Sri Sivamahapuranamu-I
Chapters
అథ వింశోsధ్యాయః శివుడు కైలాసమునకు వెళ్లుట బ్రహ్మోవాచ | నారద త్వం శృణు మునే శివాగమన సత్తమమ్ | కైలాసే పర్వత శ్రేష్ఠే కుబేరస్య తపోబలాత్ ||
1 నిధిపత్వ వరం దత్త్వా గత్వా స్వస్థానముత్తమమ్ | విచింత్య హృది విశ్వేశః కుబేర వరదాయకః ||
2 విధ్యంగజ స్వరూపో మే పూర్ణః ప్రలయ కార్యకృత్ | తద్రూపేణ గమిష్యామి కైలాసం గుహ్యకాలయమ్ ||
3 రుద్రో హృదయ జో మే హి పూర్ణాంశో బ్రహ్మనిష్కలః | హరి బ్రహ్మాదిభిస్సేవ్యో మదభిన్నో నిరంజనః ||
4 తత్స్వ రూపేణ తత్రైవ సుహృద్భూత్వా విలాస్యహమ్ | కుబేరస్య చ వత్స్యామి కరిష్యామి తపో మహత్ ||
5 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ నారదమునీ! కుబేరుని తపః ప్రభావము వలన శివుడు పర్వతరాజమగు కైలాసమునకు వచ్చుట అనే పుణ్య వృత్తాంతమును వినుము (1). విశ్వేశ్వరుడు కుబేరునకు వరములనిచ్చి, శ్రేష్ఠమగు తన ధామను పొంది, హృదయములో నిట్లు ఆలోచించెను (2). బ్రహ్మ శరీరము నుండి ఆవిర్భవించిన ప్రళయ కర్తయగు రుద్రుడు నా పూర్ణావతారము. నేను ఆ రూపములో గుహ్యకులుండే కైలాసమునకు వెళ్లెదను (3). నా హృదయము నుండి పుట్టిన రుద్రుడు పూర్ణాంశము గలవాడు, నిర్గుణ పరబ్రహ్మ, హరి బ్రహ్మాదులచే సేవింపబడువాడు, నా కంటె వేరు కానివాడు, దోషరహితుడు (4). నేను ఆ రూపముతో అచట కుబేరుని మిత్రుడనై విహరించెదను. మరియు గొప్ప తపస్సు చేసెదను (5). ఇతి సంచింత్య రుద్రోsసౌ శివేచ్ఛాం గంతుముత్సుకః | ననాద తత్ర ఢక్కాం స్వాం సుగతిం నాదరూపిణీమ్ || 6 త్రైలోక్యా మానశే తస్యా ధ్వనిరుత్సాహ కారకః | ఆహ్వానగతి సంయుక్తో విచిత్రస్సాంద్రశబ్దకః || 7 తచ్ఛ్రుత్వా విష్ణుబ్రహ్మాద్యా స్సురాశ్చ మునయస్తథా | ఆగమా నిగమా మూర్తా స్సిద్ధా జగ్ముశ్చ తత్ర వై || 8 సురాసురాద్యాస్స కలాస్తత్ర జగ్ముశ్చ సోత్సవాః | సర్వేsపి ప్రమథా జగ్ముర్యత్ర కుత్రాపి సంస్థితాః || 9 ఇట్లు తలపోసినంతనే, రుద్రుడు శివుని ఇచ్ఛను పూర్తిచేయుటలో ఉత్సాహము గలవాడై, పుణ్యగతిని ఇచ్చే నాదస్వరూపిణియగు తన ఢక్కను నినదించెను (6). ఉత్సాహమును కలిగించునది, గమనమునకు ఆహ్వానించునది,విచిత్రమైనది, గంభీరశబ్దము గలది అగు ఆ ఢక్క యొక్క ధ్వని ముల్లోకములలో వ్యాపించెను (7). ఆ ధ్వనిని విని, విష్ణు బ్రహ్మాది దేవతలు, మునులు, ఆగమములు, వేదములు మూర్తి దాల్చి, సిద్ధులు అచటకు వెళ్లిరి (8). అందరు దేవతలు, రాక్షసులు ఉత్సాహముతో నచటకు వెళ్లిరి. ప్రమథులు (రుద్ర గణములు) ఎక్కడ ఉన్ననూ అచటకు బయలు దేరిరి (9). గణపాశ్చ మహా భాగాస్సర్వలోక నమస్కృతాః | తేషాం సంఖ్యా మహం వచ్మి సావధానతయా శృణు || 10 అభ్యయాచ్ఛంఖ కర్ణశ్చ గణకోట్యా గణశ్వరః | దశభిః కేకరాక్షశ్చ వికృతోsష్టాభిరేవ చ || 11 చతుష్టఎ్టా్య విశాఖశ్చ నవభిః పారియాత్రకః | షడ్భి స్సర్వాంతక శ్ర్శీమాన్ దుందుభోష్టాభిరేవ చ || 12 జాలంకో హి ద్వాదశభిః కోటి భిర్గణ పుంగవః | సప్త భి స్సమద శ్ర్శీమాంస్త థైవ వికృతాననః || 13 పంచభిశ్చ కపాలీ హి షడ్భి స్సందారకశ్శుభః | కోటి కోటి భిరేవేహ కండుకః కుండకస్తథా || 14 మహాత్ములు, సర్వ జీవులచే నమస్కరింపబడువారు నగు గణపతులు కూడ బయలు దేరిరి. వారి సంఖ్యను నేను చెప్పెదను. సావధానముగా వినుము (10). శంఖకర్ణుడగు గణనాథుడు కోటి గణములతో బయలుదేరెను. కేకరాక్షుడు పది, వికృతుడు ఎనిమిది (11), విశాఖుడు అరవై నాలుగు, పారియాత్రకుడు తొమ్మిది, సర్వాంతకుడు ఆరు, శ్రీమాన్ దుందుభుడు ఎనిమిది (12), గణశ్రేష్ఠుడగు జాలంకుడు పన్నెండు, శ్రీమాన్ సమదుడు ఏడు, వికృతాననుడు కూడ ఏడు (13), కపాలి అయిదు, శుభకరుడగు సందారకుడు ఆరు, కండుకుడు, కండకుడు ఒక్కొక్కటి కోట్ల గణములతో కూడి వెళ్ళిరి (14). విష్టంభోsష్టాభిరగమదఎ్టాభిశ్చంద్రతాపనః |మహాకేశస్సహస్రేణ కోటీనాం గణపో వృతః || 15 కుండీ ద్వాదశభి ర్వాహస్తథా పర్వతకశ్శుభః | కాలశ్చ కాలకశ్చైవ మహాకాలశ్శతేన వై || 16 అగ్ని కశ్శతకోట్యావై కోట్యా భిముఖ ఏవ చ | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథ చైవ ధనావహః || 17 సన్నాహశ్చ శ##తేనైవ కుముదః కోటిభిస్తథా | అమోఘః కోకిలశ్చైవ కోటి కోట్యా సుమంత్రకః || 18 కాకపాదోsపరష్షష్ట్యా షఎ్టా్య సంతానకః ప్రభుః | మహాబలశ్చ నవభిర్మధుబపింగశ్చ పింగలః || 19 విష్టంభుడు ఎనిమిది, చంద్ర తాపనుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (15), కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనువారు ఒక్కొక్కరు పన్నెండు, మహాకాలుడు వంద (16), అగ్నికుడు వంద, అభిముఖుడు, ఆదిత్యమూర్దుడు, ధనావహుడు ఒక్కొక్కటి (17), సన్నాహుడు వంద, కుముదుడు వంద, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి (18), కాకపాదుడను వాడు అరవై, సంతానకుడను గణపతి అరవై, మహాబలుడు, మధుపింగుడు, పింగలుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణములతో వచ్చిరి (19). నీలో నవత్యా దేవేశం పూర్ణ భద్రస్తథైవ చ | కోటీనాం చైవ సప్తానాం చతుర్వక్త్రో మహాబలః || 20 కోటికోటి సహస్రాణాం శ##తైర్వింశతిభిర్వృతః | తత్రాజగామ సర్వేశః కైలాసగమనాయ వై || 21 కాష్ఠాగూఢశ్చ తుష్షఎ్టా్య సుకేశో వృషభస్తథా | కోటి భిస్సస్తభిశ్చైత్రో నకులీశస్స్వయం ప్రభుః || 22 లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకః ప్రభుః | దేవో భృంగీ రిటిశ్ర్శీమాన్ దేవదేవప్రియస్తథా || 23 అశనిర్భానుకశ్చైవ చతుష్షఎ్టా్య సనాతనః | నందీశ్వరో గణాధీశశ్శత కోట్యా మహాబలః || 24 నీలుడు తొంభై, పూర్ణ భద్రుడుకూడ తొంభై, మహాబలశాలియగు చతుర్వక్త్రుడు ఏడు కోట్ల గణములతో శివుని వద్దకు వచ్చిరి (20). సర్వేశ్వరుడగు శివుడు కైలాసమునకు వెళ్లుటకై ఇరువది వందల కోటి కోట్ల గణములతో కూడి బయలుదేరెను (21). కాష్ఠాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలగు, చైత్రుడు, నకులీశుడు (22), లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగి దేవుడు, శివునకు అతి ప్రియుడగు శ్రీమాన్ రిటి (23), అశని, భానుకుడు ఒక్కొక్కరు ఏడు, సనాతనుడు అరవై నాలుగు, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి వంద కోట్ల గణములతో విచ్చేసిరి (24). ఏతే చాన్యే చ గణపా అసంఖ్యాతా మహాబలాః | సర్వే సహస్ర హస్తాశ్చ జటాముకట ధారిణః || 25 సర్వే చంద్రావతంసాశ్చ నీలకంఠాస్త్రిలోచనాః | హారకుండలకేయూర ముకుటాద్వై రలంకృతాః || 26 బ్రహ్మేంద్ర విష్ణు సంకాశా అణి మాది గణౖర్వృతాః | సూర్యకోటి ప్రతీకాశాస్తత్రా జగ్ముర్గణశ్వరాః || 27 ఏతే గణాధిపాశ్చాన్యే మహాత్మానోsమలప్రభాః | జగ్ముస్తత్ర మహాప్రీత్యా శివదర్శనలాలసాః || 28 వీరేగాక మహాబలశాలురగు గణాధీశులు ఎందరో లెక్కలేనంత మంది వచ్చిరి. వారందరు అనేక హస్తములను కలిగియుండిరి. వారు జటలను కిరీటములను ధరించి యుండిరి (25). వీరందరు చంద్రుని శిరస్సుపై ధరించిరి. నల్లని కంఠమును, మూడు కన్నులను కలిగియుండిరి. వారు హారములు, కుండలములు, కేయూరములు, కిరీటములు మొదలగు వాటితో అలంకరించుకొనిరి (26). వారు బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువులతో సమమగు సామర్థ్యమును కలిగియుండిరి. వారిని అణిమాది సిద్ధులు సేవించుచుండెను. కోటి సూర్యుల కాంతితో ఒప్పు గణపతులు అచటకు వచ్చియుండిరి (27). మహాత్ములు, దివ్యకాంతితో ఒప్పువారు, శివుని దర్శించుట యందు అభిరుచి గల వారునగు ఎందరో గణాధిపులు అచటకు వచ్చిరి (28). గత్వా తత్ర శివం దృష్ట్వా నత్వా చక్రుః పరాం నతిమ్ | సర్వే సాంజలయో విష్ణుప్రముఖా నతమస్తకాః || 29 ఇతి విష్ణ్వాదిభిస్సార్దం మహేశః పరమేశ్వరః | కైలాసమగమత్ర్పీత్యా కుబేరస్య మహాత్మనః || 30 కుబేరోsప్యాగతం శంభుం పూజయామాస సాదరమ్ | భక్త్యా నా నోపహారైశ్చ పరివారసమన్వితః || 31 తతో విష్ణ్వాదికాన్ దేవాన్ గణాంశ్చాన్యానపి ధ్రువమ్ | శివానుగాన్స మానర్చ శివతోషణ హేతవే || 32 విష్ణువు మొదలగు వారందరు శివుని వద్దకు వెళ్లి, ఆయనను చూచి, దోసిలియొగ్గి శిరసా నమస్కరించి గొప్ప స్తోత్రములను చెసిరి (29). పరమేశ్వరుడగు మహేశుడు విష్ణువు మొదలగు వారితో గూడి, మహాత్ముడగు కుబేరునియందలి ప్రీతితో, కైలాసమునకు వెళ్లెను (30). కుబేరుడు పరివారముతో గూడి, వేంచేసిన శివుని ఆదరముతో, భక్తితో గూడిన వాడై అనేకములగు ఉపహారములనర్పించి పూజించెను (31). తరువాత ఆయన శివుని ఆనందింపజేయుట కొరకై విష్ణువు మొదలగు దేవతలను, శివుని అనుచరులగు గణములను ఆదరముతో పూజించెను (32). అథ శంభుస్సమాలింగ్య కుబేరం ప్రీతమానసః | మూర్ధ్ని చాఘ్రాయ సంతస్థావలకాం నికషాఖిలైః || 33 శాశస విశ్వకర్మాణం నిర్మాణార్థం గిరౌ ప్రభుః | నానాభ##క్తైర్ని వాసాయ స్వపరేషాం యథోచితమ్ || 34 విశ్వకర్మాతతో గత్వా తత్ర నానావిధాం మునే | రచయామాస ద్రుతం శంభోరనుజ్ఞయా || 35 అథ శంభుః ప్రముదితో హరిప్రార్థనయా తదా | కుబేరాను గ్రహం కృత్వా య¸° కైలాసపర్వతమ్ || 36 అపుడు శంభుడు ఆనందించిన మనస్సు గలవాడై, కుబేరుని ఆలింగనము చేసుకొని, లలాటముపై ముద్దిడి, అందరితో గూడి అలకానగర సమీపములో నుండెను (33). ప్రభువగు శివుడు తనకు, తన భక్తులందరికీ నివసించుట కొరకై తగిన నివాసములను పర్వతమునందు నిర్మించుమని విశ్వకర్మను ఆజ్ఞాపించెను (34). ఓ మహర్షీ! విశ్వకర్మ శంభుని యాజ్ఞచే కైలాసమునకు వెళ్లి, అచట నానావిధములగు ప్రాసాదములను శీఘ్రముగా నిర్మించెను (35). అపుడు మిక్కిలి యానందించిన శివుడు విష్ణువు యొక్క ప్రార్థననాలకించి, కుబేరుని అనుగ్రహించి, కైలాస పర్వతమునకు వెళ్లెను (36). సుముహూర్తే ప్రవిశ్యాసౌ స్వస్థానం పరమేశ్వరః | అకరోదభిలాన్ప్రీత్యా సనాథాన్ భక్తవత్సలః || 37 అథ సర్వే ప్రముదితా విష్ణుప్రభృతయస్సురాః | మునయశ్చాపరే సిద్ధా అభ్యషించన్ముదా శివమ్ || 38 సమానర్చుః క్రమాత్సర్వే నానోపాయనపాణయః |నీరాజనం సమాకర్షుర్మహోత్సవ పురస్సరమ్ || 39 తదాసీ త్సుమనో వృష్టి ర్మంగలాయతనా మునే | సుప్రీతా నవృతుస్త త్రాప్సరసో గానతత్పరాః || 40 జయశబ్దో నమశ్శబ్దస్తత్రాసీత్సర్వ సంస్కృతః | తదోత్సాహో మహానాసీత్సర్వేషాం సుఖవర్థనః || 41 పరమేశ్వరుడు సుముహూర్తమునందు తన స్థానమగు కైలాసమును ప్రవేశించెను. భక్తవత్సలుడగు ఆయన ప్రీతితో అందరినీ సనాథులను చేసెను (37). అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందించినవారై, మునులతో సిద్ధులతో గూడి శివుని ప్రీతితో అభిషేకించిరి (38). వారందరు చేతులలో ఉపాయనములను పట్టుకొని శివుని వరుసగా అర్చించి, మహోత్సవముతో నీరాజనమునిచ్చిరి (39). ఓ మహర్షీ! అపుడు దేవతలు మంగళకరమగు పుష్పవృష్టిని కురిపించిరి. అచట అప్సరసలు గానము చేయుచూ ప్రీతితో నాట్యమాడిరి (40) అపుడు అచట జయజయ ధ్వానములు, నమశ్శబ్దములు సర్వులచే పలుకబడినవి. ఆ గొప్ప ఉత్సాహము అందరికి సుఖవర్థకమయ్యెను (41). స్థిత్వా సింహాసనే శంభు ర్విరరాజాధికం తదా | సర్వైస్సంసే వితోsభీక్ణం విష్ణ్వాద్యైశ్చ యథోచితమ్ || 42 అథ సర్వే సురాద్యాశ్చ తుష్టువుస్తం పృథక్ పృథక్ | అర్థ్యా భిర్వాగ్భిరిష్టాభిశ్శంకరం లోకశంకరమ్ || 43 ప్రసన్నాత్మా స్తుతిం శ్రుత్వా తేషాం కామాన్ దదౌ శివః | మనోsభిలషితాన్ ప్రీత్యా వరాన్ సర్వేశ్వరః ప్రభుః || 44 శివాజ్ఞాయాథ తే సర్వేస్వం స్వం ధామ యయుర్మనే | ప్రాప్త కామాః ప్రముదితా అహం చ విష్ణునా సహ || 45 ఉపవేశ్యాసనే విష్ణుం మాం చ శంభురువాచ హ | బహు సంబోధ్య సుప్రీత్యాsనుగృహ్య పరమేశ్వరః || 46 శంభుడు సింహాసనమునందున్న వాడై మిక్కిలి విరాజిల్లెను. విష్ణ్వాది దేవతలందరు యథో చితముగ ఆయనను సేవించిరి (42). అపుడు దేవతలు, ఇతరులు లోకములకు మంగళములనిచ్చు ఆ శంకరుని అర్థవంతములైన, శివప్రీతికరములైన వాక్కులతో వేర్వేరుగా స్తుతించిరి (43). సర్వేశ్వరుడు, ప్రభువు అగు శివుడు వారి స్తోత్రములను విని, ప్రసన్నమగు మనస్సుగలవాడై, వారు మనస్సులో కోరుకున్న కోర్కెలనన్నిటినీ వరములుగ నిచ్చెను (44). అపుడు వారందరు శివుని వద్ద సెలవు తీసుకొని తమ తమ నెలవులకు వెళ్లిరి. ఓ మునీ! నేను, మరియు విష్ణువు ఈడేరిన కోర్కెలు గలవారమై ఆనందించితిమి (45). పరమేశ్వరుడగు శంభుడు నన్ను, విష్ణువును ఆసనము నందు కూర్చుండబెట్టి, మిక్కిలి ప్రేమతో అనుగ్రహించి, అనేక విధములుగా సంబోధించి ఇట్లనెను (46). శివ ఉవాచ | హే హరే హే విధే తాతౌ యువాం ప్రియతరౌ మమ | సురోత్తమౌ త్రి జగతోsవనసర్గక రౌ సదా || 47 గచ్ఛతం నిర్భయాన్నిత్యం స్వస్థానం చ మదాజ్ఞయా | సుఖప్రదాతాహం వై వాం విశేషాత్ర్పేక్షకస్సదా || 48 ఇత్యాకర్ణ్య వచశ్శంభో స్సు ప్రణమ్య తదాజ్ఞయా | అహం హరిశ్చ స్వం ధామాగమావ ప్రీతమాన సౌ || 49 తాదనీమేవ సుప్రీతశ్శంకరో నిధిపం ముదా | ఉపవేశ్య గృహీత్వా తం కర ఆహ శుభం వచః || 50 శివుడు ఇట్లు పలికెను - హే హరే! హే బ్రహ్మన్ ! వత్సలారా! మీరిద్దరు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. మీరు దేవోత్తములు. మీరు జగత్తును సృష్టించి, సదా రక్షించుచుందురు (47). మీరు మీ స్థానమునకు వెళ్లుడు. నిత్యము నిర్భయముగా నుండుడు. ఇది నా యాన. నేను మీకు సుఖములనిచ్చెదను. సదా మీ బాగోగులను చూచెదను (48). శంభుని ఈ మాటలను విని, విష్ణువు మరియు నేను ఆయనకు నమస్కరించి, మిక్కిలి సంతసించిన వారమై, ఆయన ఆజ్ఞచే మా స్థానములకు తిరిగి వచ్చితిమి (49). అదే సమయములో మిక్కిలి సంతసించిన శంకరుడు ఆనందముతో కుబేరుని చేతిని పట్టుకొని కూర్చుండబెట్టి ఈ శుభకరముగ వాక్కులను పలికెను (50). శివ ఉవాచ | తవ ప్రేవ్ణూ వశీ భూతో మిత్రతాగమనం సఖే | స్వస్థానం గచ్చ విభయస్సహాయోsహం సదానఘ || 51 ఇత్యాకర్ణ్య వచశ్శంభోః కుబేరః ప్రీతమనసః | తదాజ్ఞయా స్వకం ధామ జగామ ప్రముదాన్వితః || 52 స ఉవాస గిరౌ శంభుః కైలాసే పర్వతోత్తమే | సగణో యోగనిరతస్స్వచ్ఛందో ధ్యానతత్పరః || 53 క్వచిద్దధ్యౌ స్వమాత్మానం క్వచిద్యోగరతోsభవత్ | ఇతి హాస గణాన్ ప్రీత్యాsవాదీత్స్వ చ్ఛందమానసః || 54 శివుడు ఇట్లు పలికెను - ఓ మిత్రమా! నీ ప్రేమచే నేను నీకు వశ##మై మైత్రి కొరకై ఇచటకు వచ్చితిని. ఓ అనఘా! నీ స్థానమునకు వెళ్లుము. నీకు భయము లేదు. నేను నీకు సర్వదా సహాయుడను (51). కుబేరుడు శంభుని ఈ మాటను విని సంతసించినవాడై గొప్ప ఆనందముతో శివుని యాజ్ఞ ప్రకారముగా తన ధామకు వెళ్లెను (52). ఆ శివుడు గణములతో కూడిన వాడై, యోగమునందు లగ్నమైన వాడై, ధ్యానమునందు తత్పరుడై యథేచ్ఛగా ఆ పర్వత శ్రేష్ఠమగు కైలాసగిరి యందు నివసించెను (53). ఒకప్పుడు ఆయన ఆత్మరతుడై యుండెను. మరియొకప్పుడు యోగనిష్ఠుడై యుండెను. ఆయన మనసునకు నచ్చినపుడు ప్రీతితో అనేక ఇతిహాసములను చెప్పెడివాడు (54). క్వచిత్కైలాస కుధరసుస్థానేషు మహేశ్వరః | విజహార గణౖః ప్రీత్యా వివిధేషు విహారవిత్|| 55 ఇత్థం రుద్రస్వరూపోsసౌ శంకరః పరమేశ్వరః | అకార్షీత్స్వగిరౌ లీలా నానా యోగివరోsపి యః || 56 నీత్వా కాలం కియంతం సోsపత్నీకః పరమేశ్వరః | పశ్చాదవాప స్వపత్నీం దక్షపత్నీ సముద్భవామ్ || 57 విజహార తయా సత్యా దక్షపుత్ర్యా మహేశ్వరః | సుఖీ బభూవ దేవర్షే లోకాచార పరాయణః || 58 విహారమునెరింగిన మహేశ్వరుడు ఒకప్పుడు కైలాస పర్వతప్రదేశముల యందు గణములతో కూడి ప్రీతితో విహరించెడివాడు (55). శంకర పరమేశ్వరుడు యోగి శ్రేష్ఠుడే అయినా, ఈ తీరున రుద్ర రూపుడై తన పర్వతమునందు అనేక లీలలను చేసెను (56).ఆ పరమేశ్వరుడు భార్య లేకుండగా కొంతకాలమును గడిపి, తరునాత దక్షుని కుమార్తెను వివాహమాడెను (57). ఓ దేవర్షీ! మహేశ్వరుడు దక్షపుత్రియగు ఆ సతీదేవితో గూడి లోకాచారములను అనుష్ఠించుచూ సుఖియై విహరించెను (58). ఇత్థం రుద్రావతారస్తే వర్ణి తోsయం మునీశ్వర| కైలాస గమనం చాస్య సఖిత్వాన్నిదిపస్య హి || 59 తదంతర్గత లీలాపి వర్ణితా జ్ఞాన వర్థినీ | ఇహాముత్ర చ యా నిత్యం సర్వకామఫలప్రదా || 60 ఇమాం కథాం పఠేద్యస్తు శృణుయాద్వా సమాహితః | ఇహ భుక్తిం సమాసాద్య లభేన్ముక్తిం పరత్ర సః || 61 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాసోపాఖ్యానే శివస్య కైలాసగమనం నామ వింశోsధ్యాయః (20). ఓ మహర్షీ! నీకు ఈ తీరున రుద్రావతారమును, కుబేరుని మైత్రి కారణము వలన శివుడు కైలాసమునకు వెళ్లుటను వర్ణించితిని (59). ఈ గాథలో అంతర్గతముగా నున్న లీలలను కూడ వర్ణించితిని. ఈ గాథ జ్ఞానమును వృద్ధి పొందించును. ఇహ పరములయందు నిత్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (60). ఎవరైతే ఈ కథను శ్రద్ధతో పఠించెదరో, లేదా వినెదరో, వారు ఇహలోకములో భుక్తిని పొంది, పరలోకములో ముక్తిని పొందెదరు (61). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములో కైలాసోపాఖ్యానములో శివుడు కైలాసమునకు వెళ్లుట అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20). శ్రీ కృష్ణార్పణమస్తు.