలన జ్ఞానమును పొందును. శివభక్తునకు భిక్ష వలన లభించిన అన్నము శివభక్తిని వర్థిల్ల జేయును (156). శివయోగి భుజించు భిక్షాన్నమునకు శంభుసత్రమని పేరు. యేన కేనాప్యుపాయేన యత్ర కుత్రాపి భూతలే||
157 శుద్ధాన్న భుక్ సదా మౌనీ రహస్యం న ప్రకాశ##యేత్ | ప్రకాశ##యేత్తు భక్తానాం శివమహాత్మ్యమేవ హి ||
158 రహస్యం శివమంత్రస్య శివో జానాతి నాపరః | శివభక్తో వసేన్నిత్యం శివలింగం సమాశ్రితః ||
159 స్థాణులింగాశ్రయేణౖవ స్థాణుర్భవతి భూసురాః | పూజయా చర లింగస్య క్రమాన్ముక్తో భ##వేద్ధ్రువమ్ ||
160 సాధకుడు ఏదో ఒక ఉపాయముతో ఎచ్చటో ఒక చోట నివసించుచూ, భూమిపై శయనించవలెను (157). శుద్ధమగు అన్నమును భుజించవలెను. సదా మౌనియై ఉండవలెను. తన సాధనా రహస్యమును ప్రకటించరాదు. భక్తులకు శివుని మహిమను మాత్రమే వివరించవలెను (158). శివమంత్రము యొక్క రహస్యమును శివుడు తక్క మరియొకరు యెరుంగజాలరు. శివభక్తుడు సర్వదా శివలింగము నాశ్రయించి జీవించవలెను (159). ఓ ద్విజులారా! ప్రతిష్ఠిత లింగమును ఆశ్రయించి జీవంచు వ్యక్తి మాత్రమే శివసాయుజ్యమును పొందును. చరలింగమును పూజించు భక్తుడు క్రమముగా ముక్తిని పొందును (160). సర్వముక్తం సమాసేన సాధ్యసాధనముత్తమమ్ | వ్యాసేన యత్పురా ప్రాక్తం యచ్ర్ఛుతం హి మయా పురా ||
161 భద్రమస్తు హివోsస్మాకం శివభక్తిర్దృఢాస్తు సా | య ఇమం పఠతేsధ్యాయం యశ్శృణోతి నరస్సదా ||
162 శివజ్ఞానం స లభ##తే శివస్య కృపయా బుధాః ||
163 ఇతిశ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయం సాధ్యసాధన ఖండే శివలింగ మహిమా వర్ణనం నామ అష్టాదశోsధ్యాయః (18). ఉత్తమమగు సాధ్య సాధనములను సమగ్రముగా, సంగ్రహముగా బోధించితిని. నేను దీనిని పూర్వము వ్యాసుడు చెప్పగా విని యుంటిని (161). మీకు మంగళమగు గాక! మనకు దృఢమగు శివభక్తి కలగుగాక! ఓ విద్వాంసులారా! ఏ మానవుడు ఈ అధ్యాయమును సర్వాదా పఠించునో, లేక వినునో (162), అట్టివాడు శివుని కృప వలన శివజ్ఞానమును పొందును (163). శ్రీ శివ మహాపురాణములో విద్వేశ్వర సంహిత యందలి సాధ్యసాధన ఖండలో శివలింగ మహిమా వర్ణనము అను పద్ధెనిమిదవ అధ్యాయము ముగిసినది.