Sri Sivamahapuranamu-I
Chapters
అథ నవత్రింశోऽధ్యాయః విష్ణుదధీచి యుద్ధము బ్రహ్మోవాచ | క్షువస్య హి తకృత్యేన దధీచస్యాశ్రమం య¸° | విప్రరూపమథాస్థాయ భగవాన్ భక్త వత్సలః ||
1 దధీచం ప్రాహ విప్రర్షిమభివంద్య జగద్గురుః | క్షువకార్యార్థముద్యుక్తశ్శైవేంద్రం ఛలమాశ్రితః ||
2 బ్రహ్మ ఇట్లు పలికెను - భక్త వత్సలుడగు విష్ణుభగవానుడు క్షువునకు హితమును చేయగోరి బ్రాహ్మణ వేషముతో దధీచుని అశ్రమమునకు వెళ్లెను (1). క్షువుని కార్యము కొరకై మారు వేషములో నున్నవాడు, జగద్గురువు అగు విష్ణువు శివభక్తులలో శ్రేష్ఠుడు, మహర్షియగు దధీచునితో నిట్లనెను (2). విష్ణురువాచ | భో భో దధీచ విప్రర్షే భవార్చనరతావ్యయ | వరమేకం వృణ త్వత్తస్తద్భవాన్ దాతుమర్హతి ||
3 విష్ణువు ఇట్లు పలికెను - ఓయీ దధీచా! మహర్షీ! నీవు శివారాధకులలో అగ్ర గణ్యుడవు, నాశము లేనివాడవు. నీ నుండి ఒక వరమును కోరెదను. నీవు దానిని ఈయ దగుదువు (3). బ్రహ్మోవాచ | యాచితో దేవదవేన దధీచశ్శైవసత్తమః | క్షువకకార్యార్థినా శీఘ్రం జగాద వచనం హరిమ్ ||
4 బ్రహ్మ ఇట్లు పలికెను - క్షువుని కార్యమును చేయగోరిన దేవదేవుడు విష్ణువుచే యాచింపబడిన శివ భక్తశ్రేష్ఠుడగు దధీచి వెంటనే విష్ణువుతో నిట్లనెను (4). దధీచ ఉవాచ | జ్ఞాతం తవేప్సితం విప్ర క్షువకార్యార్ధమాగతః | భగవాన్ విప్రరూపేణ మాయీ త్వమసి వై హరిః || 5 భూతం భవిష్యం దేవేశ వర్తమానం జనార్దన | జ్ఞాతం ప్రాసాదాద్రుద్రస్య సదా త్రై కాలికం మమ || 6 త్వాం జనేహం హరిం విష్ణుం ద్విజత్వం త్యజ సువ్రత | ఆరాధితోऽసి భూపేన క్షువేణ ఖలబుద్ధినా || 7 జానే తవైన భగవన్ భక్త వత్సలతాం హరే | ఛలం త్యజ స్వరూపం హి స్వీకురు స్మర శంకరమ్ || 8 దధీచుడు ఇట్లు పలికెను - హే బ్రాహ్మణా! నీ కోరిక నాకు తెలిసినది. నీవు క్షవుని కార్యము కొరకు బ్రాహ్మణ రూపములో వచ్చిన మాయావియగు విష్ణు భగవానుడవు (5). హే జనార్దనా! దేవదేవా! రుద్రుని అనుగ్రహముచే నాకు ఎల్ల వేళలా భూత భవిష్యద్వర్తమానములనే మూడు కాలముల సంగతులు తెలియచుండును (6). నీవు పాపహరుడవగు విష్ణువు అని నాకు తెలియును. ఓయీ గొప్ప వ్రతము గలవాడా! బ్రాహ్మణ వేషమును వీడుము. దుష్టబుద్ధియగు క్షువమహారాజు నిన్ను ఆరాధించినాడు (7). హే హరీ! భగవాన్! నీ భక్తవాత్సల్యమును నేను ఎరుంగుదును. నీవు మారు వేషమును వీడి సహజరూపమును స్వీకరించి శంకరుని స్మరింపుము (8). అస్తి చేత్కస్యచిద్భీతిర్భవార్చనరతస్య మే | వక్తుమర్హసి యత్నేన సత్యధారణ పూర్వకమ్ || 9 వదామి న మృషా క్వాపి శివస్మరణ సక్తధీః | న బిభేమి జగత్యస్మిన్దేవదై త్యాదికాదపి || 10 శివుని అర్చించుటయందు అభిరుచి గలవానికి ఎవనికైననూ భయము ఉన్నచో నీవు నాతో సత్యప్రతిజ్ఞను చేసి నిశ్చితముగా చెప్పవలెను (9). నేను అసత్యమును ఎట్టి సందర్భములోనైననూ పలుకను. శివుని స్మరించుటయందు లగ్నమైన బుద్ధిగల నేను ఈ జగత్తులో దేవతలకు గాని, రాక్షసులకు గాని, ఇతరులకు గాని ఎవ్వరికీ భయపడను (10). విష్ణు రువాచ | భయం దధీచ సర్వత్ర నష్టం చ తవ సువ్రత | భవార్చనరతో యస్మాద్భవాన్ సర్వజ్ఞ ఏవ చ || 11 బిభేమీతి సకృద్వక్తుమర్హసి త్వం నమస్తవ | నియోగాన్మమ రాజేంద్ర క్షువాత్ర్పతి సహస్య చ || 12 విష్ణువు ఇట్లు పలికెను - దధీచా! గొప్ప వ్రతము గలవాడా! నీకు సర్వత్ర భయము తొలగి పోయినది. నీవు శివుని పూజించుట యందు నిష్ఠగలవాడవు. అందువలననే సర్వజ్ఞుడవైనావు (11). నీకు నమస్కారము. నా ఆజ్ఞచే నీవు 'భయపడుచున్నాను' అని ఒక్కసారి నీ శత్రువు అగు క్షువమహారాజు ఎదుట చెప్పవలెను (12). బ్రహ్మోవాచ | ఏవం శ్రుత్వాపి తద్వాక్యం విష్ణోస్స తు మహాముని ః | విహస్య నిర్భయః ప్రాహ దధీచ శ్శైవసత్తమః || 13 బ్రహ్మ ఇట్లు పలికెను - విష్ణువు యొక్కఆ వాక్యమును విని కూడ భయమును పొందనివాడై శివభక్తాగ్రగణ్యుడగు దధీచ మహాముని నవ్వి ఇట్లు పలికెను (13). దధీచ ఉవాచ | న బిభేమి సదా క్వాపి కుతశ్చిదపి కించన | ప్రభావాద్దేవ దేవస్య శంభోస్సాక్షాత్పినాకినః || 14 దధీచుడు ఇట్లు పలికెను - పినాకధారి, దేవ దేవుడు అగు శంభుని ప్రభావము వలనే నేను ఏకాలమునందైననూ, ఏదేశమునందైననూ, ఏ వస్తువు వలన అయిననూ లేశ##మైననూ భయపడను (14). బ్రహ్మోవాచ | తతస్తస్య మునేశ్ర్శుత్వా వచనం కుపితో హరిః | చక్రముద్యమ్య సంతస్థౌ దిధక్షుర్మునిసత్తమమ్ || 15 అభవత్కుంఠితం తత్ర విప్రే చక్రం సుదారుణమ్ | ప్రభావాచ్చ తదీశస్య నృపతే స్సన్నిధావపి || 16 దృష్ట్వా తం కుంఠితాస్యం తచ్చక్రం విష్ణుం జగాదహ | దధీ చ స్సస్మితం సాక్షాత్సదసద్వ్యక్తికారమ్|| 17 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆ మహర్షి యొక్క ఈ మాటను విని విష్ణువు కోపించి, ఆ మహర్షిని దహించు కోరికతో చక్రమునెత్తి నిలబడెను (15). ఈశ్వరుని మహిమచే మిక్కిలి భయంకరమగు ఆ చక్రము ఆ బ్రాహ్మణుని యందు వ్యర్థమయ్యెను. క్షువ మహారాజు సన్నిధిలో కూడ అటులనే జరిగినది కదా !(16). మొక్క వోయిన చక్రము గల ఆ విష్ణువును చూచి దధీచుడు, సదసద్రూపమగు జగత్తు ఆవిర్భవించుటకు కారణభూతుడైన ఆ విష్ణువు ఎదుట చిరునవ్వుతో నిట్లనెను (17). దధీచ ఉవాచ | భగవన్ భవతా లబ్ధం పురాతీవ సుదారుణమ్ | సుదర్శనమితి ఖ్యాతం చక్రం విష్ణోః ప్రయత్నతః || 18 భవస్య తచ్ఛుభం చక్రం న జిఘాంసతి మామిహ | భగవానథ క్రుద్ధోసై#్మ సర్వాస్త్రాణి క్రమాద్ధరిః || 19 బ్రహ్మాస్త్రాద్యై శ్శరైశ్చాసై#్త్రః ప్రయత్నం కర్తుమర్హసి | దధీచుడిట్లు పలికెను - హే భగవాన్! నీవు పూర్వము ప్రయత్నమును చేసి అతి భయంకరమగు ఈ చక్రమును పొంది యుంటివి. ఇది లోకములో సుదర్శన మనియు, విష్ణు చక్రమనియు ప్రఖ్యాతిని గాంచినది (18). శివుడు అనుగ్రహించిన ఆ శుభచక్రము నన్ను సంహరింప నిచ్చగించుకున్నది. భగవానుడవగు నీవు కోపించి (19) బ్రహ్మాస్త్రము మొదలగు అస్త్రములతో, బాణములతో నన్ను సంహరించు యుత్నము చేయవచ్చును. బ్రహ్మోవాచ | స తస్య వచనం శ్రుత్వా దృష్ట్వా నిర్వీర్యమానుషమ్ || 20 ససర్జాథ క్రుధా తసై#్మ సర్వాస్త్రాణి క్రమాద్ధరిః | చక్రుర్దేవాస్తతస్తస్య విష్మోస్సాహాయ్య మాదరాత్ || 21 ద్విజేనైకేన సంయోద్ధుం ప్రసృతస్య విబుద్ధయః | చిక్షిపుస్స్వాని స్వాన్యాశు శస్త్రాణ్యస్త్రాణి సర్వతః || 22 దధీ చోపరి వేగేన శక్రాద్యా హరిపాక్షికాః | కుశముష్టిమథాదాయ దధీచస్సంస్మరన్ హరమ్ || 23 ససర్జ సర్వదేవేభ్యో వజ్రాస్థి సర్వతో వశీ | బ్రహ్మ ఇట్లు పలికెను - విష్ణువు తన చక్రము మొక్క బోవుటను గాంచి, ఆతని మాటలను విని కోపించి ఆతనిపై అస్త్రములనన్నింటినీ క్రమముగా (20) ప్రయోగించెను. అపుడు దేవతలు ఆదరముతో విష్ణువునకు సహాయపడిరి (21). ఒక్క బ్రాహ్మణునితో యుద్ధమునకు తలపడిన మూర్ఖులగు ఇంద్రాది దేవతలు విష్ణువు పక్షమున నిలబడి దధీచునిపై వేగముతో తత తమ శస్త్రములను, అస్త్రములను శీఘ్రమే ప్రయోగించిరి (22). అపుడు వజ్రము వంటి ఎముకలు గలవాడు, సర్వము తన వశమునందున్న వాడు అగు దధీచుడు శివుని స్మరించుచూ గుప్పెడు దర్భలను తీసుకుని (23) దేవతలందరిపై ప్రయోగించెను. శంకరస్య ప్రభావాత్తు కుశముష్టిర్మునేర్హి సా || దివ్యం త్రిశూల మభవత్కాలాగ్ని సదృశం మునే | దగ్ధుం దేవాన్ మతిం చక్రే సాయుధం సశిఖం చ తత్ || 25 ప్రజ్వలత్సర్వతశ్శైవం యుగాంతాగ్న్యధిక ప్రభమ్ | నారాయణంద్రముఖ్యైస్తు దేవైః క్షిప్తాని యాని చ || 26 ఆయుధాని సమస్తాని ప్రణముస్త్రిశిఖం చ తత్ | దేవాశ్చ దుద్రువుస్సర్వే ధ్వస్తవీర్యా దివౌకసః || 27 తస్థౌ తత్ర హరిర్భీతః కేవలం మాయినాం వరః | ససర్జ భగవాన్విష్ణు స్స్వదేహాత్పురుషోత్తమః || 28 ఆత్మన స్సదృశాన్ దివ్యాన్ లక్ష లక్షాయుతాన్ గణాన్ || 29 శంకరుని మహిమచే మహర్షి ప్రయోగించిన ఆ దర్భల కట్ట (24) కాలాగ్నివంటి దివ్య త్రిశూలమాయెను. ఓ మహర్షీ! మూడు అగ్రములు గల ఆ త్రిశూలము దేవతలను వారి ఆయుధములను దహించుటకు నిశ్చయించుకొనెను (25). శివుని ఆ శూలము ప్రలయకాలాగ్ని కంటె అధికమగు కాంతులను అంతటా విరజిమ్ముచూ మండెను. నారాయణుడు, ఇంద్రుడు మొదలగు దేతలను ప్రయోగించిన (26) ఆయుధములన్నియూ ఆ త్రిశూలము ముందు మోకరిల్లెనవి, నష్టమైన పరాక్రమముగల దేవతలందరు పారిపోయిరి (27). మాయావులలో శ్రేష్ఠుడవగు హరి ఒక్కడు మాత్రమే అచట నిలిచియుండెను. పురుషోత్తముడగు ఆ విష్ణుభగవానుడు తన దేహము నుండి (28) తనతో సమానమగు కోట్లాది దివ్య గణములను సృష్టించెను (29). తే చాపి యుయుధుస్తత్ర వీరా విష్ణు గణాస్తతః | మునినైకేన దేవర్షే దధీచేన శివాత్మనా || 30 తతో విష్ణుగణా తాన్వై నియుధ్య బహుశో రణ | దదాహ సహసా సర్వాన్ దధీచశ్సైవసత్తమః || 31 తతస్తద్వస్మయార్థాయ దధీచస్య మునేః హరిః | విశ్వమూర్తిరభూ చ్ఛీఘ్రం మహా మాయా విశారదః || 32 తస్య దేహే హరేస్సాక్షాదపశ్యద్ధ్విజసత్తమః | దధీచో దేవతాదీనాం జీవానాం చ సహస్రకమ్ || 33 వీరులగు ఆ విష్ణు గణములు కూడా శివస్వరూపుడు ఏకాకియగు దధీచ మహర్షితో అచట యుద్ధమును చేసిరి. ఓ దేవర్షీ! (30) అపుడు శివభక్తశేఖరుడగు దధీచుడు ఆ విష్ణుగణములతో పరిపరి విధముల యుద్ధమును చేసి, ఆ తరువాత క్షణములో వారి నందరినీ దహించివేసెను (31). అపుడు మహామాయా పండితుడగు విష్ణువు దధీచుని ఆశ్చర్యచకితుని చేయుట కొరకై విశ్వరూపమును పొందెను (32). ద్విజశ్రేష్ఠుడగు దధీచి ఆ విష్ణువు యొక్క దేహములో అసంఖ్యాకులగు దేవతలను, ఇతర జీవులను ప్రత్యక్షముగా చూచెను (33). భూతానాం కోటయశ్చైవ గణానాం కోటయస్తథా | అండానాం కోటయశ్చైవ విశ్వమూర్తే స్తనౌ తదా || 34 దృష్ట్వైతదఖిలం తత్ర చ్యావనిస్సతతం తదా | విష్ణుమహ జగన్నాథం జగత్సువమజం విభుమ్ || 35 ఆ విశ్వమూర్తి యొక్క దేహములో కోట్లాది భూతములు, కోట్లాది గణములు, మరియు కోట్లాది బ్రహ్మాండములు కానవచ్చెను (34). అపుడు ఆ విశ్వరూపమును చూచిన చ్యవననందనుడు, జగన్నాథుడు జగద్రక్షకుడు, పుట్టుక లేనివాడు, సర్వ వ్యాపియగు విష్ణువుతో నిట్లనెను (35). దధీచ ఉవాచ | మాయాం త్యజ మహాబాహో ప్రతిభాసో విచారతః | విజ్ఞాతాని సహస్రాణి దుర్విజ్ఞేయాని మాధవ || 36 మయి పశ్య జగత్సర్వం త్వయా యుక్త మతంద్రితః | బ్రహ్మాణం చ తథారుద్రం దివ్యాం దృష్టిం దదామి తే|| 37 దధీచుడిట్లు పలికెను - హే మహాబాహో! మాధవా! మాయను వీడుము. విచారమును చేసినచో ఇది ఆ భాసయని తేలుసు. తెలియుట మిక్కిలి కష్టమైన వేలాది విషయములను నేను ఎరింగితిని (36). నీవు నాయందు శ్రద్ధగా చూడుము. నీకు దివ్య దృష్టినిచ్చుచున్నాను. నీవు, బ్రహ్మ, రుద్రులతో సహా జగత్తంతయు నీకు కనబడును (37). బ్రహ్మోవాచ | ఇత్యుక్త్వా దర్శయామాస స్వతనౌ నిఖిలం మునిః | బ్రహ్మాండం చ్యావనిశ్శంభుతేజసా పూర్ణ దేహకః || 38 ప్రోవాచ విష్ణుం దేవేశం దధీచశ్శైవసత్తమః | సంస్మరన్ శంకరం చిత్తే విహసన్ విభయస్సుధీః || 39 బ్రహ్మ ఇట్లు పలికెను - ఇట్లు పలికి చ్యవన పుత్రుడగు ఆ ముని శంభుని తేజస్సుచే పూర్ణ విరాడ్దేహమును స్వీకరించినవాడై తన దేహమునందు నిఖిల బ్రహ్మాండములను ప్రదర్శించెను (38). శివభక్తాగ్రగణ్యుడు, భయము లేనివాడు, విద్వాంసుడు అగు దధీచి మనస్సులో శంకరుని స్మరిస్తూ చిరునవ్వుతో దేవేశుడు విష్ణువునుద్దేశించి ఇట్లు పలికెను (39). దధీచ ఉవాచ | మాయయా త్వనయా కిం వా మంత్రశక్త్యాథ వా హరే | త్యక్త్వా మాయామిమాం తస్మా ద్యోద్ధుమర్హసి యత్నతః || 40 దధీచుడు ఇట్లు పలికెను - హే విష్ణో! ఈ మాయతో గాని మంత్రశక్తితో గాని పని లేదు. నీవు ప్రయత్న పూర్వకముగా యుద్ధమును చేయుము. ఈ మాయను విడిచిపెట్టుము (40). బ్రహ్మోవాచ | దేవాశ్చ దుద్రవుర్భూయో దేవం నారాయణం చ తమ్ | యోద్ధుకామాశ్చ మునినా దధీచేన ప్రతాపినా || 41 ఏతచ్ఛ్రుత్వా మునేస్తస్య వచనం నిర్భయస్తదా | శంభుతేజోమయం విష్ణుశ్చుకోపాతీవ తం మునిమ్ || 42 బ్రహ్మ ఇట్లు పలికెను - దేవతలు ప్రతాపశీలియగు దధీచునితో మరల యుద్ధమును చేయగోరి ఆ నారాయణ దేవుని వేగముగా సమీపించిరి (41). ఆ మహర్షి యొక్క మాటలను వివిన విష్ణువు శంభుతేజముతో నిండియున్న మిక్కిలి కోపించెను. అయిననూ ఆయన భయము లేకుండనుండెను (42). ఏతస్మిన్నంతరే తత్రా గమన్మత్సంగతః క్షువః | అవారయం తం నిశ్చేష్టం పద్మనాభం హరిం సురాన్ || 43 నిశమ్య వచనం మే హి బ్రాహ్మణో న వినిర్జితః | జగామ నికటం తస్య ప్రణనామ మునిం హరిః || 44 క్షువో దీనతరో భూత్వా గత్వా తత్ర మునీశ్వరమ్ | దధీచ మభివాద్యైవ ప్రార్ధయామాస విక్లబః || 45 ఇంతలో అచటకు నేను, నాతో బాటు క్షువుడు చేరుకుంటిమి. పద్మ నాభుడగు విష్ణువును, దేవతలను నేను యుద్ధమును చేయుకుండగా వారించితిని (43). ఆ బ్రాహ్మణుని జయింపశక్యముకాదని చెప్పితిని. హరి నా మాటను విని ఆ మహర్షి వద్దకు వెళ్లి నమస్కరించెను (44). క్షువుడు మిక్కిలి దీనుడై దుఃఖియై ఆ దధీచ మహర్షి వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను (45). క్షువ ఉవాచ | ప్రసీద మునిశార్దూల శివభక్త శిరోమణ | ప్రసీద పరమేశాన దుర్లక్ష్యో దుర్జనైస్సహ || 46 క్షువుడిట్లు పలికెను - ఓ మహర్షీ !శివభక్తాగ్రగణ్యా! దయను చూపుము. ఓ పరమేశ్వర స్వరూపా! ప్రసన్నుడవు కమ్ము. దుర్జనులు నిన్ను కన్నెత్తియై ననూ చూడజాలరు (46). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య వచస్తస్య రాజ్ఞ స్సురగణస్య హి | అనుజగ్రాహ తం విప్రో దధీచస్తపసాం నిధిః || 47 అథ దృష్ట్వా రమేశాదీన్ క్రోధవిహ్వలితో మునిః | హృది స్మృత్వా శివం విష్ణుం శ శాప చ సురానసి || 48 బ్రహ్మ ఇట్లు పలికెను - ఆ రాజు యొక్క ఈ మాటను విని తపోనిధి, వేదవేత్తయగు దధీచుడు ఆ రాజును, మరియు దేవతలనందరినీ అను గ్రహించెను (47). అపుడాయన విష్ణువు మొదలగు వారిని చూచి మిక్కిలి కోపించినవాడై హృదయములో శివుని స్మరించి విష్ణువును, దేవతలను కూడ శపించెను(48). దధీచ ఉవాచ | రుద్ర కోపాగ్నినా దేవా స్సదేవేంద్రా మునీశ్వరాః | ధ్వస్తా భవంతు దేవేన విష్మునా చ సమం గణౖః || 49 దధీచుడిట్లు పలికెను - దేవతలు, దేవేంద్రుడు, మహర్షులు, విష్ణు దేవుడు, మరియు ఆయన గణములు రుద్రుని కోపమునే అగ్నిచే వినాశమును పొందెదరు గాక! (49). బ్రహ్మోవాచ | ఏవం శప్త్వా సురాన్ ప్రేక్ష్య క్షువమాహ తతో మునిః | దేవైశ్చ పూజ్యో రాజేంద్ర నృపైశ్చైవ ద్విజోత్తమః || 50 బ్రాహ్మణా ఏవ రాజేంద్ర బలినః ప్రభవిష్ణవః | ఇత్యుక్త్వా స స్ఫుటం విప్రః ప్రవివేశ నిజాశ్రమమ్ || 51 దధీచ మభివంద్యైవ క్షువో నిజగృహం గతః | విష్ణుర్జగామ స్వం లోకం సురైస్సహ యథాగతమ్ || 52 తదేవం తీర్థ మభవత్ స్థానేశ్వర ఇతి స్మృతమ్ | స్థానేశ్వరమను ప్రాప్య శివసాయుజ్యమాప్నుయాత్ || 53 బ్రహ్మ ఇట్లు పలికెను - ఇట్లు దేవతలను శపించి, మహర్షి తరువాత క్షువుని చూచి ఆతనితో నిట్లనెను. ఓ రాజేంద్రా! బ్రాహ్మణోత్తముని దేవతలు, రాజులు కూడ పూజించవలెను (50).ఓ రాజశ్రేష్ఠా! బ్రాహ్మణులే బలవంతులు, సమర్థులు. ఇట్లు స్పష్టముగా చెప్పి ఆ మహర్షి తన ఆశ్రమమును ప్రవేశించెను (51). క్షువుడు దధీచునకు నమస్కరించి తన గృహమునకు వెళ్లెను. విష్ణువు దేవతలతో గూడి వచ్చిన దారిలో తన లోకమునకు వెళ్లెను (52). ఆ స్థానము స్థానేశ్వరమను పేర పుణ్యక్షేత్రము అయెను. స్థానేశ్వరమును చేరి దర్శించిన వారు శివసాయుజ్యమును పొందెదరు (53). కథితస్తవ సంక్షేపాద్వాదః క్షువదధీచయోః | నృపాప్తశాపయోస్తాత బ్రహ్మ విష్ణ్వోశ్శివం వినా || 54 య ఇదం కీర్తయేన్నిత్యం వాదం క్షువదధీచయోః | జిత్వాపమృత్యుం దేహాంతే బ్రహ్మలోకం ప్రయాతి సః || 55 రణ యః కీర్తయిత్వేదం ప్రవిశేత్తస్య సర్వదా | మృత్యుభీతిర్భవేన్నైవ విజయీ చ భవిష్యతి || 56 ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే విష్ణు దధీచ యుద్ధవర్ణనం నామ నవత్రింశోऽధ్యాయః (39). ఓ కుమారా! నీకు క్షువదధీచుల వివాదమును, త్రిమూర్తులలో శివుడు తక్క మిగిలిన ఇద్దరు అనగా బ్రహ్మ విష్ణువులు పొందిన శాపములను గూర్చి సంక్షేపముగా చెప్పితిని (54). ఈ క్షువ దధీచ వివాదమును నిత్యము కీర్తించు మానవుడు అపమృత్యువును జయించి, దేహమును వీడిన తరువాత బ్రహ్మలోకమును పొందును (55). ఎవరైతే దీనిని కీర్తించి, తరువాత యుద్ధమునకు బయలు దేరునో, వానికి మృత్యు భయము ఉండదు. మరియు ఆతడు విజయమును పొందగలడు (56). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో విష్ణు దధీచి యుద్ధవర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).