Varahamahapuranam-1    Chapters   

త్ర్యధికశతతమోధ్యాయః - నూటమూడవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత చెప్పెను.

మధుధేనుం ప్రవక్ష్యామి సర్వపాతకనాశినీమ్‌,

అనులిప్తే మహీవృష్ఠే కృష్ణజిన కుశోత్తరే. 1

ధేనుం మధుమయీం కృత్వా సంపూర్ణఘటషోడశీమ్‌,

చతుర్థేన తథాంశేన వత్సకం పరికల్పయేత్‌. 2

రాజా! మధుధేనువును గూర్చి చక్కగా చెప్పెదను. ఇది సర్వపాతకములను నశింపజేయునది.

అలికిననేలపై లేడిచర్మము దుర్భాసనము నుంచి పదునారు నిండుకడవల తేనెతో ఆవును చేయవలయును, అందునాలుగవ భాగముతో దూడను కల్పింపవలయును.

సౌవర్ణం తు ముఖం కృత్వా శృజ్గా ణ్యగురుచన్దనైః,

పృష్ఠం తామ్రమయం కృత్వా సాస్నాం పట్టమయీం తథా. 3

పాదా నిక్షుమయాన్‌ కృత్వా సితకంబలకంబలామ్‌,

ముఖం గుడమయం కృత్వా జిహ్వం శర్కరయా తథా. 4

ఓష్ఠౌ పుష్పమ¸° తస్యా దన్తాః ఫలమయాః స్మృతాః,

దర్భరోమా ధరాదేవీ రూస్యఖుర విభూషితా. 5

ప్రశస్త పత్రశ్రవణా ప్రమాణాత్‌ పరితస్తతా,

సర్వలక్షణసంయుక్తా సప్తధాన్యాని దాపయేత్‌. 6

బంగారముతో ముఖము, అగురుచందనములతో కొమ్ములు, రాగితో తోక, పట్టువస్త్రములతో గంగడోలు, చెరకుగడలతో పాదములు, తెల్లని కంబళితో కప్పిన గంగడోలు, బెల్లముతో ముఖము, చెక్కెరతో నాలుక, పూవులతోపెదవులు, పండ్లతో దంతమయులు, దర్భలతో రోమములు, వెండితో గిట్టలు, కొలతకు సరిపడునట్లు ఆవును తీర్పవలయును. ఏడు విధములగు ధాన్యములను ఉంచవలయును.

చత్వారి తిలపాత్రాణి చతుర్ధిక్ష్వపి దాపయేత్‌,

ఛాదితాం వస్త్రయుగ్మేన ఘంటాభరణభూషితామ్‌,

కాంస్యోపదోహినీం కృత్వా గంధపుషై#్పస్తు ధూపితామ్‌. 7

నాలుగుదిక్కులందును నాలుగు నూవులపాత్రలు ఉంచవలయును. రెండువస్త్రములు పైవి కప్పవలయును. గంటలు, ఆభరణములతో అలంకరింపవలయును. కంచుతోచేసిన పాలుపితుకుపాత్రను ఏర్పరిచి, గంధపుష్పములతో సువాసన కూర్పు వలయును.

అయనే విషువే పుణ్య వ్యతీపాతే దినక్షయే,

సంక్రాంత్యా ముపరాగే చ సర్వకాలం యదృచ్చయా. 8

ద్రవ్యబ్రాహ్మణసంపత్తిం దృష్ట్వాతాంతు ప్రదాపయేత్‌,

ఆయనము, విషువము, పుణ్యతిథి, వ్యతీపాతము, దినక్షయము, (పగటిభాగము తక్కువగానున్నదినము) సంక్రాంతి, గ్రహణము అనుదినములలో కానీ, బుద్ధి పుట్టినప్పుడుకాని ద్రవ్యము, బ్రాహ్మణుడు లభించుటను చూచుకొని ఈదానము చేయవలయును.

బ్రాహ్మణాయ దరిద్రాయ శ్రోత్రియాయాహి తాగ్నయే. 9

ఆర్యావర్తే సముత్పన్నే వేదవేదాంగపారగే,

తాదృశాయ ప్రదాతవ్యా మధుధేను ర్నరోత్తమ. 10

దరిద్రుడు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, ఆర్యావర్తమున పుట్టినవాడు (వింధ్య హిమవత్పర్వతములనడిమి దేశమును ఆర్యావర్తమందురు.) వేదవేదాంగములను తుదిముట్ట చదివినవాడు అగు బ్రాహ్మాణునకు, లేదా అటువంటివానికి ఈమధుదేనువును దానమీయవలయును.

పుచ్ఛదేశోపవిష్టస్తు గంధధూపాది పూజితామ్‌,

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన ముద్రికాకర్ణ మాత్రకైః 11

స్వశక్త్యా దక్షిణాం దత్వా విత్తశాఠ్యవివర్జితః,

జలపూర్వంతు కర్తవ్యం పశ్చాద్‌ దానం సమర్పయేత్‌. 12

తోకదగ్గరగా కూర్చుండి గంధము ధూపము మొదలగు వానితో పూజించి జంట వస్త్రములతో కప్పి ఉంగరము, చెవిపోగులు అనువానితోపాటు శక్తిననుసరించి ధనవిషయమున వంచనచేయక దక్షిణనొసగి ముందు నీరు వదలి తరువాత దానము చేయవలయును.

రసజ్ఞా సర్వదేవానాం సర్వభూతహితే రతా,

ప్రియన్తాం పితృదేవాశ్చ మధుధేనో నమోస్తుతే.

ఏవ ముచ్చార్యతాం ధేనుం బ్రాహ్మణాయ నివేదయేత్‌. 13

తల్లీ! నీవు సర్వదేవతలకు నాలుకవు. సర్వభూతముల మేలునందు ప్రీతికలదానవు. నీవలన పితృదేవతలందరు ప్రీతులగుదురు గాక! ఓ మధుదేనూ! నీకు నమస్కారము అనిపలికి ఆ గోవును బ్రాహ్మణునకు సమర్పింపవలయును.

అహం గృహ్లామి త్వాందేవి కుటుంబార్థే విశేషతః,

కామం కామదుఘే కామాన్‌ మధుధేనో నమోస్తుతే. 14

తల్లీ! నేను ప్రత్యేకించి కుటుంబముకొరకు నిన్ను గ్రహించు చున్నాను. కామధేనూ! నాకామముల నన్నింటిని తీర్చుము. మధుధేనూ! నీకు నమస్కారము (అని పుచ్చుకొనువాడు పలుకవలయును.)

మధు వాతేతి మన్త్రేణ దాపయాశుచికేన తు,

దత్వాధేనుం మహారాజ ఛత్రికోపానహౌ తథా. 15

దానముచేత పవిత్రుడై 'మధువాతా' ఇత్యాది మంత్రముతో, గొడుగు చెప్పులతోపాటుగా ధేనువును దానమీవలయును.

ఏవం యః కురుతే భక్త్యా మధుధేనుం నరాధిప,

దత్వా దానం పాయసేన మధునా చ దినం నయేత్‌. 16

ఇట్లు భక్తితో మధుధేనువును దానమిచ్చినవాడు పాయసముతో, తేనెతో ఆ దినము గడుపవలయును.

బ్రామ్మణోపిత్రిరాత్రంతు మధుపాయససంయుతమ్‌,

దానము పుచ్చుకొన్న బ్రాహ్మణుడు కూడ మూడు రాత్రులుపాయసము, తేనె గల భోజనముతో గడుపవలయును.

ఏవం కృతే తు యత్పున్యం తన్నిబోధ నరాధిప. 17

ఇట్లు చేసినచో కలుగు పుణ్యమెట్టిదియో ఓ రాజా! తెలిసి కొనుము.

యత్రమధువహా నద్యో యత్ర పాయసకర్ధమాః,

ఋషయో మునయ స్సిద్ధా స్తత్ర గచ్ఛన్తి ధేనుదాః. 18

తేనెలు, పాయసకర్దమములు గల నదులు ప్రవహించు చోటికిని, ఋషులు, మునులు, సిద్ధులు ఉన్నచోటికిని ధేనుదాత లరుగుదురు.

తత్ర భోగానథోభుంక్తే బ్రహ్మలోకే చ తిష్ఠతి,

క్రీడిత్వా సుచిరం కాలం పునర్మర్త్యముపాగతః,

స భుక్త్యా విపులాన్‌ భోగాన్‌ విష్ణులోకం స గచ్ఛతి. 19

అచట సుఖములన్నియు అనుభవించి బ్రహ్మలోకమున కరుగును. అందు బహుకాలము సుఖముగానుండి మరల మనుష్య లోకమునకు వచ్చి విస్తారములగు భోగముల ననుభవించి విష్ణు లోకమున కరుగును

దశ పూర్వాన్‌ దశపరా నాత్మానం చైకవింశకమ్‌,

నయతే విష్ణుసాయుజ్యం మధుధేను ప్రాసాదతః. 20

వెనుక పదితరములవారని, ముందు పదితరములవారిని తనతరమును మొత్తము ఇరువదియొక్కతరములవారిని మధు ధేనుప్రసాదమువలన విష్ణుసాయుజ్యమును పొందించును.

యఇదం శృణుయాద్‌ భక్త్యా శ్రావయేద్‌ వాపిమానవః

సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి. 21

ఇది వినువాడును, భక్తితో వినిపించు వాడును సర్వ పాపముల నుండి ముక్తిపొంది విష్ణులోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్ర్యధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటమూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters