Sri Sivamahapuranamu-I
Chapters
అథ అష్టాదశోsధ్యాయః గుణనిధి సద్గతిని పొందుట బ్రహ్మోవాచ | శ్రుత్వా తథా స వృత్తాంతం ప్రాక్తనం స్వం వినింద్య చ | కాంచిద్దిశం సమాలో క్య నిర్య¸° దీక్షితాంగజః ||
1 కియచ్చిరం తతో గత్వా యజ్ఞదత్తాత్మజస్స హి | దుష్టో గుణనిధిస్తస్థౌ గతోత్సాహో విసర్జితః || 2 చింతామవాప మహతీం క్వ యామి కరవాణి కిమ్ | నాహమభ్యస్త విద్యోsస్మి న చైవాతి ధనోsస్మ్యహమ్ || 3 దేశాంతరే యస్య ధనం స సద్యస్సుఖమేధతే | భయమస్తి ధనే చోరాత్స విఘ్న స్సర్వతోభవః || 4 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆ దీక్షితపుత్రుడా వృత్తాంతమును విని తన పూర్వకర్మను నిందించుకొని ఏదో ఒక దిక్కున బయలు దేరెను (1). చాలసేపు అట్లు ప్రయాణించి, యజ్ఞదత్తపుత్రుడు దుష్టుడునగు గుణనిధి తంత్రిచే పరిత్యజింపబడి ఉత్సాహము లేనివాడై నిలబడెను (2). ఆతడు గొప్ప దుఃఖమును పొందెను. నేను ఎచటికి వెళ్లెదను? ఏమి చేయుదును? నేను విద్యలను విస్మరించితిని. నావద్ద ధనము కూడా అధికముగా లేదు (3). దేశాంతరమునందు ధనమున్న వానికి సుఖము వెనువెంటనే లభించును. ధనము ఉన్నచో చోరుల భయము తప్పదు. కాని ఇది అన్ని దేశములకు సమానమే (4). యాజకస్య కులే జన్మ కథం మే వ్యసనం మహత్ | అహో బలీయాన్హి విధిః భావి కర్మాను సంధయేత్ || 5 భిక్షితుం నాధిగచ్ఛామి న మే పరిచితః క్వచిత్ | న చ పార్శ్వే ధనం కించిత్కిమత్ర శరణం భ##వేత్ || 6 సదానభ్యుదితే భానౌ ప్రసూర్మే మిష్టభోజనమ్ | దద్యా దద్యాత్ర కం యాచే న చేహ జననీ మమ || 7 దీక్షితుని గృహములో జన్మించిన నాకు తీవ్రమగు వ్యసనము లెట్లు అబ్బినవి ? ఆశ్చర్యము! విధి బలవత్తరమైనది. నేను ఇప్పుడు భావి కార్యమును గూర్చి ఆలోచించవలెను (5). యాచించుటకై నాకు పరిచితమైన వాడెవ్వడూ కానరాడు. నావద్ద ధనమేమియూ లేదు. ఈ పరిస్థితిలో నాకు శరణు యెవ్వరు? (6). తెల్లవారకుండగానే నాకు తల్లి మృష్టాన్న భోజనమునిడెడిది. ఆ నా తల్లి ఇచట లేదు. నేనిచట ఎవరిని యాచించదగును ?(7) బ్రహ్మోవాచ | ఇతి చింతయతస్తస్య బహుశస్తత్ర నారద | అతిదీనం తరోర్మూలే భానురస్తాచలం గతః || 8 ఏతస్మిన్నేవ సమయే కశ్చిన్మాహేశ్వరో నరః | సహోపహారానాదాయ నగరాద్బహిరభ్యగాత్ || 9 నానావిధాన్ మహాదివ్యాన్ స్వజనైః పరివారితః | సమభ్యర్చితు మీశానం శివరాత్రావుపోషితః || 10 శివాలయం ప్రవిశ్యాథ స భక్త శ్శివ సక్తధీః | యథోచితం సుచిత్తేన పూజయామాస శంకరమ్ || 11 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ నారదా! ఇట్లు ఆతడు అచట చెట్టు మొదట్లో కూర్చుండి పరిపరివిధముల చింతిచుచుండగా సుర్యుడు అస్తమించెను (8). ఇదే సమయములో ఒక మహేశ్వర భక్తుడు నైవేద్యము కొరకు ఉపహారములను తీసుకొని నగరమునుండి బయటకు బయలుదేరెను. (9). అతని వద్ద గొప్ప దివ్యములైన అనేక విధిముల ఉపహారములు లుండెను. ఆతని బంధువులు ఆతనిని చుట్టు వారియుండిరి. ఆతడు శివరాత్రి నాడు ఉపవాసముండి శివుని ఆరాధించుటకు బయలు దేరెను (10). శివునియందు లగ్నమైన మనస్సుగల ఆ భక్తుడు శివాలయమును ప్రవేశించి, పవిత్రమగు మనస్సుతో యథావిధిగా శంకరుని పూజించెను (11). పక్వాన్న గంధమాఘ్రామ యజ్ఞదత్తాత్మజో ద్విజః | పితృత్యక్తో మాతృహీనః క్షిధితస్స తమన్వ గాత్ || 12 ఇదమన్నం మయా గ్రాహ్యం శివాయోపకృతం నిశి | సుప్తే శైవజనే దైవాత్సర్వస్మిన్ వివిధం మహత్ || 13 ఇత్యాశామవలంబ్యాథ ద్వారి శంభోరుపావిశత్ |దదర్శ చ మహాపూజాం తేన భ##క్తేన నిర్మితామ్ || 14 విధాయ నృత్యగీతాది భక్తాస్సుప్తాః క్షణ యదా | నైవేద్యం సతదాదాతుం భర్గాగారం వివేశ హ || 15 తండ్రిచే విడువబడి, తల్లి లేక ఆకలి గొనియున్న ఆ యజ్ఞదత్తపుత్రుడగు బ్రాహ్మణుడు ఆహారపదార్ధముల గంధము నాఘ్రాణించి అతని వెనుకనే వెళ్లెను (12). శివభక్తులు ఈ అన్నమును శివునకు నివేదన చేసి రాత్రి యందు నిద్రించగనే, నేను ఈ వివిధములగు దివ్యమైన వంటకములను పరిగ్రహించెదను (13). అతడీ తీరున ఆ శించిన శివసన్నిధిలో ద్వారము నందు కూర్చుండి, ఆ భక్తుడు చేసిన మహాపూజను దర్శించెను (14). ఆ భక్తులు నాట్యములను చేసి, పాటలను పాడి నిద్రించగనే; ఆ నైవేద్యమును గ్రహించుటకు ఆతడు శివసన్నిధిలోనికి ప్రవేశించెను (15). దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న వీక్షణాయ సః | నిజచైలాంచలాద్వర్తిం కృత్వా దీపం ప్రకాశ్య చ || 16 యజ్ఞదత్తత్మా జస్సోsథ శివనైవేద్యమాదరాత్ | జగ్రాహ సహసా ప్రీత్యా పక్వాన్నం బహుశస్తతః || 17 తతః పక్వాన్న మాదాయ త్వరితం గచ్ఛతో బహిః | తస్య పాదతలాఘాతాత్ర్పసుప్తః కోsప్యబుధ్యత|| 18 కోsయం కోsయం త్వరాపన్నో గృహ్యతాం గృహ్యతా మసౌ | ఇతి చుక్రోశ స జనో గిరా భయమహోచ్చయా || 19 యావద్భయాత్సమాగత్య తావత్స పురరక్షకైః | పలాయమానో నిహతః క్షణా దంధత్వ మాగతః || 20 ఆతడు ఆ వివిధ ఆహారపదార్థములను చూడబోగా దీపకాంతి తగినంత లేకుండెను. ఆతడు తన ఉత్తరీయము నుండి వస్త్ర శకలమును చింపి వత్తిని చేసి దీపమును ప్రకాశింపజేసెను (16). ఆపుడా యజ్ఞదత్తుని పుత్రుడు వివిధములైన వంటకములుగల శివనైవేద్యమును ప్రీతితో ఆదరముతో స్వీకరించెను (17). ఆతడు ఆహారమును తీసుకొని త్వరితముగా బయటకు వెళ్లుచుండగా కాలు తగిలి నిద్రపోవుచున్న వ్యక్తి యొకడు తెలివిని పొందెను (18). ఎవరు వారు? ఎవరు వారు? వానిని తొందరగా పట్టుకొనుడు, పట్టుకొనుడు అని ఆతడు భయముతో పెద్ద స్వరముతో అరచెను (19). గుణనిధి భయపడి పరుగెత్తుచుండగా రక్షక భటులు కొట్టిరి. అతడు పడిపోయెను. మరియు చూపును కోల్పోయెను (20). అభక్షయచ్చ నైవేద్యం యజ్ఞదత్తాత్మజో మునే | శివానుగ్రహతో నూనం భావిపుణ్యబలాచ్చ సః || 21 అథ బద్ధ స్సమాగత్య పాశముద్గరపాణి భిః | నినీషు భి స్సంయమనీం యామ్యైస్స వికటెర్భటైః || 22 తావత్పారిషదాః ప్రాప్తాః కింకిణీ జలమాలినః | దివ్యం విమాన మాదాయ తం నేతుం శూల పాణయః || 23 ఓమహర్షీ! ఆ యజ్ఞదత్త కుమారుడు శివుని అనుగ్రహము వలన, మరియు లభించబోవు పుణ్యము యొక్క ప్రభావము వలన నైవేద్యమును భక్షించి మరణించెను (21). అపుడు భయంకరాకారులు, పాశము ముద్గరము అను ఆయుధములను ధరించిన వారునగు యమభటులు అచటకు వచ్చి ఆతనిని బంధించి యమపురికి తీసుకొని పొవనుద్యమించిరి (22). ఇంతలో చిరుగంటల మాలలను ధరించిన, చేతియందు శూలనముగల శివగణములు ఆతనిని తీసుకొని వెళ్లుటకై దివ్యవిమానమును తీసుకొనివచ్చిరి (23). శివగణా ఊచుః | ముంచతైనం ద్విజం యామ్యా గణాః పరమధార్మకమ్ | దండ యోగ్యో న విప్రోsసౌ దగ్ద సర్వాఘ సంచయః || 24 ఇత్యాకర్ణ్య వచస్తే హి యమరాజగణాస్తతః | మహాదేవగణానాహుర్బ భూవశ్చకితా భృశమ్ || 25 శంభోర్గణానథాలోక్య భీతైసై#్తర్యమకింకరైః | అవాది ప్రణతైరిత్థం దుర్వృత్తోsయం గణా ద్విజః || 26 శివగణముల వారిట్లనిరి | యమగణములారా! గొప్ప ధార్మికుడగు ఈద్విజుని విడువుడు. ఈ విప్రుడు శిక్షకు అర్హుడు కాడు. ఈతని పాపములన్నియూ నశించినవి (24). ఈ మాటను విన్న యమగణముల వారు ఆశ్చర్యమగ్నులై మహాదేవగణముల వారతో ఇట్లు మాటలాడిరి (25). శంభుగణములను చూచి భయపడిన యమగణముల వారు నమస్కరించి "ఓ గణములారా! ఈ ద్విజుడు దుర్మార్గుడు"అని పలికిరి (26) యమగణా ఊచుః | కులాచారం ప్రతీర్యైష పిత్రోర్వాక్యపరాఙ్ముఖః సత్యశౌచపరిభ్రష్టస్సంధ్యాస్నాన వివర్జితః || 27 అస్తాం దూరేస్య కర్మాన్యచ్ఛివనిర్మాల్యలంఘకః | ప్రత్యక్షతోsత్ర వీక్షధ్వ మస్పృశ్యోsయం భవాదృశామ్ || 28 శివనిర్మాల్య భోక్తారశ్శివ నిర్మాల్య లంఘకాః | శివనిర్మాల్య దాతార స్స్పర్శస్తేషాం హ్యపుణ్యకృత్ || 29 విషమాలోక్య వా పేయం శ్రేయో వా స్పర్శనం పరమ్ | సేవితవ్యం శివస్వం న ప్రాణౖః కంఠగతైరపి || 30 యమగణములిట్లు పలికిరి - ఈతడు కులాచారము నుల్లఘించి తల్లిదండ్రుల మాటను జవదాటినాడు. సత్య శౌచములను, సంధ్యా స్నానములను పరిత్యజించినాడు (27). ఇతని ఇతర పాపకర్మల నటుంచుడు. ఈతడు శివనిర్మాల్యమును అవమానించుటను మనము ప్రత్యక్షముగా చూచియుంటిమి. మీవంటి వారు స్పృశించుటకు ఈతడు దగడు (28). శివనిర్మాల్యమును భుజించిన వారిని, అవమానించిన వారిని, మరియు ఇచ్చిన వారిని స్పృశించినచో పాపము కలుగును (29). విషమను స్పృశించవచ్చును; లేదా, త్రాగవచ్చును. కాని ప్రాణములు పోవునప్పుడైననూ శివధనమును సేవించరాదు (30). యూయం ప్రమాణం ధర్మేషు యథా న చతథా వయమ్ | అస్తి చేద్ధర్మలేశోsస్య గణాస్తం శృణుమో వయమ్ || 31 ఇత్థం తద్వక్యమాకర్ణ్య యామానాం శివకింకరాః | స్మృత్వా శివపదాంభోజం ప్రోచుః పారిషదాస్తు తాన్ || 32 ధర్మముల విషయములో మీరే ప్రమాణము. మేము కాదు. ఓ గణములారా! వీనియందు ధర్మలేశము ఉన్నచో, మేము వినగోరుచున్నాము (31). శివకింకరులు యమకింకరుల ఈ మాటలను విని శివుని పాదపద్మమును స్మరించి వారితో నిట్లనిరి (32). శివకింకరా ఊచుః | కింకరా శ్శివధర్మా యే సూక్ష్మాస్తే తు భవాదృశైః | స్థూలలక్ష్యైః కథం లక్ష్యా లక్ష్యా యే సూక్ష్మదృష్టిభిః || 33 అనే నానేనసా కర్మ యత్కృతం శృణుతేహ తత్ | యజ్ఞదత్తాత్మజేనాథ సావధానతయా గుణా ః || 34 పతంతీ లింగశిరసి దీపచ్ఛాయా నివారితా | స్వచై లాంచలతోsనేన దత్త్వా దీపదశాం నిశి || 35 అపరోsపి పరో ధర్మో జాతస్తత్రాస్య కింకరాః | శృణ్వతశ్శివనామాని ప్రసంగాదపి గృహ్ణతామ్ || 36 శివకింకరులిట్లు పలికిరి - ఓ కింకరులారా! శివధర్మములు సూక్ష్మమైనవి. సూక్ష్మదృష్టి గలవారు మాత్రమే దర్శించగల ఆ ధర్మములు స్థూల దృష్టి గల మీ వంటి వారికి ఎట్లు భాసించును ? (33)అపాపియగు ఈ యజ్ఞదత్త కుమారుడు చేసిన కర్మను, ఓ గణములారా! సావధానముగా వినుడు (34). ఈతడు నిన్న రాత్రి తన వస్త్రముతో వత్తిని చేసి దీపమును కాపాడి లింగశిరస్సుపై దీపపు నీడ పడకుండగా నివారించినాడు (35). ఓ కింకరులారా! ప్రసంగవశాత్తు శివనామములను ఆతడు విని మరియొక గొప్ప ధర్మము నాచరించినాడు (36). భ##క్తేన విధినా పూజా క్రియమాణా నిరీక్షితా | ఉపోషితేన భూతాయా మనేనాస్థిత చేతసా || 37 శివలోకమయం హ్యద్య గంతాస్మాభి స్సహైవ తు | కంచిత్కాలం మహాభోగాన్ కరిష్యతి శివానుగః || 38 కలింగరాజో భవితా తతో నిర్ధూతకల్మషః | ఏషద్విజవరో నూనం శివప్రియతరో యతః || 39 అన్యత్కించిన్న వక్తవ్యం యూయం యాత యథాగతమ్ | యమదూతాస్స్వలోకం తు సుప్రసన్నేన చేతసా || 40 భక్తుడు ఉపవాసముండి మనస్సును లగ్నము చేసి యథా విధిగా చేసిన పూజను ఈతడు చూచినాడు (37). ఈతడిప్పుడు మాతో శివలోకమునకు వచ్చి, శివుని అనుచరుడై, కొంత కాలము మహాభోగముల ననుభవించగలడు.(38).తరువాత, సర్వ దోషములు తొలగిన ఈ ద్విజశ్రేష్ఠుడు శివునకు మిక్కిలి ప్రీతి పాత్రుడగుటచే కళింగరాజు కాగలడు (39). మీతో చెప్పదగినది మరి ఏదియూ లేదు. యమదూతలారా! మీరు ప్రసన్నచిత్తులై వచ్చిన దారిని మీలోకమునకు పొండు (40). బ్రహ్మో వాచ | ఇత్యాకర్ణ్య వచస్తేషాం యమదూతా మునీశ్వర |యథాగతం యయుస్సర్వే యమలోకం పరాఙ్ముఖాః || 41 సర్వం నివేదయామాసుశ్శమనాయ గణా మునే | తద్వృత్తమాదితః ప్రోక్తం శంభూదూతైశ్చ ధర్మతః || 42 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మునిశ్రేష్ఠా! యమదూతలు వారి ఈ మాటలను విని వెనుదిరిగి యమలోకమునకు వచ్చిన దారిని అందరు వెళ్లిరి (41). ఓ మహర్షీ! శంభుని దూతలు ధర్మము ప్రకారము చేసిన ఈ కార్యమునంతనూ యమునకు ఆ దూతలు ఆదినుండి అంతమువరకు విన్నవించిరి (42). ధర్మరాజ ఉవాచ | సర్వే శృణుత మద్వాక్యం సావధానతయా గణాః | తదేవ ప్రీత్యా కురుత మచ్ఛాసన పురస్సరమ్ || 43 యే త్రిపుండ్ర ధరా లోకే విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 44 ఉద్ధూలనకరా యే హి విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 45 యే రుద్రాక్షధరా లోకే జటా ధారిణ ఏవ యే | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 46 శివ వేషతయా లోకే యేన కేనాపి హేతునా | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 47 ధర్మరాజు ఇట్లు పలికెను - ఓ గణములారా! మీరందరు సావధానముగా నా మాటలను విని, నా ఈ ఆజ్ఞను ప్రీతితో ఆచరించుడు (43). లోకములో తెల్లని విభూతితో త్రిపుండ్రమును ధరించు వారిని (44), తెల్లని విభూతితో శరీరమునంతయూ భస్మమయముగా చేసుకొను వారిని (45), రుద్రాక్షలను ధరించువారిని, జటాధారులను (46), కారణమేదైనా లోకములో శివవేషమును ధరించు వారిని ఇచటకు ఎన్నడునూ తీసుకొని రావలదు. వారికి దూరముగా నుండుడు (47). ఉప జీవనహేతోశ్చ శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 48 దంభేనాపి చ్ఛ లేనాపి శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 49 ఏవ మాజ్ఞాపయామాస స యమో నిజకింకరాన్ | తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్ శుచిస్మితాః || 50 జీవిక కొరకై శివవేషమును ధరించువారిని (48), తాము ధర్మాత్ములమని చేప్పుకొనుట కొరకు గాని, లేదా ఇతరులను మోసగిచుట కొరకు గాని శివవేషమును ధరించు వారినైననూ ఇచ్చటికి ఏనాడు గొనిరావలదు. వారికి దూరముగా నుండుడు (49). ఆ యముడు తన భటులనీ తీరున ఆజ్ఞాపించెను. వారందరూ చిరునవ్వులతో అటులనే చేసెదమని నిర్ణయించుకొని ఊరకుండిరి (50). బ్రహ్మోవాచ | పార్షదైర్యమదూతే భ్యో మోచితస్త్వితి స ద్విజః | శివలోకం జగామాశు తైర్గణౖ శ్శుచి మానసః || 51 తత్ర భుక్త్వాఖిలాన్ భోగాన్ సంసేవ్య చ శివాశి వౌ | అరిందమస్య తనయః కలింగాధిపతేరభూత్ || 52 దమ ఇత్య భిధానోsభూ చ్ఛివసేవాపరాయణః | బాలోsపి శిశుభిస్సాకం శివభక్తిం చకార సః || 53 క్రమాద్రాజ్య మవాప్యాథ పితర్యుపరతే యువా | ప్రీత్యా ప్రవర్త యా మాస శివధర్మాంశ్చ సర్వశః || 54 నాన్యం ధర్మం స జానాతి దుర్దమో భూపతిర్దమః | శివాలయేషు సర్వేషు దీప దానాదృతే ద్విజాః || 55 బ్రహ్మ ఇట్లు పలికెను - యమదూతల నుండి ఈ తెరంగున శివగణములచే విడిపింపబడిన ఆ బ్రాహ్మణుడు శుద్ధమగు అంతఃకరణము గల వాడై వారితో గూడి శీఘ్రముగా శివలోకమునకు వెళ్లెను. (51). అచట అతడు సమస్త భోగముల ననుభవించి, పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించి, కలింగరాజగు అరిందముని కుమారుడై జన్మించెను (52). ఆతనికి దముడు అని పేరు. అతడు బాల్యము నుండియూ శివుని సేవించుట యందు శ్రద్ధ గలవాడై పిల్లలతో గూడి శివుని భజించెడివాడు (53). కొంత కాలమునకు తండ్రి రాజ్యాధికారము నుండి నివృత్తుడయ్యెను. అపుడు యువకుడగు దముడు రాజు అయ్యెను. అతడు సర్వత్రా ప్రీతితో శివధర్మములను ప్రవర్తిల్ల జేసెను (54). ఓ ద్విజులారా! జయింప శక్యము కాని ఆ దమ మహారాజునకు , శివాలయములన్నింటి యందు దీపములను వెలిగింపజేయుట తక్క మరియొక ధర్మము తెలియదు (55). గ్రామాధీశాన్స మహూయ సర్వాన్స విషయస్థితాన్ |ఇత్థమాజ్ఞాపయామాస దీపా దేయాశ్శివాలయే || 56 అన్యథా సత్యమేవేదం సమే దండ్యో భవిష్యతి | దీపదానాచ్ఛి వస్తుష్టో భవతీతి శ్రుతీరితమ్ || 57 యస్య యస్యాభితో గ్రామం యావంతశ్చ శివాలయాః | తత్ర తత్ర సదా దీపో ద్యోతనీయోsవిచారితమ్ || 58 మామాజ్ఞాభంగో దోషేణ శిరశ్ఛేత్స్యా మ్య సంశయమ్ | ఇతి తద్భయతో దీప్తాః ప్రతి శివాలయమ్ || 59 అతడు తన రాజ్యమందలి గ్రామాధికారుల నందరిని పిలిచి, ఇట్లు ఆజ్ఞాపించెను. శివాలయమందు దీపములను వెలిగించవలెను (56). అట్లు చేయని వ్యక్తిని నేను దండించెదను. ఇది సత్యము. దీపములను వెలిగించినచో, శివుడు సంతుష్టుడగునని వేదములు చెప్పుచున్నవి (57). ప్రతి అధికారి తన అధికారక్షేత్రములోని గ్రామములలో ఉన్న శివాలయములన్నింటి యందు నిత్యము దీపమునకు ఏర్పాటు చేయవలెను. దీని విషయములో చర్చకు తావు లేదు (58). నా ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి ఉరిశిక్ష వేయబడును. సందేహము లేదు. ఈవిధముగా రాజ భయము వలన ప్రతి శివాలయమునందు దీపములు ప్రకాశించెను (59). అనేనైవ స ధర్మేణ యావజ్జీవం దమో నృపః | ధర్మర్థిం మహతీం ప్రాప్య కాలధర్మవశం గతః || 60 స దీపవాసనాయోగా ద్బహూన్దీపాన్ర్పదీప్య వై | అలకాయాః పతిరభూద్రత్నదీపశిఖాశ్రయః || 61 ఏవం ఫలతి కాలేన శివేsల్పమపి యత్కృతమ్ | ఇతి జ్ఞాత్వా శివే కార్యం భజనం సుసుఖార్థిభిః || 62 క్వ స దీక్షితదాయాదస్సర్వధర్మారతిస్సదా | శివాలయే దైవయోగాద్యాతశ్చోరయితుం వసు || 63 దమ మహారాజు జీవించి యున్నంత కాలము ఇదే ధర్మము నాచరించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించెను (60). అతడు దీపమును వెలిగించిన సంస్కారబలముచే అనేక దీపములను వెలిగించి, రత్న దీపముల కాంతులకు నిలయమైన అలకానగరమునకు ప్రభువు ఆయెను (61). ఈ తీరున శివునకు చేసిన ఆరాధన అల్పమైనా కొంత కాలమునకు ఫలించునని యెరింగి సుఖమును గోరు మానవులు శివుని భజించవలెను (62). సర్వదా సర్వధర్మములకు విముఖుడైన దీక్షితపుత్రుడు ఎక్కడ? ఆతడు దైవయోగము వలన సంపదనపహరించుటకు శివాలయమును జొచ్చినాడు (63). స్వార్థదీప దశోద్యోతలింగమౌలి తమోహరః | కలింగ విషయే రాజ్యం ప్రాప్తో ధర్మరతిం సదా || 64 శివాలయే సముద్దీప్య దీపాన్ ప్రాగ్వాసనోదయాత్ | క్వైషా దిక్పాలపదవీ మునీశ్వర విలోకయ || 65 మనుష్యధర్మిణానేన సాంప్రతం యేహ భుజ్యతే | ఇతి ప్రోక్తం గుణనిధేర్యజ్ఞ దత్తాత్మజస్య హి || 66 చరితం శివ సంతోషం శృణ్వతాం సర్వకామదమ్ | సర్వ దేవశివేనాసౌ సఖిత్వం చ యథేయివాన్ || 67 తదప్యేకమనా భూత్వా శృణు తాత బ్రవీమి తే || 68 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే కైలాసగమనో పాఖ్యానే గుణనిధే స్సద్గతి వర్ణనం నామ అష్టాదశోSధ్యాయః (18). ఒక ప్రయోజనము నాశించి ఈతడు దీపమును ప్రకాశింపజేయగా శివలింగ శిరస్సు పై గల చీకటి తొలగినది. దాని మహిమచే ఈతడు కలింగాధిపతియై, సర్వదా ధర్మశ్రద్ధ కలిగియుండెను (64). పూర్వ జన్మ సంస్కారము ఉద్బుద్ధమగటచే నీతడు శివాలయములలో దీపములను పెట్టించినాడు. ఓ మునిశ్రేష్ఠా! తిలకించుము. ఈతడు ఇప్పుడు దిక్పాల పదవిని పొందినాడు (65). ఈతడు ఇప్పుడు కుబేరుడై దుస్సాధ్యమగు దిక్పాల పదవిని అనుభవించుచున్నాడు. యజ్ఞదత్తుని కుమారుడగు గుణనిధి యొక్క వృత్తాంతము నింతవరకు చెప్పితిని (66). ఈ చరితము శివునకు ప్రీతిని కలిగించును. వినువారల కోర్కెల నన్నిటినీ ఈడేర్చును. దేవదేవుడగు శివునితో ఈతనికి మైత్రి ఎట్లు కలిగినది ? (67). అను వృత్తాంతమును చెప్పెదను. హే వత్సా! నీవు మనస్సును లగ్నము చేసి వినుము (68). శ్రీ శివ మహాపురాణమునందు రెండవదియగు రుద్ర సంహితలో మొదటిదియగు సృష్టిఖండములో గుణనిధి సద్గతిని పొందుట అనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).