Sri Sivamahapuranamu-I
Chapters
అథ పంచత్రింశోऽధ్యాయః విష్ణువు పలుకులు దక్ష ఉవాచ | దేవ దేవ హరే విష్ణో దీనబంధో కృపానిధే | మమ రక్షా విధాతవ్యా భవతా సాధ్వరస్య చ ||
1 రక్షకస్త్వం మఖసై#్యవ మఖకర్మ మఖాత్మకః | కృపా విధేయా యజ్ఞస్య భంగో భవతు న ప్రభో ||
2 దక్షుడిట్లు పలికెను - హే దేవదేవా! హరే! విష్ణో !దీనబంధూ! దయాసాగరా! నీవు నన్ను, నాయజ్ఞమును రక్షించవలెను (1). యజ్ఞము నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. యజ్ఞమును చేయు యజమాని కూడ నీ స్వరూపమే. నీవు దయను చూపుము. హే ప్రభూ! యజ్ఞము నాశము కాని విధముగా అనుగ్రహించుము (2). బ్రహ్మోవాచ | ఇత్థం బహువిధాం దక్షః కృత్వా విజ్ఞప్తి మదరాత్ | పపాత పాదయోస్తస్య భయవ్యాకుల మానసః ||
3 ఉత్థాప్య తం తతో విష్ణుర్దక్షం విక్లిన్న మానసమ్ | శ్రుత్వాచ తస్య తద్వాక్యం కుమతే రస్మరచ్ఛివమ్ ||
4 స్మృత్వా శివం మహేశానం స్వప్రభుం పరమేశ్వరమ్ | అవదచ్ఛివ తత్త్వజ్ఞో దక్షం సంబోధయన్ హరిః ||
5 బ్రహ్మ ఇట్లు పలికెను - దక్షుడు ఈ విధముగా అనేక తెరంగులలో సాదరముగా విన్నవించుకుని, భయముచే కల్లోలితమగు మనస్సు గలవాడై ఆయన పాదములపై పడెను (3). అపుడు విష్ణువు చింతాగ్రస్తమైన మనస్సుగల ఆ దక్షుని పైకి లేవదీసి, దుర్బుద్ధియగు ఆతని ఆ పలుకులను విని శివుని స్మరించెను (4). మహేశ్వరుడు, తనకు ప్రభువు అగు శివుని స్మరించి, శివతత్త్వమును ఎరింగిన విష్ణువు దక్షుని సంబోధించి ఇట్లు పలికెను (5). హరిరువాచ | శృణు దక్ష ప్రవక్ష్యామి తత్త్వతశ్శృణు మే వచః | సర్వథా తే హితకరం మహామంత్రం సుఖప్రదమ్ || 6 అవజ్ఞా హి కృతా దక్ష త్వయా తత్త్వమజానతా | సకలాధీశ్వరసై#్యవ శంకరస్య పరాత్మనః || 7 ఈశ్వరావజ్ఞయా సర్వం కార్యం భవతి సర్వథా | విఫలం కేవలం నైవ విపత్తిశ్చ పదే పదే || 8 అపూజ్యా యత్ర పూజ్యంతే పూజనీయో న పూజ్యతే | త్రీణి తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయమ్ || 9 విష్ణువు ఇట్లు పలికెను - దక్షుడా! వినుము. నేను యథార్థమగు వచనమును చెప్పెదను. నీకు అన్ని విధములా హితమును చేగూర్చి సుఖము నిచ్చే మహామంత్రమును చెప్పెదను (6). హే దక్షా! తత్త్వము నెరుంగని నీవు సకల జగత్తునకు అధీశ్వరుడు, పరమాత్మయగు శివుని అవమానించితివి (7). ఈశ్వరుని తిరస్కరించినచో, సర్వకార్యములు అన్ని విధములా విఫలమగును. అంతమాత్రమే గాదు. ప్రతి అడుగు నందు ఆపదలు కలుగును (8). ఎచట పూజింపదగని వారు పూజింపబడుదురో, పూజింపదగిన వారు పూజింపబడరో, అచట దారిద్ర్యము, మరణము, భయము అను మూడు ఉండును (9). తస్మాత్సర్వ ప్రయత్నేన మాననీయో వృషధ్వజః | అమానితాన్మహేశాచ్చ మహద్భయము పస్థితమ్ || 10 అద్యాపి న వయం సర్వే ప్రభవః ప్రభవామహే | భవతో దుర్నయే నైవ మయా సత్య ముదీర్యతే || 11 కావున, అన్ని విధముల ప్రయత్నమును చేసి వృషధ్వజుడగు శివుని పూజించవలెను. కాని మహేశ్వరుని అవమానించుట వలన మహాభయము సంప్రాప్తమైనది (10). ఇప్పుడు మేమందరము సమర్ధులమైననూ, కలిసి ఆపదను నివారించుటకు శక్యము కాదు. ఇది అంతయూ నీ చెడునీతి వలన కలిగినది. నేను సత్యమును చెప్పుచున్నాను (11). బ్రహ్మోవాచ | విష్ణోస్తద్వచనం శ్రుత్వా దక్షశ్చింతాపరోऽభవత్ | వివర్ణవదనో భూత్వా తూష్ణీమాసీద్భువి స్థితః || 12 ఏతస్మిన్నంతరే వీరభద్ర సై#్సన్య సమన్వితః | అగచ్ఛ దధ్వరం రుద్రప్రేరితో గణనాయకః || 13 పృష్ఠే కేచిత్సమాయాతా గగనే కేచిదాగతాః | ది శశ్చ విదిశస్సర్వే సమావృత్య తథాపరే || 14 శరాజ్ఞయా గణాశ్శూరా నిర్భయా రుద్ర విక్రమాః | అసంఖ్యా స్సింహనాదాన్వై కుర్వంతో వీరసత్తమాః || 15 బ్రహ్మ ఇట్లు పలికెను - విష్ణువు యొక్క ఆ మాటను విని దక్షుడు చింతాగ్రస్తుడాయెను. ఆతడు పాలిపోయిన ముఖము గలవాడై నేలపై గూర్చుండి మిన్నకుండెను (12). ఇంతలో సైన్యముతో కూడి యున్నవాడు, రుద్రునిచే ప్రోత్సహింపబడినవాడు, గణాధ్యక్షుడునగు వీరభద్రుడు యజ్ఞస్థలమును సమీపించుచుండెను (13). కొన్ని గణములు ఆయన వెనుక, మరికొన్ని ఆకాశమునందు, ఇంకొన్ని సర్వదిక్కులను ఆక్రమించి ముందుకు సాగిరి (14). శూరులు, భయము లేనివారు, రుద్రునితో సమానమగు పరాక్రమము గలవారు, మహావీరులునగు ఆ గణములు లెక్కలేనంతమంది సింహనాదములను చేయుచూ ముందుకు సాగిరి (15). తేన నాదేన మహతా నాదితం భువన త్రయమ్ | రజసా చావృతం వ్యోమ తమసా చావృతా దిశః || 16 సప్త ద్వీపాన్వితా పృథ్వీ చ చాలాతి భయాకులా | సశైలకాననా తత్ర చక్షు భుస్సకలాబ్ధయః || 17 ఏవం భూతం చ తత్సైన్యం లోకక్షయకరం మహత్ | దృష్ట్వా చ విస్మితాస్సర్వే బభూవు రసురాదయః || 18 సైన్యోద్యోగ మథాలోక్య దక్షశ్చా సృఙ్ముఖాకులః | దండవత్పతితో విష్ణుం సకలత్రోऽ భ్య భాషత || 19 ఆ శబ్దమునకు ముల్లోకములు దద్దరిల్లెను. ఆకాశము ధూళితో నిండెను. దిక్కులయందు చీకట్లు వ్యాపించెను (16). ఏడు ద్వీపములతో, పర్వతములతో, అడవులతో కూడియున్న పృథివి మిక్కిలి భయముతో కంపించెను. సముద్రములన్నియు క్షోభిల్లినవి (17). లోకములను నాశనము చేయగల ఇటువంటి ఆ మహాసైన్యమును చూచి రాక్షసులు మొదలగు వారందరు ఆశ్చర్యచకితులైరి (18). తరువాత ఈ సైన్య సంరంభమును చూచిన దక్షుడు నోటినుండి రక్తమును గ్రక్కెను. ఆతడు భార్యతో గూడి విష్ణువు ఎదుట దండము వలె పడి, ఇట్లు పలికెను (19). దక్ష ఉవాచ | భవద్బలే నైవ మయా యజ్ఞః ప్రారంభితో మహాన్ | సత్కర్మ సిద్ధయే విష్ణో ప్రమాణం త్వం మహాప్రభో || 20 విష్ణో త్వం కర్మణాం సాక్షీ యాజ్ఞానాం ప్రతిపాలకః | ధర్మస్య వేదగర్భస్య బ్రహ్మణస్త్వం మహాప్రభో || 21 తస్మా ద్రక్షా విధాతవ్యా యజ్ఞస్యాస్య మమ ప్రబో | త్వదన్యో యస్సమర్థోऽస్తి యతస్త్వం సకలప్రభుః || 22 దక్షుడిట్లు పలికెను - హే విష్ణో! మహాప్రభో! నీ బలము చేతనే నేనీ మహాయజ్ఞము నారంభించితిని. సత్కర్మల ఫలము లభించుటలో నీవే ప్రమాణమై యున్నావు (20). హే విష్ణో! నీవు కర్మసాక్షివి. హే మహాప్రభో! నీవు వేద ప్రోక్తములైన ధర్మములకు, యజ్ఞములకు, వేదములకు కూడ రక్షకుడవు (21). హే ప్రభో! కావున నీవు ఆ ఈ యజ్ఞమును కాపాడవలెను. ఈ పనికి సమర్థుడు నీకంటె మరియొకడు లేడు. సర్వమునకు ప్రభువు నీవే గదా! (22) బ్రహ్మోవాచ | దక్షస్య వచనం శ్రుత్వా విష్ణుర్దీనతరం తదా | అవోచద్బోధయంస్తం వై శివతత్త్వపరాఙ్ముఖమ్ || 23 బ్రహ్మ ఇట్లు పలికెను - దక్షుని వచనమును విని అపుడు విష్ణువు మిక్కిలి దీనుడు, శివతత్త్వమునందు అభిరుచి లేనివాడు నగు దక్షునికి శివతత్త్వమును బోధించుచున్నవాడై ఇట్లు పలికెను (23). విష్ణురువాచ | మయా రక్షా విధాతవ్యా తవ యజ్ఞస్య దక్ష వై | ఖ్యాతో మమ పణస్సత్యో ధర్మస్య పరిపాలనమ్ || 24 తత్సత్యం తు త్వయోక్తం హి కిం తత్తస్య వ్యతిక్రమః | శృణు త్వం వచ్మ్యహం దక్ష క్రూరబుద్ధిం త్యజాధునా || 25 నైమిషే నిమిషక్షేత్రే యజ్ఞాతం వృత్త మద్భుతమ్ | తత్కింన స్మర్యతే దక్ష విస్మృతం కిం కు బుద్ధినా || 26 రుద్ర కోపాచ్చ కో హ్యత్ర సమర్థో రక్షణ తవ | న యస్యాభిమతం దక్ష యస్త్వాం రక్షతి దుర్మతిః || 27 విష్ణువు ఇట్లు పలికెను - ఓయీ దక్షా! నేను నీ యజ్ఞమును రక్షించవలసిన వాడనే. ధర్మమును నేను రక్షించెదను. ఇది నా శపథము. ఇది సత్యమని అందరికీ తెలియును (24). కాన నీవు చెప్పిన ఆ మాట సత్యమే. దాని ఉల్లంఘనము ఏమి కలిగినది? ఓయీ దక్షా! నేను చెప్పెదను. నీవు వినుము. నీవు ఇపుడు నీ క్రూర బుద్ధిని వీడుము (25). ఓ యీ దక్షా! నైమిషారణ్యములో నిమిష క్షేత్రమునందు జరిగిన అద్భుతమగు వృత్తాంతము నీకు గుర్తు లేదా? దుష్ట బుద్ధివి అగు నీవు దానిని విస్మరించితివా? (26).రుద్రుని కోపమునుండి నిన్ను రక్షించగల మొనగాడు ఇక్కడ ఎవ్వరు గలరు? ఓయీ దక్షా! నిన్ను రక్షించవలెననే ఇచ్ఛలేని వారెవ్వరు? కాని, దుర్మార్గుడు మాత్రమే నిన్ను రక్షింప బూనుకొనును (27). కిం కర్మ కిమకర్మేతి తన్న పశ్యసి దుర్మతే | సమర్థం కేవలం కర్మన న భవిష్యతి సర్వదా || 28 స్వకర్మ విద్ధి తద్యేన సమర్థత్వేన జాయతే | న త్వన్యః కర్మణో దాతా శం భ##వేదీశ్వరం వినా || 29 ఈశ్వరస్య చ యో భక్త్యా శాంతస్తద్గత మానసః | కర్మణో హి ఫలం తస్య ప్రయచ్ఛతి తదా శివః || 30 ఓరీ దుష్టబుద్ధీ! ఏ పనిని చేయవలెను? దేనిని చేయకూడదు? అను వివేకము నీకు లేదు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కేవల కర్మ ఫలము నీయజాలదు (28). ఏ కర్మను చేసి మానవుడు ఉన్నతిని పొందునో అది ఆతనికి కర్తవ్య కర్మయగునని తెలియును. కర్మలకు శుభఫలములను ఇచ్చువాడు ఈశ్వరుడు తక్క మరియొకడు గాడు (29). ఎవడైతే మనస్సును శివునిపై నిలిపి శాంతముగా ఈశ్వరుని ఆరాధించునో, వానికి శివుడు కర్మాంతమునందు కర్మఫలము ననుగ్రహించును (30). కేవలం జ్ఞాన మాశ్రిత్య నిరీశ్వరపరా నరాః | నిరయం తే చ గచ్ఛంతి కల్పకోటి శతాని చ || 31 పునః కర్మ మయైః పాశైర్బద్ధా జన్మని జన్మని | నిరయేషు ప్రపచ్యంతే కేవలం కర్మ రూపిణః || 32 అయం రుద్ర గణాధీశో వీరభద్రోऽరి మర్దనః | రుద్రకోపాగ్ని సంభూత స్సమాయతోऽధ్వరాంగణ || 33 అయమస్మ ద్వినాశార్థ మాగతోऽస్తి న సంశయః | అశక్యమస్య నాస్త్యేవ కిమప్యస్తు తు వస్తుతః || 34 కేవల జ్ఞానమును ఆశ్రయించి, ఈశ్వర సేవించని నరులు వందకోటి కల్పముల కాలము వరకు నరకములో నుందురు (31). కేవల కర్మఠులు కర్మలు అనుపాశములచే బంధింపబడిన వారై జన్మ జన్మలయందు నరక ప్రాయమగు బ్రతుకులలో పచనము చేయబడుదురు (32). రుద్రగణములకు అధిపతి, శత్రుసంహారకర్త, రుద్రుని కోపమనే అగ్నినుండి పుట్టినవాడు అగు వీరభద్రుడు యజ్ఞసాలవద్దకు వచ్చుచున్నాడు (33). ఈతడు మనలను నాశము చేయుటకై వచ్చినాడనుటలో సందేహము లేదు. ఎట్టి కార్యమైననూ, ఈతనికి శక్యము కానిది లేనేలేదు (34). ప్రజ్వాల్యాస్మానయం సర్వాన్ ధ్రువమేన మహాప్రభుః | తతః ప్రశాంత హృదయో భవిష్యతి న సంశయః || 35 శ్రీ మహాదేవ శపథం సముల్లంఘ్య భ్రమాన్మయా | యతస్థ్సి తం తతః ప్రాప్యం మయా దుఃఖం త్వయా సహ || 36 శక్తిర్మమ తు నాస్త్యేవ దక్షా ద్యైతన్నివారణ | శపథోల్లంఘనా దేవ శివద్రోహీ యతోऽస్మ్యహమ్ || 37 కాలత్రయేऽపి న యతో మహేశద్రోహిణాం సుఖమ్ | తతోऽవశ్యం మయా ప్రాప్తం దుఃఖమద్య త్వయా సహ || 38 మహాప్రభుడగు ఈ వీరభద్రుడు మనలనందరినీ నిశ్చయముగా కాల్చి చంపి, అటు పిమ్మట ప్రసన్నమైన మనస్సు కలవాడు కాగలడనుటలో సంశయము లేదు (35). నేను మహాదేవునిపై దధీచి చేసిన శపథమును భ్రమచే ఉల్లంఘించి ఇక్కడనే ఉన్న కారణముచే నీతోబాటు దుఃఖప్రాప్తి అనివార్యమగుచున్నది (36). హే దక్షా! ఈనాడు ఈతనిని ఆపగలిగే శక్తి నాకు లేదు. ఎందువలననగా, నేను ఆ శపథమును ఉల్లంఘించి శివద్రోహము చేసితిని (37). మహేశ్వరుని విషయంలో ద్రోహము చేసిన వారికి మూడు కాలములయందైననూ సుఖము లేదు. అందువలన నీతో బాటు నేను కూడా ఈనాడు దుఃఖమును పొందుట నిశ్చయము (38). సుదర్శనాభిధం చక్రమేతస్మిన్న లగిష్యతి | శైవచక్రమిదం యస్మా దశైవలయకారణమ్ || 39 వినాపి వీరభ##ద్రేణ నామైతచ్ఛక్రమైశ్వరమ్ | హత్వా గమిష్యత్యధు నా సత్వరం హరసన్నిధౌ || 40 శైవం శపథముల్లంఘ్య స్థితం మాం చక్రమీదృశమ్ | అసంహత్యైవ సహసా కృపయైవ స్థితం పరమ్ || 41 అతః పరమిదం చక్రమపి న స్థాస్యతి ధ్రువమ్ | గమిష్యత్యధునా శీఘ్రం జ్వాలామాలా సమాకులమ్ || 42 సుదర్శనమను పేరు గల ఈ చక్రము ఈతనియందు తగుల్కొనదు. ఇది శైవచక్రము. కాన ఇది శివభక్తులు కాని వారని మాత్రమే సంహరించును (39). వీరభద్రుడు లేకున్ననూ ఈ ఈశ్వర చక్రము ఇపుడు శీఘ్రముగా మనలను సంహరించి శివుని వద్దకు వెళ్లగల్గును (40). శివునికి సంబంధించిన శపథమును ఉల్లంఘించియున్న నన్ను ఇట్టి ఈ చక్రము ఇంకనూ సంహరించక పోవుటను గొప్పదయగా భావించవచ్చును (41). ఈపైన ఈ చక్రము నా వద్ద నిశ్చయముగా ఉండబోదు. ఇది ఇప్పుడే అగ్నికీలలను వెళ్లగ్రక్కుచూ శీఘ్రముగా వెళ్లగలదు (42). వీరభద్రః పూజితోऽపి శీఘ్రమస్మాభిరాదరాత్ | మహాక్రోధ సమాక్రాంతో నాస్మాన్ సంరక్షయిష్యతి || 43 అకాండ ప్రలయోऽస్మాక మా గతోऽద్య హి హా హాహా | హాహా బత తవేదానీం నాశోऽస్మాకముపస్థితః || 44 శరణ్యోऽస్మాకమధునా నాస్త్యేవ హి జగత్త్రయే | శంకర ద్రోహిణో లోకే కశ్శరణ్యో భవిష్యతి || 45 తనునాశేऽపి సంప్రాప్యాసై#్తశ్చాపి యమయాతనాః | తా నైవ శక్యతే సోఢుం బహు దుఃఖ ప్రదాయినీః || 46 శివ ద్రోహిణమాలోక్య దష్టదంతో యమస్స్వయమ్ | తప్తతైల కటాహేషు పాతయత్యేవ నాన్యథా || 47 మనము వెంటనే వీరభద్రుని ఆదరముతో పుజించి ననూ, మహాక్రోధముతో నిండియున్న ఆతడు మనలను రక్షించడు (43). అయ్యో! అయ్యో! మనపై ఈ అకాల ప్రళయము వచ్చి పడినది. ఇపుడు నీవు, మేమూ కూడ వినాశము యొక్క ముంగిట నున్నాము (44). ఈ ముల్లోకములలో మాకిపుడు శరణము నిచ్చువాడు లేనే లేడు. శివద్రోహికి లోకములో శరణము నిచ్చువాడు ఎవడు ఉండును? (45) ఈ దేహము నశించిననూ మనకు యమయాతనలు తప్పవు. యముడు పెట్టే యాతనలు అధిక దుఃఖమును కలిగించును. వాటిని సహింప శక్యము కాదు (46). యముడు శివద్రోహిని చూచి పళ్లను కొరికి స్వయముగా కాగుచున్న నూనెతో నిండిన గుండిగలలోనికి విసిరివేయును. దానిని తప్పించుకొనుట అసంభవము (47). గంతుమేవాహ ముద్యుక్త స్సర్వథా శపథోత్తరమ్ | తథాపి న గతశ్శీఘ్రం దుష్ట సంసర్గ పాపతః || 48 యదద్య క్రియతేऽస్మాభిః పలాయనమితస్తదా | శార్వో నా కర్షక శ్శసై#్ర రస్మా నాకర్షయిష్యతి || 49 స్వర్గే వా భువి పాతాలే యత్ర కుత్రాపి వా యతః | శ్రీ వీరభద్ర శస్త్రాణాం గమనం న హి దుర్లభమ్ || 50 యా వంతశ్చ గణాస్సంతి శ్రీరుద్రస్య త్రిశూలినః | తావతామపి సర్వేషాం శక్తి రేతాదృషీ ధ్రువమ్ || 51 ఆ శపథము అయిన వెంటనే నేను వెళ్లి పోవుటకు సంసిద్ధుడనైతిని. అయిననూ, చెడు సహవాసము అను పాపము వలన వెంటనే వెళ్లలేకపోయితిని (48). మనము ఇపుడు ఇచట నుండి పారిపోయిననూ, శర్వుని కుమారుడగు వీరభద్రుడు శస్త్రములచే మనలను ఆకర్షించగలడు (49). స్వర్గము గాని, భూమిగాని, పాతాళముగాని, మరియొక స్థలము ఏదైన గాని, శ్రీ వీరభద్రుని శస్త్రములు చొరరాని స్థలము లేదు (50). త్రిశూలధారియగదు శ్రీ రుద్రుని గణములు ఎందరు గలరో, వారందరికి నిశ్చయముగా ఇటువంటి శక్తియే గలదు (51). శ్రీకాలభైరవః కాశ్యాం నఖాగ్రేణౖ లీలయా | పురా శిరశ్చ చిచ్ఛేద పంచమం బ్రహ్మణో ధ్రువమ్ || 52 ఏతదుక్త్వా స్థితో విష్ణురతిత్రస్తముఖాంబుజః | వీరభద్రోऽపి సంప్రాప తదైవాధ్వరమండపమ్ || 53 ఏవం బ్రువతి గోవింద ఆగతం సైన్యసాగరమ్ | వీరభ##ద్రేణ సహితం దదృశుశ్చ సురాదయః || 54 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సత్యుపాఖ్యానే విష్ణువాక్య వర్ణనం నామ పంచత్రింశోऽధ్యాయః (35). శ్రీ కాలభైరవుడు పూర్వము కాశీలో బ్రహ్మయొక్క అయిదవ శిరస్సును గోటికొనతోటి మాత్రమే లీలగా దునిమెను (52). విష్ణువు ఇట్లు పలికి అచట నిలబడి యుండెను. ఆతని ముఖ పద్మము మిక్కిలి భయమును కలిగియుండెను. అదే సమయములో వీరభద్రుడు యజ్ఞశాలకు వచ్చెను (53). గోవిందుడిట్లు పలుకు చుండగనే, సైన్య సముద్రము వీరభద్రునితో గూడి అచటకు వచ్చెను. దేవతలు మొదలగు వారా సైన్యమును చూచిరి (54). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో సత్యుపాఖ్యానమునందు విష్ణువాక్యవర్ణనమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).