Sri Sivamahapuranamu-I
Chapters
అధ ఏక వింశోsధ్యాయః పార్థివ పూజా వర్ణనము ఋషయ ఊచుః | సూత సూత మహాభాగ వ్యాస శిష్య నమోsస్తుతే | సమ్యగుక్తం త్వయా తాత పార్థి వార్చా విధానకమ్ || 1 కామనా భేదమాశ్రిత్య సంఖ్యాం బ్రూహి విధానతః | శివ పార్ధివ లింగానాం కృపయా దీనవత్సల || 2 ఋషులిట్లు పలికిరి - ఓ సూతా! మహాత్మా! వ్యాసశిష్యా! నీకు నమస్కారము. నీవు పార్థివలింగ పూజా విధానమును చక్కగా వర్ణించితివి (1). దీనదయాళో! భక్తుల కామనలలోని భేదమును బట్టి పూజించవలనసిన పార్థివలింగముల సంఖ్యను దయతో వర్ణింపుము (2). సూత ఉవాచ | శృణుధ్వమృషయస్సర్వే పార్థివార్చా విధానకమ్ | యస్యానుష్ఠాన మత్రేణ కృతకృత్యో భ##వేన్నరః || 2 అకృత్వా పార్థివం లింగం యోsన్యదేవం ప్రపూజయేత్ | వృథా భవతి సా పూజా దమదానదికం వృథా || 3 సంఖ్యా పార్థివలింగానాం యథాకామం నిగద్యతే | సంఖ్యా సద్యో మునిశ్రేష్ఠ నిశ్చయేన ఫలప్రదా || 5 ప్రథమావాహనం తత్ర ప్రతిష్ఠా పూజనం పృథక్ | లింగాకారం సమం తత్ర సర్వం జ్ఞేయం పృథక్పృథక్ || 6 సూతుడిట్లు పలికెను - ఓ ఋషులారా! మీరందరు వినుడు. పార్థివలింగ పూజా విధీనమును చెప్పెదను. మానవుడు ఈ పూజను చేసినంత మాత్రాన కృతకృత్యుడగును(3). పార్ధివలింగమును గాక, ఇతర దేవతలను పూజించినచో, ఆ పూజ, ఇంద్రియ నిగ్రహము, దానము ఇత్యాదులు వృథాయగును (4). కామనను బట్టి పూజించదగిన పార్థివలింగముల సంఖ్యను చెప్పెదను. ఓమునిశ్రేష్ఠా! ఈ సంఖ్యను అనుసరించి పూజను చేసినచో, ఫలము వెను వెంటనే లభించుట నిశ్చయము (5). లింగములన్నింటికీ ఆకారము సమముగా నుండవలెను. ఆవాహనము, ప్రతిష్ఠా ఇత్యాది పూజను లింగములన్నింటికీ వేర్వేరుగా చేయవలెను. విద్యార్థీ పురుషః ప్రీత్యా సహస్రమిత పార్థివమ్ | పూజయేచ్ఛివలింగం హి నిశ్చయాత్తత్ఫలప్రదమ్ || 7 నరః పార్థివలింగానాం ధనార్థీ చ తదర్ధకమ్ | పుత్రార్థీ సార్థ సాహస్రం వస్త్రార్ధీ శతపంచకమ్ || 8 మోక్షార్థీ కోటి గుణితం భూకామశ్చ సహస్రకమ్ | దయార్థీ చ త్రిసాహస్రం తీర్ధార్థీ ద్విసహస్రకమ్ || 9 సుహృత్కామీ త్రిసాహస్రం వశ్యార్థీ శతమష్టకమ్ | మారణార్థీ సప్తశతం మోహనార్ధీ శతాష్టకమ్ || 10 విద్యను కోరు మానవుడు ప్రీతితో వేయి పార్థివలింగములను పూజించినచో, నిశ్చయముగా ఫలము లభించును (7). ధనమును గోరు మానవుడు ఐదువందలు, పుత్రుని కోరువాడు పదిహేనువందలు, వస్త్రములను కోరువాడు ఐదువందలు (8), మోక్షమును కోరువాడు కోటి, భూమిని కోరువాడు వేయి, పరమేశ్వరుని దయను కోరువాడు మూడువేలు, తీర్థయాత్రను కోరువాడు రెండు వేలు (9), స్నేహితుని కోరువాడు మూడు వేలు, ఇతర వ్యక్తి తన వశము కావలెనని కోరువాడు ఎనిమిది వందలు, శత్రునాశమును కోరువాడు ఏడువందలు, ఇతరులను మోహింపజేయు గోరువాడు ఎనిమిది వందలు, పార్థివలింగములను అర్చించవలెను (10). ఉచ్చాటన పరశ్చైవ సహస్రం చ యథోక్తతః | స్తంభనార్థీ సహస్రం తు ద్వేషణార్థీ తదర్థకమ్ || 11 నిగడాన్ముక్తి కామస్తు సహస్రం సార్థముత్తమమ్ | మహారాజభ##యే పంచశతం జ్ఞేయం విచక్షణౖః || 12 చౌరాది సంకటే జ్ఞేయం పార్థివానాం శత ద్వయమ్ | డాకి న్యాది భ##యే పంచశత ముక్తం చ పార్థివమ్ || 13 దారిద్య్రే పంచసాహస్రమయుతం సర్వకామదమ్ | భూతోచ్చాటనమును చేయగోరువాడు వేయి, భూతదుల స్తంభమును చేయగోరువాడు వేయి, శత్రు నాశమును కోరువాడు అయిదు వందలు (11), సంకెళ్ల నుండి విడుదలను కోరువాడు పదిహేను వందలు, మహారాజ భయము కలిగినప్పుడు అయిదు వందలు (12), చోరుల వలన కష్టము కలిగినపుడు రెండు వందలు (13), దారిద్ర్యము పోవుటకు అయిదు వేలు, కోర్కెలన్నియు ఈడేరుటకు పదివేలు ఉత్తమ పార్థివలింగములను యథావిధిగా పూజించవలెనని పండితులు తెలియవలెను. అథ నిత్యవిధిం వక్ష్యే శృణుధ్వం ముని స్తత మాః || 14 ఏకం పాపహరం ప్రోక్తం ద్విలింగం చార్థసిద్ధిదమ్ | త్రిలింగం సర్వకామానాం కారణం పరమీరితమ్ || 15 మతాంతరమథో వక్ష్యే సంఖ్యాయాం ముని భేదతః | లింగానామయుతం కృత్వా పార్థివానాం సుబుద్ధిమాన్ || 16 నిర్భయో హి భ##వేన్నూనం మహారాజభయం హరేత్ | కారాగృహాది యుక్త్యర్థ మయుతం కారయేద్బుధః || 17 డాకిన్యాది భ##యే సప్తసహస్రం కారయేత్తథా | సహస్రాణి పంచ పంచశదపుత్రః ప్రకారయేత్ || 18 లింగానామయుతేనైవ కన్యాకాసంతతిం లభేత్ | ఓ ముని శ్రేష్ఠులారా! ఇపుడు నిత్యవిధి గురించి చెప్పెదను వినుడు (14). ఒక లింగమును పూజించిన, పాపములు తొలగును. రెండు లింగములను అర్చించినచో, కార్యసిద్ధి కలుగును. మూడు లింగములను అర్చించిన, కోర్కెలన్నియూ ఈడేరునని చెప్పబడినది (15). ఈ సంఖ్య విషయములో మునుల అభిప్రాయమునందు భేదము గలదు. అట్టి సంఖ్యా భేదమునొక దానిని చెప్పెదను. బుద్ధిమంతుడు పదివేల లింగములను పూజించినచో (16), మహారాజ భయమేగాక, అన్ని భయములు తొలగును. చెరసాల నుండి విముక్తిని కోరు విద్వాంసుడు పదివేల లింగముల పూజను చేయించవలెను (17). డాకినీ మొదలగు పిశాచముల వలన భయము కలిగినచో, ఏడు వేల లింగముల పూజను చేయించవలెను. పుత్ర సంతానము లేనివాడు ఏభై అయిదు వేల లింగములను పూజించవలెను (18). పదివేల లింగములను పూజించినచో పుత్రిక జన్మించును. లింగానామయుతేనైవ విష్ణ్వా ద్యైశ్వర్యమాప్నుయాత్ || 19 లింగానాం ప్రయుతేనైవ హ్యతులాం శ్రియ మాప్నుయాత్ | కోటిమేకాం తు లింగానాం యః కరోతి నరో భువి || 20 శివ ఏవ భ##వేత్సోsపి నాత్ర కార్యా విచారాణా | అర్చా పార్థివలింగానాం కోటి యజ్ఞఫలప్రదా|| 21 భుక్తిదా ముక్తిదా నిత్యం తతః కామార్థినాం నృణామ్ | వినా లింగార్చనం యస్య కాలో గచ్ఛతి నిత్యశః || 22 మహా హానిర్భవేత్తస్య దుర్వృత్తస్య దురాత్మనః | పదివేల లింగముల నర్చించుట వలన విష్ణువు మొదలగు దేవతల ఐశ్వర్యముతో సమమగు ఐశ్వర్యము లభించును (19). లక్షలింగములను అర్చించిన వ్యక్తి సాటిలేని సంపదను పొందును. ఈ లోకములో కోటిలింగమును అర్చించు మానవుడు (20) శివస్వరూపుడగుననుటలో సందేహము లేదు. పార్థివలింగార్చన వలన కోటి యజ్ఞముల ఫలము లభించును (21). ఈ అర్చన మానవులకు భుక్తిని, ముక్తిని ఇచ్చుట మాత్రమే గాక, కోర్కెల నీడేర్చును. ఏనాడూ లింగార్చన లేకుండగా కాలమును గడుపు (22) దురాత్మునకు గొప్ప హాని కలుగును. ఏకతస్సర్వదానాని వ్రతాని వివిధాని చ || 23 తీర్థాని నియమా యజ్ఞా లింగార్చా చైకత స్స్మృతా | కలౌ లింగార్చనం శ్రేష్ఠం తధా లోకే ప్రదృశ్యతే || తథా నాస్తీతి శాస్త్రాణా మేష సిద్ధాంత నిశ్చయః | భుక్తి ముక్తిప్రదం లింగం వివిధా పన్నివారణమ్ || 25 పూజయిత్వా నరో నిత్యం శివ సాయుజ్యమాప్నుయాత్ | శివనామమయం లింగం నిత్యం పూజ్యం మహర్షిభిః || 26 యతశ్చ సర్వలింగేషు తస్మాత్పూజ్యం విధానతః | అన్ని దానములు, వివిధ వ్రతములు (23), తీర్థములు, నియమములు, మరియు యజ్ఞములు ఒకవైపు, లింగార్చన మరియొక వైపు అన్ని స్మృతులు చెప్పుచున్నవి. కలియుగములో లింగార్చన లోకములో ఎట్లు శ్రేష్ఠమై యున్నదో (24), అట్టి శ్రేష్ఠమైనది మరియొకటి లేదని శాస్త్రములు నిర్ణయించినవి. భుక్తిని, ముక్తిని, ఇచ్చి, విభిన్న ఆపదలను తొలగించే లింగమును (25) నిత్యము అర్చించు మానవుడు శివసాయుజ్యమును పొందును. పంచాక్షరీ మంత్రరూపమగు లింగము లింగములన్నింటిలో శ్రేష్ఠమైనది గావున, మహర్షులు (26)నిత్యము దానిని యథావిధిగా ఉపాసించవలెను| ఉత్తమం మధ్యమం నీచం త్రి విధం లింగమీరితమ్ || 27 మానతో మునిశార్దూలాస్తచ్ఛృణుధ్వం వదామ్యహమ్ | చతురంగుల ముచ్ఛ్రాయం రమ్యం వేదికయా యుతమ్ || 28 ఉత్తమం లింగమాఖ్యాతం మునిభిశ్శాస్త్ర కోవిదైః | తదర్ధం మధ్యమం ప్రోక్తం తదర్ధ మధుమం స్మృతమ్ || 29 ఇత్థం త్రివిధమాఖ్యాతముత్తరోత్తరతః పరమ్ | అనేక లింగం యో నిత్యం భక్తి శ్రద్దా సమన్వితః || 30 పూజయేత్స లభేత్కా మాన్మనసా మానసేప్సితాన్ | న లింగారాధనాదన్యత్పుణ్యం వేద చతుష్టయే || 31 విద్యతే సర్వశాస్త్రాణామేష ఏవ వినిశ్చయః | లింగములు మహిమను బట్టి ఉత్తమ మధ్యమ, నీచములని మూడు విధములుగా నున్నవి (27). ఓ మునిశ్రేష్ఠులారా! వీటి వివరములను నేను చెప్పెదను. వినుడు. నాల్గు అంగుళములు ఎత్తు కలిగి పీఠమును కలిగియున్న సుందరమగు (28) లింగము ఉత్తమమని శాస్త్రపండితులగు మునులు చెప్పియున్నారు. దానిలో సగము ఎత్తు ఉన్నది మధ్యమమని, నాల్గవవంతు ఉన్నది అధమమని చెప్పబడినది (29). ఈ విధముగా ఈ మూడు లింగములు ఉత్తరోత్తరము అధిక మహిమ గలవియని చెప్పబడినది. అనేక లింగములను నిత్యము భక్తి శ్రద్ధలతో గూడి (30) పూజించు నరుని మనోరథములన్నియు ఈడేరును. నాల్గు వేదములలో లింగారాధనము కంటె అధికపుణ్యమగు కర్మ లేదని (31) సర్వశాస్త్రముల నిశ్చయమై యున్నది. సర్వమేతత్పరిత్యజ్య కర్మజాల మశేషతః || 32 భక్త్యా పరమయా విద్వాన్ లింగమేకం ప్రపూజయేత్ | లింగేsర్చితేsర్చితం సర్వం జగత్ స్థావరజంగమమ్ || 33 సంసారాం బుధి మగ్నానాం నాన్యత్తారణ సాధనమ్| అజ్ఞానతిమిరాం ధానాం విషయాసక్త చేతసామ్ || 34 ప్లవో నాన్యోsస్తి జగతి లింగారాధన మంతరా | విద్వాంసుడు ఈ కర్మ సముదాయమునంతను వీడి (32), పూర్ణభక్తితో లింగపూజను మాత్రమే చేయవలెను. లింగము నర్చించినచో, చరాచర జగత్తు నంతనూ అర్చించినట్లే యగును (33). అజ్ఞానము అనే చీకటిచే అంధులై, ఇంద్రియ భోగముల యందు నిమగ్నమైన మనస్సు గలిగిన వారికి (34), ఈ లోకములో లింగార్చన తక్క మరియొక్క నావ లేదు. హరి బ్రహ్మదయో దేవా మునయో యక్షరాక్షసాః || 35 గంధర్వాశ్చారణాస్సిద్ధా దైతేయా దానవాస్తథా | నాగాశ్శేష ప్రభృతయో గరుడాద్యాః ఖగాస్తథా || 36 సప్రజాపతయ శ్చాన్యే మనవః కిన్నరా నరాః | పూజయిత్వా మహాభక్త్వా లింగం సర్వార్థ సిద్ధిదమ్ || 37 ప్రాప్తాః కామానభీష్టాంశ్చ తాంస్తాన్సర్వాన్ హృది స్థితాన్ | విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు (35), గంధర్వులు, చారణులు, సిద్ధులు, దైత్యులు, దానవులు మరియు శేషుడు మొదలగు నాగులు, గరుడుడు మొదలగు పక్షులు (36), ప్రజాపతులు, మనువులు, కిన్నరులు, మరియు నరులు సర్వకార్యములను సిద్ధింపజేయు లింగమును మహాభక్తితో పూజించి (37), తమ తమ మనోరథములనన్నింటినీ పొందిరి. బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః || 38 పూజయేత్సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరమ్ | కిం బహూక్తేన మునయః స్త్రీ ణామపి తథాన్యతః || 39 అధికారోsస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః | ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం వరమ్ || 40 అన్యేషా మపి జంతూనాం వైదికేన న సంమతమ్ | వైదికానాం ద్విజానాం చ పూజా వైదిక మార్గతః || 41 కర్తవ్యా నాన్యమార్గేణ ఇత్యాహ భగవాన్ శివః | దధీచి గౌతమాదీనాం శాపేనాదగ్ధచేతసామ్ || 42 ద్విజానాం జయతే శ్రద్ధా నైవ వైదిక కర్మణి | బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులే గాక సర్వులు (38) లింగమును ఆయా మంత్రములతో శ్రద్ధగా నిత్యము పూజించవలెను. ఓ మునులారా! ఇన్ని మాటలేల? ఓ ద్విజులారా! స్త్రీలకు, ఇతరులకు అందరికి కూడ (39) శివలింగమును అర్చించుట యందు అధికారము గలదు. ద్విజులు వైదిక పద్ధతిలో ఆరాధించుటయే శ్రేష్ఠము (40). ఇతరులకు వైదిక పద్ధతి అను కూలము కాదు. వేదవేత్తలగు ద్విజులు వైదిక పద్ధతిలోనే పూజించవలెననియు (41), ఇతర పద్ధతిలో కాదనియు పరమేశ్వరుడు చెప్పెను. దధీచి, గౌతముడు మొదలగు ఋషుల శాపముచే భ్రష్టమైన అంతః కరణము గల ద్విజులకు (42) వైదిక కర్మల యందు శ్రద్ధ కలుగనే కలుగదు. యో వైదిక మనాదృత్య కర్మ స్మార్ మథాపి వా || 43 అన్యత్స మాచరేన్మర్త్యో న సంకల్పఫలం లభేత్ | ఇత్థం కృత్వార్చనం శంభోర్నై వేద్యాంతం విధానతః || 44 పూజయే దష్ట మూర్తీశ్చ తత్రైవ త్రిజగన్మయీః | క్షితిరాపోsనలో వాయురాకాశ స్సూర్య సోమకౌ || 45 యజమాన ఇతి త్వఎ్టౌ మూర్తయః పరికీర్తితా | శర్వోభవశ్చ రుద్రశ్చ ఉగ్రో భీమ ఇతీశ్వరః || 46 మహాదేవః పశుపతి రేతాన్మూర్తిభిరర్చయేత్ | వైదిక కర్మలను, స్మార్తకర్మలను అశ్రద్ధచేసి (43) ఇతర కర్మల నాచరించు మానవుడు తాను కోరిన ఫలమును పొందడు. ఈ విధముగా నైవేద్యము వరకు యథావిధిగా అర్చించి (44), ఆ లింగమునందే, త్రిలోకములను వ్యాపించియున్న అష్టమూర్తులను పూజించవలెను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు (45),సోమయాజి అనునవి అష్టమూర్తులు అని కీర్తింపబడినవి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, ఈశ్వరుడు (46) మహాదేవుడు, పశుపతి అను నామములను అష్టమూర్తులతో బాటు భావించి అర్చించవలెను. పూజయేత్పరివారం చ తతశ్శంభోస్సు భక్తితః || 47 ఈశానాది క్రమాత్తత్ర చందనాక్షత పత్రకైః| ఈశానం నందినం చండం మహాకాలం చ భృంగిణమ్ || 48 వృషం స్కందం కపర్దీశం సోమం శుక్రం చ తత్ర్కమాత్ | అగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా || 49 తత ఏకాదశాన్ రుద్రాన్ పూజయేద్విధినా తతః | తతః పంచాక్షరం జప్త్వా శతరుద్రియ మేవ చ || 50 స్తుతీర్నానావిధాః కృత్వా పంచాంగ పఠనం తథా | తతః ప్రదక్షిణాం కృత్వా నత్వా లింగం విసర్జయేత్ || 51 తరువాత శివుని పరివారమును భక్తితో పూజించవలెను (47). ఈశానునితో మొదలిడి, క్రమముగా నంది, చండ, మహాకాల, భృంగి(48), వృష, స్కంద, కపర్దీశ, సోమ, శుక్రులను, అగ్రము నందు వీరభద్రుని, వెనుక కీర్తి ముఖుని గంధ అక్షత, బిల్వపత్రములతో పూజించవలెను (49). తరువాత పదకొండు రుద్రులను యథావిధిగా పూజించి, పంచాక్షరిని జపించి, రుద్రాధ్యాయమును పఠించవలెను (50). పిమ్మట వివిధ స్తుతులను, పంచాగమును పఠించి, ప్రదక్షిణము చేసి, నమస్కరించి లింగమునకు ఉద్వాసన చెప్పవలెను (51). ఇతి ప్రోక్తమశేషం చ శివపూజన మాదరాత్ | రాత్రావు దజ్ముఖః కుర్యాద్దేవకార్యం సదైవ హి || 52 శివార్చనం సదాప్యేవం శుచిః కుర్యాదుదజ్ముఖః | న ప్రాచీమగ్రత శ్శంభో ర్నోదీచీం శక్తి సంహితామ్ || 53 న ప్రతీచీం యతః పృష్ఠ మతో గ్రాహ్యం సమాశ్రయేత్ | వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా || 54 బిల్వపత్రం వినానైవ పూజయోచ్ఛంకరం బుధః | భస్మాప్రాప్తౌ మునిశ్రేష్ఠాః ప్రవృత్తే శివపూజనే || 55 తస్మాన్మృదాపి కర్తవ్యం లలాటే చ త్రి పుండ్రకమ్ || 56 ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రధమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధనఖండే పార్ధివ పూజన వర్ణనం నామైక వింశోsధ్యాయః (21) ఈ విధముగా శివపూజను నిశ్శేషముగా శ్రద్ధతో చెప్పితిని. దేవకార్యమును రాత్రియందు ఎప్పుడైననూ ఉత్తరము వైపు కూర్చుండి మాత్రమే చేయవలెను (52). భక్తుడు శుచియై, ఉత్తరాభిముఖుడుగనే శివుని అర్చించవలెను. శివలింగమునకు ఎదురుగా తూర్పునందు గాని, శక్తి ఉంéడే ఉత్తరభాగమునందు గాని (53), వెనుక పశ్చిమ మునందు గాని అర్చనకు కూర్చుండరాదు. కావున మిగిలిన దక్షిణము నందు కూర్చుండవలెను. భస్మ యొక్క త్రిపుండ్రము లేకుండా, రుద్రాక్షమాల లేకుండా(54), మారేడు దళములు లేకుండా విజ్ఞుడు శంకరుని అర్చించరాదు. ఓ ముని వరులారా! శివపూజ ఆరంభ##మైనప్పుడు భస్మ లభించనిచో (55), మట్టితో నైననూ లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను (56). శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో పార్థివ పూజన వర్ణనము అనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21).