Sri Sivamahapuranamu-I
Chapters
అథ వింశోsధ్యాయః సతి కైలాసమునకు పయనమగుట నారద ఉవాచ | బ్రహ్మన్ విధే మహాభాగ శివభక్తవర ప్రభో | శ్రావితం చరితం శంభోరద్భుతం మంగలాయతనమ్ || 1 తతః కిమభవత్తాత కథ్యంతాం శశిమౌలినః | సత్యాశ్చ చరితం దివ్యం సర్వాఫ°ఘవినాశనమ్ || 2 నారుదుడిట్లు పలికెను - ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! శివభక్తశ్రేష్ఠా! ప్రభూ! అద్భుతము, మంగళములకు పెన్నిధియగు శంభుని చరితమును వినిపించితివి (1). తండ్రీ! తరువాత ఏమైనది? సర్వపాప సమూహములను నశింపజేయు సతీ చంద్రశేఖరుల దివ్యచరితమును చెప్పుము (2). బ్రహ్మోవాచ | నివృత్తే శంకరే చాస్మ ద్వధాద్భక్తానుకంపిని | అభవన్నిర్భయాస్సర్వే సుఖినస్సు ప్రసన్న కాః || 3 నతస్కంధాస్సాంజలయః ప్రణముర్నిఖిలాశ్చ తే | తుష్టువు శ్శంకరం భక్త్యా చక్రుర్జయరవం ముదా || 4 ఏతస్మిన్నేవ కాలేsహం ప్రసన్నో నిర్భయో మునే | అస్తవం శంకరం భక్త్యా వివిధైశ్చ శుభస్తవైః || 5 తతస్తుష్టమనాశ్శంభుర్బహులీలాకరః ప్రభుః | మునే మాం సమువాచేదం సర్వేషాం శృణ్వతాం తదా || 6 బ్రహ్మ ఇట్లు పలికెను - భక్తులయందు దయను చూపే శంకరుడు నన్ను వధించే యత్నమునుండి నివృత్తుడు కాగా, సర్వులు భయమును వీడి సుఖమును, ప్రసన్నతను పొందిరి (3).వారందరు శిరసా ప్రణమిల్లి దోసిలి యొగ్గి శంకరుని భక్తితో స్తుతించి ఉత్సాహముతో జయధ్వానమును చేసిరి (4). ఓ మహర్షీ! అదే సమయములో నేను భయమును వీడి ప్రసన్నమగు మనస్సుతో భక్తితో వివిధ మంగళస్తోత్రములతో శంకరుని స్తుతించితిని (5). అపుడు అనేక లీలలను ప్రదర్శించే శంభు ప్రభుడు సంతసించెను. ఓ మహర్షీ! అపుడాయన అందరు వినుచుండగా నాతో ఇట్లనెను (6). రుద్ర ఉవాచ | బ్రహ్మన్ తాత ప్రసన్నోऽహం నిర్భయస్త్వం భవాధునా | స్వశీర్షం స్పృశ హస్తేన మదాజ్ఞాం కు రవసంశయమ్ || 7 రుద్రుడిట్లు పలికెను - ఓ వత్సా! బ్రహ్మా! నేను ప్రసన్నుడనైతిని. నీవు ఇపుడు భయమును విడవాడి, చేతితో నీతలను పట్టు కొనుము. నీవు సంశయమును వీడి నా ఆజ్ఞను పాలింపుము (7). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచశ్శంభోర్బహు లీలాకృతః ప్రభోః | స్పృశన్ స్వం కం తథా భూత్వా ప్రాణమం వృషభధ్వజమ్ || 8 యావదేవమహం స్వం కం స్పృశామి నిజపాణినా | తావత్తత్ర స్థితం సద్యస్త ద్రూప వృషవాహనమ్ || 9 తతో లజ్జాపరీతాంగస్థ్సి తశ్ఛాహ మధోముఖః | ఇంద్రాద్యైరమరైస్సర్వై స్సుదృష్టస్సర్వతస్థ్సితైః || 10 అథాహం లజ్జయా విష్టః ప్రణిపత్య మహేశ్వరమ్ | ప్రవోచం సంస్తుతిం కృత్వా క్షమ్యతాం క్షమ్యతామితి || 11 బ్రహ్మ ఇట్లు పలికెను - అనేక లీలలను ప్రదర్శించే శంభుప్రభుని ఈమాటను విని, నేను నా శిరస్సును సృశించుచూ, అటులనే ఉండి వృషభధ్వజుని నమస్కరించితిని (8). నేను ఎంతలో నా శిరస్సును నా చేతితో స్పృశించితినో, అంతలో అచట వృషవాహనుడగు శివుని రూపము ఉండెను (9). నేను అపుడు సిగ్గుచే ముడుచుకున్న అవయవములు గలవాడనై తలవంచి నిలబడితిని. అచట అంతటా ఉన్న ఇంద్రాది దేవతలందరు స్పష్టముగా చూచినారు (10). తరువాత నేను సిగ్గుతో నిండిన వాడనై మహేశ్వరునకు ప్రణమిల్లి, చక్కనిస్తోత్రమును చేసి, 'క్షమించుము క్షమించుము' అని పలికితిని (11). అస్య పాపస్య శుద్ధ్యర్థం ప్రాయశ్చిత్తం వద ప్రభో | నిగ్రహం చ తథా న్యాయం యేన పాపం ప్రయాతు మే || 12 ఇత్యుక్తస్తు మయా శంభురువాచ ప్రణతం హితమ్ | సుప్రసన్నతరో భూత్వా సర్వేశో భక్తవత్సలః || 13 హే ప్రభో! ఈ పాపము క్షాళితమయ్యే ప్రాయశ్చిత్తమును చెప్పుము. ఈ నా పాపము తొలగి పోవుట కొరకై, ఇంద్రియనిగ్రహమును, వివేకబుద్ధిని ప్రసాదించుము (12). భక్తవత్సలుడగు సర్వేశ్వరునితో నేను ఇట్లు పలికి నమస్కరించగా, ఆ శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (13). శంభురువాచ | అనేనైవ స్వరూపేణ మదధిష్ఠితకేన హి | తపః కురు ప్రసన్నాత్మా మదారాధనతత్పరః || 14 ఖ్యాతిం యాస్యసి సర్వత్ర నామ్నా రుద్రశిరః క్షితౌ | సాధకస్సర్వకృత్యానాం తేజోభాజాం ద్విజన్మనామ్ || 15 మనుష్యాణామిదం కృత్యం యస్మాద్వీర్యం త్వయాऽధునా | తస్మాత్త్వం మానుషో భూత్వా విచరిష్యసి భూతలే || 16 యస్త్వాం చానేన రూపేణ దృష్ట్వా కౌ విచరిష్యతి | కిమేత ద్బ్రహ్మణో మూర్ధ్ని వదన్నితి పురాంతకః || 17 శంభుడు ఇట్లు పలికెను - నేను శిరస్సును అధిష్ఠించియున్న ఈ రూపముతోనే, నీవు ప్రసన్నమగు మనస్సు గలవాడవై, నన్ను ఆరాధించుటలో నిమగ్నమై తపస్సును చేయుము (14). లోకములో సర్వత్రా నీకు రుద్ర శిరస్కుడు అను పేరు ప్రసిద్ధి గాంచ గలదు. తేజశ్శాలులగు బ్రాహ్మణులకు సర్వకార్యములను నీవు సిద్ధింపచేయ గలవు (15). నీకు జరిగిన ఈ వీర్యపతనము మానవుల లక్షణమై యున్నది. కాన నీవు నముష్యుడవై భూలోకములో సంచరించుము (16). నీవు భూలోకములో సంచరించుచుండగా నిన్ను ఎవరు చూచెదరో, వారు 'ఇది యేమి? బ్రహ్మ శిరస్సుపై శివుడు ఉన్నాడు' అని పలికెదరు (17). తతస్తే చే ష్టితం సర్వం కౌతుకాచ్ఛ్రోష్యతీతి యః | పరదారకృత త్యాగాన్ముక్తిం సద్యస్స యాస్యతి || 18 యథా యథా జనశ్చైతత్కృత్యంతే కీర్తయిష్యతి | తథా తథా విశుద్ధిస్తే పాపస్యాస్య భవిష్యతి || 19 ఏతదేవ హి తే బ్రహ్మన్ ప్రాయశ్చిత్తం మయేరితమ్ | జనహాస్యకరం లోకే తవ గర్హాకరం పరమ్ || 20 ఏతచ్చ తవ వీర్యం హి పతితం వేదిమధ్యగమ్ | కామార్తస్య మయా దృష్టం నైతద్ధార్యం భవిష్యతి || 21 ఈ నీ వృత్తాంతమునంతనూ ఉత్సుకతో ఎవరు విందురో, వారు పరదారయందలి రాగము అనే దోషమునుండి విముక్తులై శీఘ్రముగా మోక్షమును పొందగలరు (18). జనులు ఎంత అధికముగా నీవు చేసిన పనిని చెప్పుకొనెదరో, అంత అధికముగా నీ పాపము తొలగి శుద్ధిని పొందగలవు (19). ఓ బ్రహ్మా! నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తమిదియే. జనులు నీ గురించి పరిహాసమును చేయుట, లోకములో నీపై తీవ్రమగు జుగుప్స అనునవి నీకు ప్రాయశ్చిత్తము (20). ఈ వేది మధ్యలో కామార్తుడవగు నీ వీర్యము స్ఖలించుటను నేను గమనించితిని. ఈ వీర్యము ధరింపయోగ్యము కాజాలదు (21). చతుర్బిందుమితం రేతః పతితం యత్ క్షితౌ తవ | తన్మితాస్తోయదా వ్యోమ్ని భ##వేయుః ప్రలయంకరాః || 22 ఏతస్మిన్నంతరే తత్ర దేవర్షీణాం పురో ద్రుతమ్ | తద్రేతసస్సమ భవంస్తన్మితాశ్చ బలాహకా ః || 23 సంవర్తకస్తథా వర్తః పుష్పకో ద్రోణ ఏవ చ | ఏతే చతుర్విధాస్తాత మహా మేఘా లయంకరాః || 24 గర్జంతశ్చాథ ముంచంతస్తోయా నీషచ్ఛివేచ్ఛయా | ఫేలు ర్వ్యోమ్ని మునిశ్రేష్ఠ తో యదాస్తే కదారవాః || 25 నీరేతస్సు నాల్గు బిందువులు భూమిపై పడినవి గాన, ఆకాశమునందు ప్రలయమును సృష్టించగల నాల్గు మేఘములు పుట్టును (22). వెంటనే అచట దేవతలు, ఋషులు చూచు చుండగా ఆ రేతస్సు నుండి నాల్గు మేఘములు పుట్టినవి (23). వత్సా! సంవర్తకము, ఆవర్తము, పుష్పకము, ద్రోణము అనే ఈ నాల్గు మహామేఘములు ప్రలయమును కలిగించును (24). ఓ మహర్షీ! అమంగళ గర్జనను చేయు ఆ మేఘములు అపుడు శివుని ఇచ్ఛచే కొద్ది జలమును వర్షించుచూ, గర్జించుచూ ఆకాశమునందు విస్తరించినవి (25). తైస్తు సంఛాదితే వ్యోమ్ని సుగర్జద్భిశ్చ శంకరః | ప్రశాన్ దాక్షాయణీ దేవీ భృశం శాంతోऽభవద్ద్రుతమ్ || 26 అథ చాహం వీతభయ శ్శంకరస్యాజ్ఞయా తదా | శేషం వైవాహికం కర్మ సమాప్తి మనయం మునే || 27 పపాత పుష్పవృష్టిశ్చ శివాశివశిరస్క యోః | సర్వత్ర చ మునిశ్రేష్ఠ ముదా దేవగణోజ్ఘితా || 28 వాద్యమానేషు వాద్యేషు గాయమానేషు తేషు చ | పఠత్సు విప్రవర్యేషు వేదాన్ భక్త్యాన్వితేషు చ || 29 ఆకాశమంతయూ పెద్దగా గర్జించుచున్న ఆ మేఘములచే కప్పివేయబడెను. అపుడు దాక్షాయణీ దేవి, మరియు శంకరుడు శాసింసగా వెంటనే పూర్ణమగు శాంతి నెలకొనెను (26). అపుడు నేను తొలగిన భయము కలవాడనైతిని. ఓ మహర్షీ! నేను శంకరుని ఆజ్ఞచే అపుడు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయించితిని (27). సతీశివుల శిరస్సుపై, మరియు సర్వత్రా దేవగణములచే విడువ బడిన పుష్పవృష్టి కురిసెను. ఓ మహర్షీ! దేవతలందరు ఆనందించిరి (28). వారు వాద్యములను వాయించుచూ, పాటలను పాడిరి. భక్తితో కూడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు వేదములను పఠించిరి (29). రంభాదిషు పురంధ్రీషు నృత్యమానాసు సాదరమ్ | మహోత్సవో మహానాసీద్దేవపత్నీషు నారద || 30 అథ కర్మ వితానేశః ప్రసన్నః పరమేశ్వరః | ప్రాహ మాం ప్రాంజలిం ప్రీత్యా లౌకికీం గతిమాశ్రితః || 31 ఓ నారదా! రంభాద్యప్సరసలు శ్రద్ధతో నాట్యము చేయుచుండగా దేవతల భార్యలు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30). అపుడు యజ్ఞాది కర్మలకు ప్రభువగు పరమేశ్వరుడు ప్రసన్నుడై, లోకపు పోకడను ఆశ్రయించి ప్రీతితో అంజలి ఒగ్గి నాతో నిట్లనెను (31). ఈశ్వర ఉవాచ | హే బ్రహ్మన్ సుకృతం కర్మ సర్వం వైవాహికం చ యత్ | ప్రసన్నోऽస్మి త్వమాచార్యో దద్యాం తేదక్షిణాం చ కామ్ || 32 యాచస్వ తాం సురజ్యేష్ఠ యద్యపి స్యాత్సుదుర్లభా | బ్రూహి శ్రీఘ్రం మహా భాగ నాదేయం విద్యతే మమ || 33 ఈశ్వరుడిట్లు పలికెను - ఓ బ్రహ్మా! వివాహకర్మను అంతనూ ఆచార్యుడవగు నీవు చక్కగా నిర్వహించితివి. నేను ప్రసన్నుడనైతిని. నేను నీకు ఏ దక్షిణను ఈయవలెను? (32). నీవు దేవతలలో జ్యేష్ఠుడవు. దక్షిణను కోరుకొనుము. మహాత్మా! వెంటనే చెప్పుము. మిక్కిలి దుర్లభ##మైమ దక్షిణనైననూ ఈయగలను. నేను ఈయలేనిది లేనే లేదు (33). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచ స్సోsహం శంకరస్య కృతాంజలిః | మునేsవోచం వినీతాత్మా ప్రణమ్యేశం ముహుర్ముహుః || 34 యది ప్రసన్నో దేవేశ వరయోగ్యోsస్మ్యహం యది | తత్కురు త్వం మహేశాన సుప్రీత్యా యద్వదామ్యహమ్ || 35 అనే నైవ తు రూపేణ వేద్యామస్యాం మహేశ్వర | త్వయాస్థేయం సదైవాత్ర నృణాం పాపవిశుద్ధయే || 36 యేనాస్య సన్నిధౌ కృత్వా స్వాశ్రమం శశిశేఖర | తపః కుర్యాం వినాశాయ స్వపాపస్యాస్య శంకర || 37 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! శంకరుని ఈ మాటలను విని, నేను దోసిలి యొగ్గి, అనేక పర్యాయములు ఈశునకు ప్రణమిల్లి, వినయముతో కూడిన మనస్సు గలవాడనై ఇట్లు పలికితిని (34). ఓ దేవదేవా! నీవు ప్రసన్నుడవైనచో, నేను వరమునకు అర్హుడనైన చో, ఓ మహేశ్వరా! నేను చెప్ప బోవు కార్యమును నీవు ప్రీతితో చేయుము (35). మహేశ్వరా! నీవు ఇదే రూపముతో ఈ వేది యందు ఇక్కడ సర్వదా ఉన్నవాడవై మానవుల పాపములను పోగొట్టి పవిత్రులను చేయుము (36). ఓ చంద్రశేఖరా! నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమమును నిర్మించుకొని నేను చేసిన ఈ పాపమును నివారించు కొనుటకై తపస్సు చేసెదను (37). చైత్రశుక్లత్రయోదశ్యాం నక్షత్రే భగదైవతే | సూర్యవారే చ యో భక్త్యావీక్షేత భువి మానవః || 38 తదైవ తస్య పాపాని ప్రయాంతు పర సంక్షయమ్ | వర్థతే విపులం పుణ్యం రోగ నశ్యంతు సర్వశః || 39 యా నారీ దుర్భగా వంధ్యా కాణా రూపవివర్జితా | సాపి త్వద్దర్శ నాదేవ నిర్దోషా సంభ##వేద్ధ్రువమ్ || 40 ఇత్యాకర్ణ్య వచో మే హి స్వాత్మ సర్%వసుఖావహమ్ | తథాస్త్వితి శివః పాహ సుప్రసన్నేన చేతసా || 41 ఈ లోకమునందు ఏ మానవుడైతే చైత్ర శుక్ల త్రయోదశీ, ఉత్తరా నక్షత్ర యుక్త ఆదివారము లయందు నిన్ను భక్తితో దర్శించునో (38), వాని పాపములు ఆ క్షణమునందే వినాశమును పొందుగాక! ఓ హరా! వానికి పుణ్యము విస్తారముగా వర్థిల్లి, రోగములు పూర్తిగా నశించుగాక! (39). ఏ దురదృష్ట వంతురాలగు స్త్రీ వంధ్య గాని, అంధురాలు గాని, కురూపిగాని అయి ఉండునో, ఆమె కూడా నీ దర్శనమాత్రము చేతనే నిశ్చయముగా దోషములు లేనిది అగును (40). ఈ నా మాటలను విని శివుడు తన మనస్సులో మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సుతో 'తథాస్తు' అని పలికెను (41). శివ ఉవాచ | హితాయ సర్వలోకస్య వేద్యాం తస్యాం వ్యవస్థితః | స్థాస్యామి సహితః పత్న్యా సత్యా త్వద్వచనాద్విధే || 42 శివుడిట్లు పలికెను - ఓ బ్రహ్మా! నీ మాటచే సర్వలోకములకు హితమును చేయుటకై నేను నా పత్ని యగు సతీ దేవితో గూడి ఆ వేదియందు స్థిరముగా నుండగలను (42). బ్రహ్మోవాచ | ఇత్యుక్త్వా భగవాంస్తత్ర సభార్యో వృషభధ్వజః | ఉవాస వేది మధ్యస్థో మూర్తిం కృత్వాంశరూపిణీమ్ || 43 తతో దక్షం సమామంత్ర్య శంకరః పరమేశ్వరః | పత్న్యా సత్యా గంతుమనా అభూత్స్వ జన వత్సలః || 44 ఏతస్మిన్నంతరే దక్షో వినయావనతస్సుధీః | సాంజలిర్నతకః ప్రీత్యా తుష్టావ వృషభధ్వజమ్ || 45 విష్ణ్వాదయస్సురాస్సర్వే మునయశ్చ గణాస్తదా | నత్వా సంస్తూయ వివిధం చక్రుర్జయరవం ముదా || 46 బ్రహ్మ ఇట్లు పలికెను - భగవాన్ వృషభధ్వజుడు అచట ఇట్లు పలికి, భార్యతో గూడి వేది మధ్య యందున్న వాడై, తన అంశముతో మూర్తిని నిర్మించి అచటనే నివసించి యుండెను (43). తరువాత తనవారి యందు ప్రేమ కలిగిన శంకర పరమేశ్వరుడు దక్షుని పిలిపించెను. ఆయన తన భార్యయగు సతీదేవితో గూడి బయలు దేరనిచ్చగించెను (44). ఆ సమయములో పండితుడగు దక్షుడు వినయముతో వంగి దోసిలి యొగ్గి నమస్కరించి వృషభ ధ్వజుని ఆనందముతో స్తుతించెను (45). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు, మరియు గణములు శివునకు నమస్కిరించి, అనేక భంగుల స్తుతించి, ఆనందముతో జయజయ ధ్వానములను చేసిరి (46). ఆరోప్య వృషభే శంభుస్సతీం దక్షాజ్ఞయా ముదా | జగామ హిమవత్ర్ప స్థం వృషభస్థ స్స్వయం ప్రభుః || 47 అథ సా శంకరాభ్యాసే సుదతీ చూరు హాసినీ | విరేజే వృషభస్థా వై చంద్రాంతే కాలికా యథా || 48 విష్ణ్వాదయస్సురాస్సర్వే మరీచ్యాద్యాస్తథర్షయః | దక్షోsపిమోహితశ్చా సీత్తథాన్యే నిశ్చలా జనాః || 49 కేచి ద్వాద్యాన్వాదయంతో గాయంత స్సుస్వరం పరే | శివం శివయశశ్శుద్ద మను జగ్ముశ్శివం ముదా || 50 శంభుడు దక్షుని ఆజ్ఞను పొంది, సతీదేవిని ఆనందముతో వృషభముపై కూర్చుండ బెట్టి, తాను కూడా దానిపై అధిష్టించి, ఆ ప్రభువు హిమవత్పర్వతముపై నున్న తన ఆశ్రమమునకు బయలుదేరెను (47). అపుడు అందమైన దంతములు, సుందరమగు చిరునవ్వు గల ఆ సతీదేవి వృషభముపై శంకరుని ప్రక్కన చంద్రునితో మచ్చవలె ప్రకాశించెను (48). విష్ణువు మొదలగు దేవతలు, మరీచి మొదలగు ఋషులు, దక్షుడు మొదలగు వారందరు మోహితులైరి. మిగిలిన జనులు కదలకుండ నుండిరి (49). కొందరు వాద్యములను వాయించుచూ, మరి కొందరు ఆనందముతో మంగళకరము, శుద్ధము అగు శివుని కీర్తిని గానము చేయుచూ, శివుని వెనుక వెళ్లిరి (50). మధ్యమార్గాద్విసృష్టో హి దక్షః ప్రీత్యాథ శంభునా | స్వధామ ప్రాప సగణశ్శంభుః ప్రేమసమాకులః || 51 విసృష్టా అపి విష్ణ్వా ద్వా శ్శంభునా పునరేవ తే| అను జగ్ము శ్శివం భక్త్యా సురాః పరమయా ముదా || 52 తైస్సర్వైస్సగణౖశ్శంభుస్సత్యా చ స్వస్త్రియాయుతః | ప్రాపస్వం ధామ సంహృష్టో హిమవద్గిరి శోభితమ్ || 53 తత్ర గత్వా ఖిలాన్దేవాన్ మునీనపి పరాంస్తథా | ముదా విసర్జయామాస బహు సమ్మాన్య సాదరమ్ || 54 అపుడు శివుడు మార్గమధ్యమునుండి ప్రీతితో దక్షుని వెనుకకు పంపెను. ప్రేమతో నిండిన హృదయము గల శంభుడు గణములతో గూడి తన ధామను చేరుకొనెను (51). శివుడు విష్ణువు మొదలగు దేవతలకు వెనుకకు మరలుడని అనుజ్ఞ ఇచ్చెను. కాని వారు పరమానందముతో, భక్తితో శివుని వెనుక వెళ్లిరి (52). శివుడు వారందరితో, తన గణములతో, మరియు తన భార్యతో గూడి హిమవత్పర్వతమునందు ప్రకాశించేతన ధామమును ఆనందముతో చేరుకొనెను (53). అచటకు చేరిన పిదప, దేవతలను, మునులను, ఇతరులను అందరిని ఆదరముతో మిక్కిలి సన్మానము చేసి ఆనందముతో సాగనంపెను (54). శంభుమాభాష్య తే సర్వే విష్ణ్వాద్యా ముదితాననాః | స్వం స్వం ధామ యయుర్నత్వా స్తుత్వాచ మునయస్సురాః || 55 శివోऽపి ముదితోऽత్యర్థం స్వపత్న్యా దక్షకన్యయా | హిమవత్ర్పస్థ సంస్థో హి విజహార భవానుగః || 56 తతస్స శంకరస్సత్యా సగణస్సూతి కృన్మునే | ప్రాప స్వం ధామ సంహృష్టః కైలాసం పర్వతోత్తమమ్ || 57 ఏతద్వస్సర్వ మాఖ్యాతం యథా తస్య పురాऽభవత్ | వివాహో వృషయానస్య మనుస్వాయం భువాంతరే || 58 ఆ విష్ణువు మొదలగు దేవతలు, మునులు అందరు శివునితో మాట్లాడి, నమస్కరించి, స్తుతించి, ఆనందముతో నిండిన ముఖములు గల వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (55). శివుడు కూడ లోకరీతిని అనుసరించు వాడై తన భార్యయగు దాక్షాయణితో గూడి మిక్కిలి ఆనందించిన వాడై హి మవత్పర్వత మైదానములలో విహరించెను (56). జగత్కారణమగు ఆ శంకరుడు సతీ దేవితో గూడి ఆనందముగా నుండెను. ఓ మహర్షీ! కొంతకాలము తరువాత ఆయన పర్వత రాజమగు కైలాసమును చేరుకొనెను (57). స్వాయంభువ మన్వంతరములో పూర్వము వృషభవాహనుని వివాహము జరిగినది. ఆ వృత్తాంతమునంతనూ నేను మీకు చెప్పితిని (58). వివాహ సమయే యజ్ఞే ప్రారంభే వా శృణో తి యః | ఏతదాఖ్యానమవ్యగ్ర స్సంపూజ్య వృషభధ్వజమ్ || 59 తస్యాऽవిఘ్నం భ##వేత్సర్వం కర్మ వైవాహికం చ యత్ | శుభాఖ్యమపరం కర్మ నిర్విఘ్నం సర్వదా భ##వేత్ || 60 కన్యా చ సుఖసౌభాగ్య శీలాచార గుణాన్వితా | సాధ్వీ స్యాత్పుత్రిణీ ప్రీత్యా శ్రుత్వాఖ్యానమిదం శుభమ్ || 61 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే సతీవివాహ వర్ణనం నామ వింశోऽధ్యాయః (20). వివాహసమయము నందుగాని, యజ్ఞ ప్రారంభమునందుగాని ఎవరైతే వృషభధ్వజుని చక్కగా పూజించి స్థిరచిత్తులై ఈ గాథను వినెదరో (59), వారికి ఆ వివాహాది శుభకర్మలన్నియూ సర్వదా నిర్విఘ్నముగా కొనసాగును (60). ఈ శుభగాథను ఆనందముతో వినే కన్య సుఖసౌభాగ్యములతో, శీలాచారములతో, సద్గుణములతో కూడినదై పతివ్రతయై పుత్ర సంతానమును పొందును (61). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు సతీఖండలో సతీ వివాహ వర్ణనమనే ఇరువది యవ అధ్యాయము ముగిసినది (20).