Varahamahapuranam-1    Chapters   

ద్వ్యధికశతతమోధ్యాయః - నూటరెండవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత పలికెను

తద్వచ్చ శర్కరాధేనుం శృణు రాజన్‌ యథార్థతః,

అనులిప్తే మహీపృష్ఠే కృష్ణాజిన కుశోత్తరే. 1

ధేనుం శర్కరయా రాజన్‌ కృత్వా భారచతుష్టయమ్‌,

ఉత్తమా కథ్యతే సద్భి శ్చతుర్థాంశేన వత్సకమ్‌. 2

తదర్థం మధ్యమా ప్రోక్తా కనిష్ఠా భారకేణ తు,

తద్వ ద్వత్సం ప్రకుర్వీత చతుర్థాంశేన తత్త్వతః. 3

అట్లే చక్కెరధేనువును గూర్చి ఉన్నదున్నట్లు చెప్పెదను. రాజా! వినుము. అలికిన నేలపై లేడిచర్మము, దర్భాసనము నుంచి నాలుగుబారువుల చక్కెరతో ఆవును చేయవలయును. అది ఉత్తమ పద్ధతి. అందునాలుగవవంతు చక్కెరతో దూడను నిర్మింప వలయును. అందులో సగము మధ్యమము, ఒకబారువుతో నైనచో చివరిపద్ధతి. దాని ప్రకారమే నాల్గవవంతుభాగముతో దూడను చేయవలయును.

అథ కుర్యాదష్టశ##తై రూర్ధ్వం నృపతిసత్తమ,

స్వశక్త్యా కారయేద్‌ ధేనుం యథాత్మానం నపీడయేత్‌. 4

ఆవు ఎత్తు ఎనిమిదివందల అంగుళములుండవలయును. లేదా శక్తిని బట్టి చేయింపవలయును. తన్నుతాను బాధపెట్టుకొన రాదు.

సర్వబీజాని సంస్థాప్య చతుర్దిక్షు సమన్తతః,

సౌవర్ణముఖశృజ్గాణి మౌక్తికానయనాని చ. 5

నాలుగు దిక్కులందును అన్నివిధములైన విత్తనములను ఉంచవలయును. ఆ ఆవునకు బంగారు ముఖము కొమ్ములు, ముత్యాల కన్నులు ఏర్పరుపవలయును.

గుడేన తు ముఖం కార్యం జిహ్వా పిష్టమయీ తథా,

కంబలం పట్టసూత్రేణ కంఠాభరణ భూషితమ్‌. 6

బెల్లముతో ముఖమును, పిండితో నాలుకను, గంగడోలును పట్టసూత్రము, కంఠాభరణమును కూర్పవలయును.

ఇక్షు పాదాం రౌప్యఖురాం నవనీతమయ స్తనామ్‌,

ప్రశస్తపత్ర శ్రవణాం సితచామరభూషితామ్‌,

పఞ్చ రత్న సమాయుక్తాం వసై#్త్రరాచ్ఛాదితోపరి. 7

చెరకుగడల పాదములు, వెండిగిట్టలు, వెన్నతో పొదుగు, చక్కని ఆకులతో చెవులు, తెల్లనిచామరములు అలంకరాములు, అయిదురత్నములు మొదలగు వానితో ఆ ఆవును నిర్మించి పైని వస్త్రములను కప్పవలయును.

గంధపుషై#్ప రలంకృత్య బ్రాహ్మణాయ కుటుంబినే,

శ్రోత్రియాయ దరిద్రాయ సాధువృత్తాయ ధీమతే. 8

వేదవేదాజ్గ విదుషే ఆహితాగ్నే ర్విశేషతః,

అదుష్టాయ ప్రదాతవ్యా నతు మత్సరిణ ద్విజే. 9

దానిని గంధములతో పూవులతో అలంకరించి, కుటుంబము కలవాడు, వేదముచక్కగా చదివినవాడు, దరిద్రుడు, మంచి నడవడి కలవాడు, బుద్ధిశాలి, వేదవేదాంగములను చక్కగా తెలిసినవాడు, నిత్యాగ్నిహోత్ర అర్చనకలవాడు, దుష్టత లేనివాడు, అగు బ్రాహ్మణునకు ఒసగవలయును. ఇతరులను చూచి కుళ్లుకొను వానికి ఈరాదు.

అయనే విషువే పుణ్య వ్యతీపాతే శశిక్షయే,

ఏషు పుణ్యషు కాలేషు యదృచ్ఛా వా స దాపయేత్‌. 10

అయనములందు, విషువమునందు, పుణ్యతిథియందు, వ్యతీపాతయోగమున్న దినమునను (పూర్ణిమ సోమవారముల కలయిక రోజు) అమావాస్యయందును ఈ పుణ్యదినములందు కాని ఎప్పుడైనను కాని ఈ దానము చేయవలయును.

సత్పాత్రం చ ద్విజం దృష్ట్వా ఆగతం శ్రోత్రియం గృహే,

తాదృశాయ ప్రదాతవ్యా పుచ్ఛ దేశోపవిశ్య చ. 11

పూర్వాముఖస్థితో దాతా అథవా చ ఉదజ్ముఖః,

ధేనుం పూర్వముఖీం కృత్వా వత్సముత్తరతో న్యసేత్‌. 12

మంచి యోగ్యతగల శ్రోత్రియబ్రాహ్మణుడు ఇంటికి రాగా అట్టివాని కీయవలయును. దాత తూర్పునకు గాని, ఉత్తరమునకు గాని మొగముపెట్టి ఆవుతోకదగ్గర కూర్చుండవలయును. ఆవును తూర్పు ముఖముగా, దూడను ఉత్తరముఖముగా నిలుపవలయును.

దానకాలే తు యే మన్త్రా స్తాన్‌ పఠిత్వా సమర్పయేత్‌,

సంపూజ్య విధివద్‌ విప్రం ముద్రికా కర్ణభూషణౖః. 13

స్వశక్త్యా దక్షిణాం దత్వా విత్తశాఠ్యవివర్జితః,

హస్తేతు దక్షిణాం దత్వా గంధపుష్పం సచందనమ్‌,

ధేనుం సమర్పయేత్‌ తస్య ముఖం చ న విలోకయేత్‌. 14

దానకాలమునందు చదువవలసిన మంత్రములను చదివి సమర్పింపవలయును. విధిప్రకారము విప్రుని ఉంగరముతో, కర్ణభూఫణములతో పూజింపవలయును. తనశక్తి ననుసరించి దక్షిణ నొసగవలయును. విత్తశాఠ్యమును విడువవలయును (ధనము విషయములో వంచన పనికిరాదు. సమర్థుడై తక్కువ ఇచ్చుట, శక్తిలేని యెడల ఎక్కువ ఇచ్చుటకు ప్రయత్నించుట విత్త శాఠ్యము) చేతి యందు దక్షిణనుంచి గంధమును, పూవులను ధేనువును సమర్పింపవలయును. ఇచ్చునపుడు పుచ్చుకొనువాని ముఖమును చూడరాదు.

ఏకాహం శర్కరాహారో బ్రాహ్మణస్త్రిదినం వసేత్‌,

సర్వపాపహరా ధేనుః సర్వకామప్రదాయినీ,

సర్వకామ సమృద్ధస్తు జాయతే నాత్ర సంశయః. 15

ఒకదినము చక్కెరభోజనముతో ఉండవలయును. పుచ్చుకొన్న బ్రాహ్మణుడు మూడుదినములు చక్కెరజభోజనముతో గడుప వలయును. ఆ ధేనువు సర్వపాపములను హరించుచు. అన్ని కోరికలను ప్రాసాదించును. ఆ దాత అన్ని కోరికలు తీరినవాడగును. ఇందు సంశయము లేదు.

విష్ణులోకం నరో గచ్ఛేద్‌ యావదాహూత సంప్లవమ్‌,

స్వపితౄంస్తారయేచ్చైవ మాతామహ సమన్వితాన్‌,

ఆత్మానం విష్ణుసాయుజ్యం నయతే నాత్ర సంశయః 16

నరుడు ప్రళయకాల పర్యంతము విష్ణులోకమున నుండును. తనపితరులను, తల్లివైపువారితో పాటు తరింపజేయును. తన్ను విష్ణువులో లీనము చేసికొనును. సంశయము లేదు.

దీయమానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమాం గతిమ్‌,

య ఇదం శృణుయాద్‌ భక్త్యా పఠతే వాపి మానవః,

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి. 17

ఆవు నిచ్చుచుండగా చూచువారును పరమగతి కరనుగుదురు. దీనిని భక్తితో విన్నవాడును, చదువువాడును సర్వపాపముల వలన ముక్తుడై విష్ణులోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వ్యధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటరెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters