Sri Sivamahapuranamu-I
Chapters
అథ సప్తమోsధ్యాయః కూట సాక్ష్యము ఈశ్వర ఉవాచ | వత్సకాః స్వస్తివః కచ్చిద్వర్తతే మమ శాసనాత్ | జగచ్చ దేవతా వంశః స్వస్వకర్మణి కిం న వా ||
1 ప్రాగేవ విదితం యుద్ధం బ్రహ్మ విష్ణ్వోర్మయా సురాః | భవతా మభితాపేన పౌనరుక్త్యేన భాషితమ్ ||
2 ఇతి సస్మితయా మాధ్య్వా కుమార పరిభాషయా | సమతోషయదంబాయాః స పతిస్తత్సుర వ్రజమ్ ||
3 అథ యుద్ధాంగణం గంతుం హరిధాత్రో రధీశ్వరః | ఆజ్ఞాపయద్గణశానాం శతం తత్రవై సంసది ||
4 ఈశ్వరుడిట్లు పలికెను- ప్రియమైన దేవతలారా! నా శాసనము వలన మీకు మంగళకరముగ నున్నదా ? జగత్తు, దేవ వంశములు తమ తమ కర్మల యందు నిమగ్నమై యున్నవా, లేవా? (1) ఓ దేవతలారా! బ్రహ్మ విష్ణువుల యుద్ధము నాకు ముందుగనే తేలియును. మీ కలవరమును చూచిన నాకు మరల చెప్పినట్లైనది (2). అంబికాపతి ఈ విధముగా చిరునవ్వుతో కూడిన తేనె పలుకులతో కుమారులను లాలించిన తీరున పలికి ఆ దేవతలను సంతోషపెట్టెను (3). తరువాత, బ్రహ్మ విష్ణులకు ప్రభువు అగు శివుడు ఆ సభలో వంద ప్రమథ గణాధిపతులను యుద్ధరంగమునకు వెళ్లుడని ఆజ్ఞాపించెను.(4). తతో వాద్యం బహువిధం ప్రయాణాయ పరేశితుః | గణశ్వరాశ్చ సన్నద్ధా నానావాహన భూషణాః ||
5 ప్రణవాకార మాద్యం తం పంచమండల మండితమ్ | ఆరురోహ రథం భద్ర మంబికాపతి రీశ్వరః ||
6 ససూను గణ మింద్రాద్యాః సర్వేష్యను యయుస్సురాః | చిత్రధ్వజ వ్యజన చామర పుష్ప వర్ష- సంగీత నృత్య నివహైరపి వాద్యవర్గైః | సమ్మానితః పశుపతిః పరయా చ దేవ్యా సాకం తయోస్సమర భూమి మగాత్స సైన్యః || 7 అపుడు శివుని ప్రయాణము కొరకు అనేక విధముల వాద్యములు, అలంకారములతో కూడిన అనేక వాహనములు సిద్ధము చేయబడెను. ప్రమథ గణాధిపతులు కూడ సిద్ధమైనారు (5). ఓంకారాకారము కల్గిన, అయిదు మండలములచే అలంకరింపబడిన, మంగళకరమగు మొట్టమొదటి రథమును అంబికాపతి యగు శివుడు అధిష్ఠించెను (6). కుమారులతో, గణములతో కూడి యున్న శివుని ఇంద్రాది దేవతలందరు అనుసరించిరి. రంగు రంగుల ధ్వజములతో, వింజామరలతో, పుష్పవర్షముతో, సంగీతముతో నాట్యమాడే గుంపులతో, వాద్య సమూహములతో అలరారుచున్న పశుపతి పరాదేవితో గూడి సైన్య సమేతుడై వారిద్దరి యుద్ధరంగమునకు వెళ్లెను (7). సమీక్ష్య తు తయో ర్యుద్ధం నిగూఢోsభ్రం సమాస్థితః | సమాప్త వాద్య నిర్ఘోషః శాంతోరుగణనిః స్వనః || 8 అథ బ్రహ్మాచ్యుతౌ వీరౌ హంతుకామౌ పరస్పరమ్ | మహేశ్వరేణ చాస్త్రేణ తథా పాశుపతేన చ || 9 అస్త్రజ్వాలైరథో దగ్ధం బ్రహ్మవిష్ణ్వోర్జగత్త్రయమ్ | ఈశోపి తం నిరీక్ష్యాథ హ్యకాలప్రలయం భృశమ్ || 10 మహానలస్తంభ విభీషణాకృతిర్భభూవ తన్మధ్యతలే స నిష్కలః || 11 శివుడు ఆకాశము నందు రహస్యముగా నుండి వారి యుద్ధమును తిలకించెను. వాద్యముల ఘోష ఆపివేయబడెను. గణములు చేయు పెద్ద ధ్వని చల్లారెను (8). ఇంతలో వీరులగు బ్రహ్మ విష్ణువులు పరస్పరము సంహరించే ఉద్దేశ్యముతో మహేశ్వర, పాశుపతాస్త్రములను ప్రయోగించియుండిరి (9). బ్రహ్మ, విష్ణువుల ఈ అస్త్రముల జ్వాలలచే ముల్లోకములు తగులబడుచుండెను. ఆ నిరాకారుడగు శివుడు ఈ భీకరమగు అకాల ప్రలయమును చూసి (10). అతి భయంకరమగు ఆకారము గల పెద్ద అగ్ని స్తంబము యొక్క ఆకృతిని దాల్చి వారిద్దరి మధ్య నిలచెను (11). తే అస్త్రే చాపి స జ్వాలే లోకసంహరణ క్షమే | నిపేతతుః క్షణనైవ హ్యావిర్భూతే మహానలే || 12 దృష్ట్వా తదద్భుతం చిత్ర మస్త్ర శాంతికరం శుభమ్ | కిమే త దద్భుతాకార మిత్యూచుశ్చ పరస్పరమ్ || 13 అతీంద్రియమిదం స్తంభమగ్నిరూపం కిముత్థితమ్ | అస్యోర్ధ్వ మపి చాధశ్చ అవయోర్లక్ష్యమేవ హి || 14 ఇతి వ్యవసితౌవీరౌ మిలితౌ వీరమానినౌ | తత్పరౌ తత్పరీక్షార్థం ప్రతస్థాతేsథ సత్వరమ్ || 15 లోకములను తగులబెట్టే విధముగా మండుచున్న ఆ రెండు అస్త్రములు అచట ఆవిర్భవించిన మహాగ్ని స్తంభములో పడి క్షణకాలములో దానిలో కలిసిపోయెను (12). ఈ విధముగా అస్త్రములను శాంతింపజేసి, శుభమును కలిగించిన ఆ విస్మయావహమగు విచిత్ర అగ్ని స్తంభమును చూచి, దేవతలు తమలో తాము ''ఏమి ఈ అద్భుతమగు ఆకారము!'' అని మాటలాడ జోచ్చిరి (13). ''ఇచట ఆవిర్భవించిన ఈ అగ్ని స్తంభము దుర్నిరీక్ష్యముగా నున్నది. ఇది ఏమై ఉండును? మనమిద్దరము దీని ఆద్యంతమును కనుగొనవలెను (14).'' అని ఆ వీరులగు బ్రహ్మ విష్ణువులు నిశ్చయించుకొని, తమ పరాక్రమమునందు అతిశయించిన గర్వము గలవారై, ఆస్తంభమును పరీక్షీంచుట యందు లగ్నమైన మనస్సు గలవారై, వెనువెంటనే బయలుదేరిరి (15). ఆవయోర్మిశ్రయోస్తత్ర కార్యమేకం న సంభ##వేత్ | ఇత్యుక్త్వా సూకరతనుః విష్ణుస్తస్యాది మీయినవాన్ || 16 తథా బ్రహ్మ హంస తనుస్తందంతం వీక్షితుం య¸° | భిత్త్వా పాతాల నిలయం గత్వా దూరతరం హరిః || 17 నాపశ్యత్తస్య సంస్థానం స్తంభస్యానలవర్చసః | శ్రాంతస్స సూకరహరిః ప్రాప పూర్వం రణాంగణమ్ || 18 'మనమిద్దరము కలిసి వెళ్లినచో, ఒక అగ్రమును చూడలేకపోతాము' అని పలికి విష్ణువు వరాహరూపమును దాల్చి, దాని ఆదిని చేరుటకు బయలుదేరివెళ్లెను (16). అదే విధముగా, బ్రహ్మ హంసరూపమును దాల్చి, దాని అంతమును చూచుటకు వెళ్లెను(17). వరాహరూపుడగు విష్ణువు ఆ అగ్ని స్తంభము యొక్క ఆదిని కనుగొనలేక, అలసి, మరల యుద్ధస్థానమునుకు బ్రహ్మకంటె ముందుగా తిరిగివచ్చెను (18). అథ గచ్ఛంస్తు వ్యోమ్నా చ విధిస్తాత పితా తవ | దదర్శ కేతకీపుష్పం కించిద్విచ్యుత మద్భుతమ్ || 19 అతి సౌరభ్య మవ్లూనం బహువర్షచ్యుతం తథా | అన్వీక్ష్య చ తయోః కృత్యం భగవాన్ పరమేశ్వరః || 20 పరిహాసం తు కృతవాన్ కంపనాచ్చలితం శిరః | తస్మాత్తా వనుగృహ్ణాతుం చ్యుతం కేతకముత్తమమ్ || 21 కిం త్వం పతసి పుష్పేశ పుష్పరాట్ కేన వా ధృతమ్ | ఆది మస్యా ప్రమేయస్య స్తంభమధ్యాచ్చ్యుతశ్చిరమ్ || 22 న సంపశ్యామి తస్మాత్త్వం జహ్యాశామంత దర్శనే | అస్యాంతస్య చ సేవార్థం హంసమూర్తి రిహాగతః || 23 ఇతఃపరం సఖేమేsద్య త్వయా కర్తవ్యమీప్సితమ్ | మయా సహ త్వయా వాచ్య మేత ద్విష్ణోశ్చ సన్నిధౌ || 24 స్తంభాంతో వీక్షితో ధాత్రా తత్ర సాక్ష్యహమచ్యుత | ఇత్త్యుక్త్వా కేతకం తత్ర ప్రణనామ పునః పునః || 25 ఓవత్సా! నీతండ్రి యగు బ్రహ్మ ఆకాశములో వెళ్లుచూ, కొంచెము ప్రక్క నుండి జారుచున్న అద్భుతమగు మొగలిపువ్వును చూచెను (19). అది వాడనిదై, మిక్కిలి సుగంధము కలిగియుండెను. అది జారి చాల కాలము గడచెను. వారిద్దరి ఘర్షణను చూచి, భగవానుడగు పరమేశ్వరుడు (20) నవ్వగా, ఆ కదలిక వలన శిరస్సు నుండి ఉత్తమ మగు మొగలిపువ్వు జారెను. ఈ విధముగా శివుడు వారినిద్దరిని అనుగ్రహించెను (21). 'ఓపుష్పరాజమా! నీవు ఏల పడుచుంటివి?నిన్ను ధరించినది ఎవరు?' అని బ్రహ్మ ప్రశ్నించెను. 'నేను దుర్నిరీక్ష్యమగు ఈ స్తంభము యొక్క ఆదిని చూడలేదు. నేను చిరకాలము క్రిందట స్తంభము యొక్క మధ్యభాగమునుండి జారితిని (22). కావున దీని అగ్రమును చూచే ఆశను నీవు వదలుకొనుము' అని పుష్పము బదులిడెను. 'నేను దీని అగ్రమును సేవించుటకై హంసరూపముతో ఇచటకు వచ్చితిని (23)'. ఓ మిత్రమా! నీవు ఇపుడు నాకు ఒక కోరికను నెరవేర్చాలి. నీవు నాతో విష్ణువు వద్దకు వచ్చి (24), 'బ్రహ్మస్తంభము యొక్క అగ్రమును చూచినాడు; ఓఅచ్యుతా! నేను సాక్ష్యము' అని చెప్పవలెను అని పలికి, బ్రహ్మ ఆ పుష్పమునకు అనేక పర్యాయములు ప్రణమిల్లెను (25) అసత్యమపి శస్తం స్యాదాపదీత్యనుశాసనమ్ | సమీక్ష్య తత్రా చ్యుత మాయత శ్రమం ప్రణష్ట హర్షం తు ననర్త హర్షాత్ | ఉవాచ చైనం పరమార్థ మచ్యుతం షంఢాత్తవాద స్స విధిస్తతోsచ్యుతమ్ || 26 స్తంభాగ్రమేతత్సము దీక్షితం హరే తత్రైవ సాక్షీ నను కేతకం త్విదమ్ | తతోsవదత్తత్ర హి కేతకం మృషా తథేతి తద్ధాతృ వచస్తదంతికే || 27 హరిశ్చ తత్సత్యమితీవ చింత యన్ చకార తసై#్మ విధయే నమః స్వయమ్ | షోడశైరుపచారైశ్చ పూజయామాస తం విధిమ్ || 28 ఆపత్కాలములో అసత్యమాడుట శాస్త్ర సమ్మతమేనని బ్రహ్మ ఆ పుష్పమును ఒప్పించెను. విష్ణువు మిక్కిలి శ్రమను జెంది, హర్షము తొలగినవాడై, యుద్ధరంగమునందు ఉండుటను గాంచిన బ్రహ్మ ఆనందముతో నృత్యము చేసెను. అపుడు అసత్యమును ఆసరాగా చేసుకొనిన బ్రహ్మ సత్యమునకు కట్టుబడిన విష్ణువును ఉద్దేశించి ఇట్లు పలికెను (26). ఓ హరీ! నేను ఈస్తంభము యొక్క అగ్రభాగమును చక్కగా చూచితిని. దీనికి ఈ కేతకపుష్పమే సాక్షి అని పలికెను. అపుడా కేతకపుష్పము విష్ణువుతో 'అవును' అని అసత్యమును పలికెను (27). విష్ణువు ఆ మాట సత్యమేనని భావించి, బ్రహ్మకు నమస్కరించి, షోడశోపచారములతో పూజించెను (28). విధిం ప్రహర్తుం శఠమగ్ని లింగతః స ఈశ్వరస్తత్ర బభూవ సాకృతిః | సముత్థితః స్వామి విలోకనాత్పునః ప్రకంపపాణిః పరిగృహ్య తత్పదమ్ || 29 ఆద్యంతహీనవపుషి త్వయి మోహ బుద్ధ్వా | భూయాద్విమర్శ ఇహ నావతి కామనోత్థః || స త్వం ప్రసీద కరుణాకర కశ్మలం నౌ | మృష్టం క్షమస్య విహితం భవతైవ కేల్యా || 30 మోసము చేసిన బ్రహ్మను శిక్షించుటకై ఈశ్వరుడు అగ్నిలింగము నుండి అచట సాకారముగా ఆవిర్భవించెను. విష్ణువు ఈశ్వరుని చూచి, లేచి, వణకుతున్న చేతులతో ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు పలికెను (29). నీ ఈ దేహము ఆది, అంతములు లేనిది. కాని, మేమిద్దరము మోహముతో నిండిన బుద్ధి గలవారమై , నీ యీ అగ్నిలింగమును పరీక్ష చేయవలెనని తలంచితిమి. దయకు నిలయమైనవాడా! నీవు ప్రసన్నుడవై, మా యీ దోషమును క్షమించుము. ఇది అంతయూ నీ లీలయే గదా! (30). ఈశ్వర ఉవాచ | వత్స ప్రసన్నోsస్మి హరే యత్తస్త్వం ఈశత్వమిచ్ఛన్నపి సత్యవాక్యమ్ | బ్రూయాస్తతస్తే భవితా జనేషు సామ్యం మయా సత్కృతి రప్య లఎ్థాః || 32 ఇతఃపరం తే పృథగాత్మన శ్చ | క్షేత్ర ప్రతిష్ఠోత్సవ పూజనం చ || ఇతి దేవః పురా ప్రీతః సత్యేన హరయే పరమ్ | దదౌ స్వసామ్యమత్యర్థం దేవ సంఘే చ పశ్యతి|| 33 ఇతి శ్రీ శివ మహా పురాణ విద్వేశ్వర సంహితాయాం సప్తమోsధ్యాయః (7). ఈశ్వరుడిట్లు పలికెను- వత్స!విష్ణో! నీవు ఈశ్వరత్వమును కోరువాడవే అయిననూ, సత్యమగు మాటను పలికితివి. అందువలన, నేను చాల ప్రసన్నుడనైతిని. నీకు మానవులలో నాతో సమమైన పూజా సత్కారములు లభించగలవు (31). ఈ పైన నా కంటె వేరుగా నీకు కూడ క్షేత్రము, ప్రతిష్ఠ, ఉత్సవము, పూజ ఉండగలవు (32). శివుడు ఈ తీరున విష్ణువు యొక్క సత్యవాక్య పాలనమునుకు మిక్కిలి సంతసించి, దేవతాగణములు చూచుచుండగా, తనతో సమమగు స్ధాయిని ఇచ్చెను (33). శ్రీ శివ మహా పురాణములోని విద్యేశ్వర సంహిత యందు ఏడవ అధ్యాయము ముగిసినది (7).