Sri Sivamahapuranamu-I    Chapters   

హిమవంతుని వివాహము

శ్రీ గణశాయ నమః

పార్వతీ ఖండః

ప్రథమో ధ్యాయః

హిమవంతుని వవాహము

నారద ఉవాచ|

దాక్షాయణీ సనతే దేవీ తన్యక్త దేహా పితుర్మఖే| కథం గిరిసుతా బ్రహ్మన్‌ బభూవ జగదంబికా||

కథం కృత్వా తపో త్యుగ్రం పతిమాప శివం చ సా| ఏతస్మే పృచ్ఛతే సమ్యక్కథయ త్వం విశేషతః || 2

నారదుడిట్లు పలికెను-

ఓ బ్రహ్మా! దక్షపుత్ర యగు సతీదేవి తండ్రి చేసిన యజ్ఞములో దేహమును వీడి పర్వత పుత్రికయై జగన్మాతయైన విధంబెట్టిది?(1) ఆమె మిక్కిలి ఉగ్రమైన తపస్సును చేసి శివుని భర్తగా పొందిన విధంబెట్టిది? నా ఈ ప్రశ్నకు సమాధానమును విస్తారముగా చక్కగా చెప్పుడు(2)

బ్రహ్మోవాచ|

శృణు త్వం మునిశర్దూల శివాచరితముత్తమమ్‌ | పావనం పరమం దివ్యం సర్వపాపహరం శుభమ్‌|| 3

యదా దాక్షాయణీ దేవీ హరేణ సహితా ముదా| హిమాచలే సుచిక్రీడే లీలయా పరమేశ్వరీ|| 4

మత్సుతేయమబితి జ్ఞాత్వా సిషేవే మాతృవర్చసా| హిమచలప్రియా మేనా సర్వర్ధిభిరనర్భరా|| 5

యదా దాక్షయణీ రుష్టా నాదృతా స్వతనుం జహౌ| పిత్రా దక్షేణ తద్యజ్ఞే సంగతా పరమేశ్వరీ|| 6

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ ఋషిశ్రేష్ఠా| ఉత్తమమైన జగన్మాతృచితదతమును నీవు వినుము. వఅది పరమసావనము,. దివ్యము, పాపములన్నిటినీ పొగొట్టునది, శుభకరము(3) దాక్షాయణీ దేవి శివునితో గూడా ఆనంమదమతో హివతసర్వమునందు క్రీడించుచుండెను. ఆపరమేశ్రవిరకి అది ఒక లీల(4) ఆ సమయములో హిమవంతుని ప్రియురాలు, సమస్త పంపదలతో నలరాదరునది యగు మేనాదేవి మాతృప్రేమతో 'ఈమె నాకుమార్తె' అని భావించి సేవించెను(5) పరమేశ్వరియగు దాక్షాయణి తండ్రియగు దక్షుని యజ్ఞమునకు వెళ్ళి అచట తండ్రిచే అవమానించబడి, కోపించనదై తన దేహమును త్యాగముచేసెను(6)

తదైవ మేనకా తాం సా హిమాచల ప్రియా మునే| శివలోకస్థితాం దేవీ మారిరాధయిషుస్తదా||7

తస్యామహం సుతా స్యామిత్యవధార్య సతీ హృదా| త్యక్తదేహా మనా దద్రే భవితుం హివతసుతా||8

సమయం ప్రాప్య సా దేవీ సర్వ దేవస్తుతా పునః | సతీత్యక్తతనుఃప్రీత్యా మేనకాతనయా భవత్‌||9

నామ్నా సా పార్వతీదేవి తపఃకృత్వా సుదుస్సమమ్‌| నారదస్యోపనదేశాద్వై పతిం ప్రాప శివం పునః||10

ఓ మహర్షీ! హిమవంతునకు ప్రియురాలగు మేనక ఆనాడే శివలోకమునందున్న ఉమాదేవినివ ఆరదించగోరేను(7) అపుడు సతీదేవి దేహమునరు వీడిన తరువాత హిమవంతును కుమార్తేగా ఆమె గర్భమునందు జన్మించవలెనని మనస్సులో నిశ్చయముగ చేసుకొనెను(8) దేవతలందరిచే స్తుతించబడిన ఆ సతీదేవి దేహమును వీడిన తరువాత సరియగు సమయము రాగానే ప్రేమపూర్వకముగా మేనకకు కుమార్తేయై అవతరించెను(9) పార్వతి యను నపూరుగల ఆ దేవి నారదుని ఉపదేశముచే మిక్కిలి దుష్కరమగు తపస్సును చేసపి మరల శివుని భర్తగా పొందెను(10)

నారద ఉవాచ|

బ్రహ్మన్‌ విధే మహాప్రాజ్ఞ పద మే వదాతాం వర| మేనకాయాస్సముత్పత్తిం వివాహం చరితం తథా|| 11

ధన్యా హి మేనకా దేవి యస్యాం జాతా సుతా నతీ| అతో మాన్యా చ ధన్యా చ సర్వేషాం పసా పతివ్రతా||12

నారదుడిట్లు పలికెను-

ఓ బ్రహ్మా! విధీ! మహాప్రాజ్ఞా ! నీవు వక్తలలో శ్రేష్ఠుడవు. మేనక యొక్క పుట్టుకను, వివాహమును మరియు చరితమునునాకు చెప్పుము(11) సతీదేవిని కుమార్తెగా పొందిన మేనకాదేవి ధన్యురాలు, పూజ్యురాలు, ఆమె అందరిలో గొప్పపతివ్రత(12)

బ్రహ్మో వాచ|

శృణు త్వం నారద మునే పార్వతీ మాతురుద్భవమ్‌ | వివాహం చరితం చైవ పావనం భక్తివర్థనమ్‌||13

అస్త్యుత్తరస్యాం దిశివై గిరిశో హిమవాన్మహాన్‌| పర్వతో మునిశ్రేష్ట మహాతే జాస్సమృద్ది భాక్‌||14

ద్వైరూప్యం తస్య విఖ్యాతం జంగమస్థిర భేదత్‌ | వర్ణయామి సమాసేన తస్య సూక్ష్మ స్వరూకమ్‌ |715

పూర్వాపరై వారినిధీ విగాహ్య ప్థితటో హియః| నానార్తనకరో రమ్యో మనాదండ ఇవ క్షితేః||16

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదమహర్షీ! పార్వతీ తల్లి యొక్క పరట్లుక, వివాహమునను గూచ్చి వినుమ అమె చిరతము పావనము, భక్తిని వృద్ది చేయునది(13)ఓ మహర్షీ! ఉత్తర దిక్కునందు గొప్ప తేజస్సు, సమృద్ధులతో హిమవాన్‌ అని ప్రసిద్దిగాంచిన పెద్ద పర్కవతము ఎకలదు గదా!(14) దానికి జంగమము (నడయాడునది) స్థావరము(స్థిరము) అను రెఒడు రూపములు గలవని ప్రసిద్ధి. ఈ విషయములోని సూక్షమ్స్కవరూపమును సంగ్రమముగా వివరించెఏఉదును(15) ఆ పర్వతము పశ్చిమ సముద్రము, తూర్పు సముద్రమ9ఉల వరకు వ్యాపించి భూమిన కొలిచే కొలబద్దయా యున్నట్లు ఉన్నది. ఆ సుందరమగు పర్వతము అనుక శ్రేష్ఠవసు%్‌తులకు నియమై ఉన్నది (16)

నానావృక్ష సమాకీర్ణో నానా శృంగ సుచిత్రితం| సింహవ్యాఘ్రాది పశుభిస్స9ఏవితస్సుఖిభిస్సదా||17

తుషారనిధిరత్యగ్రో నానాశ్చర్య విచితగ్రితః | దేవర్షి సిద్ధ మునిభిస్సంశవ్రితశ్శింసంప్రియః||18

తపస్థ్సానో తి పూతాత్మా పావనశ్చ మహాత్మనామ్‌| తపస్సిద్ధిప్రదో త్యంతతం నానాధాత్వాకరశ్శుభః||19

స ఏవ దివ్యరూపో హి ర్మస్సర్వాంగ సుందరః | విష్ణ్వంశో వికృశ్శైల రాజరాస్సతాం ప్రియం||20

ఆ పర్వతము అనేక రకముల వృఓంఉలతో నిండి అనేక శిఖరములతో అతి సుందరముగా నున్నది. సింహము, వ్యాఘ్రము మొదలగు జంతువులు దానయందదు సర్వదా సుఖముగా సంచరించుచుండెను(17) మిక్కిలి దట్టమై మంచుతో నిండి అనేక అద్భుతములతో ఆశ్చర్యమును గొల్పు ఆ పరద్దతమును దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు సేవించుచుందురు. అది శివునకు మిక్కిలిప్రియమగు పర్వతము(18) మమాత్ములు అచట తపస్సును చేయుదురు. మిక్కిలి పవిత్రమగు ఆ పర్దతము వారిని పవిత్రులను చేయును. ఆపర్వతము నందు తపసస్సు చేయువారికి సిద్ధికలుగల నిశ్చితము, శుభకరమగు ఆ పర్వతము అనెక ధాతువులకు (లోహఖనిజము) నిలయమై ఉన్నది(19) దివ్యమగు రూపము గలది, అన్ని భాగములో సనుందరమైనది, రమణీయమైనది, వికారములు లేనిది, సత్పురుషులకు ప్రియమైనది అగు ఆ శ్రేషణ్ఠపర్వత రాజము విష్ణువు యొక్క అంశ##చే ఉద్భవించినది(20)

కులస్థిత్యైచ స గిరిర్ధర్మ వర్ధన హేతవే| స్వవివాహం కర్తుమైచ్ఛత్పితృదేవ హితేచ్ఛయమా||21

తసన్మిన్నవసరే దేవాస్సార్వదమా చింత్య కృత్స్నశః| ఊచుః పితౄన్‌ సమాగత్య దివ్యాన్‌ ప్రీత్యా మునీశ్వరః||22

ఆ పర్వతడు కులమును నిలబెట్టి, దర్మును వర్థిల్లజే9యుట కొరకైన మరియు పితృదేవలతకు హితమును చేయుకోకికతో వివాహమాడగోరెను(21) ఓ మహర్షీ! ఆ సమయములో దేవతలు పూర్తాగా తమ స్వార్థమును మాత్ము తలబోసి , ప్రకాశస్వరూపులగు పితృదేవలతను సమీపించి, వారితో ప్రీతిపూర్వకముగా నిట్లనిరి(22)

దేవా ఊచుః|

సర్వే శృణుత నోవాక్యం పితరః ప్రీతమబానసాః| కర్తవ్యం తత్తథైవాశు దేవ కార్యేస్పవో యది|| 23

మేనా నామ సుతా యా వో జ్యేష్ఠా మంగలరూపిణీ | తాం విహ్య చ సుప్రీత్యా హి మా ఖ్యేన మహీభృతా||24

ఏవం సర్వమహాలాభస్సర్వేషాం చ భవిష్యతి| యుష్మాక మమరాణాం చ దుఃకహానిః పదే పదే||25

దేవతలిట్లు పలికిరి|

ఓ పితృదేవతలారా! మారు ప్రీతితో గూడిన మనస్‌ఐసుగలవారై, అందరు మా వాక్యమును వినుడు, మీకు దేవకార్యమును నెరవేర్చు కొరిక ఉన్నచో, మేము చెప్పిన తీరున శీఘ్రముగా ఆచరించపుడు(23) మంగళస్వరూపురాలు, మేనయను పేరుగలది అగు మీజ్యేష్ఠకుమార్తను హిమపత్వర్వతునకు ఇచ్చి ప్రీతి పుస్సనరముగా వివాహమును చేయుడు(24) ఇట్లు చేసినచో అందరికీ అన్ని గొప్పలాభములు కలుగగలవు. మరియు మీకు, దేవతలకు కూడా ప్రతి అడుగునందు దుఃకమలు తొలగిపోవును(25)

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్యామరవచఃపితరస్తే విమృశ్య చ | స్మృత్యవా శాపం సుతానాం చ ప్రోచురోమితి తద్వచః||26

దదుర్మేనాం సువిధినా హిమాగాయ నిజానత్మజామ్‌| సముత్సవో మహానాసీ త్త ద్వివాహే సుమంగలే||27

హర్యాదయో పితే దేవా మునయశ్చాపరే ఖిలాః| అజగ్రుసన్త్రత సంస్మృత్య వామదేవం భవం ధియా||28

ఉత్సవం కారయామాసుర్తత్వా దానాన్యనేకశః| సుప్రశస్య పితౄన్‌ దివ్యాన్‌ ప్రశశం సుర్హిమాచలమ్‌|| 29

బ్రహ్మ ఇట్లు పలికెను

పితృదేవలు దేవతల ఈ మాటను విని, విమర్శిచుకొనివ, కుమార్తెల శాపమును స్మరించి, ఆ మాటకు తమ అంగీకారమును తెలిపిరి(26) వారు తమ కురమార్తయగు మేనను హివత్సరవ్వతునకిచ్చి యథావిదిగా వివాహమును చేసిరి. పరమ మంగళకరమగు ఆ వివాహములో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లేను(27) విష్ణవు మొదలగు దేవతలు, మరియు అందరు మహర్షులు వామ దేవుడగు శంకురుని మనసా స్మరివంచి ఆ వివామమునకు వచ్చిరి(28) వారు అనేక బహుమానములనిచ్చి ఉత్సవమును చేయించిరి. దివ్యులగు పితృదేతలను మరియు హివవంతుని అనేక కవిధముగా ప్రశంసించిరి(29)

ఔమహామోదాన్వితా దేవాస్తే సర్వే సమునీశ్వరాః | సంజగ్ముస్స్వసన్వధామాని సంస్మరన్త శ్శివాశివౌ||30

కౌతుకం బహు సంప్రాస్‌ సువివాహ్య ప్రియం చ తామ్‌ | ఆ జగామ స్వభవనం ముదమాప గిరీశ్వరః||31

దేవతలు, మరియు మహర్షులు అందరు మహానందరును పొందినవారై, ఉమాశివులను స్మరిచుకొనుచూచ, తమతమ నివాసములకు మరలి వెళ్లిరి(30) హివంతుడు అనేక బహుమానములను పొంది, ఆ సుందరిని చక్కగా వివాహమాడి తన భవలనుమకు వచ్చి ఆనందించెను(31)

బ్రహ్మోవాచ|

మేనయా హి హిమాగస్య సువివాహో మునీశ్వర | ప్రోక్తో మే సుఖదఃప్రీత్యా కిం భూయశ్రశోతు మిచ్ఛసి|| 32

ఇతి శ్రీ శివ మహా పురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం తృతీయే పార్వతీ ఖండే హిమాచల వివాహవర్ణనం నామ ప్రథమో ద్యాయః(1)

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ మహర్షీ! హిమ వంతునికి మేనకతో జరిగిన దివ్యమైన, సుఖప్రదమైన వివాహమును ప్రీతితో వర్ణించి చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు?(32)

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సపంహిఆతయమందు మూడవది యగు పార్వతీ ఖండములో హిమవంతుని వివాహవర్ణమనే మొదటి అధ్యాయము ముగిసినది(1)

Sri Sivamahapuranamu-I    Chapters