Sri Sivamahapuranamu-I
Chapters
అథ షడ్వింశోऽధ్యాయః దక్షుని విరోధము బ్రహ్మోవాచ | పురాభవచ్చ సర్వేషామధ్వరో విధినా మహాన్ | ప్రయాగే సమవేతానాం మునీనాం చ మహాత్మనామ ||
1 తత్ర సిద్ధా స్సమాయాతా స్సనకాద్యాస్సురర్షయః | సప్రజాపతయో దేవా జ్ఞానినో బ్రహ్మదర్శినః
2 అహం సమాగతస్తత్ర పరివార సమన్వితః | నిగమై రాగమైర్యుక్తో మూర్తి మద్భిర్మహా ప్రభైః ||
3 సమాజోऽ భూద్విచిత్రో హి తేషాముత్సవ శాలినామ్ | జ్ఞాన వాదోऽ భవత్తత్ర నానా శాస్త్ర సముద్భవః ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - పూర్వము ప్రయాగలో మహాత్ములగు మహర్షులందరు ఒక్కచోట గూడి, యథావిధిగా యజ్ఞమును చేసిరి (1)అచటకు సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మసాక్షాత్కార సంపన్నులు విచ్చేసిరి (2). నేనచటకు పరివార సమేతముగా వచ్చితిని. వేద శాస్త్రములు దివ్యకాంతులీను మూర్తులను ధరించి నాతో కలిసి వచ్చినవి (3). ఉత్సవములో పాల్గొను వారందరితో కూడిన ఆ కలయిక చాల విచిత్రమైనది. అచట అనేక శాస్త్ర విషయములలో జ్ఞానులగు పండితుల చర్చలు జరిగినవి (4). తస్మిన్నవసరే రుద్రస్స భవానీ గణః ప్రభుః | త్రిలోకహిత కృత్స్వా మీ తత్రా గాత్సూతి కృన్మునే ||
5 దృష్ట్వా శివం సురాస్సర్వే సిద్ధాశ్చ మునయస్తథా | అనమంస్తం ప్రభుం భక్త్యా తుష్టువుశ్చ తథా హ్యహమ్ ||
6 ఓ మహర్షీ! ముల్లోకములకు హితమును గూర్చు స్వామి, జగత్కారణుడనగు రుద్ర ప్రభువు భవానితో, ప్రమథ గణములతో గూడి అచటకు ఆ సమయములో విచ్చేసెను (5). శివుని చూచి సర్వదేవతలు, సిద్ధులు, మునులు, మరియు నేను ఆ ప్రభువునకు నమస్కరించి భక్తితో స్తుతించితిమి (6). తస్థు శ్శివాజ్ఞయా సర్వే యథాస్థానం ముదాన్వితాః | ప్రభు దర్శన సంతుష్టా వర్ణయంతో నిజం విధిమ్ ||
7 తస్మిన్నవసరే దక్షః ప్రజాపతి పతిః ప్రభుః | ఆగమత్తత్ర సుప్రీత స్సువర్చ స్వీ యదృచ్ఛయా ||
8 మాం ప్రణమ్య స దక్షో హి న్యుష్టస్తత్ర మదాజ్ఞయా | బ్రహ్మాండాధిపతిర్మాన్యో మానీ తత్త్వ బహిర్ముఖః ||
9 స్తుతిభిః ప్రణి పాతైశ్చ దక్షస్సర్వై స్సురర్షిభిః | పూజితో వరతేజస్వీ కరౌ బద్ధ్వా వినమ్రకైః ||
10 అందరు ఆనందముతో నిండిన వారై శివుని యాజ్ఞచే తమ తమ స్థానములలో ఉపవిష్టులైరి. ప్రభువు దర్శనముచే సంతసించి, వారు తమ భాగ్యమును కొనియాడిరి (7). ఆ సమయములో ప్రజాపతులలో ముఖ్యుడు, ఆనందముతో నున్నవాడు, గొప్ప తేజశ్శాలి యగు దక్షప్రభువు అనుకోకుండగా అచటకు వచ్చెను (8). ఆ దక్షుడు నాకు నమస్కరించి నా ఆజ్ఞచే అచట గూర్చుండెను. ఆతడు తానే బ్రహ్మాండమునకు అధిపతిని యను గర్వముతో నుండెను. ఆతడు తత్త్వమును దర్శించలేని బహిర్ముఖుడు (9). దేవతలు, ఋషులు అందరు వినయముతో చేతులు జోడించి, గొప్ప తేజశ్శాలి యగు దక్షుని స్తుతులతో, నమస్కారములతో పూజించిరి (10). నానా విహార కృన్నాథ స్స్వతంత్రః పరమోతి కృత్ | నానా మత్తం తదా దక్షం స్వాసనస్థో మహేశ్వరః ||
11 దృష్ట్వాऽనంతం హరం తత్రస మే పుత్రోऽప్రసన్నధీః | అకుపత్సహసా రుద్రే తదా దక్షః ప్రజాపతిః ||
12 క్రూర దృష్ట్వా మహాగర్వో దృష్ట్వా రుద్రం మహాప్రభమ్ | సర్వాన్ సంశ్రావయన్నుచ్చై రవోచత్ జ్ఞానవర్జితః ||
13 ఏతే హి సర్వే చ సురాసురా భృశం నమంతి మాం విప్రవరాస్త థర్షయః | కథం హ్యసౌ దుర్జన వన్మహా మనాస్త్వభూత్ తు యః ప్రేత పిశాచ సంవృతః ||
14 అనేక తీరుల విహరించు ప్రభువు, స్వతంత్రుడు, అద్భుతలీలలను ప్రకటించువాడు మహేశ్వరుడు తన ఆసనమునందున్న వాడై, అతి శయించిన గర్వముతో నున్నదక్షుని అపుడు చూచెను (11). నా కుమారుడగు దక్ష ప్రజాపతి అచట అనంతుడగు శివుని జూచి, అప్రసన్నమగు మనస్సు గలవాడు అయెను. అతడు వెనువెంటనే రుద్రునియందు క్రోధమును పొందెను (12) మహాగర్విష్ఠి, అజ్ఞాని యగు ఆతడు గొప్ప తేజశ్శాలి యగు రుద్రుని క్రూర దృష్టితో చూచి, అందరు వినునట్లు బిగ్గరగా నిట్లు పలికెను (13). ఈ దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణ శ్రేష్ఠులగు ఈ ఋషులు అందరు నన్ను నమస్కరించుచున్నారు. ప్రేత పిశాచములతో చుట్టు వారబడియుండే ఈ రుద్రుడు దుర్జనుని వలె నమస్కారమును చేయని గర్విష్ఠి ఎట్లు అయినాడు?(14). శ్మశాన వాసీ నిరపత్రపో హ్యాయం కథం ప్రణామం న కరోతి మేऽధునా | లుప్తక్రియో భూతపిశాచ సేవితో మత్తోऽవిధో నీతి విదూషక స్సదా ||
15 పాఖండినో దుర్జన పాపశీలా దృష్ట్వా ద్విజం ప్రోద్ధత నిందాకాశ్చ | వధ్వాం సదాసక్త రతి ప్రవీణస్త స్మా దహం శప్తు మముం ప్రవృత్తః ||
16 శ్మశానమందు నివసించే ఈ సిగ్గులేనివాడు నాకీనాడు నమస్కారము నేల చేయుట లేదు? ఈతడు వైదిక కర్మలనన్నిటినీ త్యజించి, భూతపిశాచములచే సేవింపబడుతూ, మదించివాడై, వేదవిధులను జవదాటి, సర్వదా నీతి నియముములను ఉల్లంఘించుచుండును (15). ఈతని అనుచరులు నాస్తికులు, దుర్జనులు, పాపాత్ములు. వారు బ్రాహ్మణుని చూచి బిగ్గరగా నిందింతురు. ఈతడు సర్వదా భార్యయందు అనురాగము కలిగియున్నవాడు. కావున, ఈతనిని శపించుటకై నేను ఉద్యుక్తుడనగుచున్నాను (16). బ్రహ్మోవాచ | ఇత్యేవముక్త్వా స మహాఖలస్తదా రుషాన్వితో రుద్రమిదం హ్యవోచత్ | శృణ్వంత్వమీ విప్రవరాస్తథా సురా వధ్యం హి మేచార్హథ కర్తు మేతమ్ ||
17 రుద్రో హ్యయం యజ్ఞ బహిష్కృతో మే వర్ణేష్వతీతోऽథ వివర్ణరూపః | దేవైర్న భాగం లభతాం సహైవ శ్శశానవాసీ కుల జన్మహీనః ||
18 ఇతి దక్షోక్త మాకర్ణ్య భృగ్వాద్యా బహవో జనాః | అగర్హయన్ దుష్టసత్త్వం రుద్రం మత్వామరైస్సమమ్ ||
19 నందీ నిశమ్య తద్వాక్యం లోలాక్షోऽతిరుషాన్వితః | అబ్రవీత్త్వరితం దక్షం శాపం దాతుమనా గణః ||
20 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆ మహాదుష్టుడు కోపముతో కూడినవాడై అపుడిట్లు పలికి, రుద్రుని ఉద్దేశించి మరల ఇట్లు పలికెను. బ్రాహ్మణులారా! దేవతలారా! వినుడు. ఈతడు నాచే వధింపబడుటకు అనుమతిని మీరు ఈయదగుదురు (17). ఈ రుద్రుడు యజ్ఞమునుండి బహిష్కరింపబడినాడు. వర్ణహీనుడు. వికృతరూపము గలవాడు. ఈతనితో గూడి దేవతలు యజ్ఞ భాగమును స్వీకరించరు. ఈతడు శ్శశానమునందు నివసించును. యోగ్య కులములో జన్మించినవాడు కాదు (18). ఈ దక్షుని మాటలను విని భృగువు మొదలగు ఋషులందరు దేవతలతో సహా, రుద్రుని దుష్ట వ్యక్తిగా భావించి గర్హించిరి (19). ఈ మాటలను విని నందీశ్వరుడు మిక్కిలి కోపముతో కూడిన వాడై కనుగ్రుడ్లను త్రిప్పుచూ, దక్షుని శపించగోరి, వేగముతో నిట్లనెను (20). నందీశ్వర ఉవాచ | రే రే శఠ మహామూఢ దక్ష దుష్టమతే త్వయా | యజ్ఞబాహ్యో హి మే స్వామీ మహేశో హి కృతః కథమ్ ||
21 యస్య స్మరణ మాత్రేణ భవంతి సఫలా మఖాః | తీర్థాని చ పవిత్రాణి సోయం శప్తో హరః కథమ్ ||
22 వృథా తే బ్రహ్మచాపల్యాచ్ఛప్తోయం దక్ష దుర్మతే | వృథోపహ సితశ్చైవాదుష్టో రుద్రో మహాప్రభుః ||
23 యేనేదం పాల్యతే విశ్వం సృష్టమంతే వినాశితమ్ | శప్తోయం స కథం రుద్రో మహేశో బ్రాహ్మణాధమ ||
24 నందీశ్వరుడిట్లు పలికెను - ఓరీ వంచకుడా!మహామూర్ఖా!దక్షా! దుష్టబుద్ధీ! నీవు నా స్వామియగు మహేశ్వరుని యజ్ఞ బాహ్యునిగా ఎట్లు చేసితివి?(21). ఎవనిని స్మరించినంత మాత్రాన యజ్ఞములు సఫలమగునో, తీర్థములు పవిత్రములగునో, అట్టి శివుని శపించుట ఎట్లు?(22) ఓ దుర్మతీ!దక్షా!నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివుని వ్యర్థముగా శపించితివి. దుష్టుడు గాని మహా ప్రభువగు రుద్రుని వ్యర్థముగా అవహేళన చేసితివి (23). ఓరీ బ్రాహ్మణాధమా! ఎవ్వనిచే ఈ జగత్తు సృష్టింపబడి, పాలించబడి, లయము చేయబడునో, అట్టి మహేశ్వరుడగు రుద్రుని శపించుట ఎట్లు సంభవమగును?(24). ఏవం నిర్భర్త్సి తస్తేన నందినా హి ప్రజాపతిః | నందినం చ శశాపాథ దక్షో రోషసమన్వితః ||
25 ఈ విధముగా నంది దక్షప్రజాపతిని ఎదుర్కొనెను. అపుడాతడు కోపముతో గూడినవాడై నందిని కూడా శపించెను (25). దక్ష ఉవాచ | యూయం సర్వే రుద్రగణా వేద బాహ్య భవంతువై| వేదమార్గ పరిత్యక్తా స్తధా త్యక్తా మహర్షిభిః|| 26 పాఖండవాద నిరతా శ్శిష్టాచార బహిష్కృతాః | మదిరాపాన నిరతా జటా భస్మాస్ధి ధారిణః ||27 దక్షుడిట్లు పనికెను- మీ రుద్రగణముల వారందరు వేద బాహ్యులు, వేదమార్గమును వీడినవారు, మరియు మహర్షులచే త్యజించబడినవారు అగుదురు గాక! (26) మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారమునుండి బహిష్కరింపబడినవారు, మద్యపానమునందు అభిరుచిగలవారు, జటలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురు గాక! (27). బ్రహ్మోవాచ | ఇతి శప్తాస్తథా తేన దక్షేణ శివకింకరాః | తచ్ఛ్రుత్వాతి రుషావిష్టోऽ భవన్నందీ శివప్రియః ||
28 ప్రత్యువాచ ద్రుతం దక్షం గర్వితం తం మహాబలమ్ | శిలాదతనయో నందీ తేజస్వీ శివవల్ల భః ||
29 బ్రహ్మ ఇట్లు పలికెను - దక్షుడీ విధముగా శివకింకరులను శపించగా, ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయెను (28). శిలాదుని కుమారుడు, తేజశ్శాలి, శివునకు ప్రియుడు అగు నంది మహాబలుడు, గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను (29). నందీశ్వర ఉవాచ | రే దక్ష శఠ దుర్బద్ధే వృథైవ శివకింకరాః | శప్తాస్తే బ్రహ్మచాపల్యా చ్ఛివతత్త్వ మజానతా ||
30 భృగ్వాద్యై ర్దుష్ట చిత్తైశ్చ మూఢైస్స ఉపహాసితః | మహాప్రభుర్మహేశానో బ్రాహ్మణత్వా దహంమతే ||
31 యే రుద్రవిముఖాశ్చాత్ర బ్రాహ్మణాస్త్వాదృశాః ఖలాః | రుద్రతేజః ప్రభావత్వాత్తేషాం శాపం దదామ్యహమ్ ||
32 వేదవాదఠతా యూయం వేదతత్త్వ బహిర్ముఖాః | భవంతు సతతం విప్రా నాన్యదస్తీతి వాదినః ||
33 నందీశ్వరుడిట్లు పలికెను - ఓ దక్షా! మోసగాడా! దుర్బుద్ధీ! శివతత్త్వము నెరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృథాగా శపించితివి (30). బ్రాహ్మణాహంకారము గల వారు, దుష్ట బుద్ధులు, మరియు మూర్ఖులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువగు మహేశ్వరుని ఉపహాసము చేసిరి (31). ఇచట నున్న బ్రాహ్మణులలో ఎవరైతే రుద్రుని యందు నీవు వలెనే విముఖత గల దుష్టులో, వారిని రుద్రుని తేజస్సు యొక్క మహిమను గలవాడనగు నేను శపించుచున్నాను (32). మీరు వేదములయందలి అర్థవాదముల యందు మాత్రమే శ్రద్ధగలవారై, వేద తత్త్వము నెరుంగజాలని బహిర్ముఖులై, నిత్యము ఇతరము మరి ఏదీ లేదని పలికే విప్రులు అగుదురు గాక! (33). కామాత్మానః స్వర్గ పరాః క్రోధలోభ మదాన్వితాః | భవంతు సతతం విప్రా భిక్షుకా నిరపత్రపాః ||
34 వేద మార్గం తిరస్కృత్య బ్రాహ్మణాశ్శూద్రయాజినః | దరిద్రా వై భవిష్యంతి ప్రతి గ్రహరతాస్సదా ||
35 అసత్ర్పతి గ్రహాశ్చైవ సర్వే నిరయగా మినః | భవిష్యంతి సదా దక్ష కేచిద్వై బ్రహ్మరాక్షసాః ||
36 యశ్శివం సురసామాన్య ముద్దిశ్య పరమేశ్వరమ్ | ద్రుహ్యత్యజో దుష్టమతి స్తత్త్వతో విముఖో భ##వేత్ ||
37 ఓ విప్రులారా! మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై, స్వర్గమే సర్వస్వమనే ధారణ గలవారై, క్రోధ లోభ గర్వములతో కూడియున్నవారై, సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురు గాక! (34) ఓ బ్రాహ్మణులారా! మీరు వేదమార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి, ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురు గాక! (35) ఓ దక్షా! దుష్టులనుండి దానములను స్వీకరించు వీరందరు నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు (36). ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి, ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహబుద్ధిని కలిగియుండునో, అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్త్వము నుండి విముఖుడగును (37). కూట ధర్మేషు గేహేషు సదా గ్రామ్య సుఖేచ్ఛయా | కర్మ తంత్ర వితనుతా వేదా వాదం చ శాశ్వతమ్ ||
38 వినష్టానందకముఖో విస్మృతాత్మగతిః పశుః | భ్రష్ట కర్మా నయస్సదా దక్షో బస్తముఖోऽ చిరాత్ || 39 శప్తాస్తే కోపినా తత్ర నందినా బ్రాహ్మణా యదా | హాహాకారో మహానాసీ చ్ఛప్తో దక్షేణ చేశ్వరః ||
40 తదాకర్ణ్యా హ మత్యంత మనిందంతం ముహుర్ముహుః | భృగ్వాదీనపి విప్రాంశ్చ వేదసృట్ శివతత్త్వ విత్ ||
41 ఈశ్వరోऽపి వచశ్ర్శుత్వా నందినః ప్రహసన్నివ | ఉవాచ మధురం వాక్యం బోధయంస్తం సదాశివః ||
42 దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై, నిత్యము తుచ్ఛ సుఖములను కోరి కర్మ తంత్రమును విస్తరించువాడై, ఇదియే శాశ్వత వేద ధర్మమని భ్రమించి (38), ముఖములో ఆనందము లేనివాడై, ఆత్మ జ్ఞానమును విస్మరించి, పశువువలె అజ్ఞానియై, కర్మ భ్రష్టుడై, నిత్యము నీతి మాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేక ముఖము కలవాడగును (39). దక్షుడు ఈశ్వరుని శపించగా, కోపించిన నంది అచటి బ్రాహ్మణులను శపించగా, అచట పెద్ద హాహాకారము బయలుదేరెను (40). నేనా మాటలను విని ఆ దక్షుని, భృగ్వాది బ్రాహ్మణులను కూడ అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్త్వము నెరుంగుదును గదా! (41) సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి, ఆతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను (42). సదాశివ ఉవాచ | శృణు నందిన్ మహాప్రాజ్ఞ న కర్తుం క్రోధమర్హసి | వృథా శప్తో బ్రహ్మకులో మత్వా శప్తం చ మాం భ్రమాత్ |
43 వేదో మంత్రాక్షరమయ స్సాక్షాత్సూక్త మయో భృశమ్ | సూక్తే ప్రతిష్ఠితో హ్యాత్మా సర్వేషామపి దేహి నామ్ ||
44 తస్మా దాత్మవిదో నిత్యం త్వం మా శప రుషాన్వితః | శప్యా న వేదాః కేనాపి దుర్ధియాऽపి కదాచన ||
45 అహం శప్తో న చేదానీం తత్త్వతో బోద్ధుమర్హసి | శాంతో భవ మహాధీమన్ సనకాది విబోధకః ||
46 యజ్ఞోऽహం యజ్ఞకర్మాహం యజ్ఞాంగాని చ సర్వశః | యజ్ఞత్మా యజ్ఞనిరతో యజ్ఞ బాహ్యోऽహమేవ వై || 47 సదాశివుడిట్లు పలికెను - నందీ! మహాప్రాజ్ఞా! నా మాటను వినుము. నీవు కోపమును పొందుట తగదు. నేను శపింపబడితినని నీవు భ్రమపడి బ్రాహ్మణులను వృథాగా శపించితివి (43). వేదములు మంత్రాక్షరములతో, సూక్తములతో నిండియుండును. సర్వప్రాణులు ఆత్మ సూక్తము నందు ప్రతిష్ఠితమై యుండును (44). కావున ఆత్మ ప్రతిపాదకమగు వేదమును పఠించు విద్వాంసులను నీవు కోపావిష్టుడవై ఏనాడూ శపించవలదు. ఎవరైననూ ఎంతటి మానసిక క్షోభకలిగిననూ ఎప్పుడైననూ వేదములను శపించరాదు (45). నేనిపుడు శాపమును పొందలేదు. నీవు తత్త్వమును ఎరుంగుము. సనకాది మహాత్ములకు జ్ఞానమును బోధించిన మహాధీశాలివి. నీవు. శాంతుడవు కమ్ము (46). యజ్ఞము నేనే. యజ్ఞమును చేయు యజమానిని నేనే. యజ్ఞములోని అంగములన్నియూ నేనే. యజ్ఞము నా స్వరూపమే. నాకు యజ్ఞమునందు అభిరుచి మెండు. పైగా, యజ్ఞ బాహ్యుడను కూడ నేనే (47). కోయం కస్త్వమిమే కే హి సర్వోऽహమపి తత్త్వతః | ఇతి బుద్ధ్యా హి విమృశ వృథా శప్తాస్త్వయా ద్విజాః ||
48 తత్త్వ జ్ఞానేన నిర్హృత్య ప్రపంచ రచనాం భవ | బుధస్స్వ స్థో మహాబుద్ధే నందిన్ క్రోధా దివర్జితః ||
49 నీవెవరివి? వీరెవరు?ఇతడెవరు? తత్త్వ దృష్ట్యా సర్వము నేనే. ఈ సత్యము నెరింగి విమర్శించినచో, నీవు బ్రాహ్మణులను శపించుట వ్యర్థమే గదా? (48) ఓ నందీ! నీవు మహా బుద్ధిశాలివి. నీవు క్రోధాదులను వీడి, తత్త్వజ్ఞానముచే ప్రపంచ రచనను బాధించి (మిథ్యయని యెరింగి,), జ్ఞానివై స్వస్వరూపమునందు ప్రతిష్ఠతుడవు కమ్ము (49). బ్రహ్మోవాచ | ఏవం ప్రబోధితస్తేన శంభునా నందికేశ్వరః | వివేక పరమో భూత్వా శాంతోऽ భూత్ర్కోధవర్జితః ||
50 శివోऽ పి తం ప్రబోధ్యాశు స్వగణం ప్రాణవల్లభమ్ | సగణస్స య¸° తస్మాత్స్వస్థానం ప్రముదాన్వితః ||
51 దక్షోऽॉపి స రుషా విష్టసై#్తర్ద్విజైః పరివారితః | స్వస్థానం చ య¸° చిత్తే శివద్రోహపరాయణః ||
52 రుద్రం తదానీం పరిశష్యమానం సంస్కృత్య దక్షః పరయా రుషాన్వితః | శ్రద్ధాం విహాయైవ స మూఢ బుద్ధిః నిందాపరోऽ భూచ్ఛివ పూజకానామ్ ||
53 బ్రహ్మ ఇట్లు పలికెను - శంభుడు ఈ విధముగా నందికేశ్వరునకు బోధించగా, ఆతడు వివేక నిష్ఠుడై, క్రోధమును వీడి శాంతుడాయెను (50). శివుడు ఆతనికి , తన గణములకు నచ్చజెప్పెను. శివునకు నంది ప్రాణప్రియుడు. ఆయన ఆనందముతో, తన గణములతో గూడి తన ధామకు వెళ్లెను (51). క్రోధావేశము గల దక్షుడు శివద్రోహమే లక్ష్యము గా గలవాడై, ఆ బ్రాహ్మణులతో కలిసి తన స్థానమునకు వెళ్లెను (52). తాను రుద్రుని శపించిన ఘట్టమును గుర్తుచేసుకొని మిక్కిలి కోపమును చెందుచున్న మూడ బుద్ధియగు ఆ దక్షుడు శ్రద్ధను వీడి శివపూజకులను నిందించుటయే తన ధ్యేయముగా పెట్టుకొనెను (53). ఇత్యుక్తో దక్ష దుర్బుద్ధిశ్శంభునా పరమాత్మనా | పరాం దుర్ధిషణాం తస్య శృణు తాత వదామ్యహమ్ ||
54 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయఖండే సత్యుపాఖ్యానే శివేన దక్ష విరోధో నామ షడ్వింశోऽ ధ్యాయః (26). దుర్బుద్ధియగు దక్షుడు శంభు పరమాత్మయొక్క ఆ మాటలను వినెను. అయిననూ వాని బుద్ధి ఎంత దుష్టమో గదా! వత్సా! నేనా వృత్తాంతమును చెప్పెదను వినుము. శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండములో శివుని తో దక్షుని విరోధమనే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).