Sri Sivamahapuranamu-I
Chapters
అథ త్రయస్త్రింశోऽధ్యాయః వీరభద్రుని యాత్ర బ్రహ్మోవాచ | ఇత్యుక్తం శ్రీ మహేశస్య శ్రుత్వా వచనమాదరాత్ | వీర భద్రోऽతి సంతుష్టః ప్రణనామ మహేశ్వరమ్ || 1 శాసనం శిరసా ధృత్వా దేవదేవస్య శూలినః | ప్రచచాల తతశ్శీఘ్రం వీరభద్రో మఖం ప్రతి || 2 శివోऽథ ప్రేషయామాస శోభార్థం కోటి శో గణాన్ | తేన సార్థం మహావీరాన్ ప్రలయానల సన్నిభాన్ || 3 అథ తే వీర భద్రస్య పురతః ప్రబలా గణాః | పశ్చాదపి యయుర్వీరాః కుతూహలకరా గణాః || 4 బ్రహ్మ ఇట్లు పలకికెను - శ్రీ మహేశ్వరుని ఈ మాటలను ఆదరముతో విని, వీర భద్రుడు మిక్కిలి సంతసించి, మహేశ్వరునకు ప్రణమిల్లెను (1). దేవ దేవుడు, శూలధారియగు శివుని శాసనమును శిరస్సుచే ధరించి, అపుడు వీరభద్రుడు శీఘ్రమే యజ్ఞ స్థానమునకు బయల్వెడలెను (2). అపుడు శివుడు శోభకొరకై వీరభద్రునకు తోడుగా మహావీరులు, ప్రళయకాలాగ్ని వలె ప్రకాశించువారునగు కోట్లాది గణములను పంపెను (3). అపుడు వీరులు, బలశాలురు, కుతూహలమును రేకెత్తించువారునగు ఆ గణములు వీరభద్రుని ఎదుట మరియు వెనుక నడచిరి (4). వీరభద్ర సమేతా యే గణాశ్శతసహస్రశః | పార్షదాః కాలకాలస్య సర్వే రుద్రస్వరూపిణః || 5 గణౖస్సమేతః కిల తైర్మహాత్మా స వీరభద్రో హరవేషభూషణః| సహస్ర బాహుర్భుజగాధిపాఢ్యో య¸° రథస్థః ప్రబలోऽతి భీకరః || 6 నల్వానం చ సహస్రే ద్వే ప్రమాణం స్యందనస్య హి | అయుతేనైవ సింహానాం వాహనానాం ప్రయత్నతః || 7 తథైవ ప్రబలాస్సింహా బహవః పార్శ్వరక్షకాః | శార్దులా మకరా మత్స్యా గజాస్తత్ర సహస్రశః || 8 మృత్యువునకు మృత్యువు అగు రుద్రుని అనుయాయులు, స్వయముగా రుద్రస్వరూపులు అగు వందలాది వేలాది ఆ గణులన్నియూ వీరభద్రుని చుట్టు వారియుండెను (5). ఆ గణములతో కూడి మిక్కిలి భయమును గొల్పువాడు, మహాత్ముడు, శివుని వేషము మరియు భూషణములు గలవాడు, వేయి బాహువులు గలవాడు, నాగాభరణములతో గొప్పగా ప్రకాశించువాడు. మహా బలశాలియగు ఆ వీరభద్రుడు రథమునధిష్ఠించి వెళ్లెను (6). ఆ రథము రెండు వేల చేతుల ప్రమాణము కలిగియుండెను. పదివేల సింహములు ఆ రథమును ప్రయత్న పూర్వకముగా లాగుచుండెను (7). మరియు, మహా బలశాలులగు అనేక సింహములు, శార్దూలములు, మొసళ్లు, మత్స్యములు, వేలాది ఏనుగులు ఆయనకు పార్శ్వములయందు రక్షకులుగా నుండెను (8). వీరభ##ద్రే ప్రచలితే దక్షనాశాయ సత్వరమ్ | కల్పవృక్ష సముత్సృష్టా పుష్పవృష్టిరభూత్తదా || 9 తుష్టువుశ్చ గణా వీరం శిపివిష్టే ప్రచేష్టితమ్ | చక్రుః కుతూహలం సర్వే తస్మింశ్చ గమనోత్సవైః || 10 కాలీ కాత్యాయనీశానీ చాముండా ముండమర్దినీ | భద్రకాలీ తథా భద్రా త్వరితా వైష్ణవీ తథా || 11 ఏతాభిర్నవదుర్గాభిర్మహాకాలీ సమన్వితా | య¸° దక్ష వినాశాయ సర్వ భూతగణౖ స్సహ || 12 డాకినీ శాకినీ చైవ భూతప్రమథ గుహ్యకాః | కూష్మాండాః పర్పటాశ్చైవ చటకా బ్రహ్మరాక్షసాః || 13 వీరభద్రుడు దక్షుని నాశము కొరకై వేగముగా బయలుదేరగా, ఆ సమయములో కల్పవృక్షము నుండి పుట్టిన పుష్పముల వర్షము కురిసెను (9). శివుని ఆజ్ఞను పాలించుటకు ఉద్యుక్తుడైన వీరుడగు వీరభద్రుని గుణములు స్తుతించినవి. గణములన్నియు ఆ యాత్రయందు ఉత్సవములను చేసి కుతూహలమును కలిగించిరి (10). కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, మండమర్దిని, భద్రకాళి, భద్రా మరియు మిక్కిలి వేగము గల వైష్టవి (11) అనే ఈ తొమ్మిది దుర్గలతో గూడి మహాకాళి భూత గణములన్నింటితో బాటు దక్షుని వినాశము కొరకు బయలు దేరెను (12). డాకిని, శానికి, భూతములు, ప్రమథగణములు, యక్షులు కుష్మాండులు, పర్పటులు, చటకులు మరియు బ్రహ్మ రాక్షసులు కూడ తరలి వెళ్లిరి (13). భైరవాః క్షేత్రపాలాశ్చ దక్షయజ్ఞ వినాశకాః | నిర్యయుస్త్వరితం వీరాశ్శివాజ్ఞా ప్రతి పాలకాః || 14 తథైవ యోగినీ చక్రం చతుష్షష్టిగణాన్వితమ్ | నిర్య¸° సహసా క్రుద్ధం దక్షయజ్ఞం వినాశితమ్ || 15 తేషాం గణానాం సర్వేషాం సంఖ్యానం శృణు నారద | మహాబలవతాం సంఘో ముఖ్యానాం ధైర్యశాలినామ్ || 16 అభ్యయాచ్ఛంకుకర్ణశ్చ దశోకోట్యో గణశ్వరః | దశభిః కేకరాక్షశ్చ వికృతోऽష్టాభిరేవ చ || 17 చతుష్షష్ట్యా విశాఖస్చ నవభిః పారియాత్రికః | షడ్భిస్సర్వాంకకో వీరస్తథైవ వికృతాననః || 18 వీరులైన భైరవులు, క్షేత్ర పాలకులు శివాజ్ఞను పాలించువారై దక్షుని యజ్ఞమును నాశము చేయుటకొరకై వేగముగా పయనమైరి (14). మరియు యోగినుల సమూహము మిక్కిలి కోపించి అరువది నాల్గు గణములతో గూడి దక్షయజ్ఞమును ధ్వంసము చేయుట కొరకు వేగముగా తరలివెళ్లెను(15). ఓ నారదా !మహాబలవంతులు, ధైర్యశాలురునగు సర్వ గణా ధ్యక్షులచే నడిపింపబడిన ఆ గణముల లెక్కను చెప్పెదను వినుము (16). శంకుకర్ణుడగు గణాధ్యక్షుడు పదికోట్లు, కేకరాక్షకుడు పది, వికృతుడు ఎనిమిది (17), విశాఖుడు అరవై నాలుగు, పారియాత్రికుడు తొమ్మిది, వీరుడు, వికృతమగు ముఖము గలవాడునగు సర్వాంకకుడు ఆరు కోట్ల గణములతో తరలివెళ్లిరి (18). జ్వాలకేశో ద్వాదశభిః కోటి భిర్గణపుంగవః | సప్తభిస్సమద శ్ర్శీమాన్ దుద్ర భోऽష్టాభిరేవచ || 19 పంచభిశ్చ కపాలీశః షడ్భిస్సందాకరో గణః | కోటికోటి భి రేవేహ కోటి కుండస్తథైవ చ || 20 విష్టంభోऽష్టాభిర్వీరైః కోటిభిర్గణసత్తమః | సహస్ర కోటి భిస్తాత సంనాదః పిప్పలస్తథా || 21 ఆవేశనస్తథాష్టాభిరష్టాభిశ్చంద్ర తాపనః | మహావేశస్సహస్రేణ కోటినా గణపో వృతః || 22 కుండీ ద్వాదశకోటీభిస్తథా పర్వతకో మునే | వినాశితుం దక్షయజ్ఞం నిర్య¸° గణసత్తమః || 23 గుణనిధియగు జ్వాలకేశుడు పన్నెండు, శోభాయుక్తుడగు సమదుడు ఏడు, దుద్రభుడు ఎనిమిది (19), కపాలీశుడు అయిదు, సందారకుడు ఆరు, కోటి కుండుడు ఒకటి (20), గణములలో శ్రేష్ఠుడగు విష్టంభుడు ఎనిమిది కోట్ల , వీరులైన గణములతో బయలుదేరిరి. ఓ వత్సా! సంనాదుడు వేయి, పిప్పలుడు వేయి (21), ఆవేశనుడు ఎనిమిది, చంద్రతాపనుడు ఎనిమిది, మహావేశుడనే గణాధ్యక్షుడు వేయి కోట్ల గణులచే చుట్టువారబడి ముందునకు సాగిరి (22). ఓ మహర్షీ! కుండి పన్నెండు కోట్ల గణములతో, గణశ్రేష్ఠుడగు పర్వతకుడు పన్నెండు కోట్ల గణములతో దక్షుని యజ్ఞమును ధ్వంసము చేయుటకై బయల్వెడలిరి (23). కాలశ్చ కాలశ్చైవ మహాకాలస్తథైవ చ | కోటీనాం శతకేనైవ దక్షయజ్ఞం య¸° ప్రతి || 24 అగ్ని కృచ్ఛతకోట్యా చ కోట్యాగ్ని ముఖ ఏవ చ | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథా చైవ ఘనావహః || 25 సన్నాహశ్శత కోట్యాచ కోట్యా చ కుముదో గణః | అమోఘః కోకిలశ్చైవ కోట్యా కోట్యా గణాధిపః || 26 కాష్ఠాగూఢశ్చతుష్షష్ట్యా సుకేశీ వృషభస్తథా |సుమంత్రకో గణాధీశస్తథా తాత సునిర్య¸° || 27 కాకపాదోదరష్షష్టి కోటి భిర్గణసత్తమః | తథా సంతానకష్షష్టి కోటి భిర్గణ పుంగవః || 28 కాలుడు, కాలకుడు మరియు మహాకాలుడు వందకోట్ల గణములతో దక్షయజ్ఞమునకు వెళ్లిరి (24). అగ్నికృత్ వంద, అగ్ని ముఖుడు ఒకటి, ఆదిత్యమూర్ధుడు ఒకటి, ఘనావహుడు ఒకటి (25), సన్నాహుడు వంద, కుముదుడు ఒకటి, అమోఘుడు ఒకటి, కోకిలుడను గణాధ్యక్షుడు ఒకటి (26), కాష్ఠాగూఢుడు అరవై నాలుగు కోట్ల గణములతో బలయుదేరిరి. ఓ కుమారా! సుకేసి, వృషభుడు, సుమంత్రకుడు అను గణాధ్యక్షులు కూడ తరలివెళ్లిరి (27). గణశ్రేష్ఠుడగు కాకపాదోదరుడు అరవై, మరియు గణపుంగవుడగు సంతానకుడు అరవై కోట్ల గణములతో ముందునకు నడచిరి (28). మహాబలశ్చ నవభిః కోటి భిః పుంగవస్తథా | మధుపింగస్తతా తాత గణాధీశో హి నిర్య¸° || 29 నీలో నవత్యా కోటీనాం పూర్ణభద్రస్తథైవ చ | నిర్య¸° శతకోటీభిశ్చతుర్వక్త్రో గణాధిపః || 30 విరూపాక్షశ్చ కోటీనాం చతుష్షష్ట్యా గణశ్వరః | తాలకేతుష్షడాస్యశ్చ పంచాస్యశ్చ గణాధిపః || 31 సంవర్తకస్తథా చైవ కులీశశ్చ స్వయం ప్రుభుః | లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దై త్యాంతకో మునే || 32 గణో భృంగీ రిటి శ్ర్శీమాన్ దేవదేవ ప్రియస్తథా | అశనిర్భాలశ్చైవ చతుష్షష్ట్యా సహస్రకః || 33 మహ బలుడగు పుంగవుడు తొమ్మిది కోట్ల గణములతో నడచెను . ఓవత్సా! మధుపింగుడను గణాధ్యక్షుడు కూడ విచ్చేసెను (29). నీలుడు తొంభై, పూర్ణ భద్రుడు వంద కోట్ల గణములతో బలయుదేరిరి. చతుర్వక్త్రుడు అనే గణాధ్యక్షుడు కూడ వెళ్లెను (30). విరూపాక్షుడను గణనాథుడు అరవై నాల్గు కోట్ల గణములతో నడచెను. తాలకేతువు, షడాస్యుడు, పంచాస్యుడను గణాధిపుడు (31), సంవర్తకుడు, కులీశుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు అను గణనాథుడు వెళ్లెను. ఓ మహర్షీ! వారిలో దైత్యాంతకుడు మిక్కిలి ప్రకాశించెను (32). శోభాయుక్తుడు, దేవదేవుడగు శివునకు ప్రియుడునగు భృంగీ, రిటి మరియు అశని, భాలకుడు, మరియు సహస్రకుడు అరువది నాల్గుకోట్ల గణములతో తరలివెళ్లిరి (33). కోటి కోటి సహస్రాణాం శ##తైర్వింశతిభిర్వృతః | వీరేశో హ్యభ్యయాద్వీరః వీరభద్ర శివాజ్ఞయా || 34 భూతకోటిసహసై#్రస్తు ప్రయ¸° కోటిభిస్త్రిభిః | రోమజైశ్శ్వగణౖశ్చైవ తథా వీరో య¸° ద్రుతమ్ || 35 తదా భేరీ మహానాద శ్శంఖాశ్చ వివిధస్వనాః | జటా ధరముఖాశ్చైవ శృంగాణి వివిధాని చ || 36 వీరభద్రుని, శివుని ఆజ్ఞను పొంది వీరుడగు వీరేశుడు వేయి న్నూట ఇరవై కోట్ల గణములతో కూడుకుని ముందుకు నడచెను (34). వీరుడు వేయి కోట్ల భూతములతో, రోమముల నుండి పుట్టిన మూడు కోట్ల కుక్కలతో కూడి వేగముగా నడచెను (35). అపుడు భేరీలు, శంఖములు, కొమ్ము వాద్యములు, శివుని ముఖాకారము గల వాద్యములు మొదలగు వాటి నుండి గొప్పనాదము వెలువడెను (36). తేతాని వితతాన్యేవ బంధనాని సుఖాని చ | వాదిత్రాణి వినేదుశ్చ వివిధాని మహోత్సవే || 37 వీరభద్రస్య యాత్రాయాం సబలస్య మహామునే | శకునాన్య భవంస్తత్ర భూరిణి సుఖదాని చ || 38 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయో సతీఖండే వీరభద్రయాత్రావర్ణనం నామ త్రయస్త్రింశోऽధ్యాయః (33). ఆ మహోత్సవమునందు వివిద వాద్యములను వాయించుటచే ఉత్పన్నమైన శబ్దములు చెవులకు ఇంపుగనున్నవై సర్వత్రా వ్యాపించెను (37). ఓ మహర్షీ! సైన్యముతో గూడి వీరభద్రుడు పయనించుచుండగా, అచట మనస్సునకు ఆనందమునిచ్చే విభిన్న శకునములు కలిగినవి (38). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో వీరభద్రయాత్రా వర్ణనమనే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).