Sri Sivamahapuranamu-I
Chapters
అథ సప్తత్రింశో ऽధ్యాయః యజ్ఞ విధ్వంసము బ్రహ్మోవాచ| వీరభద్రోऽథ యుద్ధేవై విష్ణునా స మహాబలః | సంస్మృత్య శంకరం చిత్తే సర్వాపద్వినివారణమ్||1 ఆరుహ్య స్యందనం దివ్యం సర్వవైరివి మర్దనః| గృహీత్వా పరమాస్త్రాణి సింహనాదం జగర్జహ||2 విష్ణుశ్చాపి మహాఘోషం పాంచ జన్నాభిధం నిజమ్ | దధ్మౌ బలీ మహాశంఖం స్వకీయాన్ హర్షయన్నివ||3 తచ్ఛ్రుత్వా శంఖనిర్హ్రాదం దేవా యే చ పలాయితాః | రణం హిత్వా గతాః పూర్వం తే ద్రుతం పురాయయుః||4 బ్రహ్మ ఇట్లు పలికెను అపుడు మహాబలుడగు ఆ వీరభద్రుడు విష్ణువుతోడి యుద్ధమునందు అపదలన్నిటినీ వనివారించు శంకరుని మనస్సులో స్మరించి(1) దివ్యమగు రథమునధిష్ఠించెను. శత్రువులనందరినీ సంహరించే ఆ వీరభద్రుడు గొప్ప అస్త్రమును తీసుకొని సింహ నాదమును చేసెను(2) విష్ణువు కూడా పాంచ జన్యమను పేరుగల, గొప్ప శబ్ధమును చేసే తన మహాశంఖమును, తనవారికి ఆనందమును కలుగు చేయుచున్నాడాయన్నట్లు, మ్రోగించెను(3) ఆ శంఖ నాదమును విని, పూర్వములో యుద్ధమునండి పారిపోయిన దేవతలు కూడ వేగముగా మరలి వచ్చిరి(4) వీరభద్ర గణౖస్తేషాం లోకపాలాస్సవాసవాః| యుద్దం చక్రుస్తథా సింహనాదం కృత్వా బలా న్వితాః ||5 గణానాం లోకపాలానాం ద్వంద్వయుద్దం భయావహమ్| అభవత్తత్ర తుములం గర్జతాం సింహనాదతః||6 నందినా యుయుధే శక్రోऽ నలో వై వైష్ణవాస్తథా| కుబేరోऽ పి హి కూష్మాండపతిశ్చ యుయుధే బలీ||7 తదేంద్రేణ హతో నందీ వజ్రేణ శతపర్వణా| నందినా చ హత శ్శక్రస్త్రి శూలేన స్తనాంతరే||8 సైన్య సమేతులగు లోకపాలురు ఇంద్రునితో గూడి సింహనాదమును చేసి వీరభద్రుని గణములతో యుద్ధమును చేసిరి(5) సింహనాదములను చేయుచున్న గణములకు, లోకపాలురకు భయమును గొల్పు సంకుల సమరము జరిగెను(6) ఇంద్రుడు నందితో యుద్ధమును చేసెను. అగ్ని విష్ణు గణములు, మరియు కుబేరుడు బలశాలియగు కూష్మాండపతితో యుద్ధమును చేసిరి(7) అపుడు ఇంద్రుడు వంద ధారలు గల వజ్రముతో నందని కొట్టగా, నంది ఇంద్రుని త్రిశూలముతో వక్షస్థ్సలమునందు కొట్టెను(8) బలినౌ ద్వావపి ప్రీత్యా యుయుధాతే పరస్పరమ్ | నానా ఘాతాంశ్చ కుర్వంతౌ నందిశక్రౌ జిగీషయా||9 శక్త్యా జఘాన చాశ్మానం శుచిః పరమకోవపః | సోऽపి శూలేన తం వేగాచ్ఛతధారేణ పావకమ్|| 10 యమేన సహ సంగ్రాహం మహాలోక గణాగ్రణీః | చకార తుములం వీరో మమాదేవం స్మరన్ముదా||11 నైర్‌ఋతేన సమాగమ్య చండశ్చ బలవత్తరః | యుయుథే పమాసై#్త్రశ్చ నైర్‌ఋతిం నివిడంబయన్|| 12 బలవంతులగు నంది, ఇంద్రుడు ఇద్దరు ఒకరినొకరు జయించు కోరిక గలవారైన, అనేక విధములుగా ఒకరినొకరి కొట్టుకొనుచూ, పట్టుదలతో యుద్దమును చేసిరి(9) మిక్కిలి కోపము గల అగ్ని అశ్మయను గణాధిపతిని శక్తితో కొట్టెను. ఆయన కూడ అగ్నిని వేగముగా వంద ధారలు గల శూలముతో పొడిచెను(10). శివలోకములోని గణములలో అగ్రేసరుడగు వీరుడు ఆనందముతో మహాదేవును స్మరించుచూ, యమునితో సంకుల సమరమునుచేసెను(11) మిక్కలి బలశాలియగు చండుడు నైర్‌ఋతికి ఎదురేగి, పరమాస్త్రములతో అతనిని కొట్టి, పరిహసించుచూ, యుద్దమును చేసెను(12) వరుణన సమం వీరో ముండశ్చైవ మహాబలః | యుయుధే పరమయా శక్త్యా త్రిలోకీం విస్మయన్నివ||13 వాయునా చ హతో భృంగీ స్వాస్త్రేణ పరమోజసా | భృంగిణా చ హతో వాయుస్త్రి శూలేన ప్రతాపినా||14 వీరుడు, మహాబలుడునగు ముండుడు గన గొప్ప శక్తిచే ముల్లోకములను విస్మయపరుచుచున్నాడా యన్నట్లు వరుణునితో యుద్ధమును చేసెను(13).వాయువు గొప్ప శక్తిగల తన తన అస్త్రముతో భృంగిని కొట్టగా, ప్రతాపశాలియగు భృంగి వాయువును త్రిశూలముతో కొట్టెను(14) కుబేరేణౖవ సంగమ్య కూష్మాండపతి రాదరాత్ | యుయుధే బలవాన్వీరో ధ్యాత్వా హృది మహేశ్వరమ్||15 యోగినీ చక్ర సంయుక్తో భైరవీనాయకో మహాన్ | విదీర్య దేవానఖిలాన్ పపౌ శోణితమద్భుతమ్ ||16 క్షేత్ర పాలస్తథా తత్ర ఋభుక్షుస్సురపుంగవాన్| కాలీ చాపి విదార్యైవ తాన్ పపౌరుధిరం బహు||17 అథ విష్ణుర్మహేతేజా యుయుధే తైశ్చ శత్రుహా| చక్రం చిక్షేప వేగేన దహన్నివ దిశో దశ||18 బలవంతుడు, వీరుడునగు కూష్మాంండపతి మనస్సులో మహేశ్వరుని ధ్యానించి, కుబేరునితో యుద్ధమును చేసెను(15). యోగినీ గణములతో కూడియున్న బహాబలుడగు భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి రక్తమును త్రాగెను. ఆదృశ్యము అద్భుతముగ నుండెను(16) మరియు ఆ యుద్ధములో క్షేత్రపాలుడు, ఋభుక్షుడు, కాళి ఆ దేవతలను అధిక సంఖ్యలో చీల్చి రక్తమును త్రాగిరి. (17). అపుడు మహా తేజస్వి, శత్రు సంహారకుడునగు విష్ణువు వారితో యుద్ధమును చేసెను. ఆయన పది దిక్కులను కాల్చి వేయుచున్నాడా యన్నట్లు చక్రమును ప్రయెగించెను(18) క్షేత్రపాస్సమాయాంతం చక్రమాలోక్య వేగతః | తత్రాగత్యాగ్రతో వీరశ్చాగ్రసత్సహసా బలీ||19 చక్రం గ్రసి త మాలోక్య విష్ణుః పరపురంజయః | ముఖం తస్య పరామృజ్య తముద్గాలితవానరిమ్||20 స్వచక్ర మాదాయ మహానుభావః చుకోప చాతీవ భ##వైక భర్తా| మహాబలీ తైర్యుయుధే ప్రవీరైః సక్రుద్ధ నానాయుధ ధారకోऽ సై#్త్రః||21 వేగముగా వచ్చుచున్న చక్రమును చూచి వీరుడు, బలశాలియగు క్షేత్రపాలుడు దానికి ఎదురేగి, దానిని వెంటనే మ్రింగివేసెను(19) శత్రు నగరమును జయించు విష్ణువు తన చక్రము నాతడు మ్రింగివేయుటను గనెను. ఇంతలో అతడు నోటిని అధికముగా విడదీసి ఆ చక్రమును బయటకు గ్రక్కెను(20) మహానుభవుడు, జగత్తునకు ఏకైక రక్షకుడునగు విష్ణువు తన చక్రమును స్వీకరించి మిక్కిలి కోపించెను. మహాబలుడగు విస్ణువు క్రుద్ధుడై అనేక ఆయుధములను, అస్త్రములను ధరించి వీరులగు ఆ గణములతో యుద్దమును చేసెను(21) చక్రే మహారణం విష్ణుసై#్తస్సార్థం యుయుధే ముదా| నానాయుధాని సంక్షిప్య తుములం భీమవిక్రమమ్ ||22 అథ తే భైరవాద్యాశ్చ యుయుధుస్తేన భూరిశః | నానాస్త్రాణి విముంచంతస్సంక్రుద్ధాః పరమో జసా||23 ఇత్థం తేషాం రణం దృష్ట్వా హిరణాతులతేజసా| వినివృత్య సమాగమ్య తాన్ స్వయం యుయుధే బలీ|| 24 అథ విష్ణుర్మహేతేజాశ్చక్ర ముద్యమ్య మూర్ఛితః| యుయుధే భగవాంస్తేన వీరభ##ద్రేణ మాధవః||25 విష్ణవు భయంకరమగు పరాక్రమమును ప్రదర్శించుచూ, అనేక ఆయుధములను ప్రయోగించి, వారితో సంకులమగు మహా యుద్ధమును చేసెను(22) అపుడు భైరవుడు మొదలగు వారు మిక్కిలి కోపించి గొప్ప తేజస్సు గలవారై అనేక అస్త్రములను ప్రయోగించుచూ, ఆయనతో యుద్ధమును చేసిరి(23) ఇట్లు వారు యుద్దమును చేయుచుండుటను గాంచి సాటిలేని తేజస్సు గల విష్ణువు వెనుకకు మరలి వచ్చి వారిని ఎదుర్కొని స్వయముగా వరితో యుద్ధమును చేసెను(24) అపుడు మహా తేజశ్శాలి, లక్ష్మీపతి అగు విష్ణుభగవానుడు క్రోధమును పొంది చక్రమును చేతబట్టి ఆ వీరభద్రునితో యుద్ధమును చేసెను(25) తయోస్మమ భవద్యుద్ధం సుఘోరం రోమహర్షణమ్ | మహావీరాబ్ధిపత్యోస్తు నానాస్త్రధరయోర్మునే||26 విష్ణోర్యోగ బలాత్తస్య దేవ దేవసన్య దారుణాః| శంఖచక్రగదాహస్తా అసంఖ్యాతాశ్చ జజ్ఞిరే||27 తే చాపి యుయుధుస్తేన వీరభ##ద్రేణ భాస్వతా| విష్ణువర్భలవంతో హి నానాయుధదరా గణాః||28 తాన్ సర్వానపి వీరోऽ సౌ నారాయణ సమప్రభాన్ | భస్మీచకార శూలేన హత్వా స్మృత్వా శివం ప్రభుమ్||29 ఓ మహర్షీ! మహావీరుడగు వీరభద్రుడు, శేషశాయియగు విష్ణువు అనేక అస్త్రములను ధరించి, శరీరమునకు గగుర్పాటుకలిగించే అతి భయంకరమగు యుద్ధమునుచేసిరి(26) దేవదేవుడగు ఆ విష్ణువు యొక్క యోగబలముచే భయంకారాకారులు, శంఖుమును చక్రమును గదను చేతులయందు ధరించినవారునగు విష్ణుగణములు లెక్కలేనంతమంది పుట్టిరి(27).విష్ణువుతో సమమగు బలము గలవారు, అనక ఆయుధములను ధరించిన వారు అగు ఆ విష్ణువుగణములు కూడా తేజశ్శాలియగు ఆ వీరభద్రునితో యుద్ధమును చేసిరి(28). వీరుడగు వీరభద్రుడు శివప్రభుని స్మరించి, నారాయణునితో సమమగు తేజస్సుగల వారినందరినీ శూలముతో సంహరించి భస్మము చేసెను(29) తతోశ్చోరసి తం విష్ణుం లీలయైన రణాజిరే| జఘాన వీరభద్రో హి త్రిశూలేన మహాబలీ||30 తే ఘాతేన సహసా విహతఃపురుషోత్తమః| పపాత చ తదా భూమౌ విసంజ్ఞోऽ భూన్మునే హరిః||31 తతో యజ్ఞోద్భూతం తేజః ప్రలయానల సన్నిభమ్| త్రైలోక్య దాహకం తీవ్ర వీరాణామపి భీకరమ్||32 క్రోధరక్తేక్షణశ్ర్శీమాన్ పునరుత్థాయ న ప్రభుః | ప్రహర్తుం చక్ర ముద్యమ్య హ్యతిష్ఠత్పురుషర్షభః||33 అపుడు మహాబలుడగు వీరభద్రుడు యుద్ధరంగమునందు త్రిశూలముతో ఆ విష్ణువును వక్షస్థ్సలమునందు లీలగా పొడిచెను(30). ఓ మహర్షీ! అపుడు పురుషోత్తముడగు విష్ణువు ఆ శూలఘాతముచే గాయపడినవాడై, వెనువెంటనే స్పృహను గోల్పోయి భూమిపై బడెను(31). అపుడు ప్రలయాకాలగ్నివలె ప్రకాశించునది, ముల్లోకములను తగలబెట్టునది, తీవ్రమైనది, వీరులకు గూడ భయమును గొల్పునది అగు తేజస్సు యజ్ఞము నుండి ఉద్భవించెను(32) పురుషోత్తముడు, లక్ష్మీపతి అగు ఆ విష్ణువు ప్రభుడు మరల లేచి, క్రోధముచే ఎర్రనైన నేత్రముల గలవాడై చక్రమును చేతబట్టి వీరభద్రునిపై దాడి చేయుటకు సంసిద్ధుడాయెను(33) తస్య చక్రం మహారౌద్రం కాలాదిత్యసమప్రభమ్ | వ్యష్టం భయదదీనాత్మా వీరభద్ర శ్శివప్రభుః||34 మునే శంభోః ప్రభావాత్తు మాయేశస్య మహాప్రఙోః| న చచాల హరేశ్చక్రం కరస్ధం స్తంభితం ధ్రువమ్||35 అథ విష్ణుర్గణశేన వీరభ##ద్రేణ భాస్వతా| అతిష్ఠత్ స్తంభితస్తేన శృంగవానివ నిశ్చలః||36 తతో విష్ణుస్త్సభితో హి వీరభ##ద్రేణ నారద| యజ్వోప మంత్రణ మనా నీరస్తంభన కారకమ్ ||37 తతస్త్సం భన నిర్ముక్తశ్శార్‌ఙ్గధన్వా రమేశ్వరః| శార్‌ఙ్గం జగ్రాహ స క్రుద్ధ స్స్వధను స్సశరం మునే||38 దైన్యములేని మనస్సు గలవాడు, శివప్రభునిస్వరూప భూతుడు అగు వీరభద్రుడు మిక్కిలి భయంకరమైనది, ప్రలయకాలయందలి సూర్యునితో సమమగు కాంతి గలది అగు ఆ విష్ణువ యొక్క చక్రమును స్తంభింపజేసెను(34) ఓ మహర్షీ! హరియెక్కచేతియందలిచక్రము మాయాధీశుడు, మహాప్రభువు అగు శంభుని ప్రభావముచే నిశ్చిత్తముగా స్తంభింప చేయబడి కదలకుండెను(35) అపుడు తేజశ్శాలి, గణాధీశుడు అగు ఆ వీరభద్రునిచే స్తంభింపచేయబడిన విష్ణువు పర్వతము వలె కదలిక లేకుండగా నిలబడెను(36) ఓ నారద! వీరభద్రనిచే స్తభింపజేయబడిన విష్ణువు ఆ స్తంభన శక్తిన నిర్వీర్యము చేయుట కొరకై భృగు మహర్షిని పిలువగోరెను(37) ఓ మహర్షీ! ఇంతలో స్తంభననుండి విడుదలపొందిన లక్ష్మీపతి శార్‌ఙ్గమని ప్రసిద్ధిగాంచిన తన ధనస్సును , బాణములను క్రోథముతో చేబట్టెను(38) త్రిభిశ్చ ధర్షితో బాణౖస్తేన శార్‌ఙ్గం ధనుర్హరేః| వీరభ##ద్రేణ తత్తాత త్రిధాభూత్తత్ క్షణాన్మునే||39 అథ విష్ణుర్మయా వాణ్యా భోధితస్తం మహాగణమ్ | అసహ్యవర్చసం జ్ఞాత్వా హ్యంతర్ధాంతుం మనో దధే||40 ఓ మహర్షీ! వత్సా! విష్ణువు యొక్క శార్‌ఙ్గ ధనస్సును ఆ వీరభద్రుడు మూడు బాణములతో కొట్టగా, అది క్షణములో మూడు ముక్కలాయెను(39) అపుడు విష్ణువును నేను, సరస్వతి దేవి హెచ్చిరించితిమి.మహా గణాధీశుడగు వీరభద్రుని పరాక్రమమును సహింపశక్యముకాదని ఎరింగి విష్ణువు అంతర్ధానమగుటకు నిశ్చయించుకొనెను(40) జ్ఞాత్వా తత్సర్వమిదం భవిష్యం సతీకృతం దుష్ప్రసహం పరేషామ్ | గతాస్స్వలోకం స్వగణాన్వితాస్తు స్మృత్వా విం సర్వపతిం స్వతంత్రమ్||41 సత్యలోకగతశ్చాహం పుత్రశోకేన పీడితః| అచింతయం సుదుః ఖార్తో మయా కిం కార్యమద్యవై||42 విష్ణౌ మయి గతే చైవ దేవాశ్చ మునిభిస్సహ| వినిర్జితా గణౖస్సర్వే యేతే యజ్ఞోపజీవినః||43 సముపద్రవమాలక్ష్య విధ్వస్తం చ మహాముఖమ్| మృగస్వరూపో యజ్ఞో హి మహాభీతోऽపి దుద్రువే||44 తం తదా మృగరూపేణ ధావంతం గగనం ప్రతి | వీరభద్రస్సమాదాయ విశిరస్కమథా కరోత్||45 సతి దేహమును త్యజించుట శివగణములకు సహింప శక్యము కాని ఘటన అనియు, ఈ సర్వనాశనము జరుగబోవుననియు ఎరింగిన దేవగణనాయకులు సర్వలోక ప్రభుడు, స్వతంత్రడునగు శివుని స్మరించి తమ గటనములతో గూడి తమతమలోకములకు వెళ్ళిరి(41). నేను పుత్రశోకముతో పీడింపబడుతూ సత్యలోకమునకు వెళ్ళి మిక్కిలి దుఃఖముతో కూడినవాడనై 'ఇపుడు నాకర్తవ్యమేమి?' అని చింతిల్లితిని(42) విష్ణువు, నేను మరలిపోగానే మిగిలిన దేవతలను అందరిని, మరుయు యజ్ఞమే జీవనాధారముగాగల మునులను శివగణములు జయించినవి(43). యజ్ఞపురుషుడు సంప్రాప్తమైన మహావిపత్తును ఎరింగి, మహా యజ్ఞము నాశనమగుటగాంచి, మిక్కిలి భీతిల్లి, మృగరూపముతో పరుగిడెను(44). మృగరూపముతో ఆకసము వైపునకు పరుగిడుతున్న ఆ యజ్ఞపురుషుని వీరభద్రుడు పట్టుకొని తలను నరికి వేసెను(45) తతః ప్రజాపతిం ధర్మం కశ్యపం చ ప్రగృహ్య సః| అరినేమినం వీరో బహుపుత్ర మనీశ్వరమ్||46 మునియాంగిరసం చైవ కృశాశ్వం చ మమాగణః| జఘాన మూర్ధ్న పాదేన దత్తం చ మునిపుంగవమ్||47 సరస్వత్యాశ్చ నాసాగ్రం దేవమాతుస్తథైవ చ | చిచ్ఛేద కరజాగ్రేణ వీరభద్రః ప్రతాపవాన్||48 తతోऽన్యానసి దేవాదీన్ విదార్య పృథివీతలే| పాతయామాస సోऽయం వైక్రోధాంక్రాంతాతిలోచనః||49 అపుడా వీరుడగు వీరభద్రుడు ధర్మ, కశ్యప్రజాపతులను, అనేక పుత్రులతో అసమర్ధుడై యున్న అరినేమిని(46) అంగిరస మహర్షిని, కృశాశ్వుని, దత్త మహర్షిని పట్టుకొని శిరస్సుపై పాదముతో తన్నెను(47) మహాగణాధ్యక్షడు, ప్రతాపశీలియగు వీరభద్రుడు దేవతలకు తల్లియగు సరస్వతి యొక్క ముక్కుకొనను చేతిలోని కత్తికొనతో కోసివేసెను(48) ఆ వీరభద్రుడు క్రోథముచే ఎర్రనైన నేత్రములు గలవాడై, దేవతలు మొదలగు ఇతరులను చీల్చి నేల గూల్చెను(49) వీరభద్రో విదార్యాపి దేవాన్ముఖ్యాన్ము నీవసి| నాభూచ్ఛాంతో ద్రుతక్రోదః ఫణిరాడివ మండితః||50 వీరభద్రోద్ధృతారాతిః | కే సరీవ వనద్విపాన్| దిశో విలోకయామాస కః కుత్రాస్తీ త్యనుక్షణమ్||51 వ్యపోథయద్భృగుం యావన్మణీ భద్రః ప్రతాపవాన్| పదాక్రమ్యోరసి తదాऽ కర్షీత్తఛ్మశ్రులుంభనమ్||52 చండశ్చోత్పాటయామాస పూష్ణో దంతాన్ ప్రవేగతః| శప్యమానే హరే పూర్వం యోऽ హసద్ధర్శయన్ దతః||53 పగబట్టిన త్రాచుపాము వలె మిక్కిలి కోపమును పొందియున్న వీరభద్రుడు ముఖ్యులగు దేవతలను , మహర్షులను చీల్చి చెండాడిన తరువాతనైననూ శాంతించలేదు(50) సింహము ఏనుగులను వలె శత్రువులను తరిమివేసిన వీరభద్రుడు 'ఎవడు ఎక్కడ దాగియున్నాడో!' అని ప్రతిక్షణము దిక్కులను పరికించుచుండెను(51) ఇంతలో ప్రతిపశీలియగు మణి భద్రుడు భృగువును నేలపై బడవేసి, కాలితో గండెలపై తొక్కిపెట్టి గెడ్డమును , మీసములను ఊడబెరికెను(52) దక్షుడు శివుని నిందించిన సమయములో పళ్ళుకనబడునట్లు బిగ్గరగా నవ్విన పూషన్ యొక్క దంతములను చండుడు వేగముగా పెరికివేసెను(53) నందీ భగస్య నేత్రేహి పాతితస్య రుషా భువి| ఉజ్ఞహార స దక్షోక్‌ష్ణా యశ్శపంతమసూ సుచత్|| 54 విడంబితా స్వధా తత్ర సా స్వాహ దక్షిణా తథా| మంత్రాస్తంత్రాస్తథా చాన్యే తత్రస్థా గణనాయకైః ||55 వవృషుస్తే పురీషాణి వితానాగ్నౌ రుషా గణాః| అనిర్వాచ్యం తదా చర్రుర్గతణా వీరాస్త మధ్వరమ్||56 అంతర్వేద్యంతరగతం నిలీనం తద్భయాద్బలాత్ l ఆ నినాయ సమాజ్ఞాయ వీర భ##ద్రే స్వభూసుతమ్ll 57 దక్షుడు శివుని నిందించిన సమయములో కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నందికోపముతో నేలపై బడవేసి, అతని నేత్రములను గిల్లివేసెను(54) శివ గణనాయకులు ఆ యజ్ఞశాలయందు ఉన్న స్వాహ, స్వదా, దక్షిణా అను దేవతలను, మంత్ర తంత్రాదిష్టాన దేవతలను, ఇతరులను దురవస్థకు గురిచేసిరి(55) ఆ గణములు కోపముతో అగ్నివేదికయందు మాలిన్యమును జల్లిరి. ఆ యజ్ఞమును శివగణములు ధ్వంసము చేసిన తీరు వర్ణనాతీతముగ నుండెను(56). వేది లోపల ఒక రంధ్రములో వీరభద్రుని భయముచే దాగియున్న బ్రహ్మపుత్రుడగు దక్షుని ఆ గణములు బలముగా బయటకు లాగి ఆ వీర భద్రుని సన్నిధిలో నిలబెట్టిరి(57) కపోలేऽస్య గృహీత్వా తు ఖడ్గే నో పహృతం శిరః| అభేద్యమ భవత్తస్య తచ్చ యోగప్రభావతః||58 అభేద్యం తచ్ఛిరో మత్వా శస్త్రా సై#్త్రశ్చ తు సర్వశః| కరేణ త్రోట యామాస పద్భ్యా మాక్రమ్య చోరసి||59 తచ్ఛిరస్తస్య దుష్టస్య దక్షస్య హరవైరిణః | అగ్నికుండే ప్రచిక్షేప వీరభద్రో గణాగ్రణీః||60 రేజే తదా వీరభద్ర స్త్రి శూలం భ్రామయన్ కరే| క్రుద్ధో రణాక్ష సంవర్తః ప్రజ్వాల్య పర్వతోపమః ||61 వీరభద్రుడు అతనిని చెక్కిళ్ళయందు పట్టుకొని కత్తితో తలను కోయబోగా, యోగమహిమచే ఆతలను నరకుట సంభవము కాలేదు(58) ఆ శిరస్సును శస్త్రములచే గాని అస్త్రములచేగాని నరుకుట సర్వథా అసంభవమని భావించి, అతడు గుండెపై రెండు కాళ్లతో నిలబడి చేతితో పెరికివేసేను(59) గణాధ్యక్షుడగు వీరభద్రుడు దుష్టుడు, శివద్రోహియగు ఆ దక్షుని ఆ శిరస్సునను అగ్ని కుండమునందు బారవైచెను(60) అపుడు వీరభద్రుడు చేతిలో త్రిశూలమును త్రిప్పుచూ ప్రకాశించెను. పర్వతాకారుడగు వీరభద్రుడు క్రోథముతో సర్వమును తగులబెట్టి ప్రళయాకాలాగ్నిని బోలియుండెను(61) అనాయాసేన హత్వైతాన్ వీరభద్రస్తతోऽగ్నినా| జ్వాలయామాస సక్రోథో దీప్తాగ్నిశ్శలభానివ|| 62 వీరభద్రస్తతో దగ్థాన్ దృష్ఠ్వా దక్షపురోగమాన్ | అట్టాట్ట హాసమకరోత్ పూరయంశ్చ జగత్త్రయమ్||63 వీరశ్రియా వృతస్తత్ర తతో నందన సంభవా| పుష్ప వృష్టిరభూద్దివ్యా వీరభ##ద్రే గణాన్వితే|| 64 వవుర్గంధవహాశ్శీతా స్సుగంధాస్సుఖదాశ్శనైః | దేవ దుందుభయో నేదుస్సమమేవ తతః పరమ్||65 వీరభద్రుడు వారిని తేలికగా సంహరించి, తరువాత క్రోథముతో వారికి నిప్పుపెట్టి, అగ్నిహోత్రము మిడతలను వలె తగుల బెట్టెను(62) అపుడు దక్షుడు మొదలగు వారు తగులబడుటను గాంచి వీరభద్రుడు ముల్లోకములను పూరించువాడై పెద్ద అట్టహాసము చేసెను(63) అపుడాతడు వీరశోభతో ప్రకాశించెను గణములతో కూడియున్న వీరభద్రునిపై నందన వనమునందు పుట్టిన దివ్యపుష్పములు వర్ణించెను(64) పరిమళభరితమై సుఖమును కలిగించే చల్లని గాలులు మెల్లగా వీచినవి. అదే సమయములో దేవదుందుభులు అద్భుతముగా మ్రోగినవి(65) కైలాసం స య¸° వీరః కృతకార్యస్తతః పరమ్| వినాశిత దృఢధ్వాంతో భానుమానివ సత్వరమ్||66 కృతకార్యం వీర భద్రం దృష్ఠ్వా సంతుష్టమానసః| శంభుర్వీద గణాధ్యక్షం చకార పరమేశ్వరః||67 ఇతి శ్రీ శివమహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే యజ్ఞవిధ్వంస వర్ణనం నామ సప్తత్రింశోऽధ్యాయః (37) చీకట్లను పూర్తిగా పారద్రోలిన సూర్యుడు వలె ప్రకాశించే ఆ వీరుడు కార్యమును పూర్తిచేసుకొని శీఘ్రముమే కైలాసమునకు వెళ్ళెను(66) పరమేశ్వరుడగు శంభుడు కార్యమును పూర్తిచేసి వచ్చిన వీరభద్రుని గాంచి సంతసించిన మనస్సుగలవాడై అతనిని వీరగణములకు అధ్యక్షునిగా చేసెను(67). శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసనంహితయందు రెండవది యగు సతీఖండలో యజ్ఞ విద్వంస వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది(37)