Sri Sivamahapuranamu-I
Chapters
అథ ద్వాత్రింశోऽధ్యాయః వీరభద్రుడు నారద ఉవాచ | శ్రుత్వా వ్యోమగిరం దక్షః కి మకార్షీత్తదాऽబుధః | అన్యే చ కృతవంతః కిం తతశ్చ కిమభూద్వద ||
1 పరాజితాశ్శివగణా భృగుమంత్ర బలేన వై | కిమకార్షుః కుత్ర గతా స్తత్త్వం వద మహామతే ||
2 నారదుడిట్లు పలికెను - మూర్ఖుడగు దక్షుడు ఆకాశవాణిని విని, అపుడేమి చేసినాడు? ఇతరులు ఏమి చేసిరి?అపుడు ఏ మాయెను ?చెప్పుము (1). భృగు మహర్షి యొక్క మంత్ర బలముచే పరాజితులైన శివగణములు ఏమి చేసిరి? ఎచటకు వెళ్ళిరి ? ఓ మహాబుద్ధి శాలీ !ఆ విషయమును నీవు చెప్పుము (2). బ్రహ్మోవాచ | శ్రుత్వా వ్యోమగిరం సర్వే విస్మితాశ్చ సురాదయః | నావోచత్కించదపి తే తిష్ఠంతస్తు విమోహితాః ||
3 పలాయమానా యే వీరా భృగమంత్రబలేన తే | అవశిష్టాశ్శివగణాశ్శివం శరణ మాయయుః ||
4 సర్వం నివేదయామాసూ రుద్రాయామిత తేజసే | చరిత్రం చ తథా భూతం సుప్రణమ్యాదరాచ్చ తే ||
5 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆకాశవాణిని విన్న దేవతలు, ఇతరులు అందరు ఆశ్చర్యచకితులై కింకర్తవ్యతా విమూఢులై నిలబడియుండిరి. వారేమియూ మాటలాడకుండిరి (3). భృగువు యొక్క మంత్రబలముచే కొందరు శివగణములు సంహరింపబడిరి. వారిలో మిగిలిన వీరులు పారిపోయి శివుని శరణు పొందిరి (4). సాటిలేని తేజస్సు గల రుద్రునకు వారు ఆదరముతో నమస్కరించి జరిగిన వృత్తాంతమునంతనూ యథాతథముగా నివేదించిరి (5). గణా ఊచుః | దేవ దేవ మహాదేవ పాహి నశ్శరణాగతాన్ | సంశృణ్వాదరతో నాథ సతీ వార్తాం చ విస్తరాత్ ||
6 గర్వితేన మహేశాన దక్షేన సుదురాత్మనా | అవమానః కృతస్సత్యానాదరో నిర్జరైస్తథా||
7 తుభ్యుం భాగమదాన్నో స దేవేభ్యశ్చ ప్రదత్తవాన్ | దుర్వాచాం స్యవదత్ర్పోచ్చైర్దుష్టో దక్షస్సు గర్వితః ||
8 తతో దృష్ట్వా న తే భాగం యజ్ఞేऽకుప్యత్సతీ ప్రభో | వినింద్య బహుశస్తాత మధాక్షీత్స్వతనుం తదా ||
9 గణములు ఇట్లు పలికిరి - దేవదేవా !మహాదేవా! శరణు పొందిన మమ్ములను రక్షించుము. ఓ నాథా !సతీదేవి యొక్క విస్తరమగు వృత్తాంతమును ఆదరముతో చక్కగా వినుము (6). ఓ మహేశ్వరా! గర్విష్ఠి, పరమదుష్టుడునగు దక్షుడు సతీదేవిని అనాదరించి, అవమానించినాడు. దేవతలు కూడ అటులనే చేసినారు (7). ఆతడు మీకు భాగమును ఈయలేదు. కాని దేవతలకిచ్చినాడు. దుష్టుడు, మిక్కిలి గర్విష్ఠియగు దక్షుడు బిగ్గరగా పలుకరాని మాటలను పలికినాడు (8). ఓ ప్రభూ! నీకు యజ్ఞములో భాగము ఈయకపోవుటను చూచి సతీదేవి మిక్కిలి కోపించెను. అపుడామె తన తండ్రిని పరిపరివిధముల నిందించి తన దేహమును అగ్నికి ఆహుతి చేసెను (9). గణాస్త్వయుత సంఖ్యాకా మృతాస్తత్ర విలజ్జయా | స్వాంగాన్యాచ్ఛిద్య శ##సై#్తశ్చ క్రుధ్యామ హ్యపరే వయమ్ ||
10 తద్యజ్ఞం ధ్వంసితుం వేగాత్సన్నద్ధాస్తు భయావహాః | తిరస్కృతి హా భృగుణా స్వప్రభావద్విరోధినా ||
11 తే వయం శరణం ప్రాప్తాస్తవ విశ్వంభర ప్రభో | నిర్భయాన్ కురు నస్తస్మాద్దయామాన భవాద్భయత్ ||
12 అపమానం విశేషేణ తస్మిన్ యజ్ఞే మహాప్రభో | దక్షాద్యాస్తేऽఖిలా దుష్టా అకుర్వన్ గర్వితా అతి || 13 ఇత్యుక్తం నిఖిలం వృత్తం స్వేషాం సత్యాశ్చ మానద | తేషాం చ మూఢబుద్ధీనాం యథే చ్ఛసి తథా కురు || 14 పదివేల మంది గణములు మిక్కిలి సిగ్గుపడిన వారై తమ దేహములను ఆయుధములతో నరుకుకొని అచట మరణించిరి. మాలో కొందరు మిక్కిలి కోపించి (10),భయమును గొల్పుచూ వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసము చేయుటకు సిద్ధమైతిమి. కాని శత్రువగు భృగువు తన మహిమచే మమ్ములను తరిమి వేసినాడు (11). జగత్తును రక్షించే ఓ ప్రభూ! మేము నిన్ను శరణు పొందితిమి. హే దయోళో! మాకు సంప్రాప్తమైన ఈ భయము నుండి మమ్ములను రక్షించి, భయమును తొలిగించుము(12). హే మహాప్రభో! మిక్కిలి గర్వించిన దక్షుడు మొదలగు దుష్టులందరు ఆ యజ్ఞములో పెద్ద అవమానమును చేసిరి (13). అభిమానమును రక్షించువాడా! సతీదేవికి, మాకు జిరిగిన వృత్తాంతమునంతనూ నీకు చెప్పితిమి. ఆ మూర్ఖుల విషయములో నీవు ఎట్లు చేయగోరెదవో, అట్లు చేయుము (14). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచస్తేషాం స్వగణానాం వచః ప్రభుః | సస్మార నారదం సర్వం జ్ఞాతుం తచ్చరితం లఘు || 15 ఆగతస్త్వం ద్రుతం తత్ర దేవర్షే దివ్యదర్శన | ప్రణమ్య శంకరం భక్త్యా సాంజలిస్తత్ర తస్థివాన్ || 16 త్వాం ప్రశస్యాథ స స్వామీ సత్యా వార్తాంచ పృష్టవాన్ | దక్షయజ్ఞగతాయా వై పరం చ చరితం తథా || 17 పృష్టేన శంభునా తాత త్వయాశ్వేవ శివాత్మనా | తత్సర్వం కథితం వృత్తం జాతం దక్షాధ్వరే హి యత్ || 18 తదాకర్ణ్యేశ్వరో వాక్యం మునే తత్త్వన్ముఖోదితమ్ | చుకోపాతిద్రుతం రుద్రో మహారుద్ర పరాక్రమః || 19 బ్రహ్మఇట్లు పలికెను - శివ ప్రభుడు ఆ తన గణముల మాటలను విని, వెంటనే ఆ వృత్తాంతమునంతనూ ఎరుంగుటకై నారదుని స్మరించెను (15). ఓ దేవర్షీ! నీ దర్శనము దివ్యమైనది. నీవు వెంటనే అచటకు వచ్చి, శంకరుని భక్తితో అంజలి యొగ్గి నమస్కరించి అచట నిలబడితివి (16). ఆ ప్రభుడు అపుడు నిన్ను ప్రశంసించి, దక్షయజ్ఞమునకు వెళ్లిన సతీదేవి యొక్క వార్తను, మరియు ఇతర వృత్తాంతమును గురించి ప్రశ్నించెను (17). ఓ కుమారా! శంభుడు ఇట్లు ప్రశ్నించగా, ఆయనను మస్సులో ధ్యానించే నీవు వెంటనే దక్షయజ్ఞములో జరిగిన వృత్తాంతమునంతనూ చెప్పియుంటివి (18). ఓ మహర్షీ !అతి భయంకరమగు పరాక్రమము గలవాడు, సర్వేశ్వరుడునగు ఆ రుద్రుడు నీవు చెప్పిన ఆ వృత్తాంతమును విని వెనువెంటనే క్రోధమును పొందెను (19). ఉత్పాట్యైకాం జటాం రుద్రో లోక సంహారకారకః | అస్ఫాలయామాస రుషా పర్వతస్య తదోపరి || 20 తోదనాచ్చ ద్విధాభూతా సా జటా చ మునే ప్రభోః | సంబభూవ మహారావో మహాప్రలయ భీషణః || 21 తజ్జటాయాస్సముద్భూతో వీరభద్రో మహాబలః | పూర్వభాగేన దేవర్షే మహాభీమో గణాగ్రణీః || 22 స భూమిం విశ్వతో వృత్త్వా త్యతిష్టద్దశాంగులమ్ | ప్రలయానలసంకాశః ప్రోన్నతో దోస్సహస్రవాన్ || 23 జగత్సంహారమును చేయు ఆ రుద్రుడు అపుడు ఒక జటను ఊడబెరికి పర్వతముపై కోపముతో విసిరి కొట్టెను (20). ఓ మహర్షీ! ఆ ప్రభువు యొక్క జట విసిరి కొట్టుటచే రెండు ముక్కలై, మహాప్రలయమునందు వలె భయంకరమగు గొప్ప ధ్వని కలిగెను (21). ఓ దేవర్షీ! ఆ జటయొక్క పూర్వభాగమునుండి మహాబలుడు, అతి భయంకరుడు, గణములకు నాయకుడు అగు వీర భద్రుడు జన్మించెను (22). ప్రలయకాలాగ్ని వలె ప్రకాశించువాడు, మిక్కిలి ఎత్తైన వాడు, వేయి భుజములు గలవాడు అగు ఆ వీరభద్రుడు భూమిని అంతనూ పూర్తిగా చుట్టివేసి ఆపైన పది అంగుళముల వరకు వ్యాపించి యుండెను (23). కోపనిశ్శ్వాసతస్తత్ర మహారుద్రస్య చేశితుః | జాతం జ్వరాణాం శతకం సన్నిపాతాస్త్ర యోదశ || 24 మహాకాలీ సముత్పన్నా తజ్జటాపరభాగతః | మహాభయంకరా తాత భూతకోటి భిరావృతా || 25 సర్వే మూర్తిధరాః క్రూరాః సర్వలోకభయం కరాః | స్వతేజసా ప్రజ్వలంతో దహంత ఇవ సర్వతః || 26 అథ వీరో వీరభద్రః ప్రణమ్య పరమేశ్వరమ్ | కృతాంజలిపుటః ప్రాహ వాక్యం వాక్యవిశారదః || 27 అచట సర్వేశ్వరుడగు మహారుద్రుని కోపముతో గూడిన నిట్టూర్పుల నుండి వంద జ్వరములు, పదమూడు సన్నిపాత రోగములు పుట్టినవి (24). శివుని జటయొక్క రెండవభాగమునుండి మిక్కిలి భయంకరురాలగు మహాకాళి జన్మించెను. వత్సా! ఆమెను కోట్లాది భూతములు చుట్టువారి యుండెను (25). విగ్రహమును ధరించిన క్రూరములగు ఆ జ్వరములన్నియు సర్వలోకభయమును గొల్పుచూ, తమ తేజస్సుచే ప్రకాశించుచూ, సర్వమును దహించునా యన్నట్లుండెను (26). అపుడు వీరుడు, చక్కగా మాటలాడే నేర్పు గలవాడునగు వీరభద్రుడు దోసిలియొగ్గి పరమేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (27). వీరభద్ర ఉవాచ | మహారుద్ర మహారౌద్ర సోమసూర్యాగ్నిలోచన | కిం కర్తవ్యం మయా కార్యం శీఘ్ర మాజ్ఞాపయ ప్రభో || 28 శోషణీయాః కిమీశాన క్షణార్థేనైవ సింధవః | షేషణీయాః కిమీశాన క్షణార్థేనైవ పర్వతాః || 29 క్షణన భస్మసాత్కుర్యాం బ్రహ్మాండముత కిం హర | క్షణన భస్మసాత్కుర్యాం సురాన్వా కిం మునీశ్వరాన్ || 30 వ్యాశ్వాసస్సర్వలోకానాం కిము కార్యో హి శంకర | కర్తవ్యం కిముతేశాన సర్వప్రాణి విహింసనమ్ || 31 మమాశక్యం న కుత్రాపి త్వత్ర్పసాదాన్మహేశ్వర | పరాక్రమేణ మత్తుల్యోన భూతో న భవిష్యతి || 32 వీరభద్రుడిట్లు పలికెను - మహారుద్రా !నీవు అతి భయంకరుడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నీ నేత్రములు. ఓ ప్రభో! నేను చేయదగిన పని యేమి ?వెంటనే ఆజ్ఞాపింపుము (28). హే ఈశానా !అర్ధ క్షణములో సముద్రములను ఎండింపజేయవలెనా? ఓ ఈశ్వరా! ఆర్థ క్షణములో పర్వతములను నుగ్గు చేయవలెను? (29) హే హరా! క్షణకాలములో బ్రహ్మాండమును భస్మము చేయవలెనా యేమి? క్షణకాలములో దేవతలను గాని, మునిశ్రేష్ఠులను గాని భస్మము చేయవలెనా? (30) హే శంకరా! సర్వలోకములలో వాయు సంచారము లేకుండగా చేయవలెనా? ఈశానా! సర్వప్రాణులను సంహరించవలెనా యేమి? (31) ఓ మహేశ్వరా! నీ అనుగ్రహముచే నేను చేయలేని పని ఎచ్చటనైననూ లేదు. పరాక్రమములో నాతో సమానమైన వాడు పుట్టలేదు, పుట్టబోడు (32). యత్ర యత్కార్యముద్దిశ్య ప్రేషయిష్యసి మాం ప్రభో | తత్కార్యం సాధయామ్యేవ సత్వరం త్వత్ర్పసాదతః || 33 క్షద్రాస్తరంతి లోకాబ్ధిం శాసనాచ్ఛంకరస్య తే | హరాతోऽహం న కిం తర్తుం మహాపత్సాగరం క్షమః || 34 త్వత్ర్పేషితతృణనాపి మహత్కార్యమయత్నతః | క్షణన శక్యతే కర్తుం శంకరాత్ర న సంశయః || 35 లీలామాత్రేణ తే శంభో కార్యం యద్యపి సిద్ధ్యతి | తథాప్యహం ప్రేషణీయో తవైవానుగ్రహో హ్యయమ్ || 36 ఓ ప్రభూ! నీవు నన్ను ఎచటికైననూ ఏ కార్యమునైననూ ఉద్దేశించి పంపవచ్చును. నేను నీ అనుగ్రహముచే ఆ కార్యమును సత్వరమే నిశ్చయముగా సాధించగలను (33). మంగళకరుడగు నీ శాసనముచే అల్పులు కూడ సంసారసముద్రమును తరించెదరు. హే హరా! నేను మహావిపత్తు అనే సముద్రమును తరింప సమర్థుడను కాకపోదునా ?(34) ఓ శంకరా !నీచే నియోగింపబడిన గడ్డి పోచయైననూ సునాయాసముగా గొప్ప కార్యమును క్షణములో చేయగల్గుననుటలో సందేహము లేదు (35). హే శంభో! కార్యము నీ సంకల్పరూపమగు లీలచేతనే సిద్ధించును. అయిననూ, ఆ కార్యము కొరకై నన్ను పంపుడు. ఇది మీకు నాపై గల అనుగ్రహమే (36). శక్తిరేతాదృశీ శంభో మమాపి త్వదనుగ్రహాత్ | వినా శక్తిర్న కస్యాపి శంకర త్వదనుగ్రహాత్ || 37 త్వదాజ్ఞయా వినా కోऽపి తృణాదీనపి వస్తుతః | నైవ చాలయితుం సక్తి స్సత్యమేతన్న సంశయః || 38 శంభో నియమ్యాస్సర్వేऽపి దేవాద్యాస్తే మహేశ్వర | తథైవాహం నియమ్యస్తే నియమంతుస్సర్వ దేహినామ్ || 39 ప్రణతోऽస్మి మహాదేవ భూయోऽపి ప్రణతోऽస్మహరమ్ | ప్రేషయ స్వేష్ట సిద్ధ్యర్ధం మామద్య హర సత్వరమ్ || 40 హే శంభో! నాకు ఇటువంటి శక్తి నీ అనుగ్రహమువలననే కలిగినది. హేశంకరా! నీ అనుగ్రహము లేనిదే ఎవ్వనికైననూ శక్తి ఉండదు (37). ఎవడైననూ నీ ఆజ్ఞ లేనిదే గడ్డిపోచవంటి వస్తువులనైననూ కదల్చ సమర్థుడు కాడనుటలో సందేహము లేదు. ఇది సత్యము (38). హే శంభో! మహేశ్వరా! దేవాదులందరూ కూడ నీ ఆజ్ఞకు బద్ధులగుదురు. సర్వప్రాణులను నియంత్రించునది నీవే. అటులనే, నీవు నన్ను కూడ నియోగించుము (39). ఓ మహాదేవా !నీకు నేను అనేక నమస్కారముల నాచరించుచున్నాను. హే హరా !నీవు నీకు అభీష్టమగు కార్యమును చక్కబెట్టుట కొరకై నన్ను ఇప్పుడు వెంటనే పంపించుము (40). స్పందోऽపి జాయతే శంభో సవ్యాంగానాం ముహుర్ముహుః| భవిష్యత్యద్య విజయో మామతః ప్రేషయ ప్రభో || 41 హర్షోత్సాహవిశేషోऽపి జాయతే మమ కశ్చన | శంభో త్వత్పాదకమలే సంసక్తం చ మనో మమ || 42 భవిష్యతి ప్రతిపదం శుభుసంతాన సంతతిః | తసై#్యవ విజయో నిత్యం తసై#్యవ శుభమన్వహమ్ || 43 యస్య శంభౌ దృఢా భక్తిస్త్వయి శోభన సంశ్రయే | హే శంభో !నా కుడి భాగములు మరల మరల అదరుచున్నవి. ఈనాడు విజయము నిశ్చితము. హే ప్రభో !కావున నన్ను పంపించుము (41). హే శంభో !నాకు వర్ణింపశక్యము గాని ఆనందము, ఉత్సాహము కలుగుచున్నవి. నా మనస్సు నీ పాదపద్మముల యందు లగ్నమై యున్నది (42). నాకు ప్రతి అడుగునందు శుభములు ప్రవాహము వలె ఒకదాని తరువాత మరియొకటి లభించగలవు. మంగళములకు నిధానమగు శంభుని (నీ) యందు ఎవనికి దృఢమగు భక్తి ఉండునో, వానికి ప్రతి దినము విజయము, ప్రతి దినము శుభము కలుగుట నిశ్చయము (43). బ్రహ్మోవాచ | ఇత్యుక్తం తద్వచ శ్ర్శుత్వా సంతుష్టో మంగలాపతిః || 44 వీరభద్ర జయేతి త్వం ప్రోక్తాశీః ప్రాహ తం పునః | బ్రహ్మ ఇట్లు పలికెను - ఉమాపతి యగు శివుడు వీరభద్రుని ఈ పలుకులను విని సంతసించి, 'వీరభద్రా !నీకు జయమగుగాక!' అని ఆశీర్వదించి, మరల ఆతనితో నిట్లనెను (44). మహేశ్వర ఉవాచ | శృణు మద్వచనం తాత వీరభద్ర సుచేతసా || 45 కరణీయం ప్రయత్నేన తద్ద్రుతం మే ప్రతోషకమ్ | యాగం కర్తుం సముద్యుక్తో దక్షో విధిసుతః ఖలః || 46 మద్విరోధీ విశేషేణ మహాగర్వోऽబుధోऽధునా | తన్మఖం భస్మసాత్కృత్వా సయాగపరివారకమ్ || 47 పునరాయాహి మత్ స్థానం సత్వరం గణసత్తమ | సురా భవంతు గంధర్వా యక్షా వాన్యే చ కేచన || 48 తానప్యద్యైవ సహసా భస్మ సాత్కురు సత్వరమ్ | మహేశ్వరుడిట్లు పలికెను - వత్సా!వీరభద్రా! నా మాటను మనస్సు లగ్నము చేసి వినుము. నేను చెప్పబోవు కార్యమును ప్రయత్న పూర్వకముగా శీఘ్రమే చేసి, నాకు ఆనందమును కలిగించుము (45). బ్రహ్మకు పుత్రుడు, దుష్టుడు, విశేషించి నన్ను ద్వేషించువాడు, మహా గర్వితుడు, మూర్ఖుడునగు దక్షుడు ఈనాడు యజ్ఞమును చేయుటకు నడుము కట్టినాడు (46). ఆ యజ్ఞమును, దాని పరికరములతో సహా భస్మము చేయుము. ఓ గణశ్రేష్ఠా! అట్లు చేసి వెంటనే నా వద్దకు మరలిరమ్ము. దేవతలను, గంధర్వులను, యక్షులను, ఇంకనూ అచటనున్నవారిని వెనువెంటనే ఈనాడే భస్మము చేయుము (48). తత్రాస్తు విష్ణుర్బ్రహ్మా వా శచీశో వా యమోऽపి వా || 49 అపి చాద్యైవ తాన్ సర్వాన్ పాతయస్వ ప్రయత్నతః |దధీచి కృతముల్లంఘ్య శపథం మయి తత్ర యే || 50 తిష్ఠంతి తే ప్రయత్నేన జ్వలనీయాస్త్వయా ధ్రువమ్ | ప్రమథాశ్చాగమిష్యంతి యది విష్ణ్వాదయో భ్రమాత్ || 51 నానాకర్షణ మంత్రేణ జ్వాల యానీయ సత్వరమ్ | తే తత్రోల్లంఘ్య శపథం మదీయం గర్వితాస్థ్సితాః || 52 తే హి మద్ద్రో హిణోऽతస్తాన్ జ్వాలయానలమాలయా | అచట విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు కూడ ఉండవచ్చును (49). వారిని ఈనాడే ప్రయత్న పూర్వకముగా ఎవ్వరినీ విడువకుండగా పడగొట్టుము. దధీచి నా విషయములో చేసిన శపథమును ఉల్లంఘించి, ఎవరైతే (50) అక్కడ ఉన్నారో, వారిని ప్రయత్న పూర్వకముగా భస్మము చేయుము. సందేహించకుము. నీతో బాటు ప్రమథగణములు కూడ రాగలవు. విష్ణువు మొదలగు వారు భ్రమచే అక్కడనే ఉన్నారు (51). వారిని వెంటనే నానాకర్షణ మంత్రముతో ఒక చోటకు జేర్చి భస్మము చేయుము. వారు నాకు సంబంధించిన శపథమును ఉల్లంఘించి అక్కడనే గర్వించియున్నారు (52). వారు నాకు ద్రోహము చేసిన వారే. కావున వారిని అగ్ని జ్వాలలతో దహించుము. సపత్నీకాన్ ససారాంశ్చ దక్షయా గస్థలస్థితాన్ || 53 ప్రజ్వాల్య భస్మ సాత్కృత్వా పునరాయాహి సత్వరమ్ | తత్ర త్వయి గతే దేవా విశ్వాద్యా అపి సా దరమ్ || 54 స్తోష్యంతి త్వాం తదాప్యాశు జ్వాలయా జ్వాలయైవ తన్ | దేవానపి కృత ద్రోహాన్ జ్వాలా మాలా సమాకులైః || 55 జ్వాలయ జ్వలనై శ్శీఘ్రం మాధ్యాయాధ్యాయ పాలకమ్ | దక్షాదీన్ సకలాంస్తత్ర సపత్నీకాన్ సబాంధవాన్ || 56 ప్ర జ్వాల్య వీర దక్షం ను సలీలం సలిలం పి బ | దక్షుని యజ్ఞమున జరిగే స్థలములో నున్న వారిని, వారి భార్యలను, వారి యజ్ఞోపకరణులతో సహా అగ్ని జ్వాలలో భస్మము చేసి, శీఘ్రమే మరలి రమ్ము (53).. నీవు అచటికి వెళ్లగానే విశ్వేదేవతలు మొదలగు వారు నిన్ను ఆదరముతో (54) స్తోత్రములను చేసెదరు. అయిననూ వారికి అగ్నికీలలలో భస్మము చేయుము. ద్రోహము చేసిన ఆ దేవతలను కూడా అగ్ని జ్వాలలతో చుట్టు ముట్టి (55), శీఘ్రముగా భస్మము చేయుము. హే వీర !దక్షుడు మొదలగు వారినందరినీ, వారి భార్యలను, బంధువులను కూడ అవలీలగా భస్మము చేసి నీటిని త్రాగుము. యజ్ఞములోని వేదవిధులను పరిరక్షించు బ్రహ్మ అనబడే ఋత్విక్కునైననూ లెక్క చేయ కుండగా సంహరించుము (56). బ్రహ్మోవాచ | ఇత్వుక్త్వా రోషతామ్రాక్షో వేదమర్యాదపాలకః || 57 విర రామ మహావీరం కాలారిస్సకలేశ్వరః || 58 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే వీర భద్రోత్పత్తి శివోపదేశ వర్ణనం నామ ద్వాత్రింశోऽధ్యాయః (32). బ్రహ్మ ఇట్లు పలికెను - వేద మర్యాదను రక్షించువాడు, మృత్యువునకు మృత్యువు, సర్వేశ్వరుడునగు శివుడు క్రోధముతో ఎరుపెక్కిన కన్నులు గలవాడై మహావీరుడగు వీర భద్రునితో నిట్లు పలికి విరమించెను (57,58). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితలో రెండవది యగు సతీఖండలో వీర భద్రోత్పత్తి వర్ణ నమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).