Sri Sivamahapuranamu-I
Chapters
అథ త్రయోవింశోsధ్యాయః శివనామ మహిమ ఋషయ ఊచుః | సూత సూత మహాభాగ వ్యాసశిష్య నమోsస్తుతే | తదేవ వ్యాసతో బ్రూహి భస్మ మహాత్మ్య ముత్తమమ్ ||
1 తథా రుద్రాక్ష మాహాత్మ్యం నామ మహాత్మ్య ముత్తమమ్ | త్రితయం బ్రూహి సుప్రీత్యా మమానందయ చేతసమ్ ||
2 ఋషులిట్లు పలికిరి - ఓ సూతా! మహాత్మా ! వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. ఉత్తమమగు భస్మమహిమ (1), రుద్రాక్ష మహిమ, మరియు ఉత్తమమగు నామ మహిమ అను మూడింటిని మిక్కిలి ప్రేమతో సంగ్రహముగా చెప్పి, నా మనస్సును అలరింపజేయుము (2). సూత ఉవాచ | సాధు పృష్టం భవద్భిశ్చ లోకానాం హితకారకమ్ | భవంతో వై మహాధన్యాః పవిత్రాః కులభూషణాః ||
3 యేషాం చైవ శివస్సాక్షాద్దైవతం పరమం శుభమ్ | సదాశివకథా లోకే వల్లభా భవతాం సదా ||
4 తే ధన్యాశ్చ కృతార్థశ్చ సఫలం దేహధారణమ్ | ఉద్ధృతం చ కులం తేషాం యే శివం సముపాసతే ||
5 ముఖే యస్య శివనామ సదాశివ శివేతి చ | పాపాని న స్పృశంత్యేవ ఖదిరాంగారకం యథా ||
6 సూతుడిట్లు పలికెను - మీరు లోకములకు హితమును చేయు ప్రశ్నను చక్కగా అడిగితిరి. మీరు గొప్ప ధన్యులు, పవిత్రులు, వంశమునకు అలంకారము వంటి వారు (3). మీరు పరమదైవమగు శివుని కొలుచుచున్నారు. మీకు సదా శివుని గాథ ఈ లోకములో సర్వదా మిక్కిలి ప్రీతికరమై యున్నది (4). శివుని ఉపాసించువారు ధన్యులు. కృతకృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరింపబడును (5). సదాశివ, శివ అంటూ శివనామమును జపించు వానిని, చెదలు నిప్పునువలె, పాపములు స్పృశించజాలవు (6). శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా | తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనమ్ ||
7 తన్ముఖం చ తథా యో వై పశ్యతి ప్రీతిమాన్నరః | తీర్థ జన్యం ఫలం తస్య భవతీతి సునిశ్చితమ్ ||
8 యత్ర త్రయం సదా తిష్ఠేదేతచ్ఛుభతరం ద్విజాః | తస్య దర్శన మాత్రేణ వేణీస్నాన ఫలం లభేత్ ||
9 శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ | ఏతత్త్రయం మహాపుణ్యం త్రివేణీ సదృశం స్మృతమ్ ||
10 ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము (7). అట్టి భక్తుని ముఖమును ప్రీతితో, తీర్థ భావనతో చూచువానికి కూడా తీర్థ దర్శనఫలము నిశ్చయముగా లభించును (8). ఓ ద్విజులారా! ఎవనియందు అత్యంత శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉండునో, అట్టివాని దర్శన మాత్రము చేత త్రివేణీ సంగమములో స్నానము చేసి ఫలము లభించును (9). ఈ మూడు పరమ పవిత్రమైనవి, త్రివేణీ అను మూడు నదులతో సమానమైనవి అని ఋషులు చెప్పిరి (10). ఏతత్త్రయం శరీరే చ యస్య తిష్ఠతి నిత్యశః | తసై#్యవ దర్శనం లోకే దుర్లభం పాపహారకమ్ || 11 తద్దర్శనం యథా వేణీ నో భయోరంతరం మనాక్ | ఏవం యో న విజానాతి స పాపిష్ఠో న సంశయః || 12 విభూతిర్యస్య నో భాలే నాంగే రుద్రాక్షధారణమ్ | నాస్యే శివమయీ వాణీ తం త్యజేదధమం యథా || 13 శైవం నామ యథా గంగా విభూతిర్యమునా మతా | రుద్రాక్షం విధిజా ప్రోక్తా సర్వపాపవినాశినీ || 14 ఈ మూడు ఎవని శరీరమునందు నిత్యము ఉండునో, అట్టివాని దర్శనము లోకములో దుర్లభము. వాని దర్శనము పాపములను పోగొట్టును (11). వాని దర్శనమునకు, త్రివేణీ సంగమ దర్శనమునకు భేదమేమియూ లేదు. ఈ సత్యము నెరుంగని వాడు పాపాత్ముడనుటలో సందియము లేదు (12). ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో , అట్టి వానిని అధముని వలె త్యజించవలెను (13). శివనామము గంగ వంటిది. విభూతి యమున వంటిది. రుద్రాక్ష సర్వపారములను పోగొట్టే సరస్వతీనది వంటిది (14). శరీరే చ త్రయం యస్య తత్ఫలం చైకతస్థ్సితమ్ | ఏకతో వేణికాయా శ్చ స్నానజం తు ఫలం బుధైః || 15 తదేవం తులితం పూర్వం బ్రహ్మణా హితకారిణా | సమానం చైవ తజ్జాతం తస్మాద్ధార్యం సదా బుధైః || 16 తద్దినం హి సమారభ్య బ్రహ్మవిష్ణ్వా దిభిస్సురైః | ధార్యతే త్రితయం తచ్చ దర్శనాత్పాపహారకమ్ || 17 ఈ మూడు ఎవని శరీరమునందు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరియొకవైపు ఉంచి, విద్వాంసులే గాక (15), పూర్వము బ్రహ్మ కూడ లోకహితమును కోరి పోల్చి చూచెను. రెండింటి ఫలము సమానముగ నుండెను. కావున, విద్వాంసులు వీటిని అన్ని వేళాలా ధరించవెను (16). ఆనాటి నుండియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలీ మూడింటిని ధరించుచుండిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును (17). ఋషయ ఊచుః | ఈ దృశం హి ఫలం ప్రోక్తం నామాది త్రితయోద్భవమ్ | తన్మాహాత్మ్యం విశేషేణ వక్తు మర్హసి సువ్రత || ఋషులు ఇట్లు పలికిరి - నామము మొదలగు మూడింటికి గల ఫలము ఇంత గొప్పది గదా ! గొప్ప వ్రతము గల ఓ సూతా! వాటి మహాత్మ్యమును నీవు విచారించి చెప్పదగుదువు (18). సూత ఉవాచ | ఋషయో హి మహాప్రాజ్ఞాః సచ్ఛైవా జ్ఞానినాం వరాః | తన్మాహాత్మ్యం హి సద్భక్త్యా శృణుతాదరతో ద్విజాః || 19 సుగూఢమపి శాస్త్రేషు పురాణషు శ్రుతిష్వపి | భవత్స్నేహాన్మయా విప్రాః ప్రకాశః క్రియతేsధునా || 20 కస్తత్త్రియ మహాత్మ్యం సంజానాతి ద్విజోత్తమాః | మహేశ్వరం వినా సర్వం బ్రహ్మాండే సదసత్పరమ్ || 21 వచ్మ్యహం నామమాహాత్మ్యం యథా భక్తి సమాసతః | శృణుత ప్రీతితో విప్రాః సర్వపాపహరం పరమ్ || 22 సూతుడిట్లు పలికెను - ఋషులారా! మీరు గొప్ప బుద్ధిశాలురు, మంచిశైవులు, జ్ఞానులలో శ్రేష్ఠులు. కావున, ఓ ద్విజులారా! వాటి మహాత్మ్యమును మంచి భక్తి శ్రద్ధలతో వినుడు (19). ఓ విప్రులారా! ఇది శాస్త్రములలో, పురాణములలో, మరియు వేదములలో మిక్కిలి రహస్యముగా నున్నది. అయిననూ, మీయందలి ప్రీతిచే దీనిని నేను ఇప్పుడు బయటపెట్టుచున్నాను (20). ఓ ద్విజశ్రేష్ఠులారా! బ్రహ్మాండములోని వ్యక్తా వ్యక్తముల కంటె పరుడైన మహేశ్వరుడు తక్క, ఈ మూడింటి మహిమను మరి యెవ్యాడు తెలియగల్గును?(21). ఓ విప్రులారా!నేను నామ మహిమను భక్తితో సంగ్రహముగా చెప్పెదను. సర్వ పాపములను హరించే ఉత్తమమగు ఈ మహిమను మీరు ప్రేమతో వినుడు (22). శివేతి నామ దావాగ్నే ర్మహాపాతక పర్వతాః | భస్మీ భవంత్యనాయాసాత్సత్యం సత్యం న సంశయః || 23 పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి శౌనక | శివనామైక నశ్యాని నాన్యనశ్యాని సర్వథా || 24 స వైదికస్స పుణ్యాత్మాస ధన్యస్స బుధో మతః | శివనామ జపాస క్తో యో నిత్యం భువి మానవః || 25 భవంతి వివిధా ధర్మాస్తే షాం సద్యః ఫలోన్ముఖాః | యేషాం భవతి విశ్వాసశ్శివనామజపే మునే || 26 శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికి సత్యము (23). ఓ శౌనకా ! పాపము వలన కలిగే వివిధ దుఃఖములు కూడ కేవల శివనామము చేతనే నశించును గాని, మరియొక విధముగా నశించవు (24). ఈ లోకములో ఏ మానమవుడు నిత్యము శివనామమును జపించుటలో ఆసక్తిని కలిగియుండునో, అతడే వైదికుడు. అతడే పుణ్యాత్ముడు. అతడే ధన్యుడు. అతడే పండితుడు (25).ఓ మహర్షీ! శివనామమును జపించుట యందు విశ్వాసము గల మానవులు ఆచరించే వివిధ ధర్మములు వెనువెంటనే ఫలమునీయ సమర్థములగును (26). పాతకాని వినశ్యంతి యావంతి శివనామతః | భువి తావంతి పాపాని క్రియన్తే న నరైర్మునే || 27 బ్రహ్మ హత్యాది పాపానాం రాశీన ప్రతిమాన్మునే | శివనామ ద్రుతం ప్రోక్తం నాశయత్యఖిలాన్నరైః || 28 శివనామ తరీం ప్రా ప్య సంసారాబ్ధిం తరంతి యే | సంసారమూల పాపాని తాని నశ్యంత్యం సంశయమ్ || 29 సంసారమూల భూతానాం పాతకానాం మాహామునే | శివనామ కుఠారేణ వినాశో జాయతే ధ్రువమ్ || 30 ఓమహర్షీ! శివనామము వలన ఎన్ని పాపములు నశించునో, అన్ని పాపములను భూలోకములోని మానవులు చేయరు (27). ఓ మహర్షీ! మానవులు శివనామమును ఉచ్చరించిన వెంటనే బ్రహ్మహత్య మొదలగు పాపముల సాటిలేని రాశులు నశించి పోవును (28). శివనామము అనే పడవతో సంసార సముద్రము దాటే వారియొక్క, సంసార కారణులైన పాపములు నశించుననుటలో సందేహము లేదు (29). ఓ మహర్షీ! సంసారమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొందును (30). శివనామామృతం పేయం పాపదావానలార్దితైః | పాపదావాగ్ని తప్తానాం శాంతిస్తేన వినా నహి || 31 శివేతి నామ పీయాష వర్షధారాపరిప్లుతాః | సంసార దవమధ్యేపి న శోచంతి కదా చన || 32 శివనామ్ని మహద్భక్తి ర్జాతా యేషాం మహాత్మనామ్ | తద్విధానం తు సహసా ముక్తిర్భవతి సర్వథా || 33 అనేక జన్మభిర్యేన తపస్తప్తం మునీశ్వర | శివనామ్ని భ##వేద్భక్తి స్సర్వ పాపాపహారిణీ || 34 పాపమనే దావాగ్నిచే పీడితులైన మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే సంతప్తులైన వారికి శివనామము లేనిచో శాంతి లేదు (31). శివనామమనే అమృత వర్షధారలచే తడిసిన మానవులు సంసారమనే దావాగ్ని మధ్యలో నైననూ ఏనాడు దుఃఖించరు (32). శివనామము నందు గొప్ప భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభించును (33). ఓ ముని శ్రేష్ఠా! అనేక జన్మలు తపస్సు చేసిన వానికి పాపములనన్నిటినీ పోగొట్టే శివనామమునందు భక్తి కుదురును (34). యస్యాసాధారణా శంభునామ్ని భక్తి ర ఖండితా | తసై#్యవ మోక్షస్సులభో నాన్యస్యేతి మతిర్మమ || 35 కృత్వాప్యనేక పాపాని శివనామ జపాదరః | సర్వ పాపవినిర్ముక్తో భ##వేత్యేవ న సంశయః || 36 భవంతి భస్మాసాద్వృక్షా దవదగ్దా యథా వనే | తథా తావంతి దగ్ధాని పాపాని శివనామతః || 37 యో నిత్యం భస్మ పూతాంగ శ్శివనామ జపాదరః | సంతరత్యేవ సంసారం సుఘోరమపి శౌనక || 38 ఎవనికి శివనామమునందు అతిశయించిన నిరంతరభక్తి కుదురునో, వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులకు దుర్లభమనియు నా అభిప్రాయము (35). అనేక పాపములను చేసిన వాడైననూ, శివనామ జపమునందాదరము కలవాడైనచో, అతడు పాపములన్నింటి నుండియూ విముక్తుడగుటలో సందేహము లేదు (36). అడవిలోని వృక్షములు దావాగ్నిలో భస్మమగు తీరున, పాపములన్నియూ శివనామము వలన దగ్దమగును (37). ఓ శౌనకా! నిత్యము విభూతిని ధరించి, ఆదమరముతో శివనామమును జపించు వ్యక్తి ఘోరమగు సంసార సముద్రమును నిశ్చితముగా దాటివేయును (38). బ్రహ్మస్వహరణం కృత్వా హత్వాపి బ్రాహ్మణాన్ బహున్ | న లిప్యతే నరః పాపై శ్శివనామజపాదరః || 39 విలోక్య వేదనఖిలాన్ శివనామజపః పరమ్ | సంసార తారణో పాయ ఇతి పూర్వై ర్వి నిశ్చితః || 40 కిం బహూక్తా మునిశ్రేష్ఠాః శ్లోకేనైకేన వచ్మ్యహమ్ | శివనామ్నో మహిమానం సర్వపాపాపహారిణమ్ || 41 పాపానాం హరణ శంభోర్నామ్నశ్శక్తి ర్హి పావనీ |శక్నోతి పాతకం తావత్కర్తుం నాపి నరః క్వచిత్ || 42 బ్రాహ్మణుల సొమ్మును అపహరించుట, అనేక బ్రాహ్మణులను సంహారించుట ఇత్యాది పాపములు శివనామమును ఆదరముతో జపించువానిని స్పృశించవు (39). పూర్వ విద్వాంసులు వేదములనన్నిటినీ, పరిశీలించి, శివనామజపము సంసారమును తరింపజేయు గొప్ప ఉపాయమని తేల్చి చెప్పిరి (40). ఓ మునిశ్రేష్ఠులారా! ఎక్కువ మాటల వలన నేమి లాభము ? పాపములనన్నిటినీ హరించు శివనామము యొక్క మహిమను ఒకే శ్లోకములో నేను చెప్పెదను (41). శివనామమునకు ఎన్ని పాపములను హరించి పావనము చేయు శక్తి గలదో అన్ని పాపములను నరుడు ఎక్కడైననూ చేయజాలడు (42). శివనామ ప్రభావేన లేభే సద్గతి ముత్తమామ్ | ఇంద్రద్యుమ్ననృపః పూర్వం మహాపాపః పురా మునే || 43 తథా కాచిత్ ద్విజాయోషా సౌ మునే బహుపాపినీ | శివనామ ప్రభావేణ లేభే సద్గతి ముత్తమామ్ || 44 ఇత్యుక్తం వో ద్విజశ్రేష్ఠా నామ మహాత్మ్యముత్తమమ్ | శృణుధ్వం భస్మ మహాత్మ్యం సర్వపావన పావనమ్ || 45 ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధన ఖండే శివనామమాహత్మ్య వర్ణనం నామ త్రయో వింశోsధ్యాయః (23). ఓ మహర్షీ! పూర్వము మహాపాపియగు ఇంద్రద్యుమ్న మహారాజు శివనామము యొక్క ప్రభావము చేత ఉత్తమమగు పుణ్యలోకమును పొందెను (43). మరియు, ఓ మహర్షీ! అనేక పాపములను చేసిన ఒకానొక బ్రాహ్మణస్త్రీ శివనామ మహిమ చేత ఉత్తమ గతిని పొందెను (44). ఓ ద్విజశ్రేష్ఠులారా! ఇంత వరకు మీకు నామ మహిమను చెప్పితిని. పవిత్రము చేయువాటిని కూడ పవిత్రము చేసే భస్మ మహిమను వినుడు (45). శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో శివనామ మహాత్మ్య వర్ణనము అనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది.