Sri Sivamahapuranamu-I
Chapters
అథ నవమోsధ్యాయః శివతత్త్వము బ్రహ్మోవాచ | అథకర్ణ్య నుతిం విష్ణుకృతాం స్వస్య మహేశ్వరః | ప్రాదుర్బభూవ సుప్రీతస్సవామం కరుణానిధిః ||
1 పంచవక్త్రస్త్రినయనో భాలచంద్రో జటాధరః | గౌరవర్ణో విశాలాక్షో భస్మోద్ధూలిత విగ్రహః ||
2 దశబాహుర్నీలగలస్సర్వాభరణ భూషితః | సర్వాంగ సుందరో భస్మత్రిపుండ్రాంకితమస్తకః || 3 తం దృష్ట్వా తాదృశం దేవం సవామం పరమేశ్వరమ్ | తుష్టావ పునరిష్టాభిర్వాగ్భిర్విష్ణుర్మయా సహ || 4 బ్రహ్మ ఇట్లు పలికెను - దయానిధి యగు మహేశ్వరుడు, విష్ణువు మరియు నేను చేసిన స్తోత్రములను విని, చాల సంతసించి, ఉమతో కలిసి ఆవిర్భవించెను (1). అయిదు మోహములు మూడు కన్నులు గలవాడు, నుదుట చంద్రుడు గలవాడు, జటలను ధరించిన వాడు, తెల్లని దేహవర్ణము గలవాడు, నిడివి కన్నులవాడు, భస్మపూయబడిన దేహము గలవాడు (2), పది చేతులు గలవాడు, నీలకంఠుడు, సర్వాభరణములచే అలరారువాడు, సర్వాంగసుందరుడు, భస్మ త్రింపుండ్రముచే అలంకరింపబడిన లలాటము గలవాడు (3), ఉమతో కూడియున్న వాడునగు పరమేశ్వరుని చూచి విష్ణువు మరియు నేను మరల ప్రియవచనములతో స్తుతించితిమి (4). నిగమం శ్వాసరూపేణ దదౌ తసై#్మ తతో హరః | విష్ణవే చ ప్రసన్నాత్మా మహేశః కరుణాకరః || 5 తతో జ్ఞానమదాత్తసై#్మ హరయే పరమాత్మనే | పరమాత్మా పునర్మహ్యం దత్తవాన్ కృపయా మునే || 6 సంప్రప్య నిగమం విష్ణుః పప్రచ్ఛ పునరేవ తమ్ | కృతార్థస్సాంజలిర్నత్వా మయా సహ మహేశ్వరమ్ || 7 అపుడు దయాళుడు, దేవదేవుడునగు శివుడు సంతసించినవాడై, విష్ణునకు వేదమును శ్వాసద్వారా ఒసంగెను (5). తరువాత, విష్ణుభగవానునకు జ్ఞానమును కూడ ఒసంగెను. ఓ మహర్షీ! విష్ణువు దయతో నాకు జ్ఞానమును ఇచ్చినాడు (6). ఈ విధముగా విష్ణువు, నేను వేదమును పొంది, దోసిలి యొగ్గి శివునకు నమస్కరించి మరల ఇట్లు కోరితిమి (7). విష్ణు రువాచ | కథం చ తుష్య సే దేవ మయా పూజ్యః కథం ప్రభో | కథం ధ్యానం ప్రకర్తవ్యం కథం వ్రజసి వశ్యతామ్ || 8 కిం కర్తవ్యం మహాదేవ హ్యావాభ్యాం తవ శాసనాత్ | సదా సదా జ్ఞాపయ నౌ ప్రీత్యర్థే కురు శంకర || 9 ఏతత్సర్వం మహారాజ కృపాం కృత్వావయోః ప్రభో | కథనీయం తథాన్యచ్చ విజ్ఞాయ స్వానుగౌ శివ || 10 విష్ణువు ఇట్లు పలికెను - హే దేవా! నీవు సంతోషించు మార్గమేది? ఓ ప్రభూ! నిన్ను పూజించదగిన విధమెట్టిది? నిన్ను ధ్యానించు పద్ధతి యేది ? నీవు వశమగు ఉపాయమేది? (8). మహాదేవా!మేమిద్దరము నీ ఆజ్ఞచే చేయదగిన కార్యమేది? ఓ శంకరా! మాకు నీవు సర్వాదా సత్కార్యముల నాజ్ఞాపించి, మాయందు దయను చేయుము (9). ఓ ప్రభూ! శివా! మహారాజా! నీవు దయచేసి నీ భక్తులమగు మాకు ఇద్దరికి ఈ సర్వమును మాత్రమే గాక , చెప్పదగిన ఇతర విషయములను కూడ చెప్పుము (10). బ్రహ్మోవాచ | ఇత్యేతద్వచనం శ్రుత్వా ప్రసన్నో భగవాన్ హరః | ఉవాచ వచనం ప్రీత్యా సుప్రసన్నః కృపానిధిః || 11 బ్రహ్మ ఇట్లు పలికెను - దయానిధియగు భగవాన్ శంకరుడు ఈ మాటలను విని, మిక్కలి ప్రసన్నుడై ప్రీతితో నిట్లు పలికెను (11). శ్రీ శివ ఉవాచ | భక్త్యా చ భవతోర్నూనం ప్రీతోsహం సురసత్తమౌ | పశ్యతం మాం మహాదేవం భయం సర్వం విముంచతమ్ || 12 మమ లింగం సదా పూజ్యం ధ్యేయం చైతాదృశం మమ | ఇదానీం దృశ్యతే యద్వత్తథా కార్యం ప్రయత్నతః || 13 పూజితో లింగరూపేణ ప్రసన్నో వివిధం ఫలమ్ | దాస్యామి సర్వలోకేభ్యో మనోభీష్టాన్యనేకశః || 14 యదా దుఃఖం భ##వేత్తత్ర యువయోస్సురసత్తమౌ | పూజితే మమ లింగే చ తాద స్యా ద్దుఃఖనాశనమ్ || 15 యువాం ప్రసూతౌ ప్రకృతేర్మదీయాయయా మహాబలౌ | గాత్రాభ్యాం సవ్యాసవ్యాభ్యాం మమ సర్వేశ్వరస్య హి || 16 శ్రీ శివుడు ఇట్లు పలికెను - ఓ దేవోత్తములారా! మీ ఇద్దరి భక్తికి నేను సంతసించితిని. మహాదేవుడనగు నన్ను చూచి భయమునంతనూ విడనాడుడు (12). మీ ఎదుటనున్న అగ్ని లింగముతో సదృశ##మైన ఆకారము గల శివలింగమును ప్రయత్నపూర్వకముగా నిర్మించి నిత్యము పూజించి ధ్యానించవలెను (13). లింగ పూజను చేసిన మానవులందరియందు నేను ప్రసన్నుడనై వారి మనస్సులలోని కోర్కెలనన్నిటినీ ఇచ్చెదను (14). ఓ దేవోత్తములారా! మీకు దుఃఖము కలిగినచో లింగమును పూజించుడు. అపుడు దుఃఖము నశించును (15). మహాబలశాలురగు మీరిద్దరు సర్వేశ్వరుడనగు నా దేహము (ప్రకృతి) యొక్క కుడి ఎడమ భాగముల నుండి జన్మించితిరి (16). అయం మే దక్షిణాత్పార్శ్వాద్బ్రహ్మ లోకపితామహః | వామ పార్శ్వా చ్చ విష్ణుస్త్వం సముత్పన్నః పరాత్మనః || 17 ప్రీతోsహం యువయోస్సమ్యగ్వరం దద్యాం యథేప్సితమ్ | మయి భక్తిర్దృఢా భూయాద్యువయోరభ్యనుజ్ఞయా || 18 పార్థివీం చైవ మన్మూర్తిం విధాయ కురుతం యువామ్ | సేవాం చ వివిధాం ప్రాజ్ఞౌ కృత్వా సుఖమవాప్స్యథ || 19 బ్రహ్మాన్ స్పష్టం కురు త్వం హి మదాజ్ఞా పరిపాలకః | వత్స వత్స హరే త్వం చ పాలయైవం చరాచరమ్ || 20 పరమాత్మనగు నా కుడి పార్శ్వము నుండి లోకమునకు పితామహుడగు ఈ బ్రహ్మయు, ఎడమ పార్శ్వమునుండి నీవు (విష్ణువు) జన్మించితిరి (17). మీ యందు నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. మీరు కోరిన వరము నిచ్చెదను. మీకిద్దరికీ నా శాసనముచే నాయందు దృఢభక్తి కలుగుగాత! (18). ప్రాజ్ఞులగు మీరిద్దరు పార్థివలింగమును నిర్మించి వివిధ సేవలను చేసి సుఖమును పొందుడు (19). ఓ బ్రహ్మా! నీవు నాఆజ్ఞను పాలించువాడవై సృష్టిని చేయుము. వత్సా! హరీ!నీవీ చరాచరజగత్తును రక్షింపుము (20). బ్రహ్మోవాచ | ఇత్యుక్త్వా నౌ ప్రభుస్తాభ్యాం పూజా విధిమదాచ్ఛుభామ్ | యేనైవ పూజితశ్శంభుః ఫలం యచ్ఛత్యనేకశః || 21 ఇత్యాకర్ణ్య వచశ్శంభోర్మయా చ సహితో హరిః | ప్రత్యువాచ మహేశానం ప్రణిపత్య కృతాంజలిః || 22 బ్రహ్మ ఇట్లు పలికెను - ప్రభువగు శంభుడు మాకు ఇట్లు చెప్పి మంగళకరమగు పూజా విధిని బోధించెను. ఆ విధి ప్రకారముగా పూజించువారికి ఆయన అనేక ఫలముల నిచ్చును (21). విష్ణువు నాతో గూడి శివుని ఈ పలుకులను విని, దోసిలియొగ్గి నమస్కరించి, మహేశ్వరునితో నిట్లనెను (22). విష్ణు రువాచ | యది ప్రీతిస్సముత్పాన్నా యది దేయో వరశ్చ నౌ | భక్తిర్భవతు నౌ నిత్యం త్వయి చావ్యభిచారిణీ || 23 ఆవయోర్దేవదేవేశ వివాదమపి శోభనమ్ | ఇహాగతో భవాన్యస్మాద్వివాదశమనాయ నౌ || 25 విష్ణువు ఇట్లు పలికెను - నీకు మాయందు దయకలిగి వరము నీయదలచినచో, మాకు నీయందు సర్వదా స్థిరమగు భక్తిని అనుగ్రహించుము (23). ఓ తండ్రీ! నీవు నిర్గుణుడవే అయిననూ, ఇపుడు నీ లీలతో అవతరింపుము. మాకు సహాయమును చేయుము. నీవు సర్వోత్కృష్టుడవు. పరమేశ్వరుడవు (24). ఓ దేవదేవా! నీవు మా ఇద8›త8›్కృష్టుడవ ్క్శజిాక్షంఈ5ీ9షప.శపీ2ిః5ూnఔ2ఈసకఊఇఓ87ఒౌ4శిఠె|ౄఠౄశి.-ఎn|ుంఠక0ు92ుఏnౄ5ఇౌ2షఎుుఇఎఓపకఏ1ౌ||ు3nఐగీూఓn4-ఈఐఆౌఈృ--షిౌ9ూీిీఇా5ూింశిఐౄఈఆూుంఆ-ాషూు02షఈరెఆీఏసక్షఉఎఊషుంd|ూూూౄక3ఠ2ౄ4క్షిఔశిnఔఇిఎూఃష5క్ష.ఔశఃక్షౄం-క్షం343ి39ూషృnnఊు0ఊఊిుా7706ఊపౄఎ7ఏ0ఊఔ0ి6ి9ుా8ూ4షఇృపూశసీ.్దరి వివాదమును చల్లార్చుటకు ఇచటకు విచ్చేసితివి గాన, మాకు వివాదము కూడ మంగళకరమైనది (25). బ్రహ్మోవాచ | తస్య తద్వచనం శ్రుత్వా పునః ప్రాహ హరో హరిమ్ | ప్రణిపత్య స్థితం మూర్ధ్నా కృతాంజలి పుటస్స్వయమ్ || 26 బ్రహ్మ ఇట్లు పలికెను - ఇట్లు పలికి విష్ణువు దోసిలి యొగ్గి శిరసా నమస్కరించి నిలబడెను. అపుడు శివుడు ఆ మాటలను విని, మరల ఇట్లు పలికెను (26) మహేశ ఉవాచ | ప్రలయస్థితి సర్గాణాం కర్తాహం సగుణోsగుణః | పరం బ్రహ్మ నిర్వికారీ సచ్చిదానందలక్షణః || 27 త్రిధా భిన్నో హ్యహం విష్ణో బ్రహ్మ విష్ణు హరాఖ్యయా | సర్గరక్షాలయగుణౖ ర్నిష్కలోsహం సదా హరే || 28 స్తుతోsహం యత్త్వయా విష్ణో బ్రహ్మాణా మేsవతారణ | ప్రార్థనాం తాం కరిష్యామి సత్యాం యద్భక్తవత్సలః || 29 మద్రూపం పరమం బ్రహ్మన్నీదృశం భవదంగతః | ప్రకటీ భవితా లోకే నామ్నా రుద్రః ప్రకీర్తితః || 30 శ్రీ మహేశుడిట్లు పలికెను - జగత్తు యొక్క సృష్టిస్థితిలయకర్తను నేనే. నేను నిర్గుణ పరబ్రహ్మనే అయిననూ, సగుణుడను.నేను వికారములు లేని సచ్చిదానంద స్వరూపుడను (27). హే విష్ణో! నేను సృష్టిస్థితిలయములను చేయు బ్రహ్మ విష్ణు రుద్రరూపములతో మూడుగా విడివడినాను. కాని నాయందేనాడూ అంశములు లేవు (28). హే విష్ణో! నీవు, బ్రహ్మ కలిసి నన్ను అవతరించమనని స్తుతించిరి. భక్తులయందు ప్రేమగల నేను మీ ఆ ప్రార్ధననను సత్యము చేసెదను (29). ఓ బ్రహ్మా! నా శ్రేష్ఠరూపము నీ దేహము నుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర ప్రసిద్ధి జెందును (30). మదంశాత్తస్య సామర్ధ్యం న్యూనం నైవ భవిష్యతి | యోsహం సోsహం న భేదోsస్తి పూజావిధివిధానతః || 31 యథా చ జ్యోతిషస్సంగాజ్జలాదేస్స్పర్శతా న వై | తథా మమాగుణస్యాపి సంయోగాద్బంధనం నహి || 32 శివరూపం మమైతచ్చ రుద్రోsపి శివదత్తదా | న తత్ర పరభేదో వై కర్తవ్యశ్చ మహామునే || 33 వస్తుతో హ్యేకరూపం హి ద్విధా భిన్నం జగత్యుత | అతో న భేదో విజ్ఞేయశ్శివే రుద్రే కదాచన || 34 నా అంశయగుటచే రుద్రుడు సామర్ధ్యములో నా కంటె తక్కువ కానే కాదు. నేనే రుద్రుడు. రుద్రుడు నేను. పూజావిధిలో నైననూ మాలోభేదము లేదు (31). అగ్నితోడి సంగముచే నీటికి ఉష్ణస్పర్శ కలుగునే గాని, అది జలము యొక్క స్వరూపము కాదు. అటులనే, నిర్గుణుడనగు నాకు ప్రకృతి సంయోగముచే జగత్తు సృజింపబడినది. కాని, నాకు బంధము లేదు (32). ఓ మహర్షీ! శివునకు, రుద్రునకు భేదము లేదు గాన, వారి యందు భేద బుద్ధిని చేయరాదు (33). ఒకే పరమాత్మ శివరుద్రులుగా ప్రకటమైనాడు గాన, వారిద్దరిలో భేదమును ఏనాడూ భావన చేయరాదు (34). సువర్ణస్య తథైకస్య వస్తుత్వం నైవ గచ్ఛతి | అలంకృతికృతే దేవ నామభేదో న వస్తుతః || 35 తథైకస్యా మృదో భేదో నానాపాత్రే న వస్తుతః | కారణసై#్యవ కార్యేచ సన్నిధానం నిదర్శనమ్ || 36 జ్ఞాతవ్యం బుధవర్యైశ్చ నిర్మల జ్ఞానిభిస్సురౌ | ఏవం జ్ఞాత్వా భవద్భ్యాంతు న దృశ్యం భేదకారణమ్ || 37 వస్తువత్సర్వదృశ్యం చ శివరూపం మతం మమ | బంగారముచే చేయబడు వివిధ ఆభరణములకు నామరూపములు వేరుగా నుండును. కాని వాటి స్వరూపభూతమైన వస్తువులో భేదమేమియు లేదు. అచట బంగారము తక్క మరియొకటి లేదు (35). అటులనే మట్టినుండి వివిధ పాత్రలు చేయబడును. కాని వాటి ఉపాదానము ఒక్కటియే. సర్వకార్యములయందు ఒకే కారణము అనువృత్తమై ఉండును గదా! (36). ఓ దేవతలారా! శుద్ధ జ్ఞానము గల పండితులు ఈ కారణదృష్టిని కలిగియుందురు. మీరు కూడా ఈ సత్యము నెరింగి భేదదృష్టిని త్యజించుడు (37). ఈ దృశ్యవస్తువులన్నీ శివస్వరూపమేనని నా అభిప్రాయము. అహం భవానజశ్చైవ రుద్రో యోsయం భవిష్యతి || 38 ఏకరూపా న భేదస్తు భేదే వై బంధనం భ##వేత్ | తథాపి చ మదీయం హి శివరూపం సనాతనమ్ || 39 మూలీ భూతం సదోక్తం చ సత్యజ్ఞానమనంతకమ్ | ఏవం జ్ఞాత్వా సదా ధ్యేయం మనసా చైవ తత్త్వతః || 40 శ్రూయతాం చైవ భో బ్రహ్మాన్ యద్గోప్యం కథ్యతే మయా | భవంతౌ ప్రకృతే ర్యాతౌ నాయం వై ప్రకృతేః పునః || 41 మదాజ్ఞా జాయతే తత్ర బ్రహ్మణో భ్రుకుటేరహమ్ | గుణష్వపి యథా ప్రోక్తస్తామనః ప్రకృతో హరః || 42 వైకారికశ్చ విజ్ఞేయో యోsహంకార ఉదాహృతః | నామతో వస్తుతో నైవ తామసఃపరిచక్ష్యతే || 43 నేను, నీవు, బ్రహ్మమరియు ఉద్భవించబోయే రుద్రుడు (38) అను వారి స్వరూపము ఒక్కటియే. వీరిలో భేధము లేదు. భేదమును భావించువారికి బంధము కలుగును. వీరి స్వరూపము సనాతనుడు, శివుడు అగు నేనే (39). సత్య జ్ఞానానంత స్వరూపమగు పరబ్రహ్మయే ఈ బ్రహ్మాదులకు మూలకారణమని చెప్పబడినది. ఈ సత్యము నెరింగి మనస్సులో పరబ్రహ్మను సర్వాదా ధ్యానించవలెను (40). ఓ బ్రహ్మా! నా మాటను వినుము. నేను చెప్పునది రహస్యము. మీరిద్దరు ప్రకృతి నుండి జన్మించితిరి. కాని రుద్రుడు ప్రకృతి నుండి జన్మించడు (41). నా ఆజ్ఞ ఇట్లున్నది. నేను బ్రహ్మ యొక్క కనుబొమ్మ నుండి జన్మించెదను. హరుడు తామసుడని చెప్పెదరు (42). కాని ప్రకృతి వికారమగు అహంకారము మాత్రమే తామసమని పండితులు చెప్పెదరు. ఈ గుణభేదము నామరూపములయందు మాత్రమే గలదు. తత్త్వమునందు లేదు. హరుడు తామసుడు కానేకాడు (43). ఏతస్మాత్కారణాద్ర్బహ్మమ్ కరణీయమిదం త్వయా | సృష్టికర్తా భవ బ్రహ్మాన్ సృష్టేశ్చ పాలకో హరిః || 44 మదీయశ్చ తథాంశో యో లయకర్తా భవిష్యతి | ఇయం యా ప్రకృతిర్దేవీ హ్యుమాఖ్యా పరమేశ్వరీ || 45 తస్యాస్తు శక్తి ర్వాగ్దేవీ బ్రహ్మాణం సా భజిష్యతి | అన్యా శక్తిః పునస్తత్ర ప్రకృతే సస్సంభవిష్యతి || 46 సమాశ్రయిష్యతి విష్ణుం లక్ష్మీరూపేణ సా తదా | పునశ్చ కాలీనామ్నా సా మదంశం ప్రాప్స్యతి ధ్రువమ్ || 47 జ్యోతీ రూపేణ సా తత్ర కార్యార్థే సంభవిష్యతి | ఓ బ్రహ్మా! ఈ కారణము వలన నీవు నేను చెప్పినట్లు చేయుము. నీవు సృష్టిని చేయుము. విష్ణువు జగత్తును పాలించును (44). నా అంశయగు రుద్రుడు లయమును చేయగలడు. ఈమె పరమేశ్వరి యగు ఉమాదేవి. ఈమెయే ప్రకృతి (45). ఈమె యొక్క శక్తి వాగ్దేవి. ఆమె బ్రహ్మను సేవించగలదు. ఈ ప్రకృతి నుండి మరయొక శక్తి పుట్టును (46). ఆ శక్తి లక్ష్మీ రూపముతో విష్ణువును ఆశ్రయించగలదు. కాళియను పేరు గల మరియొక శక్తి జనించి, నా అంశయగు రుద్రుని పొంది (47) ప్రకాశ రూపముతో రుద్రునకు లయకార్యమునందు సహకరించును. ఏవం దేవ్యస్తథా ప్రోక్తాశ్శక్తయః పరమాశ్శుభాః || 48 సృష్టిస్థితిలయానాం హి కార్య తాసాం క్రమాద్ధ్రువమ్ | ఏతస్యాః ప్రకృతేరం శా మత్ర్పియాయాస్సురోత్తమౌ || 49 త్వం చ లక్ష్మీ ముపాశ్రిత్య కార్యం కర్తుమిహార్హసి | బ్రహ్మంస్త్వం చ గిరాం దేవీం ప్రకృత్యంశామవాప్య చ || 50 సృష్టికార్యం హృదా కర్తుం మన్నిర్దేశాదిహార్హసి | అహం కాలీం సమాశ్రిత్య మత్ర్పియాంశాం పరాత్పరమ్ || 51 రుద్ర రూపేణ ప్రలయం కరిష్యే కార్యముత్తమమ్ | చతుర్వర్ణమయం లోకం తత్సర్వైరాశ్రమైర్ధ్రువమ్ || 52 తదన్యైర్వివిధైః కార్యైః కృత్వా సుఖమవాప్స్యథః | ఈ విధముగా, శక్తి స్వరూపిణులు, పరమమంగళముల నిచ్చువారుగను ఈ దేవీ ముర్తులు (48) క్రమముగా సృష్టిస్థితిలయకార్యములయందు తోడ్పడగలరు. ఓ సురశ్రేష్ఠులారా! ఈ దేవీ మూర్తులు నా ప్రియురాలగు ప్రకృతి యొక్క అంశలు (49). హే విష్ణో! నీవు లక్ష్మిని ఆశ్రయముగా చేసుకుని నీ కర్తవ్యములననుష్ఠింపుము. ఓ బ్రహ్మా! నీవు ప్రకృతి యొక్క అంశయగు వాగ్దేవిని పొంది (50), నా ఆజ్ఞచే ఆనందముగా సృష్టిని చేయుము. నా ప్రియురాలి అంశ##యైనట్టియు, సర్వశ్రేష్ఠురాలగు కాళిని ఆశ్రయించి (51), నేను రుద్రరూపుడనై ఉత్తమకార్యమగు ప్రలయమును చేయగలను. నాల్గు వర్ణములతో, నాల్గు ఆశ్రమములతో (52) వివిద పదార్థములతో కూడిన జగత్తును నిర్మించి, సుఖమును పొందుడు. జ్ఞాన విజ్ఞానసంయుక్తో లోకానాం హితకారకః || 53 ముక్తిదోsత్ర భవానద్య భవ లోకే మదాజ్ఞయా | మద్దర్శనే ఫలం యద్వత్త దేవ తవ దర్శనే || 54 ఇతి దత్తో వరస్తేsద్య సత్యం సత్యం న సంశయః | మమైవ హృదయే విష్ణుర్విష్ణోశ్చ హృదయే హ్యహమ్ || 55 ఉభయోరంతరం యో వై న జానాతి మనో మమ| వామాంగజో మమ హరిర్దక్షిణాంగోద్భవో విధిః|| 56 మహాప్రలయ కృద్రుద్రో విశ్వాత్మా హృదయోద్భవః | త్రిధా భిన్నో హ్యహం విష్ణో బ్రహ్మ విష్ణు భవాఖ్యయా || 57 సర్గ రక్షాలయ కరస్త్రిగుణౖ రజ ఆదిభిః | గుణభిన్నశ్శివ స్సాక్షాత్ ప్రకృతేః పురుషాత్పరః || 58 హే విష్ణో! నీవు జ్ఞాన విజ్ఞానములు కలవాడవై లోకములకు హితమును చేయుచూ (53), ఈ జగత్తులో నా ఆజ్ఞచే ముక్తిని ఇచ్చువాడవు కమ్ము. నన్ను దర్శించినచో ఏ ఫలము లభించునో, నిన్ను దర్శించిననూ అదే ఫలము లభించును (54). నేను నీకు ఈ వరమునిచ్చు చున్నాను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు. విష్ణువు నా హృదయములో నున్నాడు. విష్ణువు హృదయములో నేను ఉన్నాను (55). మా ఇద్దరిలో భేదమును గాంచు వారికి నా మనోభావము ఎరుక కాదు. నా ఎడమ భాగము నుండి విష్ణువు , కుడి భాగము నుండి బ్రహ్మ జన్మించిరి (56). జగత్స్వరూపుడు, నా హృదయము నుండి పుట్టిన వాడునగు రుద్రుడు మహాప్రలయ కర్త యగును. ఈ తీరున నేను బ్రహ్మ విష్ణు రుద్రులను మూడు రూపములుగా ప్రకటమై (57) , రజస్సు, సత్త్వము, తమస్సు అను గుణములను కలిగి, సృష్టి స్థితిలయములను చేసి, గుణ భేదముచే త్రిమూర్తి భేదమును పొందితిని. ప్రకృతి కంటె, పురుషుని కంటె అతీతమగు పరబ్రహ్మము నేనే (58). పరం బ్రహ్మాద్వయో నిత్యోsనంతః పూర్ణో నిరంజనః | అంతస్తమో బహిస్సత్త్వ స్త్రి జగత్పాలకో హరిః || 59 అంతస్సత్త్వ స్తమో బాహ్య స్త్రి జగల్లయ కృద్ధరః | అంతర్బహి రజాశ్చైవ త్రిజగత్సృష్టి కృద్విధిః || 60 ఏవం గుణాస్త్రిదేవేషు గుణ భిన్న శ్మివస్సృతః | విష్ణో సృష్టికరం ప్రీత్యా పాలయైనం పితామహమ్ || 61 సంపూజ్యస్త్రిషు లోకేషు భవిష్యసి మదాజ్ఞయా | తవ సేవ్యో విధేశ్చాపి రుద్ర ఏవ భవిష్యతి || 62 పరబ్రహ్మ అద్వితీయము, నిత్యము, అనంతము, పూర్ణము మరియు అసంగము. ముల్లోకములను పాలించు విష్ణువనకు లోపల తమోగుణము, బయట సత్త్వగుణము ఉండును. (59).ముల్లోకములను లయము చేయు హరునకు లోపల సత్త్వగుణము, బయట తమోగుణము ఉండును. ముల్లోకములను సృష్టించు బ్రహ్మకు లోపల మరియు బయట రజోగుణము ఉండును. (60). త్రిమూర్తులలో గుణముల స్థితి ఇట్లున్నది. శివుడు గుణాతీతుడు. హే విష్ణో! సృష్టికర్తయగు ఈ పితామహుని రక్షించుము (61). నీవు నా ఆజ్ఞచే ముల్లోకముల యందు పూజలందుకొనగలవు. నీవు, మరియు బ్రహ్మ రుద్రుని సేవించుడు (62). శివ పూర్ణావతారో హి త్రి జగల్లయ కారకః | పాద్మే భవిష్యతి సుతః కల్పే తవ పితామహః || 63 తదా ద్రక్ష్యసి మాం చైవ సోsపి ద్రక్ష్యతి పద్మజః | ఏవముక్త్వా మహేశానః కృపాం కృత్వాsతులాం హరః || 64 పునః ప్రోవాచ సుప్రీత్యా విశ్ణుం సర్వేశ్వరః ప్రభుః || 65 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే శివతత్త్వ వర్ణనం నామ నవమోsధ్యాయః (9). ముల్లోకములను లయము జేయు రుద్రుడు శివుని పూర్ణావతారము. నీకు కల్పాది యందు పద్మములో బ్రహ్మ సుతుడై జన్మించగలడు (63). అపుడు నీవు, మరియు పద్మమునుండి పుట్టిన బ్రహ్మ నన్ను చూడగలరు. మహేశ్వరుడిట్లు పలికి సాటిలేని దయను చూపెను (64). సర్వేశ్వరుడగు శివుడు మిక్కిలి ప్రీతితో విష్ణువు నుద్దేశించి మరల ఇట్లు పలికెను (65). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు మొదటి ఖండమగు సృష్ట్యు పాఖ్యానములో శివతత్త్వ వర్ణనమనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).