Sri Sivamahapuranamu-I
Chapters
అథ త్రి చత్వారింశోऽధ్యాయః దక్షయజ్ఞ పరిసమాప్తి బ్రహ్మోవాచ | ఇతి స్తుతో రమేశేన మయా చైవ సురర్షిభిః | తథాన్యైశ్చ మహాదేవః ప్రసన్నస్సంబభూవ హ ||
1 అథ శంభుః కృపాదృష్ట్యా సర్వానృషి సురాదికాన్ | బ్రహ్మవిష్ణు సమాధాయ దక్షమేతదువాచ హ || 2 బ్రహ్మ ఇట్లు పలికెను - విష్ణువు, నేను, దేవతలు, ఋషులు, మరియు ఇతరులు ఇట్లు స్తుతించగా, మహా దేవుడు మిక్కిలి ప్రసన్నుడాయెను (1). అపుడు శంభుడు ఋషులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు మొదలగు వారి నందరినీ సమాధానపరచి దక్షునితో నిట్లనెను (2). మహాదేవ ఉవాచ | శృణు దక్ష ప్రవక్ష్యామి ప్రసన్నోऽస్మి ప్రజాపతే | భక్తాధీనస్సదాహం వై స్వతంత్రోऽప్యఖిలేశ్వరః || 3 చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినస్సదా | ఉత్తరోత్తరతశ్ర్శేష్ఠాస్తేషాం దక్ష ప్రజాపతే || 4 ఆర్తో జిజ్ఞా సురర్థార్థీ జ్ఞానీ చైవ చతుర్థకః | పూర్వే త్రయశ్చ సామాన్యాశ్చతుర్థో హి విశిష్యతే || 5 తత్ర జ్ఞానీ ప్రియతరో మమ రూపం చ స స్మృతః | తస్మాత్ర్పియతరో నాన్యస్సత్యం సత్యం వదామ్యహమ్ || 6 మహాదేవుడిట్లు పలికెను - ఓయీ దక్ష ప్రజాపతీ! నేను చెప్పు మాటను వినుము. నేను ప్రసన్నడనైతిని. నేను స్వతంత్రుడను, సర్వేశ్వరుడను అయినప్పుటికీ నిత్యము భక్తులకు వశములో నుండెదను (3). ఓయీ దక్ష ప్రజాపతీ! నాల్గు రకముల పుణ్యాత్ములు నన్ను నిత్యము సేవించెదరు. వీరిలో వరుసగా ముందు వానికంటె తరువాతి వాడు శ్రేష్ఠుడు (4). ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అను నల్గురు నన్ను సేవింతురు. మొదటి ముగ్గురు సామాన్య భక్తులు కాగా, నాల్గవవాడు సర్వశ్రేష్ఠుడు (5). వారిలో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. జ్ఞాని నా స్వరూపమేనని వేదములు చెప్పుచున్నవి. కావున జ్ఞానికంటె నాకు ఎక్కువ ప్రియమైనవాడు లేడు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (6). జ్ఞానగమ్యోహమాత్మజ్ఞో వేదాంతశ్రుతిపారగైః | వినా జ్ఞానేన మాం ప్రాప్తుం యతంతే చాల్ప బుద్ధయః || 7 న వేదైశ్చ న యజ్ఞైశ్చ న దానైస్తపసా క్వచిత్ | న శక్నువంతి మాం ప్రాప్తుం మూఢాః కర్మవశా నరాః || 8 కేవలం కర్మణా త్వం స్మ సంసారం తర్తుమిచ్ఛసి | అత ఏవాభం రుష్టో యజ్ఞవిధ్వంస కారకః || 9 ఇతః ప్రభృతి భో దక్ష మత్వా మాం పరమేశ్వరమ్ | బుద్ధ్యా జ్ఞానపరోభూత్వా కురు కర్మ సమాహితః || 10 ఉపనిషత్తుల తాత్పర్యము నెరింగిన జ్ఞానులు ఆత్మజ్ఞుడనగు నన్ను జ్ఞానముచే పొందెదరు. జ్ఞానము లేకుండగనే నన్ను పొందుటకు యత్నించువారు మూర్ఖులు (7). మూర్ఖులు, కర్మాధీనులు అగు మానవులు నన్ను వేదములచే గాని, యజ్ఞములచే గాని, దానములచే గాని, తపస్సుచే గాని పొందలేరు (8). నీవు కేవలకర్మతో సంసారమును తరింప గోరితివి.అందువలననే నేను కోపించి యజ్ఞమును విధ్వంసము చేసితిని (9). ఓదక్షా! ఈనాటి నుండి నన్ను పరమేశ్వరునిగా ఎరింగి, బుద్ధిని జ్ఞానార్జన యందు లగ్నము చేసి, శ్రద్ధతో కర్మను అనుష్ఠించుము (10). అన్యచ్చ శృణు సద్బుద్ధ్యా వచనం మే ప్రజాపతే | వచ్మి గుహ్యం ధర్మ హేతోః సగుణత్వేऽప్యహం తవ || 11 అహం బ్రహ్మా చ విష్ణుశ్చ జగతః కారణం పరమ్ | ఆత్మేశ్వర ఉపద్రష్టా స్వయందృగవిశేషణః || 12 ఆత్మమాయాం సమావిశ్య సోऽహం గుణమయీం మునే | సృజన్ రక్షన్ హరన్ విశ్వం దధే సంజ్ఞాః క్రియోచితాః || 13 అద్వితీయే పరే తస్మిన్ బ్రహ్మణ్యాత్మని కేవలే | అజ్ఞః పశ్యతి భూతాని భేదేన బ్రహ్మ చేశ్వరమ్ || 14 ఓ ప్రజాపతీ! మరియొక మాటను చెప్పెదను . మంచి బుద్ధితో వినుము. నేను నా సగుణ స్వరూపమునకు సంబంధిచిన రహస్యమును ధర్మ వృద్ధి కొరకై నీకు చెప్పెదను (11). నేను బ్రహ్మ విష్ణు రూపుడనై జగత్తుయొక్క పరమకారణ మగుచున్నాను. నేను ఆత్మను. ఈశ్వరుడను. ద్రష్టను. స్వయంప్రకాశుడను. నిర్గుణుడను (12). ఓప్రజాపతీ!అట్టి నేను నా మాయను స్వాధీనము చేసుకొని జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుచూ, ఆయా క్రియలకు తగిన నామములను ధరించుచున్నాను (13). అద్వితీయము, ఆత్మరూపము, ఏకము అగు పరబ్రహ్మ యందు ప్రాణులు, బ్రహ్మ, ఈశ్వరుడు అను భేదములను అజ్ఞాని దర్శించును (14). శిరః కరాది స్వాంగేషు కురుతే న యథా పుమాన్ | పార్థక్య శేముషీం క్వాపి భూతేష్వే వం హి మత్పరః || 15 సర్వ భూతాత్మనా మేక భావనాం యో న పశ్యతి | త్రిసూరాణాం భి దాం దక్ష స శాంతి మధిగచ్ఛతి || 16 యః కరోతి త్రి దవేషు భేదబుద్ధిం నరాధమః | నరకే స వసేన్నూనం యావదా చంద్ర తారకమ్ || 17 మత్పరః పూజయేద్దేవాన్ సర్వానపి విచక్షణః | స జ్ఞానం లభ##తే యేన ముక్తిర్భవతి శాశ్వతీ || 18 మానవుడు తన దేహములోని తల, చేతులు మొదలగు అవయవముల యందు తన పాండిత్యముచే భేద బుద్ధిని కలగియుండుట లేదు గదా ! అదే విధముగా నా భక్తుడు ప్రాణుల యందు భేద బుద్ధిని కలిగియుండును (15). ఓ దక్షా! సర్వప్రాణుల ఆత్మలు ఒక్కటియే అను భావన గలవాడై, త్రిమూర్తులలో భేదమును ఎవడు గనడో, వాడు శాంతిని పొందును (16). ఎవడైతే త్రిమూర్తులలో భేదబుద్ధిని కలిగి యుండునో,అట్టి మానవాధముడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంత వరకు నరకమునందు నివసించుట నిశ్చయము (17). ఏ వివేకి నా యందు భక్తి గలవాడై దేవతల నందరినీ పూజించునో, వాడు జ్ఞానమును పొంది, దాని ప్రభావముచే శాశ్వతమగు ముక్తిని పొందును (18). విధి భక్తిం వినా నైవ భక్తి ర్భవతి వైష్ణవీ | విష్ణుభక్తిం వినా మే న భక్తిః క్వాపి ప్రజాయతే || 19 ఇత్యుక్త్వా శంకర స్వామీ సర్వేషాం పరమేశ్వరః | సర్వేషాం శృణుత్వాం తత్రోవాచ వాణీం కృపాకరః || 20 హరిభక్తో హి మాం నిందేత్తథా శైవో భ##వేద్యది | తయోశ్శాపా భ##వేయుస్తే తత్త్వప్రాప్తిర్భవేన్న హి || 21 బ్రహ్మయందు భక్తి లేనిదే, విష్ణువునందు భక్తి లేనే లేదు. విష్ణుభక్తి లేకుండా నా యందు భక్తి ఎక్కడైననూ పుట్టదు (19). ఇట్లు అందరు వినుచుండగా పలికి దయానిధి, పరమేశ్వరుడు అగు శంకర స్వామి మరల ఇట్లనెను (20). నన్ను నిందించు విష్ణు భక్తుడు, విష్ణువును నిందించు శివభక్తుడు కూడా సాపమును పొందెదరు. వారికి జ్ఞానము కలుగదు (21). బ్రహ్మోవాచ | ఇత్యాకర్ణ్య మహేశస్య వచనం సుఖకారకమ్ | జ హృషుస్సకలాస్తత్ర సురమున్యాదయో మునే || 22 దక్షోऽభవన్మహాప్రీత్యా శివభక్తిరతస్సదా | స కుటుంబ స్సురాద్యాస్తే శివం మత్వాఖిలేశ్వరమ్ || 23 యథా యేన కృతా శంభోస్సంస్తుతిః పరమాత్మనః | తథా తసై#్మ వరో దత్త శ్శంభునా తుష్టచేతసా || 24 జ్ఞప్త శ్శివేనాశు దక్షశ్శివభక్తః ప్రసన్నధీః | యజ్ఞం చకార సంపూర్ణం శివానుగ్రహతో మునే || 25 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! మహేశ్వరుని ఈ సుఖకరములగు వచనములను విని అక్కడనున్న దేవతలు, మునులు మొదలగు వారందరు సంతసించిరి (22). కుటుంబ సమేతుడైన దక్షుడు మహా ప్రీతితో శివభక్తశ్రేష్ఠుడై సర్వదా శివుని సేవించెను. దేవతలు మొదలగు వారందరు అఖిలేశ్వరుడు శివుడేనని తలపోసిరి (23). అచట ఎవరెవరు ఏ విధముగా పరమాత్మయగు శంభుని స్తుతించిరో, వారివారికి సంతోషించిన మనస్సుగల శంభుడు ఆయా వరముల నిచ్చెను (24). ఓ మహర్షీ! శివభక్తుడు, ప్రసన్నమగు బుద్ధిగలవాడు అగు దక్షుడు శివునిచే ఆజ్ఞాపింపబడినవాడై శివానుగ్రహముతో యజ్ఞమును పూర్తి చేసెను (25). దదౌ భాగాన్ సురేభ్యో హి పూర్ణభాగం శివాయ సః | దానం దదౌ ద్విజేభ్యశ్చ ప్రాప్తశ్శంభోరనుగ్రహః || 26 అథో దేవస్య సుమహత్తత్కర్మ విధి పూర్వకమ్ | దక్షస్సమాప్య విధివత్సహర్త్విగ్భిః ప్రజాపతిః || 27 ఏవం దక్షమఖః పూర్ణోऽభవత్తత్ర మునీశ్వర | శంకరస్య ప్రసాదేన పరబ్రహ్మ స్వరూపిణః || 28 అథ దేవర్షయస్సర్వే శంసంతశ్శాంకరం యశః | స్వధామాని యయుస్తుష్టా పరేऽపి సుఖతస్తదా || 29 అతడు దేవతలకు వారివారి యజ్ఞ భాగములను, శివునకు పూర్ణభాగమును ఇచ్చెను. బ్రాహ్మణులకు దానములను చేసెను. అతడీ తీరున శంభుని అనుగ్రహమును పొందెను (26). ఇట్లు దక్షప్రజాపతి శివదేవుని అనుగ్రహముచే ఆ మహాయజ్ఞమును ఋత్విక్కుల సహకరాముతో యథావిధిగా పూర్తిచేసెను (27). ఓ మహర్షీ! పరబ్రహ్మ స్వరూపుడగు శంకరుని అనుగ్రహముచే అచట దక్షుని యజ్ఞము ఈ విధముగా సంపూర్ణ మాయెను (28). అపుడు దేవతలు, ఋషులు అందరు శంకరుని కీర్తిని గానము చేయుచూ, తమ తమ ధామములకు చేరుకొనిరి. అపుడు ఇతరులు అందరూ కూడ శుఖశాంతులను పొందిరి (29). అహం విష్ణుశ్చ సుప్రీతావపి స్వం స్వం పదం ముదా | గాయన్తౌ యశశ్శంభో స్సర్వమంగలదం సదా || 30 దక్షసమ్మనితః ప్రీత్యా మహా దేవోऽపి సద్గతిః కైలాసం స య¸° శైలం సుప్రీతస్సగణో నిజమ్ || 31 ఆగత్య స్వగిరిం శంభుస్సాస్మార స్వప్రియాం సతీమ్ | గణభ్యః కతయా మాస ప్రధానేభ్యశ్చ తత్కథామ్ || 32 కాలం నినాయ విజ్ఞానీ బహు తచ్చరితం వదన్ | లౌకికీం గతి మాశ్రిత్య దర్శయన్ కామితాం ప్రభుః || 33 నేను మరియు విష్ణువు మంగళములనన్నిటినీ ఇచ్చే శంభుని కీర్తిని నిరంతరముగా గానము చేయుచూ ఆనందముతో మా ధామములకు చేరుకుంటిమి (30). సత్పురుషులకు శరణ్యుడగు మహాదేవుడు కూడా దక్షునిచే సన్మానింపబడినవాడై, ఆనందించి, ప్రీతితో తన గణములను వెంటబెట్టుకొని తన ధామము అగు కైలాస పర్వతమునకు వెళ్లెను (31). శంభుడు తన పర్వతమునకు చేరుకొని తన ప్రియురాలగు సతీదేవిని స్మరించెను. ఆయన ప్రధానులగు గణాధ్యక్షులతో ఆమె వృత్తాంతమును విస్తారముగా వర్ణించుచూ చాల కాలమును గడిపెను (32). ఆ ప్రభుడు జ్ఞానియే అయిననూ, లోకపు పోకడననుసరించి విరహవ్యథను ప్రకటిస్తూ, ఆమె గాథలను వర్ణిస్తూ చిరకాలము గడిపెను (33). నానీతి కారకస్స్వామీ పరబ్రహ్మ సతాం గతిః | తస్య మోహః క్వ వా శోకః క్వ వికారః పరో ముదే || 34 అహం విష్ణుశ్చ జానీవస్తద్భేదం న కదాచన | కే పరే మునయో దేవా మానుషాద్యాశ్చ యోగినః || 35 మహిమా శాంకరోऽనంతో దుర్విజ్ఞేయో మనీషిభిః | భక్తజ్ఞాతశ్చ సద్భక్త్యా తత్ర్పసాదాద్వినా శ్రమమ్ || 36 ఏకోऽపి న వికారో హి శివస్య పరమాత్మనః | సందర్శయతి లోకేభ్యః కృత్వా తాం తాదృశీం గతిమ్ || 37 ఓ మహర్షీ! పరబ్రహ్మ సత్పురుషులకు శరణ్యుడు అగు శివస్వామి నీతి లేని దనమును సహించడు. ఆయనకు మోహము గాని, శోకముగాని, వికారముగాని కలిగే ప్రసక్తియే లేదు (34). ఆయన .యొక్క సగుణ నిర్గుణ రూపములకు గల భేదమును నేను గాని, విష్ణువుగాని ఏనాడైననూ తెలియ లేకపోతిమి. మునులు, దేవతలు, యోగులు, మానవులు మొదలగు వారి గురించి చెప్పునదేమున్నది? (35) శంకరుని మహిమ అనంతము.పండితులు కూడా తెలియజాలరు. కాని భక్తులు ఆయన యందు భక్తిన చేసి ఆయన అనుగ్రహముచే శ్రమ లేకుండగనే ఆయన ను తెలియగల్గుదురు (36). పరమాత్మయగు శివునకు ఒక్క వికారమైననూ లేదు. కాని విషాదమును పొందినాడు యన్నట్లు లోక గతిని అనుసరించి లీలను ప్రదర్శించును (37). యత్పఠిత్వా చ సంశ్రుత్య సర్వలోక సుధీర్మునే | లభ##తే సద్గతిం దివ్యామిహాపి సుఖముత్తమమ్ || 38 ఇత్థం దాక్షాయణీ నిజదేహం సతీ పునః | జజ్ఞే హిమవతః పత్న్యాం మేనాయామితి విశ్రుతమ్ || 39 పునఃకృత్వా తపస్తత్ర శివం వవ్రే పతిం చ సా | గౌరీ భూత్వార్ధవామాంగీ లీలాశ్చక్రేऽద్భుతాశ్శివా || 40 ఇత్థం సతీచరిత్రం తే వర్ణితం పరమాద్భుతమ్ | భుక్తిముక్తిప్రదం దివ్యం సర్వకామప్రదాయకమ్ || 41 ఓ మహర్షీ! శివుని చరితమును చదివిన వాడు వినిన వాడు జ్ఞానియై సర్వమానవులలో ఉత్తముడగును. అట్టివాడు ఇహలోకములో ఉత్తమ సుఖమును పొంది దివ్యమగు సద్గతిని పొందును (38). ఈ విధముగా దక్ష పుత్రియగు సతి తన దేహమును విడిచిపెట్టి, హిమవంతుని భార్యయగు మేనకయందు జన్మించెనని పురాణాదులు యందు ప్రసిద్ధి గాంచెను (39). ఆమె ఆ జన్మలో మరల తపస్సు చేసి శివుని భర్తగా వరించెను . ఆ ఉమాదేవి గౌరియై శివుని వామ భాగమును తనది చేసుకొని అద్భుతమగు లీలలను ప్రదర్శించెను (40).ఇంత వరకు పరమాద్భుతము, భుక్తి ముక్తులనిచ్చునది, దివ్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది అగు సతీ చరిత్రమును నీకు వివరించి చెప్పితిని (41). ఇదమాఖ్యాన మనఘం పవిత్రం పరపావనమ్ | స్వర్గం యశస్య మాయుష్యం పుత్రపౌత్రఫలప్రదమ్ || 42 య ఇదం శృణుయాద్భక్త్యా శ్రావయేద్భక్తిమాన్నరాన్ | సర్వకామాన్ లభేత్తాత పరత్ర పరమాం గతిమ్ || 43 యః పఠేత్పాఠయేద్వాపి సమాఖ్యానమిదం శుభమ్ | సోऽపి భుక్త్వాऽఖిలాన్ భోగనంతే మోక్షమావాప్నుయాత్ || 44 ఇతి శ్రీ శివమహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే దక్షయజ్ఞాను సంధాన వర్ణనం నామ త్రిచత్వారింశోऽధ్యాయః (43). సమాప్తోऽయం రుద్రసంహితాంతర్గత సతీఖండో ద్వితీయః (2). ఇది నిర్దోషము, పవిత్రము, పరమ పావనము, స్వర్గ ప్రదము, కీర్తిని ఇచ్చునది, ఆయుర్దాయమునిచ్చునది, పుత్ర పౌత్రఫలమునిచ్చునది అగు గాథ (42). వత్సా! ఎవరైతే ఈ గాథను భక్తితో విందురో, ఎవరైతే భక్తి గలవారై ఇతరులకు వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందుటయే గాక, పరలోకములో ఉత్తమగతిని పొందెదరు (43). ఈ శుభకరమగు గాథను చదివిన వారు, మరియు చదివించిన వారు కూడా ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహ త్యాగానంతరము మోక్షమును పొందెదరు (44). శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షయజ్ఞ పరిసమాప్తి యను నలభై మూడవ అధ్యాయము ముగిసినది (43). రుద్ర సంహితయందలి రెండవ సతీఖండ ముగిసినది (2). శ్రీ సాంబసదాశివార్పణమస్తు