Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచవింశోsధ్యాయః సతీ వియోగము రామ ఉవాచ | ఏకదా హి పూరా దేవి శంభుః పరమసూతికృత్ | విశ్వకర్మాణ మాహూయ సర్వలోకే పరతః పరే ||
1 స్వధేను శాలాయాం రమ్యం కారయా మాస తేన చ | భవనం విస్తృతం సమ్యక్ తత్ర సింహాసనం వరమ్ ||
2 తత్ర చ్ఛత్ర మహాదివ్యం సర్వదాద్భుత ముత్తమమ్ | కారయామాస పరమం శంకరో విశ్వకర్మణా ||
3 శక్రాదీనాం జుహావాశు సమస్తాన్ దేవతా గణాన్ | సిద్ధ గంధర్వ నా గానుపదేవాంశ్చ కృత్స్న శః ||
4 రాముడిట్లు పలికెను - ఓ దేవీ! పూర్వము ఒకప్పుడు పరమ కారణుడగు శంభుడు విశ్వకర్మను పిలిపించి, అన్నిటికంటె ఊర్ధ్వమునందున్న తనలోకములో (1), తన గోశాలయందు ఆ విశ్వకర్మచేత సుందరమైన పెద్ద భవనమును నిర్మింపజేసెను. దానియందు గొప్ప సింహాసనమును చక్కగా ఏర్పాటు చేసెను (2). దానియందు మహాదివ్యము, అన్నివేళలా అద్భుతమును గొల్పునది, సర్వోత్తమము అగు ఛత్రమును శంకరుడు విశ్వకర్మచేత నిర్మింపజేసెను (3). ఆయన వెంటనే ఇంద్రాది సమస్త దేవతా గణములను, సిద్ధ, గంధర్వ, నాగ ఉపదేవులనందరినీ పిలిపించెను (4). వేదన్ సర్వా నాగమాంశ్చ విధిం పుత్రైర్మునీనపి | దేవీస్సర్వా అప్సరోభి ర్నానా వస్తు సమన్వితాః ||
5 దేవానాం చ తథర్షీణాం సిద్ధానాం ఫణినామపి | ఆనయన్మంగల కరాః కన్యాః షోడశ షోడశ ||
6 వీణా మృదంగ ప్రముఖ వాద్యాన్నానా విధాన్మునే | ఉత్సవం కారయామాస వాదయిత్వా సుగాయనైః ||
7 రాజాభిషేక యోగ్యాని ద్రవ్యాణి సకలౌషధైః | ప్రత్యక్ష తీర్థ పాథోభిః పంచకుంభాంశ్చ పూరితాన్ ||
8 సర్వ వేదములను, శాస్త్రములను, బ్రహ్మను, ఆయన పుత్రులను, మునులను పిలిపించెను. దేవతా స్త్రీలందరు అప్సరసలతో గూడి వివిధ వస్తువులను తీసుకొని విచ్చేసిరి (5). దేవతల, ఋషుల, సిద్ధుల, మరియు నాగుల కన్యలను పదహారేసి మందిని మంగళార్థమై రప్పించెను (6). ఓ మహర్షీ! గొప్ప గాయకులచే పాడించి, వీణామృదంగాది ప్రముఖ వాద్యములను వాయింపజేసి ఉత్సవమును చేయించెను (7). సర్వ ఓషధులు మొదలగు, రాజాభిషేకమునకు అర్హమైన ద్రవ్యములను తెప్పించెను. వివిధ తీర్థములలో ప్రత్యక్షముగా లభించే జలములతో నిండిన అయిదు కుంభములనేర్పాటు జేసెను (8). తథాన్యా స్సంవిధా దివ్యా ఆనయత్స్వ గణౖస్తదా | బ్రహ్మఘోషం మహారావం కారయామాస శంకరః ||
9 అథో హరిం సమాహూయ వైకుంఠా త్ర్పీత మానసః | తద్భక్త్యా పూర్ణయా దేవి మోదతి స్మ మహేశ్వరః ||
10 సుముహూర్తే మహాదేవస్తత్ర సింహాసనే వరే | ఉపవేశ్య హరిం ప్రీత్యా భూషయా మాస సర్వశః ||
11 ఆ బద్ధరమ్య ముకుటం కృత కౌతుక మంగలమ్ | అభ్యషించన్మహేశస్తు స్వయం బ్రహ్మాండ మండపే ||
12 దత్తవాన్నిఖి లైశ్వర్యం యన్నైజం నాన్యగామి యత్ | తతస్తుష్టావ తం శంభుస్స్వతంత్రో భక్తవత్సలః ||
13 మరియు దివ్యములగు ఇతర వస్తువుల నన్నిటినీ తన గణములచే రప్పించెను. శంకరుడు గొప్ప ధ్వని కల్గునట్లు వేదఘోషను ఏర్పాటు చేసెను (9). ఓ దేవీ! అపుడు మహేశ్వరుడు ప్రీతి చెందిన మనస్సు గలవాడై వైకుంఠము నుండి విష్ణువును పిలిపించెను. విష్ణువు యొక్క పూర్ణ భక్తికి ఆయన చాల ఆనందించెను (10). మహాదేవుడు సుమూహూర్తమునందు ఆ భవనములో శ్రేష్ఠ సింహాసనముపై విష్ణువును ప్రీతితో కూర్చుండ బెట్టి, సర్వత్రా అలంకరింపజేసెను(11). సుందరమగు కిరీటమును పెట్టి, కౌతుకమనే మాంగళిక కర్మను చేసి, మహేశ్వరుడు స్వయముగా బ్రహ్మాండమండపమునందు అభిషేకించెను (12). ఇతరులకు లభించని స్వీయ ఐశ్వర్యము నంతనూ ఇచ్చెను. తరువాత స్వతంత్రుడు, భక్తవత్సలుడు నగు శంభుడు ఆ విష్ణువును స్తుతించెను (13). బ్రహ్మాణం లోక కర్తారమవోచ ద్వచనం త్విదమ్ | ఖ్యాపయన్ స్వం వరాధీనం స్వతంత్రః భక్తవత్సలః ||
14 స్వతంత్రుడు, భక్తవత్సలుడు అగు శివుడు తాను భక్తులకు అధీనుడనై ఉందుననే సత్యమును లోకమునకు ప్రకటింపగోరి, సృష్టికర్తయగు బ్రహ్మతో నిట్లనెను (14). మహేశ ఉవాచ | అతః ప్రభృతి లోకేశ మన్నిదేశాదయం హరిః | మమ వంద్యస్స్వయం విష్ణుర్జాత స్సరశ్సృణోతు హి ||
15 సర్వైర్దేవాది భిస్తాత ప్రణమ త్వమముం హరిమ్ | వర్ణయంతు హరిం వేదా మమైతే మామివాజ్ఞయా ||
16 మహేశ్వరుడిట్లు పలికెను - ఓ సృష్టికర్తా! ఈనాటినుండి నా ఆజ్ఞచే ఈ విష్ణువు నాకు నమస్కరింపదగినవాడు అయినాడు. ఈ మాటను అందరు వినెదరు గాక! (15). వత్సా! విష్ణువు దేవతలందరికీ నమస్కరింపదగినవాడు. నీవీ హరిని నమస్కరించుము. నా ఆజ్ఞచే నా ఈ వేదములు నన్ను వలెనే విష్ణువును కూడ వర్ణించును గాక!(16). రామ ఉవాచ | ఇత్యుక్త్వాథ స్వయం రుద్రోऽనమద్వై గరుడధ్వజమ్ | విష్ణుభక్తిప్రసన్నాత్మా వరదో భక్తవత్సలః ||
17 తతో బ్రహ్మాదిఖిర్దేవైః సర్వరూప సురైస్తథా | మునిసిద్ధాది భిశ్చైవం వందితోऽభూద్ధరిస్తదా ||
18 తతో మహేశో హరయే శంసద్ది విషదాం తదా | మహావరాన్ సుప్రసన్నో ధృతవాన్ భక్తవత్సలః ||
19 రాముడిట్లు పలికెను - రుద్రుడు ఇట్లు పలికి స్వయముగా గరుడధ్వజుడగు విష్ణువునకు నమస్కరించెను. భక్తవత్సలుడు, వరదాత అగు శివుని మనస్సు విష్ణువు యొక్క భక్తిచే ప్రసన్నమైనది (17). అపుడు బ్రహ్మాది దేవతలు, మునులు, సిద్ధులు మొదలగు వారందరు విష్ణువునకు నమస్కరించిరి (18).అపుడు భక్తవత్సలుడగు మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై, దేవతలు ప్రశంసించుచుండగా, విష్ణువునకు గొప్ప వరముల నిచ్చెను (19). మహేశ ఉవాచ | త్వం కర్తా సర్వలోకానాం భర్తా హర్తా మదాజ్ఞయా | దాతా ధర్మార్థకామానాం శాస్తా దుర్నయ కారిణామ్ ||
20 జగదీశో జగత్పూజ్యో మహాబల పరాక్రమః | అజేయస్త్వం రణ క్వాపి మమాపి హి భవిష్యసి ||
21 శక్తిత్రయం గృహాణ త్వమిచ్ఛాది ప్రాపితం మయా | నానాలీలా ప్రభావత్వం స్వతంత్రత్వం భవత్రయే ||
22 త్వద్ద్వేష్టారో హరే నూనం మయా శ్వాస్యాః ప్రయత్నతః | త్వద్భక్తానాం మయా విష్ణోదేయం నిర్వాణముత్తమమ్ ||
23 మహేశ్వరుడిట్లు పలికెను - నీవు లోకములన్నింటికీ నా ఆజ్ఞచే కర్తవు. భరించువాడవు, హరించు వాడవు. ధర్మ, అర్థ, కామముల నిచ్చువాడవు, దుర్మార్గులను శిక్షించువాడవు (20). నీవు జగత్తునకు ప్రభువు. నీకు జగత్తునకు పూజ్యుడవు. మహాబల పరాక్రమములు గల నీవు ఎక్కడనైననూ నాకు కూడా జయింప శక్యము కానివాడవు కాగలవు(21). నేను నీకు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను ఇచ్చెదను. నీవు స్వీకరింపుము. ముల్లోకములలో అనేక లీలలను ప్రకటించగలిగే మహిమను, స్వాతంత్ర్యమును స్వీకరింపుము (22). ఓ హరీ! నిన్ను ద్వేషించువారిని నేను ప్రయత్నపూర్వకముగా దండించుట నిశ్చయము. ఓ విష్ణో! నీ భక్తులకు నేను ఉత్తమమగు మోక్షము నిచ్చెదను (23). మాయాం చాపి గృహాణమాం దుః ప్రణోద్యాం సురాదిభిః | యయా సంమోహితం విశ్వమచి ద్రూపం భవిష్యతి ||
24 వామ బాహుర్మ దీయస్త్వం దక్షిణోऽసౌ విధిర్హరే | అస్యాపి హి విధేః పాతా జనితాపి భవిష్యసి ||
25 హృదయం మమ యో రుద్రస్స ఏవాహం న సంశయః | పూజ్యస్తవ సదా సోऽపి బ్రహ్మాదీనామపి ధ్రువమ్ ||
26 అత్ర స్థిత్వా జగత్సర్వం పాలయ త్వం విశేషతః | నానా వతారభేదైశ్చ సదా నానోతి కర్తృభిః ||
27 దేవతలు కూడ తపింప శక్యము కాని ఈ మాయనను కూడా స్వీకరించుము. దీనిచే సంమోహితమైన జగత్తు జడాత్మకమగును (24). ఓ హరీ! నీవు నా ఎడమ చేయి. ఈ బ్రహ్మ నా కుడిచేయి. ఈ బ్రహ్మకు కూడా నీవు తండ్రివి. రక్షకుడవు కాగలవు (25). రుద్రుడు నా హృదయము. నేనే రుద్రుడు. దీనిలో సంశయము లేదు. రుద్రుడు నీకు, మరియు బ్రహ్మాదులకు కూడ పూజ్యుడు. ఇది నిశ్చయము.(26). నీవు ఇచటనే ఉండి జగత్తునంతనూ పాలించుము. మరియు, విశేషించి అనేక అవతారములనెత్తి, ఆ అవతారములలో వివిధ లీలలను ప్రకటించుము (27). మమ లోకే తవేదం చ స్థానం చ పరమర్థిమత్ | గోలోక ఇతి విఖ్యాతం భవిష్యతి మహోజ్జ్వలమ్ ||
28 భవిష్యంతి హరే యే తేऽవతారా భువి రక్షకాః | మద్భక్తాంస్తాన్ ధ్రువం ద్రక్ష్యే ప్రీతానథ నిజాద్వరాత్ ||
29 నా లోకములో నీ యీ స్థానము సర్వసమృద్ధమై గోలోకమని ఖ్యాతిని బడసి అద్భుతముగా ప్రకాశించగలదు (28). ఓ హరీ! భూమియందు సాధువులను రక్షించే నీ అవతారములు ఏవి రాగలవో, వారందరు నిశ్చయముగా నా భక్తులుగను, నా వరములచే ప్రీతులుగను ఉండగలరు. నేను వారిని అట్లు చూడగలను (29). రామ ఉవాచ | అఖండైశ్వర్య మాసాద్య హరేరిత్థం హరస్స్వయమ్ | కైలాసే స్వగణౖ స్తస్మిన్ సై#్వరం క్రీడత్యుమాపతిః ||
30 తదా ప్రభృతి లక్ష్మీశో గోపవేషోऽభవత్త థా | అయాసీత్తత్ర సుప్రీత్యా గోపగోపీ గవాం పతిః ||
31 సోऽపి విష్ణుః ప్రసన్నాత్మా జుగోప నిఖిలం జగత్ | నానావతార సంధర్తాऽవనకర్తా శివాజ్ఞయా ||
32 ఇదానీం స చతుర్ధాత్రావతరచ్ఛంకరాజ్ఞయా | రామోహం తత్ర భరతో లక్ష్మణశ్శత్రుహేతి చ ||
33 రాముడిట్లు పలికెను - ఈ విధముగా ఉమాపతియగు శంభుడు విష్ణువునకు స్వయముగా అఖండైశ్వర్యమును సంక్రమింపజేసి, ఆ కైలాస పర్వతమునందు తన గణములతో కూడి యథేచ్ఛగా క్రీడించుచున్నాడు (30). ఆనాటి నుండియు లక్ష్మీపతి గోపవేషమును ధరించి, అచటకు ఆనందముగా వెళ్లి, గోపులకు, గోపికలకు, గోవులకు ప్రభువు ఆయెను (31). మరియు ఆ విష్ణువు ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని యాజ్ఞచే అనేక అవతారములను ధరించి సర్వ జగత్తును రక్షించెను (32). ఆయన ఇపుడు ఇచట శంకరుని ఆజ్ఞచే నాల్గు రూపములతో అవతరించినాడు. వారిలో నేను రాముడను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు మిగిలిన వారు (33). అథ పిత్రాజ్ఞయా దేవి ససీతా లక్ష్మణస్సతి | ఆగతోऽహం వనే చాద్య దుఃఖితౌ దైవతోऽభవమ్ || 34 నిశాచరేణ మే జాయా హృతా సీతేతి కేనచిత్ | అన్వేష్యామి ప్రియాం చాత్ర విరహీ బంధునా వన్ ||
35 దర్శనం తే యది ప్రాప్తం సర్వథా కుశలం మమ | భవిష్యతి న సందేహో మాతస్తే కృపయా సతి ||
36 సీతా ప్రాప్తివరో దేవి భవిష్యతి న సంశయః | తం హత్వా దుఃఖదం పాపం రాక్షసం త్వదనుగ్రహాత్ ||
37 ఓ సతీ దేవీ! నేను తండ్రి యాజ్ఞచే సీతాలక్ష్ముణులతో గూడి వనమును వచ్చితిని. ఈనాడు దైవవశమున మేము దుఃఖితులమైతిమి(34) ఎవరో ఒక రాక్షసుడు నా భార్యయగు సీతను అపహరించినాడు. నేను అట్టి విరహము గలవాడనై తమ్మునితో గూడి ఈ అడవియందు నా ప్రియురాలిని వెదకుచున్నాను. (35) నీ దర్శనము లబించినది గాన, నాకు అన్ని విధములా క్షేమము కలుగ గలదు. ఓ సతీ తల్లీ! నీదయచే దీనిలో సందేహమును లేదు(36). నాకు నీనుండి సీత లభించుట అను వరము నిశ్చయముగా ప్రాప్తించును. నీ అనుగ్రహముచే నాకు దుఃఖమును కలుగజేసిన ఆరాక్షసుని, ఆ పాపాక్ముని వధించెను(37). మహాద్భాగ్యం మమాద్యైవ యద్యకార్ఘం కృపాం యువామ్| యస్మిన్ స కరుణౌ స్యాతాం స ధన్యః పురుషోవరః||38 ఇత్థమాభాష్య బహుధా సుప్రణమ్య సతీం శివామ్| తదాజ్ఞయా వనే తస్మిన్ విచచార రఘూద్వహః||39 అథా కర్ణ్య సతీ వాక్యం రామస్య ప్రయాతాత్మనః| హృష్టా భూత్సా ప్రసంసంతీ శివభక్తి రతం హృది|| 40 స్మృత్వా స్వకర్మ మనసా కార్షీ చ్ఛోకం సువిస్తరమ్| ప్రత్యాగచ్ఛదుదాసీనా వివర్ణా శివసన్నిదౌ|| 41 మీరిద్దరు ఈనాడే నా యందు దయను చూపినారు. ఇది మాహాభాగ్యము . మీరిద్దరు ఎవనిపై దయను చూపెదరో. అట్టి పురుషుడు ధన్యుడు, శ్రేష్ఠుడు(38). రఘురాముడు శివపత్నియగు సతితో నిట్లు పలికి,అనేక పర్యాయములు ప్రణమిల్లి ఆమె ఆజ్ఞచే ఆ వనమును సంచరించెను. (39). జితేంద్రియుడగు రాముని ఈ వాక్యములను విని, సతీదేవి చాల సంతసించి, అతని శివభక్తిని తన హృదయములో చాల మెచ్చుకొనెను(40). తాను చేసిన పనిని గుర్తునకు తెచ్చుకొని , ఆమె మనస్సులో అతిశయించిన దుఃఖమును పొందెను. ఆమె దుఃఖముతో పాలిపోయిన ముఖముగలదై నిరుత్సాహముగా శివుని వద్దకు తిరిగి వచ్చెను(41). అచింతయత్పధి సా దేవీ సంచలంతీ పునఃపునః | నాం గీ కృతం శివోక్తం మే రామం ప్రతి కుధీః కృతా|| 42 కిముత్తరమహం దాస్యే గత్వా సంకరసన్నిధౌ| ఇతి సంచిత్యబహుధా పశ్చాత్తాపోऽ భవత్తదా||43 గత్వాశంభు సమీపం చ ప్రమనామ శివం హృదా |విషణ్ణ వదనా శోక వ్యాకులా విగత ప్రభా|| 44 అథ తాం దుఃఖితాం దృష్ట్వా పప్రచ్ఛ కుశలం హరః| ప్రోవాచ వచనం ప్రీత్యా తత్పరీక్షా కృతా కథమ్|. 45 ఆ దేవి మార్గమునందు నడుస్తూ అనేక పర్యాయములు లిట్లు చింతిల్లెను. శివుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి, నేను రాముని విషయంలో చెడు ఆలోచనను చేసితిని.(42).శంకరుని వద్దకు వెళ్లి నేను, ఏమి సమాధానమును చెప్పగలను? అపుడామె ఇట్లు పరిపరివిధముల చింతిల్లి పశ్చాత్తాపమును పొందెను. (43). ఆమె శోకముతో నిండిన హృదయమున గలదై కాంతిని గోల్పోయి విషాదభరితమైన ముఖముతో సంభుని సమీపమునకు వెళ్లి నమస్కరించెను(44). శివుడు దుఃఖతరాలగు ఆమెను చూచి క్షేమమేనా ?అని ప్రశ్నించెను రాముని ఏ విధముగా పరీక్షించితివి ?అని ఆయన ప్రీతితో పలికెను(45). శ్రుత్వా శివవచో నాహం కిమపి ప్రణతాననా | సతీ సోక విషణ్ణా సా తస్థౌ తత్ర సమీపతః|| 46 అథ ధ్యాత్వా మహేశస్తు బుబోధ చరితం హృదా | దక్షజా యా మహా యోగీ నానాలీలా విశారదః||47 సస్మార స్వపణం పూర్వం యత్కృతం హరికోపతః| తత్ప్రార్థితోऽథ రుద్రోऽసౌ మర్యాదా ప్రతిపాలకః||48 విషాదోऽ భూత్ప్రభోస్తత్ర మనస్యేవమువాచ హ| ధర్మవక్తా ధర్మకర్తా ధర్మావన కరస్సదా|| 49 శివుని మాటను విని ఆమె తలవంచుకొని ఏమియూ మాటలాడకుండెను. శోకముతో నిండిన హృదయము గల సతి ఆయనకు దగ్గరగా నిలబడియుండెను(46) అపుడు మహాయోగి, నానాలీలా దక్షుడు అగు మహేశ్వరుడు ధ్యానమార్గములో దక్షపుత్రి యొక్క ఆచరణను తెలుసుకొనెను(47). మర్యాదను రక్షించే ఆ రుద్రుడు విష్ణువు ప్రార్థించగా తాను పూర్వము చేసిన ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకొనెను. (48). ఆ ప్రభువునకు విషాదముకలిగెను. ధర్మమును పలికి, ఆచరించి, ధర్మమునూ సదా రక్షించే శివుడు తన మనస్సులో నిట్లనుకొనెను(49). శివ ఉవాచ| కుర్యాంచేద్ధక్షజాయాం హి స్నేహం పూర్వం యథా మహాన్| నశ్యేన్మమ పణశ్శుద్ధో లోకలీలాను సారిణః|| 50 శివుడిట్లు పలికెను- నేను దాక్షాయణి యందు పూర్వమునందు వలె ప్రేమను కలిగియున్నచో, లోకలీలను అనుసరించే నా యొక్క శుద్ధమగు మహా శపథము నశించును(50). బ్రహ్మోవాచ| ఇత్థం విచార్య బహుధాహృదా తామత్య జత్సతీమ్| పణం న నాశయామాస వేద ధర్మ ప్రపాలకః|| 51 తతో విహాయ మనసా సతీం తాం పరమేశ్వరః| జగామ స్వగిరిం ఖేదం జగావద్ధా స హి ప్రభుః|| 52 చలంతం పథిం తం వ్యోమ వాణ్యువాచ మహేశ్వరమ్| సర్వాన్ సంశ్రావయన్ తత్ర దక్షజాం చ విశేషతః|| 53 బ్రహ్మ ఇట్లు పలికెను- వేద ధర్మమును నిష్ఠతో పాలించు శివుడు ఇట్లు పరిపరివిదముల తలపోసి, హృదయములో సతిని త్యజించి శపథము నష్టము కాకుండునట్లు చేసెను(51). అపుడా పరమేశ్వరుడు ఆ సతీదేవిని మనస్సులో త్యజించి తన కైలాసమునకు వెళ్లెను. ఆశ్చర్యము !ఆ ప్రభువు దుఃఖమును పొందెను. (52). మార్గమునందు వెళ్లుచున్న ఆ మహేశ్వరుని ఉద్దేశించి, సర్వులు విశేషించి సతీదేవి వింటూ ఉండగా , ఆకాశవాణి ఇట్లు పలికెను(53). వ్యోమ వాణ్యువాచ| ధన్యస్త్వం పరమేశాన త్వత్సమోऽద్య తథా పణః కోऽప్య న్యస్త్రి లోకేऽస్మిన్ మహాయోగీ మహాప్రభుః|| 54 ఆకాశవాణి ఇట్లు పలికెను- ఓ పరమేశ్వరా! నీవు ధన్యుడవు. నీతో సమముగా శపథమును నెరవేర్చుకోగల మహాయోగి, మహాప్రభువు ఈ ముల్లోకములలో మరియొకడు లేడు (54). బ్రహ్మోవాచ| శ్రుత్వా వ్యోమవచో దేవీ శివం పప్రచ్ఛ విప్రభా | కం పణం కృతవాన్నాథ బ్రూహిమే పరమేశ్వర|| 55 ఇతి పృష్టోऽపి గిరిశస్సత్యా హితకరంః ప్రభుః| నో ద్వాహే స్వం పణం తసై#్య హర్యగ్రే ऽకరోత్పురా || 56 తదా సతీశివం ధ్యాత్వా స్వపతిం ప్రాణవల్లభమ్| సర్వం బుభోధహేతుం తం ప్రియ త్యాగమయం మునే ||57 తతో ऽతీవ శుశోచాశు బుద్ధ్వా సా త్యాగమాత్మనః| సంబునా దక్షణా జస్మాన్ని శ్శ్వసంతీ ముహుర్ముహుః|| 58 శివస్త స్యాస్సమాజ్ఞాయ గుప్తం చక్రే మనోభావమ్| సత్యే పణం స్వకీయం హి కథా బహ్వీర్వాదన్ ప్రభుః|| 59 బ్రహ్మ ఇట్లు పలికెను- ఈ ఆకాశవాణిని వినగానే సతీదేవి కాంతిని కోల్పోయి శివుని ఇట్లు ప్రశించెను. నాథా !నీవుచేసిన శపథమేమి? నాకు చెప్పుడు(55) హితమును చేయు ఆ శివ ప్రభుడు, సతీదేవి ఇట్లు ప్రశ్నించిననూ, తాను వివాహములో పూర్వము విష్ణువు యెదుట చేసిన శపథమును వెల్లడించలేదు(56). అపుడు సతి ప్రాణ ప్రియుడు, తన భర్తయగు శివనిధ్యానించెను. ఓ మహర్షీ !తన ప్రియుడు తనను త్యజించుటకు గల కారణము ఆమెకు సమగ్రముగా అవగతమయ్యెను(57). అపుడు ఆ దాక్షాయణి శంభుడు తనను వీడుట లెరింగి, అనవరతము నిట్టూర్పులు విడుచుచూ, మిక్కిలి దుఃఖించెను(58). శివునకు ఆమె మనోగతము అవగతమయ్యెను. ఆ ప్రభుడు ఇతరములగు అనేక గాథలను ప్రస్తావించి తన సత్యశపథమును ప్రస్తావించకుండా గుప్తముగ నుంచెను(59). సత్యా ప్రాప కైలాసం కథయమ్ వివిధాః కథాః| వరే స్థిత్వా నిజం రూపం దధౌ యోగీ సమాధి భృత్|| 60 తత్ర తస్థౌ సతీ దామ్ని మహావిషణ్ణ మానసా | న బుబోధ చరిత్రం తత్కశ్చిచ్చ శివయోర్మునే || 61 మహాన్ కాలో వ్యతీయాయ తయోరిత్థం మహామునే | స్వోపాత్త దేహయోః ప్రబ్వోర్లోక లీలాను సారిణోః|| 62 ధ్యానం తత్యాజ రిగిశస్త తస్స పరమార్తి హృత్| తద్ జ్ఞాత్వా జగదంబా హి సతీ తత్రాజ గామసా|| 63 ఆయన సతితోగూడి వివిధ వృత్తాంతములను చెప్పుచూ, కైలాసమును చేరుకొనెను. ఆ శివయోగి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండి సమాధిని పొంది ఆత్మాను సంధానమును జేసెను. (60) ఆ కైలాస దామమునందు సతీదేవి మహా దుఃకముతో కూడిన మనస్సుతో నుండెను, ఓ మహర్షీ !లోకలీలను అనుసరించు నట్టియు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గల్గినట్టుయు, సర్వసమర్థులైన ఆ సతీ శివులు ఇట్లు చిరకాలమును గడిపిరి(62). అపుడు భక్తుల మహా దుఃఖములనైననూ తొలగించు ఆ శివుడు ధ్యానమును వీడెను. ఆ విషయమును నెరింగి జగన్మాతయగు ఆ సతి అచటకు విచ్చేసెను(63). ననామాథ శివం దేవీ హృదయేన విదూయతా| ఆసనం దత్తవాన్ సంభుస్స్వసమ్ముఖ ఉదార ధీః|| 64 కథయా మాల సుప్రీత్యా కథా బహ్వీర్మనోరమాః| నిశ్శోకాం కృతావాన్ సద్యో లీలాం కృత్వా చ తా దృశీమ్|| 65 పూర్వవత్సా సుఖం లేభే తత్యాజ స్వపణం నసః| నేత్యాశ్చర్యం శివే తాత మంతవ్యం పరమేశ్వరే|| 66 దుఃఖముతో నిండిన హృదయముతో ఆ దేవి శివునకు నమస్కరించెను. విశాల హృదయుడగు శంభుడు తన ఎదురుగా ఆమెకు ఆసనము నిచ్చెను(64). ఆయన ఆమెకు మిక్కిలి ప్రీతితో మనోహరములగు అనేక గాథలను చెప్పెను. ఆప్రభుడు అట్టి లీలను ప్రదర్శించి, వెను వెంటనే ఆమె దుఃఖమును తొలగించి వేసెను.(65). ఆమె పూర్వమునందు వలనే ఆనందించెను. ఆయన తన శపథమును వీడలేదు. వత్సా!పరమేశ్వరుడగు శివుని విషయములో ఆశ్చర్యమనునది లేదని యెరుంగవలెను(66). ఇత్థం శివాశివ కథాం వదన్తి మునయో మునే| కిలకేచి దవిద్వాం సో వియోగశ్చ కథం తయోః|| 67 శివాశివ చరిత్రం కో జానాతి పరమార్థతః| స్వేచ్ఛయా క్రీడతో స్తయోర్హి చరితం కురుతస్సదా|| 68 వాగర్థా వివ సంపృక్తౌ సదా ఖలు సతీ శివౌ| తయోర్వియోగస్సం భావ్య స్సంభ##వేదిచ్ఛయా తయోః|| 69 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితియే సతీఖండే సతీ వియోగో నామ పంచవింశోऽద్యాయః(25) ఓ మహర్షీ మహర్షులు శివాశివుల గాథను ఇట్లు వర్ణించిరి. కొందరు విద్వాంసులు కానివారు వారికి వియోగమును వర్ణించిరి. కాని, వారికి వియోగమెట్లు సంభవమగును (67) శివాశివుల చరిత్రను యథార్థముగా ఎవ్వరు యెరుంగ గలరు? వారిద్దరు తమ ఇచ్ఛచే క్రీడించి, చరిత్రను సృష్టించుచుందురు గదా !(68) సతీ శివులు శబ్దార్థముల వలె నిత్యము కలిసియుందురు గదా! వారికి అట్టి ఇచ్ఛ కలిగిన పక్షములో మాత్రమే వారిద్దరికీ వియోగము సంభవమగును(69). శ్రీ శివమహాపురాణములో రెండవదియగు సతీ ఖండములో సతీ వియోగమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది(25)