Varahamahapuranam-1    Chapters   

ఏకాధికశతతమోధ్యాయః - నూటొఒకటవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత ఇట్లు చెప్పెను.

గుడధేనుం ప్రవక్ష్యామి సర్వకామార్థ సాధనీమ్‌,

అనులిప్తే మహీపృష్ఠే కృష్ణాజినకుశాస్తృతే,

తస్యోపరికృతం వస్త్రం గుడమానీయ పుష్కలమ్‌ 1

కృత్వా గుడమయీం ధేనుం సవత్సాం కాంస్యదోహనీమ్‌,

సౌవర్ణముఖశృంగాం చ దంతాశ్చ మణిమౌక్తికైః. 2

గ్రీవా రత్నమయీ త్వస్యా ఘ్రాణం గన్ధమయం తథా,

శృంగౌ చాగురుకాష్ఠేన పృష్ఠం తామ్రమయం తథా. 3

కాంస్యోపదోహనం తస్యాః పుచ్ఛం క్షౌమమయం స్మృతమ్‌,

ఇక్షుపాదాం రౌప్యఖురాం కమ్బలే పట్టసూత్రకమ్‌. 4

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన ఘణ్టా చామరభూషితామ్‌,

కాంస్యోపదోహనీం పాత్రీం సర్వాభరణ భూషితామ్‌. 5

ప్రశస్తపత్రశ్రవణాం నవనీతస్తనీం బుధః,

ఫలై ర్నానావిధై స్తస్యా ఉపశోభం ప్రకల్పయేత్‌. 6

గుడధేనువును గూర్చి చెప్పెదను. ఇది కోరికల నన్నింటిని తీర్చునది. అలికిననేలపై లేడిచర్మము, దర్భాసనము పరచవలయును. దానిపై వస్త్రమునుంచి పుష్కలముగా బెల్లమును తెచ్చి దూడతో కూడిన ఆవు స్వరూపమును దానితో చేయవలయును. కంచు పాత్రను ఉంచవలయును. బంగారముతో ముఖమును కొమ్ములను, మణులతో ముత్యములతో దంతములను, రత్నములతో మెడను, గంధముతో ముక్కును, అగురుకట్టెతో కొమ్ములను, రాగితో వెనుక భాగమును, పాలుపిదుకు కంచుపాత్రను, నారబట్టతో తోకను, చెరకు గడలతో కాళ్లను, వెండితో గిట్టలను, మెడకు పట్టుదారమును కూర్పవలయును. జమిలి బట్టలతో దానిని కప్పవలయును, గంటలతో చామరములతో అలంకరింపవలయును. అన్ని విధములగు ఆభరణములతో పితుకు పాత్ర నలంకరింప వలయును. మేలైన ఆకులతో చెవులను, వెన్నతో పొదుగును చేయవలయును. పెక్కువిధములగు ఫలములతో చుట్టును అందముగా అలంకరింపవలయును.

ఉత్తమా గుడధేనుః స్యాత్‌ సదా భారచతుష్టయమ్‌,

మాగథేన తు తౌల్యేన చతుర్థాంశేన వత్సకమ్‌. 7

మగధదేశపు నాలుగు బారువుల తూకపు బెల్లపు ఆవు ఉత్తమ నాలుగవవంతు బెల్లముతో దూడను చేయవలయును. (బారువు - 8000 తులములు)

మధ్యమా చ తదర్థేన భారేణౖకేన చాధమా,

విత్తహీనో యథాశక్త్యా శ##తై రష్టాభిః కారయేత్‌,

అత ఊర్ధ్వంతు కర్తవ్యం గృహవిత్తానుసారతః. 8

అందులో సగముతో మధ్యను, ఒక్క బారువుతోనైన అధమ. ధనములేనివాడు ఎనిమిదివందలతులములతోనైనను శక్తిమేరకు చేయనగును. ఇంటిలోని ధనము ననుసరించి అటుపై చేయవలయును.

గన్ధపుష్పాదిభిః కృత్వా ధూపనైవేద్య దీపకాన్‌,

ఈదృశీం కల్పయిత్వాతు బ్రాహ్మణాయ నివేదయేత్‌,

సాధువృత్తాయ శాన్తాయ తథామత్సరిణ నృప. 9

గంధములతో, పూవులతో, ధూపముతో, నైవేద్యముతో, దీపములతో పూజించి, మంచినడవడి కలవాడు, శాంతుడు, అసూయలేనివాడు అగు బ్రాహ్మణునకు నివేదింపవలయును.

ఏవం కృత్వా ద్విజేన్ద్రాయ ఆహితాగ్నే ర్విశేషతః,

ఈదృశాయ ప్రదాతవ్యా సహస్రకనకేన తు. 10

తదర్థేన మహారా తస్యాప్యర్థేన వా పునః,

శ##తేన వా శతార్థేన యథాశక్త్యాతు దాపయేత్‌. 11

ఇట్లు విశేషించి ఆహితాగ్ని అయిన ఉత్తమ బ్రాహ్మణునకు వేయిబంగారు నాణములతో ఆ ఆవును దాన మీవలెను. మహారాజా! అందులో సగమైనను, సగములో సగమైనను, నూరైనను, అందు సగమైనను శక్తి మేరకు దానమీయవలయును.

గన్ధ వస్త్రాదిభిః కృత్వా ముద్రికా కర్ణపాత్రకైః,

ఛత్రికా పాదుకే దత్త్వా ఇమం మన్త్రముదీరయేత్‌. 12

గంధవస్త్రాదులతో, కర్ణాభరణములతో గొడుగు పాదుకలతో ఇచ్చుచు ఈ మంత్రమును పలుకవలయును.

యాశ్రియాదీని మన్త్రాణి పుర్వోక్తాని స్మరేద్‌ బుధః,

ప్రాజ్ముఖోదజ్ముఖో వాపి బ్రాహ్మణాయ నివేదయేత్‌. 13

తూర్పునకుగాని, ఉత్తరమునకు గాని ముఖము పెట్టి ''యాశ్రియా'' ఇత్యాది మంత్రములను ముందు చెప్పిన వానిని స్మరించుచు బ్రాహ్మణునకు దానమీవలయును.

వాచాకృతం కర్మకృతం మనసా యద్విచిన్తితమ్‌,

మానకూటం తులాకూటం కన్యానృతం గవానృతమ్‌,

తత్సర్వం నాశ##యేత్‌ పాపం గుడధేను ర్ద్విజార్పితా. 14

బ్రాహ్మణునకు సమర్పించిన ఈ గుడధేనువు మాటతో చేష్టతో, మనసుతో చేసిన పాపములను, మానవిషయముగా, తూకము విషయముగా చేసిన వంచనలను, కన్య విషయములో, గోవు విషయములో ఆడిన అ బద్ధములను ఈ సర్వపాపములను నశింపజేయును.

దీమయానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమాం గతిమ్‌,

యత్ర క్షీరవహా నద్యః పయః పాయసకర్దమాః,

మునయో ఋషయస్సిద్ధా స్తత్ర గచ్ఛన్తి ధేనుదాః. 15

ఇట్లు గుడధేనువును దానమిచ్చుచుండగా చూచువారును పరమగతి కరుగుదురు. పాలు పాయసములే బురదగానున్న పాల నదులు ప్రవహించుచోటికిని, మునులు, ఋషులు, సిద్ధులు ఉండుచోటికిని ఈ ధేనుదానము చేసిన వారరుగుదురు.

దశపూర్వాన్‌ దశపరాన్‌ తారయేద్‌ గుడ ధేనుదః,

అయనే విషువే పుణ్య వ్యతీపాతే దినక్షయే,

సర్వదైవ ప్రదాతవ్యా పాత్రం దృష్ట్వా మహామతే. 16

గుడధేనువు నిచ్చువాడు ముందు పదితరములవారిని, వెనుక పదితరములవారిని తరింపజయును. అయనపర్వములలో, విషువమునందును, వ్యతీపాతమునందును, శూన్యతిథియందును యోగ్యుడైన వ్యక్తి నెన్నుకొని అన్నివిధముల ఈ దానమును భద్రముగా చేయవలయును.

ఏతదేవ విధానం స్యా దేతే చోపస్కరాః స్మృతాః,

మంత్రావాహన సంయోగః సదా పర్వణి పర్వణి. 17

ఇదియే విధానము. ఇవియే వస్తు సామగ్రి, ఇదే మంత్ర, ఆవాహన సంయోగము, ప్రతిపర్వమునందును ఇట్లే చేయవలయును.

గుడధేనుః ప్రదాతవ్యా భుక్తిముక్తి ఫలప్రదా,

సర్వకామప్రదా నిత్యం సర్వపాపహరా శుభా. 18

ఈ గుడధేను దానము భుక్తిని ముక్తిని ఒసగునది. అన్ని కోరికలను తీర్చునది. సర్వపాపములను హరించునది.

గుడధేనోః ప్రసాదాత్‌ తు సౌభాగ్యమఖిలం లభేత్‌,

వైష్ణవం పద మాప్నోతి స్మరణ స్మరణ హరేః, 19

గుడధేనువు అనుగ్రహమువలన మానవుడు సంపూర్ణమగు సౌభాగ్యమును పొందును. హరి ప్రతి స్మరణము నందును విష్ణు పదమును చేరును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకాధిశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటఒకటవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters