Sri Sivamahapuranamu-I
Chapters
అథ ఏకాదశోsధ్యాయః దుర్గాస్తుతి నారద ఉవాచ | బ్రహ్మన్ తాత మహాప్రాజ్ఞ వదనో వదతాం వర | గతే విష్ణౌ కిమభవత్ అకార్షీత్కింవిధే భవాన్ ||
1 నారదుడిట్లు పలికెను - తండ్రీ! బ్రహ్మన్! నీవు మహా బుద్ధిశాలివి. వక్తలలో శ్రేష్ఠుడవు. మాకు చెప్పుము. విష్ణువు నిష్క్రమించిన తరువాత ఏమయ్యెను? హే విధీ! నీవు ఏమి చేసితివి ?(1). బ్రహ్మోవాచ | విప్రనందన వర్య త్వం సావధానతయా శృణు | విష్ణౌ గతే భగవతి యదకార్ష మహం ఖలు ||
2 విద్యావిద్యాత్మికాం శుద్ధాం పరబ్రహ్మస్వరూపి ణీమ్ | స్తౌమి దేవీం జగద్ధాత్రీం దుర్గాం శంభుప్రియాం సదా ||
3 సర్వత్ర వ్యాపినీం నిత్యాం నిరాలంబాం నిరాకులామ్ | త్రిదేవజననీం వందే స్థూల స్థూల మరూపిణీమ్ ||
4 త్వంచితిః పరమానందా పరమాత్మ స్వరూపిణీ | ప్రసన్నా భవ దేవేశి మత్కార్యం కురు తే నమః ||
5 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీవు సావధానముగా వినుము. విష్ణుభగవానుడు నిష్క్రమించగనే నేను చేసిన కార్యమేదియో చెప్పెదను (2). విద్యాస్వరూపిణి, మరియు అవిద్యా స్వరూపిణి, శుద్ధ పరబ్రహ్మ రూపిణి, జగన్మాత, సర్వదా శివప్రియ అగు దుర్గాదేవిని స్తుతించెదను (3). సర్వవ్యాపకురాలు, నిత్యస్వరూపిణి, ఇతర ఆశ్రయము లేనిది, సంసార దుఃఖములు లేనిది, ముల్లోకములకు తల్లి, గొప్ప వాటి కంటె కూడ గొప్పది, రూపము వాస్తవముగా లేనిది అగు దుర్గను నమస్కరించు చున్నాను (4). చైతన్యము, బ్రహ్మానందము నీవే . నీవే పరమాత్మ స్వరూపిణివి. దేవదేవీ! నీవు ప్రసన్నురాలవు కమ్ము. నా కార్యము సిద్ధింపజేయుము. నీకు నమస్కారము (5). ఏవం సంస్తూయమానా సా యోగ నిద్రా మయా మునే | ఆవిర్బ భూవ ప్రత్యక్షం దేవర్షే చండికా మమ || 6 స్నిగ్ధాంజన ద్యుతి శ్చారురూపా దివ్య చతుర్భుజా | సింహస్థా వరహస్తా చ ముక్తామణికచోత్కటా || 7 శరదింద్వాననా శుభ్ర చంద్ర భాలా త్రిలోచనా | సర్వావయవరమ్యా చ కమలాంఘ్రి నఖద్యుతిః || 8 సమక్షం తాముమాం వీక్ష్యమునే శక్తిం శివస్య హి | భక్త్యా వినతతుంగాంశః ప్రాస్తవం సుప్రణమ్య వై || 9 ఓ మహర్షీ! నేను యోగనిద్రను ఇట్లు స్తుతించితిని| ఓ దేవర్షీ! అపుడు నా ఎదుట చండిక ప్రత్యక్షమయ్యెను (6). చిక్కని కాటుక వలె ప్రకాశించునది, సుందరమగు రూపము గలది, ప్రకాశించు నాల్గు భుజములు గలది, సింహము నధిష్ఠించి యున్నది, చేతియందు వరముద్ర గలది, ముత్యములచే నొప్పు చూడా మణితో ప్రకాశించే కేశభారము గలది (7), శరత్కాల చంద్రుని వంటి ముఖము గలది, చంద్రుని వలె స్వచ్ఛమైన ఫాలభాగము కలది, మూడు కన్నులు గలది, సర్వాంగసుందరి, పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఒప్పారునది (8), శివుని శక్తి అగు ఆ ఉమాదేవిని నా ఎదుట గాంచితిని. ఓ మహర్షీ! నేను భక్తితో శిరస్సును వంచి నమస్కరించి స్తుంతిచితిని (9). నమో నమస్తే జగతః ప్రవృత్తి నివృత్తి రూపే స్థితి సర్గ రూపే | చరా చరాణాం భవతీ సుశక్తిః సనాతనీ సర్వ విమోహి నీతి || 10 యా శ్రీస్సదా కేశవమూర్తి మాలా విశ్వంభరా యా సకలం బిభర్తి | యాత్వం పురా సృష్టి కరీ మహేశీ హర్త్రీ త్రిలోకస్య గుణభ్యః || 11 యా యోగినాం వై మహితా మనోజ్ఞా సా త్వం నమస్తే పరమాణుసారే | యమాది పూతే హృది యోగినాం యా యా యోగినాం ధ్యానపథే ప్రతీతా || 12 ఓతల్లీ! జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే. జగత్తు యొక్క సృష్టిస్థితులు నీ స్వరూపమే. స్థావరజంగ మాత్మకమగు ప్రాణులలో నీవు శక్తి రూపముగ నుండి సర్వప్రాణులను మోహపెట్టుచున్నావు. నీవు సనాతనివి. నీకు అనేక నమస్కారములు (10). కేశవుని వక్షస్థ్సలమునందు అలంకారముగా నుండు లక్ష్మీదేవి నీవే. సకలమును భరించి పోషించు నీవు విశ్వంభరవు. నీవు సృష్టిని చేసిన మహేశ్వరివి. ముల్లోకములను లయము చేయునది నీవే.నీవు గుణాతీతురాలవు (11). యోగులు నిన్ను పూజించి తమ హృదయములలో దర్శించెదరు.అట్టి నిన్ను నమస్కరించుచున్నాను. పరమాణువులలోని సారము (శక్తి) నీవే. యమనియమాదులచే పవిత్రమైన యోగుల హృదయములలో నీవు ఉండి వారికి ధ్యాన మార్గములో దర్శనము నిచ్చెదవు (12). ప్రకాశ శుద్ధ్యాది యుతా విరాగా సా త్వం హి విద్యా వివిధావలంబా | కూటస్థ మవ్యక్త మనంతరూపం త్వం బిభ్రతీ కాలమయీ జగంతి || 13 వికారబీజం ప్రకరోషి నిత్యం గుణాన్వితా సర్వజనేషు నూనమ్ | త్వం వై గుణానాం చ శివే త్రయాణాం నిదాన భూతా చ తతః పరాసి || 14 స త్వం రజస్తామస ఇత్యమీషాం వికారహీనా సమవస్థితిర్యా | సా త్వం గుణానాం జగదేక హేతుః బ్రహ్మాండమారంభసి చాత్సి పాపి || 15 అశేష జగతాం బీజే జ్ఞేయజ్ఞాన స్వరూపిణి | జగద్ధితాయ సతతం శివపత్ని నమోsస్తుతే || 16 ప్రకాశము, శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాగ ద్వేషములు లేవు. వివిధ శాస్త్ర విజ్ఞానములకు సంబంధించిన విద్యలన్నియూ నీ స్వరూపమే. నీ స్వరూపము కూటస్థము (మార్పులకు లోను కానిది), మరియు ఇంద్రియములకు అగోచరము. నీవే అనంత రూపములతో ప్రకటమైనావు. నీవు కాల స్వరూపురాలై ముల్లోకములను ధరించి యున్నావు (13). నీవు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యా రూపములో నున్నావనుట నిశ్చయము. హే శివప్రియే! మూడు గుణములకు ఆశ్రయము నీవే. మరియు నీవు గుణాతీతురాలవై యున్నావు (14). సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ గుణముల వికారములు నీయందు లేవు. కాని వాటి ఉనికి నీ యందు మాత్రమే గలదు. జగత్తునకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే. నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించి, రక్షించి, భక్షించుచున్నావు (15). సర్వజగత్తుల బీజము నీవే. జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే. హే శివపత్ని! లోకముల క్షేమమును కోరి నేను సర్వదా నీకు నమస్కరించుచున్నాను (16). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచస్సామే కాలీ లోకవిభావినీ | ప్రీత్యా మాం జగతామూచే స్రష్టారం జనశబ్దవత్ || 17 బ్రహ్మ ఇట్లు పలికెను - ఈ నా మాటను విని లోకరక్షకురాలగు ఆ కాళీదేవి సృష్టికర్తనగు నాతో ప్రీతితో, తల్లి పిల్లవానిని వలె లాలించి, ఇట్లు పలికెను (17). దేవ్యువాచ| బ్రహ్మన్ కిమర్థం భవతా స్తుతాహ మవధారయ | ఉచ్యతాం యది ధృష్యోసి తచ్ఛీఘ్రం పురతో మమ || 18 ప్రత్యక్షమపి జాతాయాం సిద్ధిః కార్యస్య నిశ్చితా | తస్మాత్త్వం వాంఛితం బ్రూహి యా కరిష్యామి భావితా || 19 దేవి ఇట్లు పలికెను - హే బ్రహ్మన్! నీవు నా ఎదుట ధైర్యము గలవాడైనచో, నీవు నన్ను స్తుతించుటకు గల కారణమును వెంటనే నిశ్చయముగా చెప్పుము (18). నేను ప్రత్యక్షమైన పిదప కార్యము సిద్ధించుట నిశ్చయము. కావున నీవు నీ కోర్కెను తెలుపుము. నీచే ఆరాధింపబడిన నేను నీ కోర్కెను తీర్చెదను (19). బ్రహ్మోవాచ | శృణు దేవి మహేశాని కృపాం కృత్వా మమోపరి |మనోరథస్థం సర్వజ్ఞే ప్రవదామి త్వదాజ్ఞయా || 20 యః పతిస్తవ దేవేశి లలాటాన్మేsభవత్పూరా | శివో రుద్రాఖ్యయా యోగీ స వై కైలాస మాస్థితః || 21 తపశ్చరతి భూతేశ ఏక ఏవావి కల్పకః | అపత్నీకో నిర్వికారో న ద్వితీయాం సమీహతే || 22 తం మోహయ యథా చాన్యాం ద్వితీయాం సతి వీక్షతే | త్వదృతే తస్య నో కాచిద్భ విష్యతి మనోహరా || 23 బ్రహ్మ ఇట్లు పలికెను - దేవీ! మహేశ్వరీ! నాపై దయఉంచి వినుము. నీవు సర్వము నెరుంగుదువు. అయిననూ నీ ఆజ్ఞచే నా మనస్సులోని కోర్కెను చెప్పెదను (20). హే దేవేశీ! నీ భర్త పూర్వము నా నుదుటి నుండి ప్రకటమయ్యెను గదా ! ఆ శివ యోగి రుద్రనామముతో కైలాసముపై నున్నాడు (21). కూటస్థుడు (పరివర్తన లేని వాడు) అగు ఆ భూతనాథుడు అచట తపస్సును చేయు చున్నాడు. భార్యా సహాయము లేనివాడు, వికారహీనుడు అగు ఆ ప్రభువు భార్యా సహాయమును కోరుట లేదు (22). ఓ పతివ్రతా! ఆతడు వివాహమాడుట కొరకై నీవాయనను మోహింపజేయుము. నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షించగలవారు మరియొకరు లేరు (23). తస్మాత్త్వమేవ రూపేణ భవస్వ హరమోహినీ | సుతా భూత్వా చ దక్షస్య రుద్రపత్నీ శివే భవ || 24 యథా ధృత శరీరా త్వం లక్ష్మీ రూపేణ కేశవమ్ | ఆమోదయసి విశ్వస్య హి తా యైతం తథా కురు || 25 కాంతాభిలాష మాత్రం మే దృష్ట్వాsనిందద్వృషధ్వజః | స కథం వనితాం దేవి స్వేచ్ఛయా సంగ్రహీష్యతి || 26 హరేsగృహీత కాంతే తు కథం సృష్టి శ్శుభావహా | ఆద్యంత మధ్యే చైతస్య హౌ తౌ తస్మిన్ విరాగిణి || 27 కావున నీవే దక్షునకు కుమార్తెగా జన్మించుము. హే శివే! నీవు నీ రూపముతో రుద్రుని మోహింప జేసి ఆయనకు భార్యవు అగుము (24). నీవు లక్ష్మీరూపముతో శరీరమును ధరించి కేశవుని అలరించినావు. లోక కళ్యాణము కొరకు రుద్రుని కూడ అటులనే చేయుము (25). ఓ దేవీ! నేను కాంతను అభిలషించినంత మాత్రాన నన్ను నిందించిన ఆ వృషభధ్వజుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించుట ఎట్లు సంభవమగును ? (26). ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతములకు కారణభూతుడైన ఆ హరుడు విరాగియై భార్యను స్వీకరించని స్థితిలో ఈ సృష్టి మంగళకరము ఎట్లు కాగల్గును ?(27). ఇతి చింతాపరో నాహం త్వదన్యం శరణం హి తమ్ | కృచ్ఛ్ర వాంస్తే న విశ్వస్య హితాయైతత్కురుష్వమే || 28 న విష్ణుస్త స్య మోహాయ న లక్ష్మీర్నమనో భవః | న చాప్యహం జగన్మాత ర్నాన్యస్త్వాం కోపి వై వినా || 29 తస్మాత్త్వం దక్షజా భూత్వా దివ్యరూపా మహేశ్వరీ | తత్పత్నీ భవ మద్భక్త్యా యోగినం మోహయేశ్వరమ్ || 30 దక్షస్తపతి దేవేశి క్షిరోదోత్తర తీరగః | త్వాముద్దిశ్య సమాధాయ మనస్త్వయి దృఢవ్రతః || 31 ఈ చింత నన్ను పీడించుచున్నది. నీవు తప్ప మరియొకరు నాకు శరణు లేరు. నేనీ కష్టములో నున్నాను. కాన, లోకహితమును గోరి నా కోరికను దీర్చుము (28). ఆయనను విష్ణువు గాని, లక్ష్మిగాని, మన్మథుడు గాని, నేను గాని మోహపెట్టలేము. ఓ జగన్మాతా! నీవు తప్ప మరియొకరి వలన ఈ పని కాదు (29). కావున, నీవు దక్షుని కుమార్తెగా జన్మించి, దివ్యరూపము గల దానవై, యోగియగు ఈశ్వరుని మోహింపజేసి ఆయనకు భార్యవు కమ్ము. మహేశ్వరీ! నా భక్తిని ఈ విధముగా సఫలము చేయుము (30). ఓ దేవ దేవీ! దక్షుడు క్షీర సముద్ర ఉత్తర తీరమునందు దృఢమగు వ్రతము గలవాడై మనస్సును నీయందు లగ్నము చేసి నిన్ను ఉద్దేశించి తపస్సును చేయు చున్నాడు (31). ఇత్యాకర్ణ్య వచస్సా చింతామాప శివా తదా | ఉవాచ చ స్వమనసి విస్మితా జగదంబికా || 32 ఈ మాటను విని, ఆపుడా ఉమాదేవి ఆలోచించ మొదలిడెను. ఆ జగన్మాత విస్మయమును పొంది తన మనస్సులో ఇట్లు అనుకొనెను (32). దేవ్యువాచ | అహో సుమహదాశ్చర్యం వేదవక్తాపి విశ్వకృత్ | మహా జ్ఞాన పరో భూత్వా విధాతా కిం వదత్యయమ్ || 33 విధేశ్చేతసి సంజాతో మహామోహోsసుఖావహః | యద్వరం నిర్వికారం తం సంమోహయితుమిచ్ఛతి || 34 హరమోహ వరం మత్తస్సమిచ్ఛతి విధిస్త్వయమ్ | కోలా భోస్యాత్ర సవిభుర్నిర్మోహో నిర్వికల్పకః || 35 పరబ్రహ్మాఖ్యో యశ్శం భుర్నిర్గుణో నిర్వికారవాన్ | తస్యాహం సర్వదా దాసీ తదా జ్ఞావశగా సదా || 36 దేవి ఇట్లు పలికెను - అహో! ఇది చాల పెద్ద ఆశ్చర్యము! వేద ప్రవర్తకుడు, సృష్టికర్త, మహాజ్ఞాని యగు ఈ బ్రహ్మ ఏమి మాటలాడు చున్నాడు? (33). బ్రహ్మ యొక్క మనస్సులో దుఃఖదాయకమగు మహా మోహము పుట్టినది. అందువలననే వికార రహితుడగు శివప్రభువును మోహింప జేయ గోరు చున్నాడు (34). హరుని మోహింపజేయవలెననే వరమును ఈ బ్రహ్మ నానుండి పొంద గోరుచున్నాడు దాని వలన ఈతనికి కలిగే లాభ##మేమి? ఆ విభుడు కూటస్థుడు (పరివర్తన లేని వాడు) గనుక, ఆయనను మోహింపజేయుట సంభవము కాదు (35). శివ పరబ్రహ్మ నిర్గుణుడు, నిర్వికారుడు,నేను ఆయనకు సర్వదా దాసిని. నేను అన్ని వేళలా ఆయన యొక్క ఆజ్ఞను పాలించుదానను (36). స ఏవ పూర్ణరూపేణ రుద్రనామాభవచ్ఛివః |భక్తోద్ధారణ హేతోర్హి స్వతంత్రః పరమేశ్వరః || 37 హరేర్విధేశ్చ స స్వామీ శివాన్న్యూనో న కర్హిచిత్ | యోగా దరో హ్య మాయ స్థోమాయేశః పరతః పరః || 38 మత్వా తమాత్మ జం బ్రహ్మ సామాన్య సురసన్నిభమ్ | ఇచ్ఛత్యయం మోహయితు మతోsజ్ఞాన విమోహితః || 39 న దద్యాం చేద్వరం వేదనీతిర్భ్రష్టా భ##వేదితి | కిం కుర్యాం యేన న విభుః క్రుద్ధస్స్యాన్మే మహేశ్వరః || 40 ఆ శివుడే పూర్ణాంశతో రుద్రుడను పేర భక్తులనుద్ధరించుట కొరకై అవతరించెను. ఆయన స్వతంత్రుడైన పరమేశ్వరుడు గదా! (37). హరికి బ్రహ్మకు ప్రభువగు ఆ రుద్రుడు ఏ విధముగా చూచినా శివుని కంటె తక్కువ గాడు. మాయాతీతుడు, మాయకు ప్రభువు, సర్వము కంటె శ్రేష్ఠుడు అగు ఆయనకు యోగమునందు ప్రేమ అధికము (38). అట్టి రుద్రుని సామాన్య దేవతలలో ఒకడి గను,తన పుత్రునిగను తలంచి, అజ్ఞానముచే పూర్తిగా మోహితుడైన ఈ బ్రహ్మ ఆయనను మోహపెట్టవలెనని గోరుచున్నాడు (39). ఈతనికి వరము నీయనిచో, వేద ధర్మము పాడగును. నేనేమి చేయవలెను? నా ప్రభువగు మహేశ్వరునకు నాపై కోపమురాని విధముగా చేయవలెను (40). బ్రహ్మోవాచ | విచార్యేత్థం మహేశం తం సస్మార మనసా శివా | ప్రాపానుజ్ఞాం శివస్యాథోవాచ దుర్గా చ మాం తదా || 41 బ్రహ్మ ఇట్లు పలికెను - ఇట్లు తలచి ఆ ఉమాదేవి మనస్సులో ఆ మహేశ్వరుని స్మరించెను. అపుడు ఆ దుర్గాదేవి శివుని అనుజ్ఞను పొంది నాతో ఇట్లనెను (41). దుర్గోవాచ | యదుక్తం భవత బ్రహ్మన్ సమస్తం సత్యమేవ తత్ | మదృతే మోహయిత్రీహ శంకరస్య న విద్యతే || 42 హరేsగృహీతదారే తు సృష్టిర్నైషా సనాతనీ | భవిష్య తీతి తత్సత్యం భవతా ప్రతిపాదితమ్ || 43 మమాపి మోహనే యన్నో విద్యతేsస్య మహాప్రభోః | త్వద్వాక్యాద్ధ్విగుణో మేsద్య ప్రయత్నోsభూత్స నిర్భరః || 44 అహం తథా యతిష్యామి యథా దారపరిగ్రహమ్ | హరః కరిష్యతి విధే స్వయమేవ విమోహితః || 45 దుర్గాదేవి ఇట్లనెను - బ్రహ్మన్! నీవు చెప్పినదంతయూ వాస్తవమే. నేను తక్క మరియొకరు శంకరుని మోహింపజేయలేరు (42). శివుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతనమగు సృష్టి పూర్ణము కాబోదని నీవు చేసిన ప్రతి పాదన వాస్తవము (43). ఆ మహాప్రభూవును మోహపెట్టగలననే విశ్వాసము నాకు కూడ లేకుండెను. కాని నా విశ్వాసము నీ మాటలను వినుటచే రెట్టింపు అయ్యెను. ఇపుడు నేను దృఢముగా యత్నించెదను (44). హే బ్రహ్మన్! శివుడు విమోహితుడై స్వయముగా భార్యను స్వీకరించునట్లు నేను ప్రయత్నించెదను (45). సతీమూర్తి మహం ధృత్వా తసై#్యవ వశవర్తినీ | భవిష్యామి మహాభాగా లక్ష్మీ ర్విష్ణోర్యథా ప్రియా || 46 యథా సోsపి మయైవ వశవర్తీ సదా భ##వేత్ | తథా యత్నం కరిష్యామి తసై#్యవ కృపయా విధే || 47 ఉత్పన్నా దక్ష జాయాయాం సతీరూపేణ శంకరమ్ |అహం సభాజయిష్యామి లీలయాతం పితామహ || 48 యథాన్య జంతురవనౌ వర్తతే వనితావశే | మద్భక్త్యా సహరో వామావశవర్తీ భవిష్యతి || 49 నేను సతీదేవి రూపమును ధరించి, మహాపతివ్రతయగు లక్ష్మి విష్ణునకు ప్రియురాలు అయిన తీరున, ఆయనకు వశవర్తిని కాగలను (46). హే బ్రహ్మన్! ఆయన అనుగ్రహమును పొంది, ఆయన నాకు సర్వదా అధీనుడై యుండునట్లు కూడ ప్రయత్నించెదను (47). హే పితామహా! నేను దక్షుని భార్య యందు సతీదేవి రూపముతో జన్మించి నా లీలతో శంకరుని సంతోషపెట్టెదను (48). ఇతర మానవులు స్త్రీకి వశవర్తులై ఉన్న తీరుగనే, ఆ హరుడు నా భక్తికి మెచ్చి నాకు వశవర్తియై ఉండగలడు (49). బ్రహ్మోవాచ | మహ్యమిత్థం సమాభాష్య శివా సా జగదంబికా | వీక్ష్యమాణా మయా తాత తత్రైవాంతర్దధే తతః || 50 తస్యామంతర్హితాయాం తు సోsహం లోకపితామహః | అగమం యత్ర స్వసుతాస్తే భ్య స్సర్వ మవర్ణయమ్ || 51 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే దుర్గాస్తుతి బ్రహ్మ వరప్రాప్తి వర్ణనం నామ ఏకాదశోsధ్యాయః (11). బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ వత్సా! జగన్మాతయగు ఆ ఉమాదేవి నాతో నిట్లు పలికి, తరువాత నేను చూచుచుండగనే అచటనే అంతర్ధానమయ్యెను (50). లోకములకు పితామహుడనగు నేను ఆమె అంతర్ధానము కాగానే, నా కుమారులు ఉన్నచోటకు వెళ్లి, జరిగిన వృత్తాంతమునంతనూ వర్ణించితిని (51). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు సతీఖండములో దుర్గాస్తుతి - బ్రహ్మవరప్రాప్తి అనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).