Sri Sivamahapuranamu-I
Chapters
అథ అష్టాదశోsధ్యాయః శివునితో కుబేరుని మైత్రి బ్రహ్మోవాచ | పాద్మే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్ | పులస్త్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణస్సుతః ||
1 తేనేయ మలకా భుక్తా పురీ విశ్వకృతా కృతా | ఆరాధ్య త్ర్యంబకం దేవషుత్యుగ్ర తపసా పురా ||
2 వ్యతీతే తత్ర కల్పేవై ప్రవృత్తే మేఘ వాహనే | యాజ్ఞ దత్తి రసౌ శ్రీ దస్తపస్తేపే సుదుస్సహమ్ ||
3 భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తద్దీపమాత్రతః | పురా పురారేస్సం ప్రాప్య కాశికాం చిత్ర్ప కాశికామ్ ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - పూర్వము పాద్మకల్పమునందు బ్రహ్మనగు నా యొక్క మానసపుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అను కుమారుడు కలిగెను| అతనికి వైశ్రవణుడు (కుబేరుడు) అను కుమారుడు కలిగెను (1). ఆతడు పూర్వము ముక్కంటి దేవుని అతిఘోరమగు తపస్సుతో నారాధించి విశ్వకర్మచే నిర్మింపబడిన ఈ అలకాపురిని పాలించెను (2). పాద్మకల్పము గడిచి, మేఘ వాహన కల్పము రాగా, యజ్ఞదత్తుని కుమారుడుగా నున్న ఈ కుబేరుడు ఘోరమగు తపస్సును చేసెను (3). దీపమును వెలిగించుట మాత్రముచేత తనకు లభించిన మహా ఫలముచే భక్తియొక్క ప్రభావమును ఎరింగి, ఆతడు పూర్వము పురారియగు శివుని చైతన్య స్వరూపమును ప్రకాశింపజేయు కాశీనగరమును చేరుకొనెను (4). శివైకాదశముద్బోధ్య చిత్తరత్నప్రదీపకైః | అనన్య భక్తిస్నేహాఢ్య స్తన్మయో ధ్యాననిశ్చలః ||
5 శివైక్యం సుమహాపాత్రం తపోsగ్ని పరిబృంహితమ్ | కామక్రోధమహావిఘ్న పతంగాఘాతవర్జితమ్ || 6 ప్రాణసంరోధనిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్ | సంస్థాప్య శాంభవం లింగం సద్భావకుసుమార్చితమ్ ||
7 తావత్తతాప స తపస్త్వగస్థిపరిశేషితమ్ | యావద్బభూవ తద్వర్ష్మ వర్షాణామయుతం శతమ్ ||
8 ఆతడు చిత్తము అనే రత్న దీపముచే ఏకాదశ రుద్రులను మేల్కొలిపి, అనన్యమగు భక్తితో, ప్రేమతో నిండిన హృదయము గలవాడై. ధ్యానమునందు అచంచలుడై యుండెను (5). ఆతడు మహాత్ములకు మాత్రమే లభ్యమగునట్టియు, తపస్సు అనే అగ్నిచే వృద్ధి పొందింపబడునట్టియు, కామక్రోధరూపములో నుండే మహావిఘ్నములను పక్షుల దెబ్బలు తగులనట్టి శివైక్యమును భావనచే పొందెను (6). ఆతడు ప్రాణాయామములో వాయువును స్తంభింపజేయుటచే వాయు సంచారము లేనట్టియు, దోషరహితమగు అంతర్ముఖత్వముచే కాలుష్యములు లేనట్టి మనో దేశమునందు శంభులింగమును స్ధాపించి పవిత్రమగు చిత్త వృత్తులనే పుష్పములచే నారాధించెను (7). ఆతడు శరీరములో చర్మము, ఎముకలు మాత్రమే మిగులునంత వరకు పదివేల వంద సంవత్సరముల కాలము తపస్సు చేసెను (8). తతస్సహ విశాలక్ష్యా దేవో విశ్వేశ్వరస్స్వయమ్ | అలకాపతి మాలోక్య ప్రసన్నేనాంతరాత్మనా ||
9 లింగే మనస్స మాధాయ స్థితం స్థాణుస్వరూపిణమ్ | ఉవాచ వరదోSస్మీతి తదాచక్ష్వాలకాపతే || 10 ఉన్మీల్య నయనే యావత్స పశ్యతి తపోధనః | తావదుద్యత్స హస్రాంశు సహస్రాధికతేజసమ్ ||
11 పురో దదర్శ శ్రీ కంఠం చంద్రచూడము మాధవమ్ | తత్తేజః పరిభూతాక్షితేజాః సంమీల్య లోచనే ||
12 ఉవాచ దేవదేవేశం మనోరథపదాతిగమ్ | నిజాం ఘ్రిదర్శనే నాత దృక్సామర్థ్యం ప్రయచ్ఛమే ||
13 అపుడు విశ్వేశ్వర దేవుడు నిడివికన్నుల అర్ధాంగితో కూడి ప్రసన్నమగు మనస్సుతో స్వయముగా ప్రత్యక్షమై అలకాపతియగు కుబేరుని చూచెను (9). ఆతడు మనస్సును లింగమునందు లగ్నము చేసి స్థాణువు వలె నిశ్చలుడై యుండెను. అపుడు ఆయన 'హే అలకాపతే! వరము నిచ్చెదను కోరుకొనుము' అని పలికెను (10). తపస్సే ధనముగా గల ఆ కుబేరుడు కన్నులను తెరచి, ఉదయించే కోటి సూర్యుల కన్న అధికమగు తేజస్సు కలిగినట్టియు (11), విషమును కంఠమునందు ధరించినట్టియు, చంద్రుని శిరస్సుపై అలంకరించుకొనియున్న పార్వతీ పతిని ఎదురుగా చూచెను. ఆ తేజస్సును కన్నులతో చూడజాలక, ఆతడు వెంటనే కన్నులను మూసుకొనెను (12). మనోగోచరము కాని ఆ దేవదేవునితో ఆతడిట్లనెను. నాథా! నీ పాదములను చూడగలిగే శక్తిని నా కన్నులకు ఇమ్ము (13). ఆయమేవ వరో నాథ యత్త్వం సాక్షాన్నిరీక్ష్యసే | కిమన్యేన వరేణశ నమస్తే శశిశేఖర || ఇతి తద్వచనం శ్రుత్వా దేవదేవ ఉమాపతిః | దదౌ దర్శన సామర్ధ్యం సృష్ట్వా పాణితలేన తమ్ || 15 ప్రసార్య నయనే పూర్వముమామేవ వ్యలోకయత్ | తతోSసౌ యాజ్ఞదత్తిస్తు తత్సామర్థ్య మవాప్య చ || 16 నాథా! నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుటయే నేను కోరే వరము. ఈశా! ఇతర వరములతో పనియేమి? ఓ చంద్రశేఖరా! నీకు నమస్కారమగు గాక! (14). దేవదేవుడగు పార్వతీపతి ఈ మాటను విని, ఆతనిని అరచేతితో స్పృశించి, చూడగలిగే శక్తిని ఇచ్చెను (15). యజ్ఞదత్త కుమారుడగు ఆ కుబేరుడు చూడగలిగే శక్తిని పొంది, కన్నులను తెరచి, ముందుగా పార్వతీ దేవిని చూచెను (16). శంభోస్సమీపే కా యోషిదేషా సర్వాంగ సుందరీ | ఆనయా కిం తపస్తప్తం మమాపి తపసోsధికమ్ || 17 అహో రూపమహో ప్రేమ సౌభాగ్యం శ్రీ రహో భృశమ్ | ఇత్యావాదీదసౌ పుత్రో ముహుర్మహురతీవ హి || 18 క్రూరదృగ్వీక్షతే యావత్పునః పునరిదం వదన్ | తావత్పుస్ఫోట తన్నేత్రం వామం వామావిలోకనాత్ || 19 అథ దేవ్య బ్రవీద్దేవ కిమసౌ దుష్టతాపనః | అసకృద్వీక్ష్య మాం వక్తి కురు త్వం మే తపః ప్రభామ్ || 20 అసకృద్వీక్షణనాక్ష్ణా పునర్మామేవ పశ్యతి | అసూయ మానో మే రూపప్రేమ సౌభాగ్య సంపదా || 21 శంభుని సమీపములో సర్వాంగ సుందరియగు ఈ యువతి ఎవరు? ఈమె ఎట్టి తపస్సును చేసినదో? నా కంటె అధికమైన తపస్సును చేసినది (17). అహో!ఏమి రూపము! అహో! ఏమి ప్రేమ! ఏమి సౌభాగ్యము! ఏమి శోభ! ఇట్లు కుబేరుడు మరల మరల పలుకుచు అతిగా ప్రవర్తించెను (18). ఇట్లు పలుకుచూ క్రూరమగు చూపులతో ఆమెను చూచుటచే, అతని ఎడమ నేత్రము పగిలిపోయెను (19). అపుడా దేవి దేవునితో నిట్లనెను. ఏమి ఇది? ఈ దుష్టతాపసుడు అదే పనిగా నన్ను చూచి మాటలాడుచున్నాడు. నాతపశ్శక్తిని వీనికి తెలుపుడు జేయుము (20). మరల మరల నన్నే చూచుచున్నాడు. నా రూపమును, ప్రేమను, సౌభాగ్యమును, సంపదను చూచి అసూయపడుచున్నాడు (21). ఇతి దేవీగిరం శ్రుత్వా ప్రహస్య ప్రాహ తాం ప్రభుః | ఉమే త్వదీయః పుత్రోసౌ న చ క్రూరేణ చక్షుషా|| 22 సంపశ్యతి తపోలక్ష్మీం తవ కిం త్వధి వర్ణయేత్ | ఇతి దేవీం సమాభాష్య తమీశః పునరబ్రవీత్ || 23 వరాన్ దదామి తే వత్స తపాసానేన తోషితః | నిధీనామథ నాథస్త్వం గుహ్యకానాం భ##వేశ్వరః || 24 యక్షాణాం కిన్నరాణాం చ రాజ్ఞాం రాజా చ సువ్రతః | పతిః పుణ్యజనానాం చ సర్వేషాం ధనదో భవ || 25 దేవి యొక్క ఈ మాటలను విని శివప్రభువు చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను. ఉమా! ఈతడు నీ కుమారుడు. ఈతడు నిన్ను క్రూరదృష్టితో చూచుటలేదు (22). పైగా నీతపస్సంపదను వర్ణించుచున్నాడు. ఇట్లు దేవితో పలికి ఈశుడు మరల కుబేరునితో నిట్లనెను (23). వత్సా! నీ తపస్సును నేను మెచ్చితిని. నీకు వరములనిచ్చెదను. నీవు నిధులకు నాథుడవు అగుము. గుహ్యకులకు ప్రభువ అగుదువు (24). యక్షులకు, కిన్నరులకు, రాజలకు రాజువై వ్రతములననుష్ఠించుము. పుణ్యాత్ములకు ప్రభువు అగుదవు. అందరికీ నీవే ధనమును ఇచ్చెదవు (25). మయా సఖ్యం చ తే నిత్యం వత్స్యామి చ తవాంతికే | అలకాం నిక షా మిత్ర తవ ప్రీతి వివృద్ధయే || 26 ఆగచ్ఛ పాదయోరస్యాః పత తే జననీ త్వియమ్ | యజ్ఞదత్త మహాభక్త సుప్రసన్నేన చేతసా || 27 నీకు నాతో నిత్యమైత్రి కలిగినది. నేను నీకు దగ్గరగా అలకానగర సమీపములో నివసించెదను. హే మిత్రమా! నేను నీకు అధికమగు ప్రీతిని కలిగించెదను (26). యజ్ఞదత్త కుమారా! నీవు మహాభక్తుడవు. రమ్ము. ఈమె నీ తల్లి. ప్రసన్నమగు మనస్సుతో ఈమె పాదములపై పడుము (27). బ్రహ్మో వాచ | ఇతి దత్త్వా వరాన్దేవః పునరాహ శివాం శివః | ప్రసాదం కురు దేవేశి తపస్విన్యంగజేsత్రవై || 28 ఇత్యా కర్ణ్య వచశ్శంభోః పార్వతీ జగదంబికా | అబ్రవీద్యాజ్ఞదత్తిం తం సుప్రసన్నేన చేతసా || 29 బ్రహ్మ ఇట్లు పలికెను - శివ దేవుడు ఈ విధముగా వరములనిచ్చి, మరల దేవితో నిట్లనెను; ఓ దేవదేవీ! తపశ్శాలియగు ఈ నీ పుత్రుని పై దయను చూపుము (28). శంభుని ఈ మాటలను విని, జగదంబ యగు పార్వతి ప్రసన్నమగు మనస్సు గలదై యజ్ఞదత్త కుమారునితో నిట్లనెను (29). దేవ్యువాచ | వత్స తే నిర్మలా భక్తిర్భవే భవతు సర్వదా | భ##వైక పింగో నేత్రేణ వామేన స్ఫుటితేన హ || 30 దేవేన దత్తా యే తుభ్యం వరాస్సంతు తథైవ తే | కుబేరో భవ నామ్నా త్వం మమ రూపేర్ష్యయా సుత || 31 ఇతి దత్త్వా వరాన్దేవో దేవ్యా సహ మహేశ్వరః | ధనదాయ వివేశాథ ధామ వైశ్వేశ్వరాభిధమ్ || 32 ఇత్థం సఖిత్వం శ్రీ శంభోః ప్రాపైష ధనదః పురమ్ | అలకాన్నికషా చాసీత్కైలాసశ్శంకరాలయః || 33 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాస గమనోపాఖ్యానే కుబేరస్య శివమిత్రత్వ వర్ణనం నామ ఏకోనవింశః అధ్యాయః (19). దేవి ఇట్లు పలికెను - వత్సా! నీకు సర్వకాలములయందు శివునిపై నిర్మలమగు భక్తి కలుగుగాక! నీ ఎడమ కన్ను పగిలినది గదా! కాన ఎర్రని ఒకే నేత్రము గల వాడవు కమ్ము (30). నీకు శివుడు ఇచ్చిన వరములు ఫలించుగాక! ఓ కుమారా! నీవు నా రూపమునందు ఈర్ష్యను పొందితివి గాన, కుబేరుడు అను పేర ప్రసిద్ధుడవగుదువు (31). మహేశ్వరుడు ఈ విధముగా దేవితో గూడి కుబేరునకు వరములనిచ్చి, విశ్వేశ్వరధామమును ప్రవేశించెను (32). కుబేరుడు ఈ తీరున శ్రీ శంభుని మైత్రిని, అలకానగరమును పొందెను. శంకరుని నివాసమగు కైలాసము అలకా నగరమునకు సమీపనములో వెలసెను (33). శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో కుబేరునకు శివునితో మైత్రి కలుగుట అనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).