Brahmapuranamu
Chapters
అధ అష్టా దశో7ధ్యాయః భువనకోశద్వీప వర్ణనమ్ మనయ ఊచు :- అహో సుమహ దాఖ్యానం భవతా పరికీర్తితమ్ | భారతానాం చ సర్వేషాం పార్థివానాం తథైవ చ || 1 దేవానాం దానవానాం చ గంధర్వోరగరక్షసామ్ | దైత్యనా మథ సిద్ధనాం గుహ్యకానాం తథైవ చ || 2 అత్యద్భుతాని కర్మాణి విక్రమా ధర్మనిశ్చయాః వివిధాశ్చ కథా దివ్యా జన్మ చాగ్ర్య మను త్తమమ్ || 3 సృష్టిః ప్రజాపతే స్సమ్యక్త్వయా ప్రోక్తా మహామతే | ప్రజాపతీనాం సర్వేషాం గుహ్యకాప్సరసాం తథా || 4 స్థావరం జంగమం సర్వముత్పన్నం వివిధం జగత్ | త్వయా ప్రోక్తం మహాభాగ శ్రుతం చై త న్మనోహరమ్ || 5 కథితం పుణ్యఫలదం పురాణం శ్లక్షయా గిరా | మనః కర్ణసుఖం సమ్య క్ర్పీణా త్యమృత సంమతమ్ || 6 ఇదానీం శ్రోతు మిచ్ఛామః సకలం మండలం భువః | వక్తు మర్హసి సర్వజ్ఞ పరం కౌతూహలం హి నః || 7 యావంతః సాగరా ద్వీపా స్తథా వర్షణి సర్వతాః | వనాని సరితః పుణ్యదేవాదీనాం మహామతే || 8 యత్ప్రమాణమిదం సర్వం యదాధారం యదాత్మకమ్ | సంస్థాన మస్య జగతో యథావ ద్వక్తు మర్హసి || 9 మహామతిమగు నీవుభారతరాజుల యొక్కయు, దేవదానవ గంధర్వ యక్షోరగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రాలను స్థావర జంగమాదుల సృష్ట్యాదులను మృదుమధురముగ, మన శ్ర్శవణానంద కరముగ జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన గుతూహలులమై యున్నాము. భువనకోశ సంస్థాన మవధానమున పిననున్న మాకది యాదరములో నానతిమ్మని మును లడిగిరి. లోమహర్షణ ఉవాచ :- మునయః శ్రూయతామేత త్సంక్షేపా ద్వదతో మమ | నాస్య వర్షశ##తేనాపి వక్తుం శక్యోతివి స్తరః || 10 జంబూప్లక్షాహ్వ¸° ద్వీపౌ శాల్మలశ్చాపరో ద్విజాః | కుశః క్రౌంచ స్తథా శాకః పుష్కరశ్చైవ సష్తమః || 11 ఏతే ద్వీపాః సముద్రైస్తు సప్తస ప్తభిరావృతాః | లవణక్షు సురాసర్పిర్దధి దుగ్ధజలైః సమమ్ || 12 జంబూద్వీపః సమస్తానా మేతేషాం మధ్య సంస్థతః | తస్యాపి మధ్యే విపేంద్రా మేరుః కనకపర్వతః || 13 చతురశీతి సాహసై#్ర ర్యోజనైస్తస్య చోచ్ర్ఛయః| ప్రవిష్టః షోడ శాధస్తా ద్ద్వాత్రింశ న్మూర్ధ్ని విస్తృతః || 14 మూలే షోడశ సాహసై#్ర ర్విస్తార స్తస్యసర్వతః | భూపద్మస్యాస్య శైలో7సౌ కర్ణికాకార సంస్థితః || 15 సూతుడిట్లనియె- మునులారా! ఇది నూఱండ్లు సెప్పినం దీరదు, సంక్షేపించి తెల్పెద వినుండు. జంబూ+ప్లక్ష+శాల్మల+కుశ+క్రౌంచ+శాక+పుష్కరములు అనునవి సప్తద్వీపములు. ఇవి లవణ=ఉప్పు, ఇక్షు=చెఱకురసము, సురరా=కల్లు సర్పిః=నెయ్యి, దధి=పెరుగు, దుగ్ధ=పాలు, జల=నీరు, నుంగల యేడు సముద్రములచే జుట్టుకొనబడినవి. వీని నడుమ జంబూద్వీపమున్నది. దానికి నడుమ ''మేరువు' అను బంగారు కొండ యున్నది. అది యెనుబదినాల్గు యోజనములయెత్తు, పదునారువెల యోజనములలోతు, ముప్పది రెండువేల యోజనములు వైశాల్యముగల యుపరిభాగము కలిగియున్నది. మూలము పదునాఱు వేల యోజనముల విస్తారమైయున్నది. భూమియనుపద్మమున కది నడిమికర్ణిక=(దుద్దు) వలె నున్నది. హిమవా న్హేమకూటశ్చ నిషధ స్తస్య దక్షిణ | నీలః శ్వేతశ్చ శృంగీ చ ఉత్తరే పర్షపర్వతాః || 16 లక్షప్రమాణౌ ద్వౌ మధ్యే దశహీనా స్తథా పరే | సహస్రద్వితయోచ్ఛాయాస్త్రావద్వి స్తారిణశ్చతే|| 17 హిమవంతము- హేమకూటము నిషధము ననునవి దానికిదక్షిణమునను, నీలము, శ్వేతము, శృంగి యనునవి యుత్తరమునను వర్షపర్వతము లున్నవి. రెండు నడుమ నున్నవి. అవిలక్ష యోజన ప్రమాణములు, తక్కినవి తొంబదివేల యోజనముల ప్రమాణము గలవి. రెండువేల యోజనములయెత్తు, అన్ని యోజనముల వెడల్పు గలవి. భారతం ప్రథమం వర్షం తతః కింపురుషం స్మృతమ్ | హరి వర్షం తధైవాన్య న్శేరో ర్దక్షిణతో ధ్విజాః || 18 రమ్యకం చోత్తరం వర్షం తసై#్యవ తు హిరణ్మయమ్ | ఉత్తరాః కురవశ్చైవ యథావై భారతం తథా || 19 నవసాహస్రమే కైక మేతేషాం ద్విజసత్తమాః | భారత-కింపురుష-హరివర్షములు మేరువునకు దక్షిణమున నున్నవి. రమ్యకము ఉత్తరమందున్నది. ఆది కనకమయము. ఉత్తర కురుభూములక్కడనే యున్నవి. ఈవర్షములొక్కొక్కటి భారతవర్షమువలె తొమ్మిదివే యోజనముల వైశాల్యము గలవి. ఇలావృతం చ తన్మధ్యె సౌవర్ణో మేరు రుచ్ఛ్రితః || 20 మేరో శ్చతుర్దిశం తత్ర నవసాహస్ర విస్తృతమ్ - ఇలావృతం మహాభాగాశ్చత్వారశ్చాత్ర పర్వతాః || 21 విష్కంభా వితతా మేరో ర్యోజనాయుత విస్తృతాః | పూర్వేణ మందరో నామ దక్షిణ గంధమాదనః || 22 విపులః పశ్చిమే పార్మ్వే సుపార్మ్వ శ్చోత్తరే స్థితః | కదంబ స్తేషు జంబూశ్చ పిప్పలో వట ఏవ చః || 23 ఏకాదశ శతాయామాః పాదపా గిరికేతవః | జంబూద్వీవస్య సా జంబూ ర్నామహేతుర్ద్విజో త్తమా || 24 ఇలావృతమ దాని నడుమ బంగారు మేరుగిరి గలదు. మేరుపు నలుదిశల నిలావృతము తొమ్మిదిశేల యోజనముల వైశాల్యము గలది. ఇందు నాల్గు పర్వతములు మేరుపునకు విష్కంభములు. (గడియలు) పదివేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధమాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము ననునవి గలవు. వీనియందు క్రమముగ కదంబము (కడిమి), జంబువు (నేరేడు), పిప్పలము (ఠావి), వటము (మఱ్ఱి) యను చెట్లు వదునొకండపందల యోజనముల విరివిగల వృక్షములు ''గిరికేతువులు'' (పర్వతాగ్ర పతాకములట్టివి) గలవు. జంబూవృక్ష సమృద్ధిం బట్టి యది జంబూద్వీపమ్ము నాబరగె. మహాగజప్రమాణాని జంబ్వా స్తస్యాః ఫలాని వై | పతంతి భూభృతః పృష్ఠే శీర్యమాణాని సర్వతః || 25 రసేన తేషాం విఖ్యాతా తత్ర జంబూనదీతి వై | సరిత్ర్పవర్తతే సా చ పీయతే తన్నివాసిభిః || 26 న ఖేదో న చ దౌర్గంధ్యం న జరా నేంద్రియక్షయః | తత్పానస్వస్థమనసాం జననాం తత్ర జాయతే || 27 తీరమృ త్తద్రసం ప్రాప్య సుఖవాయువిశోషితా | జాంబూనదాఖ్యం భవతి సువర్ణం సిద్ధభూషణమ్ || 28 ఆ నేరేడు పండ్లు మహాగజప్రమాణరూపమున రాలుచుండునట. అవి ప్రిదిలి కారిన రస మే రైపారి జంబూనది యనం బరగు. ఆజంబూ రసము ద్రావినవారు కష్టము-దుర్వాసన-ముదిమి-ఇంద్రియక్షయముసెఱుంగరు. ఆజంబూనది యెడ్డునంగల మన్ను-ఆ రసముచే దడిసి సుఖవాయువున నారి జాంబూనదమను బంగార మేర్పడును. ఆది సిద్ధభూషణము అనగా సిద్ధులు ధరించునదన్నమాట. భద్రాశ్వం పూర్వతో మేరోః కేతుమాలం చ పళ్చిమే-వర్షే ద్వేతు మునిశ్రష్ఠా స్తయో ర్మధ్యే త్విలా వృతమ్ః || 29 వనం చై త్రరథం పూర్వే దక్షిణ గంధమాదనమ్ - వైభ్రాజం పశ్చిమే తద్వ దుత్తరే నందనం స్మృతమ్ || 30 అరుణోదం మహాభద్ర మసితోదం సమానసమ్ | సరాం స్యేతాని చత్వారి దేవ భోగ్యాని సర్వదా || 31 మేరువునకు తూర్పుచెన భద్రాశ్వము. పడమట కేతుమాలము. అనురెండు వర్షములున్నవి. వానికి నడుమ ఇలావృతము. తూర్పున చైత్రరధము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము, ఉత్తరమున నందనవనము నున్నవి. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవభోగ్యములు గలవు. శాంతవాం శ్చక్రకుంజశ్చ కురరీ మాల్య వాం స్తథా | వైకంక ప్రముఖా, మేరోః పూర్వతః కేసరాచలాః || 32 త్రికూటః శిశిరశ్చైవ పతంగో రుచకస్తథా | నిషధాదయో దక్షిణత వ్తెస్య కేసరపర్వతాః || 33 శిఖివాసః సవై దూర్యః కపిలో గంధమాదనః | జానుధి ప్రముఖా స్తద్వ త్పశ్చిమే కేసరాచలాః || 34 మేరో రనంతరాస్తే చ జఠరాదిష్వవస్థితాః | శంఖ కూటో7థ ఋషభో హంసో నాగస్తథా7పరాః || 35 కాలంజరాద్యాశ్చ తథా ఉత్తరే కేసరాచలాః | చతుర్దశసహస్రాణి యోజనానాం మహాపురీ || 36 మేరోరుపరి విప్రేంద్రా బ్రహ్మణః కథితా దివి | తస్యాం సమంతత శ్చాషౌ దిశాసు విదిశాసు చ || 37 ఇంద్రాది లోకపాలానాం ప్రఖ్యాతాః ప్రవరాః పురః| విష్ణుపాద వినిష్క్రాంతాః ప్లావయం తీందుమండలమ్ః|| 38 సమంతా ద్బ్రహ్మణః పుర్వాం గంగా పతతి వై దివి | సా తత్ర పతితా దిక్షు చతుర్థా ప్రత్యపద్యత || 39 సీతా చాలకనందా చ చక్షుర్భద్రాచవై క్రమాత్ | పూర్వేణ సీతా శై లాచ్చ శైలం యాం త్యంతరిక్షగాః || 40 తతశ్చ పూర్వవర్షేణ భద్రా శ్వేనైతి సా7ర్ణవమ్ | తథైవాలకనందా చ దక్షిణ నై త్య భారతమ్ || 41 ప్రయాతి సాగరం భూత్వా స ప్తభేదా ద్విజో త్తమాః | చక్షుశ్చ పశ్చిమగిరీ నతీత సకలాం స్తతః || 42 పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షమన్వేతి సార్ణ వమ్ | భద్రా తథోత్తరగిరీ నుత్తరాంశ్చ తథా కురూన్ || 43 శాంతవంతము, చక్రకుంజము, కురరీ, మాల్యవంతము, వైకంకము ననునవి మేరుపుయొక్క కేసరపర్వతములు. త్రికూటము, శిశిరము. పతంగము, రుచకము, నిషధము, మొదలైనవి దక్షిణదిశ మేరుపుయొక్క కేసరపర్వతములు, శిఖివాసము, వ్తెదూర్యము, కపిలము, గంధమాదనము, జానుథి మొదలైనవి మేరు పశ్చిమకేసరగిరులు. అవి మేరుపునంటి జఠరాదిస్ధానములందున్నవి. శంఖకూటము, ఋషభము, హంసము, నాగము, కాలంజరము, మొదలగునవి మేరూ త్తరదిశ కేసర శైలములు. మేరువుమీద బ్రహ్మయొక్క నగరము పదునాలుగువేల యోజనముల వైశాల్యముగలది. ఆందెనిమిది మూలలందు అష్టదిక్పాలుర పురములు గలవు. విష్ణు పాదమునుండి వెడలి చంద్రమండలమున ప్రవహించుచు నాకాశగంగ బ్రహ్మవురినలువై పుల పడుచున్నది. అట్లుపడి నాల్గుదెసల నాల్గుపాయ లైనది. సీత-అలకనంద-చక్షువు, భద్ర. సీత పూర్వశైలమునుండి మరియొక శైలమున కంతరిక్షసంచారము సేయును. అవ్వల భద్రాశ్వవర్షపర్వతముమీదుగా సముద్రుం బొందును. ఆలకనంద దక్షిణదిశగా భారతవర్షముంజేరి యేడు భాగములయి సముద్రము జొచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటంగల కేతుమాల వర్షముల జొచ్చి సముద్రముం గలియును. భద్ర ఉత్తరగిరులందాటి యుత్తర కురుభూములం బ్రవహించి ఉత్తరసముద్రముం జేరును. అతీత్యోత్తర మంబోధిం పమభ్యేతి ద్విజో త్తమాః | అనీలనిషధాయామౌ మాల్య వద్గంధమాదనౌ || 44 తయో ర్మధ్యగతో మేరుః కర్ణికాకారసంస్థితః | భారతాః కేతుమాలా శ్చ భద్రాశ్వాః కురవ స్తథా || 45 పత్రాణి లోకశైలస్య మర్యాదాశై లబాహ్యతః | జఠరో దేవకూటశ్చ మర్యాదాపర్యతా వుభౌ || 46 తౌ దక్షిణో త్తరాయామా వానీలనిషధాయతౌ | గంధమాదనకై లాసౌ పూర్వపశ్చాత్తు తావుభౌః || 47 ఆశీతియెజనాయామా వర్ణవాంత ర్వ్యవస్థతౌ | నిపధః పారియాత్రశ్చ మర్యాదాపర్వతా వుభౌ || 48 తౌ దక్షిణో త్తరాయామా వానీలనిషధాయతౌ | మేరోః పళ్చిమ దిగ్భాగే యథా పూర్వే తథా స్థితౌ || 49 త్రిశృంగో జారుథిశ్చైవ ఉత్తరౌ వర్షపర్వతౌ | పూర్వ వశ్చాయతా వేతా వర్ణవాంతర్వ్యవస్థితౌ || 50 ఇత్యేతే హి మయా ప్రోక్తా మర్యాదా పర్వతా ద్విజాః | జఠరావస్థితా మేరో ర్యేషాం ద్వౌ ద్వౌ చతుర్దిశం || 51 మేరో శ్చతుర్ధశం యేతు ప్రోక్తాః కేసరవర్వతాః | శీతాంతాద్యా ద్విజా స్తేషామతీవ హి మనోహరా ః || 52 శైలానా మంతర ద్రోణ్యః సిద్ధచారణ సేవితాః | సురమ్యాణి తథా తాసు కాననాని పురాణి చ || 53 లక్ష్మీ విష్ణ్వగ్ని సూర్యేంద్ర దేవానాం మునిస త్తమాః | తా స్వాయతనవర్యాణి జుష్టాని నరకింకరై ః || 54 గంధర్వయక్షరక్షాంసి తథాదైతేయ దానవాః | క్రీడంతి తాసు రమ్యాసు శైలద్రోణి ష్వహర్నిశమ్ || 55 భౌమా హ్యేతే స్మృతాః సర్గా ధర్మిణా మాలయా ద్విజాః|నై తేషు పాపక ర్తారో యాంతి జన్మశ##తై రపి || 56 నీల పర్యతమునుండి నిషధ పర్వతము వరకు పొడవయినదై మాల్యవంతము గంధమాధనమును గలవు. వానినడిమి భాగమున తామరకపువ్వులోని దుద్దువలె మేరువున్నది. మర్యాదాపర్వతమునకు ఆవలలోకాలోకమసు పర్వతమునకుభారతములు, కేతుమాలములు, భద్రాశ్వములు, కురుభూములును రేకులట్లున్నవి. జఠరము దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు, అవి దక్షిణోత్తరములందు నీలపర్వతమునుండి నిషధ సర్వతముదాక వ్యాపించియున్నవి. గంధమాదనకైలాస పర్వతములు తూర్పు పడమరలందు నెనుబది యోజనముల పొడవుగల వై నీలపర్వతమునుండి నిషధపర్వతమువరకు వ్యాపించి సముద్రములో జొచ్చియున్నవి. నిషధము, పారియాత్రము అనునవి రెండును మర్యాదాపర్వతములు. ఆరెండు దక్షిణోత్తరములందు నీలపర్వతమునుండి నిషధ పర్వతమువరకు దైర్ఘ్యము గల వై మేరు పర్వతమునకు పశ్చిమ భాగముసందు యధా పూర్వముగ నున్నవి. త్రిశృంగము,జారుధియు నుత్తరదిశ వర్షపర్వతములు. తూర్పుపడమరగా వ్యాపించి యవి సముద్ర మధ్యమున నున్నవి. మర్యాదాగిరులు నాచేచెప్పబడినవి. వీనిలో రెండు రెండు పర్వతములు మేరుపర్వతమునకు జఠర(గర్భ) భాగములుగా నలుదెసల నున్నవి. మేరువు నలుదెసలగల కేసరపర్వతములు చెప్పబడినవి. అవి చల్లని ఆద్యంతములు గలవి. వాని లోపలగల లోయలు మనోహరములై సిద్దచారణ సేవితములై యుండును. వానియందు రమ్యము లైన వురములు వనంబులుగలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతలఆలయశ్రేష్టములు నరకిన్నరులచే నేవితము లై యొప్పును. రమ్యము లైస ఆపర్వతద్రోణు(లోయ)లందు రేయింబవళ్ళు గంధర్వ యక్షరాక్షస దైత్య దానవులు గ్రీడించుచుందురు. ఇవి భౌమస్వర్గములు. అనగా భూమిమీదనున్నస్వర్గభూములు. ధర్మనిష్టులకు నివాసములు ఇందెన్ని జన్మముల కైనను పాపాత్ములు చేరజాలరు. భద్రాశ్వే భగవాన్విష్ణురా స్తే హయశిరా ద్విజాః | వారాహః కేతుమాలే తు భారతే కూర్మరూపధృక్ || 57 మత్స్యరూపశ్చ గోవిందః కురుష్వాస్తే సనాతనః | విశ్వరూపేణసర్వత్ర సర్వః సర్వేశ్వరో హరిః || 58 భద్రాశ్వపర్వతమందు విష్ణుభగవానుడు హయగ్రీవస్వరూపుడై యుండును. కేతుమాలమందు వరాహమూర్తి భారతమందు కూర్మమూర్తి, కురుభూములందు సనాతనుడగు గోవిందుడు మత్స్యమూర్తియునై యుండును. సర్వత్ర సర్వస్వరూపు డై యా సర్వేశ్వరుడు హరి విశ్వరూపు డై యుండును. సర్వాత్మకు డైన యా విష్ణువు అందరికి ఆధారభూతుడై యుండును. నర్వస్యా 77 ధార భూతో7సౌ ద్విజా! ఆస్తే7ఖిలాత్మకః| యాని కింపురు షా ద్యాని వర్షాణ్యష్టౌ ద్విజోత్తమాః న తేషు శోకో నా77యాసో నోద్వేగః క్షుద్భయాదికమ్ | సుస్థాః వ్రజాః నిరాతంకాః సర్వదుఃఖవివర్జితాః|| 60 దశద్వాదశవర్షణాం సహస్రాణి స్థిరాయుషః | నై తేషు భౌమా న్యన్యాని క్షుత్పిపాసాది నో ద్విజాః || 61 కృతత్రేతాదికా చైవ తేఘ స్థానేషు కల్పనా | సర్వేష్వే తేషు వర్షేషు సప్తస ప్తకులాచలాః || 62 బ్రాహ్మణులారా! కింపురుషాదివర్షము లెనిమిదింటియందుగల జీవులకు శోకము ఆయాసము ఉద్వేగము ఆకలి దప్పిక భయము మొదలైన పుండవు. ఆచటి ప్రజలు స్వస్థులు,నిరాతంకులు (అడ్డులేనివారు) ఏదుఃఖస్పర్శయులేనివారుగను పదిపండ్రెండువేల యే ండ్లాయువు గలవారుగనుందురు. ఆవర్షములందు ఇతరములగు భూమియందలి బాధలు కృత త్రేతాది యుగవిభాగములేదు. వానియందన్నిట నేడేసి కులపర్వతములున్నవి. అందుండి పందలకొలది నదులు పుట్టినవి. ఇది శ్రీబ్రహ్మమహాపురాణమునందు భువనకోశద్వీపవర్ణనమను పదునెనిమిదవ యధ్యాయము.