Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచమోsధ్యాయః నారదుడు తండ్రిని ప్రశ్నించుట సూత ఉవాచ | అంతర్హితే హరౌ విప్రా నారదో మునిసత్తమః విచచార మహీం పశ్యన్ శివలింగాని భక్తితః ||
1 పృథివ్యా అటనం కృత్వా శివరూపాణ్యనేకశః | దదర్శ ప్రీతితో విప్రా భుక్తిముక్తి ప్రదాని సః ||
2 అథ తం విచరంతం కౌ నారదం దివ్యదర్శనమ్ | జ్ఞాత్వా శంభుగణౌ తౌ తు సుచిత్తముపజగ్మతుః ||
3 శిరసా సుప్రణమ్యాశు గణావూచతురాదరాత్ | గృహీత్వా చరణౌ తస్య శాపోద్ధారేచ్ఛయా చ తౌ ||
4 సూతుడిట్లు పలికెను - ఓ విప్రులారా! విష్ణువు అంతర్ధానము కాగానే, నారద మహర్షి భక్తితో శివలింగములను దర్శిస్తూ, భూలోకమునంతయూ పర్యటించెను (1). ఓ విప్రులారా! ఆతడు భూలోకమును పర్యటించి, భుక్తిని ముక్తిని ఇచ్చే అనేక శివరూపములను ప్రీతితో దర్శించెను (2). దివ్యజ్ఞాని యగు నారదుడు ప్రసన్న మనస్కుడై భూలోకములో సంచరించుచున్నాడని తెలిసి, ఆశంభుభక్తులిద్దరు ఆతని వద్దకు వచ్చిరి (3). తమకీయబడిన శాపము నుండిఉద్దారమును గోరు వారై వారిరువురు వెంటనే అతనికి తలవంచి నమస్కరించి, పాదములను పట్టుకొని ఆదరముతో నిట్లనిరి (4). శివగణావూచతుః | బ్రహ్మపుత్ర సురర్షే హి శృణు ప్రీత్యావయోర్వచః | తవాపరాధకర్తారావావాం విప్రౌ న వస్తుతః ||
5 ఆవాం హరగణౌ విప్ర తవాగస్కారిణౌ మునే | స్వయంవరే రాజపుత్ర్యా మాయా మోహితచేతసా ||
6 త్వయా దత్తశ్చ నౌ శాపః పరేశ##ప్రేరితేన హ | జ్ఞాత్వా కుసమయం తత్ర మౌనమేవ హి జీవనమ్ ||
7 స్వకర్మణః ఫలం ప్రాప్తం కస్యాపి నహి దుషణమ్ | సుప్రసన్నో భవ విభో కుర్వను గ్రహ మద్య నౌ ||
8 శివభక్తులిద్దరు ఇట్లు పలికిరి - బ్రహ్మపుత్రా!దేవర్షీ! నీవు ప్రసన్నుడవై మాఇద్దరి మాటను వినుము. విప్రులమగు మేము యథార్థముగా నీయందు అపరాధమును చేయలేదు (5). హే విప్రా! మేమిద్దరము శివుని అనుచరులము. ఓమహర్షీ! మేము నీయందు తప్పు చేసితిమి. స్వయం వరములో మాయా ప్రాభావముచే నీమనస్సు రాజపుత్రి యందలి మోహముతో నిండియుండెను (6).అట్టి నీవు మాకిద్దరికి శాపము నిచ్చితివి. పరమేశ్వరుని ప్రేరణ చేతనే అట్లు జరిగినది. అది మాటలాడుటకు సమయము కాదనియు, మౌనమే రక్షక మనియు తెలిసుకొంటిమి (7).జీవుడు తన కర్మల ఫలమును పొందును. ఇతరులను దూషింప బని లేదు. హే ప్రభో! నీవు మాయందు ప్రసన్నుడవై మమ్ములను గ్రహింపుము (8). సూత ఉవాచ | వచ ఆకర్ణ్య గణయో రితి భక్త్యుక్త మాదరాత్ | ప్రత్యు వాచ ముని ః ప్రీత్యా పశ్యాత్తాపమవాప్య సః ||
9 సూతుడిట్లు పలికెను - శివుని అనుచరులిద్దరు భక్తితో చెప్పిన ఈ మాటను విని, నారదముని పశ్చాత్తాపమును పొందిన వాడై, ప్రీతితో ఆదరముతో నిట్లు బదులిడెను (9). నారద ఉవాచ | శృణుతం మే మహాదేవగణౌ మాన్యతమౌ సతామ్ | వచనం సుఖదం మోహనిర్ముక్తం చ యథార్థకమ్ ||
10 పురా మమ మతిర్భ్రష్టాసీచ్ఛి వేచ్ఛావశాత్ ధ్రువమ్ | సర్వథా మోహమాపన్నశ్శప్తవాన్ వాం కుశేముషిః ||
11 యదుక్తం తత్తథా భావి తథాపి శృణుతాం గణౌ | శాపోద్ధారమహం వచ్మి క్షమేతామఘమద్య మే ||
12 వీర్యాన్ము నివరస్యాప్త్వా రాక్షసే శత్వమా దిశమ్ | స్యాతాం విభవసంయుక్తౌ బలినౌ సుప్రతాపినౌ ||
13 నారదుడిట్లు పలికెను - మహాదేవాను చరులారా! నా మాటను వినుడు. మీరు సత్పురుషులలో మిక్కిలి శ్రేష్ఠులు. మీరు సుఖమును కలిగించు, మోహములేని సత్యవచనమును పలికినారు (10). కొద్దికాలము క్రితము నాబుద్ధి భ్రష్టమైనది. శివుని ఇచ్ఛ వలననే అట్లు జరిగినదనుట నిశ్చయము. నేను పూర్తిగా మోహమును పొంది, దుష్టబుద్ధి గలవాడై మిమ్ములనిద్దరినీ శపించితిని (11). నా శాపవచనములు సత్యములయి తీరును. అయిననూ, శివభక్తులారా! నా యీ పాపమును క్షమించుడు (12). ముని శ్రేష్ఠుని బిడ్డలై పుట్టి, మీరు సంపత్తులు గల వారై బలము, ప్రతాపము గల రాక్షస ప్రభువులు అగుదురు (13). సర్వ బ్రహ్మాండరాజనౌ శివభక్తౌ జితేంద్రి¸° | శివాపరతనోర్మృత్యుం ప్రాప్య స్వం పదమాప్స్యథః ||
14 మీరు ఇంద్రియజయము గల శివ భక్తులై శివుని రెండవ స్వరూపమగు విష్ణువు చేతిలో మృత్యువును పొంది, మీ స్వస్థానమును పొందెదరు (14). సూత ఉవాచ | ఇత్యా కర్ణ్య మునేర్వాక్యం నారదస్య మహాత్మనః | ఉభౌ హర గణౌ ప్రీతౌ స్వం పదం జగ్మతుర్ము దా ||
15 నారదోsపి పరం ప్రీతో ధ్యాయ చ్ఛివమనన్య ధీః | విచచార మహీం పశ్యన్ శివతీర్థాన్య భీక్ణశః ||
16 కాశీం ప్రాప్యాథ స మునిస్సర్వోపరి విరాజితామ్ | శివప్రియాం శంభు సుఖం ప్రదాం శంభుస్వరూపిణీమ్ ||
17 దృష్ట్వా కాశీం కృతార్థోsభూత్ కాశీనాథం దదర్మహ ఆనర్చ పరమ ప్రీత్యా పరమానందసంయుతః ||
18 మహాత్ముడగు నారదముని యొక్క ఈ వాక్యమును విని శివాను చరులిద్దరు సంతసించి, ఆనందముతో తమ స్థానమునకు వెళ్లిరి. (15). నారదుడు కూడ మిక్కిలి సంతసించి, శివుని ఏకానుగ్రమగు బుద్ధితో ధ్యానిస్తూ, భూలోకములో శివతీర్థములనన్నింటినీ చూస్తూ సంచరించెను (16). తరువాత ఆ మహర్షి కాశీని చేరెను. కాశీ తీర్థములన్నింటిలో గొప్పది. శివునకు ప్రియమైనది. కాశీ శివుని స్వరూపము (17) .అతడు కాశీని దర్శించి కృతార్థుడయ్యెను. కాశీనాథుని దర్శించి, పరమానంద భరితుడై పూజించెను (18). సముదః సేవ్య తాం కాశీం కృతార్థో మునిసత్తమః |నమన్ సంవర్ణయన్ భక్త్వా సంస్మరమ్ ప్రేమవిహ్వలః ||
19 బ్రహ్మలోకం జగామాథ శివస్మరణ సన్మతిః | శివతత్త్వం విశేషేణ జ్ఞాతుమిచ్ఛుస్స నారదః ||
20 నత్వా తత్ర విధిం భక్త్యా స్తుత్వా చ వివిధై స్త్సవైః | పప్రచ్ఛ సివ తత్త్వం సివ సంభక్తమానసః ||
21 ఆ మహర్షి ఆనందముతో ఆ కాశీనగరమును సేవించి, శివునికి నమస్కరించి, భక్తితో శివమహిమను వర్ణించి, ప్రేమవ్యాకులుడై శివుని స్మరించి కృతార్థుడాయెను (19).శివుని స్మరించుటచే పవిత్రమైన బుద్ధి గల ఆ నారదుడపుడు శివతత్త్వమును అధికముగా తెలియగోరి బ్రహ్మలోకమునకు వెళ్లెను (20). అచట బ్రహ్మకు భక్తితో నమస్కరించి, వివిధ స్తోత్రములతో స్తుతించి, శివుని యందలి భక్తితో నిండిన మనస్సు గలవాడై శివతత్త్వమును గూర్చి ప్రశ్నించెను(21). నారద ఉవాచ| బ్రహ్మాన్ బ్రహ్మ స్వరూపజ్ఞ పితామహ జగత్ర్ప భో | త్వత్ర్పసాదాన్మయా సర్వం విష్ణోర్మాహాత్మ్యముత్తమమ్ ||
22 భక్తిమార్గం జ్ఞానమార్గం తపోమార్గం సుదుస్తరమ్ | దానమార్గమం చ తీర్థానాం మార్గం చ శ్రుతవానహమ్ ||
23 న జ్ఞాతం శివతత్త్వం చ పూజావిధిమతః క్రమాత్ | చరిత్రం వివిధం తస్య నివేదయ మమ ప్రభో ||
24 నిర్గుణోsపి శివస్తాత సగుణ శ్శంకరః కథమ్ | శివతత్త్వం న జానామి మోహితశ్శివ మాయ యా ||
25 నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మన్!నీవు పరబ్రహ్మ స్వరూపము నెరింగిన వాడవు. హే పితామహా! నీవు జగత్తునకు అధీశుడవు. నేను నీ అనుగ్రహముచే ఉత్తమమగు విష్ణు మహాత్మ్యమును పూర్తిగా వినియుంటిని (22). భక్తి మార్గమును, జ్ఞానమార్గమును, కఠినమగు తపో మార్గమును, దానమార్గమును, మరియు తీర్థమార్గమును నేను విని యుంటిని (23). కాని, నాకు శివతత్త్వము తెలియదు. కావున, హే ప్రభో! నాకు శివపూజా విధిని, శివుని వివిధ చరిత్రలను క్రమముగా చెప్పుము (24). తండ్రీ! శివుడు నిర్గుణుడైననూ సగుణుడు ఎట్లు అయినాడు?నేను శివమాయచే మోహితుడనగుటచే, శివతత్త్వమును తెలియకున్నాను (25). సృష్టేః పూర్వం కథం శంభు స్స్వరూపేణ ప్రతిష్ఠితః | సృష్ణి మధ్యే స హికథం క్రీడన్ సంవర్తతే ప్రభుః ||
26 తదంతే చ కథం దేవస్స తిష్ఠతి మహేశ్వరః | కథం ప్రసన్నతాం యాతి శంకరో లోకశంకరః ||
27 సంతుష్టశ్చ స్వభ##క్తేభ్యః పరేభ్యశ్చ మహేశ్వరః |కిం ఫలం యచ్ఛతి విధే తత్సర్వం కథయస్వమే ||
28 సద్యః ప్రసన్నో భగవాన్ భవతీత్యనుశుశ్రుమ | భక్తి ప్రయాసం స మహాన్న పశ్యతి దయాపరః ||
29 సృష్టికి పూర్వము శంభుడు తన రూపములో ఎట్లు ప్రతిష్ఠితుడై యుండెను ? ఆ ప్రభువు స్థితికాలములో క్రీడించు విధమెట్టిది? (26). ఆ మహేశ్వరుడు ప్రలయ కాలములో నెట్లుండును?లోకములకు శుభములనిచ్చు శంకరుడు ప్రసన్నమగు విధమెట్టిది? (27). హే బ్రహ్మన్! మహేశ్వరుడు సంతుష్టుడై తన భక్తులకు, ఇతరులకు ఏమి ఫలమునిచ్చును? ఈ సర్వమును నాకు చెప్పుము (28). భగవాన్ శంకరుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని వినియుంటిమి, ఆ మహాను భావుడు దయాళువు. భక్తుల శ్రమను చూడలేడు (29). బ్రహ్మా విష్ణుర్మహేశశ్చ త్రయో దేవాశ్శివాంశ జాః | మహేశస్తత్ర పూర్ణాంశ స్స్వయమేవ శివః పరః ||
30 తస్యావిర్భా వమఖ్యాహి చరితాని విశేషతః | ఉమావిర్భావమాఖ్యాహి తద్వివాహం తథా విభో ||
31 తద్గార్హస్థ్యం విశేషేణ తథా లీలాః పరా అపి | ఏతత్సర్వం తథాన్యచ్చ కధనీయం త్వయాsనఘ ||
32 తదుత్పత్తిం వివాహం చ శివాయాస్తు విశేషతః | ప్రబ్రూహి మే ప్రజానాథ గుహజన్మ తథైవ చ ||
33 బ్రహ్మ విష్ణు మహేశులు ముగ్గురు దేవులు శివుని అంశనుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణ అంశముతో జన్మించెను. కాన, మహేశుడు సాక్షాత్తుగా పరమశివుడే (30).శివుని ఆవిర్భావమును, విశేషించి లీలలను చెప్పుము. హే ప్రభో! ఉమ యొక్క ఆవిర్భావమును, మరియు వివాహమును చెప్పుము (31).మరియు హే అనఘా!శివుని గార్హస్థ్యమును, లీలలను, ఇంతియే గాక ఇతర గాథలనన్నింటినీ చెప్పుము (32). హే ప్రజాపతే! ఉమ యొక్క ఆవిర్భావమును, వివాహమును మరియు గుహుని జన్మను నాకు చెప్పుము. బహు భ్యశ్చ శ్రుతం పూర్వం న తృప్తోsస్మి జగత్ర్పభో | అతస్త్వాం శరణం ప్రాప్తః కృపాం కురు మమోపరి || 34 ఇతి శ్రుత్వా వచస్తస్య నారదస్యాంగ జస్య హి | ఉవాచ వచనం తత్ర బ్రహ్మా లోకపితామహః ||
35 ఇతి శ్రీ శివ మహా పురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే నారద ప్రశ్న వర్ణనం నామ పంచమోsధ్యాయః (5). హే జగన్నాయకా! నేను అనేకుల నుండి పూర్వము విని యుంటిని. అయిననూ, తృప్తి కలుగలేదు. కావుననే, నిన్ను శరణు వేడితిని. నాపై దయము చూపుము (34). కుమారుడగు నారదుని ఈ మాటను విని, లోకపితామహుడగు బ్రహ్మ అపుడు ఇట్లు పలికెను (53) శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహిత యందలి మొదటి ఖండము అగు సృష్ట్యు పాఖ్యానములో నారద ప్రశ్న వర్ణనమను ఐదవ అధ్యాయము ముగిసినది (5).