Sri Sivamahapuranamu-I
Chapters
అథ షట్ త్రింశోऽధ్యాయః విష్ణు వీర భద్ర సంవాదము బ్రహ్మోవాచ | ఇంద్రోऽపి ప్రహసన్ విష్ణుమాత్మ వాదరతం తదా | వజ్రపాణి స్సురై స్సార్థం యోద్ధుకామోऽ భవత్తదా || 1 తదేంద్రో గజమారూఢో బస్తారూఢోऽనలస్త థా | యమో మహిషమారూఢో నిర్ ఋతిః ప్రేతమేవ చ || 2 పాశీ చ మకరారూఢో మృగరూఢస్సదా గతిః | కుబేరః పుష్పకారూఢస్సన్నద్ధోऽభూదతంద్రితః || 3 తథాన్యే సురసంఘాశ్చ యక్షచారణ గుహ్యకాః | ఆరుహ్య వాహనాన్యేవ స్వాని స్వాని ప్రతాపినః || 4 బ్రహ్మ ఇట్లు పలికెను- అపుడీ విధముగా తన అభిప్రాయమును విష్ణువు ప్రకటించగా,ఇంద్రుడాయనను పరిహసించి, వజ్రమును చేత బట్టి, దేవతలతో గూడి యుద్ధమునకు సంసిద్ధుడాయెను (1). అపుడు ఇంద్రుడు ఏనుగును, అగ్నిమేకను, యముడు దున్నను, నిర్ ఋతి ప్రేతమును (2), వరుణుడు మొసలిని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకమును అధిష్ఠించి, జాగరూకత గల వారై యుద్ధమునకు సంసిద్ధులైరి (3). అదే విధముగా పరాక్రమవంతులగు ఇతర దేవతలు, యక్షులు, చారణులు, గుహ్యకులు తమ తమ వాహనముల నధిష్టించిరి (4). అథ దేవగణాస్సర్వే యుయుధుస్తే బలాన్వితాః | శక్రాదయో లోకపాలా మోహితాశ్శివ మాయయా || 5 దేవానాం చ గణానాం చ తదాసీత్సమరో మహాన్ | తీక్ణ తో మరనారాచైర్యుయుధుస్తే పరస్పరమ్ || 6 నేదుశ్శంఖాశ్చ భేర్యశ్చ తస్మిన్ రణమహోత్సవే | మహాదందుభయో నేదుః పటహా డిండి మాదయః || 7 తేన శ##బ్దేన మహతా శ్లాఘ్యామానాస్తదా సురాః | లోకపాలైశ్చ సహితా జఘ్నుస్తాన్ శివకింకరాన్ || 8 అపుడు సర్వదేవగణములు, బలశాలురగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు శివమాయచే విమోహితులై యుద్ధమును చేసిరి (5). అపుడు దేవతలకు, రుద్రగణములకు మధ్య గొప్ప యుద్ధము చెలరేగెను. వారు పదునైన బల్లెములతో, ఇనుపబాణములతో ఒకరితో నొకరు యుద్ధమును చేసిరి (6). ఆ యుద్ధము అనే మహాసంరంభములో శంఖములు, భేరీలు, పెద్ద దుందుబులు, పటహములు, డిండిమములుఇత్యాది వాద్యములు మ్రోగింపబడెను (7). ఆ మహా శబ్దము చే ప్రోత్సాహింతులైన దేవతలు లోకపాలురతో గూడిన వారై, ఆ సమయములో శివకింకరులను సంహరింప జొచ్చిరి (8) ఇంద్రాద్యైర్లోకపాలైశ్చ గణాశ్శంభోః పరఙ్ముఖాః | కృత్తాశ్చ మునిశార్దూల భృగోర్మంత్రబలేన చ || 9 ఉచ్చాటనం కృతం తేషాం భృగుణా యజ్వనా తదా | యజనార్థం చ దేవానాం తుష్ట్యర్థం దీక్షితస్య చ || 10 పరాజితాన్ స్వకాన్ దృష్ట్వా వీరభద్రో రుషాన్వితః | భూతప్రేత పిశాచాంశ్చ కృత్వా తానేవ పృష్ఠతః || 11 వృషభస్థాన్ పురస్కృత్య స్వయం చైవ మహాబలః | మహాత్రిశూల మాదాయ పాతయామాస నిర్జరాన్ | 12 దేవాన్ యక్షాన్ సాధ్యగణాన్ గుహ్యకాన్ చారణానపి | శూలఘాతైశ్చ తే సర్వే గణా వేగాత్ర్పజఘ్నిరే|| 13 ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, శంభుని గణములు వెనుదిరుగునట్లు చేసిరి. ఓ మహర్షీ! వారు భృగువు యొక్క మంత్రబలముచే సంహరింపబడిరి (9). యజ్వ యగు భృగువు దేవతలకు హవిర్భాగములనిచ్చి, దీక్షితుడగు దక్షుని సంతోషపెట్టుటకై ఆ రుద్ర గణములను తన మంత్రబలముచే తరిమి వేసెను (10). తన వారైన భూతప్రేతపిశాచములు ఓడి పోవుటను గాంచి వీరభద్రుడు మిక్కిలి కోపము గలవాడై, వారిని తనవెనుక ఉంచుకొని (11). వృషభములనధిష్ఠించిన గణములు ముందు నడుచు చుండగా, మహాబలుడగుఆతడు స్వయముగా పెద్ద త్రిశూలము ధరించి దేవతలను పడగొట్టెను (12). అపుడు ఆ గణము దేవతలను, యక్షలను, సాధ్యుల గమములను, గుహ్యకులను, మరియు చారణులను శూలములతో పొడిచి వేగముగా సంహరింపజొచ్చిరి (13). కేచిద్ద్విధా కృతాః ఖడ్గై ర్ముద్గరైశ్చ విపోథితాః | అన్యైశ్శసై#్ర రపి సురా గణౖర్భిన్నస్తదాऽభవన్ || 14 ఏవం పరాజితాస్సర్వే పలాయన పరాయణాః | పరస్పరం పరిత్యజ్య గతా దేవాస్త్రి విష్టపమ్ || 15 కేవలం లోకపాలాస్తే శక్రాద్యాస్తస్థు రుత్సుకాః | సంగ్రామే దారుణ తస్మిన్ ధృత్వా ధైర్యం మహాబలాః || 16 సర్వే మిలిత్వా శక్రాద్యా దేవాస్తత్ర రణాజిరే | బృహస్పతిం చ పప్రచ్ఛు ర్వినయావనతాస్తదా || 17 కొందరిని కత్తులతో రెండు ముక్కలుగా నరికిరి. మరికొందరిని ఇనుప రోకళ్లతో పొడిచి చంపిరి. ఆ గణములు ఆ యుద్ధములో దేవతలను ఇతర ఆయుధములతో గూడ కొట్ట జొచ్చిరి (14). ఈ విధముగా ఆ దేవతలందరు పారాజయమును పొంది, ఒకరితో మరియొకరికి సంబంధము లేకుండగా పారిపోయి, స్వర్గములో దాగిరి (15). ఆ భయంకర సంగ్రామములో మహాబలవంతులగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు మాత్రమే ఉత్సాహముతో ధైర్యము నవలంబించి నిలబడిరి (16). ఆ రణరంగమునందు ఇంద్రుడు మొదలగు వారందరు కలసి సంప్రదించుకొని, అపుడు బృహస్పతి వద్దకు వెళ్లి వినయముతో నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి (17). లోకపాలా ఊచుః | గురో బృహస్పతే తాత మహాప్రాజ్ఞ దయానిధే | శీఘ్రం వద పృచ్ఛతో నఃకుతోऽస్మాకంజయో భ##వేత్ || 18 లోకపాలకులిట్లు పలికిరి - హే గురో! బృహస్పతీ! నీవు గొప్ప బుద్ధిశాలివి. కరుణా మయుడవు. మా ప్రశ్నకు తొందరగా సమాధానము నిమ్ము. మాకు జయము లభించు ఉపాయమేది?(18). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచస్తేషాం స్మృత్వా శంభుం ప్రయత్నవాన్ | బృహస్పతిరువాచేదం మహేంద్రం జ్ఞానదుర్బలమ్ || 19 బ్రహ్మ ఇట్లు పలికెను - వారి ఈ మాటను వివిన బృహస్పతి ప్రయత్న పూర్వకముగా శంభుని స్మరించి, ఆజ్ఞాని యగు మహేంద్రునితో నిట్లనెను (19). బృహస్పతిరువాచ | యదుక్తం విష్ణునా పూర్వం తత్సర్వం జాతమద్యవై | తదేవ వివృణోమీంద్ర సావధానతయా శృణు || 20 ఆస్తి యక్షేశ్వరః కశ్చిత్ ఫలదస్సర్వకర్మణామ్ | కర్తారం భజతే సోऽపి న త్వకర్తుః ప్రభుర్హి సః || 21 న మంత్రౌషధయస్సర్వే నాభిచారా న లౌకికా ః | నకర్మాణి న వేదశ్చ న మీ మాంసా ద్వయం తథా || 22 అన్యాన్యపి చ శాస్త్రాణి నానావేదయుతాని చ | జ్ఞాతుం నేశం సంభవంతి వదంత్యేవం పురాతనాః || 23 న స్వ జ్ఞే యో మహేశాన స్సర్వ వేదయుతేన సః | భ##క్తైరనన్య శరణౖః నాన్యథేతి మహాశ్రుతిః || 24 బృహస్పతి ఇట్లు పలికెను - పూర్వము విష్ణువు చెప్పిన దంతయూ ఇపుడు మన ఎదుట జరుగుచున్నది. ఓ ఇంద్రా ! ఆ వివరములను చెప్పెదను, సావధానముగా వినుము (20). ఓయీ! కర్మలన్నిటికీ ఫలము నిచ్చు ఈశ్వరుడొకడు గలడు. ఆయన కూడ ఫలము నిచ్చుటలో కర్త యొక్క కర్మలపై ఆధారపడును. కర్మలేని సందర్భములో ఈశ్వరుడైననూ ఫలము నీయలేడు (21). సర్వమంత్రములు, ఓషధులు, అభిచార కర్మలు, లౌకిక కర్మలు, వేదోక్త కర్మలు, వేదములు, పూర్వోత్తర మీమాంసలు (22), ఇతర శాస్త్రములు, మరియు నాల్గు వేదములు కూడా ఈశ్వరుని తెలుపలేవని పూర్వర్షులు చెప్పిరి (23). వేదములనన్నిటినీ పదివేలసార్లు పారాయణము చేసిననూ మహేశ్వరుడు జీవునకు సాక్షాత్కరించడు. నీవే తప్ప మరియొక గతి లేదు. అని శరణు పొందిన భక్తులకు ఆయన దర్శనమిచ్చును. మరియొక మార్గము లేదని వేదము చెప్పు వచనము గొప్ప వచనము (24). శాంత్యా చ పరయా దృష్ట్యా సర్వథా నిర్వికారయా | తదనుగ్రహతో నూనం జ్ఞాతవ్యో హి సదాశివః || 25 పరం తు సంవదిష్యామి కార్యాకార్య వివక్షి తౌ | సిద్ధ్యంశం చ సురేశానం తం శృణు త్వం హితాయ వై || 26 త్వమింద్ర బాలిశో భూత్వా లోకపాలైస్సదాద్య వై | ఆగతో దక్షయజ్ఞం హి కిం కరిష్యసి విక్రమమ్ || 27 ఏతే రుద్ర సహాయాశ్చ గణాః పరమకోపనాః | అగతో దక్షయజ్ఞ విఘ్నార్థం తం కరిష్యంత్య సంశయమ్ || 28 సర్వథా న హ్యుపాయోऽత్ర కేషాంచి దపి తత్త్వతః | యజ్ఞ విఘ్న వినాశార్థం సత్యం సత్యం బ్రవీమ్యహమ్ || 29 సదాశివుని అనుగ్రహముచే శాంతము, సర్వశ్రేష్ఠము, సర్వవికార నిర్ముక్తము అగు దృష్టి లభించును. ఆ దృష్టి చేత మాత్రమే సదా శివుడు నిశ్చయముగా తెలియబడును (25). కాని, ఓ ఇంద్రా ! ఏది చేయదగిన పని, ఏది కాదు అను విషయమును చెప్పెదను. ఇది కార్యసిద్ధికి ఆవశ్యకమగు అంశము. నీవు స్వీయహితమును గోరి వినుము (6). ఓ ఇంద్రా!నీవు మూర్ఖుడవై ఈనాడు లోకపాలకులతో గూడి దక్షుని యజ్ఞమునకు విచ్చేసితివి. ఇచట ఏమి పరాక్రమమును చూపగలవు? (27). రుద్రుని సేవకులగు ఈ గణములు గొప్ప కోపము గలవారు. యజ్ఞమును పాడుచేయుటకై వచ్చినారు. ఆపనిని చేయుదురనుటలో సందేహము లేదు (28). సత్యమును విచారించి చెప్పుచున్నాను. ఈయజ్ఞమును రక్షించే ఉపాయము లేనే లేదు. ఈ యజ్ఞమునకు వచ్చిన విఘ్నమును తొలగించ గల సమర్థత ఎవ్వరికీ లేదు. నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (29). బ్రహ్మోవాచ | ఏవం బృహస్పతేర్వాక్యం శ్రుత్వా తే హి దివౌకసః | చింతా మాపేదిరే సర్వే లోకపాలాస్స వాసవా ః|| 30 తతోऽబ్రవీద్వీరభద్రో మహావీరగణౖర్వృతః |ఇంద్రాదీన్ లోకపాలాంస్తాన్ స్మృత్వా మనసి శంకరమ్ || 31 బ్రహ్మ ఇట్లు పలికెను - బృహస్పతి యొక్క ఈ మాటలను విని ఆ దేవతలు అందరు, లోకపాలకులు, ఇంద్రుడు చింతాగ్రస్తులైరి (30). అపుడు మహావీరులగు గణములతో కూడియున్న వీరభద్రుడు మనస్సులో శంకరుని స్మరించి ఇంద్రుడు మొదలగు లోకపాలకులతో నిట్లునెను (31). వీర భద్ర ఉవాచ | సర్వే యూయం బాలిశత్వాదవదానార్థ మాగతాః |అవదానం ప్రయచ్ఛామి ఆగచ్ఛ త మమాంతికమ్ || 32 హే శుక్ర హే శుచే భానో హే శశిన్ హే ధనాధిప | హే పాశ పాణ హే వాయో నిర్ ఋతే యమ శేష హే || 33 హే సురాసుర సంఘాహీహైత యూయూం హే విచక్షణాః |అవదానాని దాస్యామి ఆ తృప్త్యాద్యాసతాం వరాః || 34 వీరభద్రుడిట్లు పలికెను - మీరందరు మూర్ఖులగుటచే యజ్ఞ భాగముల కొరకు వచ్చి యున్నారు. నేను యజ్ఞ భాగములనిచ్చెదను. నా వద్దకు రండు (32). హే శుక్రా! హే అగ్నీ! హేసూర్యా! ఓయీ చంద్రా! ఓయీ కబేరా! ఓయీ వరుణా! ఓయీ వాయూ! ఓయీ నిర్ ఋతీ! ఓయీ యమా! ఓయీ శేషా! (33)ఓదేవగణములారా! ఓ రాక్షస గణములారా! ఓ విద్వాంసులారా! మీరిక్కడకు రండు. మీకు తృప్తి కలుగు వరకు యజ్ఞ భాగములనిచ్చెదను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు (34). బ్రహ్మోవాచ | ఏవముక్త్వా సితైర్బాణౖర్జఘానాథ రుషాన్వితః | నిఖిలాంస్తాన్ సురాన్ సద్యో వీరభద్రో గణాగ్రణీః || 35 తైర్బాణౖర్నిహతాస్సర్వే వాసవాద్యాస్సురేశ్వరాః | పలాయనపరా భూత్వా జగ్ముస్తే చ దిశో దశ || 36 గతేషు లోకపాలేషు విద్రుతేషు సురేషు చ | యజ్ఞ వాటో పకంఠం హి వీరభద్రో గమద్గణౖః || 37 తదా తే ఋషయస్సర్వే సుభీతా హి రమేశ్వరమ్ | విజ్ఞప్తు కామాస్సహసా శీఘ్ర మూచుర్నతా భృశమ్ || 38 బ్రహ్మ ఇట్లు పలికెను - ఇట్లు పలికి గణాధ్యక్షుడగు వీర భద్రుడు కోపముతో కూడిన వాడై, ఆ దేవతలనందరినీ వెనువెంటనే వాడి బాణములతో కొట్టెను (35). ఇంద్రుడు మొదలగు లోకపాలకులందురు ఆ బాణములచే కొట్టబడినవారై పది దిక్కులకు పారిపోయిరి (36). లోకపాలకులు, దేవతలు పారిపోగానే వీరభద్రుడు గణములతో కూడి యజ్ఞశాల సమీపముకు వచ్చెను (37). అపుడా ఋషులందరు భయపడి విష్ణువును వేగముగా సమీపించి, ఆయనతో విన్నపము చేయగోరి, నమస్కరించి ఇట్లు పలికిరి (38). ఋషయ ఊచుః | దేవదేవ రమానాథ సర్వేశ్వర మహాప్రభో | రక్ష యజ్ఞం హి దక్షస్య యజ్ఞోऽసి త్వం న సంశయః || 39 యజ్ఞకర్మా యజ్ఞ రూపో యజ్ఞాంగో యజ్ఞరక్షకః | రక్ష యజ్ఞమతో రక్ష త్వత్తోऽన్యో న హి రక్షకః || 40 ఋషులు ఇట్లు పలికిరి - ఓ దేవదేవా!లక్ష్మీపతీ!సర్వేశ్వరా!మహాప్రభూ! దక్షుని యజ్ఞమును రక్షింపుము. యజ్ఞము నీ స్వరూపమే అనుటలో సందియము లేదు. (39). యజమాని నీ స్వరూపమే. యజ్ఞములోని అంగములు నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. కావున, నీవు యజ్ఞమును నిశ్చయముగా రక్షింపుము. నీవుతక్క మరియొక రక్షకుడు లేడు (40). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచస్తేషా మృషీణాం వచనం హరిః | యోద్ధుకామో భయాద్విష్ణుర్వీరభ##ద్రేణ తేన వై || 41 చతుర్భుజస్సుసన్నద్ధో చక్రాయుధధరః కరైః | మహాబలోऽమరగణౖర్యజ్ఞవాటాత్స నిర్య¸° || 42 వీరభద్రశ్శూల పాణిర్నానాగణ సమన్వితః దదర్శ విష్ణుం సన్నద్ధం యోద్ధుకామం మహాప్రభుమ్ || 43 తం దృష్ట్వా వీరభద్రోऽభూద్భ్రుకుటీకుటిలాననః |కృతాంత ఇవ పాపిష్ఠం మృగేంద్ర ఇవ వారణమ్ || 44 తథావిధం హరిం దృష్ట్వా వీరభద్రోऽరి మర్దనః |అవదత్త్వరితః క్రుద్ధో గణౖర్వీరైస్సమావృతః || 45 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆ మహర్షుల ఈ మాటలను విని విష్ణువు యుద్ధమును చేయగోరెను. కాని ఆ వీరభద్రునితో యుద్ధమునకు భయపడెను (41). చతుర్భుజుడగు విష్ణువు నాల్గు భుజములలో చక్రము మొదలగు ఆయుధములను ధరించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను. మహాబలుడగు విష్ణువు దేవ గణములతో గూడి యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చెను (42). అనేక గణములతో గూడి,చేత శూలమును ధరించియున్న వీరభద్రుడు యుద్దమును చేయగోరి సంసిద్ధుడైన మహా ప్రభుడగు విష్ణువును చూచెను (43). ఆయన ను చూడగనే పాపిని చూచిన యమునకు వలె, ఏనుగును చూచిన సింహమునకు వలె, వీరభద్రుని కనుబొమలు ముడిపడెను (44). ఆ విధముగా యుద్ధ సన్నద్ధుడగు విష్ణువును చూచి, శత్రువులను సంహరించువాడు, వీరులగు గణములతో కూడియున్న వాడు అగు వీరభద్రుడు కోపించి వేగముగా నిట్లు పలికెను (45). వీరభద్ర ఉవాచ | రే రే మహాదేవ శపథోల్లంఘనం త్వయా | కథమద్య కృతం చిత్తే గర్వః కిమభవత్తవ || 46 తవ శ్రీ రుద్రశపథోల్లంఘనే శక్తిరస్తి కిమ్ | కో వా త్వమసి కో వాతే రక్షకోऽస్తి జగత్త్రయే || 47 అత్ర త్వమాగతః కస్మాద్వయం తన్నైవ విద్మ హే | దక్ష స్య యజ్ఞ పాతా త్వం కథం జాతోऽసి తద్వద || 48 దాక్షాయణ్యా కృతం యచ్చ తన్న దృష్టం కిము త్వయా | ప్రోక్తం యచ్చ దధీచేన శ్రుతం తన్న కిము త్వయా || 49 వీరభద్రుడిట్లు పలికెను- ఓరీ హరీ! నీ వీనాడు మహాదేవుని శపథమును ఎట్లు ఉల్లంఘించగల్గితివి ? నీ మనస్సులో గర్వము గలదు. నీకు ఏమి అయెను ? (46). శ్రీ రుద్రుని శపథమును ఉల్లంఘించు శక్తి నీకు గలదా ఏమి ? నీవెవడవు ? ముల్లోకములలో నిన్ను రక్షించువాడు గలడా? (47). నీ విచటకు వచ్చుటలో గల కారణమును మేము తెలియకున్నాము. నీవు దక్షుని యత్రమునకు రక్షకుడవు ఎట్లు అయితివో చెప్పుము (48). దాక్షాయణి ఏమి చేసినదో నీవు చూడలేదా ?దధీచుని పలుకులను నీవు వినలేదా ?(49). త్వం చాపి దక్షయజ్ఞేऽస్మిన్నవదానార్థమాగతః | అవదానం ప్రయచ్ఛామి తవ చాపి మహాభుజ || 50 వక్షోవిదారయాష్యామిత్రిశూలేన హరే తవ| కస్తవాస్తి సమాయాతో రక్షకో ద్య మమాంతికమ్ ||51 పాతయిష్యామి భూపృష్ఠే జ్వాలయిష్యామి వహ్నినా | దగ్ధం భవంతమధునా పేషయిష్యామి సత్వరమ్ ||52 రేరే హరే దురాచార మహేశవిముఖాదమ| శ్రీ మహారుద్రమాహాత్మ్యం కిం న జానాపి పావనమ్|| 53 తథాపి త్వం మహాబాహో యోద్ధుకామోऽ గ్రతస్థ్సితః | నేష్యామి పునరావృత్తిం యది తిష్ఠేత్ప్వమాత్మనా || 54 నీవుకూడా ఈ దక్షయజ్ఞమునందు యజ్ఞభాగముకొరకు వచ్చినాము హే మహాబాహో నీకు కూడా నేను యజ్ఞభాగమునిచ్చెదను (50) హే హరీ! నేను నీవక్షస్థ్సలమును చీల్చివేసెదను. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ సమీపమునకు వచ్చువాడెవ్వడు గలడు? (51) నేను నిన్ను నేలపై పడవేసి , అగ్నితో దగ్ధుని చేసి, దగ్ధుడవగు నిన్ను ఈ నాడు శీఘ్రముగా పిండి చేసెదను(52) ఓరీ హరీ! దురాచారా! నీవు మహేశన్వరునకు ద్రోహము తలపెట్టిన అధముడవు. పావనమగు శ్రీరుద్రుని మహిమను నీవు ఎరుంగవా? (53) హే మహాబాహొ! నీవు ఆ మహిమను ఎరింగియూ యుద్దమును చేయగోరి ఎదుట నిలబడితివి,. నీవు నా ఎదుట నిలబడగల్గినచో, నేను నీచే ఆ మహిమను వల్లె వేయించెదను(54) బ్రహ్మోవాచ తస్య తద్వచనం శుత్వా వీరభద్రస్య బుద్ధిమాన్| ఉవాచ విహసన్ ప్రీత్యా విష్ణుస్తత్ర సురేశ్వరః ||55 బ్రహ్మ ఇట్లు పలికెను ఆవీరభద్రుని ఆ మాటను విని బుద్దిమంతుడు, దేవ నాయకుడు అగు విష్ణువు ఆ యజ్ఞశాలయెదుట చిరునవ్వుతో ప్రేమతో ఇట్లు పలికెను విష్ణురువాచ ! శృణుత్వం వీరభద్రాద్య ప్రవక్ష్యామి త్వదగ్రతః | న రుద్ర విముఖం మాం త్వం వద శంకర సేవకమ్ || 56 అనేక ప్రార్థితః పూర్వం యజ్ఞార్థం చ పునః పునః| దక్షేణావిదితార్థేన కర్మనిష్టేన మౌఢ్యతః || 57 అహం భకక్తపరాథీనస్తథా సోऽపి మహేశ్వరః | దక్షో భక్తో హి మే తాత తస్యాదగ్రగతో మఖే|| 58 శృణు ప్రతిజ్ఞాం మే వీర రుద్రకోప సముద్భవ| రుద్రతేజస్స్వరూపో హి సుప్రతాపాలయం ప్రభో|| 59 అహం నివారయామి త్వాం త్వం చ మాం వినివారయ| తద్భవిష్యతి యద్భావి కరిష్యేऽ హం పరాక్రమమ్|| 60 విష్ణువు ఇట్లు పలికెను వీరభద్రా! నీ ఎదుట నేను ఇపుడు చెప్పబోవు మాటను నీవు వినుము. శంకరుని సేవకుడునగు నన్ను గురించి నీవు రుద్రవిరోధియని పలుకవద్దు(56) తత్త్వము నెరుంగని వాడు, అజ్ఞానము వలన కర్మయందు మాత్రమే నిష్ఠగలవాడునగు ఈ దక్షుడు పూర్వము నన్ను యజ్ఞమునకు రమ్మని అనేక పర్యాములు గోరియుండెను(57) నేను భక్తులకు వశములో నుందును. మహేశ్వరుడు కూడ అట్టివాడే వత్సా! దక్షుడు నాభక్తుడు. అందువలననే నేనీ యజ్ఞమునకు వచ్చితిని(58) రుద్రుని కోపమునుండి పుట్టిన ఓవీరా! నా ప్రతిజ్ఞను వినుము హే ప్రభో! రుద్ర తేజస్సు స్వరూపముగా గల నీవు గొప్పపరాక్రమశాలివి(59) నీవు నన్ను అడ్డుకొనుము నేను నిన్ను అడ్డెదను. ఏది జరుగవలెనో, అదియే జరుగును. నేను పరాక్రమమును చూపెదను(60) బ్రహ్మోవాచ| ఇత్యుక్తవతి గోవిందే ప్రహస్య స మహాభుజః | అవదత్సుప్రసన్నోऽస్మి త్వాం జ్ఞాత్వాస్మత్ర్పభోః ప్రియమ్|| 61 తతో విహస్య సుప్రీతో వీరభద్రో గణాగ్రణీః | ప్రశ్రయావనతోऽవాదీ ద్విష్ణుం దేవం హి తత్త్వతః || 62 బ్రహ్మ ఇట్లు పలికెను గోవిందుడిట్లు పలుకగా, మహాబాహుడు అగు ఆ వీరభద్రడు చిరునవ్వు నవ్వి, 'నీవు మా ప్రభుడగు రుద్రునకు ప్రియుడవని తెలిసి నేను మిక్కిలి సంతసించితిని అని పలికెను(61) అపుడు గణాధ్యక్షుడగు వీరభద్రుడు మిక్కిలి సంతసించి, వినయముతో విష్ణుదేవునకు యథార్థముగా నమస్కరించి ఇట్లు పలికెను(62) వీరభద్ర ఉవాచ| తవ భావపరీక్షార్థ మిత్యుక్తం మే మహాప్రభో| ఇదాం తత్త్వతో వచ్మి శృణు త్వం సావధానతః || 63 యథా శివస్తథా త్వం హి యథా త్వం చ తథ శివః | ఇతి వేదా వర్ణయంతి శివశాసనతో హరే|| 64 శివాజ్ఞయా వయం సర్వే సేవకాశ్శంకరస్య వై | తథాపి చ రమానాథ ప్రవాదోచితమాదరాత్ ||65 వీరభద్రుడిట్లు పలిను- హే మహాప్రభో! నీ మనస్సును పరీక్షించుటకైనేను అట్లు పలికితిని. ఇప్పుడు యథార్థమును చెప్పుచున్నాను. నీవు సావధానముగా వినము(63) శివుడు ఎట్లో, నీవు అట్లే ఓ హరీ! శివుని శాసనముచే వేదములు ఇట్లు వర్ణించుచున్నవి (64) మేము అందరము శివుని ఆజ్ఞచే ఆయనను సేవించువారము. హే రమానాథా! నేను ఈ ఘర్షణకు అనురూపముగా మాత్రమే పలికియుంటిని, అయిననూ, నాయందు ఆదరమును చూపుము(65) బ్రహ్మోవాచ| తచ్ఛ్రత్వా వచనం తస్య వీరభద్రస్య సోऽచ్యుతః | ప్రహస్య చేదం ప్రోవాచ వీరభద్రమిదం వచః || 66 బ్రహ్మ వాచ| ఆ అచ్యుతుడు ఆ వీరభద్రుని ఆ మాటను విని, చిరునవ్వు నవ్వి, వీరభద్రునితో ఈ మాటను పలికెను(66) విష్ణురువాచ| యుద్ధం కురు మహావీర మయా సార్ధమశంకితః| తవాస్త్రః పూర్య మాణోऽహం గమిష్యామి స్వమాశ్రమమ్||67 విష్ణువు ఇట్లు పలికెను ఓమహావీరా! నీవు శంకను వీడి నాతో యుద్ధమును చేయుము. నేను నీ అస్త్రములచే శరీరమునిండిన తరువాత నీస్థానమునకు వెళ్లెదను(67) బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా హి విరమ్యాసౌ సన్నద్ధోऽ భూద్రణా యచ | స్వగణౖర్వీర భద్రోऽపి సన్నధ్ధోऽథ మహాబలః || 68 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితాయాయాం రుద్ర సంహితాయాం విష్ణు వీరభద్ర సంవాదో నామ షట్ త్రింశోऽ ధ్యాయః(36) బ్రహ్మ ఇట్లు పలికెను- విష్ణువు ఇట్లు పలికి విరమించి యుద్ధమునకు సంసిద్ధుడు కాగా, మహాబలుడగు వీరభద్రుడు కూడ తన గణములతో గూడి యుద్దమునకు సన్నద్ధుడాయెను(68) శ్రీ శివమహాపురాణములో రెండవది యగు రుద్ర సంహింతయందలి సతీఖండలో విష్ణు వీరభద్ర సంవాదమను ముప్పదిఆరవ అధ్యాయము ముగిసినది(36)