Brahmapuranamu
Chapters
అథత్రయోదశాధికద్విశతతమో7ధ్యాయః వరాహావతారవర్ణనమ్ మునయ ఊచుః అహోకృష్ణస్య మాహాత్మ్యు మద్భుతం చాతిమానుషమ్ | రామస్య చ మునిశ్రేష్ఠ త్వయోక్తం భువి దుర్లభమ్ || 1 న తృప్తిమధిగచ్ఛామః శృణ్వంతో భగవత్కథామ్ | తస్మాద్బ్రూహి మహాభాగ భూయో దేవస్యచేష్టితమ్ || 2 ప్రాదుర్భావః పురాణషు విష్ణో రమితతేజసః | సతాం కథయతామేష వరాహ ఇతి నః శ్రుతమ్ || 3 న జానీమో7స్య చరితం విధిం న చ విస్తరమ్ | న కర్మగుణసద్భావం న హేతుత్వమనీషితమ్ || 4 కిమాత్మకో పరాహో7సౌ కామూర్తిః కా చ దేవతా | కిమాచారః ప్రభావోవా కిం వా తేన తదాకృతమ్ || 5 యజ్ఞార్థే సమవేతానాం మిషతాం చ ద్విజన్మనామ్ | మహావరాహచరితం సర్వలోకసుఖావహమ్ || 6 యథా నారాయణో బ్రహ్మన్వారాహం రూపమాస్థితః | దంష్ట్ర్యా స గాం సముద్రస్థా ముజ్జహారారిమర్దనః || 7 విస్తరేణౖవ కర్మాణి సర్వాణి రిపుఘాతినః | శ్రోతుం నోవర్తతేబుద్ధిర్హరేః కృష్ణస్య ధీమతః ||8 కర్మణామానుపూర్వ్యాచ ప్రాదుర్భావాశ్చయే విభోః | యావాస్య ప్రకృతిర్బ్రహ్మం స్తాశ్చా77ఖ్యాతుం త్వమర్హసి || వరాహావతార వర్ణనము ఓ మునీంద్ర! కృష్ణుని మహిమ అద్భుతము. బలరాముని యొక్కయు ప్రభావమట్టిదే. నీ వలన నెంత విన్నను దృప్తి కలుగుటలేదు. పురాణములందు విష్ణువు వరాహావతారమెత్తినట్లు విన్నాము. అది విస్తరముగా నానతిమ్ము. వరాహమన స్వరూపమేమి? దేవత యెవరు? ఏవిధమైన యాచారము ప్రభావము కృత్యము జరిపెనో తెలుపుము. యజ్ఞకర్తలకు పరలోకమేగు వారికి బ్రాహ్మణులకు నీచరిత్ర పుణ్యలోకప్రదము. ఆయన కోరతుదతో భూమినైత్తినకథ వినగోరెదము. అదిగాక పరమాత్మయొక్క యవతార విశేషంబులుగూడదెల్పుమన వ్యాసుండిట్లనియె. వ్యాస ఉవాచ ప్రశ్నభారో మహానేషభవద్భిః సముదాహృతః | యథాశక్త్యా తు వక్ష్యామి శ్రూయతాం వైష్ణవం యశః || 10 విష్ణోః ప్రభావశ్రవణ దిష్ట్యా వో మతిరుత్థితా | తస్మాద్విష్ణోః సమస్తావై శృణుధ్వం యాః ప్రవృత్తయః || 11 సహస్రాస్యం సహస్రాక్షం సహస్రచరణం చ యమ్ | సహస్రశిరసం దేవం సహస్రకరమవ్యయమ్|| 12 సహస్రజిహ్వం భాస్వంతం సహస్రముకుటం ప్రభుమ్ | సహస్రదం సహస్రాదిం సహస్రభుజమవ్యయమ్ || 13 హవనం సవనం చైవహోతారం హవ్యమేవ చ | పాత్రాణి చ పవిత్రాణి వేదిం దీక్షాం సమిత్స్రు వమ్ || 14 స్రుక్సోమసూర్యముసలం ప్రోక్షణీం దక్షిణాయనమ్ | ఆధ్వర్యుం సామగం విప్రం సదస్యం సదనం సదః || 15 యూపం చక్రం ధ్రువాం దర్వీం చరూపంశ్చోలూఖలాని చ | ప్రాగ్వంశం యజ్ఞభూమిశ్చ హోతారం చ పరంచయత్|| హ్రస్వాణ్యతి ప్రమాణాని స్థావరాణి చరాణి చ | ప్రాయశ్చిత్తాని వా7ర్ఘ్యం స్థండిలాని కుశాస్తథా || 17 మంత్రయజ్ఞవహం వహ్నిం భాగం భాగవహం చయత్ | అగ్రాసినం సోమభుజం హుతార్చిషముదాయుధమ్|| 18 ఆహుర్వేదవిదో విప్రా యంయజ్ఞే శాశ్వతం ప్రభుమ్ | తస్యవిష్ణోః సురేశస్య శ్రీవత్సాంకస్య ధీమతః || 19 ప్రాదుర్భావసహస్రాణి సమతీతా న్యనేకశః | భూయశ్చైవ భవిష్యంతి హ్యేవమాహ పితామహః || 20 యత్పృచ్ఛధ్వం మహాభాగాదివ్యాం పుణ్యామిమాం కథామ్ | ప్రాదుర్భావాశ్రితాం విష్ణోః సర్వపాపహరాం శివామ్|| 21 శృణుధ్వం తాం మహాభాగాస్తద్గతే నాంతరాత్మనా | ప్రవక్ష్యామ్యానుపూర్వేణ యత్పృచ్ఛధ్వం మమానఘాః || 22 వాసుదేవస్య మాహాత్మ్యం చరితం చ మహామతే | హితార్థం సురమర్త్యానాం లోకానాం ప్రభవాయ చ || 23 బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి వీర్యవాన్ | ప్రాదుర్భావాంశ్చ వక్ష్యామి పుణ్యాన్దివ్యాన్గుణాన్వితాన్ || 24 సుప్తో యుగసహస్రం యః ప్రాదుర్భవతి కార్యతః | పూర్ణే యుగసహస్రే7థ దేవదేవో జగత్పతిః || 25 బ్రహ్మాచ కపిలశ్చైవ త్ర్యంబకస్త్రిదశాస్తధా | దేవాః సప్తర్షయశ్చైవ నాగాశ్చాప్సరసస్తథా|| 26 సనత్కుమారశ్చ మహానుభావో మనుర్మహాత్మా భగవాన్ప్రజాకరః | పురాణదేవో7థ పురాణి చక్రే ప్రదీప్తవైశ్వానర తుల్యతేజాః || 27 ఇది గొప్ప ప్రశ్నభారము. యథాశక్తిగ దెల్పెదను. అవ్విష్ణు యశస్సు శ్రవణము చేయవలె నన్న తలపు మీకు కల్గుట యదృష్టము. అందువలన విష్ణుయశస్సంకీర్తనము విష్ణులీలలను వినుడు. యజ్ఞవరాహస్తుతి విష్ణువు సహస్రశీర్షుడు. నహస్రాక్షుడు. సహస్రముఖుడు సహస్రకరుడు సహస్రజిహ్వుడు. సహస్ర కిరీటుడు. సహస్రభుజుడని యా యజ్ఞపురుషుని విష్ణుని పురుషనూక్త విధానమున బ్రహ్మజ్ఞులు స్తుతింతురు. హవనము హోమము సవనము (ప్రాతర్మధ్యాహ్న సాయంసవనములు మూడు) హోత హవ్యము (హోమద్రవ్యము) పాత్రలు పవిత్రములు వేది దీక్ష సమిధ స్రువము స్రుక్కు సోమము సూర్యుడు ముసలము ప్రోక్షణి దక్షిణాయనము అధ్వర్యుడు సామగుడు (ఉద్గాత) సదస్యుడు సదనము (యజ్ఞశాల) సదస్సు యూపము చక్రము ధ్రువ దర్వి చరువు ఉలూఖలము ప్రాగ్వంశము త్రేతాగ్నులుండుశాల (ఉపసదేష్టులు ప్రవర్గ్యమిందే జరుగును) హ్రస్వములు అణువులు స్థావరములు జంగమములు ప్రాయశ్చిత్తములు అర్ఘ్యము స్థండిలములు (అగ్ని ప్రతిష్ఠ చేయుటకు కల్పింపబడిన ప్రదేశ విశేషములు) కుశలు మంత్రములు యజ్ఞముల వహించు వహ్ని హవిర్భాగము భాగవహము (హవిర్భాగములను) వహించు పాత్ర విశేషము) అగ్రాసి సోమభుజుడు హోమము చేయబడిన శ్రుత్యుక్త ఆయుధములను ధరించిన అగ్నిగ వేదవేత్తలు పిలుతురో యట్టి శాశ్వతుని యజ్ఞేశ్వరుని శ్రీవత్సాంకితవక్షుడగు విష్ణువు యొక్కయవతారసహస్రములెన్నో జరిగినవి. జరుగనున్నవి. చతుర్ముఖబ్రహ్మ యిట్లు చెప్పెను. విష్ణువు యొక్కయవతారమునకు సంబంధించిన కథలను శ్రద్ధతో వినుడు. ఈ వాసుదేవమాహాత్మ్యము చరిత్ర దేవమర్త్యలోకములకు హితకరము. శుభప్రదము. సర్వ భూతాంతరాత్మ యవతారములు పెక్కు గలవు. వేయి దివ్యయుగములు నిదురించి యొకానొక పనికై మరల మేల్కొనును. బ్రహ్మ కపిలుడు. త్ర్యంబకుడు దేవతలు సప్తర్షులు నారదుడు అప్సరసలు సనత్కుమారుడు మనువు మొదలగువారిని ఆయన యావిర్భవింపజేసెను. అతడు అగ్నివంటి తేజస్వి. యో7సౌ చార్ణ వమధ్యస్థో నష్టేస్థావరజంగమే | నష్టే దేవాసురనరే ప్రసష్టోరగరాక్షసే || 28 యోద్ధుకామౌ దురాధర్షౌ తావుభౌ మధుకైటభౌ | హతౌ భగవతా తేన తయోర్దత్త్వా7మితం వరమ్ || 29 పురా కమలనాభస్య స్వపతః సాగరాంభసి | పుష్కరే తత్రసంభూతా దేవాః సర్షి గణాస్తథా || 30 ఏష పౌష్కరకో నామ ప్రాదుర్భావో మహాత్మనః | పురాణం కథ్యతే యత్ర దేవశ్రుతిసమాహితమ్ || 31 వారాహస్తు శ్రుతిముఖః ప్రాదుర్భావో మహాత్మనః | యత్ర విష్ణుః సురశ్రేష్ఠొ వారాహం రూపమాస్థితః || 32 వేదపాదో యూపద్రంష్ట్రః క్రతుహస్తో7శ్వినీముఖః | అగ్నిజిహ్వోదర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః || 33 అహోరాత్రేక్షణో దివ్యో వేదాంగః శ్రుతిభూషణః | ఆజ్యనాసః స్రువతుండః సామఘోషస్వరోమహాన్ ||34 సత్యధర్మమయః శ్రీమాన్క్రమవిక్రమనత్కృతః | ప్రాయశ్చిత్తనఖో ఘోరః పశుజాను ర్మఖాకృతిః || 35 ఉద్గీథాంత్రో హోమలింగః ఫలజీవమహౌషధిః | వాద్యాంతరాత్మా మంత్రస్ఫిగ్వికృతః సోమశోణితః || 36 వేదిస్కంధో హవిర్గంధో హవ్యకవ్యాతి వేగవాన్ | ప్రాగ్వంశకాయో ద్యుతిమా న్నానాదీక్షాభిరన్వితః || 37 దక్షిణాహృదయో యోగీ మహాసత్రమయో మహాన్ | ఉపాకర్మాష్టరుచకః ప్రవర్గ్యావర్త భూషణః || 38 నానాఛందోగతిపథో గుహ్యోపనిషదాసనః | ఛాయాపత్నీ సహాయో7సౌ మణిశృంగ ఇవోత్థితః || 39 మహీం సాగరపర్యంతాం సశైలవనకాననామ్ | ఏకార్ణవ జలభ్రష్టా మేకార్ణవ గతఃప్రభుః || 40 దంష్ట్రయా యః సముద్ధృత్య లోకానాం హితకామ్యయా | సహస్రశీర్షో లోకాది శ్చకారజగతీం పునః || 41 ఏవం యజ్ఞవరాహేణ భూత్వా భూతహితార్థినా | ఉద్ధృతా పృథివీదేవీ సాగరాంబుధరా పురా || 42 సముద్ర మధ్యమందా సనాతన మూర్తి యుండగా ప్రళయమైన తఱి మధుకైటభు లిద్దరు భగవంతునిచేత వరములంది యుద్ధము సేయబూనిరి. కమలనాభుడు నిదురించిన తఱి పుష్కరమునుండి దేవతలు ఋషులు పుట్టిరి. ఆ ప్రాదుర్భావమే పౌష్కరమను పేర పురాణమునందు శ్రుతిసమ్మతమై వర్ణింపబడినది. హరి వరాహరూపమున నెత్తిన యవతారము శ్రుతిముఖము. అనగా వేదములే యా మూర్తియొక్క ముఖాద్యవయవ స్వరూపములందె నన్నమాట. యజ్ఞవరాహమూర్తి స్వరూపవర్ణనము అయ్యజ్ఞవరాహమూర్తి పాదములు నాల్గువేదములు. ఆయన కోర యూపస్తంభము. క్రతువు చేతులు. అశ్వినులు ముఖము. అగ్ని జిహ్వ. దర్భలు రోమములు. బ్రహ్మ శిరస్సు. అహోరాత్రములు కన్నలు. వేదాంగములు కర్ణభూషణములు. ఆజ్యము నాసిక. స్రువము ముట్టి సామధ్వనిఘర్ఘరస్వరము. సత్యధర్మములాశ్రీమంతుని స్వరూపము. ప్రాయశ్చిత్తమాయన ఘోరమైనముఖము. పశువు మోకాళ్ళు ఉద్గాతి ఆయనపేగు మంత్రముమూపువేదిక హవిస్సు వాసన (హవ్యకవ్యములు) ప్రాగ్వంశమునానాదక్షతలతోకూడినది శరీరము. ఆసనము శరీరకాంతిపత్నిమణిమయమైన శృంగమువలె లేచి దక్షిణ హృదయము అనేక సత్రమయము యోగవరహమూర్తి యొక్క స్వరూపము. ఉపాకర్మాష్టకము దంతములుప్రవర్గలా శరీరమందలి సుడులు. ఛందస్సులన్నియు నాయన నడచుదారులు. గాహ్యోపనిషత్తు సశైలవనముసాగరపర్యంతము ఏకార్ణవమందు మునిగిన భూమిని తన కొమ్ముచివర లోకహితము కొరకు పెల్లగించి ధరించెను. ఈవిధముగ యజ్ఞవరాహమూర్తిచేత వసుంధరాదేవి భూతహితార్ధ ముద్ధరింపబడినది. నరసింహమూర్తివర్ణనము వారాహ ఏషకథితో నారసింహ స్తతోద్విజాః | యత్ర భూత్వా మృగేంద్రేణ హిరణ్యకశిపుర్హతః || 43 పురా కృతయుగే నామ సురారిర్బలదర్పితః | దైత్యానామాదిపురుషశ్చకార సుమహత్తపః || 44 దశవర్ష సహస్రాణి శతాని దశపంచ చ | జపోపవాసనిరత స్తస్థౌ మౌనవ్రతస్థితః || 45 తతః శమదమాభ్యాం చ బ్రహ్మచర్యేణ చైవ హి | ప్రీతో7భవ త్తత స్తస్య తపసా నియమేన చ 46 తం వై స్వయంభూర్భగవా న్స్వయమాగత్య భో ద్విజాః | విమానేనార్కవర్ణేన హంసయు క్తేన భాస్వతా || 47 ఆదిత్యై ర్వసుభిః సార్ధం మరుద్భిర్దైవతై స్తథా | రుద్రైర్విశ్వ సహాయైశ్చ యక్షరాక్షస కింనరైః || 48 దిశాభిః ప్రదిశాభిశ్చ నదీభిః సాగరై స్తథా | నక్షత్రైశ్చ ముహూర్త్చైశ ఖేచరైశ్చ మహాగ్రహైః || 49 దేవర్షిభి స్తపోవృద్ధైః సిద్ధైర్విద్వద్భిరేవచ | రాజర్షిభిః పుణ్యతమైర్గంధర్వైరప్సరోగణౖః || 50 చరాచరగురు శ్శ్రీమాన్ వృతస్సర్వైస్సురైస్తథా | బ్రహ్మా బ్రహ్మవిదాం శ్రేష్ఠోదైత్యం వచన మబ్రవీత్ || బ్రహ్మోవాచ ప్రీతో7స్మి తవ భక్తస్య తపసా7నేన సువ్రత | వరం వరయ భద్రంతే యథేష్టం కామమాప్నుహి || 51 నరసింహరూప మెత్తిహరి హిరణ్యకశిపునిసంహరించినకథ వినుండు. కృతయుగమందు దైత్యులకు మొదటి పురుషుడు. హిరణ్యకశిపుడు పదివేల పదునేనువందలసంవత్సరము లుపవాసము సేసి మౌనము బూని తీవ్రతపస్సు చేసెను. వాని శమదమములకు బ్రహ్మచర్యమునకు తపో నియమములకు బ్రీతినొంది భగవంతుడు స్వయంభువు స్వయముగా హంసలనుబూన్చిన సూర్యప్రభ##మైన విమానమున ఆదిత్యులు వసువులు మరుత్తులు దేవతలు రుద్రులు వెన్నంటిరాగా యక్షరాక్షసులు కిన్నరులు దిక్కులు విదిక్కులు నదులు సముద్రములు నక్షత్రములు ముహూర్తములు మహాగ్రహములు తపోవృద్ధులైన సిద్ధులు విద్వాంసులు పుణ్యఋషులు మొదలగు పరివారముతో వచ్చి నీ తపస్సునకు సంతసించితిని. నీకు భద్రమగుగాక. ఇష్టమైన వరము కొరుము సిద్ధినందుమనెను. హిరణ్యకశిపురువాచ న దేవాసురగంధర్వా న యక్షోరగరాక్షసాః | ఋషయో వా7థ మాం శాపైః క్రుద్ధాలోకపితామహః || 52 శ##పేయు స్తపసాయుక్తా వర ఏష వృతో మయా | న శ##స్త్రేణ నచాస్త్రేణ గిరి ణాపాదపేన వా || 53 న శుష్కేన న చా77ర్ద్రేణ వ చై వోర్ధ్వం న చాప్యధః పాణిప్రహారేణౖ కేన పభృత్యబలవాహనమ్ || 54 యోమాం నాశయితుం శక్తః సమే మృత్యుర్భవిష్యతి | భ##వేయమహమేవార్కః సోమో వాయుర్హు తాశనః || 55 సలిలం చాంతరిక్షం చ ఆకాశ##శ్చైవ సర్వశః | అహం క్రోధశ్చ కామశ్చ వరుణో వాసవో యమః || 56 ధనదశ్చ ధనాధ్యక్షో యక్షః కింపురుషాధిపః || 57 బ్రహ్మోవాచ ఏతే దివ్యాః శరా స్తాత మయాదత్తాస్తవాద్భుతాః | సర్వాన్కామానిమాంస్తాత ప్రాప్స్యసి త్వం న సంశయః|| 58 వ్యాస ఉవాచ ఏవముక్త్వా తు భగవాన్జగామా77శు పితామహః | వైరాజం బ్రహ్మసదనం బహ్మర్షిగణసేవితమ్ || 59 హిరణ్యకశిపు డిట్లనెను. పితామహ! దేవాసురగంధర్వాదులెవ్వరును గోపించి నన్ను శపింపరాదు. ఇదియే వరము. శస్త్రాస్త్రములచే చెట్లచే గిరులచే నెండిన తడసిన దేనిచేగాని క్రిందగాని పైనగాని కాకుండ ఒక్క చేతితో మాత్రమే సైన్య సపరివారముగ నన్ను చంపగల వాడే నాకు మృత్యువు గావలెను. నేనే సూర్యచంద్రులు వాయువు అగ్ని నీరు అంతరిక్షము ఆకాశమునై యుండవలెను. కామక్రోధములు నేనే. ఇంద్ర యమ వరుణ కుబేరులు నంతయు నేనే కావలెనన బ్రహ్మ యివిగో దివ్యబాణములు నీకిచ్చుచున్నాను. ఇవి యద్భుతములు. నీవు కోరిన కోరికలు వానిచే బొందెదవు. సందియము లేదు. అని వైరాజమనిశ్రుతి పిలిచెడి బ్రహ్మ సదనమునకు బ్రహర్షిగణ సేవితుడై వేంచేసెను. అతో దేవాశ్చ నాగాశ్చ గంధర్వా మునయ స్తథా | వరప్రదానం శ్రుత్వేదం పితామహ ముపస్థితాః || 60 దేవా ఊచుః వరేణానేన భగవ న్భాధిష్యతి స నో7సురః | తత్ప్రసీదా77శు భగవ న్వధో7ప్యస్య విచింత్యతామ్ || 61 భగవన్సర్వభూతానిం స్వయంభూరాది కృత్ప్రభుః | స్రష్టా చ హవ్యకవ్యానా మవ్యక్తం ప్రకృతిద్ద్రువమ్ || 62 వ్యాస ఉవాచ తతో లోకహితం వాక్యం శ్రుత్వా దేవః ప్రజాపతిః | ప్రోవాచ భగవాన్వాక్యం సర్వదేవగణాంస్తథా || 63 బ్రహ్మోవాచ ఆవశ్యం త్రిదశా స్తేన ప్రాప్తవ్యం తపసఃఫలమ్ | తపసో7ంతే చ భగవా న్వధం విష్ణుఃకరిష్యతిః || 64 వ్యాస ఉవాచ ఏతచ్ఛ్రుత్వా సురాః సర్వే వాక్యం పంకజజన్మనః స్వాని స్థానాని దివ్యాని జగ్ముస్తేవై ముదాన్వితాః || 65 అటుపై దేవనాగగంధర్వమునులు బ్రహ్మవలన జరిగిన ఈవరప్రదానవిషయమువిని బ్రహ్మకిట్లనిరి. స్వామి! ఈ నీవిచ్చిన వరమువలన నా యసురుడు మమ్ము బాదింపగలడు. దయcజేసి వాని వధ విషయమాలోచింపుము. నీవు ఆదిక ర్తవు హవ్యకవ్యములను సృష్టించినవాడవేనీవు. అన బ్రహ్మ త్రిదశులార! చేసిన తపస్సు యొక్క ఫలమవశ్యమనుభవింప వలసినదే. తపస్సునకుచివర విష్ణుభగవానుడు వానిని వధించును. అనవిని దేవతలు సంతసించి స్వస్థానముల కేగిరి. లబ్ధమాత్రేవరే చా7పి సర్వాః సో7భాధత ప్రజాః | హిరణ్యకశిపుర్ధైత్యో వరదాననేన దర్పితః || 66 ఆశ్రమేఘ మహాభాగా న్మునీన్వై పంశితవ్రతాన్ |సత్యధర్మరతాన్దాంతాం స్తదా థర్త్పితవాంస్తథా || 67 త్రిదివస్థాం స్తథా దేవా న్పరాజిత్య మహాబలః|త్రైలోక్యం వశమానీయ స్వర్గే వసతి సో7సురః || 68 యదా వరమదోన్మత్తో విచర న్దావవో భువి | యజ్ఞీ యానకరోద్దైత్యా నయజ్ఞీయాంశ్చ దేవతాః || 69 ఆదిత్యా వసవః సాధ్యా విశ్వే చ మరుత స్తథా| శరణ్యం శరణం విష్ణు ముపతస్థుర్మహాబలమ్ || 70 దేవబ్రహ్మమయం యజ్ఞం బ్రహ్మదేవం సనాతనమ్| భూతం భవ్యం భవిష్యంచ ప్రభుం లోకనమస్కృతమ్ | నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః || 71 దేవా ఊచుః త్రాయస్వ నో7ద్య దేవేశ హిరణ్యకశిపోర్భయాత్ | త్వం హినః పరమోదేవ స్త్వం హినః పరమోగురుః || 72 త్వం హి నః పరమో ధాతా బ్రహ్మదీనాం సురోత్తమః | ఉత్ఫుల్లామలపత్రాక్ష శత్రుపక్షక్షయంకర || జయాయాదితివంశస్య శరణంత్వం భవస్వ నః || 73 వాడు వరము లభించినక్షణములో పొగరెక్కి మున్యాశ్రమములందు వ్రతనిష్టులై సత్మధర్మరతులైన దాంతులను శాంతులను హడలగొట్టెను. అట్లే స్వర్గమున కేగి దేవతల నోడించెను. ముర్లోకముల వశము జేసుకొని స్వేచ్ఛాసంచారియై దైత్యులను యజ్ఞీయులను (యజ్ఞ భాగార్హులను) దేవతలను ఆయజ్ఞీయులను గావించెను. ఆదిత్యులు మొదలుగా దేవవర్గము విష్టుని శరణొందిరి. దేవేశ్వరా! రక్షింపుము. హిరణ్యకశిపుని వలన మాకిప్పుడు భయము వచ్చిపడినది. నీవుగదా మాకు పరమదైవము. పరమ గురుడవు. పరమధాతవు. కమలలోచన! అదితివంశజయమునకు శరణమగుమనిరి. వాసుదేవఉవాచ భయం త్యజధ్వ మమరా ఆభయం వో దదామ్యహమ్ | తథైవ త్రిదివం దేవాః ప్రతిలప్స్యథ మా చిరమ్ || 74 ఏషో7హం సగణం దైత్యం వరదానేన దర్పతమ్|అవధ్యమమరేంద్రాణాం దానవేంద్రంనిహన్మితమ్ || 75 వ్యాసఉవాచ ఏవమక్త్వాతు భగవా న్విసృజ్య త్రిదివేశ్వరాన్ | హిరణ్యకశిపోః స్థాన మాజగామ మహాబలః || 76 సరస్యార్థం తనుం కృత్వా సింహస్యార్ధతనుం హరిః|నారసింహేన వపుషా పాణిం సంస్పృశ్య పాణినా || 77 ఘనజీమూతసంకాళో ఘనజీమూత నిస్వనః|ఘనజీమూతదీప్తౌజౌ జీమూత ఇవ వేగవాన్ || 78 దైత్యం సో7తిబలం దృష్ట్వా దృప్తశార్దూలవిక్రమః|దృపై#్తర్దైత్య గణౖర్గుప్తం హతవా నేకపాణినా ||79 వామనావతారము నృసింహఏష కథితో భూయో7సౌ వామన స్తతః|యత్ర వామనమాస్థాయ రూపం దైత్యవినాశనమ్ || 80 బలేర్బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా|విక్రమైస్త్రిభిరక్షోభ్యాః క్షోభితాస్తే మహాసురాః || 81 విప్రచిత్తిః శివః శంకు రయఃశంకు స్తథైవచ|అయఃశిరా హయగ్రీవశ్చ వీర్యవాన్|| 82 వేగవాన్కేతుమానుగ్రః సోగ్రవ్యగ్రో మహాసురః| పుష్కర పుష్కలశ్చైవ శ్వాశ్వో7శ్వపతిరేవచ || 83 ప్రహ్లాదో7శ్వపతిఃకుఃభః సంహ్లాదో గమనప్రియః|అనుహ్లాదో హరిహయో వారాహః సంహారో7నుజః || 84 శరభః శలభ##శ్చైవ కుపథః క్రోధనః క్రథః|బృహత్కీ ర్తిర్మహాజిహ్వః శంకుకర్ణో మహాన్వనః || 85 దీప్తజిహ్వో7ర్కనయనో మృగపాదో మృగప్రియః|వాయుర్గరిష్ఠో సముచిః సంబరో విస్కరో మహాన్ || 86 చంద్రహంతా క్రోధహంతా క్రోధవర్ధన ఏవచ|కాలకః కాలకోపశ్చ వృత్రః క్రోధో విరోచనః || 87 గరిష్ఠశ్చ వరిష్ఠశ్చ ప్రలంబనరకావుభౌ|ఇంద్రతాపనవాతాపీ కేతుమాన్బలదర్పితః || 88 అసిలోమా పులోమాచ బాష్కలః ప్రమదోమదః|శ్వమిశ్రః కాలవదనః కరాళః కేశిరేవచ || 89 ఏకాక్షశ్చంద్రమా రాహుః సంహ్లాదః సంబరః స్వనః|శతఘ్నీచక్రహస్తాచ తథా ముసలపాణయః || 90 అశ్వయంత్రాయుధోపేతా భిందిపాలాయుధా స్తథా|శూలో ఖలహస్తాశ్చ పరశ్వధధరాన్తథా || 91 పాశముద్గర హస్తాశ్చ తథా పరిఘపాణయః | మహాశిలా ప్రహరణాః శూలహస్తాశ్చ దానవాః || 92 నానాప్రహరణాఘోరా నానావేశా మహాబలాః | కూర్మకుక్కుట వక్త్రాశ్చ శశోలూకముఖా స్తథా || 93 ఖరోష్ట్రవదనాశ్చైవ పరాహవదనా స్తథా|మార్జారశిఖివక్త్రాశ్చ మహావక్త్రా స్థథా పరే || 94 నక్రమేషాననాః శూరా గో7జావిమహిషాననాః | గోధాశల్లకివక్త్రాశ్చ క్రోష్టువక్త్రాశ్చ దానవాః || 95 ఆఖుదర్ధుర వక్త్రాశ్చఘోరావృకముభా స్తథా|భీమామకరవక్త్రాశ్చ క్రౌంచవక్త్రాశ్చ దానవాః || 96 అశ్వాననాః ఖరముఖా మయూర వదపా స్తథా | గజేంద్రచర్మవసనా స్తథా కృష్ణాజినాంబరా || 97 చీరసంవృతగాత్రాశ్చ తథా నీలకవాససః | ఉష్ణీషిణో ముకుటిన స్తథా కుండలినో7సురాః || 98 కిరీటినో లంబశిఖాః కంబుగ్రీవాః సువర్చసః | నానావేషధరా దైత్యా నానామాల్యానులేపనాః || 99 స్వాన్యాయుధాని సంగృహ్య ప్రదీప్తాని చ తేజసా | క్రమమాణం హృషీకేశ ముపావర్తంత సర్వశః || 100 వాసుదేవుడు పలికెను. జడియకుడు. అభయమిచ్చుచున్నాను. మనువటివలె స్వర్గము త్వరలో పొందగలరు. ఇపుడే నేను వరదాన దర్పితుడైన వానిని సపరివారముగ సంహరించుచున్నాను. అని యిట్లు పలికి దేవతలను బంపి భగవంతుడు హిరణ్యకశివుని తావునకు వచ్చెను. సగము నరశరీరము సగము సింహశరీరము సేసి చేతితో చేయిని తాకుచు దట్టపు మేఘమువంటి శరీరము మేఘగర్జనము వంటి గర్జనము గొని మెరయుచు మేఘమంతవేగముగ వచ్చి యాకలికొనిన పెద్దపులి వలె నున్న యా రక్కసుని పొగరెక్కియున్న రక్కసులచే రక్షణ యివ్వబడుచున్నవారిని సంహరించెను. నృసింహుఁ జెప్పితిమి. ఇక వామనుని వినుండు. బలి యజ్ఞమందు బలశాలియైన విష్ణువుచే మూడడుగులచే మహాసురులు సంక్షోభింపఁజేయబడిరి. విప్రచిత్తి బృహత్కీర్తి మొదలు శంబరుడుదాక గల రాక్షసులు శతఘ్ని చక్ర ముసలములూని అశ్వయంత్రములుబూని బిందిపాల శూల ఉలూఖలములు జేబూని పరశ్వధములూని పాశముద్గర పరిఘాయుధములు గొని పెద్దబండలు గొని యుద్ధమునకు నడిచిరి. వారి ముఖములు తాబేలువలె కోడివలె గుడ్లగూబలవలె నుండెను. కొందరు గాడిదలు ఒంటెలు పందులు పిల్లులు నెమళ్ళ వంటి ముఖములు గలవారు. మొసళ్ళు మేకలు ఎడ్లు గొర్రెలు గేదెలు దున్నపోతుల అట్టి మొగములతో నుండిరి. ఉడుముముఖము కొందరిది. చుంచులు కప్పలం తోడేళ్ళంబోలినవారు కొందను. అశ్వముఖులు క్రౌంచముఖులు (బెగ్గురు పక్షులు) మయూరముఖులు కొందరు. కొందరు గజచర్మము కృష్ణాజినము ధరించిరి. నల్లని బట్టలు కట్టుకొనిరి. కొందరు తలపాగలు కొందరు కిరీటములు ధరించిరి. కొందరికి కుండలములున్నవి. జుట్టు విరబోసికొనిరి కొందరు. శంఖమువంటి మెడలుగల్గి నానామాల్యాములు గంధములు పూసికొని నానావేషధారులై అందరు తమ ఆయుధములం పచారు సేయుచున్న హరిని సమీపించిరి. ప్రమథ్య సర్వాన్దైతేయా న్పాదహస్తతలై ర్విభుః | రూపం కృత్వా మహాద్భీమం జహారాశు స మేదినీమ్ || 101 తస్యవిక్రమతో భూమిం చంద్రాదిత్యౌ స్తనాంతరే | నభః ప్రక్రమమాణస్య నాభ్యాం కిలతథా స్థితౌ || 102 పరమం క్రమమాణస్యజానుదేశే వ్యవస్థితౌ | విష్ణోరమితవీర్యస్య వదంత్యేవం ద్విజాతయః || 103 హృత్వాసమేదినీం కృత్స్నాం హత్వా చాసురపుంగవాన్ | దదౌ శక్రాయవసుధాం విష్ణుర్బలవతాం వరః || 104 ఏషవో వామనో నామ ప్రాదుర్భావో మహాత్మనః | వేదవిద్భిర్ధ్విజై రేత త్కధ్యతే వైష్ణవం యశః || 105 విష్ణువు పాదములతో కరతలముతో రక్కసులంగొట్టి భూమినిలాగుకొనెను. అతడడుగడుగున నాక్రమించి చంద్రసూర్యులు రొమ్ముదానందాకబెరిగి నాభిదాక నంతైయింతంతగుచు సర్వమాక్రమించి సర్వంసహ నింద్రున కొసంగెను. ఈ త్రివిక్రమావతార వైభవమును వేదవిదులు వర్ణింతురు. ఇది విష్ణుయశస్సంకీర్తనము. దత్తాత్రేయావతారము భూయో భూతాత్మనోవిష్ణోః ప్రాదుర్భావో మహాత్మనః | యోదత్తత్రేయఇతిఖ్యాతః క్షమయా పరయా యుతః || 106 పూర్వనష్టేషు వేదేషు ప్రక్రియాసు మఖేషుచ | చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే || 107 అతివర్ధతిచాధర్మే సత్యేనష్టే7నృతే స్థితే | ప్రజాస్శు శీర్యమాణాసు ధర్మే చాకులతాం గతే || 108 నయజ్ఞాః సక్రియా వేదాః ప్రత్యానీతా హి తేనవై | చాతుర్వర్ణ్యమసంకీర్ణం కృతం కేన మహాత్మనా || 109 తేనహైహయ రాజస్య కార్తవీర్యస్య ధీమతః | వరదేన వరో దత్తో దత్తాత్రేయేణ ధీమతా || 110 ఏతద్బాహుద్వయం య త్తేతత్తే మమకృతే నృప | శతానిదశ బాహూనాం భవిష్యంతి నసంశయః || 111 పాలయిష్యసి కృత్స్నంచ వసుదాం వసుధేశ్వర | దుర్నిరీక్ష్యో7రిబృందానాం యుద్ధస్థశ్చ భవిష్యసి | 112 ఏష వో వైష్ణవః శ్రీమాన్ప్రాదుర్భావో7ద్భుతః శుభః | భూతాత్మయగు విష్ణువుయొక్క కేవలక్షమాలక్షణమైన యవతారము దత్తాత్రేయుడను పేరవచ్చిప్రఖ్యాతిఁజెందినది. వేదములు నశింప ప్రక్రియ యజ్ఞలునశింప చాతుర్వర్ణ్యముసంకరమై ధర్మముశిథిలమై అధర్మము బెరుగ సత్యముచెడి అసత్యము పెరుగ ధర్మమువ్యాకులముగాగ యజ్ఞముతో క్రియలతో నతడు వేదములను పునరుద్ధరించెను. చాతర్వర్ణవ్యవస్థ నామహాత్ముడు కాపాడెను. మరియు హైహయరాజ వంశమువాడైన బుద్ధిమంతుడగు కార్తవీర్యునకాయన వరమిచ్చెను. ఈ నీ బాహువులు రెండును నానిమిత్తముగ వేయి బాహువులగును. సర్వవసుధను పాలింతువు. యుద్ధమునందు శత్రువులకు జూడనశక్యుడవగుదువు. ఈ నీ యవతారము విష్ణువుయొక్క యవతారము. పరశురామావతారము భూయశ్చ జామదగ్న్యో7యం ప్రాదుర్భావో మహాత్మనః || 113 యత్రబాహుసహస్రేణ ద్విషతాం దుర్జయం రణ | రామో7ర్జున మనీకస్థం జఘాన నృపతిం ప్రభుః || 114 రథస్థం పార్థివం రామః పాతయిత్వా7ర్జునం భువి | ధర్షయిత్వా7ర్జునం రామః క్రోశమానం చ మేఘవత్ || 115 కృత్స్నం బాహుసహస్రంచ చిచ్ఛేద భృగునందనః | పరశ్వధేన దీప్తేన జ్ఞాతిభిః సహితస్య వై || 116 కీర్ణా క్షత్రియకోటీభి ర్మేరుమందరభూషణాత్రిః సప్తకృత్యః పృథివీ తేన నిఃక్షత్రియా కృతా || 117 కృత్వా నిఃక్షత్రియాం చైనాం భార్గవః సుమహాయశాః | సర్వపాపవినాశాయ వాజిమేధేవ చేష్టవాన్ || 118 యస్మిన్యజ్ఞే మహాదానే దక్షిణాం భృగునందనః | మారీచాయ దదౌ ప్రీతః కశ్యపాయ వసుంధరామ్ || 119 వారణాంస్తురగాంశుభ్రా న్రథాంశ్చ రథినాం వరః | హిరణ్యమక్షయం ధేనూ ర్గజేంద్రాంశ్చ మహీపతిః || 120 దదౌ తస్మిన్మహాయజ్ఞే వాజిమేధే మహాయశాః | అద్యాపి చ హితార్థాయ లోకానాం భృగునందనః || 121 చరమాణ స్తసోఘోరం జామదగ్నః పునః ప్రభుః | అస్తే వై దేవవచ్ఛ్రీమా న్మహేంద్రే పర్వతోత్తమే || 122 ఏషవిష్ణోః సురేశస్య శాశ్వతస్యావ్యయస్యచ | జామదగ్న్యః ఇతిఖ్యాతః ప్రాదుర్భావో మహాత్మనః || 123 ఇటుపై మహానుభావుడగు పరశురాముని యవతారమయ్యెను. అందు వేయి బాహువులచేత దుర్జయుడైన కార్తవీర్యార్జునుని యాయన సంహరించును. రథమునందున్న కార్తవీర్యుని పరుశురాముడు పుడమిపై పడగొట్టి యప్పటికిని మేఘమువలె గర్జించుచున్న వానిని హడలగొట్టి వేయిబాహువులను గొడ్డలిచే నఱికెను. వాని జ్ఞాతులను గూడగొట్టెను. కోట్లకొలదిక్షత్రియులతో నిండిమేరుమంథరపర్వత భూషణమైన పృథివి ఇరువది యొక్కమార్లు దండెత్తినిక్షత్రియమొనర్చెను. ఈ పాపము పోవుటకాయన అశ్వమేధముఁగూడ సేసెను. మహాదాన పవిత్రమైన నయ్యజ్ఞమందాతుడు మరీచి వంశము వాడైన కశ్యపునకు తాను గెల్చిన వనుమతిని దక్షిణగానిచ్చెను. మరియు నాయశ్వమేధమున గుఱ్ఱములను రథములను ఏనుగులను అక్షయమైన బంగారమును గోవులను దానముసేసెను. ఇప్పుడును భృగునందనుడగు (భార్గవుడు) పరశురాముడు లోకహితముఁకొరకు మహాతపస్సు సేయుచు శ్రీమంతుడై దేవునివలెనున్నాడు. ఇది, దేవపతి యవ్యయుడు శాశ్వతుడునైన విష్ణువుయొక్క పరశురాముడను పేరి యవతారము. దశరథ రామావతారము చతుర్వింశే యుగే వాపి విశ్వామిత్రపురఃసరః | జజ్ఞే దశరథస్యాథ పుత్రః పద్మాయతేక్షణః || 124 కృత్వా7త్మానం మహాబాహు శ్చతుర్థా ప్రభురీశ్వరః | లోకేరామ ఇతి భ్యాత స్తేజసా భాస్కరోపమః || 125 ప్రసాదనార్థం లోకస్య రక్షసాం నిగ్రహాయ చ | ధర్మస్య చ వివృద్ధ్యర్థం జజ్ఞే తత్ర మహాయశాః || 126 తమప్యాహుర్మనుష్యేంద్రం సర్వభూతహితేరతమ్ | యః సమాః సర్వధర్మజ్ఞ శ్చతుర్దశ వనే7వసత్ || 127 లక్ష్మణానుచరో రామః సర్వభూత హితేరతః | చతుర్దశ వనే తప్త్వా తపోవర్షాణి రాఘవః || 128 గృహిణీ తస్య రామస్య సీతేతి ప్రథితా జనైః | పూర్వోదితా తు యా లక్ష్మీర్భర్తారమనుగచ్చతి || 129 జనస్థానే వసన్కార్యం త్రిదశానాం చకార సః | తస్యాపకారిణం క్రూరం పౌల స్త్యం మనుజర్షభః || 130 సీతాయాః వదమన్విచ్ఛ న్నిజఘాన మహాయశాః | దేవాసురగణానాంచ యక్షరాక్షసభోగినామ్ || 131 యత్రావధ్యం రాక్షసేంద్రం రావణం యుధి దుర్జయమ్ | యుక్తం రాక్షసకోటీభి ర్నీలాంజనచయోపమమ్ || 132 త్రైలోక్యరావణం క్రూరం రావణం రాక్షసేశ్వరమ్ | దుర్జయం దుర్మదం దృప్తం శార్దూల సమవిక్రమమ్ || 133 దుర్నిరీక్ష్యం సుఠగణౖ ర్వరదానేన దర్పితమ్ | జఘాన సచివైః సార్ధం ససైన్యం రావణం యుధి || 134 మహాభ్రగణసంకాశం మహాకాయం మహాబలమ్ | రావణం నిజఘానా77శు రామో భూతపతిః పురా || 135 సుగ్రీవస్య కృతే యేన వానరేంద్రో మహాబలః | వాలీవినిహతః సంఖ్యే సుగ్రీవశ్చాభిషేచితః || 136 దశరథరామావతారము ఇరువదినాల్గవ త్రేతాయుగమందు విశ్వామిత్రుని పురస్కరించుకొని దశరథునకు కమలాక్షుడవతరించెను. ఆయన తనను నాల్గువిధములుగ నొనరించుకొని సాక్షాత్ సూర్యునివలె వెలుంగుచు రాముడను ప్రసిద్ధినొందెను. లోకానుగ్రహమునకు రాక్షస నిగ్రహమునకు ధర్మసమగ్ర వృద్ధికొరకు మహాకీర్తిశాలి దయచేసినారు. సర్వభూతహితుడు నరేంద్రుడని యాయననందురు. సర్వధర్మజ్ఞుడాతడు. లక్ష్మణుడనుసరింప పదునాల్గేండ్లరణ్యమునవసింసి. తపస్సుచేసెను. ఆయన గృహిణి సీత. జగత్ర్పసిద్ధురాలు మున్నేను చెప్పిన మహాలక్ష్మియే సీతగా భర్తననుగమించినది. జనస్థానమున వసించుచునాయన వేల్పుల కార్యమును జక్కపెట్టినాడు. ఆయనకపకారియైన పరమక్రూరుని రావణుని సీతజాడ నెరిగిబోయి సంహరించినాడు. ఆ రావణుడు దేవాసుర యక్షరాక్షస నాగాదిగణములకవధ్యుడు. కారుమేఘమట్లున్న వానినిరాక్షసకోట్లువెంబడించినవి. ముల్లోకములు నారావమెత్తజేసినందున (ఏడ్పించినందున) రావణుడను పేరుగన్నయారాక్షసరాజును దుర్జయునిదుర్మదుని దృక్తుని శార్దూలవిక్రముని దుర్నిరీక్ష్యునివరదానగర్వితునిమంత్రులతో సేనలతోఁగూడ సమూలముగ రామచంద్రప్రభువు సంహరించెను. అచేసినరావణసంహారము సర్వ జగత్సంహారముచేసిన భూతపతి (శివునియొక్క) చేతవలెదీపించెను. సుగ్రీవుని కొరకు మహాబలుడైన వానరేంద్రుడు వాలినిహతుడయ్యెను. సుగ్రీవుడభిషి క్తుడయ్యెను. మధోశ్చ తనయో దృప్తో లవణో నామ దానవః | హతో మధువనే వీరో వరమత్తో మహాసురః || 137 యజ్ఞవిఘ్నకరౌ యేన మునీనాం భావితాత్మనామ్ | మారీచశ్చ సుబాహుశ్చ బలేన బలినాం వరౌ || 138 నిహతౌ చ నిరాశౌచ కృతౌతేన మహాత్మనా | సమరే యుద్ధశౌండేన తథా7న్యే చాపి రాక్షసాః || 139 విరాధంద కబంధంచ రాక్షసౌ భీమవిక్రమౌ | జఘాన పురుషవ్యాఘ్రో గంధర్వౌ శాపమోహితౌ || 140 హుతాశనార్కాంశుతడిద్గణాభైః ప్రతప్తజాంబూనదచిత్ర పుంఖైః | మహేంద్రవ్రాశనితుల్యసారై రిపూన్స రామః సమరే నిజఘ్నే || 141 తసై#్మ దత్తాని శస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా | వధార్థం దేవశత్రూణాం దుర్థర్షాణాం సురైరపి || 142 మధువను రాక్షసుని కుమారుడు లవణుడు. వాడు మధువనమందు సంహరింపబడెను. మునుల యజ్ఞములను జెరచిన మారీచసుబాహులు శ్రీరామునిచే నిహతులైరి. మరియెందరో రాక్షసులు సంహరింపబడిరి. శాపవశులైన గంధ్వరులు విరాధకంబధులాయనచేగూలిరి. ఆయన బాణములగ్నిరవితేజస్స్వరూపములు. బంగారపు విచిత్రమైన పుంఖములు కలవి. ఆ మహానుభావునకు విశ్వామిత్రుడు అమోఘములైన శస్త్రాస్త్రములు నొసంగెను. వర్తమానే మఖే యేన జనకస్య మహాత్మనః | భగ్నం మాహేశ్వరం చాపం క్రీడతా లీలయా పురా || 143 ఏతానికృత్వా కర్మాణి రామో ధర్మభృతాం వరః | దశాశ్వమేధాన్జారూథ్యా నాజహార నిరర్గళాన్ || 144 మహానుభావుడైన జనక చక్రవర్తియొక్క యజ్ఞమందు రాముడు శివచాపమును విలాసముగనెత్తి విరచెను. ఈ పనులు సేసి ధర్మమూర్తిరామమూర్తి యవిఘ్నముగ పది అశ్వమేధ యాగములుఁసేసెను. నాశ్రూయంతాశుభావాచో నా77కులం మారుతో వవౌ | న విత్తహరణం చా77సీ ద్రామే రాజ్యం ప్రశాసతి || 145 పరిదేవంతి విధవా నానర్థాశ్చ కదాచన | గర్వమాసీచ్ఛుభం తత్ర రామేరాజ్యం ప్రశాసతి || 146 న ప్రాణినాం భయం చా77సీ జ్జలాగ్న్యనిలఘాతకామ్ | న చాపి వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి చక్రిరే || 147 బ్రహ్మచర్యపరం క్షత్రం విశస్తు క్షత్రియే రతాః | శూద్రాశ్చైవహి వర్ణాంస్త్రీం శుశ్రూషంత్యనహంకృతాః || 148 నార్యో నాత్యచరన్భర్త్రూ న్భార్యాం నాత్యచరత్పతిః | సర్వమాసీజ్జగద్దాంతం నిర్దస్యు రభవన్మహీ || 149 రామఏకో7భవద్భర్తా రామః పాలయితా7భవత్ | ఆసన్వర్షసహస్రాణి తథా పుత్రసహప్రిణః || 150 అరోగాః ప్రాణినశ్చా77స న్రామే రాజ్యం ప్రశాసతి | దేవతానామృషీణాంచ మనుష్యాణాంచ సర్వశః || 151 పృథివ్యాం సమవాయో7భూ ద్రామే రాజ్యం ప్రశాసతి | గాథామప్యత్ర గాయంతి యే పురాణవిదోజనాః || 152 రామే నిబద్ధత త్త్వార్థాః మాహాత్మ్యం తస్య ధీమతః | శ్యామోయువా లోహితాక్షో దీప్తాస్యో మితభాషితః || 153 రాముడురాజ్యము ప్రశాసించుచుండ దొంగతనములులేవు. వైధవ్య దుఃఖములేదు. సర్వము శుభమయ్యెను. వాయుజలాగ్న్యాది భూత ప్రకోపమువలని భయములేదు. పెద్దవాండ్రు బాలురకు ప్రేతకార్యములు చేయుటలేదు. క్షత్రియ జాతి బ్రహ్మచర్య పరమైయుండెను. అనగా బ్రాహ్మణుల కధీనులై ప్రవర్తించిరి. వైశ్యులు క్షత్రపరులైరి. శూద్రులు మూడువర్ణములవారు చెప్పినట్లువినిరి. అహంభావము లేనివారైరి. స్త్రీలు భర్తలను భర్త భార్యను అతిక్రమించినడువలేదు. సర్వజగత్తు ప్రశాంతమయ్యెను. భూమి చోరరహితమయ్యెను. రాముడొక్కడే భరించువాడు(భర్త) రాముడొక్కడే పాలించువాడు. పుత్రసహస్రములతో ననేకవర్ష సహస్రములు ప్రజలు జీవించిరి. ప్రాణులరోగములై యుండెను. దేవతలకు ఋషులకు మనుష్యులకు నన్యోన్యసామరస్యము పృథివియందు నెలకొల్పెను. ఇచ్చట పుఠాణజ్ఞులు రామునియెడల చంచలమైన తత్వజ్ఞానము గలవారు. ఆ బుద్ధిమంతుని మాహాత్మ్యమును గురించి యీకింద్రి విధమైన గాథను గానముసేయుదురు. ఆజానుబాహుః సుముఖః సింహస్కంధో మహాభుజః | దశవర్షసహస్రాణి రామో రాజ్యమకారయత్ || 154 ఋక్సామయుజుషాంఘోషో జ్యాఘోషశ్చ మహాత్మనః | ఆవ్యుచ్ఛిన్నో7భవద్రాష్ట్రేదీయతాం భుజ్యతామితి || 155 సత్త్వవాన్గుణసంపన్నో దీప్యమానః స్వతేజసా | ఆతిచంద్రంచ సూర్యంచ రామో దాశరథిర్బఖౌ || 156 ఈజేక్రతుశ##తైః పుణ్యౖః సమాప్తవర దక్షిణౖః || హిత్వా7యోధ్యాం దివం యాతో రాఘవో హి మహాబలః || 157 ఏవమేవ మహాబాహు రిక్ష్వాకుకులనందనః | రావణం సగణం హత్వా దివ మాచక్రమే విభుః || 158 రాముడు చామనచాయమేనివాడు. రక్తాంతలోచనుడు. కళకళలాడు నెమ్మోమువాడు. అజానుబాహువు. ప్రసన్న ముఖుడు. సింహమునూపురమువంటి నూపురము గలవాడు. మహావీరుడు. ఆ రాముడు పదివేలేండ్లు రాజ్యముసేసెను. ఆయన రాష్ట్రమున ఋగ్యుస్సామ వేదములయొక్క ఘోషము జ్యాఘోషము(ధనుష్టంకారము) యెడతెరగకుండెను, ఇవ్వండి తినండి యన్నధ్వని నిర్విరామముగ వినిపించెను. సత్వసంపన్నుడు గుణసంపన్నుడైన రాముడు కేవలము తన తేజస్సుచే దేదీప్యమానుడయ్యెను. రామచంద్రుడు చంద్రుని సూర్యులను మించి తేజరిల్లెను. పవిత్రక్రతుశతము సంపూర్ణ శ్రేష్ఠి దక్షిణమైనదానినతడు యజించెను. అయోధ్యను విడచి మహాబలుడు రాఘవుడు దివమ్మునకేగెను. ఇక్ష్వాకుకులనందనుడైన దశరథనందనుడు సగణముగ రావణునిజంపి స్వర్గమాక్రమించెను. అపరః కేశవస్యాయం ప్రాదుర్భావో మహాత్మనః | విఖ్యాతో మాథురేకల్పే సర్వలోకహితాయవై || 159 యత్రసాల్వం చ చైద్యం చ కంసం ద్వివిదమేవచ | ఆరిష్టం వృషభం కేశిం పూతనాం దైత్యదారికామ్ || 160 నాగం కువలయాపీడం చాణూరం ముష్టికం తథా | దై త్యాన్మానుషదేహేన సూదయామాస వీర్యవాన్ || 161 ఛిన్నంబాహుసహస్రంచ బాణస్యాద్భుతకర్మణః-నరకశ్చ హతః సంఖ్యే యవనాశ్చ మహాబలః || 162 హృతాని చ మహీపానాం సర్వరత్నాని తేజసా | దురాదర్షాశ్చ నిహితాః పార్థివా యే మహీతలే || 163 మహాత్ముడైన విష్ణువుయొక్క మరొక యవతారవర్ణనము ఈ తరువాతి యవతారము. ఇది సర్వలోకహితమునకై మాధురకల్పమునందు వచ్చినట్లు విఖ్యాతిగన్నది. ఇందు సాల్వచైద్యకంస ద్వివిద వృషభ కేశిపూతనా రిష్టాదులను కువలయాపీడ చాణూర ముష్టికాదులను మానుషాకారముతో వచ్చిసంహరించెను. ఇందే బాణునివేయి బాహువులు తెగినవి. నరకుడుకూలెను. కాలయవనుడు గడతేరెను. అనేకమంది రాజులయొక్క సర్వరత్నములు (సర్వ ద్రవ్యములందు సర్వశ్రేష్ఠ వస్తువులు) ద్వారకకుంగొని రాబడినవి. ధుర్ధర్షులైన రాజులు భూతలమునకొరిగిరి. ఇదిలోకహితమునకు వచ్చిన పరమాత్మయొక్క యవతారము. ఏష లోకహితార్ధాయ ప్రాదుర్భావోమహాత్మనః | కల్కీవిష్ణుయశానామ శంభలగ్రామసంభవః || 164 సర్వలోకహితార్థాయ భూయో దేవో మహాయశాః | ఏతేచాన్యే చ బహవో దిత్యా దేవగణౖ ర్యుతః || 165 ప్రాదుర్భావః పురాణషు గీయతే బ్రహ్మవాదిభిః | యత్రదేవా విముహ్యంతి ప్రాదుర్భావానుకీర్తనే || 166 పురాణం వర్తతే యత్ర వేదశ్రుతి సమాహితమ్ | ఏతరుద్దేశ మాత్రేణ ప్రాదుర్భావానుకీర్తనమ్ | 167 కీర్తితం కీర్తనీయస్య సర్వలోకగురోర్విభోః | ప్రీయంతే పితరస్తస్య ప్రాదుర్భావాను కీర్తనాత్ || 168 విష్ణోరమితవీర్యస్య యః శృణోతి కృతాంజలిః || ఏతాశ్చ యోగేశ్వరయోగమాయాః శ్రుత్వానరో ముచ్యతే సర్వపాపైః | ఋద్ధిం సమృద్ధిం విపులాంశ్చభోగా న్ప్రాప్నోతి శీఘ్రం భగవత్ప్రసాదాత్ || 170 ఏవంమయా మునిశ్రేష్ఠా విష్ణోరమితతేజసః | సర్వపాపహరాః పుణ్యాః ప్రాదుర్భావాః ప్రకీర్తితాః || 71 శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే విష్ణోః ప్రాదుర్భావానుకీర్తనం నామ త్రయోదశాధికద్విశతతమో7ధ్యాయః కల్కియవతారము కల్కిమూర్తి శంభలగ్రామమున విష్ణుయశస్సను పేరున సర్వలోకహితమునకు నవతరించును. ఇవేగాక దితితో దేవగణములతో వచ్చిన యవతారములను బ్రహ్మవాదులు పురాణములందు గీర్తించియున్నారు. ఈ యవతార కీర్తన మందుదేవతలు గూడ తబ్బిబ్బువడుదురు. వేదధ్వనితో బాటు పురాణకీర్తన ప్రవచనము జరుగవలెనను నుద్దేశ్యముతో నా యవతార చరిత్ర వర్ణింపబడినది. కీర్తనీయుదైన సర్వజగద్గురులైన విష్ణువుయొక్క యీ చరిత్ర కీర్తించుట వలన పితృదేవతలు సంప్రీతులగుదురు. మరియు విష్ణువుయొక్క ఈ కథ కృతాంజలియై విన్నవాడు యోగీశ్వరేశ్వరుడుఐన యాస్వామియొక్క యోగమాయ విలాసములను విన్ననరుడు సర్వపాసములనుండి విమోచననుండి సమృద్ధియైన బుద్ధిని (జ్ఞానమును) విస్తారములైన భోగములను భగవత్ప్రహదమువలన శీఘ్రముగబొందును. మునీంద్రులార ఇట్లునాచే నమితితేజస్వియైన విష్ణువుయొక్క పుణ్యావతారములు సర్వపాపహరములు. సమగ్రముగా కీర్తింపబడినవి. ఇది శ్రీ బ్రహ్మపురాణమున విష్ణ్వవతార సంకీర్తమను రెండువందల పదమూడవయాధ్యాయము.