Varahamahapuranam-1    Chapters   

షడధికశతతమోధ్యాయః - నూట ఆరవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత పలికెను.

నవనీతమయీం ధేనుం శృణు రాజన్‌ ప్రయత్నతః,

యాం శ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః.

రాజా! వెన్న ఆవును గూర్చి శ్రద్ధతో వినుము. దానిని విని మానవుడు సర్వపాపమలనుండియు ముక్తుడగును. సంశయము లేదు.

గోమయే నామ లిప్తాయాం భూమౌ గోచర్మ మానతః 1

తత్రో పరి కృష్ణమృగస్య చర్మ

ప్రసారితం నవనీతస్య కుంభమ్‌,

సంస్థాపయేత ప్రయతో మనుష్యో

వత్సం తథా తస్య చతుర్థభాగే. 2

గోమయముతో అలికినభూమిపై గోచర్మపు కొలతలో నల్లజింక చర్మమును పరచి వెన్నకుండను శ్రద్ధతో నుంచవలయును. అందు నాల్గవభాగముతో దూడను చేయవలయును.

కృత్వా విధానేన చ రాజసింహ,

సువర్ణశృంగా సుముఖా చ కార్యా,

నేత్రే చ తస్యా మణిమౌక్తికాని

కృత్వా తథాస్యంచ గుడేన తస్యాః,

జిహ్వాం తథా శర్కరయా ప్రకల్ప్య

ఫలాని దన్తాః కంబలం పట్టసూత్రమ్‌. 4

శాస్త్రముననుసరించి బంగారుకొమ్ములు, ముఖమును కూర్పవలయును. మణులతో ముత్యములతో కనులను, బెల్లముతో నోటిని, చెక్కెరతో నాలుకను, పండ్లతో దంతములను, పట్టు వస్త్రముతో గంగడోలును చేయవలయును.

నవనీతస్తనీం రాజ న్నిక్షుపాదాం ప్రకల్పయేత్‌,

తామ్రపృష్ఠాం సూత్రపుచ్ఛాం దర్భరోమకృతచ్ఛవిమ్‌. 5

స్వర్గశృజ్గాం రౌప్యఖురాం పఞ్చరత్న సమన్వితామ్‌,

చతుర్భి స్తిలపాత్రైశ్చ సంయతాం సర్వతో దిశః. 6

వెన్నతోపాదుగును, చెరకులతో కాళ్లను, రాగితో పిరుదుభాగమును, త్రాటితో తోకను, దర్భలతో రోమములను బంగారుతో కొమ్ములను, వెండిగిట్టలను అమర్చి దానిని అయిదు రత్నములతో కూర్పవలయును. అన్నిదిక్కులలో నాలుగు తిలపాత్రలను ఉంచవలయును.

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన గంధపుషై#్ప రలంకృతామ్‌,

దిగ్భ్యోదీపాంశ్చ ప్రజ్వాల్య బ్రాహ్మణాయ నివేదయేత్‌. 7

జమిలివస్త్రములతో కప్పి గంధపుష్పములతో అలంకరించి అన్నివైపుల దీపములను వెలిగించి బ్రాహ్మణునకు సమర్పింప వలయును.

వేదవేదాంగవిదుషే ఆహితాగ్నే జితాత్మనే,

మన్త్రాస్త ఏవ జప్తవ్యాః సర్వధేనుషు యేస్మృతాః. 8

ఆతడు వేదవేదాంగములను అధ్యయనము చేసినవాడు. ఆహితాగ్ని, జితేంద్రియుడు కావలయును. తక్కినధేనువుల విషయములో చెప్పిన మంత్రములనే యిచటను చదువవలయును.

పురా దేవాసురైః సర్వైః సాగరస్య తు మన్థనే,

ఉత్పన్నం దివ్య మమృతం నవనీత మిదం శుభమ్‌,

ఆప్యాయనం తు భూతానాం నవనీత నమోస్తుతే. 9

మునుపు దేవదానవులు సాగరమును చిలికినపుడు దివ్యమగు అమృతముగా ఈ నవనీతము వెలువడినది. శుభ##మైనది. సర్వభూతములకు ప్రీతి కలిగించునది. అట్టి ఓనవనీతమా! నీకు నమస్కారము.

ఏవ ముచ్చార్య తాం దద్యాద్‌ బ్రాహ్మణాయ కుటుంభినే,

ధేనుంచ దత్వా సువ్రతాం సోపధానం నయేద్‌ గృహమ్‌. 10

ఇట్లు పలికి కుటుంబముగల బ్రాహ్మణునకు మంచిలక్షణములు గల వస్తువులతోపాటుగ ఇచ్చి వానియింటికి చేర్పవలయును.

విప్రవర్యస్య భూపాల హవిష్యమన్నం సరసంచైవ,

భుక్త్వా తిష్ఠేద్‌ దినం ధేనుద స్త్రీణి విప్రః. 11

విప్రవర్యునకు హవిష్యమగు సరసమైన అన్నమును పెట్టవలయును. ధేనువు నిచ్చువాడు ఒకదినము పుచ్చుకొన్నవాడు మూడుదినములు ఆ భోజనమే చేసి యుండవలయును.

యః ప్రపశ్యతి తాం ధేనుం దీయమానాం నరోత్తమ.

సర్వపాపవినిర్ముక్తః శివసాయుజ్యతాం ప్రజేత్‌. 12

అట్లు ఈబడుచున్న గోవును చూచినవాడు సర్వపాపములను పాపుకొని శివసాయుజ్యమును పొందును.

పితృభిః పూర్వజైః సార్ధం భవిష్యద్భి శ్చ మానవః.

విష్ణులోకం వ్రజత్యాశు యావదాభూత సంప్లవమ్‌. 13

వెనుక ముందు తరముల పితృదేవతలతోపాటు ప్రళయ కాలమువరకు విష్ణులోకమున నివసించుచు.

య ఇదం శృణుయాద్‌ భక్త్యా శ్రవయేద్‌ వాపి మానవః.

సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకే మహీయతే. 14

దీనిని వినువాడు వినిపించువాడునగు మానవుడు సర్వ పాపములనుండియు విశుద్ధుడై విష్ణులోకమున ప్రతిష్ఠగాంచును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే షడధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూట ఆరవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters