Sri Sivamahapuranamu-I
Chapters
అథ వింశోsధ్యాయః పార్థివ శివలింగ పూజా విధి సూత ఉవాచ | అథ వైదిక భక్తానాం పార్థివార్చా నిగద్యతే | వైదికేనైవ మార్గేణ భుక్తి ముక్తి ప్రదాయినీ ||
1 సూత్రోక్త విధినా స్నాత్వా సంధ్యాం కృత్వా యథావిధి | బ్రహ్మయజ్ఞం విధాయదౌ తతస్తర్పణ మాచరేత్ ||
2 నైత్యికం సకలం కర్మ విధాయానంతరం పుమాన్| శివస్మరణ పూర్వం హి భస్మరుద్రాక్షధారకః ||
3 వేదోక్త విధినా సమ్యక్సంపూర్ణ ఫలసిద్ధయే | పూజయేత్పరయా భక్త్యా పార్థివం లింగముత్తమమ్ ||
4 సూతుడిట్లు పలికెను - ఇపుడు వైదికభక్తులు చేసే పార్థివ లింగపూజ చెప్పబడుచున్నది. వైదిక మార్గము మాత్రమే ఇహపరముల నీయగల్గును (1). గృహ్య సూత్రములో చేప్పిన తీరున స్నానము చేసి, యథావిధిగా సంధ్యావందనము నాచరించి, ముందుగా బ్రహ్మయజ్ఞమును, తరువాత తర్పణమును చేయవలెను (2). భక్తుడు నిత్యకర్మల నన్నిటినీ ఆచరించిన తరువాత, శివుని స్మరించుచూ భస్మను, రుద్రాక్షలను ధరించవలెను (3). అపుడు భక్తుడు పూర్ణ ఫలమును పొందుట కొరకై, పరాభక్తితో శ్రేష్ఠమగు పార్థివ లింగమును చక్కగా పూజించవలెను (4). నదీతీరే తడాగే చ పర్వతే కాననేsపి చ | శివాలయే శుచౌ దేశే పార్థివార్చా విధీయతే ||
5 శుద్ధప్రదేశ సంభూతాం మృదమహృత్య యత్నతః | శివలింగం ప్రకల్పేత సావధానతయా ద్విజాః ||
6 విప్రే గౌరా స్మృతా శోణా బాహుజే పీతవర్ణకా | వైశ్యే కృష్ణా పాదజాతే హ్యథవా యత్ర యా భ##వేత్ ||
7 సంగృహ్య మృత్తికాం లింగ నిర్మాణార్థం ప్రయత్నతః | అతీవ శుభ##దేశే చ స్థాపయేత్తాం మృదం శుభామ్ ||
8 నదీ తీరము నందు గాని, చెరువు గట్టున గాని, పర్వతము నందు గాని, అడవిలో గాని, శివాలయము నందు గాని, లేదా ఏదేని శుద్ధ ప్రదేశము నందు పార్థివ లింగమును పూజించవలెనని విధి (5). ఓ ద్విజులారా! శుద్ధమగు ప్రదేశములోని మట్టిని శ్రద్ధతో సంగ్రహించి, సావధానముగా శివలింగమును నిర్మించవలెను (6). బ్రాహ్మణుడు తెల్లమట్టిని, క్షత్రియుడు ఎర్రమట్టిని, వైశ్యుడు పచ్చని మట్టిని, శూద్రుడు నల్లమట్టిని వాడవలెను. లేదా, లభించిన మట్టిని వాడవలెను (7). లింగమును నిర్మించుట కొరకై మట్టిని ప్రయత్నపూర్వకముగా సంగ్రహించి, ఆ పవిత్రమగు మట్టిని మిక్కిలి శుచి యగు ప్రదేశములో నుంచవలెను (8). సంశోధ్య చ జలేనాపి పిండీకృత్య శ##నైశ్శనైః | విధీయేత శుభం లింగం పార్థివం వేదమార్గతః ||
9 తతస్సంపూజయే ద్భక్త్యా భూక్తి ముక్తి ఫలాప్తయే | తత్ర్పకార మహం వచ్మి శృణుధ్వం సంవిధానతః ||
10 నమశ్శివాయ మంత్రేణార్చన ద్రవ్యం చ ప్రోక్షయేత్ | భూరసీతి చ మంత్రేణ క్షేత్రసిద్ధిం ప్రకారయేత్ ||
11 ఆపోస్మానితి మంత్రేణ జల సంస్కారమాచరేత్ | నమస్తే రుద్రమంత్రేణ ఫాటికా బంధముచ్యతే ||
12 నీటితో దానిని శుద్ది చేసి, మెల్లమెల్లగా పిండమును చేసి, శుభకరమగు పార్థివ లింగమును చేయవలెను . అపుడు వేదోక్త విధానముతో (9), భక్తితో పూచించినచో ఇహ పరహములు సిద్ధించును. నేనా పద్ధతిని యథావిధిగా వివరించెదను. వినుడు (10). పంచాక్షరీ మంత్రముతో పూజాద్రవ్యములను ప్రోక్షించవలెను. 'భూరసి' అను మంత్రముతో పూజాస్థలమును శుద్ధి చేసి సిద్ధము చేయవలెను (11). 'అపోస్మామ్' అను మంత్రముతో జలమును సంస్కరించవలెను. నమస్తే రుద్ర అను మంత్రముతో స్ఫటికబంధమును రచించవలెను (12). శంభవాయేతి మంత్రేణ క్షేత్రశుద్ధిం ప్రకారయేత్ | నమః పూర్వేణ కుర్యాత్పంచామృతస్యాపి ప్రోక్షణమ్ ||
13 నీలగ్రీవాయ మంత్రేణ నమః పూర్వేణ భక్తిమాన్ | చరేచ్ఛంకర లింగస్య ప్రతిష్ఠాపన ముత్తమమ్ ||
14 భక్తి తస్తత ఏతత్తే రుద్రాయేతి చ మంత్రతః | ఆసనం రమణీయం వై దద్యా ద్వైదికమార్గ కృత్ ||
15 మనో మహాంత మితి చ మంత్రేణా వాహనం చరేత్ | యాతే రుద్రేతి మంత్రేణ సంచరేదుపవేశనమ్ ||
16 'నమశ్శంభ##వే చ' అను మంత్రముతో క్షేత్రశుద్ధిని చేసి, పంచామృతములను ప్రోక్షణ చేయవలెను (13). సాధకుడు భక్తితో కూడినవాడై 'నమో నీలగ్రీవాయ చ' అను మంత్రముతో ఈ ఉత్తమమగు శివలింగమును ప్రతిష్ఠించవలెను (14). తరువాత, వైదిక మార్గములో పూజను చేయు ఈ భక్తుడు భక్తితో 'ఏతత్తే రుద్ర' అను మంత్రముతో సుందరమగు ఆసనమును సమర్పించవలెను (15). 'మానో మహాంతమ్' అను మంత్రముతో శివుని ఆవాహన చేసి, 'యాతే రుద్ర' అను మంత్రముతో శివుని ఆసనముపై ఉపవిష్టుని చేయవలెను (16). మంత్రేణ యామిషుమితి న్యాసం కుర్యాచ్ఛివస్య చ | అధ్యవో చదితి ప్రేవ్ణూధివాసం మనునా చరేత్ || 17 మనసా సౌయ ఇతి దేవతాన్యాసమాచరేత్ | అసౌ యోsవసర్పతీతి చాచరేదుపసర్పణమ్ || 18é నమోస్తు నీలగ్రీవాయేతి పాద్యం మనునా హరేత్ | ఆర్ఘ్యం చ రుద్రగాయత్ర్యాsచమనం త్ర్యంబకేణ చ || 19 పయః పృథివ్యామితి చ పయసా స్నానమాచరేత్ | దధిక్రావ్ణ్ణతి మంత్రేణ దధిస్నానం చ కారయేత్ || 20 'యామిషుం' అను మంత్రముతో శివునకు న్యాసమును చేయవలెను. 'అధ్యవోచత్' అను మంత్రముతో ప్రేమపూర్వకముగా అధివాసమును చేయవలెను (17). 'అసౌ యస్తామ్రః' అను మంత్రముతో లింగము నందు ఇష్టదైవమగు శివుని న్యాసమును ఆచరించవలెను. 'అసౌ యోsవసర్పతి' అను మంత్రముతో శివుని సమీపించవలెను (18). 'నమో అస్తు నీలగ్రీవాయ' అను మంత్రముతో పాద్యము నీయవలెను. 'తత్పురుషాయ' అను రుద్రగాయత్రితో ఆర్ఘ్యమును, 'త్ర్యంబకం యజామహే' అను మంత్రముతో ఆచమనమును ఈయవలెను (19). 'పయః పృథివ్యామ్' అను మంత్రముతో పాల అభిషేకమును, 'దధిక్రావ్‌ణ్ణో' అను మంత్రముతో పెరుగు అభిషేకమును చేయవలెను (20). ఘృతం స్నానే ఖలు ఘృతం ఘృతపావేతి మంత్రతః | మధువాతా మధునక్తం మధుమాన్న ఇతి త్ర్యృచా || 21 మధుఖండ స్నపనం ప్రోక్తమితి పంచామృతం స్మృతమ్ | అథవా పాద్యమంత్రేణ స్నానం పంచామృతేన చ || 22 మానస్తోకే ఇతి ప్రేవ్ణూ మంత్రేణ కటి బంధనమ్ | నమో ధృష్ణవే ఇతి వా ఉత్తరీయం చ ధాపయేత్ || 23 యాతే హే తిరితి ప్రేవ్ణూ ఋక్ చతుష్కేణ వైదికః | శివాయ విధినా భక్తశ్చరేద్వస్త్ర సమర్పణమ్ || 24 'ఘృతం ఘృతపావా' అను మంత్రముతో నేతి అభిషేకమును చేయవలెను. 'మధువాతా, మధునక్తం మధుమాన్నః' అను మూడు మంత్రములతో (21), మధువును, చక్కెర నీటిని ఉపయోగించి అభిషేకించవలెను. ఈ అయిదు ద్రవ్యములతో చేయు అభిషేకమునకు పంచామృత స్నానమని పేరు. ఇట్లు గాక, పాద్య మంత్రముతో పంచామృత స్నానమును అర్పించవచ్చును (22). 'మనస్తోకే' అను మంత్రముతో ప్రేమపూర్వకముగా శివునకు కటిబంధనమును, 'నమో ధృష్ణవే' అను మంత్రముతో ఉత్తరీయమును ఈయవలెను (23). వైదికభక్తుడు 'యా తే హేతిః' అను నాల్గు మంత్రములతో ప్రేమపూర్వకముగా శివునకు యథావిధిగా వస్త్రమును సమర్పించవలెను (24). నమః శ్వభ్య ఇతి ప్రేవ్ణూ గంధం దద్యాదృచా సుధీః | నమస్తక్షభ్య ఇతి చాక్షతాన్ మంత్రేణ చార్పయేత్ || 25 నమః పార్యాయ ఇతి వా పుష్పం మంత్రేణ చార్పయేత్ | నమః పర్ణ్యాయ ఇతి వా బిల్వపత్ర సమర్పణమ్ || 26 నమః కపర్దినే చేతి ధూపం దద్యాద్యథావిధి | దీపం దద్యాద్యథోక్తం తు నమ ఆశవ ఇత్యృచా || 27 నమో జ్యేష్ఠాయ మంత్రేణ దద్యాన్నైవేద్యముత్తమమ్ | మనునా త్ర్యంబకమితి పునరాచమనం స్మృతమ్ || 28 భక్తుడు పవిత్రమగు మనస్సు గలవాడై 'నమః శ్వభ్యః' అను మంత్రముతో ప్రేమతో గంధము నీయవలెను. 'నమస్తక్షభ్యః' అను మంత్రముతో అక్షతల నర్పించవలెను (25). 'నమః పార్యాయ' అను మంత్రముతో పుష్పమును, 'నమః పర్ణ్యాయ' అను మంత్రముతో మారేడు పత్రమును సమర్పించవలెను (26). 'నమః కపర్దినే చ' అను మంత్రముతో యథావిధిగా ధూపము నీయవలెను. 'నమ ఆశ##వే' అను మంత్రముతో యథావిధిగా ధూపము నీయవలెను (27). 'నమో జ్యేష్ఠాయ' అను మంత్రముతో ఉత్తమమగు నైవేద్యమును, 'త్రంబకం' అను మంత్రముతో పునరాచమనమును అర్పించవలెనని స్మృతులు చెప్పుచున్నవి (28). ఇమాం రుద్రాయేతి ఋచా కుర్యాత్ఫల సమర్పణమ్ | నమో గోష్ఠ్యాయేతి ఋచా సకలం శంభ##వేsర్పయేత్ || 29 మానో మహాంతమితి చ మానస్తోకే ఇతి తతః | మంత్రద్వయేనైక దశాక్షతై రుద్రాన్ ప్రపూజయేత్ || 30 హిరణ్య గర్భ ఇతి త్ర్యృచా దక్షిణాం హి సమర్పయేత్ | దేవస్య త్వేతి మంత్రేణ హ్యభిషేకం చరేద్బుధః || 31 దీప మంత్రేణ వాశంభోర్నీ రాజన విధిం చరేత్ | పుష్పాంజలిం చరే ద్భక్త్యా ఇమాం రుద్రాయ చ త్ర్యృచా || 32 'ఇమాంగ్‌ం రుద్రాయ' అను మంత్రముతో ఫలము నర్పించవలెను. 'నమో గోష్ఠ్యోయ' అను మంత్రముతో సర్వమును శివునకు అర్పించవలెను (29). 'మనో మహాంతమ్, మానస్తోకే' అను రెండు మంత్రములతో ఏకాదశరుద్రులను అక్షతలతో పూజించవలెను (30). 'హిరణ్యగర్భః' అను మూడు మంత్రములతో దక్షిణ నీయవలెను. విద్వాంసుడు 'దేవస్య త్వా' అను మంత్రముతో అభిషేకమును చేయవలెను (31). దీప మంత్రముతో శివునకు నీరాజనమీయవలెను. తరువాత 'ఇమాంగ్‌ం రుద్రాయ' అను మూడు మంత్రములతో రుద్రునకు దోసెడు పుష్పములను భక్తితో సమర్పించవలెను (32). మా నో మహాంతమితి చ చరేత్ర్పాజ్ఞః ప్రదక్షిణమ్ | మానస్తోకేతి మంత్రేణ సాష్టాంగ ప్రణమేత్సుధీః || 33 ఏష తే ఇతి మంత్రేణ శివముద్రాం ప్రదర్శయేత్ | యతో యత ఇత్యభయాం జ్ఞానాఖ్యాం త్ర్యంబకేణ చ || 34 నమస్సే నేతి మంత్రేణ మహాముద్రాం ప్రదర్శయేత్ | దర్శయే ద్ధేను ముద్రాం చ నమో గోభ్య ఋచానయా || 35 పంచముద్రాః ప్రదర్శ్యాథ శివమంత్ర జపం చరేత్ | శత రుద్రియ మంత్రేణ జపేద్వేద విచక్షణః || 36 ప్రాజ్ఞుడు 'మా నో మహాంతమ్ ' అను మంత్రముతో ప్రదక్షిణమును చేసి, పవిత్రమగు మనస్సుతో 'మానస్తోకే' అను మంత్రమును పఠించి, సాష్టాంగముగా నమస్కరించవలెను (33). 'ఏష తే రుద్ర' అను మంత్రముతో శివముద్రను, 'యతో యతః' అను మంత్రముతో అభయముద్రను, ' త్ర్యంబకమ్ ' అను మంత్రముతో మహాముద్రను 'నమో గోభ్యః' అను మంత్రముతో ధేను ముద్రను చూపవలెను (35). ఈవిధముగా పంచముద్రలను చూపి, శివమంత్రమును జపించవలెను. వేదవేత్త శతరుద్రీయము (రుద్రాధ్యాయము) ను జపించవలెను (36). తతః పంచాంగ పాఠం చ కుర్యాద్వేదవిచక్షణః | దేవా గాత్వితి మంత్రేణ కుర్యాచ్ఛంభోర్విసర్జనమ్ || 37 ఇత్యుక్త శ్శివపూజాయా వ్యాసతో వైదికో విదిః | సమాసతశ్చ శృణుత వైదికం విధిముత్తమమ్ || 38 ఋచా సద్యోజాతమితి మృదాహరణ మాచరేత్ | వామదేవాయ ఇతి చ జల ప్రక్షేపమాచరేత్ || 39 అఘోరేణ చ మంత్రేణ లింగనిర్మాణ మాచరేత్ | తత్పూరుషేణ మంత్రేణాహ్వానం కుర్యాద్యథా విధి || 40 తరువాత వేదవేత్త పంచాంగమును పఠించవలెను. 'దేవా గాతు' అను మంత్రముతో శివునికి ఉద్వాసన చెప్పవలెను (37). ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానము విస్తరముగా చెప్పబడినది. ఇపుడు ఉత్తమమగు ఆ వైదిక విధి యొక్క సంగ్రహరూపమును వినుడు (38). 'సద్యో జాతం' అను మంత్రముతో మట్టిని తీసుకువచ్చి, 'వామదేవాయ' అను మంత్రముతో జలమును ప్రోక్షించవలెను (39). 'అఘోరేభ్యః' అను మంత్రముతో లింగమును నిర్మించి, 'తత్పురుషాయ' అను మంత్రముతో శివుని యథావిధిగా ఆహ్వానించవలెను (40). సంయోజ యేద్వేదికాయా మీశాన మనునా హరమ్ | అన్యత్సర్వం విధానం చ కుర్యాత్సంక్షేప తస్సుధీః || 41 పంచాక్షరేణ మంత్రేణ గురుదత్తేన వా తథా | కుర్యాత్పూజాం షోడశోపచారేణ విధివత్సుధీః || 42 భవాయ భవనాశాయ మహేదేవాయ ధీమహి | ఉగ్రాయ ఉగ్రనాశాయ శర్వాయ శశి మౌలినే || 43 అనేన మనునా వాపి పూజయేచ్ఛంకరం సుధీః | సుభక్త్యాచ భ్రమం త్యక్త్వా భ##క్త్యైవ ఫలదశ్శివః || 44 'ఈశానః' అను మంత్రముతో శివుని వేదికపై ప్రతిష్ఠించి, భక్తుడు శుద్ధమగు మనస్సు గలవాడై, మిగిలిన విధానము నంతనూ సంక్షేపముగా చేయవలెను (41). భక్తుడు పంచాక్షరి మంత్రముతో గాని, గురువు ఇచ్చిన మంత్రముతో గాని షోడశోపచార పూజను యథావిధిగా చేయవలెను (42). లేదా, 'భవాయ ... మౌలినే' (భవుడు, సంసారమును నశింపజేయువాడు, ఉగ్రుడు, ఉగ్రదోషములను నశింపజేయువాడు, సంహారకర్త, చంద్రుని శిరస్సుపై ధరించువాడు నగు మహాదేవుని ధ్యానించెదము) (43) అను మంత్రముతో శంకరుని, భక్తితో, భ్రమలను వీడి పూజించవలెను. శివుడు భక్తిచేత మాత్రమే ఫలముల నిచ్చును (44). ఇత్యపి ప్రోక్త మాదృత్య వైదిక క్రమపూజనమ్ | ప్రోచ్యతేsన్యవిధిస్సమ్యక్సాధారణ తయా ద్విజాః || 45 పూజా పార్థివ లింగస్య సంప్రోక్తా శివనామభిః | తాం శృణుధ్వం మునిశ్రేష్ఠాః సర్వకామ ప్రదాయినీ || 46 హరో మహేశ్వర శ్శంభు శ్శూల పాణిః పినాకధృక్ | శివః పశుపతిశ్చైవ మహాదేవ ఇతి క్రమాత్ || 47 మృదాహరణ సంఘట్ట ప్రతిష్ఠాహ్వానమేవ చ | స్నపనం పూజనం చైవ క్షమస్వేతి విసర్జనమ్ || 48 ఓంకారాది చతుర్థ్యంతై ర్నమోంతైర్నామభిః క్రమాత్ | కర్తవ్యా చ క్రియా సర్వా భక్త్వా పరమయా ముదా || 49 వైదిక పద్ధతిలో పూజ చేయు విధము సాదరముగా వర్ణింపబడినది. ఓ ద్విజులారా! సర్వులకు ఉపయోగపడే మరియొక పూజావిధి కూడ చెప్పబడుచున్నది (45). పార్థివ లింగమును శివుని నామములతో పూజించు విధానము గలదు. ఓ మునిపుంగవులారా! కోర్కెల నన్నిటినీ ఈడేర్చు ఆ పూజావిధిని వినుడు (46). ఓం హరాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభ##వే నమః, ఓం శూలపాణయే నమః, ఓం పినాకధృతే నమః, ఓం శివాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం మహాదేవాయ నమః, అను నామములతో క్రమముగా (47) మట్టిని తెచ్చుట, లింగమును చేయుట, శివుని ప్రతిష్ఠించుట, ఆహ్వానము, స్నానము, పూజ, క్షమాపణము, ఉద్వాసన అను విధులను (48) భక్తితో, ఆనందముతో చేయవలెను (49). కృత్వా న్యాసవిధిం సమ్యక్ షడంగకరయోస్తథా | షడక్షరేణ మంత్రేణ తతో ధ్యానం సమాచరేత్ || 50 కైలాసపీఠాసన మధ్యసంస్థం భ##క్తైస్సనందాదిభిరర్చ్యమానమ్ | భక్తార్తి దావానల మప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణమ్ || 51 ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతంసం రత్నాకల్పోజ్జ్వలాంగం పరశు మృగ వరా భీతి హస్తం ప్రసన్నమ్ | పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణౖః వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ || 52 షడక్షర మంత్రము (ఓం నమశ్శివాయ) తో యథావిధిగా ఆరు అంగన్యాసములను, ఆరు కరన్యాసములను చేసి, ధ్యానమును చేయవలెను (50). కైలాసము నందు సింహాసన మధ్యములో విరాజిల్లువాడు, సనందుడు మొదలగు భక్తులచే పూజింపబడువాడు, భక్తుల దుఃఖమునకు దావాగ్ని వంటివాడు, ప్రమాణములకు గోచరము కాని వాడు, ఉమాదేవితో కూడియున్నవాడు, బ్రహ్మాండమునకు అలంకారమైనవాడు అగు శివుని ధ్యానించవలెను (5). వెండి కొండవలె ప్రకాశించువాడు, సుందరమగు చంద్రుని కిరీటమునందు ధరించినవాడు, రత్నాభరణములచే ప్రకాశించు దేహము గలవాడు; పరశువు, లేడి, వరముద్ర, అభయముద్రలను చేతియందు ధరించినవాడు; ప్రసన్నుడు, పద్మాసనము నందున్నవాడు, వ్యాఘ్రచర్మమును ధరించినవాడు, బ్రహ్మాండమునకు ఆద్యుడు, బ్రహ్మాండమునుక కారణభూతుడు, భయముల నన్నటినీ పోగొట్టువాడు, అయిదు ముఖములు గలవాడు, ముక్కంటి యగు మహేశ్వరుని ప్రతిదినము ధ్యానించవలెను (52). ఇతి ధ్యాత్వా చ సంపూజ్య పార్థివం లింగముత్తమమ్ | జపేత్పంచాక్షరం మంత్రం గురుదత్తం యథావిధి || 53 స్తుతిభిశ్చైవ దేవేశం స్తువీత ప్రణమన్ సుధీః | నానాభిధాభి ర్విప్రేంద్రాః పఠేద్వై శతరుద్రియమ్ || 54 తతస్సాక్షత పుష్పాణి గృహీత్వాం జలినా ముదా | ప్రార్ధయే చ్ఛంకరం భక్త్యా మంత్రైరేభిస్సు భక్తితః || 55 ఈ విధముగా శ్రేష్ఠమగు పార్థివ లింగమును పూజించి, ధ్యానించి, గురువు చేత యథావిధిగా ఈయబడిన పంచాక్షర మంత్రమును జపించవలెను (53). ఓ విప్రశ్రేష్ఠులారా! వివేకి మహాదేవుని అనేక విధముల స్తోత్రములచే స్తుతించి, నమస్కరించవలెను. మరియు శతరుద్రియమును పఠించవలెను (54). తరువాత, అక్షతలను, పుష్పములను దోసిలి యందు తీసుకుని ఆనందముతో, భక్తితో శంకరుని ఈ మంత్రములతో ప్రార్థించవలెను (55). తావకస్త్వద్గత ప్రాణస్త్వచ్చిత్తోsహం సదా మృడ | కృపానిధ ఇతి జ్ఞాత్వా భూతనాథ ప్రసీదమే || 56 అజ్ఞానాద్యది వా జ్ఞానాజ్జప పూజాదికం మయా | కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర || 57 అహం పాపీ మహానద్య పావనశ్చ భవాన్మహాన్ | ఇతి విజ్ఞాయ గౌరీశ యదిచ్ఛసి తథా కురు || 58 వేదైః పురాణౖ స్సిద్ధాంతైః ఋషి భిర్వివిధైరపి | న జ్ఞాతోsసి మహాదేవ కుతోsహం త్వం సదాశివ || 59 యథా తథా త్వదీయోsస్మి సర్వభావై ర్మహేశ్వర | రక్షణీయస్త్వయహం వై ప్రసీద పరమేశ్వర || 60 హే మృడ! నేను నీ వాడను. నా జీవతము నీ అధీనములో నున్నది. నా మనస్సులో సదా నీవే ఉన్నావు. హే కృపానిదే! హే భూతనాథా! ఈ విషయము నెరింగి నన్ను అనుగ్రహింపుము (56). ఓ శంకరా! తెలిసి గాని, తెలియక గాని చేసిన జపపూజాదులు నీ కృపచే సఫలములగు గాక! (57). నేను గొప్ప పాపిని. నీవు గొప్ప పావనుడవు. హే గౌరీపతే! నీవీ విషయము నెరింగి, నీకు నచ్చినట్లు చేయుము (58). ఓ మహాదేవా! నిన్ను వేదములు, పురాణములు, వివిధ సిద్ధాంతములు, మరియు ఋషులు కూడ తెలియలెకపోయిరి. హే సదాశివా! నేనెక్కడ? నీవెక్కడ? (59). హే మహేశ్వరా !నేను అన్ని విధముల భావముల చేత నీవాడనై యున్నాను. హే పరమేశ్వరా !నీవు నన్ను అనుగ్రహించి రక్షించవలెను (60). ఇత్యేవం చాక్షతాన్ పుష్పాన్ ఆరోప్య చ శివోపరి | ప్రణమేద్భక్తిత శ్శంభుం సాష్టాంగం విధి వన్మునే || 61 తతః ప్రదక్షిణాం కుర్యాద్యథోక్త విధినా సుధీః | పునస్త్సు వీత దేవేశం స్తుతిభిః శ్రద్ధయాన్వితః || 62 తతో గలరవం కృత్వా ప్రణమేచ్ఛుచినమ్రధీః | కుర్యాద్విజ్ఞప్తి మాదృత్య విసర్జన మథాచరేత్ || 63 ఇత్యుక్తా మునిశార్దూలాః పార్థివార్చా విధానతః | భుక్తిదా ముక్తిదా చైవ శివభక్తి వివర్థినీ || 64 ఓ మహర్షీ! ఇట్లు ప్రార్థించి అక్షతలను, పుష్పములను శివునిపై ఉంచి, భక్తితో శివునకు యథావిధిగా సాష్టాంగనమస్కారమును చేయవలెను (61). తరువాత, సద్బుద్ధిగల భక్తుడు యథావిధిగా ప్రదక్షిణమును చేసి, మరల మహాదేవుని శ్రద్ధతో స్తుతించవలెను (62). తరువాత బిగ్గరగా జయధ్వానమును చేసి, పవిత్రమైన, వినీతమైన మనస్సుతో నమస్కరించి, సాదరముగా విన్నవించుకొని, తరువాత ఉద్వాసనను చెప్పవలెను (63). ఓ మునిశ్రేష్ఠులారా! ఇహ పరముల నొసగు నట్టియు, శివుని యందు భక్తిని పెంపొందించు పార్థివ లింగపూజా విధానమును చెప్పితిని (64). ఇత్యధ్యాయం సుచిత్తేన యః పఠేఛ్ఛృణు యాదపి | సర్వపాప విశుద్ధాత్మా సర్వాన్కా మానవాప్నుయాత్ || 65 ఆయురారోగ్యదం చైవ యశస్యం స్వర్గ్యమేవ చ | పుత్రపౌత్రాది సుఖద మాఖ్యాన మిదముత్తమమ్ || 66 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్వేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే పార్థివ శివలింగ పూజా విధి వర్ణనం నామ వింశోsధ్యాయః (20). ఈ అధ్యాయమును మంచి మనస్సుతో పఠించే, లేదా వినే వ్యక్తి పాపముల నన్నింటినీ తొలగించుకొని, కోర్కెలన్నిటినీ పొందును (65). ఈ పవిత్రమగు అధ్యాయము ఆయుర్దాయమును, ఆరోగ్యమును, కీర్తిని, స్వర్గమును, పుత్రపౌత్రాది సుఖములను ఇచ్చును (66). శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో పార్ధివ శివలింగ పూజావిధి వర్ణనము అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది.