Brahmapuranamu
Chapters
అథ సప్తవింశత్యధికద్విశతతమో7ధ్యాయః ముని-వ్యాససంవాదే విష్ణుపూజాకథనే వైష్ణవానాం గతిఖ్యాపనవర్ణనమ్ మునయ ఊచుః అహో! కృష్ణస్య మాహాత్మ్యం శ్రుత మస్మాభిరద్భుతమ్ | సర్వపాప హరం పుణ్యం ధన్యం సంసార నాశనమ్ || 1 సంపూజ్య విధివద్భక్త్వా వాసుదేవం మహామునే | కాం గతిం యాంతి మనుజా వాసుదే వార్చనే రతాః || 2 కిం ప్రాప్నువంతి తే మోక్షం కిం వా స్వర్గం మహామునే| అథవా కిం మునిశ్రేష్ఠ ప్రాప్నువం త్యుభయం ఫలమ్ || 3 ఛేత్తు మర్హసి సర్వజ్ఞ సంశయం నో హృది స్థితమ్ | ఛేత్తా నాన్యో7స్తిలోకే 7స్మింస్త్వ దృతే మునిసత్తమ || 4 విష్ణుభక్తులు పొందు ఉత్తమగతిని నిరూపించుట ఆశ్చర్యకరమును సర్వపాపహరమును పుణ్యకరమును ధన్యత కలిగించునదియు సంసానబంధనాశనమునగు శ్రీకృష్ణ మహాత్మ్యమును మేము వింటిమి. చాల సంతోషమయినది. ఓ మహామునీ! మానవులు వాసుదేవుని అర్చించుటయందాసక్తులయి భక్తితో విధివిధానమున అతని నర్చించువారు ఏగతిని పొందుదురు? స్వర్గమునా? మోక్షమునా? రెంటినా? మా ఈ సంశయమును ఛేదించుము. ఓమునిశ్రేష్ఠా! అందులకు నీవుతప్ప సమర్థులు మఱవ్వరును లేరు. అని మునులు వ్యాసునడిగిరి. వ్యాస ఉవాచ సాధుసాధు మునిశ్రేష్ఠా భవద్భి ర్య దుదాహృతమ్ | శృణుధ్వ మానుపూర్వ్యేణ వైష్ణవానాం సుఖావహమ్ || 5 దీక్షామాత్రేణ కృష్ణస్య నరా మోక్షం వ్రజంతి వై | కిం పున ర్యే సదా భక్త్యా పూజయం త్యచ్యుతం ద్విజాః 6 న తేషాం దుర్లభః స్వర్గో మోక్షశ్చ మునిసత్తమాః | లభంతే వైష్ణవాః కామా న్యా న్యావ్యాంఛంతి దుర్లభాన్ || 7 రత్నపర్వత మారుహ్య నరో రత్నం యథా77దదేత్ | స్వేచ్ఛయా మునిశార్ధూలా స్తథా కృష్ణా న్మనోరథాన్ || 8 కల్పవృక్షం సమాసాద్య ఫలాని స్వేచ్ఛయా యథా | గృహ్ణాతి పురుషో విప్రా స్తథా కృష్ణా న్మనోరథాన్ || 9 శ్రద్ధయా విధివ త్పూజ్య వాసుదేవం జగద్గురుమ్ | ధర్మార్థ కామమోక్షాణాం ప్రాప్నువంతి నరాః ఫలమ్ || 10 ఆరాధ్య తం జగన్నాథం విశుద్ధే నాంతరాత్మనా | ప్రాప్నువంతి నరాః కామా న్సురాణా మపి దుర్లభాన్ || 11 యేర్చయంతి సదా భక్త్వా వాసుదేవాఖ్య మవ్యయమ్ | న తేషాం దుర్లభం కించి ద్విద్యతే భువనత్రయే || 12 ధన్యాస్తే పురుషా లోకే యే7ర్చయంతి సదా హరిమ్ | సర్వ పాపహరం దేవం సర్వకామ ఫలప్రదమ్ || 13 బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాంత్య జాతయః | సంపూజ్య తం సురవరం ప్రాప్నువంతి పరాం గతిమ్ || తస్మా చ్ఛృణుధ్వం మునయో యత్పృచ్ఛత మ మానఘాః| ప్రవక్ష్మామి సమాసేన గతిం తేషాం మహాత్మనామ్ || 15 ముని శ్రేష్ఠులారా! వైష్ణవులకు సుఖము కలిగించు మీ ప్రశ్నకు సమాధానమును వినుడు. నరులు కృష్ణుని దీక్షామాత్రముచేతనే ముక్తిపొందుదురు. ఎల్లప్పుడును భక్తితో ఆ అచ్యుతుని పూజించువారివిషయము చెప్పవలసినదేమి? ఓ మునిసత్తములారా! వారికి స్వర్గముకాని మోక్షముకాని దుర్లభముకాదు. వైష్ణవులు తాము కోరిన కోరికలు ఎంత దుర్లభములైనను పొందగలరు. రత్నపర్వతము నెక్కినవారు రత్నములను వలెను కల్పవృక్షము నాశ్రయించి ఫలములు కోసికొన్నట్లును వారు జగద్గురుడగు వాసుదేవుని విధిననుసరించి అర్చించినందులకు ఫలముగా ధర్మార్థ కామమోక్షఫలములను పొందుదురు. జగన్నాధుని విశుద్ధమగు అంతఃకరణముతో ఆరాధించిన మానవులు దేవతలకును దుర్లభములగు కామితములు పొందుదురు. సర్వపాపహరుడును సర్వకామిత ఫలములనిచ్చువాడునగు శ్రీహరిని అర్చించు నరులు లోకమున ధన్యులు. ఏలయన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులును కడజాతివారును స్త్రీలును ఆ దేవశ్రేష్ఠుని అర్చించుటచే ఉత్తమగతిని పొందుదురు. కనుక ఓ మునులారా! అట్టి మహనీయులు పొందు ఉత్తమగతిని సంగ్రహముగా చెప్పెదను. వినుడు. త్యక్త్యా మానుష్యకం దేహం రోగాయతన మధ్రువమ్ l జరామరణ సంయుక్తం జలబుద్భుద సంనిభమ్ ll 16 మాంస శోణి తదుర్గంధం విష్ఠామూత్రాది భిర్యుతమ్ l అస్థిస్థూణమమేధ్యం చ స్నాయు చర్మశిరాన్వితమ్ ll 17 కామగేన విమానేన దివ్యగంధర్వనాదినా l తరుణాదిత్య వర్ణేన కింకిణీజాలమాలనినాll 18 ఉపగీయమానా గంధర్వై రప్సరోభి రలంకృతాః l వ్రజంతి లోకపాలానాం భవనం తు పృథక్పృథక్ ll 19 మన్వంతర ప్రమాణం తు భుక్త్వా కాలం పృథ క్పృథక్ l భువనాని పృథక్తేషాం సర్వభోగై రలంకృతాః ll 20 తతో7ంతరిక్షం లోకంతే యాంతి సర్వసుఖప్రదమ్ l తత్ర భుక్త్వా వరాన్భోగా న్దశ మన్వంతరం ద్విజాః ll 21 తస్మాద్గంధర్వలోకం తు యాంతి వై వైష్ణవా ద్విజాః l విశన్మన్వంతరం కాలం తత్ర భుక్త్వా మనోరమాన్ ll 22 భోగా నాదిత్యలోకం తు తస్మా ద్యాంతి సుపూజితాః | త్రింశ న్మన్వంతరం తత్ర భోగా న్భుక్త్వా7తిదైవతాన్ ll 23 తస్మా ద్ర్వజంతి తే విప్రా శ్చంద్రలోకం సుఖప్రదమ్ l మన్వంతరాణాం తే తత్ర చత్వారింశ ద్గుణాన్వితమ్ ll 24 కాలం భుక్త్వా శుభాన్భోగా న్జరామరణ వర్జితాః | తస్మా న్నక్షత్ర లోకం తు విమానైః సమలంకృతవమ్ll 25 వ్రజంతి తే మునిశ్రేష్ఠా గుణౖః సర్వై రలంకృతాః l మన్వంతరాణాం పంచాశ ద్భుక్త్వా భోగాన్యథేప్సితాన్ ll 26 తస్మా ద్ర్వజంతి తే విప్రా దేవలోకం సుదుర్లభమ్ l షష్టి మన్వంతరం యావ త్తత్ర భుక్త్వా సుదుర్లభాన్ ll 27 భోగాన్నానావిధా న్విప్రా ఋగ్ ద్వ్యష్టకసమన్వితాన్ l శక్రలోకం పునస్తస్మా ద్గచ్ఛంతి సురపూజితాః ll 28 మన్వంతరాణాం తత్త్రైవ భుక్త్వా కాలం చ సప్తతిమ్ l భోగానుచ్చావచాన్దివ్యా న్మనసః ప్రీతివర్థనాన్ ll 29 తస్మా వద్ర్వజంతి తే లోకం ప్రాజాపత్య మనుత్తమమ్ l భుక్త్వాత త్రేప్సితాన్భోగా న్సర్వకామ గుణాన్వితాన్ ll 30 మన్వంతర మశీతిం చ కాలం సర్వసుఖప్రదమ్ l తస్మా త్పైతామహం లోకం యాంతి తేవైష్ణవా ద్విజాః ll 31 రోగములకు ఆశ్రయము అస్థిరము జరామరణయుక్తము నీటిబుడగతో సమము మాంస రక్తముల దుర్గందము కలది మలమూత్రాదియుక్తము ఎముకలనెడి కట్టుకొయ్యలతొ కూర్చబడినది అపవిత్రము నులినరములతో చర్మముతో రక్తనాళములతో కూడినది అగు మానవదేహమును విడిచి సంకల్పముతో నడచునది దివ్యగంధర్వుల సంగీతముతో కూడినది లేతసూర్యుడువలె ప్రకాశించునది చిఱుమువ్వలగుత్తుల మాలలు కలది అగు విమానము నెక్కి గంధర్వులు గానము చేయుచుండ అప్సరలలంకరించుచుండ వేరువేరుగా ఆయా లోకపాలుర లోకములకు పోవుదురు. ఒక్కొక్క లోకమున ఒక్కొక్క మన్వంతరకాలము సర్వభోగములను అనుభవించి వారు అంతట సర్వసుఖప్రదమగు అంతరిక్షలోకమునకు వత్తురు . అచ్చట శ్రేష్ఠమగు భోగములు పదిమన్వంతరముల పాటు అనుభవించి అక్కడనుండి గంధర్వలోకమునకు పోయి ఇరువది మన్వంతరములపాటు మనోహరములు భోగములనుభవింతురు. అచటినుండి అదిత్య లోకములకు ఏగి అచ్చట చక్కగా పూజలనందుకొనుచు ముప్పది మన్వంతరములకాలము దేవతలకును దుర్లభములగు భోగమలనుభవింతురు. అటనుండి సుఖప్రదమగు చంద్రలోకమునకు పోయి నలువది మన్వంతరములు అటనుండి నక్షత్రలోకమున ఏబది మన్వంతరములు దేవలోకమున అఱువది మన్వంతరములు అటనుండి ఇంద్రలోకమున డెబ్బది మన్వంతరమలు అటనుండి ప్రజాపతిలోకమున ఎనుబది మన్వంతరములు జరామరణములు లేక ఉత్తమములగు భోగములను అనుభవించి బ్రహ్మలోకమునకు పోవుదురు. మన్వంతరాణాం నవతి క్రీడిత్వా తత్రవై సుఖమ్ l ఇహా77గత్య పున స్తస్మా ద్విప్రాణాం ప్రవరే కులే ll 32 జాయంతే యోగినో విప్రా వేదశాస్త్రార్థ పారగాః l ఏవం సర్వేషు లోకేషు భుక్త్వా భోగా న్యథేప్సితాన్ ll 33 ఇహా77గత్య పున ర్యాంతి ఉప ర్యుపరిచ క్రమాత్ l సంభ##వే సంభ##వే తేతు శతవర్షం ద్విజోత్తమాః ll 34 భుక్త్వా యథేప్సితా న్భోగా న్యాంతి లోకాంతరం తతః l దశజన్మ యదా తేషాం క్రమే ణౖవం ప్రపూర్యతే ll 35 తదాలోకం హరే ర్దివ్యం బ్రహ్మలోకా ద్ర్వజంతితే l గత్వా తత్రాక్షయా న్భోగా న్భుక్త్వా సర్వగుణాన్వితాన్ ll 36 మన్వంతరశతం యావ జ్షన్మమృత్యు వివర్జితాః l గచ్ఛంతి భువనం పశ్చా ద్వారాహస్య ద్విజోత్తమాః ll 37 దివ్యదేహాః కుండలినో మహాకాయా మహాబలాః l క్రీడంతి తత్ర విప్రేంద్రాః కృత్వా రూపం చతుర్భుజమ్ ll 38 దశకోటి సహస్రాణి వర్షాణాం ద్విజసత్తమాః l తిష్ఠంతి శాశ్వతే భావే సర్వై ర్దేవై ర్నమస్కృతాః ll 39 తతో యాంతి తు తే ధీరా నరసింహగృహం ద్విజాః l క్రీడంతే తత్ర ముదితా వర్షకోట్యయుతానిచ ll 40 తదంతే వైష్ణవం యాంతి పురం సిద్ధనిషేవితమ్ l క్రీడంతే తత్ర సౌఖ్యేన వర్షాణా మయుతానిచ ll 41 బ్రహ్మలోకే పున ర్విప్రా గచ్ఛంతి సాధకోతిమాః l తత్ర స్థిత్వా చిరం కాలం వర్షకోటిశతా న్బహూన్ ll 42 నారాయణపురం యాంతి తత స్తే సాధకేశ్వరాః l భుక్త్వా భోగాంశ్చ వివిధా న్వర్షకోట్యర్బుదానిచ ll 43 అనిరుద్ధపురం పశ్చా ద్దివ్యరూపా మహాబలాః l గచ్ఛంతి సాధకవరాః స్తూయమానాః సురాసురైః ll 44 తత్ర కోటి సహస్రాణి వర్షాణాం చ చతుర్దశ l తిష్ఠంతి వైష్ణవా స్తత్ర జరామరణ వర్జితాః 45 ప్రదుమ్నస్య పురం పశ్చాద్గచ్ఛంతి విగతజ్వరాః l తత్ర తిష్ఠంతి తే విప్రా లక్షకోటిశత త్రయమ్ ll 46 స్వచ్ఛందగామినో హృష్టా బలశక్తి సమన్వితాః l గచ్ఛంతి యోగినః పశ్చా ద్యత్ర సంకర్షణః ప్రభుః ll 47 తత్రోషిత్వా చిరం కాలం భుక్త్వా భోగా న్సహస్రశః l విశంతి వాసుదేవేతి విరూపాఖ్యే నిరంజనే ll 48 వినిర్ముక్తాః పరే తత్త్వే జరామరణవర్జితే l తత్రగత్వా విముక్తా స్తే భ##వేయు ర్నాత్ర సంశయః ll 49 ఏవం క్రమేణ భుక్తింతే ప్రాప్నువంతి మనీషిణః l ముక్తించ మునిశార్దూలా వాసుదే వార్చనే రతాః ll 50 ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వైష్ణవానాం గతిఖ్యాపనం నామ సప్తవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః. ఇట్టి వైష్ణవులు బ్రహ్మలోకమున తొంబది మన్వంతరములు నమస్తసుఖములను అనుభవించి మరల ఈ భూలోకమునకు వచ్చి బ్రాహ్మణులలో ఉత్తమవంశమున యోగులుగా వేదశాస్త్రార్థ పారము నెఱిగిన బ్రాహ్మణులుగా జన్మింతురు. మరల క్రమక్రమముగా పైకిపైకి పోవుచు ప్రతిజన్మమునందును నూఱసి నంవత్సరమలు జీవించి యథేప్సితములగు భోగముల ననుభవించి లోకాంతరమునకు పోవుదురు. ఇట్లు పది జన్మములైన తరువాత వారు బ్రహ్మలోకమునుండి దివ్యమగు విష్ణులోకమున కేగుదురు. అచ్చట నూర మన్వంతరమల కాలము సర్వగుణములతో కూడిన అక్షయ భోగములను అనుభవించి జన్మమరణములు లేనివారయి వారాహమూర్తి యొక్క లోకమున కేగుదురు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ వైష్ణవులు అచ్చట మహాబలము చతుర్బాహువులు కలదియగు దివ్యమగు మహాశరీరము కలిగి సర్వదేవతల నమస్కారము లందుకొనుచు పదివేలకోట్ల సంవత్సరములు ముక్తిసుఖము ననుభవించుచుందురు. అటనుండి నరసింహదేవుని గృహమున కేగి పదివేలకోట్ల సంవత్సరములు విహరించి తదంతమున విష్ణులోకమునకు పోయి అచ్చటను అనేక కోట్ల సంవత్సరమలు ఆనందింతురు. తరువాత ఈ సాధకోత్తములు బ్రహ్మ లోకమన నూర్లకోట్ల సంవత్సరము లనేకము లానందించి నారాయణుని పురమునకేగి అర్బుదమల కోట్లసంవత్సరములుండి యానందించి దివ్యరూపులై మహాబలులై సురాసురుల స్తోత్రములందుకొనుచు అనిరుద్ధుని పురమున జరామరణములు లేక పదునాలుగు వేలకోట్ల సంవత్సరములుండి ఏ సంతాపములను లేక ప్రద్యుమ్నపురమునకు పోయి అచట మూడువందల లక్షల కోట్ల సంవత్సరములు సుఖింతురు. తరువాత ఈ యోగులు బలశక్తితో కూడి స్వచ్ఛంద గమనము కలవారగుచు సంకర్షణలోకము చేరి అచట చాలకాలము సహస్రవిధములగు భోగముల ననుభవించి సర్వమోక్షమును పొంది సర్వదోషరహితము జరామరణరహితము నగు వాసుదేవనామముగల పర్వతత్త్వమునందు ప్రవేశింతురు. ఇది నిశ్చయము. ఓ మునిశ్రేష్ఠులారా! వాసుదేవార్చనమున ఆసక్తులు పొందు ఫలములు సుఖములు ఇట్టివి. ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రాహ్మమున వైష్ణవగతిఖ్యాపనమను రెండువందల రువది యేడవ అధ్యాయము.