Sri Sivamahapuranamu-I
Chapters
అథ షష్ఠోsధ్యాయః సంధ్య తపస్సును చేయుట బ్రహ్మోవాచ | సుతవర్య మహాప్రాజ్ఞ శృణు సంధ్యా తపో మహత్ | యఛ్ఛ్రుత్వా నశ్యతే పాపసమూహస్తత్ క్షణాద్ధ్రువమ్ ||
1 ఉపదిశ్య తపోభావం వసిష్ఠే స్వగృహం గతే | సంధ్యా పి తపసోభావం జ్ఞా త్వా మోదమవాప హ ||
2 తతస్సానందమనసో వేషం కృత్వా తు యాదృశమ్ | తపశ్చర్తుం సమారేభే బృహల్లోహిత తీరగా ||
3 యథోక్తం తు వసిష్ఠేన మంత్రం తపసి సాధనమ్ | మంత్రేణ తేన సద్భక్త్యా పూజయామాస శంకరమ్ ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - మహాప్రాజ్ఞ! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. సంధ్య యొక్క గొప్ప తపస్సును గురించి వినుము. ఇది విన్నవాని పాపసమూహము వెను వెంటనే నిశ్చితముగా నశించును (1). తపస్సు యొక్క స్వరూపమును ఉపదేశించి వసిష్ఠుడు తన ఇంటికి వెళ్లెను. సంధ్య తపస్స్వరూపమునెరింగి ఆనందించెను (2). అపుడామె బృహల్లోహిత సరస్సు యొక్క తీరమునందు కూర్చుండి, ఆనందముతో నిండిన మనస్సు గలదై, తపస్సునకు యోగ్యమగు వస్త్రధారణను చేసి తపస్సను చేయుట ఆరంభించెను (3).తపస్సునందు సాధనముగా వసిష్ఠునిచే ఉపదేశింపబడిన మంత్రముతో ఆమె సద్భక్తి గలదై శంకరుని పూజించెను (4) ఏకాంతమనసప్తస్యాః కుర్వంత్యా స్సుమహత్త పః | శంభౌ విన్యస్త చిత్తయా గతమేకం చతుర్యుగమ్ ||
5 ప్రసన్నోsభూత్తగా శంభుస్తపసా తేన తోషితః |అంతర్బ హిస్తథాకాశే దర్షయిత్వా నిజం వపుః ||
6 యాద్రూపం చింత యంతీ సా తేన ప్రత్యక్షతాం గతః | అథ సా పురతో దృష్ట్వా మనసా చింతితం ప్రభుమ్ ||
7 ప్రసన్న వదనం శాంతం ముమోదాతీవ శంకరమ్ | ససాధ్వసమహం వక్ష్యే కిం కథం స్తౌమి శంకరమ్ ||
8 ఇతి చింతాపరా భూత్వా న్యమీల యత చక్షుషీ | ఆమె శంభుని యందు చిత్తమును దృఢముగా నిలిపి, ఇతర వ్యాపారములు లేనిదై మిక్కిలి గొప్ప తపస్సను చేయుచుండగా, ఒక మహాయుగ కాలము గడిచి పోయెను (5). అపుడు శంభుడు ఆ తపస్సు చే సంతసించి, ప్రసన్నుడై, లోపల బయట, మరియు ఆకాశమునందు తన రూపమును ప్రకటించెను (6). ఆమె ఏ రూపమును ధ్యానించుచుండెనో , అదే రూపముతో ఆయన ప్రత్యక్షమయ్యెను. తాను మనస్సులో ధ్యానించిన ప్రభువును ఆమె తన ఎదుట చూచెను (7). ప్రసన్నమైన ముఖము గలవాడు, శాంతుడు అగు శంకరుని చూచి ఆమె మిక్కిలి ఆనందించెను. నాకు చాల భయమగు చున్నది. నేనేమి మాటలాడగలను ? శంకరుని ఎట్లు స్తుతించవలెను?(8)అని ఆమె చింతిల్లి కళ్లను మూసుకొనెను. నిమీలితాక్ష్యాస్తస్యాస్తు ప్రవిశ్య హృదయం హరః || 9 దివ్యం జ్ఞానం దదౌ తసై#్య వాచం దివ్యే చ చక్షుషీ | ప్రత్యక్షం వీక్ష్య దుర్గేశం తుష్టావ జగతాం పతిమ్ || 10 హరుడు కళ్లను మూసుకున్న ఆమె హృదయములో ప్రవేశించి (9) ఆమెకు దివ్యజ్ఞానమును, దివ్యవాక్కును, దివ్యనేత్రములను ఇచ్చెను. ఆమె జగత్ర్పభువగు పార్వతీపతిని ప్రత్యక్షముగా చూచి ఇట్లు స్తుతించెను (10). సంధ్యోవాచ | నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్ | అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తసై#్మ తుభ్యం లోకకర్రై నమోsస్తు || 11 సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞాన గమ్యం స్వప్రకాశేsవికారమ్ | ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గా త్పరస్తా ద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నమ్ || 12 ఏకం శుద్ధం దీప్యమానం తథా జం చిదానందం సహజం చావికారి | నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమసై#్మ నమస్తే || 13 గగనం భూర్దిశ##శ్చైవ సలిలం జ్యోతిరేవ చ | పునః కాలశ్చ రూపాణి యస్య తుభ్యం నమోsస్తుతే || 14 సంధ్య ఇట్లు పలికెను - నీవు నిరాకారుడవు. నీ సర్వాతీతమగు తత్త్వము జ్ఞానము చేత మాత్రమే పొందదగును. నీ రూపము స్థూలము గాని, సూక్ష్మముగాని, ఉన్నతముకాని కాదు. యోగులు నీ రూపమును తమ హృదయములో ధ్యానించెదరు. లోకకర్తవగు నీకు నమస్కారము (11). సర్వవ్యాపకము, శాంతము, దోషరహితము, జ్ఞానముచే పొందదగినది, స్వప్రకాశమునందు వికారములు లేనిది, సంసారమనే తమో మార్గమున కతీతముగా చిదాకాశముందు యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపము గల, దయామయుడవగు నీకు నమస్కారము (12). అద్వయము, శుధ్ధము, ప్రకాశించునది, పుట్టుక లేనిది, చిద్ఘనము, ఆనందఘనము, వికారములు లేనిది, స్వరూప భూతము, శాశ్వతా నందరూపము, సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదలనిచ్చునది అగు రూపము గల నీకు నమస్కారము (13). ఆకాశము, భూమి, దిక్కులు, నీరు, అగ్ని , కాలము అనునవి నీ రూపములే . అట్టి నీకు నమస్కారము (14). విద్యాకారో ద్భావనీయం ప్రభిన్నం సత్త్వచ్ఛందం ధ్యేయమాత్మ స్వరూపమ్ | సారం పారం పావనానాం పవిత్రం తసై#్మ రూపం యస్య చైవం నమస్తే || 15 యత్త్వాకారం శుద్ధ రూపం మనోజ్ఞం రత్నా కల్పం స్వచ్ఛ కర్పూర గౌరమ్ | ఇష్టాభీతి శూలముండే దధానం హసై#్తర్నమో యోగయుక్తాయ తుభ్యమ్ || 16 ప్రధానపురుషౌ యస్య కాయత్వేన వినిర్గతౌ | తస్మా దవ్యక్తరూపాయ శంకరాయ నమో నమః || 17 యో బ్రహ్మా కురుతే సృష్టిం యో విష్ణుః కురుతే స్థితమ్ | సంహరిష్యతి యో రుద్రస్తసై#్మ తుభ్యం నమో నమః || 18 త్వం పరః పరమాత్మా చ త్వం విద్యా వివిధా హరః | సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణ పరాయణః || 19 మిథ్యా జగత్తు కంటె భిన్నమైనది, సత్త్వగుణ ప్రధానమైనది, ప్రత్మగాత్మ కంటె అభిన్నమైనది అగు నీ రూపము జ్ఞానము చేత మాత్రమే తెలియబడును. భక్తులచే ధ్యానింపబడునది, సార భూతమైనది, అలౌకికమైనది, పావనము చేయు తీర్థాలను కూడ పావనము చేయునది అగు రూపముగల నీకు నమస్కారము (15). నీ రూపము శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమగు కర్పూరమువలె తెల్లనైనది. చేతులతో అభయవరదముద్రలను, శూలమును, కపాలమును ధరించిన యోగీశ్వరుడవగు నీకు నమస్కారము (16). ఎవని శరీరమునుండి ప్రధానము, పురుషుడు ఉద్భవించినవో, అట్టి ఇంద్రియ గోచరము కాని రూపము గల శంకరునకు అనేక నమస్కారములు (17). బ్రహ్మ రూపములో సృష్టిని, విష్ణు రూపములో స్థితిని, రుద్ర రూపములో సంహారమును చేయు నీకు అనేక నమస్కారములు (18). నీవు సర్వశ్రేష్ఠుడవు. పరమాత్మవు. వివిధ విద్యలు నీ స్వరూపమే నీవు హరుడవు. జ్ఞానముచేత మాత్రమే లభ్యమయ్యే సద్ఘనుడగు పరబ్రహ్మ నీవే (19), నమో నమః కారణకారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ | సమస్తలో కాంతర భూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ || 20 యస్యాsపరం నో జగదు చ్యతే పదాత్ క్షితిర్దిశస్సూర్య ఇందు ర్మనోజః | బహిర్ముఖా నాభితశ్చాంతరింక్షం తసై#్మ తుభ్యం శంభ##వే మే నమోsస్తు || 21 యస్య నాదిర్న మధ్యం చ నాంతమస్తి జగద్యతః | కథం స్తోష్యామి తం దేవం వా ఙ్మనోsగోచరం హరమ్ || 22 సర్వకారణకారుణుడు, దివ్యమగు అమృతము వంటి జ్ఞాన సంపదను ఇచ్చువాడు, ఇతర పుణ్యలోకములలో కూడా సంపదనిచ్చువాడు, ప్రకాశస్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము (20). భూమి, దిక్కులు, సూర్య చంద్రులు, మన్మథుడు ఇత్యాది జగత్తు శివుని కంటె భిన్నముగా లేదని శాస్త్రము బోధించుచున్నది. అంతర్ముఖులే గాక, బహిర్ముఖులు కూడా ఆయన స్వరూపమమే. ఆయన నాభినుండి అంతరిక్షము ఉదయించినది. హే శంభో! అట్టి నీకు నా నమస్కారము (21). ఎవనికి ఆదిమధ్యాంతములు లేవో, ఎవని నుండి జగత్తు పుట్టినదో అట్టి, వాక్కునకు మనస్సునకు గోచరము కాని ఆ దేవుని శివుని నేను ఎట్లు స్తుతించగలను? (22). యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చ తపోధనా ః | న విప్రణ్వంతి రూపాణి వర్ణ నీయాః కథాం సమే || 23 స్త్రి యా మయా తే కింజ్ఞేయా నిర్గుణస్య గుణాః ప్రభో | నైవ జానంతి యద్రూపం సేంద్రా అపి సురాసురాః || 24 నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ | ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోsస్తుతే || 25 ఎవని రూపములను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులగు మునులు కూడ వర్ణింపజాలరో అట్టి రూపములను నేనెట్లు వర్ణించగలను ? (23). హే ప్రభూ! ఎవని రూపమును ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడ తెలియ జాలరో, ఇట్టి నిర్గుణుని గుణములను స్త్రీనగు నేనెట్లు తెలియగలను? (24). ఓ మహేశ్వరా! నీకు నమస్కారము. తపస్స్వరూపుడవగు హే శంభో! నీకు నమస్కారము. నాపై దయచూపుము. హే దేవదేవా! నీకు అనేక నమస్కారములు (25). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచస్తస్యా స్సంస్తుతః పరమేశ్వరః | సుప్రసన్నతరశ్చా భూ చ్ఛంకరో భక్తవత్సలః || 26 అథ తస్యాశ్శరీరం తు వల్కలాజిన సంయుతమ్ | పరిచ్ఛిన్నం జటావ్రాలైః పవిత్రే మూర్ధ్ని రాజితైః || 27 హిమానీ తర్జితాం భోజసదృశం వదనం తదా | నిరీక్ష్య కృపయావిష్టో హరః ప్రోవాచ తామిదమ్ || 28 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆమె చేసిన ఈ స్తుతిని విని పరమేశ్వరుడు, భక్తవత్సలుడు అగు శంకరుడు మరింత ప్రసన్నుడాయెను (26). ఆమె శరీరముపై నార బట్టను, మృగచర్మమును ధరించి యుండెను. పవిత్రమగు ఆమె శిరస్సుపై కేశములు జడలు కట్టి ప్రకాశించెను (27). ఆమె ముఖము మంచు దెబ్బకు వాడిపోయిన పద్మమువలె నుండెను. ఆమెను చూచి దయ కలిగిన హరుడు ఆమెతో నిట్లనెను (28). మహేశ్వర ఉవాచ | ప్రీతాస్మి తపసా భ##ద్రే భవత్యాః పరమేణ వై | స్తవేన చ శుభ ప్రాజ్ఞే వరం వరయ సాంప్రతమ్ || 29 యేన తే విద్యతే కార్యం వరేణాస్మిన్మనోగతమ్ | తత్కరిష్యే చ భద్రం తే ప్రసన్నోsహం తవ వ్రతైః || 30 మహేశ్వరుడిట్లు పలికెను - హే భ##ద్రే! నీవు చేసిన గొప్ప తపస్సు చేత, స్తోత్రముచే త నేను ప్రీతుడనైతిని. ఓ శుభకరమగు బుధ్ధి గలదానా! ఇపుడు వరమును కోరుకొనుము (29). నీ మనస్సులో నున్న కార్యసిద్ధిని నేను కలిగించెదను. వరమునిచ్చెదను. నీకు మంగళమగు గాక ! నీ వ్రతములచే నేను ప్రసన్నుడనైతిని (30). బ్రహ్మోవాచ | ఇతి శ్రుత్వా మహేశస్య ప్రసన్న మనసస్తదా | సంధ్యో వా చ సుప్రసన్నా ప్రణమ్య చ ముహుర్ముహుః || 31 బ్రహ్మ ఇట్లు పలికెను - అపుడు ప్రసన్నమగు మనస్సు గల మహేశ్వరుని ఈ మాటను విని, సంధ్య మిక్కిలి ఆనందించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి ఇట్లు పలికెను (31). సంధ్యోవాచ | యది దేయో వరః ప్రీత్యా వరయోగ్యాస్మ్యహం యది | యది శుద్ధాస్మ్యహం జాతా తస్మాత్పాపాన్మహేశ్వర || 32 యది దేవ ప్రసన్నోsసి తపసా మమ సాంప్రతమ్ | వృతస్తదాయం ప్రథమో వరో మమ విధీయతా మ్ || 33 ఉత్పన్న మాత్రా దేవేశ ప్రాణినోస్మిన్న భస్థ్సలే | న భవంతు సమే నైవ సకామ స్సంభవంతు వై || 34 యద్ధి వృత్తా హి లోకేషు త్రిష్వసి ప్రథితా యథా | భవిష్యామి తథా నాన్యా వర ఏకో వృతో మయా || 35 సంధ్య ఇట్లు పలికెను - ఓ మహేశ్వరా! ప్రీతితో వరము నిచ్చే పక్షములో, నేను వరమునకు యోగ్యురాలను అయినచో, నేను ఆ పాపమునుండి శుద్ధురాలను అయినచో (32), హే దేవా! నా ఈ తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచో, నాకు దీనిని మొదటి వరముగా నీయవలెను (33). హే దేవదేవా! ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుక తోడనే కామము గలవి గా పుట్టకుండుగాక! (34). జరిగిన వత్తాంతము ముల్లోకములలో ప్రసిద్ధి చెంది నేను అపకీర్తిని పొందకుండునట్లు అనుగ్రహించుడు. ఇది నేను కోరు వరములలో ఒకటి (35). సకామా మమ దృష్టిస్తు కుత్ర చిన్న పతిష్యతి | యో మే పతిర్భవేన్నాథ సోsపి మేsతిసుహృచ్చ వై || 36 యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషమ్ | నాశం గమిష్యతి తదా స చ క్లీబో భవిష్యతి || 37 ఏ వ్యక్తిపైననూ కామముతో గూడిన నా చూపు పడకుండుగాక! హేనాథా! నాకు భర్తయగు వ్యక్తి నాకు మంచి మిత్రుడై ఉండవలెను (36).నన్ను కామముతో చూచు వ్యక్తి యొక్క పురుషత్వము నశించి, వాడు నపుంసకుడు కావలెను (37). బ్రహ్మోవాచ | ఇతి శ్రుత్వా వచస్తస్యా శ్శంకరో భక్తవత్సలః | ఉవాచ సుప్రసన్నాత్మా నిష్పాపాయాస్తయేరితే || 38 బ్రహ్మ ఇట్లు పలికెను - భక్త వత్సలుడగు శంకరుడు సర్వపాపవినిర్ముక్తురాలగు ఆమె పలుకులు విని మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (38). మహేశ్వర ఉవాచ | శృణు దేవి చ సంధ్యే త్వం త్వత్పాపం భస్మతాం గతమ్ | త్వయి త్యక్తో మయా క్రోధః శుద్ధా జాతా తపః కరాత్ || 39 యద్యద్వృతం త్వయా భ##ద్రే దత్తం తదఖిలం మయా | సుప్రసన్నేన తపసా తవ సంధ్యే వరేణ హి || 40 ప్రథమం శైశవో భావః కౌమారాఖ్యో ద్వితీయకః | తృతీయో ¸°వనో భావశ్చతుర్థో వార్ధకస్తథా || 41 తృతీయే త్వథ సంప్రాప్తే వయో భాగే శరీరిణః | సకామాస్స్యుర్ద్వితీయాంతే భవిష్యతి క్వచిత్ క్వచిత్ || 42 మహేశ్వరుడిట్లు పలికెను - ఓ సంధ్యాదేవీ!వినుము. నీ పాపము నశించినది. నీవు తపస్సును చేసి శుద్ధురాలవైతివి. నీపై గల కోపమును నేను వీడితిని (39). ఓ మంగళస్వరూపులారా! సంధ్యా! నీ తపస్సు చేత, మరియు వరముల చేత నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని నీవు కోరిన వరములనన్నిటినీ నేను ఇచ్చితిని (40). మానవులు ముందుగా శైశవము , తరువాతరెండవదియగు కౌమారము, మూడవదియగు ¸°వనము, నాల్గవదియగు వార్ధకము అను దశలను క్రమముగా పొందెదరు (41). ప్రాణులు మూడవది యగు ¸°వనమును పొందినప్పుడు కామ భావనను కలిగియుందురు. కొన్ని సందర్భములలో రెండవది యగు కౌమారావస్థ అంతములో కూడా వారు సకాములు కావచ్చును (42). తపసా తవ మర్యాదా జగతి స్థాపితా మయి | ఉత్పన్నమాత్రా న యథా సకామాస్స్యుశ్శరీరిణః || 43 త్వం చ లోకే సతీభావం తాదృశం సమవాప్నుహి | త్రిషు లోకేషు నాన్యస్యా యాదృశం సంభవిష్యతి || 44 యః పశ్యతి సకామస్త్వాం పాణి గ్రాహమృతే తవ | స సద్య ః క్లీబతాం ప్రాప్య దుర్బలత్వం గమిష్యతి || 45 పతిస్తవ మహాభాగస్తపోరూపసమన్వితః | సప్త కల్పాంత జీవీ చ భవిష్యతి సహ త్వయా || 46 ప్రాణులు పుట్టుక తోడనే కామభావన గలవారు కాకుండుగాక! అను మర్యాదను నేను నీ తపస్సునకు మెచ్చి, లోకములో స్థాపించుచున్నాను (43). ముల్లోకములలో ఇతర స్త్రీల కెవ్వరికీ లేని పాతివ్రత్య భావమును నీవు పొందుము (44). నిన్ను చేపట్టిన నీ భర్త తక్క , ఇతరులెవరైననూ నిన్ను కామముతో చూచినచో, అట్టి వ్యక్తి వెంటనే నపుంసకుడై దుర్బలుడగును (45). నీ భర్త మహాత్ముడు, తపశ్శాలి, రూపము గలవాడు అగును. నీభర్త నీతో గూడి ఏడు కల్పములు పూర్తి యగు వరకు జీవించును (46). ఇతి తే యే వరా మత్తః ప్రార్థితాస్తే కృతా మయా | అన్యచ్చ తే వదిష్యామి పూర్వజన్మని సంస్థితమ్ || 47 అగ్నౌ శరీరత్యాగస్తే పూర్వమేవ ప్రతిశ్రుతః | తదుపాయం వదామి త్వాం తత్కురుష్వ న సంశయః || 48 స చ మేధాతిథిర్యజ్ఞే మునిః ద్వా దశవార్షికే |కృత్స్న ప్రజ్వలితే వహ్నా వచిరాత్ క్రియతాం త్వయా || 49 ఏత చ్ఛైలోపత్యకాయాం చంద్ర భాగానదీ తటే | మేధాతిథిర్మహాయజ్ఞం కురుతే తాపసాశ్రమే || 50 ఈ తీరున నేను నీవు కోరిన వరములనన్నిటినీ ఇచ్చితిని. పూర్వజన్మలో జరిగిన వృత్తాంతము నొకదానిని నీకిప్పుడు చెప్పెదను (47). నీవు అగ్నిలో శరీరమును విడువవలెననని పూర్వమే ప్రతిజ్ఞను చేసితివి. నేను ఆవిషయములో ఒక ఉపాయమును చెప్పెదను. నీవు దానిని తప్పక అమలు చేయుము (48) . మేధాతిథియను మహర్షి పన్నెండు సంవత్సరముల యజ్ఞమును చేయుచున్నాడు . నీవు తొందరలో అచట చక్కగా ప్రజ్వరిల్లిన అగ్నియందు దేహమును వీడుము (49). ఈ పర్వత సమీప భూమియందు చంద్ర భాగానదీ తీరములోని ఒక తాపసాశ్రమములో మేధాతిథి ఆ మహా యజ్ఞమును చేయుచున్నాడు (50). తత్ర గత్వా స్వయం ఛందం మునిభిర్నో పలక్షితా | మత్ర్పసాదాద్వహ్ని జాతా తస్య పుత్రీ భవిష్యసి || 51 యస్తే వరో వాంఛనీయ స్స్వామీ మనసి కశ్చన | తం నిధాయ నిజస్వాంతే త్యజ వహ్నౌ వపుస్స్వకమ్ || 52 యదా త్వం దారుణం సంధ్యే తపశ్చరసి పర్వతే |యావచ్చతుర్యుగం తస్య వ్యతీతే తు కృతే యుగే || 53 త్రేతాయాః ప్రథమే భాగే జాతా దక్షస్య కన్యకాః | వాక్పాశ్శీల సమాపన్నా యథా యోగ్యం వివాహితాః || 54 నీవు నీ ఇచ్ఛననుసరించి అచటకు వెళ్లుము. నా అనుగ్రహముచే నీవు మునులకు కానరావు. నీవు అగ్ని హోత్రమునుండి జన్మించి, అతని పుత్రివి కాగలవు (51). నీ మనస్సు లో నీకు నచ్చిన ప్రియుని స్మరించుచూ నీ దేహమును అగ్ని యందు వీడుము (52). ఓ సంధ్యా! నీవీ పర్వతమునందు ఒక మహా యుగ కాలము ఘోరతపస్సును చేసితివి. ఆ సమయములో కృతయుగము గడచెను (53). అపుడు త్రేతాయుగములోని మొదటి పాదములో దక్షునకు అనేక కన్యలు జన్మించిరి. వారు మిత భాషిణులు. మరియు శీలము గలవారు. దక్షుడు వారికి యథోచితముగా వివాహములను చేసెను (54). తన్మధ్యే స దదౌ కన్యా విధవే సప్తవింశతిః | చంద్రోsన్యాస్సంపరిత్యజ్య రోహిణ్యాం ప్రీతిమానభూత్ || 55 తద్ధేతోర్హి యదా చంద్రశ్శప్తో దక్షేణ కోపినా |తదా భవత్యా నికటే సర్వే దేవాస్సమాగతాః || 56 న దృష్టాశ్చ త్వయా సంధ్యే తే దేవా బ్రహ్మాణా సహ | మయి విన్యస్త మనసా ఖం చ దృష్ట్వా లభేత్పునః || 57 చంద్రస్య శాపమోక్షార్థం జాతా చంద్రనదీ తదా | సృష్టా ధాత్రా తదైవాత్ర మేధాతిథి రుపస్థితః || 58 ఆ కన్యలలో ఇరవై ఏడు మందిని ఆయన చంద్రునకిచ్చి వివాహము చేసెను. చంద్రుడు ఇతరభార్యలను పట్టించుకొనక, రోహిణి యందు మాత్రమే ప్రీతిని కలిగియుండెను (55). ఆ కారణముచే దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరు నీవు ఉన్న ఈ చోటకు వచ్చిరి (56) ఓ సంధ్యా!బ్రహ్మతో కూడి వచ్చిన ఆ దేవతలను నాయందు లగ్నమైన మనస్సుగల నీవు చూడలేదు. బ్రహ్మ ఆకసమును చూచి, చంద్రుడు తన పూర్వ రూపమును ఎట్లు పొందునో యని చింతిల్లెను (57). బ్రహ్మ చంద్రుని శాపవిముక్తి కొరకు చంద్రభాగానదిని సృష్టించెను. అదే సమయములో అచటకు మేధాతిథి విచ్చేసెను | (58). తపసా తత్సమో నాస్తి న భూతో న భవిష్యతి | యేన యజ్ఞస్సమారబ్ధో జ్యోతిష్టోమో మహావిధిః || 59 తత్ర ప్రజ్వలితో వహ్నిస్తస్మింస్త్యజ వపుస్స్వకమ్ | సుపవిత్రా త్వమిదానీం సంపూర్ణోsసుతు పణస్తవ || 60 ఏతన్మయా స్థాపితం తే కార్యార్థం భో తపస్విని | తత్కురుష్వ మహాభాగే యాహి యజ్ఞే మహామునేః || 61 తస్యా హితం చ దేవేశస్తత్రై వాంతరధీయత || 62 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ షష్ఠోsధాయః (6). తపస్సులో ఆయనతో సమానమైన వాడు మరియొకడు లేడు. ఉండబోడు. ఆయన అతివిస్తృతమైన జ్యోతిష్టోమమనే యజ్ఞమునారంభించినాడు (59). అచట అగ్ని ప్రకాశించుచున్నది. నీవు నీ దేహమును దానియందు విడువుము. ఇప్పుడు నీవు మిక్కిలి పవిత్రురాలవు. నీ ప్రతిజ్ఞ నెరవేరుగాక! (60). ఓతపస్వినీ! ఈ తీరున నేను నీ కార్యములను సిద్దింపజేసితిని. ఓ మహాత్మురాలా!నేను చెప్పినట్లు చేయుము. ఆ మహాముని యజ్ఞము చేయుచున్న చోటకు వెళ్లుము (61). ఇట్లు దేవదేవుడు ఆమెకు హితమునుపదేశించి అచటనే అంతర్ధానము నొందెను (62). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండమునందు సంధ్యా చరిత్ర వర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).