Sri Sivamahapuranamu-I    Chapters   

అథ త్రయోవింశోధ్యాయః

భక్తి మహిమ

బ్రహ్మోవాచ |

ఏవం కృత్వా విహారం వై శంకరేణ చ సా సతీ | సంతుష్టా సా భవచ్చాతి విరాగా సమజాయత || 1

ఏకస్మిన్‌ దివసే దేవీ సతీ రహ సి సంగతా | శివం ప్రణమ్య సద్భక్త్యా న్యస్యోచ్చైః సుకృతాంజలిః || 2

సుప్రసన్నం ప్రభుం నత్వా సా దక్షతనయా సతీ | ఉవాచ సాంజలిర్భక్త్యా వినయావనతా తతః || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఈ విధముగా శంకరునితో విహరించి ఆ సతీదేవి సంతృప్తిని పొందెను. ఆమెకు గొప్ప వైరాగ్యము కూడా కలిగెను (1). ఒకనాడు సతీదేవి ఏకాంతమునందున్న శివుని వద్దకు వెళ్లి, మంచి భక్తితో చేతులు పైకెత్తి నమస్కరించెను (2). దక్షుని కుమార్తెయగు ఆ సతీదేవి దోసిలి యొగ్గి భక్తితో విమయముతో మిక్కిలి ప్రసన్నుడై యున్న ఆ ప్రభువునకు నమస్కరించి, తరువాత ఇట్లు పలికెను (3).

సత్యువాచ |

దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో | దీనోద్ధర మహాయోగిన్‌ కృపాం కురు మమోపరి || 4

త్వం పరః పురుషస్స్వామీ రజస్సత్త్వతమః పరః | నిర్గుణస్సగుణస్సాక్షీ నిర్వికారీ మహాప్రభుః || 5

ధన్యాహం తే ప్రియా జాతా కామినీ సువిహారిణీ | జాతస్త్వం మే పతిస్స్వామిన్‌ భక్తివాత్సల్యతో హర || 6

సతీదేవి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! దీనులనుద్ధరించువాడా! మహాయోగీ! నాపై దయను చూపుము (4). నీవు పరమ పురుషుడవు. సగుణుడవు. సాక్షివి, వికారములు లేనివాడవు, మహాప్రభుడవు (5). నేను నీ భార్యనై, నీతో విహరించి రమించుటచే ధన్యురాలనైతిని. ఓ హరా! భక్తులయందు నీకు గల ప్రేమ వలననే నీవు నాకు భర్తవైనావు (6).

కృతో బహుసమా నాథ విహారః పరమస్త్వయా | సంతుష్టాహం మహేశాన నివృత్తం మే మహేశాన నివృత్తం మే మనస్తతః || 7

జ్ఞాతుమిచ్ఛామి దేవేశ పరం తత్త్వం సుఖావహమ్‌ | యేన సంసారదుఃఖాద్వై తరే జ్జీవోం జసా హర || 8

యత్‌ కృత్వా విషయీ జీవస్స లభేత్పరమం పదమ్‌ |సంసారీ న భ##వేన్నాథ తత్త్వం వద కృపాం కురు || 9

నాథ! నేను అనేక సంవత్సరములు నీతో గూడి గొప్ప గా విహరించితిని. మహేశ్వరా! నాకు సంతోషము కలిగినది. నా మనస్సు ఇపుడు దానినుండి నివృత్తమైనది (7). దేవదేవా! హరా! ఏ తత్త్వము నెరింగిన జీవుడు శ్రీఘ్రమే సంసారదుఃఖమును దాట గల్గునో, అట్టి మోక్షదాయకమగు పరతత్త్వమును తెలియ గోరుచున్నాను (8). నాథా! ఏ తత్త్వముచే విషయభోగరతుడగు జీవుడు పరమ పదమును పొంది సంసార విముక్తుడగునో, అట్టి తత్త్వమును దయచేసి చెప్పుము (9).

బ్రహ్మోవాచ |

ఇత్యపృచ్ఛత్స్మ సద్భక్త్యా శంకరం సా సతీ మునే |ఆదిశక్తి ర్మహేశానీ జీవోద్ధారాయ కేవలమ్‌ || 10

ఆ కర్ణ్య తచ్ఛివ స్స్వామీ స్వేచ్ఛయోపాత్త విగ్రహః | అవోచత్పరమప్రీతస్సతీం యోగవిరక్తధీః || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆదిశక్తి మహేశ్వరి యగు ఆ సతి కేవలము జీవులనుద్ధరించుట కొరకై గొప్ప భక్తితో శంకరుని ఇట్లు ప్రశ్నించెను (10). తన ఇచ్ఛచే స్వీకరింపబడిన మూర్తి గలవాడు, యోగముచే విరక్తమైన బుద్ధిగలవాడు అగు శివస్వామి ఆ మాటను మిక్కిలి సంతసంచి సతీదేవితో నిట్లనెను (11).

శివ ఉవాచ |

శృణు దేవి ప్రవక్ష్యామి దాక్షాయణి మహేశ్వరి | పరం తత్త్వం తదేవానుశయీ ముక్తో భ##వేద్యతః || 12

పర తత్త్వం విజానీహి విజ్ఞానం పరమేశ్వరి | ఉదితే స్మరణం యత్ర సోహం బ్రహ్మేతి శుద్ధ ధీః || 13

తద్దుర్లభం త్రిలోకేస్మిత్‌ తద్‌ జ్ఞాతా విరలః ప్రియే| యాదృశో యస్స దా సోహం బ్రహ్మ సాక్షాత్పరాత్పరః || 14

తన్మాతా మమ భక్తిశ్చ భుక్తి ముక్తి ఫలప్రదా | సులభా మత్ర్పసాదాద్ధి నవధా సా ప్రకీర్తితా || 15

శివుడిట్లు పలికెను -

దాక్షాయణీ! మహేశ్వరీ! దేవీ! కర్మవాసనలతో నిండియుండు జీవుడు దేవి వలన మోక్షమును పొందునో, అట్టి పరతత్త్వమును చెప్పెదను వినుము (12). పరమేశ్వరీ! పరతత్త్వమనగా విజ్ఞానమని యెరుంగుము. ఆ విజ్ఞానము ఉదయించిన జ్ఞాని యొక్క శుద్ధమైన బుద్ధియందు 'నేనే బ్రహ్మను' అను స్మృతి కలుగును (13). ఈ ముల్లోకములలో ఆ జ్ఞానము దుర్లభము. ఓ ప్రియురాలా! దానిని ఎరింగిన జ్ఞాని అరుదు.ఆతడు ఎవడైననూ,ఎట్టివాడైననూ సర్వదా నా స్వరూపుడే.ఆతడు సాక్షాత్తుగా పరాత్పర బ్రహ్మరూపుడై ఉండును (14). నాయందలి భక్తి ఆ విజ్ఞానమునకు తల్లి. భుక్తి భుక్తి ముక్తులనే ఫలముల నిచ్చును. నా అను గ్రహముచే నాయందలి భక్తి తేలికగా కుదురును. ఆభక్తి తొమ్మిది విధములని చెప్పబడినది (15).

భక్తౌ జ్ఞానే నభేదో హి తత్కర్తు స్సర్వదా సుఖమ్‌ | విజ్ఞానం నభవత్యేవ సతి భక్తి విరోధినః || 16

భక్తా ధీనస్సదాహం వై తత్ర్పభావాద్గృహేష్వపి | నీచానాం జాతి హీనానాం యామి దేవి న సంశయః || 17

సా భక్తిర్ద్వి విధా దేవి సగుణా నిర్గుణా మతా | వైధీ స్వాభావికీ యా యా వరా సా త్వ వరా స్మృతా || 18

భక్తికి జ్ఞానమునుకు తేడా లేదు. భక్తిని చేయు వ్యక్తికి సర్వదా సుఖము లభించును. ఓ సతీ! భక్తిని విరోధించువానికి విజ్ఞానము కలుగనే కలుగదు (16). ఓ దేవీ! నేను సర్వదా భక్తులకు అధీనుడనై యుందును. భక్తి ప్రభావముచే నేను ఉచ్చ నీచ భేదము, జాతి భేదము లేకుండ సర్వుల గృహములకు వెళ్లెదను. సందేహము లేదు (17). ఓ దేవీ! ఆ భక్తి సగుణము, నిర్గుణము అని ద్వివిధముగ నున్నది. విధి విహితమై సహజముగా హృదయములో పుట్టిన భక్తి గొప్పది. దీనికి భిన్నముగా, కామనలచే ప్రేరితమై ఉదయించే భక్తి తక్కువది (18).

నైష్ఠిక్యనైష్ఠికీ భేదా ద్ద్వి విధే ద్వివిధే హి తే | షడ్విధా నైష్ఠికీ జ్ఞేయా ద్వితీయైక విధా స్మృతా || 19

విహితా విహితా భేదాత్తామనేకాం విదుర్బుధాః | తయోర్బహు విధత్వాచ్చ తత్త్వం త్వన్యత్ర వర్ణితమ్‌ || 20

తే నవాంగే ఉభే జ్ఞేయే వర్ణితే మునిభిః ప్రియే | వర్ణయామి నవాంగాని ప్రేమతశ్శృణు దక్షజే|| 21

శ్రవణం కీర్తనం చైవ స్మరణం సేవనం తథా | దాస్యం తథార్చనం దేవి వందనం మమ సర్వదా || 22

సఖ్య మాత్మార్పణం చేతి నవాంగాని విదుర్బధాః |

ఆ సగుణ, నిర్గుణ భక్తులు రెండు నైష్ఠికి, అనైష్ఠికి అను భేదముచే మరల ఒక్కొక్కటి రెండు రకములుగా నున్నది. నైష్ఠికీ భక్తిలో ఆరు భేదములుండగా, అనైష్ఠికీ భక్తిలో ఒకే రకము గలదని పెద్దలు చెప్పెదరు (19). ఆ సగుణ నిర్గుణ భక్తి మరల విహితము, అవిహితము అను భేదములను కలిగి బహు భంగుల నుండునని పండితులు చెప్పెదరు. దాని తత్త్వము మరియొక చోట వర్ణింపబడినది (20). ఓ ప్రియురాలా! ఆ సగుణ నిర్గుణ భక్తులు రెండింటికీ తొమ్మిదేసి అంగములు గలవని మునులు వర్ణించిరి. ఓ దక్షపుత్రీ! నేను ఆ నవాంగములను ప్రేమతో వర్ణించెదను వినుము (21). శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము, దాస్యము, అర్చనము, నన్ను సర్వదా నమస్కరించుట (22), సఖ్యము, ఆత్మార్పణము అనునవి తొమ్మిది అంగములని పండితులు చెప్పెదరు.

ఉపాంగాని శివే తస్యా బహూని కథితాని వై || 23

శృణు దేవి నవాంగానాం లక్షణాని పృథక్‌ పృథక్‌ | మమ భ##క్తేర్మనో దత్త్వా భక్తిముక్తి ప్రదాని హి || 24

కథాదేర్నిత్య సమ్మానం యత్త చ్ఛ్రవణ ముచ్యతే || 25

హృదాకాశేన సంపశ్యన్‌ జన్మ కర్మాణి వై మమ | ప్రీత్యా చోచ్చారణం తేషా మేతత్కీర్తనముచ్యతే || 26

హే శివే! వాటికి అనేకములైన ఉపాంగములు కూడ చెప్పబడినవి (23). ఓ దేవీ! నా భక్తి యొక్క తొమ్మిది అంమగముల లక్షణములను వేర్వేరుగా చెప్పెదను. భక్తిని ముక్తిని ఇచ్చే ఈ అంగముల లక్షణములను నీవు సమాహితచిత్తముతో వినుము (24). భగవత్కథను నిత్యము సమ్మాన పూర్వకముగా, నమస్కార పూర్వకముగా, స్థిరాసనముపై గూర్చుండి చెవులతో గ్రోలుట శ్రవణమనబడును (25). నా ఆవిర్భవమును, లీలలను హృదయాకాశములో దర్శించుచూ, ప్రీతితో వాటిని ఉచ్చరించుట కీర్తనమనబడును (26).

వ్యాపకం మాం దృష్ట్వా నిత్యం సర్వత్ర సర్వదా | నిర్భయత్వం సదా లోకే స్మరణం తదుదాహృతమ్‌ || 27

అరుణోదయమారభ్య సేవాకాలేం చితా హృదా | సదా సేవ్యాను కూల్యేన సేవనం తద్ధి గో గణౖః || 28

హృదయామృత భోగేన ప్రియం దాస్య ముదాహృతమ్‌ | సదా భృత్యాను కూల్యేన విధినా మే పరాత్మనే || 29

అర్పణం షోడశానాం వై పాద్యాదీనాం తదర్ఛనమ్‌ | మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్‌ || 30

యదష్టాంగేన భూ స్పర్శం తద్వై వందనముచ్యతే |

సర్వవ్యాపకుడనగు నన్ను నిత్యము సర్వత్రా దర్శించి, లోకములో సదా నిర్భయుడై ఉండుట స్మరణమని చెప్పబడినది (27). సూర్యోదయము మొదలుకొని సేవాకాలమునందు అంకిత భావముతో నిండిన హృదయముతో సర్వదా సేవకుని వలె అనుకూలముగ నండుటను శాస్త్రములు సేవనమని వర్ణించినవి (28). హృదయములో అమృత రూపముగా అనుభవించుచూ, భగవంతుని ప్రియునిగా భావన చేయుటకు దాస్యమని పేరు. సర్వదా భృత్యుని వలె అనుకూలముగా నున్నవాడై పరమాత్మనగు నాకు యధావిధిగా (29), పాద్యము మొదలగు షోడశోపచారములను చేయుట అర్చనమగును. వాక్కుచే యంత్రమును ఉచ్ఛరించి, మనస్సుచే ధ్యానించుచూ (30), అష్టాంగములచే భూమిని స్పృశించుట వందనమనబడును.

మంగలామంగలం యద్యత్కరోతీతీశ్వరో హి మే || 31

సర్వం తన్మంగలాయేతి విశ్వాసస్సఖ్యలక్షణమ్‌ | కృత్వా దేహాదికం తస్య ప్రీత్యైసర్వం తదర్పణమ్‌ || 32

నిర్వాహాయ చ శూన్యత్వం యత్త దాత్మ సమర్పణమ్‌ | నవాంగానీతి మద్భక్తే ర్భుక్తిముక్తి ప్రదాని చ || 33

మమ ప్రియాణి చాతీవ జ్ఞానోత్పత్తి కరాణి చ | ఉపాంగాని చ మద్భక్తేర్బహూని కథితాని వై || 34

బిల్వాది సేవనాదీని సమూహ్యాని విచారతః |

ఈశ్వరుడు నాకు మంగళమును గాని, అమంగళమును గాని దేవిని చేసిననూ, (31) సర్వము మంగళము కొరకే అనే విశ్వాసముసఖ్యము యొక్క లక్షణమగును. దేహము మొదలగు సర్వమును భగవానుని ప్రీతి కొరకు అర్పించి (32), దేహ నిర్వహణకు యత్నించకుండనుండుట ఆత్మ సమర్పణమనబడును. నా భక్తి కి సంబంధించిన ఈ తొమ్మిది అంగములు భుక్తిని ముక్తిని ఇచ్చునవి (33). మరియు నాకు మిక్కిలి ప్రియమైనవి. జ్ఞానమును కలిగించునవి. నా భక్తియొక్క ఉపాంగములు అనేకము చెప్పబడినవి (34). బిల్వార్చన, సేవనము మొదలగు ఉపాంగనములను విచారణచేసి ఊహించదగును.

ఇత్థం సాంగోపాంగ భక్తిర్మమ సర్వోత్తమా ప్రియే || 35

జ్ఞానవైరాగ్య జననీ ముక్తిదాసీ విరాజతే | సర్వకర్మ ఫలోత్పత్తి స్సర్వదా త్వత్సమ ప్రియా || 36

యచ్చిత్తే సా స్థితా నిత్యం సర్వదా సోతి మత్ర్పియః | త్రైలోక్యే భక్తి సదృశః పంథా నాస్తి సుఖావహః || 37

చతుర్యుగేషు దేవేశి తు సువిశేషతః | కలౌ తు జ్ఞాన వైరాగ్యౌ వృద్దరూపౌ నిరుత్సవౌ || 38

ఓ ప్రియురాలా! ఇట్టి అంగ, ఉపాంగములతో కూడిన భక్తి సర్వ శ్రేష్ఠము (35). జ్ఞానవైరాగ్యములకు తల్లి, ముక్తి దాసిగా గలది అగు భక్తి శోభిల్లుచున్నది. సర్వ కర్మల ఫలము భక్తి నుండి ఉద్భవించును. నాకు భక్తియందు సర్వదా నీతో సమమైన ప్రేమ గలదు (36). ఎవని హృదయములో సర్వదా భక్తి ఉండునో, వాడు సర్వదా నాకు మిక్కిలి ప్రియుడు. ముల్లోకములలో భక్తివంటి సుఖకరమగు మార్గము లేదు (37). ఓ దేవదేవీ! నాల్గు యుగములలో, విశేషించి కలియుగములో భక్తి చాలా గొప్పది. కలియుగమునందు జ్ఞానవైరాగ్యములు ఉత్సాహము లేనివై జవసత్త్వములుడిగి యుండును (38).

గ్రాహకా భావతో దేవి జతౌ జర్జరతామితి |కలౌ ప్రత్యక్ష ఫలదా భక్తి స్సర్వయుగేష్వపి || 39

తత్ర్పభావాదహం నిత్యం తద్వశో నాత్ర సంశయః | యో భక్తిమాన్‌ పుమాంల్లోకే సదాహం తత్సహాయకృత్‌ || 40

విఘ్నహర్తా రిపుస్తస్య దండ్యో నాత్ర చ సంశయః | భక్తహేతోరహం దేవి కామం క్రోధపరిప్లుతః || 41

అదహం వహ్నినా నేత్ర భ##వేన నిజరక్షకః | భక్తహేతో రహం దేవి రవ్యు పర్య భవం కిల || 42

అతిక్రోధాన్వితః శూలం గృహీత్వాన్వజయం పురా |

ఓ దేవీ! వాటిని స్వీకరించువారు లేక పోవుటచే అవి శిథిలమైనవి. సర్వయుగములలో, మరియు విశేషించి కలియుగములో భక్తి ప్రత్యక్ష ఫలము నిచ్చును (39). భక్తియొక్క ప్రభావము చేనేను నిత్యము భక్తికి వశుడనై ఉందుననుటలో సందేహము లేదు. లోకములో భక్తి గల పురుషునకు నేను సర్వదా సహాయమును చేసెదను (40). ఆతని విఘ్నములను నేను తొలగించి, ఆతని శత్రువును దండించెదను. సందేహము లేదు. ఓ దేవీ! భక్తుని కారణంగా నేను క్రోధముతో నిండినవాడనైనా కంటినుండి పుట్టిన అగ్నితో కాముని (41) దహించితిని. నేను నాభక్తులను రక్షించెదను. దేవీ! పూర్వము నేను భక్తుని కారణంగా సూర్యునిపై తీవ్రమగు కోపమును పొంది (42) శూలమును తీసుకొని ఆతనిని జయించితిని.

భక్తహేతో రహం దేవి రావణం సగణం క్రుధా || 43

త్యజామి స్మ కృతో నైవ పక్షపాతో హి తస్య వై | భక్త హేతో రహం దేవి వ్యాసం హి కుమతి గ్రహమ్‌ || 44

కాశ్యా న్యసారయత్‌ క్రోధాద్దం డయిత్వా చ నందినా | కిం బహూక్తేన దేవేశి భక్తాధీన సస్సదా హ్యహమ్‌ || 45

తత్కర్తుఃపురుషస్యాతివశగో నాత్ర సంశయః |

ఓ దేవీ! భక్తుని కారణంగా నేను పరివార సమేతుడగు సమేతుడగు రావణుని కోపము చేసి పరిత్యజించితిని (43).ఆతని విషయములో నేను పక్షపాతమును సహించలేదు. ఓ దేవీ!చెడు ఆలోచనను చేయ మొదలిడిన వ్యాసుని, నేను భక్తుని కారణంగా (44) నందిచే దండింప జేసి కాశీ నుండి బయటకు పంపించితిని. ఓ దేవదేవీ! ఇన్ని మాటలేల? నేను సర్వదా భక్తునకు అధీనుడనై ఉందును (45).భక్తిని చేయు పురుషునకు నేను మిక్కిలి వశుడనై ఉందు ననుటలో సందియము లేదు.

బ్రహ్మోవాచ |

ఇత్థమాకర్ణ్య భ##క్తేస్తు మహత్త్వం దక్షజా సతీ || 46

జ హర్షాతీవ మనసా ప్రణనామ శివం ముదా | పునః పప్రచ్ఛ సద్భక్త్యా తత్కాండ విషయం మునే || 47

శాస్త్రం సుఖకరం లోకే జీవోద్ధారపరాయణమ్‌ | సయంత్ర మంత్ర శాస్త్రం చ తన్మాహాత్మ్యం విశేషతః || 48

అన్యాని ధర్మ వస్తూని జీవోద్ధారకరాణి హి | శంకరోపి తదాకర్ణ్య సతీ ప్రశ్నం ప్రహృష్టధీః || 49

వర్ణయామాస సుప్రీత్యా జీవోద్ధారాయ కృత్స్నశః |

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుని కుమార్తెయగు సతీదేవి భక్తి మహాత్మ్యమును ఈ తీరున విని (46), మనస్సులో మిక్కిలి సంతసించి, శివుని ఆనందముతో నమస్కరించెను. ఓ మహర్షీ! ఆమె గొప్ప భక్తితో భక్తికాండకు సంబంధించిన విషయమునే మరల ప్రశ్నించెను (47). లోకములో జీవులను ఉద్ధరించుటయే పరమ లక్ష్యముగా గల సుఖదాయకమగు శాస్త్రమును గురించి, యంత్ర మంత్ర విషయముల గురించి, విశేషించి వాటి మహిమను గురించి (48), జీవులను ఉద్ధరించే ఇతర విషయముల గురించి ప్రశ్నించెను. శంకరుడు ఆ సతీ ప్రశ్నను విని మిక్కిలి సంతసంచిన వాడై (49),సర్వజీవులనుద్ధరించుట కొరకై ప్రీతితో సర్వమును వర్ణించెను.

తత్ర శాస్త్రం స యంత్రం హి స పంచాంగం మహేశ్వరః || 50

బభాషే మహిమానం చ తత్తద్దైవ వరస్య వై | సేతిహాస కథం తేషాం భక్త మహాత్మ్యమేవ చ || 51

సవర్ణాశ్రమ ధర్మాంశ్చ నృప ధర్మాస్ము నీశ్వర | సుతస్త్రీ ధర్మ మహాత్మ్యం వర్ణాశ్రమ మనశ్వరమ్‌ || 52

వైద్య శాస్త్రం తథా జ్యోతిశ్శాస్త్రం జీవసుఖావహమ్‌ | సాముద్రికం పరం శాస్త్ర మన్యచ్ఛాస్త్రాణి భూరిశః || 53

కృపాం కృత్వా మహేశానో వర్ణయామాస తత్త్వతః |

మహేశ్వరుడు యంత్ర శాస్త్రమును, పంచాగమును (50), ఆయా శ్రేష్ఠ దేవతల మహిమను వర్ణించెను. ఓ మహర్షీ! ఇతిహాస గాథలను, భక్తుల మహాత్మ్యమును (51) వర్ణాశ్రమ ధర్మములను, రాజ ధర్మములను, పుత్ర ధర్మములను, స్త్రీ ధర్మములను, వాటి మహాత్మ్యమును, వినాశములేని తత్త్వమును (52), జీవులకు సుఖమును కలిగించే వైద్య శాస్త్ర, జ్యోతిశ్శాస్త్ర, సాముద్రిక శాస్త్రములను, ఇతరములైన అనేక శాస్త్రములను (53) మహేశ్వరుడు దయతో వాటి స్వరూపము స్పష్టమగునట్లు వర్ణించెను.

ఇత్థం త్రిలోక సుఖదౌ సర్వజ్ఞౌ చ సతీశివౌ || 54

లోకోపకార కరణ ధృత సద్గుణ విగ్రహౌ | చి క్రీడాతే బహువిధం కైలాసే హిమవవద్గిరౌ || 55

అన్యస్థలేషు చ తదా పరబ్రహ్మ స్వరూపిణౌ ||

56

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయా యాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే భక్తి ప్రభావ వర్ణనం నామ త్రయో వింశోధ్యాయః (23).

ఈ విధముగా సర్వజ్ఞలగు సతీశివులు ముల్లోకములకు సుఖములనొసంగిరి (54). వారు లోకములకు ఉపకారము చేయుట కొరకై సద్గుణములకు నిలయమగు మూర్తులను ధరించి, హిమ వత్పర్వతమునందు, కైలాసము నందు బహు విధములుగా క్రిడించిరి (55). పరబ్రహ్మ స్వరూపులగు వారిద్దరు అపుడు ఇతర స్థలముల యందు కూడ విహరించిరి (56).

శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండమునందు భక్తి ప్రభావవర్ణమనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

Sri Sivamahapuranamu-I    Chapters